Wednesday, 18 April 2012

కోడి విలాపం

అయ్యలారా! అమ్మలారా! దయగల తల్లులారా! ఇది నా కథ, మనోవ్యధ, ఆత్మఘోష. నేనెవర్ని? తెలీదు! నేను కోడినా? కోడిలాంటిదాన్నే - కానీ కాదు. ప్రాణిలాంటిదాన్నే - కానీ కాదు. ఇదేదో పొడుపుకధలా ఉంది కదూ? కానీ కాదు! ఇదొక దిక్కులేని, దిక్కుమాలిన కోడికాని కోడికథ.
                              
అనగనగా ఒక కోడి. ఆ కోడికి ఎన్నోరంగులు. మగకోడిని 'పుంజు' అనీ, ఆడకోడిని 'పెట్ట' అనీ పిలిచేవారట. గ్రామాల్లో కోడి 'కొక్కొరొక్కో' అని కూస్తేగానీ తెల్లారేదికాదట! కోడిపెట్ట గుడ్లు పెడుతుందట, గుడ్లు పొదుగుతుందట! తన బుజ్జి పిల్లల్ని వెంటేసుకుని దర్జాగా తిరుగుతూ పురుగుల్నీ, గింజల్నీ ఏరుకుని తింటూ, తన పిల్లలికి తినిపిస్తూ ఊరంతా తిరుగాడుతుందట!

రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది, కోళ్ళూ అంతరించిపోతున్నారు. మానవుడు తెలివైనవాడు. ఎప్పటికప్పుడు తన అవసరాలకి తగినట్లు కొత్త వస్తువులు సృష్టించుకుంటాడు, కొత్త ఆహారాన్నీ తయారు చేస్తుంటాడు. మనుషుల తిండి కోసం (వ్యాపార కోసం) నేను కనిపెట్టపడ్డాను. నన్ను 'బ్రాయిలర్ చికెన్' అంటారు. మేం చూడ్డానికి దొరల్లా తెల్లగా, అందంగా ఉంటాం.
                     
పేరుకు కోడినే, కానీ నేనొక కృత్రిమ కోడిని. నన్ను నాతల్లి తన గుడ్డు పొదగి జన్మనివ్వ లేదు. తలిదండ్రులు లేకుండా పుట్టాను కాబట్టి నేను పుట్టుకతోనే అనాధను. పుట్టి బుద్ధెరిగి ఏనాడూ నాలుగడుగులు నడిచిన పాపాన పోలేదు. పుట్టంగాన్లే నన్ను ఇరుకైన గది(కేజ్)లో బంధిస్తారు, కాబట్టి నేను పుట్టుకతోనే బందీని కూడా!

నా జైలు జీవితం బహుదుర్భరం. నా గది అత్యంత చిన్నది. ఆ గదిలోనే ఇంకో నలుగురైదుగురితో సహజీవనం. వెలుతురుండదు, గాలి ఉండదు, దుర్గంధపూరితం. జీవితంలో కనీసం ఒక్కసారయినా మనసారా రెక్కలు విప్పి టపటపలాడించాలని నా కోరిక. కానీ నా గదిలో నాకు నించునే జాగా కూడా ఉండదు, ఇంక రెక్కలు ఎలా విప్పేది? ఎలా ఆడించేది?

నా కేజ్ నుండి మెడ మాత్రమే బయటకి పెట్టి నిర్ణీత ఆహారం తీసుకోవాలి. నాకు అత్యంత శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం వేక్సిన్లు పొడుస్తారు, రోగాలు రాకుండా యాంటీ బయోటిక్స్ ఇస్తారు. నేను తినేతిండీ, మందులూ సమతూకంలో ఉండాల్ట. అప్పుడే నేను మంచి కండబట్టి, ఖర్చుకు తగ్గ బరువుతో నన్ను పెంచినవాడికి లాభాలు తెస్తాంట.

నా శరీరంలో ఏ భాగం ఎంత పెరగాలో కూడా మందులే నిర్ణయిస్తాయి. ఒక్కోసారి నా బ్రెస్ట్ కండ నా శరీరానికి మించి పెరుగుతుంది. అప్పుడు నేను సరీగ్గా నించోలేను, కాళ్ళు కూడా విరిగిపోతుంటాయి, గుండె ఆగిపోతుంటుంది. అయినా - మీక్కావలిసింది నా రెక్కల జాయింట్లు బలవడమే కానీ నా కష్టం కాదుగా?

మేం కేజిల్లో కోళ్ళం, మేం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని గాయాల పాలవకుండా మా ముక్కులు కత్తిరించేస్తారు. కత్తిరించబడ్డ ముక్కునొప్పితో ఇవ్వాళ నా పక్కనున్న కోడిపిల్ల ఒకటి - 'మనదీ ఒక బ్రతుకేనా? కుక్కల వలె, నక్కల వలె! మనదీ ఒక బ్రతుకేనా? సందులలో పందుల వలె!' అంటూ ఒకటే ఏడుస్తుంది! ఓసి దీని అమాయకత్వం దొంగల్దోలా! ఆ జంతువులు మాకన్నా చాలా నయం!

నాకీ ప్రపంచమంతా కేవలం నాలుగు కోళ్ళ మయం! నా కేజ్‌లో ఉండే నాలుగు కోళ్ళే నా ప్రపంచం. హీనమైన జీవనాన్ని 'కుక్కబ్రతుకు' అని అంటారు కానీ - 'బ్రాయిలర్ కోడి బ్రతుకు' అని ఎవరూ అనరు. ఎందుకంటే - మాదసలు బ్రతుకే కాదు కాబట్టి!

నా ఆయుష్షు నలభై రోజులే. నలభై రోజల తర్వాత - నేను తినేతిండికి సరిపడేంత బరువు పెరగను, అందువల్ల నాకు తిండి దండగ. 'దిగుబడి' రాకపొతే పెంచేవాడికి నష్టం వస్తుంది కాబట్టి నాకు నలభై రోజులకే నూరేళ్ళు నిండుతాయి. ఆ రోజు నా పీక పరపరా కోసి చంపేస్తారు.

'నిప్పులు చిమ్ముకుంటూ.. నింగికి నే నెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ.. నేలకి నే రాలిపోతే.. నిర్ధాక్షిణ్యంగా వీరె' అని మహాకవి రాశాడు. ఆయన ఎవరి కోసం రాసాడో తెలీదు కానీ - నాకు మాత్రం నా గూర్చే రాసినట్లనిపిస్తుంది.

కనీసం చంపబోయే ముందు కూడా మేం ప్రాణులమని గుర్తించరు. డొక్కువేన్లలో, ఇరుకైన బోనుల్లో మమ్మల్ని గడ్డి కుక్కినట్లు కుక్కుతారు. అంచేత ఊపిరాడక కొందరం వేన్లోనే చస్తాం. అక్కణ్ణుండి మా కాళ్ళు కట్టేసి, గుట్టగా పడేసి ద్విచక్రవాహానాల్లో తీసికెళతారు. రోడ్డుకి తల గీసుకుని కొందరం, చక్రంలో పడి నలిగిపోయి ఇంకొందరం దార్లోనే చస్తాం.

చికెన్ సెంటర్లలో మా కళ్ళముందే మా స్నేహితుల పీకల్ని కత్తిరిస్తుంటారు. రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటుండగా, మమ్మల్ని మా సోదరుల విగత శరీరాలపై గుట్టగా పడేస్తారు. 'భగవంతుడా! తొందరగా చావు ప్రసాదించవయ్యా!' అని దుఃఖంతో, భయంతో వణుకుతూ కళ్ళు మూసుకోవడం తప్ప ఏం చెయ్యగలం?
             
జాషువా 'గబ్బిళం' రాసుకున్నాడు. తిలక్ 'గొంగళీ పురుగులు' రాశాడు. పువ్వు కష్టాలపై కరుణతో కరుణశ్రీ 'పుష్పవిలాపం' రాసుకున్నాడు. మామీద మాత్రం ఎవ్వరూ ఏమీ రాయలేదు, రాయరు కూడా. కేవలం 'దిగుబడి' కోసమే మా బ్రతుకు. మీ ఇళ్ళల్లో, హోటళ్ళల్లో - మా శరీర ఖండాలు భోజన పదార్ధాలవుతాయి, అదే మా జీవన పరమార్ధం.

------------------

అమ్మయ్య! ఇన్నాళ్ళకి మాకో తోడు దొరికింది. భూమండలంలో ఇండియా అనే దేశం ఒకటుందిట. ఆ దేశం ఈ మధ్య విపరీతంగా అభివృద్ధి సాధిస్తుందట. అక్కడ చదువులే పెట్టుబడిట, ఉద్యోగాలే దిగుబడిట. ఆ దేశంలో ఆడపిల్లల్ని తల్లి గర్భంలోనే చంపేస్తారట. ఆడపిల్లలకి దాణా దండగ. వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసినా దిగుబడి మొగుడికి వెళ్ళిపోతుందిట - అందుకని!

ఇండియాలో మగపిల్లల్ని ఈ లోకంలోకి ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతార్ట. కొన్నాళ్ళకి ఆ పిల్లల కాళ్ళ క్రింద నుండి ఆ ఎర్రతివాచీ లాగేసి మడత పెట్టేస్తార్ట. వారు బుడిబుడి నడకలతో 'అమ్మా, అత్తా' అంటూ ముద్దుపలుకులు మొదలెట్టంగాన్లే ఎల్కేజీ (ఇదో రకమైన కేజ్)లో పడేస్తార్ట. ఆ బుజ్జిగాళ్ళకి చదువు (ఆరోగ్యకరమైన దాణా) కుక్కుతార్ట (వేస్తారు). వాళ్ళకి పద్ధతిగా పరీక్షలు (వేక్సీన్లు) పెడతార్ట (వేస్తారు). పాపం! ఈ పిల్లలు కూడా మాలాగే బందీలు, వీళ్ళకి బాల్యం ఉండదు.

వీరికి ఆటపాటలంటే యేంటో తెలీదుట. చదువుడే చదువుడు, రుద్దుడే రుద్దుడు, గుద్దుడే గుద్దుడు. పుస్తకాల బ్యాగులు మోసీమోసీ వెన్నుపూస ఒంగిపోతుందిట. పిల్లలకి జ్ఞాపకశక్తిని పెంచడానికి 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్' అనే దుకాణదారులు ఉంటార్ట. వీళ్ళు విజయానికి వెయ్యిమెట్లు ఎక్కిస్తార్ట. ఈ మెట్లెక్కలేని దురదృష్టవంతుల్ని మధ్యలో అర్ధంతరంగా తోసేస్తార్ట. మేం రోగాలోచ్చి చచ్చినట్లే - పరీక్షలు తప్పిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చస్తుంటార్ట!

నా జీవచ్ఛవ బ్రతుకు కేవలం నలభై రోజులే, ఈ పిల్లగాళ్ళ బ్రతుకులు అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు నాకనిపిస్తుంది - నేను చాలా అద్రుష్టవంతుణ్నని!

57 comments:

  1. అబ్బ ఏంటండి ఇట్లా గుండెలు పిండేశారు

    ReplyDelete
  2. బ్రాయిలర్ బ్లాగోత్తమా శ్రీ రమణా!

    బాయ్ అండ్ గర్ల్ బ్రాయిలర్ కోడీ, పకోడీ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. ఎంత పని చేసావు బ్రదరూ....ఇది చదివి నాభార్యామణి చికెన్ని కిచెన్లో నుంచి తరిమేస్తే మా గతేం కాను? (అహ ఇంత రాసినా ఇంకా చికెన్ తింటావా దుర్మార్గుడా అంటావా?) నువ్వు మానేసావా? అహ! విషయం కనుక్కుందావని అడిగా!

    నిజం చెప్పొద్దూ, నీ కోడి విలాపం, అంతకంటే బాలవిలాపాల్లో ఎంతో నిజముంది. దీన్ని చదివి ఒక్క తల్లిగానీ తండ్రి గానీ మారితే "నీ విలాపం" సక్సెస్ ఐనట్లే!!అలా జరగాలని కోరుకొంటూ

    మిత్రుడు గౌతం

    ReplyDelete
  4. వ్యక్తిత్వవికాస కోర్సుల వలన ఉపయోగం ఉందంటారా డాక్టర్ గారు....

    ReplyDelete
  5. chala baga rasaru. We have to provide minimum facilities for the chicken atleast :)

    ReplyDelete
  6. మీతో ఈ కోడి విలాపం రాయించడం, బ్రాహ్మినికల్ మను వాద, బూర్జువా వర్గ, హిందుత్వ మతవాద, శాఖాహార అగ్రవర్ణ శక్తులని తెలుస్తూనే వుంది. హమ్మయ్యా... చెప్పేశాను. ఇది కోడి-పండగ వ్యతిరేక శక్తుల రాజకీయ కుట్ర అని కూడా మా చీకటి పరిశీలకులు వ్యూహాత్మక పరిశీలన. దీనిపై బ్లాగుల్లో దుమ్మెత్తి పోయడాన్ని ఏ శక్తీ ఆపలేదు అని మీకు తెలియజేసుకుంటున్నాను.
    అసలు కోడిజన్మ సార్థకం అయ్యేదే డైనింగ్ ప్లేటు మీద అని మీరు గ్రహించాల్సిన రోజు ఆసన్నమైంది. ప్రపంచ కోడి ప్రియులారా ఏకంకండి.

    ReplyDelete
  7. అయ్యా , మీ వలన బ్రాయిలర్ ఫెస్టివల్ వచ్చి మెరుగైన సమాజం కోసం ఉద్యమించే వారికీ కూడా దాణా దోరికేటట్టు వుంది

    ReplyDelete
  8. మీ ఆర్టికల్ బాగుందండీ. నవ్వు, బాధ రెండు కలిగాయి. మీ వ్యాసాలన్నీ చదువుతూనే ఉంటాను. కామెంట్ వ్రాయడం మాత్రం ఇది రెండోసారి. మా అమ్మాయిని ఈ సంవత్సరం బడిలో వేయాలి. ఎంతోకొంత ఆటస్థలం ఉన్న బడి (కాన్వెంట్) కోసం వెతుకులాట ప్రారంభించాను చూడాలి మరి ఏమవుతుందో.

    శ్రీవాసుకి

    ReplyDelete
  9. డాక్టర్ గారు,

    ఇలా రాసి మాలాంటి మాంసాహార ప్రియులని కమ్మటి కోడి మాంసం,చికెన్ దం బిర్యాని,చికెన్ పకోడి మరియు అనేక రకాల చికెన్ రుచులను తినకుండా చెయాలని శాకాహారులు చేసిన కుట్రలా అగుపిస్తుంది.

    మరొక విషయం నేను కూడా బ్రాయిలర్ కోళ్ళలాంటి మా పిల్లలను (పాపం యుకేజి ,మూడవ తరగతి చదివేవాల్లను) బాగా దిగుమతుల కోసం ఇప్పుడు చదివే స్కూలు కాదని వేరే స్కూలు జాయిన్ చేద్దామనుకుంటున్నాను.అయినా నాకు మావాళ్ళు పశ్చిమ దేశాలకు వెళ్ళి డబ్బు యంత్రాలల మారాలని కోరుకోవడం లేదు. ఇద్దరూ ఐఏయస్ ఆఫీసర్లు అయితే చాలు.

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  10. మీరు రాసింది సరదాగానే రాసారు.... కానీ అందులో మనసును ద్రవించే వేదనను అంతర్లీనంగా బాగా చెప్పారు...
    నాణేనికి ఒకపైపు మీరు రాసింది.. కాని రెండో పైపు చూస్తే వాటి వేదన మనకు అర్దమవుతుంది..... నేను మాత్రం ఇందులో రెండో కోణం మాత్రమే చూడగలుగుతున్నాను.

    ReplyDelete
  11. ఐఏయస్ ఆఫీసర్లు అంటే ప్రజలకు సేవ చేసే ఆఫీసర్లు కావాలనుకుంటున్నా గాని నాకు డబ్బు సంపాదించేవారిగా వుండాలని కొరుకోవడం లేదు.

    యాద్రుచికంగా ఇప్పుడే చికెన్ దం బిర్యాని తింటున్నాను

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  12. Narayanaswamy S గారు,

    థాంక్యూ!

    నా పోస్ట్ లక్ష్యం పిల్లల కష్టాలు వివరించడం. కానీ కోడి కష్టాలే ఎక్కువగా రాసేశాను.

    ReplyDelete
  13. జిలేబి గారు,

    >>బ్రాయిలర్ బ్లాగోత్తమా శ్రీ రమణా!<<

    ఈ మధ్య మీరు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నారు!

    ReplyDelete
  14. @TJ "Gowtham" Mulpur,

    మిత్రమా,

    నీకు అంత కష్టం రాదులే!

    బ్లాగు చదివి అభిప్రాయాలు మార్చుకోడమా! బ్లాగేమన్నా ప్రతిఘటన సినిమా అనుకుంటున్నావా?!!

    ReplyDelete
  15. Bhaskar గారు,

    నేనెప్పుడూ వ్యక్తిత్వ వికాస కోర్స్ తీసుకోలేదు. ఆ వికాసం లేనందువల్ల.. నా వ్యక్తిత్వం వికసించక.. ఇట్లా బ్లాగులు రాసుకుంటూ బ్రతికేస్తున్నాను. ఇంక నేను మీకు సలహా ఏమివ్వగలను చెప్పండి?!

    ReplyDelete
  16. "చదువై పోయింతర్వాత వీళ్ళని పశ్చిమ దేశాలకి ఎగుమతి చేస్తారు. అక్కడ వీళ్ళు చేసే పనికి మంచి కూలీ గిట్టుబాటవుతుంది. బోలెడు డాలర్లు సంపాదించి పెంచినోళ్ళకి లాభాలు గడిస్తారు. జీవితమంతా 'దిగుబడే దిగుబడి'."

    ఈ ముక్కమీద ఎవరూ కామెంటినట్టులేదే!!!

    ReplyDelete
  17. SNKR గారు,

    మీరు బహుశ ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్య రాసినట్లున్నారు.

    నేను జంతువుల్ని, పక్షుల్ని ఆహారం కోసం చంపడాన్ని వ్యతిరేకించను. అట్లాగే.. పిల్లలకి చదువు చాలా అవసరం. కాకపోతే.. కౄరమైన విధానాల్ని, పద్ధతుల్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాను.

    ReplyDelete
  18. Rangacharyulu గారు,
    ధన్యవాదాలు.

    kamal గారు,
    థాంక్యూ!

    ReplyDelete
  19. శ్రీవాసుకి గారు,

    ధన్యవాదాలు. మీ పాపకి ఒక ఆట స్థలం ఉన్న స్కూల్ దొరకాలని, అక్కడి టీచర్లు పిల్లల పట్ల sensitive గా ఉండాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  20. @ramaad-tretz,

    రమేష్ బాబు గారు,

    నేను మాంసాహారానికి వ్యతిరేకిని కాదు. పోలిక కోసం మాత్రమే కోడిని వాడుకున్నాను. నా అసలు ఉద్దేశ్యం పిల్లల కష్టాల్ని హైలైట్ చెయ్యడం మాత్రమే.

    మీ పిల్లలు ఫలానా కావాలని కోరుకోవడమే వాళ్ళపై ఒత్తిడి పెంచడం అవుతుందేమో! ఏదో ఒకటి అవుతారు. let them have some fun and enjoy life!

    ReplyDelete
  21. రాజీవ్ రాఘవ్ గారు,

    ధన్యవాదాలు.

    మనం మనుషుల హక్కులే సరీగ్గా పట్టించుకోవట్లేదు. ఇంక నోరు లేని పక్షులు, పిల్లల గూర్చి చెప్పేదేమింది?

    ReplyDelete
  22. Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  23. @తెలుగు భావాలు,

    వివాదాలు ఎందుకులేండి!

    నా బ్లాగులో కబుర్లు చెప్పిన కోడి చచ్చిపోయి చాలాసేపు అయ్యింది. ఆ కోడి ఉపన్యాసానికి, నాకు ఏ సంబంధం లేదు. dying declaration లాంటిది నా బ్లాగులో రాసుకోడానికి కోడికి అవకాశం ఇచ్చాను. అంతే!

    ReplyDelete
  24. య ర గారు
    మీ పోలిక చాలా బాగుంది. కాని ఇది ఎందరికి కనువిప్పు కలిగిస్తుంది. ఇప్పుడు ఇండియా లో 'ఎడ్యుకేషన్' ఒక లాభసాటి వ్యాపారం అయ్యింది. తల్లి , తండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటిపక్క వాళ్ళబ్బాయి కన్నా పెద్ద స్చూల్లో చదవాలి అనే 'competition ' తో మాత్రమె ప్రవర్తిస్తున్నారు. ఇప్పటి పిల్లల్ని చూస్తే నాకు చాల జాలి వేస్తుంది. మన ప్రభుత్వం కూడా 'ఎడ్యుకేషన్' మీద ఎటువంటి కంట్రోల్ లేకుండా వుంది. అసలు ఇప్పుడు తల్లి తండ్రులు పిల్లాడు పుట్టగానే డిసైడ్ అయిపోతారు, వాడు డాక్టరా, ఇంజినీరా అని , పాపం అప్పటినించే వాడి కష్టాలు మొదలు. మరి వాళ్ళు 'broiler ' కోడి కాకపోతే మరి ఏమిటి? నీ బ్లాగ్ చదివి కనీసం కొంతమంది అయినా మారితే చాలా సంతోషం.
    గో వె ర

    ReplyDelete
  25. /నేను జంతువుల్ని, పక్షుల్ని ఆహారం కోసం చంపడాన్ని వ్యతిరేకించను. /

    నేనూ అంతే!
    నానా జంతు, క్రిమి కీటకాదులు, నరమాంసం తినడం వృద్ధిలోకి వస్తేగాని మృగాలు బతికే అవకాశాలు మృగ్యం అని నా ఆలోచన. ఉస్మేనియా వార్త అలా మెదులుతోందేమో అలా రాసి వుంటాను.

    మీరన్నట్లు జంతువులను నొప్పిలేకుండా గొంతులు కోసే పద్ధతులను అమల్లోకి రావాలి.

    మీ వ్యాసం నచ్చింది, తాకాల్సిన చోట తాకింది.

    ReplyDelete
  26. టచింగ్ వ్యాసం.. :-(

    ReplyDelete
  27. @Go Ve Ra,

    ఒకప్పుడు టౌన్లకి మాత్రమే పరిమితమైన ఈ రుద్దుడు గ్రామాలకి కూడా విస్తరించింది. పిల్లల పరిస్థితి దారుణం. ఐదో క్లాసు విద్యార్ధుల్ని కూడా ఉదయం ఏడు నుండి రాత్రి పది దాకా చదువు పేరుతో హింసిస్తున్నారు.

    గ్రామాల్లో పిల్లలు ఐదింటికే లేచి తయారయితే గాని.. ఆటో ఎక్కి స్కూల్ చేరుకోలేరు. గమ్మత్తేమంటే tution home, స్కూల్ ఒకటే!

    ఆశ్చర్యమేమంటే ఈ పిల్లల తలిదండ్రులు విద్యాధికులు కారు. కానీ.. వ్యవసాయం లాభసాటిగా లేకపొవడం, చదువు పట్ల అపార గౌరవం, అవగాహం లేకపోవడం.. వీరిని తమ పిల్లల్ని బండ చదువుల పట్ల పంపేలా చేస్తున్నయ్.

    పిల్లల్ని చదువు పేరిట పెట్టే హింస మనకి కనిపించే దాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. నా ప్రాక్టీస్ లో కేసులు చూస్తుంటే కడుపులో దేవుతుంది. అంత ఘోరం!

    ReplyDelete
  28. That's it. I am going vegetarian.

    ReplyDelete
  29. torturing when they are alive is very sad!

    good one sir

    ReplyDelete
  30. Mauli గారు,
    థాంక్యూ!

    కృష్ణప్రియ గారు,
    థాంక్యూ!

    ReplyDelete
  31. @GIdoc,

    probably pictures in my blog are a bit terrifying. i am sorry. don't take hasty decisions!

    ReplyDelete
  32. Krishna Palakollu గారు,

    నేను ఈ పోస్ట్ రాసింది పిల్లల కోసం.
    అనుకోకుండా కోడి హీరో అయిపోయింది!

    ReplyDelete
  33. SNKR గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  34. No hasty decision. Your blog is the straw that broke the proverbial camel's back. Inflicting pain on other living beings is indefensible.

    ReplyDelete
  35. May be this is one of your best post.

    తమ కోసం, సమాజం కోసం కాకుండా, IT కంపెనీల కోసం పిల్లలని కనే తల్లిదండ్రులున్నంత కాలం ఇంతే. నిజంగానే వీళ్ళు పిల్లలని ప్రపంచం గురించి తెలుసుకోనివ్వకుండా, కోడిని పొదిగినట్టు పెంచుతున్నారు.


    అన్నట్టు ఈ టపా పేరు కుక్కుట విలాపం అని ఎందుకు పెట్టలేదు?

    ReplyDelete
  36. *బోలెడు డాలర్లు సంపాదించి పెంచినోళ్ళకి లాభాలు గడిస్తారు. జీవితమంతా 'దిగుబడే దిగుబడి'*
    పెంచినోళ్ళ ఊరు కదలకుండా, కాలు మీదాకాలు వేసుకొని పిల్లలు పంపే డబ్బులతో స్థలాలు,ఇళ్లుకొంట్టు తమ కలలను నెరవేర్చుకొంటారు. టివిలో నచ్చిన ప్రోగ్రాంలు చూస్తూ, మాంచి వంటలు చేసుకొని తింట్టు, విదేశాలలొని పిల్లవాడు పోన్ చేస్తే ఈ రోజు గుత్తి వంకాయ కూర చేసుకొని తింట్టున్నంత సేపు నువ్వే గుర్తుకు వచ్చావ్. నీకది చాలా ఇష్టం కదా అని మాటలు చెబుతూ, మూసలి వారు వారి జీవితం సంత్రుప్తి గా గడిపేస్తున్నారు.

    ఈ తరంలో 55-75సం|| మధ్యన ఉండేవారి అదృష్టమే అదృష్టం. ఆరోజుల్లో వారి చిన్నపుడు ఊరు కదలకుండా ప్రభుత్వోద్యగాలు చేశారు. 1975- 1990 మధ్య కాలంలో ఉద్యోగం రావాలంటే కష్ట్ట పడే వారు. పి.వి.గారి దయ వలన, సోషలిజం పక్కన పడేసిన తరువాత గ్లోబలైసేషన్బాట పట్టిన తరువాత, మధ్య తరగతి వారికి మంచి ఉద్యోగాలు రావటం మొదలైంది. ప్రతివారికి చదవటం, ఏదోక ఉద్యోగం దొరకటం తో వారి కోరికలకి ఆశలకి పట్ట పగ్గాలు లేకుండాపోయాయి. కొన్ని ఇళ్లలో తండృలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. పిల్లవాడు అమేరికా నుంచి డబ్బులు పంపితే వీరు ఇళ్లు వాకిళ్లు కొంట్టూంటారు. వీళ్లు మునపటి ముసలి వారిలా మనవలకి, మనుమరాండ్రకి రామాయణ, భాగవతాల కథలు చెప్పే తరహా కాదు. ఎవరు స్థలాలు అమ్ముతున్నారు, ఎక్కడ ఇల్లు ఖాళిగా ఉంది నోరు తెరిస్తే ఇదే మాట.

    Regds,
    SriRam

    ReplyDelete
  37. హృదయవిదారకంగా రాశారు.KFC,Mc.Donalds వాళ్ళు ఒక్క కోళ్ళనే కాదు, పందుల్నీ,ఆవుల్నీ కూడ ఇలాగే బ్రీడ్ చేసి కౄరంగా చంపటంగురించి వింటూనే వుంటాం. మీరన్నట్లు పిల్లలగురించి ఎక్కువ బాధ పడాలో జంతువుల గురించి ఎక్కువ బాధ పడాలో తెలియటం లేదు . మళ్ళీ ట్రెండ్ మారి సాఫ్ట్ వేర్ పోయి ఇంకేదో రావాలి!

    ReplyDelete
  38. @SriRam,

    నా క్లినికల్ ప్రాక్టీస్ లో పిల్లలకి మంచి మార్కులు రావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిన తల్లుల్ని చూశాను. చిన్న క్లాసుల్లో మార్కులకి ప్రాధాన్యం లేదని మనలాంటి వారు చెప్పినా వారికి అర్ధం కాదు.

    పిల్లల్ని చదవమని ఒత్తిడి చేసే తలిదండ్రులు (ఎక్కువ మంది) అమాయకులు. చదువు పట్ల అవగాహన లేని వారు.

    మా పిల్లల స్కూల్ హెడ్ మాస్టర్ (ఇప్పుడు principal అంటున్నారు.) 'పేరెంట్స్ మీట్ అంటేనే భయం వేస్తుందండి. ఆదివారం నాడు కూడా స్కూల్ పెట్టమని, పిల్లలకి ఒక్క మార్క్ తగ్గినా స్కూల్ మార్చేస్తామని, మా పిల్లల్ని తన్నండి అని.. రకరకాల డిమాండ్స్. ముఖ్యంగా ఈ తల్లుల దెబ్బకి జీవితం మీద విరక్తి కలుగుతుంది.' అని చెబుతుంటారు.

    ReplyDelete
  39. సన్నజాజి గారు,

    నేను చాలాసార్లు మగవాడిగా పుట్టినందుకు 'అమ్మయ్య!' అనుకుంటాను.

    ఇంకొన్నిసార్లు (ముందే పుట్టేసి) ప్రస్తుతం విద్యార్ధి దశలో ఉండనందుకు కూడా 'అమ్మయ్య!' అనుకుంటాను.

    ReplyDelete
  40. /కొన్ని ఇళ్లలో తండృలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. పిల్లవాడు అమేరికా నుంచి డబ్బులు పంపితే వీరు ఇళ్లు వాకిళ్లు కొంట్టూంటారు/


    హ్హ్వాహ్వాహ్వా...

    ReplyDelete
  41. >>పేరెంట్స్ మీట్ అంటేనే భయం వేస్తుందండి. ఆదివారం నాడు కూడా స్కూల్ పెట్టమని, పిల్లలకి ఒక్క మార్క్ తగ్గినా స్కూల్ మార్చేస్తామని, మా పిల్లల్ని తన్నండి అని.. రకరకాల డిమాండ్స్. ముఖ్యంగా ఈ తల్లుల దెబ్బకి జీవితం మీద విరక్తి కలుగుతుంది.' అని చెబుతుంటారు.

    ఇది నిజంగా నిజమా? ఏంటో, ముందు తరం వాళ్లు అనుభవించిన ప్రశాంతమైన జీవితం ఇప్పటి పిల్లలకి ఎక్కడిది? పాపం అనిపిస్తూ ఉంటుంది. చదువుల్లో ఎన్నో రకాలు, స్టేట్ సిలబస్ అంటే అందరికీ చులకనే, సి.బి.యస్.సి కాస్త బెటర్. ఇక ఐ.సి.యస్.సి అంటే ఉన్నదంతా ఊడ్చిపెట్టి మరీ అందులో వేస్తారు.

    ఇక తెలుగు మీడియం అన్న పదం వినిపించడం మానేసి చాలా కాలమైనట్లు ఉంది :(((( అలా తెలుగు మీడియం చదివి వచ్చిన నా జీవితం బాగుంది కదా, ఎందుకు ఇప్పుడు ఇంత పోటీ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దీనికొక పరిష్కారం ఉందంటారా??

    ReplyDelete
  42. @మనసు పలికే,

    ఈ సమస్యకి పరిష్కారం కనుచూపు మేర కనిపించడం లేదు.

    ReplyDelete
  43. శంకర్,
    నామిత్రుడు వాళ్ల ఇంటికి ఖర్చులకని డబ్బులు పంపితే, వాళ్ల నాన్న గారు వచ్చే డబ్బులకి అలవాటు పడి , ఉద్యోగ విరమణ చేసి, రియల్ రంగం లోకి దిగాడు. ఆ అబ్బాయి పంపిన డబ్బులను స్థలానికి అడ్వాన్స్ గా ఇచ్చేశాను. నువ్వు ఇంకొక నాలుగు లక్షలు పంపకపోతే ఆడవాన్స్ గా ఇచ్చిన లక్షలు తిరిగి రావని బెదిరిస్తూ, పోన్ చేసి ఒకటే ఓత్తిడి చేస్తూంటాడు. ఇటువంటి వారిని ఎంతో మందిని చూసాను.

    SriRam

    ReplyDelete
  44. "బ్లాగేమన్నా ప్రతిఘటన సినిమా అనుకుంటున్నావా?!!"

    మీరు ప్రతిఘటన చూసాక సినిమాలు మానేసారా లేక అంతకు ముందేనా?

    ReplyDelete
  45. బుల్లబ్బాయ్24 April 2012 at 18:16

    ఈ మధ్య ఎక్కడొ ఒక పోస్టర్ చూసా it goes something like this..

    those who are born in 70s/80s...

    We are the last generation that learnt to play in the street.

    We were the last to record songs off the radio on cassettes

    Lived without cell phones. We never had cell phones but still kept in touch.

    Rode our bicycles down the roads without breaks.

    We did not have Playstations, 500 television stations, flat screen’s, surround sound, 3D, mp3s, iPods, iPhone, iPads, or broadband……….

    But nevertheless, we had a GREAT Time

    ReplyDelete
  46. Jai Gottimukkala గారు,

    'ప్రతిఘటన' సినిమా వీధి నాటకానికి ఎక్కువ, పరిషత్తు నాటకానికి తక్కువ అని మా మిత్రుల అభిప్రాయం. ఇంతటి "అభ్యుదయ" సినిమా చూసే ధైర్యం నాకు లేదు. కాబట్టి చూళ్ళేదు.

    ఆ సినిమా చూసిన నా స్నేహితుడొకడు ఒక జోక్ చెప్పాడు. టీచరమ్మ పాట పాడంగాన్లే స్టూడెంట్లకి బుద్దొచ్చేస్తుందిట!!!

    ReplyDelete
  47. బుల్లెబ్బాయ్ గారు,

    అవును. నిజం.
    ఆ రోజుల్లో గ్రూప్ ఏక్టివిటీస్ సరదాగా ఉండేవి.
    ప్రధానంగా చదువు అనే బండ నెత్తి మీద లేకపోవడం అదృష్టం.

    ReplyDelete
  48. "ఆదివారం నాడు కూడా స్కూల్ పెట్టమని, పిల్లలకి ఒక్క మార్క్ తగ్గినా స్కూల్ మార్చేస్తామని, మా పిల్లల్ని తన్నండి అని.. రకరకాల డిమాండ్స్"

    You may win the ratrace but remember you are still a rat..

    ReplyDelete
  49. Olden days of agriculture & village predominent life is really Golden era of our life (who are aged above 45), that life was in tune with Nature and basic human values. Now it is only money earning oriented life without love, affections,compassion, etc.

    HOPE ATLEAST SOME PEOPLE STOP TAKING NON-VEG AFTER READING YOUR ARTICLE.

    ReplyDelete
  50. "ఆ సినిమా చూసిన నా స్నేహితుడొకడు ఒక జోక్ చెప్పాడు. టీచరమ్మ పాట పాడంగాన్లే స్టూడెంట్లకి బుద్దొచ్చేస్తుందిట"

    ఇదే "సంచలన" చిత్రంలో మరో పెద్ద జోకు. ఒక పిచ్చాడు ఎన్నికలకు నామినేషన్ వేస్తాడు. పిచ్చి వాళ్లకు పోటీ చేసే అర్హత ఉండదు కాబట్టి ఎన్నికల సంఘం నామినేషన్ తిరస్కరిస్తుంది. అయినా సదరు "అభ్యర్తి" డప్పు పట్టుకొని ప్రచారం చేస్తాడు.

    ReplyDelete
  51. Jai Gottimukkala గారు,

    అవునా! నాకు తెలీదు. హృదయాన్ని 'కదిలించే' విశేషం చెప్పారు. ధన్యవాదాలు!

    ReplyDelete
  52. doctor garu, ilanti subject tho kurnool ku chendina harikishan ane rachayitha o katha rasaaru.

    ReplyDelete
  53. chala baga rasaru. meeru touch chesina anni points bavunnayi. kodi badha, aada pillalu, pillala chaduvula baruvulu. I know they are many people in western countries just for earnings by leaving everybody here. prati sentense comedy ade samayam lo....antarleenam ga dagi vunna satyam...gundeni pindesayante nammandi....manchi aalochanaku akshara roopam icharu.
    Eppudoo edo timepass ki chaduvutanu kani..ee tapa kadilinchindi baga

    ReplyDelete
  54. Intha cheppiina meeru, mee kuthurni ni broiler kodi cheyyadam bagaledu

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.