Thursday, 15 December 2011

మద్యపానం = ఆసనాలు

లింగమూర్తి నా చిన్ననాటి స్నేహితుడు. హైదరాబాదులో ఉద్యోగం . ఈమధ్య తాగుడు ఎక్కువ చేశాట్ట. రోడ్ల మీద ఎక్కడబడితే అక్కడ పడిపోతున్నాట్ట.

'నీ మాట వింటాడేమో, ఒకసారి చెప్పి చూడు." అన్న మరో చిన్ననాటి స్నేహితుడి సలహాపై మా లింగమూర్తికి ఫోన్ చేశాను.

"ఏమిరా లింగం! బుద్ధుందా లేదా? తాగి ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నావట." విసుక్కున్నాను.

"తాగటం నిజం. ఒళ్ళు గుల్ల అన్నది మాత్రం అబద్దం." మత్తుగా అన్నాడు లింగమూర్తి.


"ఆహా! అయితే తాగి ఒళ్ళు బాగుచేసుకుంటున్నావా?" వెటకారంగా అన్నాను.

"కరెక్ట్! నేనేమీ తాగుబోతునయ్యి తాగట్లేదు. ఆరోగ్యసూత్రాలు పాటించటానికే తాగుతున్నాను." ముద్దగా అన్నాడు లింగమూర్తి.

"నీకు  మందెక్కువైంది. తరవాత మాట్లాడతాలే." అన్నాను.

"నాకు మందెక్కువ అవడం కాదు, నీకు బుర్ర తక్కువైంది. ఒక మెయిల్ పంపిస్తున్నా, చూసి నువ్వూ జ్ఞానాన్ని సంపాదించుకో." అంటూ పెద్దగా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు లింగమూర్తి.

కొద్దిసేపటికి లింగమూర్తి నుండి ఒక మెయిల్ వచ్చింది.
---------------------------------------------------------

మద్యపానం ఆరోగ్యానికి చాలా మంచిది. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలే మద్యపానం వల్లకూడా కలుగుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

శవాసనం  
శరీరం  పూర్తిగా  రిలాక్స్  అవుతుంది.



బలాసనం 
మానసిక ప్రశాంతత  కలిగించే  ఆసనం!



సేతుబంధ  సర్వాంగాసనం 
మెదడుకి  రక్తప్రసరణ  పెంచుతుంది!



మర్జయాసనం 
వీపు, నడుమునకి   బలాన్నిస్తుంది!



హలాసనం 
వెన్ను నొప్పికీ, నిద్ర లేమికీ  ఎంతో  మంచి  ఆసనం!




డాల్ఫినాసనసం 
కాళ్ళకీ, చేతులకీ, బుజాలకీ  మంచిది!




శలంభాసనం 
వీపు, కాళ్ళు, చేతులకీ  మంచిది!




ఆనందబలాసనం 
నడుముకి  మంచిది!




మలాసనం 
వీపు, మోకాళ్ళకి  మంచిది!




కావున మిత్రులారా! పొద్దున్నే లేచి ఆసనాలు, గీసనాలు అంటూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా, ఆనందంగా పీకల్దాకా మందు కొట్టేసి అంతే ప్రయోజనాన్ని పొందండి!

14 comments:

  1. ఎంత సరదా కోసమైనా మరీ ఇంతగానా! బొమ్మలు మాత్రం బాగున్నాయ్. నాకయితే ఆసనాలు వేసేవాళ్ళని ఎగతాళి చేస్తున్నట్లనిపిస్తుంది. సర్లేండి. మీ ఇష్టం.

    ReplyDelete
  2. హహహ నాకు కూడా వచ్చింది ఈ FWD...బాగా నవ్వుకున్నా! :)

    ReplyDelete
  3. డాట్రుగారే ష్వయంగా షెప్పిన తర్వాత మేం తూ.చ. తప్పకుండా పాటించకుండా ఎలాఉంటాం షెప్పండి.. అలాగే పాటించేష్తాం :-)))

    ReplyDelete
  4. LOOOL వేణుగారు. ఇప్పటి మీ ఈ వ్యాఖ్య, అల్లెప్పుడో పప్పుగారికి బజ్ లో చెప్పిన వ్యాఖ్య తలచుకొని మరీ ROFLing తున్నా :)))))))

    @రమణగారు: ఐతే బిగిన్నర్స్‌కు ఇక్కడ చూపించిన ఏ ఆసనాలు ఉత్తమం అంటారూ ?

    ReplyDelete
  5. కామెంట్లు రాసిన మితృలందరికీ ధన్యవాదాలు.

    మొన్న బాలగోపాల్ 'శంకరాభరణం' రివ్యూ పోస్ట్ కి నా బ్లాగ్ వేడెక్కింది.

    బ్లాగ్ చల్లబరచే కార్యక్రమంగా ఈ బొమ్మలు పెట్టాను.

    మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  6. డాక్టరు గారు,
    నాదొక ఆలోచన. మీ దగ్గరకు మానసిక రోగులు వచ్చినప్పుడు (ఎక్కువగ) నిద్ర మాత్రలు ఇస్తారుగద. ఈ నిద్ర మాత్రలవలన, మధ్యం వలన శరీరంలోని భాగల పయిన ఏమయినా ప్రభావం ఊంటుందా. నాకు తెలిసి పై రెండిట్ల వలన మనిషి నిద్రలో ఒంటిమీద గుడ్డలు ఊడేంతగా స్పృహ కోల్పోతాడు. "ఆసనాలవలన" లాభం ఉంది, నష్ఠం మాత్రం లేదు. బంగళా లోని కరెంటు దీపాలకన్న గుడిశ లోని నూనె దీపాలవలన డబ్బు ఎలా ఆదా చేసుకొని లాభం పొందుతున్నామని (తప్పనిసరై, వేరే దారిలేక) అనుకుంటారో అలాగే మీ(స్నేహితుడి) అలొచన కూడా. మంచిది మనకిష్టం లేకపోయినా, చెడు మాత్రం ఇతరలకు చెప్పకుండా ఉండటం, అదీ ఇలాంటి "ఆరోగ్య" సంభందినవి సరి కాదని నా ఆలోచన. మనిషి "చెడు, చెప్పుడు" మాటలకు త్వరగా ప్రభావితమవుతాడు.

    ReplyDelete
  7. అజ్ఞాత..
    నేను నా 'మిత్రుడి' మెయిల్ మీరు ఎంజాయ్ చేస్తారని పబ్లిష్ చేశాను.
    లైట్ గా తీస్కోండి.
    మన బ్లాగర్లు ఏదో కాలక్షేపంగా, సరదాగా రాస్తున్నారు. చూస్తున్నారు.
    నా మెయిల్ చూసి తాగుడు మొదలెట్టేంత అమాయకులు ఉన్నారంటారా!

    ReplyDelete
  8. అదేమిటో తెలీదు గానీండీ, ఈ డాక్టరు గారు, లైట్ గా చెబ్తే జనాలు సీరియస్ గా తీసుకుంటారు! సీరియస్ గా చెబ్తే లైట్ గా తీసుకుంటారు ! దీన్ని మీరెమైనా విశ్లెషించారా ఎప్పుడైనా యారమణ గారూ?

    ReplyDelete
  9. Zilebi గారు..
    అదేమిటో అనాదిగా సైకియాట్రిస్టుల పట్ల అందరిదీ ఇదే వైఖరి!

    నాకు అలవాటయిపోయింది లేండి.

    మీరు మాత్రం నా వైపు ఉన్నందుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  10. హహహ జిలేబి గారు బాగా చెప్పారు :-)

    ఐనా నాకు ఈ టపాలో బొమ్మలు చూస్తే "తాగితే మీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది తాగకండి బాబులూ..." అని చెప్పినట్లు అనిపించిందే కానీ యోగాసనాలను కించపరిచినట్లు అనిపించలేదు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.