నేను పుట్టిన కులానికి రిజర్వేషన్ లేదు. మెడిసిన్ సీట్ వచ్చాక కూడా నాకు కులాలపై సరైన అవగాహన లేదు. కొన్నాళ్ళకి - రిజర్వేషన్లు ప్రతిభని దిగజారుస్తున్నయ్యనీ, OC పేదవారికి అన్యాయం జరిగిపోతుందనీ నమ్మడం మొదలెట్టాను. ఆ తరవాత కొన్నాళ్ళకి రిజర్వేషన్లపై నాకున్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను.
ఇదంతా ఒక పరిణామ క్రమం. యే విషయాన్నైనా అవగాహన చేసుకోడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోదశలో స్థిరపడిపోతారు. రిజర్వేషన్ల గూర్చి ఒకప్పటి నా అవగాహన ఆనాడు నాకున్న పరిమితుల్ని సూచిస్తుంది. నాకు రిజర్వేషన్ లేకపోవడం, సైన్స్ విద్యార్ధిని కావడం, రిజర్వేషన్ వల్ల వచ్చిన మెడికల్ సీటుతో చదువుకుంటున్న వారితో పెద్దగా స్నేహం లేకపోవడం నాకున్న పరిమితులు.
రిజర్వేషన్ ప్రతిభని గండి కొడుతుందనే వాదనలో పస లేదు. ఉదాహరణకి మెడిసిన్ సీటుకి కావలసిన కనీస అర్హత ఇంటర్మీడియేట్ బయాలజీ సబ్జక్టుల్తో పాసవ్వడం. కానీ మెడిసిన్ సీట్లు తక్కువ, అర్హులైన విద్యార్ధులు ఎక్కువ అవడం మూలాన మళ్ళీ EMCET అని ఇంకో పరీక్ష పెడుతున్నారు. ఇందుకోసం విద్యార్ధులు ఇంటర్ సబ్జక్టుల్నే మళ్ళీమళ్ళీ చదువుతారు. ఇంటర్మీడియేట్ సబ్జక్టుల జ్ఞానం (దీన్నే 'మెరిట్' అని కూడా అంటారు) సీటు వొచ్చేదాకాననే విషయం గుర్తుంచుకోవాలి.
వొక్కసారి మెడిసిన్ సీటొచ్చాక పూర్తిగా కొత్త సబ్జక్టులు మొదలవుతాయి, కొత్త కోర్సూ మొదలవుతుంది. MBBS సబ్జక్టులు పాసవడానికి ఎవరికీ ఎటువంటి రిజర్వేషనూ వుండదు. అందరికీ ఒకే పరీక్ష, ఒకే కొలబద్ద. కాబట్టి - సామాజికంగా వెనకబడిన విద్యార్ధులకి మెడికల్ కాలేజిలోకి ప్రవేశానికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని, ఇంకే విధమైన రాయితీలు ఉండవని అర్ధం చేసుకోవాలి.
మన దేశ ఆరోగ్య వ్యవస్థలో ప్రభుత్వాల పాత్ర చాలా ప్రధానమైనది. ఇప్పటికీ గ్రామీణ పేదల అవసరాలు ప్రభుత్వాసుపత్రులే తీరుస్తాయి. ఈరోజుకీ టైఫాయిడ్, కలరా, మలేరియా, డయేరియాలే మన ప్రధాన శత్రువులు. ఈ రోగాలకి వైద్యం అందేది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే. మనం గమనించవలసినది - ఇక్కడ పన్జేసే వైద్యుల్లో ఎక్కువమంది రిజర్వేషన్ వల్ల డాక్టర్లైనవాళ్ళే.
'ప్రతిభ' ఉండి, రిజర్వేషన్ లేని డాక్టర్లు (ఎక్కువమంది) ఏం చేస్తారు? మెరుగైన వసతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకి వలస వెళ్ళిపోతారు. లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మిస్తారు. కారణం - వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పన్జేసే అవసరం వుండదు (వనరుల సమస్య వుండదు కనుక).
కొందరు వైద్యవిద్యకి గొప్ప బుర్ర కావాలని అనుకుంటారు. నాకిది అర్ధం కాదు. నేననుకోవడం మంచి డాక్టర్ కావాలంటే కావలసింది commitment. గొప్ప తెలివితేటలున్న మెరిట్ విద్యార్ధి PG సీటు కోసం లైబ్రరీల్లో శ్రమిస్తాడు. రిజర్వేషన్ విద్యార్ధులు వార్డుల్లో పేషంట్ల మధ్యన శ్రమిస్తారు. కారణం - వారు MBBS తో గ్రామీణ ప్రాంతాల్లో పన్జేయ్యడానికి మానసికంగా సిద్ధపడిపోయి వుంటారు కాబట్టి. MBBS సబ్జక్టుల్ని టెన్త్ క్లాసులాగా, ఇంటర్మీడియేట్ లాగా లైబ్రరీలలో చదవడం సరైన వైద్యవిద్య కాదు. వైద్యవిద్యకి రోగాల్నీ, పేషంట్లనీ అర్ధం చేసుకోడం ఎంతో అవసరం.
ఇలా అనేకమైన లోపాలతో, priorities తలక్రిందులుగా వున్న వైద్యవిద్య వల్ల రిజర్వేషన్ వున్నా, లేకున్నా committed doctors వచ్చే అవకాశం తగ్గించేసుకున్నాం. ఇవన్నీ లోపలకెళ్తే గానీ కనపడని లోపాలు. కాబట్టి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందన్నది పసలేని వాదనే అవుతుంది.
నాకు తెలుసు, ఇవన్నీ చాలా ప్రాధమిక పాయింట్లని. కానీ ఈ మాత్రం చెప్పేందుకు నా స్నేహితులు నాకెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఒకళ్ళిద్దరు ఎగతాళి కూడా చేశారు. ఇది నా బ్లాగ్ కాబట్టి ఈ చిన్ని పాయింటుని ప్రశాంతంగా రాసుకున్నాను (బ్లాగ్రాతల వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది).
ముగింపు -
"నాన్నా! ఈ రిజర్వేషన్లు చాలా దారుణం. BC, SC ల వల్ల మనం చాలా నష్టపోతున్నాం." నా కూతురి స్టేట్మెంట్!
"ముందు రిజర్వేషన్లు ఎలా వోచ్చాయో తెలుసుకో. మనకి స్వతంత్రం రాక ముందు.. " అని చెప్పబోతుండగా -
మొహం చిట్లించుకుంటూ నా కూతురు తన బెడ్రూములోకి వెళ్ళిపోయింది!
(picture courtesy : Google)
నేను పుట్టిన కులమో రిజర్వేషన్ పరిదిలోకి రాదు. ఇంతకు ముందు చాలా వ్యతిరేకత ఉండేది... ఇప్పుడు కొద్దిగా ఆలోచన మొదలయ్యింది :)
ReplyDeleteఆలోచనలెప్పుడూ కొద్దిగా లేటుగానే మొదలవుతయ్! :)
Deletewhen reservation was given in admissions there is no need of reservations in jobs or in promotions, as you told merit people are going abroad and reserved people are ruling India.
ReplyDeleteIs it! I think we follow a reservation roster system laid down by apex court.
Deleteనేను ST అయినా నేను రిజర్వేషన్‌కి వ్యతిరేకం. మా కులంలో అంగూఠా వేసేవాడు కూడా తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు. గ్రామీణ ప్రాంతాల్లో degree చదివేవాళ్ళు నాలుగు లేదా ఐదు శాతం ఉంటారు. ఒక్క శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా బతకడానికి చదువే సులభమైన మార్గమని మిగితావారు అనుకుంటారు. అందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు పెట్టాలి కానీ చదువులూ, రిజర్వేషన్ల వల్ల అందరికీ ఉద్యోగాలు రావని చెపితే, వీళ్ళు నమ్మరు.
ReplyDeleteచదువుకి చాలా ప్రాముఖ్యత పెరిగిన మాట నిజం. చాలా పేదవారు కూడా అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. చదవంగాన్లే ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మే అమాయకులు వీరు.
DeleteBy the way, watch this video: https://youtu.be/2uJmxFHSaFc
Deleteఆహా ! పని లేక పిపీలికమై మళ్ళీ ఈ పనిలేక కొత్త సంవత్సరం లో ఈ "ఫీలింగ్"కము ఏమిటి :)
ReplyDeleteశుభాకామ్క్షల తో !
(మీ బ్లాగు బ్లాగిల్లు లో వస్తోందండోయ్ !)
చీర్స్
జిలేబి
జిలేబీ జీ,
Delete'పని లేక.. ' మూసెయ్యడానికి కారణం - దొంగనాయకమ్మ అనే బ్లాగ్! ఇందుకు 'మాలిక', హరిబాబులు కారణం. నాకు బ్లాగిల్లు గూర్చి తెలీదు. ఇప్పుడే చూస్తాను. కామెంటినందుకు ధన్యవాదాలు.
ఒక్క వ్యాఖ్య తో మీరు మళ్ళీ ఇక్కడ వ్రాసేట్లు చేసారు కదా ! మీ బ్లాగిల్లు గట్రా మీకెందుకండీ. ఈ బ్లాగు రిజిస్టర్ పర్మినెంట్ గా రిజిస్టర్ అయిపొయింది చదువరుల జ్ఞాపకాల్లో. పిపీలికం చూడాలన్నా ఇక్కడికొచ్చి లింక్ వెదుక్కోవాలి. ఇక్కడి టపా అసలు ఏ బ్లాగ్ లో చదువుతున్నామో అర్ధం కాకుండానే (పక్కన కూడలి టపా లేటెస్ట్ అని కనిపిస్తుంటే ఈ పోస్ట్ ఎక్కడిదబ్బా అనుకుంటున్నా చదవడం ఆపలేదు మరి :)
Deleteరమణ గారు, మీరు వైద్యుడు & రిజర్వేషన్ అవసరం లేనంత డబ్బున్నవారు. నేను రిజర్వేషన్ అవసరం లేని వ్యవసాయకుణ్ణి. వ్యాపారం, వ్యవసాయం చెయ్యకుండా కేవలం చదువునే పెట్టుబడిగా పెట్టి ఉద్యోగం మాత్రమే చెయ్యాలనుకునేవాళ్ళే రిజర్వేషన్ పేరుతో కొట్టుకుంటారు.
ReplyDelete'రిజర్వేషన్‌తో చదువుకున్నవారిలో ప్రతిభ వుండదు అనే అభిప్రాయం సరికాదు.'
Deleteఈ చిన్న పాయింట్ ఘాట్టిగా చెప్పడమే ఈ పోస్ట్ లక్ష్యం. :)
సరిగ్గా చెప్పారు,చిన్న పాయింట్లను కూడా వినడానికి ఇష్టపడని వారు, నాక్కూడా తగుల్తూనే ఉన్నారు. ఈ బ్లాగులు నిజంగా 'ఆ ప్రశాంతంగా చెప్పుకోలేకపోయే' కొరత తీరుస్తున్నాయి.
ReplyDeleteనేనకోవడం - మనం interact అవుతున్న 'సమూహం' ఎవరు అన్నది గుర్తించడం ముఖ్యం. ఒక్కో 'సమూహం' ఒక్కో రంగు, రుచి, వాసన కలిగుంటుంది. 'రిజర్వేషన్ల వల్ల దేశానికి కలుగుతున్న నష్టం' అని చెప్పడం మొదలెడ్తే నా స్నేహితులు తెల్లవార్లూ వినడానికి సిద్ధం. :)
DeleteBack with Bang Sir...Missed your articles(blogs) a lot..Meee Ammai tho yemi cheppali anukunnaro ikkada cheppochu kadaaa..!!
ReplyDeleteథాంక్యూ! చాలామందికి fixed opinions వుంటాయి. కానీ - 'i am very democratic and open for new ideas' అనే భ్రాంతిలో వుంటారు. అందుకోసం ఒక చిన్న ఉదాహరణ రాశాను.
Deleteరిజర్వేషన్ల గూర్చి ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి - అవి నాగార్జున సిమెంటులాగా ధృఢంగానూ వుంటాయి. :)
<<< Fixed Options>>>
Deleteకాల్ ఆప్షనా లేక పుట్ ఆప్షనా సెలవీయ వలె !
స్ట్రాటెజీ కవర్డ్ కాలా లేక పుట్టా లేక ఐరన్ కాండోరా :)
జేకే !
జిలేబి
For me, reservation doesn't matter but opportunity matters. In America, a least educated person can be employed as a store cashier. In India, every one wants government job. Exploring alternate options is taboo-like in India.
ReplyDeleteచెప్పిన పాయింటు చాలా సరైనదే. సీటు వచ్చిన తర్వాత రిజర్వేషను తో పని లేదు కానీ, రెలటివ్ గ్రేడింగ్ వల్ల రిజర్వేషను పిల్లలు చాలా కష్ట పడితేనో, స్వయం ప్రతిభతో వెలగక పోతేనో కానీ నెగ్గుకొచ్చి మంచి మార్కులతో పాసవడం కష్టం. సీజీ పీ ఏ తగ్గి పోయి IIT ల్లో ఉపకార వేతనం కుదించబడ్డ రిజర్వేషన్ పిల్లలెంతమందో.
ReplyDeleteWhile providing reservations is mandatory as long as our society remains pathologically stratified, the issue of reservation is very very complex. It necessitates large scale research and national debate. Just having reservations without any additional scaffolding to bring them on par will not be very productive.