అమ్మయ్య! ఎట్లాగయితేనేం - సెక్యూరిటీ కన్నుగప్పి, ఆ స్టార్ హోటల్లోకి దూరాను. చల్లగా ఏసీ, మెత్తగా తివాచీలు, నున్నగా తెల్లటి గోడలు.. స్వర్గంలా వుంది. లాబీలో వెళ్తున్నవాళ్ళు నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లిలా ఓ గదిలోకి జారుకున్నాను. ఇంతలో ఎవరో గదిలోకి వస్తున్న అలికిడి. ఒక్క గెంతున కర్టన్ల చాటుకి దాక్కున్నాను.
గదిలోకి వచ్చిన వ్యక్తిని చూసి నమ్మలేకపొయ్యాను. ఆయన మామూలు మనిషి కాదు - సినిమా యాక్టర్ చిరంజీవి! నాదెంత అదృష్టం! లక్షలమంది 'అన్నయ్యా' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ దేవుళ్ళా ఆరాధించే వ్యక్తి బస చేసిన గదిలోకి దూరగలిగాను. రూమ్ బాయ్ కాఫీ తెచ్చాడు. చిరంజీవి కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అవును మరి! తెలుగు ప్రజల ఉన్నతికై అనుక్షణం పరితపించే వ్యక్తి అలాగే ఆలోచిస్తాడు.
కర్టన్ చాటునుండి బయటకొచ్చి చిరంజీవి ఎదురుగా నిలబడ్డాను. నన్ను చూడంగాన్లే ఆశ్చర్యపోయాడు చిరంజీవి. ఆశ్చర్యపోడా మరి! మాసిన తల, పెరిగిన గడ్డం, ముడతలు పడ్డ నల్లటి చర్మం, ఎండిన డొక్కలు, తొర్రిపళ్ళు, రంగు వెలిసిన మొలత్రాడు, మురికిపట్టిన చిల్లుల గోచీ, కుంటి నడక, కుడిచేతిలో సొట్టలు పడ్డ సత్తు బొచ్చె, బొచ్చెలో రెండు రూపాయి బిళ్ళలు. ఇదీ నా అవతారం. కుక్కల్లో గజ్జికుక్కలు హీనమైనవి. మనుషుల్లో అడుక్కునేవారు హీనులు. అట్టి హీనులు నక్షత్ర్రాల హోటలు రూములోకి ఎలా రాగలరు?
భిక్షాటన నాకు ఎన్నో యేళ్ళుగా అలవాటైన వృత్తి, నిద్రలో లేపినా అడుక్కోగలను. గొంతు సరిచేసుకుని, సత్తుబొచ్చె పైకీకిందకీ ఆడిస్తూ, రూపాయి బిళ్ళల్ని శబ్ధం వచ్చేలా ఎగరేస్తూ "ఆకలేస్తంది దొరా! అన్నం తిని నాల్రోజులయ్యింది బాబయ్యా! దరమం సెయ్యి దొరా!" అంటూ రాగయుక్తంగా ఓండ్ర పెట్టాను.
చిరంజీవి ఒక్కక్షణం నాకేసి చూశాడు. పక్కనే నిలబెట్టి ఉన్న పెద్ద సూట్‌కేసుని గది మధ్యకి లాగాడు. నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. 'అమ్మయ్య! నా దరిద్రం వదిలిపోయింది. ఈ దరమ ప్రభువు ఇచ్చే సొమ్ముతో నా దశ తిరిగిపోద్ది.' అనుకుంటూ వుండగా -
చిరంజీవి సూట్‌కేసు తెరిచాడు, అందులో ఒక బొచ్చె - అచ్చు నా సత్తు బొచ్చెలాంటిదే వుంది. ఆ బొచ్చెని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. "అమ్మా పదవి, అయ్యా పదవి! కేంద్రమంత్రయినా, రాష్ట్రమంత్రయినా ఏదయినా పర్లేదు. పదవి లేక చచ్చిపొయేట్లున్నాను. అమ్మా, అయ్యా.. " అంటూ భోరున విలపించసాగాడు.
బిత్తరపొయ్యాను. కొద్దిసేపటికి యేం జరుగుతుందో అర్ధమైంది. వార్నీ! ఈ చిరంజీవి కూడా నాలాగానే అడుక్కునేవాడా!? నాది వొట్టి దరిద్రం అయితే, ఈయన దరిద్రానికే దరిద్రంలాగా వున్నాడు. ఇంకా అక్కడే వుంటే నా చిల్లుల గోచీగుడ్డ లాక్కుంటాడేమోననే భయంతో, ప్రాణాలు (గోచీగుడ్డ) అరచేతిలో పెట్టుకుని (పట్టుకుని) ఒక్క ఉదుటున బయటికి ఉరికా!
ఇది అన్యాయమండీ...చిరంజీవిని విమర్శించడంద్వారా పబ్లిసిటీ పొందడానికి ప్రయత్నించే రోజాలాంటివారు - ఆయన పదవులకోసం అడుక్కుంటున్నాడని విమర్శిస్తే, దానిని జనరలైజ్ చేసేయడం సరికాదేమోనండి. ప్రభుత్వానికి కీలక సమయంలో మద్దతు ఇచ్చి సాయపడినందుకు PRP deserves cabinet berths. తమపార్టీకి న్యాయంగా రావాల్సిన దానికోసం ఆయన మూడు మంత్రిపదవులు అడిగిన మాట నిజమే. దానిని అడుక్కోవడం అనడం ఎలా సబబవుతుంది?
ReplyDelete"నాది దరిద్రం అయితే.. ఈయనది దరిద్రానికే దరిద్రం."
ReplyDeleteచాలా బాగా చెప్పారు..
:):):)
ReplyDeleteఆ పైని అజ్ఞాత అడుక్కోవడాన్ని సమర్థించడం బాగా వుందండి. ఇందులో న్యాయాన్యాలు కూడా ఆయనకు కనిపిస్తున్నాయంటే నిజంగా న్యాయదేవతకు కళ్ళకే కాదు, ఒళ్ళంతా బేండేజి కట్టేసి డిక్కీలో తొంగోబెట్టేసే అభిమానులున్నారని తెలుస్తోంది.
ReplyDeleteఅయ్యా, ఇది "పని లేక" ప్రొఫైల్ కి తగిన పోస్ట్ లాగా అనిపించటం లేదు.
ReplyDeleteమీ బ్లాగ్, మీ ఇష్టం, కాకపోతే మీ అభిమానులు గా మేము మీ మీద కొంతం ఇమేజ్ ఏర్పరుచుకున్నాము.
దయ చేసి మీరు మీ సాధారణమైన "class writer " ఇమేజ్ ని మైంటైన్ చెయ్యచ్చు. ఇది కొంచం "mass writer " ఇమేజ్ ని మీకు ఆపాదిస్తోందేమో నని మీ అభిమాన సంఘం (ఇప్పుడే... ఈ కామెంట్ రాస్తుండగానే ఏర్పరిచాను :) ) సభ్యుడిగా "ఖండిస్తున్నాను"
ఇదే సంగతి మీ సుబ్బు, తనదైన స్టైల్ లో మీతో సంభాషిస్తే దీనికన్నా బాగుండేది. అప్పుడు, మీరు మీ "సుబ్బు సుభాషితాలని" ఒక సంచిక లాగ ప్రచురించనూ వచ్చు.
ReplyDelete>>"ప్రభుత్వానికి కీలక సమయంలో మద్దతు ఇచ్చి సాయపడినందుకు PRP deserves cabinet berths"
ReplyDeleteThey say they joined Congress. What is special about they supporting the Govt. They did what any of the Cong. MLA's did.
What makes them special ?
అదిరింది గురువుగారూ.ఆయ్యలారా..అమ్మలారా ఈబ్లాగును మా గురువు గారు సరదాగా రాస్తున్నారు అంతేకానీ, ఎవరినీ కించపర్చడానికి కాదు,కావునన్ మీరుకూడా చదివి,సరదాగా పొట్ట చెక్కలు చెసుకోండి.
ReplyDeleteweekend politician ji విలీనానికి ముందే అగ్రిమెంటు జరిగి వుంటుంది కదా. దాని ప్రకారం కాంగ్రెస్ ది నది దాటిన తరువత తెప్ప తగలేయడమే అవుతుంది.
ReplyDeleteits not correct at all..... with out supporting someone we are not supposed to comment on them, do you know that does he didn't have the capacity to rule A.P. did you given chance or did you felt his ruling is not correct..????? (with out knowing the reasons we are not suppose to comment some one)....
ReplyDeleteతెప్పతగలేయడం కాంగ్రెస్ కి అలవాటే అని రాజకీయాలు చూస్తున్న ఎవరైనా కూడా చెప్తాడు. తెలిసి తెలిసి చంకనెక్కించుకున్నాక సపోర్ట్ ఇవ్వక ఏం చేస్తారు. సపోర్ట్ చేయడం పార్టీలో చేరాక బాధ్యత.
ReplyDeleteమహేష్ గారు మీ ప్రశ్నలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి.. దారేపోయేవాళ్ళకంతా పిలచి మమ్మల్ని పరిపాలించండి అని ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలా ?? ప్రజలలో ఆయన పరిపాలించగలడు అన్న నమ్మకం కలిగించలేక పోడం ఆయన లోపం. నాకు అవకాశం ఇవ్వలేదు అని ఏడవడం అసమర్ధత.
Ramana garu cheppina danilo thappu emi ledhu..wat he has said is apt to chiru present situation.
ReplyDeleteప్రజలలో ఆయన పరిపాలించగలడు అన్న నమ్మకం కలిగించలేక పోడం ఆయన లోపం. నాకు అవకాశం ఇవ్వలేదు అని ఏడవడం అసమర్ధత.
ReplyDeleteWell said !!
Kasta over ga raasaru..
ReplyDeleteVery good.
ReplyDeleteఇందులో ఆశ్చర్య మేముముంది. పదవి పిచ్చి ఉన్న ఎవరైనా అంతే! పదవి దొరికే వరకు ముష్టివాడి కన్నా కనాకష్టం! చిరంజీవైన సరే, వాడమ్మ మొగుడైన సరే!
ReplyDeleteగో వె ర
ఆ భిక్షా పాత్ర కి కొంత ఎక్స్ టెన్షన్ !
ReplyDeleteఆ పాత్ర తో వారు మేడం గారి దగ్గరి కెళ్తే, మేడం గారు, సారు గారు, ఇద్దరు స్పెషల్ భిక్షా పాత్ర తో
:మాసిన తల.. పెరిగిన గడ్డం.. ముడతలు పడ్డ నల్లటి చర్మం.. ఎండిన డొక్కలు.. తొర్రి పళ్ళు.. రంగు వెలిసిన మొలత్రాడు.. మురికి పట్టిన చిల్లుల గోచీ.. కుంటి నడక.. కుడి చేతిలో సొట్టలు పడ్డ సత్తు బొచ్చె.. బొచ్చెలో రెండు రూపాయి బిళ్ళలు.. :
గల వోటర్ దగ్గిర 'అమ్మా భిక్షం! అయ్యా భిక్షం వోటెయ్యండి మహా ప్రభో అంటూ అడుక్కోవడం!
భూమి గుండ్రముగా వుండును!
చీర్స్
జిలేబి.
Manifesto లో తెలంగాణా ఇవ్వాలని రాసుకొని సరయిన సమయంలో మాట మార్చిన చిరుకి ఇదే తగిన శాస్తి.
ReplyDeleteనన్ను దూషిస్తూ కొన్ని కామెంట్లు వచ్చాయి. నేను ప్రచురించలేదు.
ReplyDeleteచిరంజీవిని బిక్షకునిగా రాయటం కొందరికి నచ్చినట్లు లేదు.
తన దగ్గర లేని దాన్ని అడగటాన్ని బిక్షాటనగా అనుకుంటే..
ఇప్పుడాపని దేశాలు కూడా చేస్తున్నాయి కదా!
కావున చిరంజీవి అభిమానులు బాధ పడిపోనక్కరలేదు.
ఆయన సామాజికన్యాయం అంటూ అరంగేట్రం చేసి..
అధ:పాతాళానికి దిగజారిపోవటం ఒక విషాదం.
చిరంజీవి రాజకీయాలని గమనిస్తున్న నాకు ఒక బిచ్చ్గగాడు గుర్తుకొచ్చాడంటే..
ఆ తప్పు చిరంజీవిది. నాది కాదు!
ఇట్లాంటి సరదా రాతలని సరదాగానే తీసుకోండి.
నన్ను తిట్టి మీ టైం వృధా చేసుకోరని ఆశిస్తున్నాను.
బిచ్చగాడి పరిస్థితి కొంచం బెటర్ అండి. రెండుసార్లు అడిగి లేదంటే ఇక వాళ్ళ దగ్గర అడుక్కోనవసరం లేదు. వేరే వాళ్ళను అడుక్కోవచ్చు.
ReplyDelete