మన ఇంటికి అతిథులు వస్తారు. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకరికి మాత్రం మంచినీళ్ళే ఇస్తాం. ఆ మంచినీళ్ళ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, తరవాత చిన్నబుచ్చుకుంటాడు, ఆ తరవాత కోపగించుకుంటాడు. కాఫీ ఆరోగ్యానికి హాని అనీ, అందుకే నీకు ఇవ్వలేదనీ మనం బుకాయించబోయినా అతడు ఒప్పుకోడు. వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు. అయినా, అందరితో పాటు తనకి కాఫీ ఆఫర్ చెయ్యనందుకు కోపగిస్తాడు. తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు.
కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్ల దుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) దీక్ష తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి కనబడుతుందిట గానీ - దాన్ని దేవస్థానం బోర్డు ఉద్యోగులే చాలా కష్టపడి వెలిగిస్తారని ప్రభుత్వమే వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదుట. దీనిక్కారణం ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు.
ప్రజలు నమ్మకాల్నీ, భక్తినీ ప్రశ్నించడానికి సందేహిస్తారు. 'మనకెందుకులే' అనుకుని అలా ఫాలో అయిపోతూ వుంటారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఏదోక రోజు నమ్మకాల్నీ, సాంప్రదాయతనీ ప్రశ్నించేవాళ్ళు బయల్దేరతారు. అంటు, మైల, ముట్టు - మొదలైన ముద్దుపేర్లతో menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు).
'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).
'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).
కోర్టుక్కూడా న్యాయదేవత వుంది. కానీ ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. వాళ్లకి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది.
సమాజం నిశ్చలంగా వుండదు, నిరంతర మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావు లేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నారు. ఆ గుండెలు బాదుకునే వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి పుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిస్తున్నాను.
(picture courtesy : Google)
ఈ మంట రాజుకోవాల్సిందే సర్.
ReplyDeleteకానీ అన్ని వైపులా (మతాలలో) రాజుకుంటే ఇంకా బాగుంటుంది..
అవును, మీ అభిప్రాయమే నాది కూడా.
Deleteవాడు "మీరు రావద్దు" అని చెబుతున్నా, వీళ్ళు వెళ్ళడానికి ఎందుకు ఎగబడాలి? సరైన నిర్ణయం స్త్రీలు శబరిమలైని తిరస్కరించడమే.
ReplyDeleteఇదేపని దళితులుకూడా హిందూమతంతో చేసిననాడు, మతమే దిగివస్తుంది. మన జనసంఖ్యనుచూసి మనవెనకాల ఫేస్‌బుక్కోళ్ళే లుంగీలెగ్గట్టుకు పరిగెడుతున్నారు. దేవుడూ అలాగే పరిగెడతాడు. ఎవరినైతే హిందూమతం నిరాదరిస్తోందో, ఎవరిని చిన్నచూపుచూస్తోందో వారందరూ హిందూమతాన్ని వదిలేస్తే, హిందూమతం తిక్క కుదురుతుంది.
అవునుగానీసార్! ప్రతిరోజూ పూజారిగారుకూడా మలవిసర్జనచేస్తాడుకదా... దానివల్ల పూజారి అపవిత్రం కానప్పుడు, నెలకోసారి జరిగే ఋతుస్రావంవల్ల స్త్రీలెలా అపవిత్రమైపోతారు?
అందుకే నేనీ పోస్టుని కాఫీతో మొదలెట్టాను. :) సమాన హక్కుల కోసం కోర్టు తలుపులు తట్టడం కూడా పోరాట స్వరూపమే. వెళ్ళేదీ లేనిదీ తరవాత వాళ్ళే నిర్ణయించుకుంటారు.
Deleteఅంబేడ్కర్ దళితులకి ఇచ్చిన సలహా కూడా ఇదేననుకుంటాను.
పాపం అయ్యప్ప :)
ReplyDeleteజిలేబి
జిలేబీ జి,
Deleteఅవును, పాపం అయ్యప్ప :)
అక్కడ అసలు కారణం ముట్టు విషయం కాదనుకుంటా మాష్టారూ...అదే ఐతే, అది అన్ని గుళ్ళ కీ వర్తిస్తుంది...
ReplyDeleteనా అభిప్రాయం: స్వాములు నలభై రోజులు బెమ్మచారుల్లా వుంటారు, అలాంటోల్ల మధ్య అమ్మయిలొస్తే ఇత్తడి ఇత్తడైపొద్ది!
ఇది అర్థం కావాలంటే, ఒకసారెప్పుడైన కేరళ గుడి కెళ్ళి చూడండి... ఓసారి నే పోయా...
ఆడా మగా తేడా లేకుండా నా మీద పడిపోయారు... ఎక్కడ పిసికి పారేస్తారో అని బయపడి చచ్చా!
తిరణాలప్పుడూ జనాలు అలాగే వుంటారు. ఇష్టం వున్నవాళ్ళు వెళ్తారు, లేపోతే లేదు.
Deleteఆ నలభైరోజులూ వీళ్ళు చేసేది నటనేతప్ప, ఆ దీక్ష వీళ్ళ చర్మాలలోకి ఇంకదనేది మీభావంకూడానా?
Deleteమక్కాలోకి రంజాన్‌లో హజ్ యాత్రకెళ్ళే యాత్రికులుకూడా ఇలాగే sex కి దూరంగానే ఉంటారు. అక్కడైతే అసలు బురఖాలుకూడా లేకుండా తిరగొచ్చు స్త్రీలు, పురుషులు. బహుశా వాళ్ళు సంస్కారులవ్వడమూ, నిజంగా దైవభక్తి కలిగిండడంవల్ల అక్కడ మీకున్న భయాలు పెట్టుకోనవసరంలేదేమో!
సుబ్రమణ్యం గారు,
Delete>>ఆడా మగా తేడా లేకుండా నామీద పడిపొయ్యారు<<
నా రెస్పాన్స్ Bullabbai గారి కామెంటుకి సమాధానంగా మాత్రమే.
నేను రాయని అభిప్రాయాల్ని నాకు ఆపాదించడం తగదు.
నేను మీకిచ్చిన రిప్లైకాదు బాబోయ్.
Deleteవనితల కుగలిగె వరమున తీర్పు
ReplyDeleteఅనిరి స్వామి శరణ మయ్యప్ప యనగ
చనిరి వడివడిన చరణము గనగ
గనిరి కొండన జ్యోతి గణగణ వెలుగ
చీర్స్
జిలేబి
sir,
ReplyDeletenaaku poorthika ardham kaledu.
inthaki shabarimalaiki womens pravesam undalantara?
ఎవరికైనా - ఒక పబ్లిక్ ప్రదేశానికి ఒక వయసు ఆడవాళ్ళని రావొద్దని నిషేధించే హక్కు వుందా లేదా అనేది కోర్టు ముందున్న విషయం. నా అభిప్రాయం స్పష్టంగానే రాశానుగా!
DeleteI agree with unknown and bullabbai opinions !
ReplyDelete