Tuesday 19 January 2016

దళిత ప్రజాప్రతినిథుల దివాళాకోరుతనం


అనగనగా ఒకానొకప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్ధి సంఘాలు వుండేవి. SFI, AISF, RSU, ABVP, NSUI అంటూ హడావుడి రాజకీయ వాతావరణం వుండేది. ఇప్పట్లా కులసంఘాలు వుండేవి కావు. విద్యార్ధి సంఘాలు ప్రధాన రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలు కావున, తరచూ వీటిమధ్య గొడవలు జరుగుతుండేవి. వాతావరణం అప్పుడప్పుడు ఉద్రిక్తంగానూ వుంటుండేది. 

కాలక్రమేణా ఎర్రజెండా ప్రాభవం కోల్పోయింది. ఎర్రజెండా స్థానంలో దళిత సంఘాలు క్రియాశీలకంగా ముందుకొచ్చాయి. వీరికి రాజకీయంగా సహజ శత్రువు బ్రాహ్మణీయ ABVP కాబట్టి అనేకచోట్ల ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనుంది. ఇదిలా వుండగా - కేంద్రంలో బీజేపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మతవాద శక్తులకి అధికారం తోడైతే ఇంక ఎదురుండదు. కావున ఇవ్వాల్టి ABVP ఒకప్పటి ABVP కాదు, చాలా బలం సంతరించుకుంది. ఈ నేపధ్యంలో ఆలోచిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

సంఘపరివారానికి ABVP కార్యకర్తలు, VHP నేతలు, కేంద్రమంత్రులు.. అందరూ బిడ్డలే. ఎవరు ఎంత స్థాయిలో వున్నా అన్నదమ్ములు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కాబట్టి యూనివర్సిటీలో జరిగిన ఒక చిన్న ఘర్షణ ఆధిపత్య పోరుగా మారింది. ఈ పోరులో సంఘపరివారానికి చెందిన కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి చురుకైన పాత్ర వహించడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. 

మతతత్వ విద్యార్ధి సంఘానికి కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పుడు - వివక్షతకి గురవుతూ, తీవ్రమైన కష్టాల్లో వున్న దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు ఎందుకు అండగా నిలవలేదు!? ఎందుకంటే - మనది నిచ్చెన మెట్ల మనువాది వ్యవస్థ. ఇది ఖరీదైన ముసుగు కప్పుకుని అమాయకంగా కనిపిస్తుంది. అధికారం అందరి చేతిలో వున్నట్లుగానే కనబడుతుంది గానీ - కొందరి చేతిలోనే వుంటుంది.

కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని కాదన్నవాడికి మంచినీళ్ళు పుట్టవు. బీజేపిలో RSS విధేయుడిగా లేనివారు వార్డు స్థాయి నాయకుడిగా కూడా ఎదగలేరు. కెరీర్ రాజకీయాల్లో పదవే పరమావిధి. అందుకు చట్ట సభల్లో ఎన్నిక కావడం కీలకం. అందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు అవసరం. అందుకు పార్టీకి విధేయుడిగా వుండటం అవసరం.

ఈ సీక్వెన్స్ అర్ధం అయితే, సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్ధులకి దళిత ప్రజాప్రతినిథులు అండగా ఎందుకు నిలబడలేదో అర్ధమవుతుంది. దళిత రిజర్వేషన్ వాడుకుని ప్రజాప్రతినిథులుగా ఎన్నికైనవారు 'పైనుండి' ఆదేశాలు రాకపోతే తమవారి వైపు కన్నెత్తి చూడరు (అలా చూస్తే ఏమవుతుందో తెలిసిన బ్రతకనేర్చిన నేతలు కనుక). అధికారం, పదవులు, డబ్బుకున్న పవర్ అట్లాంటిది!

మనువాది పార్టీలు దళితులకి ఎలాగూ శత్రువులే. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు ప్రమాదకారి. తమ పక్షాన నిలబడని (నిలబడలేని) దళిత ప్రజా ప్రతినిథులకి బుద్ధి చెప్పగలిగి, వారిని శాసించే స్థాయికి దళిత సంఘాలు చేరుకున్న రోజున - అవి శత్రువుని మరింత సమర్ధతతో ఎదుర్కొనగలవు. ఆ విధంగా దళిత చైతన్యం పురోగమించగలిగితే, రోహిత్ వంటి యువకులు మరింత ఉత్సాహంగా పోరాడగలరు. ఆ రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ఆశాభావంతో వుందాం (అంతకుమించి చేసేదేమీ లేదు కనుక).


(picture courtesy : Google) 

31 comments:

  1. బాగా చెప్పారు. ఇది అర్ధమవక సామాన్యులు ఒకరినొకరు తిట్టుకుంటూ (కొందరు మనసులోనే లెండి) ద్వేషభావంతో మండిపడుతున్నారు. కులం కుంపటి పదవి దుప్పటి అవుతుంది అందుకే !

    ReplyDelete
    Replies
    1. దెబ్బతిన్నవాళ్ళు కోపంగా వుండటం సహజం.

      (మీరు బాలగోపాల్ 'రిజర్వేషన్లు - ప్రజాస్వామిక ధృక్పథం' చదివారా?)

      Delete
  2. కనబడే శత్రువు కన్నా కనబడని శత్రువు మరింత ప్రమాదకారి ...ఆ శత్రువు గురించి మాట్లాడడమే మన తక్షణ కర్తవ్యం అనుకుంటున్నాను...

    ReplyDelete
    Replies
    1. అవును, ఆల్రెడీ ఈ పని జరుగుతుంది.

      Delete
  3. హిందువులు తమనుతాము రక్షించుకోవడానికి నిక్కర్లేసుకొనే సుశిక్షితులను తయారుచేసుకుంటున్నప్పుడు, దళితులుమాత్రం హిందువులనుండి తమనుతాము రక్షించుకోవడానికి సాయుధపోరాటం బాట ఎందుకు పట్టకూడదు? దళితులుమాత్రమే రాజ్యాంగబధ్ధంగా ఎందుకు నడుచుకోవాలి?

    ReplyDelete
  4. కళ్ళముందున్న వాస్తవాలు సాక్ష్యాలు మరీచి..ఒక కొత్త వాదాన్ని వినిపించడం మధ్యే వాదుల గొప్పతనమేగా మరి. అక్కడ రాజకీయ శవ నాధులకి ఇప్పుడో మధ్యే వాదంగా చావు డప్పుకొట్టే మధ్యతరగతి ఊరడింపు వాదం ఎప్పుడూ ఉండేదే.. కొత్తా కాదు వింత అంత కన్న లేదు..నిజాన్ని నిజంగా మాట్లాడలేని చూడలేని విజ్ఞులున్నంత కాలమూ ఈ చావు మేళాలు శవరాజకీయాలు మధ్య తరగతి మిధ్యే వాద గోడ మీద పిల్లుల ఊరడింపులు ఎలా మారతాయీ ఎందుకు మారతాయీ....SHAME !!!

    ReplyDelete
    Replies
    1. మీవ్యాఖ్య ఎవరినుద్దేశించో అర్ధం కాలేదు.

      ఇప్పటికే దేశభక్త గూండాలు చెప్పినవన్నీ అబధ్ధమని తేలాయి. I hope you are not siding with them. హిందువులెప్పుడూ మాది మెజారిటీ వర్గం కాబట్టి మామాట నెగ్గాలి అంటూంటారు. నిజానికి ఈ దేశంలో మెజారిటీ వెనుకబడిన తరగతులవారు (హిందూమతం కేవలం తన జనసంఖ్య పెంచుకోవడంకోసం వారినికూడా హిందువులుగా పరిగణిస్తుంది ఆలయప్రవేశం, కుటుంబ సంబంధాల దగ్గరికొచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఛండాలురైపోతారు). మెజారిటీ ప్రజల అభీష్టమే చెల్లితే దెబ్బకు దేశంకూడా దిమ్మతిరిగే అభివృధ్ధి సాధించడంతోపాటు, సకల జాడ్యాలనుంచీ విముక్తమవుతుంది.

      Delete
  5. దళితవాదం, స్త్రీవాదం లాంటివి మాట్లాడితే పాలకవర్గంవాళ్ళు ticketలు ఇస్తారా? నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న రెండుమూడు కులాలని ఆకర్షించే తెలివి ఉన్నవానికైతే ticket ఇస్తారు కానీ....

    ReplyDelete
  6. రమణ గారు, చాల రోజుల తరువాత మీ బ్లాగ్ కి వచ్చాను.
    మీకు గాని నిజం ఏమిటి అని తెలుసుకోవాలని వుంటే సుబ్రమణ్య స్వామి , ఎస్. గురుమూర్తి ఇలాంటి వాళ్ళని ట్విట్టెర్ లొ ఫాలో అవ్వండి. ( మన "అవ్వార్డ్ వాపసి " వాళ్ళ లాగ, "అందరూ నా మాటే వినాలి, అసలు మిగతా వాళ్ళకి మాట్లాడే హాక్కె లేదు" అని అంటె చెయ్యగలిగింది ఎమీ లేదు. )

    తెలిసి తెలియక మీరు చెసే నష్టం చాలా వుంది. మీరు అనుకునే రైట్ వింగ్ వాళ్ళూ కూడా (మీరు అందరిని ఒకే గాటన కట్టేసారు) , మిగతా "ఉదార వాద సెకులరిష్ట్" లాగే "శంతంగా వుంటే" మీలాంటి వాళ్ళూ చాల మంది అసలు బ్లాగు తెరవటానికి కూడ చెయ్యటానికి సాహసించరు.

    ReplyDelete
    Replies
    1. మీరు మీ అమాయకత్వం ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ....
      అహ తెలుస్తోందా అని !!!

      Delete
    2. చివరకి "సుబ్రహ్మణ్య స్వామి" లాంటి attention seeking ores (pardon my spelling)ని quote చేసే దశకు చేరుకున్నదన్నమాట మన సమాజం! ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేవాడు ఈ మోది అనే super man యొక్క influence నుంచి deflect అవుతాడో, ఆనడు అతనికి అద్వానీ, వాజపేతు లకు పట్టిన గతే పట్టగలదు. Heil Hitler!!!.

      అబ్బో! అలా ఎవ్వరూ సాహసం చెయ్యకూడదనేదేహా మీ ఎజెండా కూడా!

      Delete
  7. స్మృతి ఇరానీ ఒక పెళ్ళైన వ్యక్తిని పెళ్ళి చేసుకుంది కానీ ఆమే రోహిత్ పుట్టుక గురించి చెడుగా మాట్లాడుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ దళిత నాయకుడూ అడగడని ఆమె ధైర్యం.

    ReplyDelete
    Replies
    1. తప్పుగా ఏం మాట్లాడింది?
      దలితుడు అని తప్పుడు ప్రచారం చేస్తుంటే దలితుడు కాదు అని నిజం వెప్పింది అందులో తప్పు ఏమి ఉంది!!
      ఎవరూ అడగరు ....అంటూనే స్మృతి ఇరానీ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించారు గదా మీరు ... మీరు మీ అతి తెలివి!!

      Delete
    2. అయ్యా... రోహిత్ అలవాట్ల గురించి, "వాడు" ఒక ఒక స్వలింగ సంపర్కుడన్న విషయం గురించి (ఆధారాలు లేకపోయినా) విషయాలను ప్రచారంలో ఉంచారు. కొంచెం దానిని గూర్చి మాట్లాడుదురూ...

      వ్యక్తులమీద విరుచుకుపడడమే సంఘ పరివార్ నీతి (ఏం నెహురూ మీద RSS చేస్తున్నది అటువంటి దాడికాదూ?) అటువంటి దాడినే ససాక్ష్యంగా ఎదుర్కొనడానికెందుకటా అంత ఉలుకూ!?
      `

      Delete
    3. సుబ్బు ... డాటారు గారి కాఫీ లు బా వంటబట్టాయి మీకు!!

      రోహిత్ గురించి మీరన్న రూమరు మీరనేంత వరకు మాకు తెలియదు!!

      ఎవరూ అపవాదులు వేయటం లెదు అని కమ్మ్యునిస్టులే అపవాదాలు పుట్టిస్తున్నట్లు ఉంది!!

      రొహిత్ ముఖపుస్తకాన్ని 5 యేళ్ళు స్క్రోల్ చేసి గనిస్తే ఒక దేశభక్తుడు హిందు వ్యతిరేకి లా ఎలా మారాడొ తెలుస్తుంది.

      ముళపుస్తకం లో రొహిత్ పోస్టులు అనాలసిస్ చేస్తు ఉన్న పొస్త్ కుదిరితే చదవండి ... అన్నీ రొహిత్ పోస్ట్ చెసినవి, షేర్ చెసినవి ఉదహరించారు .



      మీరు చెప్పిన రూమరు నిజం అయినా విమర్శించాల్సిన పని లెదు గానీ ... విడియో లొ ఉన్న కాశాయం చీర కనిపించిమా చింపుతా ...అనేంత విషం ఎవరు ఎక్కించారో కాస్తా కాఫీ తాగి చెప్పు!

      Delete
    4. ధన్యులుమీరు. ఎంతవరకు తెలుసుకోవాలో మీరు అంతవరకే తెలుసుకున్నారు.

      మేము మీలా ఐదేళ్ళ FB profile analysis చెయ్యలేని అభాగ్యులం మీరు చెప్పింది చెయ్యలేకపోయాం. రంగుతోనీ, గుర్తులతోనీ శత్రుత్వం పెంచుకున్నది ఒక్క రోహితేనా? యాకూబ్ హత్యమీద (శిక్షకాదండోయ్) అనేక అనుమానాలు అనేకమంది అ-రోజితులుకూడా వ్యక్తం చేశారు. బహుశా మీకు అదికూడా (convenietగా తెలిసుండదు).

      కాషాయం తెలియదుగానీ నాకూ హైందవం మటెత్తిస్తది. తన మనుషులతో పొలిటికల్ గేం ఆడే మతం నాకు మంటెత్తిస్తది. తన మతంవాళ్ళని పశువులకంటే హీనంగా చూసే మతం నాకు మంటెత్తిస్తది. ఇప్పుడు నాకూ కాషాయం నాకూ నచ్చట్లేదు. కాషాయానికో కంటెక్స్టున్నది. ఇప్పుడు కాషాయం హిందూమతానికన్నా RSSనే ఎక్కువ సింబలైజ్ చేస్తది. RSS ఒక KKK లేదా LET కంటే ఉన్నతాదర్శాలున్న సంస్థకాదు (of course మీకీ విషయం ప్రస్తుతానికి తెలీదు).

      Delete
  8. ఎవరికైన నిజం తెలుసుకోవాలని ఆసక్తి వుంటే ....
    https://www.facebook.com/mahender.sevella/videos/839546539504497/

    ReplyDelete
    Replies
    1. ఫస్ బుక్ వీడియో లొ వున్న విషయలని ధ్రువీకరిస్తూ....6 నెలల క్రితం వార్త..
      https://www.youtube.com/watch?v=Y98hjKVw06I
      మీరు అనుకునే అమాయకపు రొహిత్ యాకుబ్ వురిని నిరసిస్తూ....
      https://pbs.twimg.com/media/CZEvVMdVAAAYM9H.jpg:large
      రోహిత్ ఆత్మ హత్య చేసుకోలేదు . శవం దగ్గర గద్దలా, ఇప్పటికే చాలా మంది నాయకులు వాలేశారు. కొంతమంది అమాయక అవేశపరులు ప్రస్తుతానికి వాళ్ళకి తెలియకుండానే ఇందులో భాగం ఐపొతున్నరు.
      రమణ గారు మీరుకూడా ఈ కొవలొకే వస్తారు అనుకుంటున్నా! కాదు మీకు కూడా 'అవార్డ్ వాపసీ వాళ్ళకు మల్లే మీ అజెండా వుంటే, మీ పోస్త్ బాగానే పని చేస్తుంది. (I sincerely hope you are NOT that kind. Again, without knowing real danger, you are abetting danger. Being a doctor by study, psychologist by profession and with so much experience, IF you can't see the truth, imagine normal people).

      This is my last post for now.

      Delete
  9. What way Mr.Late Rohit is great or what is a good cause for committed suicide or what ultimate or unbearable punishment he face. He is not Icon of Young India, he is cap goat for these bloody parties & leader hungry stomachs.
    What is his act for national integrity.
    I will never support any caste base unions, whether it is SC / ST / BC / OC. Every caste base unions should ban for sake of nation interest.

    ReplyDelete
    Replies
    1. Dude!

      Get ur English correct first! "cap goat"? I am not worried about your spellings but grammar is venerable bro!

      మీరు కుల సంఘాలను సమర్ధించమన్నారు. సంతోషం! మీ భార్యగారి తండ్రిగారి కులమేమిటి సార్!? అది మీకులంకాదా సార్!?

      మనం మన personal interests విషయంలో ఎంతగానో పట్టించుకొనే కులమతాలు కేవలం దేశం అనే gross scaleలో విమర్శించాలండీ? అంటే మనం double lives జీవించలాండీ?

      Delete
    2. కులమనే ఒక conceptని తన core ideologyగా ఉంచుకున్న హిందూమతాన్ని ban చేస్తే సరిపోదా? ఎక్కడి లండన్? ఎక్కడి ఢిల్లీ? అక్కడ కులవివక్షకు వ్యతిరేకంగా ఒక రూల్ పాసయినా మనకు సిగ్గులేదా? మనం అమెరికా స్థాయికీ, సౌదీ, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్‌ల స్థాయికి దిగజారితేగానీ మనం గర్వించలేమా? SC/ST/BC/OC కులసంఘాలను నిషేధించాలని నినదించారే? అవసలెందుకున్నాయో తెలుసా? కులం ప్రధానంగా నడిచే మతం హిందూమతం. అది మెజారిటీగా చెలామణీ అయ్యేసమాజంలో SC/ST/BCలి సంఘటితం కాకుంటే మైనారిటీలైన (వాళ్ళను పేరుకు కలుపుకోని మైనారిటీలైన) హిందువులు అణగద్రొక్కరా? అదికాదా ఒకప్పుడు జరిగింది? అదికాదా ఇప్పుడు జరుగుతున్నది?

      Delete
  10. 1.అసలు ఈ రోహిత్ దళితుడే కాదు. అతను వడ్డెర కులానికి చెందిన వాడు. ఉద్యోగాలు త్వరగా వస్తాయని దొంగ యస్.సి. సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఇది వాళ్ళ నాన్నే స్వయంగా చెప్పాడు. ఇలాంటి దొంగ యస్.సి. సర్టిఫికెట్ గాళ్ళ వలన నిజమయిన యస్.సి. లకు అన్యాయం జరుగుతుంది.
    2.అసలు ఈ గొడవ మొదలయింది ఎక్కడ? ఈ రోహిత్ యాకూబ్ మెమన్ అనే తీవ్ర వాది ని ఉరితీయటం తప్పని ర్యాలీలు తీశాడు. ఒక యాకూబ్ ని చంపితే వేల మంది యాకూబ్ లు పుడతారు అని నినాదాలు ఇచ్చిన వాడు. అది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని ఫేస్బుక్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళను భౌతిక దాడి చేసి గాయపరిచాడు.
    3. ఇదే రోహిత్ హిందూ మతం మీద అవాకులు చెవాకులు పేలాడు. స్వామి వివేకానంద ను తన నోటికి వచ్చిన మాటలు అన్నారు. అయినా ఎవరూ అతన్ని ఏమీ అనలేదు. అతని మీద ఏ రకమయిన వివక్ష జరగలేదు.
    4. ఒక విద్యార్ధి ని భౌతికంగా గాయపరచటం తో తప్పనిసరి పరిస్తితుల్లో యూనివర్సిటీ అతని మీద చర్యలు తీసుకుంది. అది కూడా చాలా మామూలు శిక్ష. ఇక ఆ మాత్రం చర్యలు కూడా తీసుకోకపోతే విద్యాలయాలు నడవడమే కష్టం.
    5.మన మీడియా కి ఈ డేశాన్ని కులాల పరంగా విడగొట్టడం సరదా. హిందువులు అంటే ద్వేషం. దళితులను హిందూ మతానికి దూరం చేసి క్రిష్టియన్లుగా మార్చాలని దాని ప్రయత్నం. అందుకే అతను దళితుడు కాదని తెలిసినా కావాలని "దలిత్ స్కాలర్" అని తెగ ఊదరగొట్టాయి మన మీడియా వర్గాలు.

    ReplyDelete
    Replies
    1. అవునవును "హింసయిజం"లో అవసరాన్నిబట్టి ఒక వ్యక్తికుఒలం అతని తండ్రిదీ, అవసరలేమిబట్టి తల్లిదీ అవుతుందిలెండి. మనం చరిత్రలో చూడలేదా ఇలాంటివి?

      అవసరాన్నిబట్టే, ఓట్లురాల్చే ఒరవడినిబట్టి, సమాజమనే క్షుద్రదేవని శంతిపరచడానికని మనుషులని బలిచ్చే న్యాయదేవత నెలకొన్న సమాజంలో ఎవడుదోధో, ఎవడుకాదో ఎలా చెబుతామండీ? ధనుంజయ్ ఛటర్జీ ఏం నేరం చేశాడు? అరుణా శాన్‌భాగ్ ఏ నేరానికి అంతటి torture అనుభవించింది? ఏరోం శర్మిల కోరికలో అంత కానిదేమున్నది? మీరు మన చట్తం న్యాయం నిష్పాక్షికంగా పనిచేస్తున్నాయని ఎలా నమ్మహలుగుతున్నారు? ఇంతకీ సల్మాన్ దోషేనా? క్షమించాలి మోదీపాలనలో చట్టం ఐదుపాదాలమీద నదుస్తుంది కదూ!!

      స్వామి వివేకానంద ideologically irrelevant. ఈ అభిప్రాయం నాదేకాదు ఘనతవహించిన మన RSS గుంపుదికూడా. అందుకే వాళ్ళు ఆయన సిధ్ధాంతాలను ఎన్నడో exploit చేసి, వండివార్చి, తమకనుగుణంగా మార్చేసుకున్నారు. మీరెప్పుడైనా దానికి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్యపెట్టారూ? మహా నగరాల్లో "వివేకానంద వైన్స్" అన్న పేరుతో షాపులే ఉన్నాయి. ఏం వ్యతిరేకత వ్యక్తంచేశారుసార్ మీరు? వివేవేకానంద in our times is just a fashion statement. మీరు ఎందుకు చొక్కాలు చించుకుంటున్నారు?

      వీసీకి పెదరాయ్డుగారికున్న "సామాన్య" అదికారం ఉంకుంటుంది నాకు తెలియదు లెంపలేసుకుంటున్నాను.

      మనుషుల్ని కులాల పరంగా విడగొట్టడం హిందూమతానికున్న సరదా. ఇప్పటికీ అంటరానితనం పల్లెల్లో పదిలంగా ఉంది తెలుసా? ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లోకి దళితులకి ప్రవేశంలేదు తెలుసా? పత్రికలు కేవలం దాన్ని ఎత్తి చూపుతున్నాయ్! మాస్టారూ... మరీ అంత ignorance కూడదండీ. Too much of ignorance is not a bliss but a bane/blindness/prejudice.

      Delete
  11. Attempt of Suicide itself a crime, Suicide is itself a escapism.
    Some media and parasite organizations / parties are wishfully glorifying Mr.V.Rohit suicide as per their agenda.

    One Farmer or a poor citizen may commit suicide, it can be pathetic and the whole society feel shy/sad for that scenario where we are living. Everybody should understand.

    Glorifying the Suicide is started during Telangana Hesitation and always it is not correct certainly.

    ReplyDelete
    Replies
    1. వివేకానందుడిది రామక్రిష్ణ మతంవాళ్ళ పుస్తకాల ప్రకారం స్వఛ్ఛందమరణం (అంటే సూయిసైడే!). మనకు తెలిసిన ఆచార్యులందరూ మీరన్నట్లుగా "కైము" చేసినవాళ్ళే. మన స్వాతంత్ర్యపోరాటవీరులైన వారిలో చాలామంది చావుకు తెగించి (అంటే చావును avoid చెయ్యగలిగీ) పోరాటంలోకి దిగిన పిరికివారేమరి.

      ధూ..! పిరికితనమటే పరిస్థితులకు లొంగి బ్రతికే లంజతనం. పిరికితనం. చేతగానితనం.

      You either lack the knowledge your own history in entirety or too dumb even to be aware of your dumbness. Only one of them could be true. You are a shame to your own existence and I was immensely angered at your disrespecting comment. You must be either lack of a goal/rich to have pondered upon this life with a 'chalta hein' attitude.

      Delete
    2. మీరన్న మాటలు క్షమించరానివండీ. కొందరు ఒక లక్ష్యంతో బ్రతుకుతారు. దాని సాధించడంకోసం లేదా అది సాధించడం అసాధ్యమని convince అయ్యాక లేదా అది సాధించేశామనుకున్నాక అభావంగా దేహాన్ని వీదుతారు. మీరు చేసిన వ్యాఖ్యలో నాకు రాక్షసత్వం, జీవితమంటే ఒక passionని కనీసం ఎరిగికూడా ఉండకపోవడం మరియు ఒక లక్ష్యలేమి తప్ప మరేమీ కనబడ్డంలేదు.

      ఘాన్సీ లక్ష్మీబాయికి తెలీదండీ యుధ్దానికెళితే తిరిగిరానని? శ్రీరాములుకు తెలీదాండీ 'ఆమరణ నిరాహారదీక్షంటే?', అల్లూరి తన విల్లుతోటి మొత్తం ఇంగ్లండునూ జయిస్తానని కలలుగన్నాడూ? టంగుటూరి ప్రకాశం పంతులుకి తెలీదూ వాడి ట్రిగ్గర్ నొక్కితే ఛస్తాడని? ఈ మధ్యే చనిపోయారు రంగనాద్! ఒక అనిర్వచనీయమైన బాధని మనం పిరికితనంగా మాత్రమే అర్ధం చేసుకోగలిగితే, అందుకు మీమీద తీవ్రమైన అసహ్యం తప్ప నాకు ఇంకేదీ కలగడంలేదు. మీ బంధువుల్లో, స్నేహితుల్లో నేను లేనందుకు నేను గర్విస్తున్నాను.

      Delete
  12. హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీమ్ !
    తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః !

    అంటే ఏమిటండీ! చచ్చినా బ్రతికినా నీమంచికే అనిచెప్పే suicide callకాదా? ఒక మనిషి తన ఆశలన్నీ ఆవిరై బలవన్మరణానికొడిగడితే దాన్ని మీరు ఎలా చిన్నబుచ్చగలుగుతున్నారు? రాజీపడి బ్రతికుండడమే ఒక గొప్ప achievement నా మీదృష్టిలో?

    ReplyDelete

  13. bhagavad geeta nu eevidhanga artham chesukonnava??
    chaavuki theginchi yuddam cheyadam, suicide okkatena?
    orni nee thelivi thellarinatte undi.

    BE COOL ... DO NOT MISGUIDE OTHERS BY QUOTING THE BHAGAVATGEETA, BIBLE, QURAN.

    YOU DON'T WORRY ABOUT MY KNOWLEDGE AND MY MENTAL CONDITION.

    YOU ARE IN INTOLERANCE STAGE ABOUT THIS ISSUE.
    IF YOU JUSTIFY THIS SUICIDE IS FOR GOOD CAUSE, AS YOU WISH. I CAN'T HELP.

    I AM NOT IN THAT STAGE TO DISGUST /AVERSION / GRUMBLING SOME UNKNOWN PERSON WHO IS ARGUE / DIFFER THE ISSUE.

    why mr.udaykiran commit suicide, why mr.ranganath commit suicide... i don't understand... there is no meaning in that & there no good message in that.
    AT THE SAME TIME MR.V.ROHITH SUICIDE ALSO NO MEANING AT ALL.


    ReplyDelete
    Replies
    1. 1) You still need to improve your English a lot.
      2) I do understand you perfectly. You could think only from the perspective of your cast. You could even denigrate a death to glorify your cast/religion/nation. Apparently, you are not just making sense but producing it :-)

      Delete
    2. I strongly believe that no sane person could take "BHAGAVATGEETA, BIBLE, QURAN" for guidance. So there is no question misguiding people :-)

      I don't even think that there are people who take those archaic books seriously and try to follow them literally in their daily lives - this is the Earth after all, not the Hell! (not yet at least).

      Delete
  14. రమణ గారు,
    నేను మధ్యె వాదిని అంటూ మీరు రాసిన చదవటానికి బాగానే వుంది. కాని మీకు తెలియకుండా (అని నేను అనుకుంటున్నాను!) మన దేశం మీద మీద విషాన్ని కక్కుతున్నారు .
    చర్చ్ మీద దాడులు , ఇంటొలెరెన్సె అంటూ అవర్ద్ వాపస్లు, లాగె, ఇప్పుడు రోహిత్ విషయం జరుగుతుంది.
    నాకు తెలిసి మీరు, "చర్చ్ మీద దాడులు" అన్నీ అభద్దం అని తేలిన తరువాత గాని, అలగే, మాల్డ లొ జరిగిన అల్లర్ల గురుంచి గాని, అలాగే, పునే లొ ఒకతన్ని , సాంతి స్వరూపులైన ముగ్గురు వ్యక్తులు తగల పెట్టిన దాని గురుంచి గాని ఎమీ రాసి నట్లు లేరు. పర్లేదు లెంది, అవి మీ అజెండా లోకి రావు. సరె!!

    మీరు ఓపిగ్గా వుండండి, రోహిత్ ను ఎవరు చంపారు, అన్న విషయం బయట పడుతుంది.
    నా అభ్యర్దన ఎమిటంటే, అప్పుడు దయచేసి , ఈ మధ్యే వాదం వదిలి, బయట పడిన నిజాలతో కూడా ఒక బ్లాగు రాయండి. "అమ్మొ అలా రాస్తే ఇంకేమైన వుందా! కేరళలొ ఆ ప్రొఫెసెర్ చెయ్యి నరికి నట్లు నా చెయ్యి నరికెయ్యరు, అలాగె తస్లీమ మీద దాడి చెసినట్లు .." అని అనుకోవద్దు. మిమల్ని ఎవరూ ఎమీ చెయరులెండి !! ఎంతైన మీరు సమర్ధిస్తున్నది చాల శాంత స్వభావుల్ని, మంచి వాళ్ళని, గొప్ప దేశ భక్తుల్ని కదా. అలా ఎం జరగదు.
    కాని నిజం తెలిసిన తరువాత కూడ ఒక బ్లాగు రాయటం మర్చిపోకండి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.