'ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు బాగా మందు తాగుతుందట! అంచేత ఆవిడ ఎన్నికల్లో నిలబడితే ఎవరూ ఓటెయ్యరట!'
ఇట్లాంటి చెత్త ఏ గల్లీస్థాయి కార్యకర్తో వాగితే.. అస్సలు పట్టించుకోం. కానీ - ఏదో ప్రొఫెసర్ గిరి, కేంద్రమంత్రి గిరి కూడా వెలగబెట్టిన ఓ ప్రబుద్ధుడు ఈ విధంగా సెలవిచ్చాడు. చదువుకి, సంస్కారానికి పొంతన ఉండాల్సిన అవసరం లేదని మరొకసారి ఋజువు చేశాడు.
పబ్బులకి మగవాళ్ళు వెళ్ళొచ్చు, ఆడవాళ్ళు మాత్రం వెళ్ళకూడదనే భావజాలం కలిగిన పార్టీకి చెందిన వ్యక్తిగా ఆ పెద్దమనిషికి అలా అనిపించొచ్చు. కాబట్టి ఆయనకి ఆల్కహాల్ తీసుకునే ఆడవాళ్ళు చెడ్డగా కనిపించొచ్చు.
సిగరెట్లు, ఆల్కహాల్ వాడటం ఆరోగ్యానికి హానికరం. ఇందులో వేరే అభిప్రాయానికి తావు లేదు. కానీ కొందరి దృష్టిలో ఈ అలవాట్లు మగవాళ్ళ విషయంలో తప్పుకాదు.. అడవారి విషయంలో మాత్రమే తప్పు! ఇందులో లాజిక్ అర్ధం కాకపోతే మీ ఖర్మ.
చట్టప్రకారం కొన్నిరకాల అలవాట్లకి వయసు పరిమితులు ఉన్నాయే కానీ, ఆడామగా నిబంధనలు లేవు. ఈ విషయం ఆ మేధావిగారికి బాగానే తెలుసు. కానీ ఎన్నికల సమయం.. ఏదో చెత్త వాగితే నాలుగు ఓట్లు రాలకపోతాయా అనే విపరీత మనస్తత్వం, లేదా నాయకత్వ దృష్టిని ఆకర్షించుకునే చౌకబారు ఎత్తుగడ.
ఆల్కహాల్ మోతాదు మించి రోజువారీ తీసుకుంటే, దానికి అలవాటు పడిపోతారు. ఈ స్థితిని alcohol dependence syndrome అంటారు. క్రమేపి లివర్, మెదడు వంటి internal organs దెబ్బ తింటాయి. ఇదొక వైద్యం చేయాల్సిన మెడికల్ కండిషన్. anatomical గా ఆడామగలకి genital organs లో తప్ప మరే internal organs లో తేడా ఉండదు.. తేడా అంతా బుద్ధుల్లోనే!
(picture courtesy : Google)
ఇవ్వాళ ఉదయాన్నే ఒళ్ళుమండిపోయింది. పేపర్లో ఈవార్త చదివి.
ReplyDeleteమీరడిగిన ప్రశ్నగురించి బ్లాగులోకంలో చానాళ్ళక్రితం చాలా చర్చ జరిగింది. శరత్'కాలం' గారడిగిన ఒక ప్రశ్న చర్చని దాదాపు ఒక కొలిక్కితీసుకొచ్చింది. కుదిరితే చదివి తరించండి.
మందు మోతాదు మించి పోయి ఉంటుంది లెండి ప్రభద్దుడి గారికి.
ReplyDeleteAs a psychiatrist you should not even recomment limited dose of alcohol. Alcohol can also cause memory loss. What happens if a patient who already has alzheimers, drink alcohol?
ReplyDelete
ReplyDeleteఇక్కడ ప్రశ్న ఆయనకీ కొంత కూడా మందు ఇవ్వక ఆవిడే తాగిసిందని ఆయన బాధేమో మరి ! అర్థం జేసుకోరూ !!
జేకే !
ఆల్ క్యా హాల్ హై !!
చీర్స్
జిలేబి
A couple of things about alcohol and gender here. Excessive drinking is a problem for any sex (yes, either sex would be better English, but, now transgender is the third sex group per the SC) and moderate drinking indeed has cardiovascular health benefits. Women do need to be somewhat more cautious in drinking because they lack an enzyme that neutralizes some of the consumed alcohol in the stomach (alcoholic dehydrogenase) unlike men and hence get a greater high for a given amount of alcohol and have a relatively early onset of cirrhosis compared to men. Alcohol dependence or alcoholism is a different matter altogether which does impair the functioning of a person and can be seen as a valid reason not to elect such a person to high office. Although, Churchill for example was famous both for his ability to swill whiskey as well as providing great leadership during the second world war. But, I must caution that binge drinking as usually happens in India in group drinking sessions is not very healthy and people must pace their drinking.
ReplyDeleteI wanted to bring the difference in sex (male vs female) and I'm glad you brought it out GI DOC. That's why though the legal blood alcohol level limit is the same for both men and women, the number of drinks that get you there are less in women.
ReplyDeleteఅందుకే అన్నారు మంచి కయినా చెడు కయినా తోడు ఉంటే బెటరని,ఇప్పుడు చూడండి ఆవిడ తోడు లేకపోవటం వల్ల కదా సపోర్టు లేకుండా ఒంటరి అయిపోయింది - పాపం:-)
ReplyDeleteAny vice impacts woman more than men like poverty. Addiction on part of anyone to anything is a total lack of responsibility. Unfortunately nature does not value equality much.
ReplyDeleteరమణ గారూ, పై వ్యాఖ్య ఎవరు ఎవరి గురించి అన్నారు? ప్రస్తుత వాతావరణంలో ఇది తెలిస్తే తప్ప అభిప్రాయం చెప్పడం కష్టం.
ReplyDeleteమన అభిమాన పార్టీ/నాయకుడు ప్రత్యర్థులను విమర్శిస్తే వచ్చే స్పందనకు, వ్యక్తులు తారుమారు అయితే వెళ్లగక్కే ఉక్రోషానికి భూమ్యాకాశాల తేడా ఉంటుంది. ఉ. పవన్ కళ్యాణ్ దృష్టిలో జగన్ అవినీతి ముందు గాలి చిరుతిళ్ళు లెక్కలోకి రావు.
I therefore can react in detail only if you disclose the names.
It seems reg Subrahmanyan Swamy comments on Priyanka Gandhi. In Doc's interpretation
DeleteThank you sir. ఇద్దరి మీద నాకు పెద్దగా కోపం కానీ అభిమానం కాని లేవు. అంచేత నో కామెంట్సు!
Deleteఈ పోస్టులో కొందరి కామెంట్లు పబ్లిష్ చెయ్యట్లేదు.. వారికోసం చిన్న వివరణ.
ReplyDeleteనా జ్ఞానాన్ని ప్రశ్నించేవారికి, నన్ను ఎడ్యుకేట్ చేద్దామని ప్రయత్నించేవారికి, నన్ను తిట్టేవారికి.. అందరికీ నమస్కారం.
నేను టన్నుల కొద్దీ అజ్ఞానంతో, పని లేక.. ఏవో నాలుగు ముక్కలు రాసుకుంటున్నాను. నాకు మీతో వాదించేంత విజ్ఞానం లేదు. దయచేసి నన్ను వదిలెయ్యండి, థాంక్యూ!
మిత్రులారా,
ReplyDeleteఈ పోస్టులో నేను పబ్లిష్ చేసినవాటి కన్నా, చెయ్యని వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. కొన్ని ఎగతాళిగా, మరికొన్ని బెదిరింపు ధోరణిలో ఉన్నాయి. అందుకనే మళ్ళీ వివరణ ఇస్తున్నాను.
బిజెపి ఆడవాళ్ళ గూర్చి ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు ఇట్లాంటి కామెంట్ చేస్తే వ్యతిరేకించేవాళ్ళా? అంటూ ఒకాయన ప్రశ్నించాడు, తప్పకుండా వ్యతిరేకించేవాణ్ని. అసలీ తాగుడు రిఫరెన్స్ భాషే వ్యక్తిగతంగా దాడి చేసే ఒక నీచసంస్కృతి అనుకుంటున్నాను. ఒక నాయకురాలు తాగుబోతు అని ఆరోపించడం వల్ల, ఆ నాయకురాలికి కలిగే రాజకీయ నష్టం అటుంచి, ఆ ఆరోపణ చేసిన చేసిన వ్యక్తి యొక్క హీనమైన మానసిక స్థితి సూచిస్తుంది.
ఫలానా సమయంలో నేను ఏమీ మాట్లాళ్ళేదు అనేది ఇంకో ఆరోపణ. ప్రతి సందర్భంలోనూ నేను పోస్ట్ రాయలేను. నా బ్లాగులో నాకున్న తీరిక సమయంలో నాలుగు ముక్కలు రాసుకుంటూ ఉంటాను, నేనేమీ పత్రిక నడపట్లేదు. ఇది నాకు హాబీ మాత్రమే. నాకు కుదిరినప్పుడు, నా ఇష్టం వచ్చిన టాపిక్ మీద నాకు నచ్చిన విధంగా రాసుకుంటాను. అందువల్ల - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.
నా బ్లాగ్ పోస్టుల్లో కొంపలు మునిగేంత విషయం ఉండదు. విజ్ఞానం కూడా ఉండదు, ఇది పూర్తిగా నా అజ్ఞాన వేదిక మాత్రమే. కాబట్టి దయచేసి మేధావులు నా పోస్టులు చదవొద్దని.. ఇటువైపు రావొద్దని.. అసలు పట్టించుకోను కూడా వద్దని మనవి చేసుకుంటున్నాను.
చివరగా - బిజెపి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అవినీతి గూర్చి ఎంతైనా ప్రశ్నించవచ్చు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు బిజెపి పార్టీ యొక్క హిందూత్వ ఐడియాలజీ గూర్చి ఎంతైనా మాట్లాడవచ్చు.. అది ఆయా పార్టీల రాజ్యాంగ హక్కు. కానీ - దానికో రాజకీయ భాష ఉంటుంది. అంతేగాని రాజకీయ ప్రత్యర్ధుల్ని వ్యక్తిగతంగా కించపరిచే నీచభాష వాడే కుసంస్కారుల్ని (వాళ్ళు ఏ పార్టీ వాళ్లైనా, ఎంత పెద్ద జ్ఞానులైనా) తిప్పికొట్టాలి అనేది నా అభిప్రాయం. అందుకే ఈ పోస్ట్ రాశాను.
ఈ పోస్ట్ నచ్చనివారికి మరొక్కసారి నమస్కారం.. ఇంక ఇటు రాకండి.