ఈరోజు ప్రముఖ హిందీ సినిమా నేపధ్య గాయకుడు మన్నాడే మరణించాడు.
మన్నాడే మధుర గాయకుడు, శాస్త్రీయ సంగీతంలో నిష్టాతుడు.. ఇలా అనేక విశేషాలతో రేపటి పత్రికల్లో వ్యాసాలు వస్తాయి. ఆసక్తి ఉన్నవారు రేపటిదాకా ఆగవలసి ఉంటుంది.
మన్నాడే తన పాటలతో నన్ను అలరించాడు. ఆయనది చాలా క్లీన్ వాయిస్.
శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రతిభ కలవారు సినిమా పాటలు పాడటానికి ఇబ్బందిగా ఫీలవుతారు. కారణం.. సినిమా అనేది పూర్తిగా డిఫెరెంట్ మీడియం. అక్కడ సన్నివేశాన్ని అనుసరిస్తూ, సందర్భాన్ని బట్టి నటీనటుల బాడీ లాంగ్వేజికి అనుగుణంగా పాడవలసి ఉంటుంది.
రాకెట్ సైంటిస్టుని రాకెట్ ఎలా ఎగురుతుందో ఒక చందమామ కథలాగా చెప్పమంటే ఇబ్బంది పడతాడు. వెయ్యిమందికి అవలీలగా వంట చేసేవాణ్ణి.. ఇద్దరికీ కాఫీ పెట్టమంటే చికాకు పడతాడు. రోజూ గుండె ఆపరేషన్లు చేసే డాక్టర్ని.. గొంతు నొప్పికి మందడిగితే చాలాసేపు ఆలోచిస్తాడు. ఇవన్నీ సింపుల్ గా కనిపించే ఇబ్బందికరమైన అంశాలు.
అట్లాంటి ఇబ్బందే గొప్ప గాయకులకి కూడా ఉంటుంది. మనకి తెలిసిన ఘంటసాల, రఫీలు శాస్త్రీయ సంగీతాన్ని పద్దతిగా నేర్చుకున్నారు. మంచి ప్రతిభావంతులు. అయితే వారు తమ ఇబ్బందిని అధిగమించి.. సినిమా పాటలకి తగ్గట్టుగా తమని తాము మలచుకున్నారు. గొప్ప విజయాలు సాధించారు. ఇదేమీ మామూలు విషయం కాదు. మన్నాడే కూడా ఈ మహాగాయకుల కోవకి చెందినవాడేనని నా అభిప్రాయం.
రచయితలకైతే ఫలానా కథ అని గుర్తు చేసుకుంటాం. గాయకులకైతే ఫలానా పాట అని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లింక్ ఇచ్చుకుని చూసుకునే సౌకర్యం ఉంది కాబట్టి.. నాకు నచ్చిన సినిమాలోంచి, నచ్చిన మన్నాడే పాటొకటి ఇస్తున్నాను. చూసి ఆనందించండి.
మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన్నాడే కి నా అశ్రుతర్పణములు.
ReplyDeleteTruly Painful News !!
ReplyDeleteఅప్పుడెప్పుడో డీడీలో ’కాబూలీవాలా‘ (రవీంద్రుడి కథ) సినిమాలో ‘అయ్ మేరే ప్యారే వతన్’ పాట ఫస్ట్ టైమ్ విన్నప్పుడు మన్నా డే మెలోడియస్ గొంతు పరిచయమైంది. నిజంగానే మన్నాడే ది అత్యద్భుతమైన స్వరం. సీమా, బసంత్ బహార్, దో బీగా జమీన్, తూఫాన్ ఔర్ దియా ఇలాంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలు అజరామరాలు. మీ నివాళి బాగుంది. థాంక్యూ. తూఫాన్ అవుర్ దియా సినిమాలోని మన్నా డే పాట బాగా నచ్చుతుంది. హై పిచ్ లో, మార్చింగ్ ట్యూన్ లో, స్ఫూర్తివంతంగా ఉంటుందీ పాట.
ఆ పాట యూట్యూబ్ లింక్: http://www.youtube.com/watch?v=GZkQn5D-EvY
ReplyDeleteపాపం సార్. ఆయన పోతే, మొత్తం 70 మంది మాత్రమే వొచ్చారంట.
ఆయన పాటల్లో టాప్ టెన్ అంట ఇక్కడ చూడండి
http://www.firstpost.com/bollywood/the-top-10-songs-of-manna-dey-you-must-listen-to-1190871.html
Manna Dey's range is almost as versatile as Rafi's.
ReplyDeleteMy Mannada favorites:
Yeh raat bheegee bheegee from Chori Chori (http://www.youtube.com/watch?v=f1DZxkiMjRo)
Aye meri zohra jabeen from Waqt (http://www.youtube.com/watch?v=qfNjDPsX1VQ)
May his soul rest in peace
RIP :(
ReplyDeleteNot a single personality from Bollywood was present at the funeral. Just a couple of celebrities from the Kannada film industry attended. In fact, there were barely 70 mourners at the funeral.
ReplyDelete(from rediff)
మిత్రులారా,
ReplyDeleteమన్నాడే సినిమాల్లోంచి రిటైర్ అయ్యి చాలాకాలం అయింది. ఆయన తోటివాళ్ళు పోయి కూడా చాలా యేళ్ళయింది. అదీగాక కన్నడ దేశంలో ఆయన గూర్చి తెలిసినవాళ్ళు తక్కువ. ఇవన్నీ తక్కువమంది హాజరవ్వడానికి కారణాలు కావచ్చును.
అయితే - ఆయన పాటల్ని చక్కగా ఎంజాయ్ చేసిన అభిమానులుగా.. మనం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.
మా బాగా చెప్పావ్!
Deleteగౌతం
అరవ అభిమానం(ఆత్మాహుతులు వగైరా..)చూపకుండా ఆ మధుర గాయకుని పాటలను జీవితాంతం గుర్తుంచుకోవడమే నిజమైన నివాళి.
ReplyDeleteమై డియర్ రమణ,
ReplyDeleteమన్నాడే ని చూడగానే పి బి శ్రీనివాస్ గుర్తుకొస్తాడు. ఇకపోతే ఘంటసాల, పి బి, జేసుదాస్, కిషోర్, రఫి, ముకెష్, మన్నాడే ల మధ్య పోలిక కుదరదు. ఎవరికి వారే వాళ్ళ వైవిద్యమైన స్వరాలతో స్రోతలను మైమరిపిస్తారు. మన్నడే పాడిన పాటల్లో నాకు బాగ ఇష్ఠమయినవి "ఆనంద్" సినిమాలో జిందగీ కైసి హై పహెలి హాయె, మేరా నాం జోకర్లోని ఎ భాయ్ జర దేక్ ఖె చలొ. నా దృష్ఠిలో వీరంతా అమర గాయకులు. కారణ జన్ములు.