మన సమాజంలో కులం ప్రభావం బలమైనది. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు చదువుతూనే ఉంటాం. మనం ఈ కుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే, ముందుగా సమాజంలో కులంపాత్ర అంచనా వెయ్యగలగాలి. ఇది రాస్తున్నప్పుడు నాకు బాలగోపాల్, ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి.
నాకు చంద్ర (బి.చంద్రశేఖర్, న్యాయవాది, పూర్వాశ్రమంలో పౌరహక్కుల నాయకుడు) మంచి మిత్రుడు. అతని ద్వారా నాకు కె.బాలగోపాల్ పరిచయం. బాలగోపాల్ తరచూ గుంటూరు వస్తుండేవాడు. అప్పుడప్పుడు నా స్కూటర్ తీసుకుని ఊళ్ళో పనులు చక్కబరుచుకునేవాడు. ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం.
అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.
అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.
బాలగోపాల్ మొహమాటస్తుడు గదాని మనం మోసపోకూడదు. విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఒకసారి కాజువల్‌గా అన్నాను - 'తెలుగు వ్యాసాలు సంక్లిష్టంగా రాయటంలో మీరు కె.వి.రమణారెడ్డిగారితో పోటీ పడుతున్నారు' అని.
'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్.
'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్.
బాలగోపాల్ నా దగ్గరకి వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వకుండా పంపేవాణ్ని కాదు. అందుక్కారణం - ఆయన్తో కొద్దిసేపు మాట్లాడే ఆవకాశాన్ని వదులుకోకూడదనే నా స్వార్ధం!
ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.
ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.
"మీదే కులం?"
"మీరు.. ఈ ప్రశ్న.. " ఆశ్చర్యంగా చూశాను.
నా ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా స్థిరంగా, స్పష్టంగా అన్నాడు బాలగోపాల్.
"ఇక్కడ నేను మీతో బంధుత్వం కలుపుకోటానికి కులం అడగట్లేదు. మనమంతా కులరహిత సమాజం కావాలనుకుంటున్నాం. ముందుగా కులం మనమీద చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించగలగాలి. అప్పుడే గదా దాంట్లోంచి బయటపడగలిగేది. నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి. నా అవగాహన, ఆలోచన కొన్నిసార్లు నా కులానికి గల పరిమితులకి లోబడే ఉంటాయి. అది నా తప్పు కాదు. మనమందరం ఈ చట్రంలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనని మనం సంస్కరించుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకి మీరు దళితులనుకుందాం. నాకా విషయం తెలీనప్పుడు మిమ్మల్ని నేను సరీగ్గా అర్ధం చేసుకోలేను. కొంతమంది కులం పేరెత్తితేనే ఏదో తప్పుగా చికాకు పడతారు, కులాన్ని గుర్తించకపోవడం సరికాదు."
ఇంకో సందర్భం -
ఇంకో కాఫీ సమయం.
"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."
"ఎలా?"
"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.
"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."
"ఎలా?"
"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.
మాటల్లో క్లుప్తత బాలగోపాల్ సొంతం. ఒక్కోసారి ఆయన్తో మాట్లాడుతూ వుండిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆయన చాలా బిజీ - నలిగిన చొక్కాతో, చెదిరిన క్రాఫుతో హడావుడిగా వెళ్లిపోతాడు. బాలగోపాల్ సర్! ఐ సెల్యూట్ యు.
(photo courtesy : Google)
మీ జ్ఞాపకాలు బాగున్నాయి. బాలగోపాల్ అన్నది అక్షరాలా నిజం. మన అవగాహనలు, ఆలోచనలు మన జన్మతః పుట్టిన కులప్రభావానికి లోనై ఉంటాయి. మనల్ని మనం సంస్కరించుకోవడం ఒక నిరంతర ప్రక్రియ. దానిలో చొరవ తీసుకోవలసిందీ, మనస్ఫూర్తిగా ఆచరించి మార్గదర్శనచేయవలసిందీ మేధావివర్గమే. వాళ్ళు ఈ హిపోక్రసీ నుండి బయటపడలేనంతవరకు, కులరహిత సమాజం ఒక ...మిధ్య, ఎండమావి...
ReplyDeleteబాలగోపాల్ గారు అన్న మాటలు చాలా నిజం. మా యూనివర్సిటీలో రెండు మూడు సార్లు ఆయన ఉపన్యాసం విన్నాను...చాలా నచ్చాయి.
ReplyDeleteఆ.సౌమ్య గారు..
ReplyDeleteధన్యవాదాలు.
బాలగోపాల్ ఉపన్యాసం విన్నందుకు అభినందనలు.
ఆయన ఉపన్యాసం ఫాలో అవటం నాకు చాలా కష్టంగా ఉండేది.
ఆయన మాట చాలా స్పీడ్. తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ అనుకునేవాళ్ళం.
విషయం కూడా ఎక్కువ. ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అయ్యేందుకు లేదు.
నాకయితే ఏదో హెవీ ఎకడమిక్ ప్రోగ్రాం లా అనిపించేది.
Ramana! i have gone through the article. it is very brief and reflective. thanks for sharing your memories. but,long back i ceased to be a civil/human rights activist. i am a bitter critique of the discourse of human rights which is nothing but the discourse of the world capital. I am engaged in writing a critique of the philosophy of human right. Anti-humanism is to be embraced to save the nature that includes humankind. By bringing our human from the natural, we moved away from nature and embraced artificial and unnatural. find some of my views in scribd.com by browsing bhuvanchandra.
ReplyDeleteబాల గోపాల్ గార౦టే చాలా అభిమానమ౦డీ, కాని నాకు ఆయన పై అభిమానం వారి కులాన్ని బట్టే అనిపిస్తున్నది. వారి గురి౦చి చక్కని విషయాలు చెప్పారు.
ReplyDelete(అవునూ మీదే కులమూ..అబ్బే తెలిస్తే మిమ్మల్ని బాగా అర్ధం చేసుకోవచ్చనీ ;-) )
రమణ గారూ:
ReplyDeleteచిన్న వ్యాసమే అయినా బాలగోపాల్ మనసుకి అద్దం పట్టింది.
అవును, మనకి మనం చాలా clean slate అనుకుంటాం. కానీ, కులం/ మతం అనేవి ఎప్పటికప్పుడు మనల్ని కొత్త అద్దం ముందు నిలబెడ్తాయి, కొత్త ప్రశ్నల్ని మన ముఖమ్మీద చూపిస్తూ...
ణ గారు, వామపక్ష భావజాలం అంటే 100% సరి పడని నాకు బాల గోపాల్ గారంటే గౌరవం. కారణం ఆయన పుస్తకాలు రాస్తూ కూచోకుండా ,బతికినన్ని రోజులు అనుక్షణం పేద ప్రజల కొరకు ఎన్నో కేసులు వాదిస్తూ, ఊర్లు తిరుగుతూ ఉండేవాడు.ఈ క్రమంలో ఆయన సంపాదించి వెనకేసుకొంది ఎమనా వుండి ఉంటే, ఆయనని ఇన్ని రోజులు ఎవరు గుర్తుంచుకొనే వారు కాదేమో. సిద్దాంతాలు ఎవైనా నిజాయితి గా పని చేసినందుకు అతనిని అభిమానించేవారు ఉన్నారు. అన్నమాచర్యుల సంకీర్తనలను తెలుగువారికి అందించిన రాళ్లపల్లి గారి మనుమడని ఎమైన సాఫ్ట్ కార్నర్ ఉండిఉండవచ్చేమో!
ReplyDelete_________________________________
కులపిచ్చిని వాడుకొని వేల ,లక్షల కోట్లు పోగేస్తే ప్రజలకు కులం వలన నష్ట్టం కాని. పేదలకోకు నిజాయితి గా పోరాడే వాడిని రక్షిస్తే సమాజానికి జరిగిన అపకారం/నష్ట్టం ఎమీలేదు కదా! `````
SriRam
*అవునూ మీదే కులమూ..అబ్బే తెలిస్తే మిమ్మల్ని బాగా అర్ధం చేసుకోవచ్చనీ ;-*
ReplyDeleteవేల,లక్షల కోట్లు వేనకాల వేసుకొన్న నాయకులను కేవలం కుల పిచ్చి కొరకు సమర్ధించే ఈ రోజుల్లొ, అమేరికాకు వేళ్ళినా కులపిచ్చిని పాస్ పోర్ట్ లాగా తమతో తీసుకొని వెళ్ళుతున్న ఈ కాలం లో, ఆడవారు సహితం తమ పేరుకి కులాల పేర్లను తగిలించుకొంటున్న ప్రస్తుత కాలం లో , జీవితకాలం తెలివిని ,ఆరోగ్యాన్ని పణ్ణంగా పెట్టి తిరిగిన బాలగోపాల్ అనే, ఒక నిజాయితి పరుడి ప్రాణాన్ని రక్షించటానికి మీడీయా వారు కులం కార్డ్ ఉపయోగించారు, అనే భావం వచ్చే విధంగా అతి నిజాయితితో అనాలిసిస్ చేసుకొన్న బాలగోపాల్ గారి కులమే రమణ గారిది. అదే కాక పైసా డబ్బులు రాని, ఈ రచనా వ్యాసంగాన్ని ఆత్మత్రుప్తి కోసం, బ్లాగులొ ఇంత సీరియస్ గా (హాస్యం రచనలు రాయటం కష్ట్టం కదా! )తీసుకొని రాసే మగవారు వారే, మిగతా వర్గాల మగ వారైతే లో ఈ డబ్బులు రాని పని చేస్తుంటే మేడం గారు ఈ పాటికే అప్పడాల కర్ర తీసుకొని ఉండేవారు :-) మీరు, పైసా సంపాదనలేని మీ రచనలు అని.
______________________
రమణ గారు, ఈ మధ్య ఆజాద్ చనిపోతే కూడా కవరేజ్ ఎక్కువగా ఉండింది. దానికి కారణం కులం అనుకోవచ్చా? నేనైతే అలా అనుకోవటం లేదు. బాలగోపాల్, ఆజాద్ లాంటి వారు కులాల కతీతంగా ఎదిగి పోయారని అనుకొంట్టున్నాను.
Sri Ram
ఇప్పుడే మీ బ్లాగు చూడ్డం. ఇన్నాల్లూ ఎలాగో మిస్సయ్యాను.
ReplyDeleteపాత పొస్టులు చాలా బాగున్నాయి. రాతలో ఫ్లో, హాస్య చతురత సూపర్.. కొనసాగించండి...(Keep it up)
ఈ టపాకి స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteబాలగోపాల్ వ్యక్తిత్వం విలక్షణమైనది.
ఆయన రాజకీయాలకి అతీతంగా ఎంతోమందిని ప్రభావితం చేశాడు.
ఆయనతో నాకు గల స్వల్ప పరిచయం ఒక చెరగని ముద్ర.
ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాను.
బాలగోపాల్ పుస్తకాలు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి.
ఆయన రాజకీయ ఆలోచనల పట్ల ఆసక్తి గలవారు ఆ పుస్తకాలు చదువుకోవచ్చు.
సాహిత్యాభిమానులైతే 'రూపం సారం' మిస్ కాకండి.
పోస్టులో రాసిన అభిప్రాయాలు నావి కాదు. బాలగోపాల్ వి.
నేను బాలగోపాల్ అభిప్రాయాల గూర్చి చర్చించేదేమీ లేదు.
ఆ విషయం స్పష్టంగానే టపాలో రాశాను కదా!