Wednesday, 11 September 2013

ఈరోజు 'ఆంధ్రజ్యోతి'లో నా వ్యాసం.. ప్రతీక పవిత్రతలు వద్దు


తెలుగుతల్లి, భారతమాత... ఇటువంటి విశేషణాత్మక పదాలు ప్రయోగించడం వల్ల భాషని, ప్రాంతాన్ని గౌరవించుకున్నట్లుగా కొందరు సంతోషించవచ్చును. కానీ ఈ పద ప్రయోగాలు భాషా విన్యాసాలు తప్ప మరేదీకాదు. అసలీ పదజాలంలోనే సంకుచిత రాజకీయాలు దాగున్నాయి. ప్రాంతాల పేరుతో, భాష పేరుతో జరిగే శ్రుతి మించిన రాజకీయ కార్యక్రమాల్ని సామాన్యుడు ప్రశ్నించకుండా చెయ్యటం అనే ఒక ఎత్తుగడ ఇందులో దాగుంది. ఇందుకు శివసేన జపించే 'మరాఠీ మానో' ఒక ఉదాహరణ.

అసలు ఒక ప్రాంతాన్ని, భాష దేవతతో పోల్చడం ఎందుకు? ప్రపంచంలో ఎవరికైనా ఒక దేశం ఉంటుంది. వారికి ఆ దేశంలో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ దేశానికి ఒక రాజ్యాంగం, క్రిమినల్ జస్టిస్ సిస్టం ఉంటాయి. ఆ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరునిగా బ్రతకాలంటే ఆ దేశ రాజ్యాంగ ఆదేశిత సూత్రాల్ని పాటించాలి. ఇందులో ఇతరుల హక్కులకి భంగం కలిగించకుండా ఉండటం చాలా ముఖ్యమైనది. తమ దేశంపై గౌరవం, ప్రేమ కలిగిన వారెవరూ నేరాలకి (రాజకీయ నేరాలు కాదు) పాల్పడి జైలుకి వెళ్ళకూడదు. నేరం, నేరపూరిత మసస్తత్వం ఏ సమాజానికైనా హానికరం. జైళ్ళు నిర్వహింపబడేది ప్రజాధనంతో కాబట్టి, నేరాలు సమాజానికి ఆర్థిక భారం కూడా. ఇక అన్నిదేశాలకీ మునిసిపాలిటీల వంటి లోకల్ బాడీలు ఉంటాయి. ఆయా ప్రజలు వాటి నియమ నిబంధనలని పాటిస్తూ సక్రమంగా పన్నులు కడితే వారు ఉత్తమ పౌరులే. ఏ దేశానికైనా ఒక పౌరుడు ఇంతకన్నా చెయ్యగల ఉపకారం మరొకటి లేదు.

అయితే మనదేశంలో కొందరికి ఇది తృప్తినివ్వదు. కొన్ని మతాల్లో దేవుళ్ళు మనిషి రూపంలో ఉంటారు. వారిని పూజించటం వారికి ఒక పవిత్రకార్యం. అందుకని వీరు దేశాలకి, ప్రాంతాలకి కూడా దేవతా రూపం ఇస్తారు. వాటికి అలంకరణ చేస్తారు. పాటలు రాస్తారు. పూజలు చేస్తారు. ఇదంతా ఒక ఆదర్శ ధర్మంగా ప్రచారం చేస్తారు. పన్నులు ఎగ్గొట్టినా ఫరవాలేదు. కుల మతాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన చేసినా ఫరవాలేదు. గొంతు చించుకుని దేశమాతపై భక్తిగీతం పాడుతూ ఒక భజన కార్యక్రమం నిర్వహిస్తే చాలు. వారు నిఖార్సైన దేశభక్తులు!

భాష అనేది ఒక కమ్యూనికేటివ్ స్కిల్. అన్నిరకాల జంతువులు, పక్షులు ఈ కమ్యూనికేషన్ కోసం మాత్రమే భాషని వాడతాయి. ఏ భాషకైనా ఇంతకన్నా మహత్తర ప్రయోజనం ఏముంటుంది? అయితే కొందరు వ్యక్తులకి భాష కూడా దేవతే! ఆ దేవతని కీర్తిస్తూ పాటలు రాస్తారు. పూజలు చేస్తూ గర్విస్తారు!

అసలే మతపరమైన దేవతలతో సమస్యలున్న ఈ దేశంలో... ఈ భాషా దేవతల వల్ల మరిన్ని సమస్యలు తలెత్తటం మినహా చేకూరే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. స్త్రీకి గల అదనపు పవిత్రత ఏమిటి? నేనిక్కడ సామాజిక అంశాలని ప్రస్తావించట్లేదు. శరీర నిర్మాణశాస్త్ర పరంగా జననేంద్రియాలలో మాత్రమే స్త్రీపురుషులకి తేడా ఉంటుంది. ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడజంతువులు గర్భం దాల్చి పిల్లల్ని కంటాయి. ఇవన్నీ బయలాజికల్ విషయాలు. ఎంత ఇష్టపడ్డా మగవాళ్ళు పిల్లల్ని కనలేరు. కాబట్టి మాతృత్వం అనేది ప్రకృతి పరంగా ఒక సహజమైన ప్రక్రియ. అయితే ఈ మాతృత్వానికి కొందరు పవిత్రత అంటగడతారు. అలాగే స్త్రీలు గర్భాన్ని 'నవమాసాలు' మోయడంలో కూడా పవిత్రత ఏమీ లేదు. కుక్కలు, పిల్లులు రెండు నెలలు మోస్తాయి. ఒక్కో జాతికి ఒక్కో పీరియడ్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తక్కువలైతే ప్రమాదం కూడా. ఒక స్త్రీ తన 'పవిత్రమైన' గర్భాన్ని పదకొండు నెలలు మోసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుదామంటే ప్రకృతి ఊరుకోదు.

కొందరు పిల్లల్ని కని, పాలిచ్చి పెంచే ప్రక్రియని పరమ పవిత్రంగా చూస్తారు. కవిత్వం కూడా రాస్తారు. మంచిది. ఎవరి ఆలోచన వారిది. కానీ వారు ఆ స్త్రీ పవిత్రతకి అక్కడితో చెల్లుచీటి ఇచ్చేస్తారు. వారి సాంప్రదాయ సంస్కృతిలో ఆడవారి తెలివితేటలపై, నిర్ణయాత్మక శక్తిపై గౌరవభావం కలిగి ఉండటం కనబడదు. అంటే ఆడవారి పవిత్రత... గర్భం దాల్చడం, పిల్లల్ని కనటం, పాలివ్వటానికి మాత్రమే పరిమితమై ఉంటుందని అర్థం చేసుకోవాలి.

'తల్లి ప్రేమ' కూడా శాస్త్రీయ విశ్లేషణకి నిలబడదు. పిల్లలపై తండ్రుల కన్నా తల్లులే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారనటానికి శాస్త్రీయ ఆధారం లేదు. పిల్లల్ని బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో తండ్రి పాత్ర తల్లికన్నా తక్కువేమీ కాదు. కేవలం గర్భసంచి లేని కారణాన, పిల్లల్ని కనే అవకాశం లేనందున పురుషుని స్త్రీ కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టడం జెండర్ వివక్ష కిందకి వస్తుంది.

మరప్పుడు ప్రాంతానికీ, భాషకీ 'తల్లి' అవసరం ఎందుకు?

విశాలమైన ఒక దేశానికి 'మాత' అంటూ, భాషకి 'తల్లి' అంటూ దేవతా రూపాలు ఇచ్చి పూజించటం అనేది ఒకరకమైన రాజకీయ భావజాల వ్యాప్తి ప్రచారం కోసం మాత్రమే. అలాగే స్త్రీలకి మాత్రమే అవకాశం ఉన్న గర్భం దాల్చే జీవశాస్త్ర అనివార్యతకి పవిత్రతని ఆపాదించటం కూడా ఒక రకం భావజాలానికి సాంస్కృతిక ముసుగు తొడగటం మించి మరేదీ కాదు.

కావున మనం అర్జంటుగా భారత మాత, తెలుగు తల్లి వంటి ప్రతీక భాష వదిలించుకోవాలి. ఇట్లాంటి విషయాల్ని రాజకీయంగానే చర్చించుకోవాలి... పరిష్కరించుకోవాలి తప్ప, లేని పవిత్రతని ఆపాదించటాన్ని ఖండించాలి. అప్పుడే దేశం, ప్రాంతం, భాష మొదలైన విషయాలని ఎమోషనల్‌గా కాకుండా... విషయ పరిజ్ఞానంతో అవగాహన చేసుకోగలం... ఈ భావజాలంతో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతని ప్రశ్నించగలం.

77 comments:

  1. బావుంది రమణ గారు! విషయం, విశ్లేషణ రెండూ ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి సామాజికాంశాలపై మీరు రెగ్యులర్ గా పత్రికలకు రాస్తూ ఉండండి. ఎక్కువమందికి అవగాహన కల్పించినవారవుతారు.

    నిజానికి, భారత స్వాతంత్ర్య సంగ్రామం మొగ్గతొడుగుతున్న తొలినాళ్లలోనే వివేకానంద, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్లు బ్రిటీష్ దాష్టీకానికి వ్యతిరేకంగా భారతజాతిని మేల్కొలిపి ఆర్గనైజ్ చేసేందుకు గణేష్, కాళీమాతా ఉత్సవాలను ఒక సాధనంగా వాడుకున్నారట. గాంధీజీ సైతం ఈశ్వర్-అల్లా అంటూనే నిరసనకు శ్రీకారం చుట్టారని తెలిసిందే. అయితే, నాటి పరిస్థితుల్లో అవి ఎవరికీ పెద్ద ఇష్యూగా అనిపించే విషయాలు కావు. కానీ, Religion అన్నది కేవలం వ్యక్తిగత విషయమనీ, దానిని కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు మాత్రమే పరిమితం చేయాలని గానీ, భిన్నజాతుల కలయిక అయిన ఇండియాలో మతాన్ని- సామాజిక అంశాలతో ముడిపెట్టరాదనే సెక్యులర్ భావనను ఆనాటి నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం మనం చూస్తూనే ఉన్నాం... క్రమంగా ఈ మతం ఆధారిత అంశాలు, భావనలు (they become privileges, now) మెల్లగా మెజారిటీ ప్రాబల్యం కల్గిన రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయి అది ఒక ఓటుబ్యాంకు రాజకీయాలకు ఉపయోగపడేవిగా తయారయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సెక్యులరిజం అంటే non recognition of any supernatural entity అని ఉంటే; ఒక్క ఇండియాలో మాత్రమే అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనివ్వడమనే తప్పు నిర్వచనం కనిపిస్తుంది. Its strange and peculiar! So, ప్రతీక పవిత్రతా మూలాలు మన స్వాత్రంత్ర్యోద్యమంలోనే ఉన్నాయి. అనంతరం ఈ అరవై ఏళ్లలో సెక్యులరిజాన్ని మరింత ఖూనీ చేసి ప్రతీక పవిత్రతా భావనలు కులాలపరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా చిలువలు పలువలుగా ప్రజల్ని చీల్చుకుంటూ విస్తరించుకుపోయాయి. మునుముందు మనం ఇంకెన్ని పవిత్రతా పిలకలు చూడాల్సి వస్తుందో..?! హే.. రామ్! :)

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      థాంక్యూ.

      ఈ మధ్య ఒకాయన 'తెలుగుతల్లి' అంటూ చచ్చేట్లు గొంతు చించుకుంటూ పాడుతున్నాడు.

      'తెలుగుతండ్రి' ఎందుకు కాకూడదు? మగవాళ్ళు చేసిన పాపం ఏమిటి? అనిపించి.. రాసిన వ్యాసం ఇది.

      Delete
    2. Germany uses the term "das Vaterland" to describe the country as a father. A few other countries also do this.

      Delete
    3. హహ్హాహ్హా..! అవును, మీరు కసి తీరా రాసినట్టు అనిపించింది మీ ఈ వాక్యం చదివినప్పుడు... ‘‘కేవలం గర్భసంచి లేని కారణాన, పిల్లల్ని కనే అవకాశం లేనందున పురుషుని స్త్రీ కన్నా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టడం జెండర్ వివక్ష కిందకి వస్తుంది.’’ ఇంకా నయం, ఈ ఇష్యూ సుబ్బూ బారిన పడలేదు!

      Delete
    4. *భిన్న జాతుల కలయిక అయిన ఇండియాలో *
      మీరు పొరబడుతున్నరు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయం లో ద్విజాతి సిద్దాంతం ఆసరగా చేసుకొని మాది భిన్నజాతి, మేము మీతో కలసి ఉండం అని , ఒక కొత్త దేశం ఏర్పాపాటు చేసుకొని వేరు పడ్డారు. రెండు జాతులలో ఒక జాతి వేరు పడిna తరువాత ఉండేది ఒకే జాతి అని మీరు గ్రహించాలి.

      Delete
    5. SriRam garu,
      మీ కామెంట్ ఇందాకే చూశాను. అవును, మీరన్న ద్విజాతి సిద్ధాంతం ఆవిష్కరణ ఘనత కూడా మనవాళ్లకే దక్కుతుంది. నిజానికి ఒక జాతికి గానీ, ఒక దేశానికి గానీ ‘మతం’ అన్నది బేసిస్ కాదు. ఒకవేళ మతమే బేసిస్ అయ్యుంటే, క్రిస్టియన్లందరూ ఒకే జాతి(దేశం)గా, ముస్లింలందరూ కూడా ఒకే జాతి(దేశం)గా ఉండి ఉండాల్సింది. కానీ ప్రపంచంలో అలా జరగలేదు. అలాగే కేవలం భాష మాత్రమే కూడా జాతికి, దేశానికి ప్రాతిపదిక కాలేదు. అలా అయ్యుంటే కూడా ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లంతా ఒకే జాతిగా, దేశంగా ఉండాల్సింది. అలా స్పానిష్ మాట్లాడే వాళ్లంతా కూడా ఒకే జాతిగా, దేశంగా ఉండాల్సింది. అలా కూడా జరగలేదు. జాతులు, దేశాల పరిణామ క్రమంలో ఆవిర్భవించిన నిర్వచనం ప్రకారం... ఒకే భాష కల్గి, ఒకే సంస్కృతీ సంప్రదాయాలు కలిగి, ఒకే రాజకీయ పరిపాలన కింద ఉంటూ, ఒకే భౌగోళిక ప్రాతంలో నివసించే స్టేబుల్ కమ్యూనిటీని జాతి లేదా దేశం అంటారనేది చారిత్రకంగా ఎమర్జ్ అయిన నిర్వచనం. ఈ బేసిస్ ప్రకారం స్వాతంత్ర్యానికి ముందు మనదగ్గర కన్నడ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, తమిళ, మలయాళీ, ఒడిస్సీ, బిహారీ ఇలా అనేక జాతులు కనిపిస్తాయి. నిజానికి బ్రిటీషర్స్ వాళ్ల మార్కెట్ అవసరాల నిమిత్తం ఈ జాతులన్నింటినీ ఒకే కామన్ అడ్మినిస్ట్రేటివ్ రూఫ్ కిందకు తీసుకువచ్చి ఒకే Nation గా మార్చి ఉండకపోయుంటే, ఇవన్నీ కాలక్రమంలో భిన్న జాతులుగా, భిన్న దేశాలుగా ఆవిర్భవించి ఉండేవే(మో). అయితే, ఈ జాతులన్నీ కలసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో పొలిటికల్ గా ఏకమై స్వాతంత్ర్యం సాధించుకోవడంతో ఆ విధంగా భిన్నజాతుల కలయికగానే మనదేశం ఆవిర్భవించింది. ఇలా భిన్న జాతులు (మల్టీ నేషనాలిటీస్) కల్గిన దేశాలు UK, FRANCE, RUSSIA చాలానే కనిపిస్తాయి. అయితే మతానికి, జాతికి మాత్రం ఎలాంటి సంబంధమూ లేదనే అనిపిస్తుంది. నయా సెక్యులరిజం, నయా (ద్వి)జాతి సిద్ధాంతం పనికట్టుకు కనిపెట్టిన ఆనాటి మన పాలకులు నిజంగానే గొప్పోళ్లు! :)

      Delete
    6. మీరన్న ద్విజాతి సిద్ధాంతం ఆవిష్కరణ ఘనత కూడా మనవాళ్లకే దక్కుతుంది.*


      మన వాళ్లంటె ఎవరండి?
      సెక్యులరిజం కి మీరు చెప్పిన అర్థం చాలా కొత్తగా అనిపించింది. మీరు ఇక్కడ రాసిన విషయలు ఎక్కడ చదివారు?

      Delete
    7. SriRam garu,

      * మనవాళ్లంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి మనందరినీ పరిపాలించిన రాజకీయ నేతలే అని నా ఉద్దేశ్యమండి.

      ** ఇక సెక్యులరిజం అంటారా... చాలాచోట్ల చదివినదేనండి.
      1. Not connected with religious or spiritual matters (Oxford dic)
      2. The belief that religion should not be involved with the ordinary social & political activities of a country (Cambridge dic).
      3. Secularism is the principle of separation of government institutions, and the persons mandated to represent the State, from religious institutions and religious dignitaries. (Wikipedia)
      మామూలుగా ఇంటర్నెట్ లో ఎక్కడ సెర్చ్ చేసినా దాదాపు ఇలాంటి అర్థం వచ్చే లింక్సే వస్తాయి. ఒక్క మనదేశంలో మాత్రమే Equal priority to all religions అని వింటాం. చదువుకుంటాం. ఇక నేను Religion & Spiritual matters కు బదులు అదే అర్థమిచ్చే Supernatural Entity అని రాశాను. అంతేనండి.

      *** ఇక జాతి లేదా దేశం (Nation/Nationality) గురించి కూడా అన్నిచోట్లా చదివినవే.
      1. a large body of people united by common descent, history, culture, or language, inhabiting a particular state or territory:
      పై డెఫినేషనే కామన్ గా ఎక్కడ చదివినా కనిపిస్తుంది. ఇందులో Religion అన్న పదం ఎక్కడా కనిపించదు. అలాగే లాంగ్వేజ్ తో పాటుగా మిగతా కామన్ ఫీచర్స్ కూడా కొన్ని కచ్చితంగా కనిపిస్తాయి. అదే నేను రాశాను. థాంక్యూ.

      Delete
  2. ramana gaaru.. mee vyasam udayam chadivaanu. baavundi

    ReplyDelete
  3. Replies
    1. చందు తులసి గారు,

      థాంక్యూ.

      (రాసేప్పుడు) ఆడవారికి అభ్యంతరకరంగా ఉంటుందేమోనని సందేహించాను.

      Delete
  4. బావుందండి ! మీరు ఉదాహరించిన అంశాలు ఆలోచింపదగినవి. మంచి వ్యాసం అందించారు. ఇలాగే పత్రికలకి వ్యాసాలూ అందించండి. ఎక్కువ మందికి సరైన కోణంలో ఆలోచించగల్గడం అలవడుతుంది.

    ReplyDelete
    Replies
    1. వనజ గారు,

      పత్రికకి వ్యాసం రాయడం నాకైతే అంత సుఖంగా లేదు.. భాషని కంట్రోల్ చేసుకోవాలి.

      (ఎక్కువమంది చదువుతారనే విషయం పక్కన పెడితే.. ఎంతైనా బ్లాగు రాస్తేనే మజా.)

      Delete

  5. ఆయ్,

    లేడీసు కున్న ఈ ఒక్క ప్రివిలేజ్ ని కూడా మీరు ఇట్లా లాగేసుకోవా లనుకోవడం ఏమీ బాగో లేదు డాటేరు గారు !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi జీ,

      స్త్రీలని దేవతామూర్తులుగా చేసి గుళ్ళో కూర్చోబెట్టడం ప్రివిలేజ్ కాదేమోనండి!

      వాళ్ళని పురుషులతో సమానంగా చూడటమే సరైన పద్ధతి అని నా అభిప్రాయం.

      Delete
    2. వాళ్ళని పురుషులతో సమానంగా చూడటమే సరైన పద్ధతి అని నా అభిప్రాయం.
      _________________________________________________

      సర్వసమానత్వాన్ని ముందుగా వ్యతిరేకించేది స్త్రీవాదులేనండొయ్! జెండర్ వివక్షలేని (at least on paper) US తరహా చట్టాలని భారత్లో ప్రవేశపెట్టమనండి చూద్దాం.

      Delete
  6. >>కావున మనం అర్జంటుగా భారత మాత, తెలుగు తల్లి వంటి ప్రతీక భాష వదిలించుకోవాలి.

    నాది కూడా ఇదే ఆలోచన. లేని తల్లులు తయారు చేసుకొని, భాష జాతికి ఏదో అయితే అది ఆ భాష తల్లికి అయినట్లు ఆవేశంతో మాట్లడతాలు అవి చూసి విసిగిపోయాను.

    ReplyDelete
    Replies
    1. @Green Star,

      'తల్లి' తగిలించి ఆవేశంగా మాట్లాడటం అనేది (వ్యూహత్మకంగా) ప్రజలని రెచ్చగొట్టటానికి మాత్రమే అనేది నా అభిప్రాయం.

      Delete
    2. కరెక్ట్ సార్,

      మీరు చెప్పినట్లు ఇలా
      http://telugu.oneindia.in/news/2013/09/09/andhrapradesh-lagadapati-blames-seemandhra-leader-122148.html

      Delete
  7. ఈ సీరియస్ మ్యాటర్ పక్కన పెడితే, అబ్బాయిలని తప్ప అన్ని వస్తువులని/జంతువులని female గానే refer చేస్తాం ఎందుకో. పుస్తకం ఇక్కడ ఉంది అంటాం, ఇక్కడ ఉన్నాడు అనము.

    ReplyDelete
    Replies
    1. అది తెలుగులోనే అనుకుంటానండీ .. నాకు తెలిసిన మిగతా భాషల్లో స్త్రీలింగానికీ నపుంసక లింగానికీ తేడాలున్నాయి.

      Delete
  8. డాక్టరుగారూ

    మీకు ఆనందం కలిగించే రోజులు దాదాపు వచ్చేసాయి. కనీసం కనుచూపూ‌మేర దాకా వచ్చేసాయి.

    మన దేశంలో, తల్లిదండ్రులు భావికాలపు అమెరికన్ పౌరులను ఉత్పత్తి చేసే వారుగా మారిపోవటం మొదలై చాలా కాలమే అయింది.

    అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళూ తెలుగులో మాట్లాడటం నామోషీగా భావిస్తూ‌ ఉంటారు. ఆ మహనుభావుల అమెరికన్ పిల్లలకు తెలుగు అనే భాష మాట్లాడటం అనే అవసరమూ ఉండదు.

    విదేశాలకు తరలిపోయిన తరువాత తెలుగుతల్లి, భారతమాత లాంటి పదాలు ఎవరికి పడతాయి లెండి. అలా మీ కోరిక నెరవేరుతోంది. తెలుగుతల్లులూ తెలుగుతండ్రులూ ఎవ్వరూ కనిపించరు.

    ఇక్కడ ఉన్న మనవాళ్ళకూ విదేశీవ్యామోహం అనే గొప్ప గుణం ఉండటం కారణంగా విదేశాలకు దత్తతపోతున్న సంతతివారి నుండి ఈ తెలుగుతల్లి, భారతమాత లాంటి పదాలు వాడటం అనాగరికం అని నేర్చేసుకుంటారు లెండి.

    ఐనా ఇంకెన్నాళ్ళూ? మరో వంద నూటయభై సంవత్సరాల తర్వాత తెలుగుతల్లి దేవుడెరుగు, తెలుగు అనే భాషయే మాయం అవటం ఖాయం.

    విశ్వమానవ సౌభ్రాతృత్వం లాంటివి గుర్తుతెచ్చుకుని మనది భారతదేశం అని చెప్పుకోవటం కూడా అనాగరికమైన ఒక పవిత్రప్రతీకని చెప్పటమే అని మరో వ్యాసం‌ వ్రాస్తారేమో తొందర్లోనే.

    శుభం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      మీకు కాస్త కొపం వచ్చినట్టుంది మాష్టారు.

      "ఇక్కడ ఉన్న మనవాళ్ళకూ విదేశీవ్యామోహం అనే గొప్ప గుణం ఉండటం కారణంగా విదేశాలకు దత్తతపోతున్న సంతతివారి నుండి ఈ తెలుగుతల్లి, భారతమాత లాంటి పదాలు వాడటం అనాగరికం అని నేర్చేసుకుంటారు లెండి."

      మనం మెరుగైన జీవనం కోసం పల్లె నుండి పట్నం పొతాం. అక్కడ మనకు మంచి ఉజ్జొగం , పిల్లలకి మంచి చదువు ఇంకా చలా చలా .... సౌకర్యాల కోసం వెల్తాం. ఇది మన darwin పరిణామ క్రమంలొ భాగమే. అసలు మనిషి మొదట పుట్టిందే africa లొ అని పెద్దలు చెప్పారు. అక్కద నుండె అన్ని ప్రాంతాలకి migrate అయ్యాడు. better living conditions for our offsprings అనెది migratory aspect కి back bone అండి.
      విదేశీవ్యామోహం, తెలుగు అనే భాషయే మాయం అవటం ఖాయం, ...... వంటి expression ఎంత వరకు సమంజసం అని అప్పుడప్పుడు ఆలొచిస్తుంటాను.
      రమణ గారు చెప్పినట్టు , language కేవలం communication కొసం.
      ఆమెరికా వెల్తే అక్కడి బాష, రష్యా వెళ్తే రష్యన్ బాష మన బష అయ్యిపొతుంది కదా.
      మనకి వెళ్ళడానికి ఇష్తం లేక లేదా వెళ్ళె అవకాసం రాక, అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఇలా ఆడి పొస్కొవాలా?

      Delete
    2. శ్యామలీయం గారు,

      తెలుగుభాష అంత ప్రమాదంలో ఉందంటారా?

      భాష - పెసరట్టు

      Delete
    3. మహేష్‌గారూ,

      మనకి వెళ్ళడానికి ఇష్టం లేక లేదా వెళ్ళె అవకాసం రాక, అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఇలా ఆడి పోసుకోవాలా అని ప్రశ్నించారు. పొరబడ్దారు. నేను ఒక దశాబ్దం పాటు అమెరికాలో ఉండి వచ్చాను. అందుచేత తెలిసే మాట్లాడాను.

      ఈ 'language కేవలం communication కోసం' అన్న వాదం పాక్షికసత్యం మాత్రమే. మనిషి జీవితం, కేవలం జీవించటానికి మాత్రమే అన్న సిథ్థాంతం చేస్తే, ఇక నాగరికత అన్నది అసంబధ్దమూ అనవసరమూ ఐన వ్యవహారం అవుతుంది. అలాగే, ఒక వ్యక్తి అస్తిత్వంలో అతడి సంప్రదాయం ఒక విడదీయరాని భాగం. ఆ సంప్రదాయంలో భాష ఒక విభాగం. కాదనే వారితో వాదించేందుకు ఏమీ ఉండదు. మీ‌ యిష్టం.

      తెలుగుభాష నిర్మొగమాటంగా కృశించి నశిస్తోంది. అలాంటిదేమీ లేదూ అనుకోవటం, కళ్ళు మూసుకుని ఎవరూ చూడటం లేదనుకోవటం లాంటిదే.

      రమణగారూ,

      కాలక్షేపానికి మీ భాష - పెసరట్టు వ్యాసం‌ బాగానే ఉంది. కాని భాష ఒక పనిముట్టు మాత్రమే అనుకోవటం మీ యిష్టం - అలా కాదు దాన్ని గౌరవించాలీ, సంరక్షించాలీ అనుకోవటం నా యిస్టం. కనిపెంచిన తల్లి కూడా ఆ పనులు చేసిపెట్టిన పనిముట్టు అనుకోవచ్చునేమో‌ నాకు తెలియదు. అలా అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ వాదన తప్పకుండా ఉంటుంది. తల్లిపట్ల బాధ్యత ఉండాలి అనుకున్నట్లే తల్లి ఒడిలో నేర్చుకున్న సమాజం‌ సహాయంతో మెరుగులు దిద్దుకున్న భాషపట్ల కూడా బాధ్యత ఉండాలీ అనుకోవటం కూడా ఉచితం అనుకున్న వాళ్ళ వాదనకూ‌ హేతుబధ్దత ఉండని నా విశ్వాసం. మీరు నమ్మక పోవటం మీ‌యిష్టం. You go to your church and I go to mine. అంతకంటే ఏం చెప్పగలను!

      Delete
    4. శ్యామలీయం గారు,

      ఎందరో భాషాప్రేమికులది మీ అభిప్రాయమే. తెలుగుభాష పట్ల మీకున్న అభిమానం నాకు తెలుసు. అందుకు మిమ్మల్ని నేను గౌరవిస్తాను కూడా.

      భాషని దేవతగా ఆకాశానికెత్తేస్తూ (రాజకీయ లబ్ది కోసం) ఉద్వేగాలని రెచ్చగొట్టేవారి గూర్చి మాత్రమే రాశాను (అనుకుంటున్నాను).

      Delete
    5. I wonder really that there are people who can think this way.Those who cant respect their language and culture cannot respect their parents also.That is materialism,which is very dangerous to the society.We can see all the developed nations and states respecting their own language and culture.There is nothing wrong in having bharatha matha or telugu thalli.Every one knows that they dont really exists.But it shows humanity in human being which is very good.Those who can think that there is no need of saving mother tongue, may have the same feeling about their mother also.I agree 100% with Shyamaleeyam garu.

      Delete
  9. మామూలు, మామూలుగానే మీరు వ్రాసిన వ్యాసం బాగుంది. మీరు పత్రికల్లొ కూడా వ్రాస్తారని ఇప్పుడే తెలిసింది. మంచింది. కనీసం కొంచెం ఎక్కువ మందైనా వాళ్ళ బుర్రలు వాడటం మొదలు పెడతారు!
    ఇప్పుడే తెలిసిన ఇంకొ విషయం ఎమిటంటే, అంధ్రజ్యొతి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మంచిపనులు చెస్తారని !!! అంటే, ఇలాంటి అలొచింపచెసే వ్యాసాలు ప్రచురించటం లాంటివి అన్నమాట!!!
    కృష్ణ

    ReplyDelete
  10. That is one wonderful write up Ramana! Simply fantastic!
    People always invent sacred or third rail issues* - god, women, children, common man, weaker sections, etc - that are supposed to be unassailable and beyond criticism to advance their own selfish agendas.
    Third rail
    BSR

    ReplyDelete
  11. రమణ గారూ..
    దేశాన్ని తల్లిగా భావిస్తే ఏదో తప్పు అన్నట్లు మీరు రాశారు. మీలాంటి మేధావులకు ఇలాంటి భావనల్తో పెద్ద అవసరం లేకపోవచ్చు. కానీ సామాన్యుల హృదయాలలో దేశం పట్ల బాధ్యతను గుర్తు చేయటానికి భారతమాత అని ప్రయోగిస్తారు. దాన్నుంచే వందేమాతరం లాంటి గీతాలు రాసారు. అలాంటి భావనలకు మీరు ఏవేవో ఆపాదించి రాసారు.
    అయినా భారత దేశంలో స్వేచ్చ మితిమీరిపోయింది. ఎవరూ మిమ్మల్ని ఈ పదాలు వాడమని, ఆయా గీతాలు పాడమని బలవంతపెట్టట్లేదు కదా.
    మీరు ఎంత ఘోరంగా రాసారంటే ఇలాంటి భావనతో పాటలు రాసి పూజలు చేసేవాళ్ళు పన్నులు ఎగగొడ్తారని, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారని రాసారు. అలాగే స్త్రీ మాతృత్వానికి పవిత్రతను, గొప్పతనాన్ని ఆపాదించే వాళ్ళు స్త్రీలకు విలువ ఇవ్వరని జెనరలైజ్ చేసి రాసారు.
    ఒక భాషని, దేశాన్ని తల్లిగ భావన చేయటం అనేది ఒక expression.దానికి కూడా రాజకీయ ఉద్దేశాలు అంటగట్టడం కుతర్కం.

    ReplyDelete
  12. మనం దేశాన్ని స్త్రీ గా చూడడం లేదు ... స్త్రీ-తత్వంగా చూస్తున్నాం. ప్రేమ కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ స్త్రీ తత్వాలు అందుకే దేశాన్ని స్త్రీ-తత్వంగా చూస్తాము. పరిపూర్ణ స్త్రీ తల్లి లోనే ఉంటుంది అందుకే దేశాన్ని తల్లి అంటాం. తండ్రి అనము.

    ఇది సహజమైన సనాతనమైన తాత్విక జీవన విధానం లో భాగము. కల్పించుకున్న పాత్రలు కావవి.


    ఇక భాష ని తల్లిని చేయడం ఒక్క మన రాష్ట్రం లోనే చూస్తాము!

    ReplyDelete
    Replies
    1. > అందుకే దేశాన్ని తల్లి అంటాం. తండ్రి అనము.
      కొన్ని కొన్ని దేశాల్లో పితృభూమి అని అంటారటండీ.
      వివరాలు గుర్తులేవు.

      Delete
  13. దేశం అన్నా, భాష అన్న, రాష్ట్రం అన్నా , జిల్లా, చివరికి ఊరు, వీధి, ఇల్లు అన్నా తల్లే !!!!!

    అన్నం, పప్పు, సాంబార్, ఇడ్లి , దోస , దిబ్బరోట్టి ఇవికూడా తల్లే !!!!!

    చికెను , మటను ని తండ్రి అంటారేమో అనుకొన్నా ...కొన్ని ప్రాంతాల్లో అయితే అది కూడా కష్టమే, అమ్మోరికి అని చెప్పి బలి కార్యక్రమాలు చేస్తారయ్యే .

    ఇదంతా ఎక్కువ శాతం పలాయనవాదమే . (పురుషుల)

    పరిపూర్ణమైన స్త్రీ అనడం ఇంకా చండాలం , ఓర్పు ఓదార్పు అశక్తత వల్ల వచ్చినవి, ఇప్పుడా అవసరం స్త్రీ ఒక్కరికే లేదు కాక లేదు .

    మరి అంత ప్రేమ కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ స్త్రీ తత్వాలు అయితే , మహిళా రిజర్వేషన్ బిల్లు అడగాల్సిన ఖర్మ ఎందుకు ???? దాన్ని సాకారం చేసుకోవాలన్నా దశాబ్దాల తరబడి అడ్డంకులు ఎందుకు ??? అంటే పైకే ఈ మాటలన్నీ . అసలు చట్టాలే అవసరం లేకుండా ఈ
    ప్రేమ కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ అనే లక్షణాలు లేని దద్దమ్మ లని ఎన్ను కోవడానికి ఎందుకు తపన పడిపోతున్నారు ? స్త్రీలనే ఎన్నుకోవచ్చును కదా ????

    ఇది యెంత మాత్రమూ స్త్రీ ని గౌరవించడమొ , ఉన్నత స్థాయిలో భావించటమో కాదు. సంకుచిత రాజకీయాలనడం ఎంతవరకు సబబో తెలియదు , రాజకీయాలు వచ్చాకే ఈ జాఢ్యము మొదలైందా , ఆ రాజకీయాలు మాత్రం మొదలైంది ఎవరితో ? పురుషులతో నే కదా .

    ReplyDelete
    Replies
    1. ** ఓర్పు ఓదార్పు అశక్తత వల్ల వచ్చినవి**

      ఇంత కంటే విడ్డూరమికోటి ఉండదు. ఓర్పు వహించాలన్నా, ఓదార్పునియ్యాలన్నా ఎంత శక్తి అవసరమో అనుభవించేవాళ్లకే తెలుస్తుంది! ఆడవాళ్లకే తెలుస్తుంది!!


      **ప్రేమ కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ అనే లక్షణాలు లేని దద్దమ్మ లని ఎన్ను కోవడానికి ఎందుకు తపన పడిపోతున్నారు ? స్త్రీలనే ఎన్నుకోవచ్చును కదా ????**

      కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ అనే లక్షణాలు లేని దద్దమ్మలని మేమెన్నుకున్న స్త్రీలలో స్పష్టంగా చూసాం. పైగా కుటిల నీతులు వంటబట్టించుకున్న అశక్తత ఒకటి. ప్రయత్నం ఆగదు. పరిపూర్ణ మైన స్త్రీలనిపిస్తే తప్పకుండా ఎంచుకుంటాం.

      ఇల్లాంటి రాజకీయాలు పక్కకి పెడితే, స్ర్రీలకి ఎక్కువ గౌరవమివ్వడం మన సంప్రదాయలో ఇంకా సజీవంగా నే ఉన్నది. అందులో సంకుచితం లేదు.

      Delete
    2. @సత్య

      మీ స్పందనకు చాలా థాంక్స్ , మీ సమాధానం లో మొదటి భాగం కి రెండవ భాగం తో పొసగడం లేదు , గమనించవలసినది .

      @ ఓర్పు వహించాలన్నా, ఓదార్పునియ్యాలన్నా ఎంత శక్తి అవసరమో అనుభవించేవాళ్లకే తెలుస్తుంది! ఆడవాళ్లకే తెలుస్తుంది!!

      మీరు చెప్పే శక్తి ఏ విధమైన శక్తి ? ఓర్పు , ఓదార్పు స్త్రీకి ఉంటె చాలన్నది అది స్త్రీని ఇంకా ఫూల్ ని చెయ్యడమే. ఆ రెంటితో పరిపూర్ణమైన మనిషి అవ్వడం నిజమే అయితే, మనుషులకన్నా పసువులకే అది ఇంకా బాగా ఉంది.

      @కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ అనే లక్షణాలు లేని దద్దమ్మలని మేమెన్నుకున్న స్త్రీలలో స్పష్టంగా చూసాం. పైగా కుటిల నీతులు వంటబట్టించుకున్న అశక్తత ఒకటి. ప్రయత్నం ఆగదు. పరిపూర్ణ మైన స్త్రీలనిపిస్తే తప్పకుండా ఎంచుకుంటాం.

      ఇది కేవలం అహంభావి అభిప్ర్రాయం లా కనిపిస్తున్ది.

      @ఇల్లాంటి రాజకీయాలు పక్కకి పెడితే, స్ర్రీలకి ఎక్కువ గౌరవమివ్వడం మన సంప్రదాయలో ఇంకా సజీవంగా నే ఉన్నది. అందులో సంకుచితం లేదు.

      సంప్రదాయంలో నిజంగా గౌరవం ఎవరికి ఎక్కువ ఉందొ నిగ్గు తేల్చాలంటే నిజమైన చర్చ జరగాలి.

      Delete
    3. @ ఆ రెంటితో పరిపూర్ణమైన మనిషి అవ్వడం నిజమే అయితే
      ఓర్పు ఓదార్పు ఉంటే చలని ఆ రెంటితో పరిపూర్ణమైన మనిషి/స్త్రీ పరిపూర్ణమౌతారని నేనెక్కడా అనలేదు, ఏ మూర్ఖుడు అనడు. తప్పుదారి న మళ్ళించవద్దు (B+)

      @ఇది కేవలం అహంభావి అభిప్ర్రాయం లా కనిపిస్తున్ది.
      అల్లంటి వాళ్ల అహాన్ని ఎదురొని ఎదుర్కొని అంటున్న మాటలు నావి

      @ఎవరికి ఎక్కువ ఉందొ నిగ్గు తేల్చాలంటే నిజమైన చర్చ జరగాలి.

      స్త్రీ ల గౌరవం లో ఎక్కువ తక్కువలగూర్చి నేను మాట్లాడ లేదు, సజీవత గూర్చే నేను గుర్తు చేసింది.
      ఈవిషయం లో మాత్రం సంకుచితం లేదని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తున్నా.

      And I accepted the thanks! :)

      Delete
    4. @ఆ రెంటితో పరిపూర్ణమైన మనిషి అవ్వడం నిజమే అయితే, మనుషులకన్నా పసువులకే అది ఇంకా బాగా ఉంది.

      పశువుల్లో మాత్రం ఆ రెండు ఓర్పు ఓదార్పు లా కనిపుస్తున్న,భ్రమింపజేస్తున్న అశక్తతలు (చేతగానితనాలు). ఇంతకు మునుపు (in above comment) ఇవే మీకు స్త్రీ లలో ఎలా కనిపించాయో నాకు అర్థం కావడం లేదు.

      Delete
    5. @మనం దేశాన్ని స్త్రీ గా చూడడం లేదు ... స్త్రీ-తత్వంగా చూస్తున్నాం. ప్రేమ కరుణ ఓర్పు ఓదార్పు పోషణ రక్షణ స్త్రీ తత్వాలు అందుకే దేశాన్ని స్త్రీ-తత్వంగా చూస్తాము. పరిపూర్ణ స్త్రీ తల్లి లోనే ఉంటుంది @@

      (B+++)


      @స్త్రీ ల గౌరవం లో ఎక్కువ తక్కువలగూర్చి నేను మాట్లాడ లేదు, సజీవత గూర్చే నేను గుర్తు చేసింది.
      ఈవిషయం లో మాత్రం సంకుచితం లేదని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. @@@

      సంకుచితమో, వ్యాకుచితమూ ఉన్నా లెకున్నా...యెవరికి కష్టం? అసలు అవి ఎవరికి లేవని గుర్తుచేస్తున్నట్లు, ఎలా నిర్దారించినట్లు ?

      @ఇవే మీకు స్త్రీ లలో ఎలా కనిపించాయో నాకు అర్థం కావడం లేదు.

      అక్కడే చెప్పాను, "ఇప్పుడా అవసరం స్త్రీ ఒక్కరికే లేదు కాక లేదు" అని కూడా ఉంది పైన , చదవకపోతే ఎలా ?? అవసరం, పరిస్థితిని బట్టి అన్ని జీవులకు తప్పదు. పురుషులు కూడా అతీతులెం కాదు . ఇక్క స్త్రీ గురించి ప్రత్యేకంగా వర్ణించడం భ్రమింప చెయ్యాలని తాపత్రయపడటమే !

      @అల్లంటి వాళ్ల అహాన్ని ఎదురొని ఎదుర్కొని అంటున్న మాటలు నావి

      ఎక్కడో ఏదో అహాన్ని ఎదుర్కొని స్త్రీల గురించి పరస్పర వ్యతిరేక ప్రకటనలు గుప్పించడం వలన సాధించేదేమీ లేదు .

      స్త్రీల గురించి మీ అపూర్వ జ్ఞానాన్ని ఇక్కడ వివరించినందుకు, ఇంకో వంద ధన్యవాదములు !

      Delete
  14. రమణ గారికి బ్లాగ్ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ...............

    ReplyDelete
  15. పిచ్చి డాట్రారూ (సానుభూతితో అన్న మాట) రాజకుమారా ఉత్తర దిక్కుకు మాత్రం పోవద్దు అంటే వాడెటు వెళతాడో చిన్నప్పుడు కథల్లో చదువుకోలేదా ఏమిటి.

    ReplyDelete
  16. రమణగారు,

    I couldn’t agree with you more. You are one sane voice in a sea of drowning noises, an eloquent one at that. We need more of you… many many more……
    (నా English ప్రతిస్పందనకు క్షమించాలి, తెలుగులో నా భావాన్ని సరిగా వ్యక్తం చేయలేనేమో అనే అనుమానం చేత)

    సందర్భోచితమైన ఒక వ్యాఖ్య:
    "Patriotism is often an arbitrary veneration of real estate above principles." -- George Jean Nathan

    అవధులు దాటిన భాషాభిమానం, ప్రాంతాభిమానాలకు కూడా చక్కగా అన్వయించుకోవచ్చు!


    శ్యామలరావుగారు,

    అర్ధం లేని విశ్వాసాలు, నిరాధార నమ్మకాలకు ఆచారము, సాంప్రదాయమనే కవచ కుండలాలు తొడిగి, ఆ భావనలపై ఇతరులు విశ్లేషణ, విమర్శలనే అస్త్రాలను సంధించడం అధర్మమని వాపోతున్నారు

    జీవించడానికి మించిన పరమార్ధం ఏ జీవికైనా ఉందని మీరు భావిస్తే భావించవచ్చుగాక… మీ సాంప్రదాయ పరిధులు, కట్టుబాట్లను దాటిన జీవన/ఆలోచనా విధానాలన్నీ నాగరికత లోపించినవేనా?

    తెలుగు భాష, ఆంధ్ర రాష్ట్రం లేదా భారతదేశాలపై మీరు అనుబంధం మమకారం పెంచుకొంటే మంచిదే, ఐతే అందరూ అదే విధమైన భక్తి ప్రపత్తులు చాటుకోవాలనడం నిరంకుశత్వమవుతుంది

    భిన్న ఆలోచనలను మార్పును ఆహ్వానించి, అంతరాలని అధిగమిస్తూ, నిరంతరం అభివృద్ధికై శ్రమించటమే ఏ భాషైనా, సమాజమైనా, దేశమైనా పురోగతి సాధించగల మార్గం. కానప్పుడు, అవి కాలక్రమంలో కృశించి నశించడం నివారించలేని పరిణామం. లేని దివ్యత్వాన్ని ఆపాదించి, బాధపడడం వల్ల ప్రయోజనం శూన్యం.

    పూర్ణప్రజ్ఞాభారతి గారు ,

    మీ ప్రతిస్పందనని వర్ణించడానికి English లో ఒక చక్కటి పదం ఉంది, తెలుగు లో నాకు అంతటి సరి జోడి పదం దొరకలేదు
    ad hominem: attacking a person or his character rather than answering his argument

    ప్రత్యర్ధి యొక్క వాదనకి ప్రతివాదన చేయగల ప్రజ్ఞాపాటవాలు లోపించి, వ్యక్తిగత హేళనకు పాల్పడడం దాని తాత్పర్యం

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారండీ. సాహిర్ లుధ్యాన్వీ ఎప్పుడో అన్నాడు:

      यह पाप है क्या यह पुन्य है क्या
      रीतों पर धर्म के मोहरे है
      हर युग में बदलते धर्मोंको
      कैसे आदर्श बनाओगे

      Rough translation:
      పాపం ఏమిటి? పుణ్యం ఏమిటి?
      ఆచారాలపై ధర్మం యొక్క ఆమోద ముద్ర
      ప్రతీ యుగానికి మారే ధర్మం
      ఆదర్శం ఎలా అవుతుంది?

      Delete
    2. ప్రతీయుగానికీ కాలానుగుణంగా మారే ధర్మమే ఆదర్శమవుతుంది.

      Delete
    3. ప్రతీయుగానికీ కాలానుగుణంగా మారే ధర్మమే ఆదర్శమవుతుంది :)

      Delete
    4. //పూర్ణప్రజ్ఞాభారతి గారు ,

      మీ ప్రతిస్పందనని వర్ణించడానికి English లో ఒక చక్కటి పదం ఉంది, తెలుగు లో నాకు అంతటి సరి జోడి పదం దొరకలేదు
      ad hominem: attacking a person or his character rather than answering his argument

      ప్రత్యర్ధి యొక్క వాదనకి ప్రతివాదన చేయగల ప్రజ్ఞాపాటవాలు లోపించి, వ్యక్తిగత హేళనకు పాల్పడడం దాని తాత్పర్యం //
      అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరిని వ్యక్తిగతంగా హేళన చేయలేదు. నా వ్యాఖ్యలోని కుండలీకరణాన్ని గమనించండి. రాజకుమారా ఉత్తర దిక్కుకు పోవద్దు అంటే అతను అటే వెళ్లి కష్టాల్లో పడడం చాలా కథల్లో ఉన్న అంశమే. అలాగే పవిత్ర ప్రతీకల వాడుక విషయంలో కూడా. వాటిని అనవసరంగా వాడవద్దు అని చెబితే వినేవాళ్లుంటారా అన్న భావంలో రాసింది పై వ్యాఖ్య. నాకు రమణగారి శైలి బాగా నచ్చింది. వారిపట్ల నేను ఎప్పుడు అగౌరవంగా కామెంట్లు రాయడం జరగలేదు. వారి పోస్టులకు గతంలో నేను పెట్టిన కామెంట్లను చూడ ప్రార్థన.

      మీరు నాపైన అభాండాన్ని వేశారే అని ఇది రాయడం.

      Delete
    5. చిన్న కరెక్షన్.. నా వ్యాఖ్యలో పవిత్ర ప్రతీకలు అని వాడినట్లున్నాను. అది ప్రతీక పవిత్రత అని చదువుకోగలరు

      Delete
    6. @Bharadwaj Velamakanni: are you translating Sahir or fiving your *own* opinion?

      Delete
    7. Sahir Ludhianvi indeed is a great lyricist. For the uninitiated like me the words quoted by Jai garu are from the song, Sansaar Se Bhaage Phirte Ho from Chitralekha, a 1964 film starring Meena Kumari. The movie was a disaster at the box office (despite great music and songs by Roshan and Sahir) - unlike the 1941 version of the film made by the same director, Kidar Sarma which was a big hit. The movie explores sin, virtue and hypocrisy of spirituality. I don't know if this actually pertains to the blog.

      Here is my take on Dr. Ramana's blog post: I think he is criticizing the politically motivated deification or glorification of geography, (rivers), languages and female sex in order to hit an emotional chord and create a charged atmosphere.

      Back to the song.
      Sansaar se bhaage phirte ho
      Here is a nice analysis of the song:
      Sansaar Se Bhaage Phirte Ho Lyrics and Translation

      Delete
    8. @GIdoc:

      Thanks a million for the links.

      I found it interesting that Meena Kumari uses a "stamping" sign to indicate "reetonpar dharm ke mohare".

      Delete
    9. Respected Edge garu
      My previous comments on this blog like the one in నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు! (http://yaramana.blogspot.in/2012/04/blog-post_11.html) and other blogs like http://http://varudhini.blogspot.in and http://http://vanajavanamali.blogspot.in etc may kindly be read to assess my personality and attitude.
      I may be expressive in English, pardon me for my ignorance of the language.

      Delete
    10. a small correction

      //I may be expressive in English, pardon me for my ignorance of the language// may be read as I may not be expressive in English, pardon me for my ignorance of the language

      Delete
    11. పూర్ణప్రజ్ఞాభారతి గారు,

      మీరు నా బ్లాగులో కామెంట్లు రాస్తున్నందుకు ధన్యవాదాలు.

      మీ కామెంట్ నన్ను hurt చెయ్యలేదు. కాబట్టి.. take it easy sir!

      (అమ్మయ్య! ఈ ముక్క రాయడానికి గంట నుండి ప్రయత్నిస్తున్నాను.)

      Delete
    12. అయ్యో, మీ వ్యాఖ్య సరిగా అర్ధం చేసుకోలేక పోయాను, ప్రజ్ఞగారు. నాదే పొరపాటు. Please accept my apologies.

      Delete
  17. Ramana sir nenu me rogi ni eka pote ee visam antha pattichch kolasi asaram ledu samrajavada uuddhalo mana sadharanam gaa matru desa rakshana ani pelupu eestam appudu sajagane kavithalu kadhalu Motherland kapadamaivrastamu sadaranma pillaku Mother tho kontha vekkuva Connectivity. vuntudi eppude kadu prachina mathrusvamyam nunchi

    sir meku munde cheppe naku rayatam radu thappu lu vunte kshamisandi
    Siva

    ReplyDelete
  18. Edgeగారు, (మీ‌ ప్రొఫైల్‌లో మీగురించి ఏ వివరమూ లేదు.)
    నా విశ్వాసాలు నావి. డాక్టరుగారు వారి విశ్వాసాలు వారు కలిగి ఉండటం‌తప్పనలేదు నేను. వారి విశ్లేషణ వారు చేసారు. నా అభిప్రాయం నేను చెప్పాను. 'అర్థం లేనీ అనే స్థాయిలో నేను వారి అభిప్రాయాన్ని ఖండించానా? జీవించటానికి మించిన పరమార్థం ఉన్నదన మన సాంప్రదాయం చెబుతున్నది. ఇతర సాంప్రదాయాలు వేరేగా చెబితే అది అనాగరికం అని నేననలేదు. నాకు నిష్కారణంగా నిరంకుశత్వం అంటకట్టారు సంతోషం - మరి ఇతర అభిప్రాయలు చెప్పేవారు నిరంకుశంగా అభిప్రాయాలు రుద్దుతున్నారని నే నన్నానా? మీరు కూడా వ్యక్తిగతంగా నా అభిప్రాయాలని ఎద్దేవా చేస్తూ‌ దండయాత్ర చేస్తున్నారని నే నెందుకు అనుకోకూడదు? మీరు పూర్ణగారిని ఆక్షేపించటానికి నాకు కారణం కనబడటం లేదు, పైగా వార్ని మీరన్న మాటలు మీకే‌ వర్తిస్తున్నాయేమో‌ ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి..

    ReplyDelete
    Replies
    1. శ్యామలరావుగారు,

      నేను అప్పుడప్పుడు తెలుగు బ్లాగులు చదువుతుంటాను, కాని స్వయంగా బ్లాగర్ను కాదు. రమణగారి బ్లాగ్ తరచుగా ఫాలో ఆవుతుంటాను. Edge అనే screen name తో స్పందిస్తాను, చాలా అరుదుగా. ఒకటి రెండు చోట్ల Amar పేరుతో కూడా కామెంట్ చేశాను, కాని అది నా నిజ నామం కాదు. అమెరికాలో ఉంటాను.

      మీ విశ్వాసాలు కాని, రమణగారి నమ్మకాలు కాని, లేక మరెవ్వరివైనా వారి వారి వ్యక్తిగత పరిధులను మించనంత వరకు అభ్యంతరపెట్టే హక్కు నాకు, వేరెవ్వరికీ లేదు. అవే నమ్మకాలు/విశ్వాసాలు వాటి పరిధిదాటి అవాస్తవిక ప్రామాణికతను ఆపాదించుకొని, విస్తృత సమాజంపై సంప్రదాయాలుగా రుద్దబడి ప్రభావం చూపుతున్నపుడు, వ్యతిరేకించడం, నిలువరించడానికి ప్రయత్నించడం వివేకవంతుల బాధ్యత. అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భుజకీర్తులను చాటుకొనే మన భారతదేశ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి లభించిన హక్కు. అలాంటి కొన్ని నిర్హేతుక సాంప్రదాయాలు సమాజంపై ఏవిధంగా దుష్ప్రభావం చూపుతున్నాయో, అవి ఎంత అసంబద్ధమో చక్కటి ఉదాహరణలతో రమణగారు వివరించారు. ఇంకా చెప్పాలంటే, మీబోటి వారు దేవతగా ఆరాధిస్తున్న తెలుగు భాషలో సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరించారు.
      మరి, మీరేం చేసారు? ఆయనకు ఉద్దేశ్యాలు అంటకట్టారు. మీరు ఆనందించే రోజులు దగ్గర పడ్డాయి, కనుచూపుమేరలోనే ఉన్నాయి అని నిష్టూరమాడారు, వ్యంగం జతచేసి. అక్కడికేదో రమణగారు తెలుగు భాష మీద యుద్ధం ప్రకటించి, దాని అంతం చూడడానికి కంకణం కట్టుకున్నట్టుగా. ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి? ఆయన వ్యక్తికరించిన అభిప్రాయాలేమిటి? అవి ఎంతవరకు సమంజసం? ఆయన వేలెత్తి చూపిన సామాజిక, రాజకీయ విపరిణామాల వల్ల మన సమాజానికి జరుగుతున్నా నష్టాలేమిటి? మీరు అలాంటి ఆలోచనలేమైనా చేసారా? పోనీ రమణగారి అభిప్రాయాలతో విభేదిస్తే, మీ భావాలనుకూడా అంతే చక్కటి తెలుగులో గౌరవంగా విశదీకరించే అవకాశం మీకూ ఉందికదా? తద్వారా, మీరు ఎంతగానో ప్రేమించే తెలుగు భాష అభివృధ్ధికి కొంతైనా దోహదపడే అదృష్టం మీదయ్యెదికదా? భాషాభిమానిగా కాకున్నా, కనీసం, బాధ్యత గల పౌరునిగానైనా స్పందించారా, లేదే? పైగా, వారి రాబోయే వ్యాసంలో ఉండబోయే విషయం గురించిన ఊహాగానరాగం!

      ఇక పూర్ణగారిని నేను ఆక్షేపించిన కారణం క్రింద ఇస్తున్నాను(తెలుగులో రాయడానికి ప్రయత్నించాను కాని సాధ్యం కాలేదు, క్షమించాలి):

      In any civilized discussion, your opponents have every right to critique your thoughts, opinions as well as your logic and reason. If instead, people chose to focus on your color, creed, how you look, what you wear or what you do for a living, that’s not a civilized discussion any more.

      Delete
    2. Respected Edge garu

      //In any civilized discussion, your opponents have every right to critique your thoughts, opinions as well as your logic and reason. If instead, people chose to focus on your color, creed, how you look, what you wear or what you do for a living, that’s not a civilized discussion any more.//

      Neither I neither focused on the color, creed, how Dr. Ramana look nor how he wear and what he does for a living. You might be mistaken by the word పిచ్చి డాట్రారూ but I sincerely regret to inform you that you have overlooked the word in bracket next to it. (సానుభూతితో అన్న మాట). It is a general tendency in the human being, specially while in a mob to ignore a good advise given by a wise-man.

      For the past 25 years, by profession I am a Lecturer in Telugu, a research supervisor in three universities, dealing with research scholars of different regions, castes and religions. Hence, I know how to honour a learned man.

      The వ్యంగ్యం in the comment is on the people who does not care the wise advise, but not on Dr. Ramana. If వ్యంగ్యం or హాస్యం are not permitted in comments, I tender an apology to Dr, Ramana and request him to block any further comments from my side on his blog, but still I READ Dr. Ramana's posts.

      Purnapragnabharathy aka Dr.K.Chandrasekhara Rao..
      , for which act Iyhathe profession of. choose a yI am a the of the WhatI

      Delete
    3. //ఇక పూర్ణగారిని నేను ఆక్షేపించిన కారణం క్రింద ఇస్తున్నాను(తెలుగులో రాయడానికి ప్రయత్నించాను కాని సాధ్యం కాలేదు, క్షమించాలి):

      In any civilized discussion, your opponents have every right to critique your thoughts, opinions as well as your logic and reason. If instead, people chose to focus on your color, creed, how you look, what you wear or what you do for a living, that’s not a civilized discussion any more.//

      దీనికి తెలుగు అనువాదం
      ఏ సంస్కారపూరితమైన చర్చలోనైనా మీ భావాలను, అభిప్రాయాలను, తర్కాన్ని, హేతువులను విమర్శించేందుకు మీ ప్రతివాది అన్ని హక్కులు ఉంటాయి. అయితే అలాకాక, వ్యక్తులు మీ వర్ణాన్నో, వర్గాన్నో, మీరెలా కనుబడుతున్నారు, ఏమి ధరిస్తున్నారు లేదా ఏ వృత్తిలో ఉన్నారు అన్నవాటిని లక్ష్యంగా చేసుకుంటే ఇక ఆ చర్చ ఎన్నటికీ సంస్కారపూరితమైన చర్చగా మిగలదు.

      Delete
    4. పూర్ణగారు,

      ధన్యవాదాలు. చాలా చక్కగా నా భావాన్ని తెలుగులో వివరించారు! మీ సహృదయతకు వందనం!!

      నా పొరపాటు మిమ్మల్ని బాధించిన విషయం గ్రహించాను. I am really sorry.

      Delete
    5. పూర్ణప్రజ్ఞాభారతి గారు,

      ఇప్పుడు మీరు హేపీ మూడ్ లోకి వచ్చెయ్యాలండి. తప్పదు.

      (అయినా మన తెలుగు బ్లాగర్లం ఉన్నదే గుప్పెడు మందిమి.. అందరం స్నేహితులమే. మనలో మనకి అపార్ధాలు ఉండరాదు.. ఉండకూడదు.)

      Delete
  19. పైన కిరణ్ గారు వ్రాసినదానితో చాలావరకు ఏకీభవిస్తాను.

    మన దేశాన్ని, ప్రాంతాన్ని, భాషని గౌరవించుకోవడం తప్పు ఎలా అవుతుంది? వాటిని రాజకీయప్రయోజనానికి ఉపయోగించుకోవడం తప్పు అవుతుందికాని.

    మీరు చెప్పినట్టుగా ఆలోచిస్తే దేశభక్తి అన్న దానికి కూడ అర్థం ఉండదు. అందరికీ వాళ్ళ వాళ్ళ దేశం గొప్పదే ఎంత పేదదైనా సరే.

    అలాగే అందరికీ అమ్మ ఉంటుంది కదా, మనం మన అమ్మనే ఎందుకు గౌరవిస్తున్నాం? పక్కింటి వాళ్ళ అమ్మని కనీసం పట్టించుకుంటున్నామా?

    అలాగే మన భాషని పరిరక్షించుకోపోతే తెలుగు భాష కొన్నాళ్ళకి అంతమయిపోవచ్చు. అప్పుడు ఇన్నాళ్ళ తెలుగు సాహిత్యానికి ప్రయోజనం ఏముంటుంది?

    మనవి అన్నవాటిని గౌరవించుకోవడం తప్పు కాదు. వాటిని రాజకీయానికో మరో స్వార్థానికో ఉపయోగించుకోవడం మాత్రమే తప్పు.

    ReplyDelete
    Replies
    1. "Pardon him. Theodotus: he is a barbarian, and thinks that the customs of his tribe and island are the laws of nature"

      Caesar in GB Shaw's play "Caesar and Cleopatra"

      "కవిత్వంలో జీవితంలో economy of thoughts and words లేకపోవడం దేశభక్తి కన్నా హీనమయిన పాపం, ఆత్మలోకంలో దివాలా"

      శ్రీశ్రీ మహాప్రస్తానం ముందుమాటలో చెలం

      Delete
    2. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.

      Delete
    3. Lol, if only that Chalam guy had some economy of carnal thoughts... But then its easier to preach than to practice!

      Delete
    4. బోనగిరి గారు

      సమస్య ప్రేమించడం కాదు . మన దేశం, ప్రాంతం, కులం , మతం , భాష అన్నీ మనకు ఖచ్చితంగా ప్రియమైనవే .

      అలాగే అమ్మని ప్రేమించడం కూడా ఇక్కడి సమస్య కాదు. అమ్మని మనుషుల్లో చూస్తె చాలు.

      Delete
  20. రమణగారూ, వాదం పెంచటం ఇష్టం లేక నేను ఈ విషయం మీద ఇక స్పందించరాదని
    నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ Edge గారి ఆరోపణలకు జవాబు చెప్పటం లేదు. అంతే‌కాక, లోకం పోకడలు గమనించటమే కాని నా బోటి వారు స్పందించీ లాభం లేదు ఈ కాలంలో. సెలవు.

    ReplyDelete
  21. మా శివాలయం రోడ్దు మాత మీద..పక్క రోడ్దు మాత వివక్షత చూపిస్తుంది..నా శివాలయం రోడ్దు మాతని కాపాడుకొవాలి...

    మా మారీసు పేట మాత మీద..పక్క పెటా మాత వివక్షత చూపిస్తుంది..నా పేట మాతని కాపాడుకొవాలి...

    మా తెనాలి మాత మీద..గుంటురు మాత వివక్షత చూపిస్తుంది..నా తెనాలి మాతని కాపాడుకొవాలి...

    మా గుంటురు జిల్లా మాత మీద..హైదరాబాదు జిల్లా మాత వివక్షత చూపిస్తుంది..నా గుంటురు జిల్లామాతని కాపాడుకొవాలి...

    మా తెలంగణ ప్రాంతం మాత మీద..ఆంధ్రా ప్రాంతం మాత వివక్షత చూపిస్తుంది..నా తెలంగణ ప్రాంతం మాతని కాపాడుకొవాలి...

    మా ఆంధ్రా రాష్ట్రం మాత మీద..తమిళనాడు రాష్ట్రం మాత వివక్షత చూపిస్తుంది..నా ఆంధ్రా రాష్ట్రం మాతని కాపాడుకొవాలి...

    మా భరత మాత మీద..ఛీని మాత వివక్షత చూపిస్తుంది..నా భరత మాతని కాపాడుకొవాలి...

    మా ఆసియా మాత మీద..అమెరికా మాత వివక్షత చూపిస్తుంది..నా ఆసియా మాతని కాపాడుకొవాలి...
    మా భూగొళం మాత మీద..వీనస్ మాత వివక్షత చూపిస్తుంది..నా భూగొళం మాతని కాపాడుకొవాలి..
    నాకు అంత వరకె వచ్చు........




















    ReplyDelete
    Replies
    1. పప్పుగారు! ఇక్కడ అందరూ చేసిన వ్యాఖ్యానాలకంటే మీ వ్యాక్యానం చాలాబావుంది . మీ వ్యాఖ్యానం నవ్వులోంచి బయటపడటానికి ఓ పదినిముషాలైనా అయిందంటే నమ్మండి. (నవ్వుంటే -మీమాట ఒక జొక్‌ లాగ అనిపించి నవ్వాను మరొలా భావించవద్దు)

      రమణ గారికి,
      సార్‌, మీ వ్యాసం అంధ్ర జ్యోతిలో చూసాను. చాల బావుంది. ఒక నూతన ఆలోచనకు తెరలేపారు.
      సంస్కృతి అంటే మన జీవితానుభవాల వడబోత నుండి నేర్చుకున్నది తిరిగి జీవితానికి అన్వయించుకొంటూ, జీవితాన్ని మెరుగులు దిద్దుకోవడానికి నూతన ఆలోచన చేయడమే సంస్కృతి అని నేను అనుకుంటున్నాను కనుక మీరు చేసిన రచన నాకు చాలా నచ్చింది.

      Delete
  22. హన్నా ....

    తెలుగు బాషా ప్ర్రేమికులిని వలస బాషా ప్రేమికులు తొక్కెస్త్తున్నారు ..

    రమణా తొందరగా ఒక నోట్ తయారు చెయ్ ..రెండుగా విభజిస్తాను.. ఓ పని అయిపొద్ధి...

    ReplyDelete
  23. రమణ గారు,
    మరి ప్రజానాట్యమండలి, గద్దర్ మొదలైన వారి పాటలలో అక్క, చెల్లీ, తల్లి అంట్టు పదాలు వాడి వినే వారి లో, భావోద్రేకాలకు లోను చేసె వారి గురించి మీ అభిప్రాయం ఎమిటి ? అలా చేయటం వలన సమస్యలు పరిష్కారం కావు గదా. అయినా వాళు అవేర్నేస్ కొరకు పాటలు రస్తూ సాధించేది ఎమైనా ఉందా? ఆ తరం పాతబడి పోయింది గదా అనుకొంటె, ఈ మధ్య మధు ప్రియా అనే చిన్న పిల్ల పాడటం మొదలు పెట్టింది.

    ReplyDelete
    Replies
    1. UG SriRam గారు,

      కవులు విరివిగా metaphors వాడతారు. అది వారి expression.

      (నేన్రాసింది political eploitation గూర్చి.)

      Delete
    2. UG SriRam గారు,

      కవులు విరివిగా metaphors వాడతారు. అది వారి expression.

      (నేన్రాసింది political eploitation గూర్చి.)

      Delete
  24. Jai

    Being a hardcore fan of SD Burman, I dont dare to misinterpret Sahir. That was my opinion and quoting Hasrat Jaipuri in this context..

    Duniya badle Mausam Badle
    Dharti Apni Saadi Badle
    Tum BADLO Pagdi :)

    ReplyDelete
  25. Jai

    Being a hardcore fan of SD Burman, I dont dare to misinterpret Sahir. That was my opinion and quoting Hasrat Jaipuri, I would say

    Duniyaa Badle Mausam Badle
    Dharti Apni Saadi badle
    Tum badlo pagdee :)

    ReplyDelete
  26. Brathaka nerchina doctor garu, Telugu thalli badulu Telangana thalli analedu.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.