"మేం అమెరికా తెలుగువాళ్ళం, అక్కడ తెలుగువాళ్ళకి సేవ చేస్తున్నాం." ఈ మాట మనకి తరచూ వినిపిస్తుంటుంది. ఈ మాటల రాయుళ్ళు సూటూబూటూ వేసుకుని హడావుడిగా ఆంధ్రదేశంలో తిరుగుతుంటారు. వీరికి అమెరికాలో ఏవో తెలుగు సంఘాలున్నాయిట. వాస్తవానికి వీళ్ళు తెలుగు రాజకీయ పార్టీలకి సేవకులనీ, తమ సొంత ప్రయోజనాల కోసం తిరుగుతుంటారనీ కిట్టనివారు అంటారు. మనకైతే వాస్తవం తెలీదు. ఈ అమెరికా సూటుబాబుల (ఇకనుండి అసూబా) సేవాతత్పరతకు అభినందిస్తున్నాను. కొన్ని వేలమైళ్ళ దూరానున్నా, తమ తెలుగుజాతికి వీరు చేస్తున్న సేవకి ముగ్ధుడనవుతున్నాను.
మన ఎండల్లో, ఉక్కపోతలో వారు సూట్లేసుకుని చెమటలు కక్కుకుంటూ, కంఠ లంగోటీ (tie) సరిచేసుకుంటూ, మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని గూర్చి ఉపన్యసిస్తుంటే నాకు ఒళ్ళు పులకిస్తుంది. ఆనందభాష్పాలు రాల్తాయి. సూటుపోతకి కారుతున్న వారి చెమట ధారల్ని చూస్తే నాకు దుఃఖం వస్తుంది. ఇంత గొప్ప సమాజసేవకులకి కూడా చెమటలు కార్పిస్తున్న మన దుష్టవాతావరణానికి సిగ్గుతో తల దించుకుంటుంటాను.
ఎదుటివాడు జడుసుకుంటాడని బట్టలేసుకుంటాం గానీ, అసలు మన వాతావరణానికి యోగివేమన డ్రెస్సే కరక్ట్. అందరికీ ఈ సౌలభ్యం ఉండదు. అసూబాలు వారి అమెరికా సంస్థల ప్రతినిధులుగా కొంత 'డ్రెస్ కోడ్' పాటించాలేమో, అందుకే ఉన్నిసూట్లు వేసుకుంటారు. అంచేత ఎండకీ, ఉక్కకీ మలమలా మాడిపోతుంటారు. ఈ వేషభాషలనే 'ఆహార్యం' (ఆహారం కాదు) అంటారని ఎవరో అనంగా విన్నాను.
కొందరు నా క్లాస్మేట్లు అమెరికాలో స్థిరపడ్డారు. ఎవరైనా మన్దేశం వచ్చినప్పుడు గెట్ టుగెదర్లు యేర్పాటవుతుంటాయి. ఒకసారి ఒక అమెరికావాసి ఒక పార్టీలో కోటేసుకొచ్చి అసూబాగా తన ఆహార్యం ప్రదర్శించాడు. మన భారతీయులకి సున్నితత్వం ఉండదు. బొత్తిగా అసూయపరులు. ఆరోజు పార్టీలో మా అసూబా అనేక విధములుగా హింసింపబడ్డాడు. అమెరికాకి వెళ్ళి ఒక మంచి సూటుగుడ్డ కొనుక్కున్నందుకు అభినందించాం. సూట్లో అచ్చు దొరబాబులా ఉన్నావని పొగిడాం. కోటేసుకున్నావు కాబటి నువ్వు కోటేస్సర్రావ్వి అంటూ ముద్దుగా పిలుచుకున్నాం. కొద్దిసేపటికి రెండుచేతులూ జోడించి, నమస్కరించి కోటు విప్పి అవతల పడేశాడు.
ఈ వేషభాషల గోల పురాణ పురుషులకేం ఖర్మ, వృత్తుల్లో కూడా చాలా ముఖ్యం. వాస్తురత్న, వాస్తుబ్రహ్మలకి ఋషీశ్వరుల వలే పొడుగు జుట్టు, పెద్ద బొట్టు, మెళ్ళో రుద్రాక్షలే ఆహార్యం. ఈ అవతారం లేకుండా ఈశాన్యమ్మూల బరువుందనీ, ఆగ్నేయం లోతుందనీ వారు చెప్పలేరు. చెప్పినా ఎవడూ పట్టించుకోడు. మెళ్ళో స్టెతస్కోపు, మందపాటి కళ్ళద్దాలు లేకపోతే డాక్టరుగారి డిగ్రీ మీద అనుమానం రావచ్చు.
రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి తెల్ల టాటా సుమోలే ఆహార్యం. ఆమధ్యన టాటా కంపెనీవాళ్ళు సుమోల ప్రొడక్షన్ ఆపేద్దామనుకున్నారు. కానీ - "ఒరే టాటా, దొంగ నా బేటా! నువ్వు సుమోలని ఆపావో.. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా" అంటూ ఒక ఫ్యాక్షనిస్టు తొడగొట్టి మరీ రతన్ టాటాని బెదిరించాట్ట. తన సుమోలకి ఇంత చరిత్ర ఉందని తెలుసుకున్న రతన్ టాటా, ఫ్యాక్షనిస్టు పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు, ఒక సాటి పారిశ్రామికవేత్తగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాట్ట.
నాకు తెలిసిన పోలీసాఫీసర్ ఒకాయన రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ని ఎంతో శ్రమకోర్చి నడుపుతుండేవాడు. చూసిచూసి ఒకరోజు ఉండబట్టలేక ఎందుకా దున్నపోతుని వెంటేసుకు తిరడగమంటూ అడిగేశా. అతను పెద్దగా నవ్వి "భలేవాడివే! బుల్లెట్ నడపకపోతే నేరస్తుల గుండెల్లో నిద్ర పోయేదెట్లా? చట్టం, న్యాయం, ధర్మం అనే మూడుసింహాలని కాపాడేదెట్లా?" అన్నాడు. అదీ నిజమే!
నాకు తెలిసిన పోలీసాఫీసర్ ఒకాయన రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ని ఎంతో శ్రమకోర్చి నడుపుతుండేవాడు. చూసిచూసి ఒకరోజు ఉండబట్టలేక ఎందుకా దున్నపోతుని వెంటేసుకు తిరడగమంటూ అడిగేశా. అతను పెద్దగా నవ్వి "భలేవాడివే! బుల్లెట్ నడపకపోతే నేరస్తుల గుండెల్లో నిద్ర పోయేదెట్లా? చట్టం, న్యాయం, ధర్మం అనే మూడుసింహాలని కాపాడేదెట్లా?" అన్నాడు. అదీ నిజమే!
తరచి చూడగా - ఇంతమంది ఇన్నితిప్పలు పడుతూ తమ వేషాలు మోస్తూ ఉండటం మనకీ, వాళ్ళకీ కూడా అవసరమేననిపిస్తుంది. వేషాలు మనకి సౌకర్యంగా ఉండటం కోసం కాదు, కానేకాదు. ఎదుటివాడికి మన స్థాయీ, అంతస్తు తెలియజెయ్యటానికి మాత్రమే! ఇది దేవుళ్ళకే తప్పలేదు. పాపం, మన అసూబాలెంత!
(photos courtesy : Google)
మంచి రాత! నీకొక విషయం చెప్పనా! అక్కడ అసుబా లే ఇక్కడ ఎక్కువగా పంచె బాసులు ఆ ఆ పండగలప్పుడు చలి కాలంలో కూడా!!! మరి దీనికర్ధమేమి తిరుమలేశా? ఓ, ఆహార్యమేనందువా?
ReplyDeleteగౌతం
gud 1
ReplyDeleteఅక్కడ అసుబా లే ఇక్కడ ఎక్కువగా పంచె బాసులు ఆ ఆ పండగలప్పుడు. మరి దీనికర్ధమేమి తిరుమలేశా?
ReplyDelete------------------
ఎదుటివాడికి మన స్థాయీ, అంతస్తు తెలియజెయ్యటానికి
ఆమధ్య ఒక ఎన్నారై తన కొడుక్కి ముచ్చటగా పెళ్ళిచేసాడు, మనూళ్ళోనే. ఆకల్యాణ మహోత్సవంలో జంట్సులందరూ సూటులు ధరించగా పంచె కట్టిన పెద్దమనుషులిద్దరు: ఆయొక్క ఎన్నారై, ఆయన కొడుకు!
ReplyDeleteగతితప్పిన మతిలేని వాదం, జంతికలు లేని సంకురేతిరి అన్నా నాకు మా చెడ్డ ఇష్టం.
ReplyDeleteకానీ పొరపాటున ఒక వీరుడు ఇటు వచ్చి ఈ టపా చూస్తే మాత్రం,
మిమ్మల్ని ఆ పరిశుద్ధాత్మ ప్రభువే కాపాడాలి..
అసూబాలు...వాహ్! ఒక కొత్త పదం, వాళ్ళ తాట తీసారు. టాటా,బేటా...భలే సరదాగా రాసారు. పైన కామెంటినట్టు అక్కడ సూట్లు, ఇక్కడ పంచెలు...పాపం, వీళ్ళ పీత కష్టాలు పీతలకే తెలియాలి.
ReplyDeleteకాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేకపోతే ఆయన్ని శివుడు కూడా గుర్తు పట్టలేడు.....
ReplyDeleteఈ అవతారం లేకుండా ఈశాన్యమ్మూల బరువుందనీ.. ఆగ్నేయం లోతుందనీ వారు చెప్పలేరు. చెప్పినా ఎవడూ పట్టించుకోడు. ఫుల్ సూటు లేకుండా ప్రతాప్.సి.రెడ్డి తన అపోలో ఆస్పత్రిలోకి వాచ్ మెన్ని దాటి లోపలకెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా.. వెళ్ళనిచ్చిన వాచ్ మెన్ని ఆ తర్వాత ఆయన సస్పెండ్ చేయ్యొచ్చు. .....
అబ్బ, భలే నవ్విస్తున్నాయి మీ రాతలు!
ఏమైనా ఇహపైన మా ఆయన్ని టై కట్టుకోనిచ్చేది లేదు_______మీ అనువాదం చదివాక!
'పని లేక' అలా ముఖపుస్తకము తిరగేస్తూ మా 'శ్రీ' పంచుకున్న మీ బ్లాగు లంకె పట్టుకుని ఇక్కడికి వచ్చా!
ReplyDeleteమీ పద ప్రయోగాలు ఒక్క మాటలో చెప్పాలంటే "అద్భుతః"!
@ గౌతం.. ఇక్కడి అసూబాలు అక్కడ పంచబాసులా!
ReplyDeleteఎందుకంటావ్?
నాకో పాట గుర్తొస్తుంది.
నలుగురుకి నచ్చినదీ.. నాకసలే నచ్చదురా..
నిండు చందురుడు ఒక వైపూ చుక్కలు ఒకవైపూ..
@sunnygaadu గారు, Rao S Lakkaraju గారు, అజ్ఞాత, తార గారు..
ReplyDeleteకామెంటినందుకు ధన్యవాదాలు.
@శ్రీగారు, NagPingiliగారు..
ReplyDeleteనేను రాస్తున్నవి మా స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలు.
మా ప్రయాణం స్కూల్లో మొదలై కాలేజీ దాకా సాగింది.
మెజారిటీ అసరా(USA)లో స్థిరపడ్డారు (కానీ.. అసూబాలు కాదు.)
మా కబుర్లు మీక్కూడా నచ్చినందుకు ధన్యవాదాలు.
@సుజాతగారు..
ReplyDeleteనా రాతలు మీకు నచ్చుతున్నందుకు కృతజ్ఞతలు.
నేను రాసిన 'టై' అనువాదం శంకరనారాయణ ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు లోనిది.
ఈ పదం మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా పాపులర్.
ఈ పదాన్ని ఇష్టంగా గుర్తు చేసుకుంటూ.. టై కట్టుకొంటారు.
మీ వారిని కూడా టై కట్టుకోనివ్వండి.. ప్లీజ్!
కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేకపోతే ఆయన్ని శివుడు కూడా గుర్తు పట్టలేడు.
ReplyDeleteనీ కధ బాగు.
ఏమైనా ఇహపైన మా ఆయన్ని టై కట్టుకోనిచ్చేది లేదు
దాని పై వచ్చిన కామెంట్లు బాగు బాగు.
- పుచ్చా
రమణ గారూ కమ్యునిస్టు మెనిపెస్టొ లొ అలా లేదు మీరు చెప్పింది అబద్దం గడ్డం ప్రస్తవన లేదు.
ReplyDeleteఅవును, నేను అబద్దమే రాశాను. సరదాగా తీసుకోండి.
Delete