ప్చ్.. 'దేవదాసు పార్వతిలది అమరప్రేమ!' అనడం మేధావిత్వం. గిరీశం ప్రేమని మెచ్చుకోవటం అధమత్వం. అయినా సరే, ప్రస్తుతానికి అధముడిగానే గిరీశం కేస్ ప్రెజెంట్ చేస్తాను.
గిరీశం చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడనీ, గొప్ప తెలివైనవాడనీ నా అభిప్రాయం! ఎందుకంటే - తిండికి గతిలేక పూటకూళ్ళమ్మని పట్టాడు, పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. ముప్పొద్దులా దుక్కలా పూటకూళ్ళమ్మ తిండి తినేసి, ఆమె డబ్బులన్నీ దొబ్బేసి - మధురవాణిని ఉంచుకోటానికి ప్లాన్ చేశాడు. గిరీశం కన్నా తెలివైంది కాబట్టే, మధురవాణి గిరీశం మాటకారితనాన్ని ఇష్టపడ్డా అతన్ని నమ్మలేదు. అందుకే ఆమె రామప్పపంతులుతో వెళ్ళిపోడానికి సిద్ధపడింది.
అందుకే ఉదర పోషణార్ధం శిష్యుడు వెంకటేశంతో కలసి అగ్నిహోత్రుడి పంచన చేరతాడు. పిల్లికి బిచ్చం పెట్టని అగ్నిహోత్రావధానుల్ని బురిడీ కొట్టించి, అతని సలహాదారుడౌతాడు. బుచ్చెమ్మని బుట్టలో వేసుకుంటాడు. చివరికి సౌజన్యారావు పంతులు గడ్డిపెడితే సింపుల్‌గా - "డామిట్, కధ అడ్డం తిరిగింది!" అని డిజప్పాయింట్ అవుతాడే గానీ దిగులేసుకోడు. దేవదాసులా మందుకొట్టి విరహగీతాలు పాడుకోడు.

'రైలందకపోతే బస్సు, బస్సందకపోతే ఆటో, ఏదీ అందకపోతే చివరాకరకి ఎడ్లబండి!' ఇదీ గిరీశం ధోరణి! దీన్నే యధార్ధవాదం అంటారు. ఇప్పుడు చెప్పండి - దేవదాసు, గిరీశంలలో ఎవరు బెటరో?
(photo courtesy : Google)
No comments:
Post a Comment
comments will be moderated, will take sometime to appear.