Saturday, 7 September 2013

ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలేనా?


మన దేశంలో ప్రస్తుతం నడుస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీలు చాలా కీలకమైనవి. అవి అనుక్షణం ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించాలి, ప్రజాశ్రేయస్సే ప్రధమ కర్తవ్యంగా భావించాలి. రాజకీయ పార్టీలకి ప్రజాసేవకి మించిన పవిత్ర కార్యం మరొకటి ఉండరాదు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రాధమిక సూత్రాలు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయ పార్టీల రాజకీయాలు ఈ ప్రాధమిక సూత్రాలని అనుసరించి ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్ధకం. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయ పార్టీల కార్యాచరణ లేనప్పుడు అవకాశవాదమే పార్టీల విధానం అయిపోతుంది. రాజకీయాల్ని చదరంగం ఆటలో ఎత్తుల్లాగా మార్చేసుకున్నప్పుడు ప్రజాశ్రేయస్సు వెనక్కి వెళ్ళిపోతుంది.

ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో.. తెలంగాణాకి వ్యతిరేకం కాదు అని ఒక పార్టీ, మీరు తండ్రి వంటి పాత్ర (?) పోషించండి అని మరొక పార్టీ ఢిల్లీలో తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. తీరా ఢిల్లీ నుండి నిర్ణయం వెలువడ్డాక, తాము వెలువరించిన అభిప్రాయానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత నుండి తప్పుకుని, భుజాలు తుడిచేసుకున్నాయి.

ప్రస్తుతం ఎన్జీవో నాయకులు తెర ముందుకు వచ్చారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే పాత రోజుల్లో జరిగే పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయి. పూర్వం పెళ్లి సంబంధంలో కట్నకానుకలు ఒక పెద్దమనిషి సమక్షంలో మాట్లాడుకునేవారు. కట్నం చెల్లింపులో తేడా వచ్చి పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడు.. అసలు పెద్దమనిషి మాయమైపోతాడు. కొత్త పెద్దమనుషులు సరికొత్తగా రంగప్రవేశం చేస్తారు. తామే అసలైన పెద్దమనుషులమని హడావుడి చేస్తారు.. ఇప్పుడు మన ఎన్జీవో నాయకుల్లాగా!

ఎన్జీవో సంఘాలు రాజకీయ వ్యవస్థలో భాగం కాదు. రాజకీయ నిర్ణయాల్ని అమలు చెయ్యడానికి రాజ్యంగ పరంగా ఏర్పడ్డ ప్రభుత్వ వ్యవస్థలో వారు భాగం. అనగా రాజకీయ నిర్ణయాలతో వారికి సంబంధం లేదు (ఆ నిర్ణయాలు వారి సర్వీసు హక్కులకి భంగం కలిగిస్తున్నప్పుడు తప్పించి). వారు ఇన్నాళ్ళు జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. నిర్ణయం వెలువడ్డాక రాజకీయ పార్టీలని పక్కన బెట్టి ఉద్యమం తలకెత్తుకున్నారు.

తాము విభజనకి అనుకూల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు సమ్మె బాట పడతారనే అవగాహన రాజకీయ పార్టీలకి లేదా? అదే నిజమైతే ఉద్యోగుల అభిప్రాయాల్ని అంచనా వెయ్యలేని రాజకీయ పార్టీల అసమర్దత ఇవ్వాళ స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలకి ముందుండి నడిపించవలసిన రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యులైన రాజకీయ పార్టీలు.. ఉద్యోగ సంఘాల అడుగు జాడల్లో నడవాల్సి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యంగా భావించాలి.

ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రజల ఎజెండా ఉద్యోగ సంఘాలు నిర్ణయించలేవు.. నిర్ణయించజాలవు. రాజకీయ వ్యవస్థ వైఫల్యం వల్లనే ఇవ్వాళ ఒక ప్రాంత ప్రజలకి ఎన్జీవో సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు హీరోల్లా కనిపిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి బాగానే ఉన్నా, ఈ ధోరణి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

(photo courtesy : Google)

24 comments:

  1. What's wrong with government employees agitating for their causes? You don't need to be a political party to have an organized opinion or collective expression. Democracy, by definition is a popularity contest. Whoever has a plank that attracts people would lead - in this case it may be NGOs. It is too bad if the politicians have to follow the lead of the NGO leaders. Political parties have no exclusive authority on shaping public opinion or formulating policy. By all means the employee associations/unions can set the agenda for themselves and by extension to people at large. But, the people have the right to embrace or reject such agendas.

    ReplyDelete
    Replies
    1. Govt. employees (like any employees) are limited by their employment contract & service rules. In India, Govt. employees are forbidden to strike work for reasons unrelated to their service conditions. Individual employees can undertake political work outside office hours (or on leave) but can't join/support any political party.

      Delete
    2. Where the world has not been broken up into fragments
      By narrow domestic walls

      Where the mind is led forward by thee
      Into ever-widening thought and action
      Into that heaven of freedom, my Father, let my country awake.

      Delete
    3. You present a very narrow construct, Jai garu. While employee direct action may be governed by contract and service rules, no one can deny the fact that special and unique circumstances govern such actions and strike is almost always a last resort. There is a lot of debate in India about whether strike is a constitutional right or fundamental right or neither, in light of recent Supreme Court decisions contrary to the constitutional provisions, prior legal precedents and international labor treaties to which India is a party to (please see the link below). I dispute the contention that the current strike is unrelated to the NGOs service conditions.

      Like all the employers, the governments too have the lockout option and can summarily dismiss every striking employee (à la Tamilnadu in 2003). But, such radical action by the government is not without consequences - especially before a general election. No management likes strikes including the government. Unfortunately, the ordinary working folks do not have very many avenues to press their cases individually. Stirs of this nature do not exactly follow the standard operating procedure or a service manual. Unrests happen for extreme reasons and successful resolutions are not often found in the rule books.

      Is there a right to strike?

      Delete
    4. Here is the poem, "Where the mind is without fear" (Chitto jetha bhayashunyo) from Rabindranath Tagore's Gitanjali in its entirety:

      Where the mind is without fear and the head is held high;
      Where knowledge is free;
      Where the world has not been broken up into fragments by narrow domestic walls;
      Where words come out from the depth of truth;
      Where tireless striving stretches its arms towards perfection;
      Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
      Where the mind is led forward by thee into ever-widening thought and action;
      Into that heaven of freedom, my Father, let my country awake

      Delete
    5. Gldoc garu,
      ఇక్కడ టైమ్లీగా మీరు ప్రస్తావించిన విశ్వకవి పలుకులు చాలా బావున్నాయి. రవీంద్రుని ఆకాంక్ష నిజమై, మనుషుల్లో సంకుచితత్వం పోయి విశ్వ మానవ వికాసం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసే శుభ గడియలు ఎప్పుడొస్తాయో!?
      ‘‘దారుణ ద్వేషాగ్ని పెంచే / దానవత్వం నశిస్తుందా
      సాధుసత్వపు సోదరత్వపు / స్వాదుతత్వం జయిస్తుందా
      నిజంగానే నిఖిలలోకం / నిండుహర్షం వహిస్తుందా
      మానవాళికి నిజంగానే / మంచికాలం రహిస్తుందా
      నిజంగానే నిజంగానే....?’’ -శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి

      Delete
    6. @GIdoc:

      Do the service conditions of employees violate their fundamental rights as citizens (or natural rights that can't be denied even by the constitution)? This is an interesting question that has not been tested yet.

      TNGO's during sakala janula samme included a few service related demands (e.g. pay revision commission) for precisely the reason I outlined. Surprising why Ashok Babu did not think of this? This is all the more surprising as former Advocate General CV Mohan Reddy is very active in the agitation.

      Delete
  2. yes you are correct ramana gaaru. ivala prabhutva vyavasthanu apahaasyam cestunna vaallu repu...prajalni lekka ceyaru.

    ReplyDelete
  3. Gldoc nailed it.

    APNGOs, like other people who have stake in this issue, have every right to influence political parties,express their opinion, pleasure, displeasure. Political parties do not hold exclusive right to represent people and when people feel that their concerns are not being addressed by political parties, they have no option but to take help of appropriate fora.

    ReplyDelete
  4. డాక్టరు గారూ,
    ఊద్యోగులు మాత్రం పౌరులు కారా? వారికి ఉద్యోగుల సమస్యలు కాకుండా, వేరే సమస్యల కోసం ఉద్యమం చేయడం తప్పుగా కనిపిస్తోందా? సరైన నాయకత్వలేమి కారణంగా చుక్కాని లేని నావలాగా అవుతుందేమో అని అందరూ భావిస్తున్న తరుణంలో, ఈ ఉద్యోగస్తులు దిశానిర్దేశం చేస్తూ జాగ్రత్తగా సమయమనంతో ముందుకు వెళుతున్నారు. వారికి ఈ సమయములో కావలిసినది ప్రోత్సాహంకానీ, అనుమానపు చూపులు కాదు..
    అర్థం చెసుకోగలరని ఆశిశ్తూ......

    -డా. రమేష్ బాబు బొబ్బిలి

    ReplyDelete
  5. ప్రజాశ్రేయస్సే ప్రధమ కర్తవ్యంగా భావించాలి...అధిష్టానానికి రాహుల్ పి.ఎం. కావడం ప్రథమ కర్తవ్యం.
    ఇన్నాళ్ళు సీమాంధ్ర ప్రజలు ఇది ఇంపాజిబుల్ అన్న ధోరణి లో మౌనం గా ఉన్నారు.అన్ని వర్గాల వారు తమ కేమీ పట్టనట్టు ఉన్నారు.ఎంజీవో లు కూడ తెలంగాన ఉద్యొగుల ఆందోలణ సమయం లో మౌనంగా ఉన్నారు. ఇప్పటికి ధైర్యం వచ్చింది.సీమాంధ్ర ప్రజలకి బుధ్ధి వచ్చినట్లు కనపడడంలేదు. లేకుంటే చంద్రబాబు ఎలా యాత్ర చేయగలుగుతున్నాడు.సమాజం అంటె పార్టీలే కాదు సార్. ప్రతి వర్గం తమ ప్రయోజనాల కోసం యక్టివ్ గా పోరాడాలి. లైక్ లాయర్స్. ప్రతి రంగం లో నిపుణులు తమ పరధి లో చెయవచ్చు కదా.డాక్తర్స్ అంతా విడిపోతే వైద్యసాలలు, మెడికల్ సీట్ల విషయం లో జరిగే న్యాయ అన్యాయాల గురించి ప్రభుత్వ,ప్రజల ద్రిష్టి కి తేవచ్చు కదా? ఏమైనా తెలంగాణా లో అన్ని వర్గాలు తమ వాదనలతో సిధం గా ఉన్నాయి(కొన్ని అభద్దాలతో సహా). మనమింకా చుట్టూ దిక్కులు చూస్తూనే ఉన్నాం.

    ReplyDelete
    Replies
    1. ఈ సీమాంధ్ర, తెలంగాణా గొడవ పక్కనబెట్టి ఆలోచించండి.

      ఎవరీ "అన్ని" వర్గాలు?

      లాయర్లు, డాక్టర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు.. అసలు సమాజంలో కొన్ని సమస్యలకి కారకులు కూడా వీళ్ళే కదా!

      ఈ "వర్గాలు" సామాన్య ప్రజలకి సంబంధించిన సమస్యలపై, ప్రజల తరఫున పోరడాతారనే అభిప్రాయం నాకు లేదు.

      వాళ్ళకేదో నష్టం కలుగుతుందని సమ్మె చేస్తున్నారు. అందులో తప్పేముంది? అస్సలు లేదు. నిస్సందేహంగా వీళ్ళు కూడా ప్రజలలో భాగమే.

      Delete
  6. ఆయనే ఉంటే తెల్లచీరెందుకు అని ఓ మోటు సామెత! ఈ 66 ఏళ్ల కాలంలో మీరన్న పరమ పవిత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆ రాజకీయ పార్టీలే, ఆ మహాన్ నేతలే... మీరన్న ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడి ఉండుంటే... ప్రజలకిన్ని కష్టాలు ఎందుకొచ్చుండేవి? అసలీ తెలంగాణా సమస్య ఎందుకు వచ్చుండేది? తెలంగాణ ప్రాంతంలోని వెనకబాటుతనాన్ని వాడుకొని ఇంతమంది ఇన్ని డ్రామాలు ఎందుకు వేసుండేవారు? దాన్ని అలుసుగా తీసుకుని బ్రిటీష్ వాళ్లకంటే అతి కిరాతకమైన కాంగ్రెస్ హైకమాండ్ తెలుగు ప్రజల మధ్య పెనుచిచ్చును రాజేసుండేదా? ప్రజలిలా ఎందుకు కొట్టుకు చచ్చుండేవాళ్లు? ఇవాళిలా ప్రజలు అన్ని ప్రాంతాల్లో లక్షలాదిగా రోడ్ల మీదకు ఎందుకు వచ్చుండేవాళ్లు? ప్రజా ఉద్యమాల దన్నే లేకపోతే ఈ ఎన్జీవో ఉద్యోగసంఘాలు, ఆర్టీసీ యూనియన్ ల హైదరాబాదులో మీటింగు పెట్టి ఉండగలిగేవాళ్లా? వాళ్లిలా టెంపరరీ హీరోలయ్యుండే వాళ్లా? మీరన్న రాజకీయ పార్టీలే కరెక్టుగా ఉండుంటే అసలు మీరీ పోస్టు రాసి ఉండేవారా? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో మీ బ్లాగు వెయ్యిన్నూటొక్క ముక్కలై అంతర్జాలం నుండి అంతర్థానమైపోతుంది, ఖబడ్దార్ !!! :)

    మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం కాబట్టి, మీ స్వేచ్చను హరించకుండా, దానికి భంగం కలగకుండా నా వాదనను వినిపించే కనీసం ప్రజాస్వామిక హక్కు నాకుందని భావిస్తున్నాను. ఏదీ ఎక్కడుంది ప్రజాస్వామ్యం చూయించమంటే బహుశా నేను చూపించలేనేమో! పోనీ, మాట వరసకన్నా మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం, నియంతృత్వంలో కాదు అని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు ఏ డిమాండ్ మీదనైనా, ఎక్కడైనా, కుండబద్ధలు తమ వాణి వినిపించే కనీస హక్కు అందరికీ ఉంటుంది. ఉండాలి కూడా. పాపం, ఎన్జీవో ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ యూనియన్ లకు ఆ హక్కు లేదంటారా? ఛస్... నీకు ఆ హక్కు లేదు, ఇక్కడ మాట్లాడితే నాలుక్కోస్తాం, అక్కడ మీటింగు పెడితే పీక నులిమేస్తాం, అది చేస్తే తంతాం, ఇది చేస్తే నరుకుతాం అని యే తలమాసిన, పనికిమాలిన సన్నాసి పొలిటీషియన్ అంటే (సాధారణంగా ఏ ప్రాంత ప్రజలు కూడా ఇలాంటి నీచస్థాయి భాష వాడరు) వాణ్ని మక్కెలిరగతన్ని జీవితాంతం బొక్కలో పడేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది. మరోమాట, మతోన్మాదం తలకెక్కి ఎవరైనా మైనారిటీల మీద అడ్డదిడ్డంగా వాగినా, పిచ్చి పట్టిన మైనారిటీ లీడర్లెవరైనా మిగతావారి మీద విషం గక్కినా కూడా... వాళ్లకు ఇలాంటి గతే పట్టించాలి. మీరన్న రాజకీయ నాయకుల చలవ వల్ల అవేవీ జరగవు. ప్చ్, ఏం చేస్తాం! మనం పరమపవిత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం మరి. నిజానికి ప్రజలు దేనిని సాధించుకోవాలన్నా... వాదనా బలం చేత, ఉద్యమ బలం చేత సాధించుకోవాలి. సాధారణ ప్రజలే తమలో తాము ఒకరి మీద ఒకరు విద్వేషం చిమ్మి, తలలు పగులగొట్టుకుని కాదు. ఎవరు ఏ ప్రాంతంలోనైనా తమ వాణిని స్వేచ్ఛగా, ధైర్యంగా వినిపించగలిగే మినిమమ్ డెమోక్రటిక్ అట్మాస్పియర్ ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ మీరన్న గ్రేట్ రాజకీయ పార్టీలు, నాయకులు అలా చేయకుండా, కేవలం వారి ఓట్ల-సీట్ల స్వార్థం కోసం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాడుకుని రావణకాష్టం రాజేసి నీరోల్లాగా ఫిడేల్ వాయించుకుంటున్నారు. ఏ ప్రాంతం ప్రజలైనా, దేన్నైనా క్వశ్చన్ చేయగలిగే డెమోక్రటిక్ వాతావరణం ఎందుకు ఉండాలంటే... ఒక ప్రాంతం పొలిటీషియన్ ఇవాళ వేరేప్రాంతం వాణ్ని నోరెత్తితే నాలుక్కోస్తానని అన్నాడంటే, రేప్పొద్దున ఖర్మకాలి కష్టాలు భరించలేక ఆ ప్రాంత ప్రజలే గళం విప్పితే పీక కోస్తానని అనడని గ్యారంటీ ఏంటి? అన్ని రకాల పబ్లిక్, ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేయడమే పనిగా పెట్టుకుని... అన్ని పార్టీలు ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు కలిసున్నా సరే, విడిపోయినా సరే సమస్యలు పెరగడానికి మాత్రం మ్యాగ్జిమమ్ గ్యారంటీ ఎలాగే ఉండనే ఉంది. అందుకే, ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా... మీరు ప్రస్తావించిన రాజకీయ నాయకుల్ని ప్రశ్నించి నిలదీయగలిగే డెమోక్రటిక్ రైట్ ను కాపాడుకోవాలి? అది చాలా అవసరం.

    నిజానికి ఇరు ప్రాంతాల ప్రజలు తమను పట్టిపీడిస్తున్న అన్నిరకాల సమస్యలకు అసలు కారణం... నేడు పూర్తిగా అవకాశవాదంలో, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయపార్టీలు, నేతలు, పాలకులే అనే విషయాన్ని గుర్తించి... వీళ్ల ఉద్యమాలన్నీ వాళ్లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టి ఉండింటే అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటికే సాల్వ్ అయిపోయుండేవి. మన దురదృష్టం. మనం మనలో మనమే కొట్టుకుంటున్నాం. మీరన్న గ్రేట్ రాజకీయ నాయకులు మాత్రం... ప్రజల్ని వాళ్లలో వాళ్లే నిత్యం కలహించుకుని కొట్టుకునే పవిత్ర కార్యాన్ని నిర్విఘ్నంగా, సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలుగుతున్నారు. మిక్కిలి సంతోషం. ఇక ఎన్జీవోలు, ఆర్టీసీ యూనియన్ లు హీరోలవుతారంటారా? కానివ్వండి. ఎవరు ఎక్కడైనా గొంతు విప్పగలిగే డెమోక్రటిక్ వాతావరణానికి నాంది పలికిన వాళ్లు కొంతకాలం హీరోలైతే మీ రాజకీయ నాయకులకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? నాకైతే అదేం పెద్ద ప్రమాదకరంగా కనిపించడం లేదు.

    ReplyDelete
    Replies
    1. మనలని ఆలొచనలు,విష్లేషణులు కాకుండా ఆవేశం మరియు మూర్ఖత్వం ఫ్రబావితం చేయగలిగినంత వరకు ….

      మన జీవన విధానాన్ని ఆభివ్ర్రుద్ధ్హిని ఫ్రాంతాల మధ్య గీతలు ఫ్రబావితం చేయగలవు అని నమ్ముతున్నంత వరకు ……

      ఫ్రజస్వామ్యం అనే ముసుగులొ ఆధునిక రాచరిక బానిసత్వానికి అలవాటు పడిపొయినంతవరకు ……

      ఫ్రసార మాధ్యమాలు వాణిజ్య మాధ్యమాలుగా మిగిలినంత వరకు …..

      మనిషికి నాయకత్వపు కొరిక ఉద్భవించిన ప్రతి సారి మనుషులు మధ్య ప్రాంతల మధ్య గీతలు గీయడానికి పెద్దగా కారణాలు సమయం అవసరం లేధు
      నిర్ధిష్టమైన పద్ధతిలొ నిర్ణీతమైన సమయంలొ సరిదిద్ద గలిగే సమస్యలు కూడ విభజనకు కారణం అయినప్పుదు దానిని సరి దిద్దే అవకాశమే లేనప్పుదు కేవలం విభజనే పరిష్కారం అని నమ్ముతున్నంతవరకు..

      డార్విన్ సిద్ధాతం ప్రకారం ప్రస్తుత పరిస్తితులు కూడ కాలగమన ఆధారిత మర్పు లొ బగం అని సర్ధుకు పొదాం...

      తొక మీ బషలొ...
      మా తెనాలి లొ చిన్నప్పటి నుండి చూసిన సత్యన్నారాయణ టాకీస్ రోడ్ లొని పులి బొంగరాలు అమ్మే పెంకుటిల్లులు అక్కడ పెరుగు అమ్మే వాళ్లు మయ మైనప్పుదు మాకు జరిగిన నష్టం ఎమి లేక పొయిన ఎదొ వెలితి..అలాగే ఇప్పుడు కూడ...చిన్నపటి నుంచి పుస్తకాల్లొ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసి చూసి ఉన్నాం కదా

      యేమైన సంకుచితం గా అర్దరహితంగా భాషిస్తె క్షమించండి.











      Delete
  7. మన రాజ్యాంగానికి మూర్తీభవించిన ప్రతినిధి మన రాష్ట్రపతి అని

    నాకున్న స్వల్ప పరిజ్ఞానం ప్రకారం నేనను కుంటున్నాను....అదే నిజమైతే ...

    "నా ఈ కిరీటము ముప్పై కోట్ల భారతీయులకూ చెందుతుంది" అని

    మన ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబూరాజేంద్రపసాద్ గారు

    రాష్ట్రపతిగా తన మొదటి ప్రసంగములో చెప్పినారని... ఆకాశవాణి కడప కేంద్రం

    నుండి ప్రసారం కాగా నేను విన్నాను. అంటే భారత దేశ పౌరసత్వం కలిగిన ప్రతి

    ఒక్కరూ మకుటం లేని రాష్ట్రపతి అని మన రాజ్యాంగం నిర్దేశించిందనే కదా

    దాని అర్థం! అంటే పౌరులందరూ ఎంతో హుందాగా వివేకవంతులై మనదేశ పరిపాలనపట్ల

    సంపూర్ణ అవగాహనా పటిమ కలిగి వుండాలి కదా? .. వాస్తవ పరిస్తితి ప్రస్తుతం

    ఎలావుంది? 65యేళ్ళ స్వాతంత్ర్య పాలనలో, 62యేళ్ళు పైబడిన గణతంత్ర అమలులో

    దేశ ప్రజల వివేక సంపత్తి ఎలా వుంది ? పుష్కళ మైన అజ్ఞానముతోనూ దుర్భర

    దారిద్ర్యం తోనూ భావదారిద్ర్యం తోనూ కూడి ఉంది. చాలా మంది ప్రజా

    ప్రతినిధులు మరియు అధికారుల దృష్టిలో ప్రజలు కనీసం మనుషులుగా నైనా

    చూడబడుతున్నారా?

    మరీ ముఖ్యంగా పరిపాలనలో ప్రజల భాగస్వామ్యము కొరకు,

    వారి విజ్ణాన అభివౄద్ధి కొరకు ఇంత సుదీర్ఘ కాలంలో

    ప్రభు త్వాలు తీసుకున్న శ్రద్ధ్హ యేమిటి ? పథక రచన యేమిటీ

    అంటే...ఎంతమాత్రం లేదు.విభజించు.. పాలించు అనే ఆంగ్లేయుల రాజ

    నీతిని యధా తథంగా అమలులో ఉంచి ..

    సమాజంలో బలహీన వర్గాల వుధ్ధరణ నెపంతో రిజర్వేషన్లు అనే పేరు పెట్టి,

    సమాజాన్ని రకరకాలుగా అసంఖ్యాకంగా విడదీసి... అనేక వర్గాల మధ్య వైషమ్యాలను

    సృష్టించి, బలమైన భేదభావాలను సమర్థ వంతంగావంతంగా సుస్థిరం చేయ గలగడమే

    వీరు చేసిన.. చేస్తున్న మహా కృషి.! ఈదెబ్బతో దేశ పౌరుల్లో దేశ సమైక్యతా

    పటిష్టతా దేశభక్తీ అనే భావాలు, వాటి అర్థమూ అనేవి మచ్చుకైనా లేకుండా

    పోయినాయి. ఇటువంటి మాటలు వారు విన్నప్పుడు అవేవో వింతశబాలుగా అనిపించినా

    ఆశ్చ్యర్య పోకూడని పరిస్తితులలో మనమున్నాము.

    నిరక్షరాశ్యులు మొదలు, మహావిద్యా వంతుల వరకూ

    "రాజకీయాలలో ప్రవేసించడము అంటే అడ్డదారిన ప్రజల

    సొమ్మును దండుకోవడం కోసమే" అనేది సర్వ సాధారణ మైన భావంగా వుండిపోయింది.

    ప్రజాసేవ అనేది ఒక హేళన సందర్భంలొ వాడే పదం గానూ, రాజకీయము అంటే అది

    మోసానికి, ద్రోహానికీ పర్యాయ పదం గానూ చలామణిలోకి వచ్చేశాయికదా!
    ఇదీఇప్పటి భారతదేశ ల standard.

    " తిక్కోడిపెళ్ళిలో తిన్నోడేబుద్దిమంతుడు" అనేది రాయలసీమలోని ఓక సామెత.

    దాని ప్రకారంగా రాజకీయాలలో

    అడ్డగోలుగా ఎంత పెద్దమొత్తం సంపాదిస్తే అంత పేద్ద హీరో అన్నమాట. సదరు

    హీరో పైన అవినీతి ఆరోపణ వస్తే ప్రజల స్పందన ఎలా వుంటుందంటే....

    అదే విధంగానే సంపాదించు కున్న వేరే వాళ్ళను ఉదహరిస్తూ, "వాళ్ళు సందించుకోలేదా

    సంపాయించుకోనీ..ఎవ్వరబ్బా సంపాయించుకోని వాళ్ళూ? " ఇదీ ఇప్పటి మన

    ప్రజల అవగాహనా పటిమ.

    ఈ అజ్ఞానాన్ని ఆసరాగా తీసుంటున్న వారి ప్రతినిధులు వంద తరాలకు సరిపడా

    నిధులు సమ కూర్చు కొనేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా!

    మనం ఎంతటి పవిత్రమైన రాజ్యాంగాన్ని రూపొందించు కున్నా ఆత్మశుధ్ధీ

    నిజాయితీ లోపించి నప్పుడు ఎత్తులకు లోటుండదు.

    పూర్వం పాశ్చ్యాత్య దేశాలలో చక్రవర్తులు నీగ్రోలమధ్య కత్తి యుధ్ధాలు నిర్వహించి

    వినోదించేవారట.అంతకు ఏమాత్రం తీసిపోవు మన ప్రతినిధుల ఈ చర్యలు.

    ReplyDelete
  8. Except those in military every citizen has right to protest in a democracy.

    ReplyDelete
  9. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలే ప్రజలకి జవాబుదారితనం వహించాలి.. వహిస్తాయి.

    జనాభాలో 0.5% అయిన గుమాస్తాలు (NGO కి తెలుగు పదం) మిగిలిన 99.5% ప్రజలకి ప్రతినిధులు కాదు. వాళ్ళు గుమాస్తాలకి మాత్రమే ప్రతినిధులు.

    (గుమాస్తాలకి సమ్మె చేసే హక్కు లేదని నేను నా పోస్టులో ఎక్కడా రాయలేదు.)

    ReplyDelete
  10. రావిశాస్త్రి కథల్లో మందు తప్ప మిగిలిన విషయం మీకెక్కలేదు అనిపిస్తాంది..

    రాజకీయ పార్టీలు జవాబుదారి ఎందుకు వహించాలి?
    అవి అవసరార్థం రాజకీయం చేసి వాటి పబ్బం అవి గడుపుకుంటాయి.

    అణగతొక్కబడ్డవాళ్ళ నుంచి ఉద్యమం మొదలవుద్ది.. తెలంగాణా ఐనా, సమైక్యాంధ్రా ఐనా.
    ఉద్యోగులకి ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళు రోడ్డుమీదకొచ్చారు.
    బాబు ఇల్లు మునిగి పోతుందేమో అని ఆయన రోడ్డెక్కాడు...
    అంతేగానీ, బాబు గానీ, సోనియాగానీ ఎవరికి జవాబు చెప్పల్సిన అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. >>ఉద్యోగులకి ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళు రోడ్డుమీదకొచ్చారు.

      నాది కూడా ఇదే అభిప్రాయం.

      >> అంతేగానీ, బాబు గానీ, సోనియాగానీ ఎవరికి జవాబు చెప్పల్సిన అవసరం లేదు.

      వీళ్ళే చెబుతారు. చెప్పాలి కూడా. ఆ విషయం రాబోయే ఎన్నికల్లో తేలుతుంది.

      Delete
  11. NGOs ప్రజలకు ప్రతినిధులమని ఎక్కడా చెప్పలేదు. కానీ వాళ్ళ ఆకాంక్షలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించింది, ఎందుకంటే వాళ్ళుకూడా ప్రజలలో భాగమే కాబట్టి. రాజకీయ నాయకులకు ఈ విభజన వల్ల నష్టం లేకపోవచ్చు, ఎందుకంటే కనీసం కొన్ని మంత్రి పదవులు, మరో ముఖ్య మంత్రి పదవి పెరుగుతాయి. కనీసం 40000 మంది ఉద్యోగులకు తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్య పద్దతిలో తమ నిరసన తెలియచేయటం లో తప్పేముంది.

    ReplyDelete
    Replies
    1. >>వాళ్ళుకూడా ప్రజలలో భాగమే కాబట్టి.

      ఈ సంగతి ఉద్యోగస్తులు సదా గుర్తుంచుకుంటే సంతోషం. పేదప్రజలు, సామాన్య మానవులతో (దురదృష్టవశాత్తు ప్రభుత్వంతో వీళ్ళకే ఎక్కువ పని) వీళ్ళు వ్యవహరించే తీరు చాలా దారుణంగా ఉంటుంది.

      (మీరు ఉద్యోగస్తులైతే వెరీ సారీ.)

      Delete
    2. డాక్టరు గారు,

      ఆంధ్రజ్యోతి లో 11వ తేదిన ఆర్టికల్ (ప్రతీక పవిత్రతలు వద్దు - యడవల్లి రమణ) మీరు రాసినదేనా?

      Delete
    3. @Kishore,

      అవునండి.

      (నా బ్లాగులో పబ్లిష్ చేస్తున్నాను.)

      Delete
  12. రమణ గారు,

    మీకు వీలున్నప్పుడు ఈ వ్యాసం చదివేది. టపాకు నేను ఇచ్చిన లింక్ కు సంబంధం లేదు
    .
    THE GATHERING STORM

    India’s collapse is picking pace.By Gautam Sen (9 September 2013)


    http://newsinsight.net/Thegatheringstorm.aspx#page=page-1

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.