పులిని చూపించి 'ఇది పులి' అని చెప్తే నవ్వొస్తుంది. అలాగే పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు 'హేమమాలిని' అని రాస్తే కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే - హేమమాలిని పరిచయం అవసరం లేని వ్యక్తి (ముఖ్యంగా మా వయసు వాళ్లకి).
హేమమాలిని ప్రస్తుతం బిజెపి తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఉంది. ఆవిడ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న ఫొటోలు అడపా దడపా న్యూస్ పేపర్లల్లో కనబడుతూనే ఉన్నయ్. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా నాకు పాతరోజులు గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుంది.
నేను పదో క్లాసులో ఉండగా నాజ్ అప్సరలో 'సీతా ఔర్ గీతా' అనే హిందీ సినిమా విడుదలైంది. హేమమాలిని ద్విపాత్రాభినయం. నాకు హేమమాలిని పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే సినిమా రెండుమూడుసార్లు చూశాను. కానీ బయటకి చెప్పుకోలేని దుస్థితి. అందుక్కొన్ని కారణాలున్నయ్! ఏమిటవి?
అడవికి సింహం రాజు. కవులు సింహం జూలు, సన్నని నడుం అందానికి చిహ్నంగా రాస్తారు. అడవిలోని జంతువులకి కవులకున్న కళాహృదయం ఉండదు, కానీ - చావు భయం మాత్రం ఉంటుది. అందుకే వాటికి సింహం పంజా దెబ్బన్నా, కండల్ని చీల్చేసే వాడికోరలన్నా భయం. అంచేత సింహం కనబడితే అవి భయం చేత పక్కకి తప్పుకుంటాయ్. రాజంటే కూడా సామాన్య ప్రజలు అలాగే భయపడాలని కవుల అభిప్రాయం కావొచ్చు, అందుకే సింహాన్ని మృగరాజుగా నిర్ణయించేశారు.
సరే! ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం (ఉన్నామా?!), ప్రజలు ఓట్లేస్తేనే లీడర్. అందుకే వాళ్ళు ఓట్లేయించుకోడానికి కుక్కపాట్లు పడతారు. ఎలక్షన్ల సమయంలో సామాన్య ప్రజలు తక్కువ ఆలోచిస్తారు, ఎక్కువమంది ఓట్లేస్తారు. మేధావులు ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువమంది ఓట్లేస్తారు!
అడవిలో సింహం కాకున్నా, ఎలక్షన్లో నించోకున్నా.. సూర్యం మా బ్రాడీపేట గ్యాంగ్ నాయకుడుగా ఉన్నాడు. బంగారానికి వెండి తలవంచినట్లు, హెడ్ కానిస్టేబుల్ కి కానిస్టేబుళ్లు ఒదిగుండినట్లు మేం కూడా సూర్యం లీడర్షిప్పుని ఒప్పేసుకున్నాం (మా బ్రాడీపేట గ్యాంగ్ గూర్చి ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అనే పోస్టులో కొంత రాశాను).
ప్రజాస్వామ్య స్పూర్తిలో సూర్యానికి ఇందిరా గాంధీ ఆదర్శం. అందుకే - సూర్యానికి నచ్చినవే మనక్కూడా నచ్చాలి, నచ్చకపోతే మనక్కూడా నచ్చరాదు. ఎదురు మాట్లాడినవాడు అసమ్మతివాదిగా నింద మొయ్యాలి. వాడిపై సిబిఐ, ఎఫ్బిఐ మొదలైన నిఘాలు కూడా ఉంచబడతాయ్. ఇది మాకందరికీ ఏదోక స్థాయిలో అనుభవమే కాబట్టి 'బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్'గా ఉండేవాళ్ళం (లేనిచో బ్రతుకు దుర్భరం చేస్తాడని తెలుసు).
మా గ్యాంగ్ లో ఏ విషయంలోనైనా (ఏకపత్నీవ్రతుళ్ళా) ఒక్కళ్ళనే ఇష్టపడాలి. మేమందరం గుండప్ప విశ్వనాథ్ అభిమానులం. గవాస్కర్ అభిమానులకి మాలో చోటు లేదు. ఏకకాలంలో విశ్వనాథ్, గవాస్కర్ల అభిమానిగా ఉండరాదు, రూల్సు ఒప్పుకోవు!
మా నాయకుడు సూర్యం రేఖ అభిమాని. కావున టెక్నికల్ గా నేను కూడా రేఖ అభిమానిని. ఇప్పుడు నాకు హేమమాలిని నచ్చిందంటే.. పార్టీ మారే రాజకీయ నాయకుళ్ళా చాలా వివరణ ఇచ్చుకోవాలి. అందుకు నేను సిద్ధంగా లేను.
నాజ్ అప్సర తెరపై 'సీతా ఔర్ గీతా' చూస్తున్నాను.
"కిశోర్ 'హవా కె సాథ్ సాథ్.. ' భలే పాడాడు కదూ?"
'ఊతప్పానికి ఉల్లిపాయలే రుచి' అనే సత్యాన్ని ప్రపంచంలో మొదటిసారి కనుగొన్నవాళ్ళా అన్నాడు సూర్యం (మావాడికి కిశోర్ కుమార్ పిచ్చి).
"అవునవును"
అమెరికా అధ్యక్షుడి మాటకి తల ఊపే ఇండియా ప్రధాన మంత్రిలా అన్నాను.
(కిశోర్ కుమారా? గాడిద గుడ్డేం కాదు! ఇక్కడ ఫుల్లుగా హేమమాలినిని చూసేస్తున్నా.)
'షోలే' మొదటిరోజు ఈవెనింగ్ షో చూశాం. దార్లో బ్రిడ్జ్ పక్కన బలరాం హోటల్లో టీ తాగుతున్నాం.
"సినిమాకి అమితాబ్ చచ్చిపోయ్యే సీన్ హైలైట్."
నిండుసభలో శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన పద్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా.. తల పంకిస్తూ అన్నాడు సూర్యం.
అదే సభలో ముందునించి మూడో వరసలో నించున్న నాలుగో భటుడిలా, వెంటనే.. "అవునవును!" అన్నాను.
కానీ నాకు హేమమాలిని 'బసంతి' సీన్లే నచ్చాయి. అయితే ద్రోహులే అతి వినయంగా ఉంటారని ఆ రోజు అనుభవ పూర్వకంగా గ్రహించాను. అందుకే - మనసులోని నా 'రాజద్రోహ కుట్ర' (హేమమాలిని అభిమానం) బయట పడనీకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాను.
మెడిసిన్ కోర్స్ అయిన వెంటనే సూర్యం బ్రాడీపేట వదిలేసి అమెరికా వెళ్ళిపొయ్యాడు. రాజు లేని రాజ్యం దిక్కులేనిదైపోయింది. అటు తరవాత సామంత రాజులూ దేశాలు పట్టిపోయారు. ఆ విధంగా మా బ్రాడీపేట గ్యాంగ్ ఆనతి కాలంలోనే ఎండలో ఉంచిన వెనిలా ఐస్ క్రీములా కరిగిపోయింది.
తరవాత కాలంలో హేమమాలిని ఏం చేసిందో తెలీదు, తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఎలక్షన్ల సందర్భంగా హేమమాలిని మొహం కనబడుతుంది. ఆమెలో ఇంకా అదే అందం, అదే డిగ్నిటీ. వావ్!
ప్రతి మనిషికి జీవితంలో ఒక్కోదశ ఉంటుంది. చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం, సినిమాలంటే ప్రాణం. ఒకప్పుడు హేమమాలిని అందాన్ని అభిమానించాను. ఇవ్వాళ నా దృష్టిలో అందానికి వీసమెత్తు విలువ కూడా లేదు.. అదసలు విషయమే కాదు. ఇవన్నీ సహజమైన పరిణామాలని అనుకుంటున్నాను.
హేమమాలిని ఈరోజుకీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమైయ్యుంటుంది? బహుశా హేమమాలినికి సావిత్రి, మీనాకుమారిల్లాగా కష్టాలు లేకపోవటం ఒక కారణం అయ్యుండొచ్చు. ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నవాణ్ని వివాహం చేసుకున్న సినిమా హీరోయిన్లు (ఎక్కువమంది) ఇబ్బందుల్లో పడ్డారు. కొందరు మాత్రమే హేపీగా ఉన్నారు. ఆ కొందర్లో హేమమాలిని ఉంది. అందుకు ధర్మేంద్రని అభినందించాలి.
చివరగా - నా జీవితంలో ఒకానొక దశలో నన్ను అలరించి, ఆనందింపచేసిన హేమమాలిని.. కడదాకా ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బెస్టాఫ్ లక్ టు హేమమాలిని!
అంకితం :
నా జీవితంలో అతిముఖ్యమైన రోజుల్లో నాకు తోడుగా ఉన్నవాడు, నా ప్రియాతి ప్రియమైన నేస్తం సూర్యంకి (Dr.Surya P Ganti, cardiac anaesthesioligist, New Jersey, USA.).
If he doesn't respond to this వాణ్ణి తొసి నే రాజంటాను!! I guess he didn't boss me that much. వాణ్ణి తొసి నే రాజంటాను!! నా ఫస్టు హేమమాలిని సినిమా Johnny Mera naam . పాట లింక్ పెడుతున్నా. ఇది ఆరో క్లాసులో చూసా అప్పుడే హేమమాలిని తో పడి పొయ్యా!!!
ReplyDeletehttps://www.youtube.com/watch?v=eqnjHf7PXjs#t=11
హేమమాలిని తో నా ఫోటో ఈమైల్ లో పంపిస్తా!!!
గౌతం
నువ్వు ఫొటోలో బాగా పడ్డావు. హేమమాలిని కూడా బాగానే దిగింది.
Deleteనువ్వు పడ్డా, హేమమాలిని దిగినా.. మొత్తానికి ఫొటో బాగుంది.
ప్రాణ్ జాయె పర్ వచన్ న జాయె . అప్పటికి ఇప్పటికి ఎనాటికైన రేఖాకే ప్రధమ స్థానం. డ్రీంగర్లు కు ద్వితీయ స్థానమే . చాల బాగుంది నీ బ్లాగు ,మరొక్కసారి చిన్న ఫ్లాష్ బాక్ ఇచ్చావు . నీ అభిమానం బలరాం టీ స్టాల్ లో తిన్న కలా కన్ కన్న తీపిగా ఉంది . నువ్వన్నదే నేను కూడా అంటున్నాను ఈ భూ మండలం లో అతి గొప్ప చోటు మన బ్రాడిపేటే . దానికి పోటీయె లేదు .
ReplyDeleteసూర్యం
ప్రాణ్ జాయె పర్ వచన్ న జాయె! అన్నట్లు ఇది రేఖ సినిమా కదూ? నువ్వు (బలవంతంగా) నాచేత ఈ సినిమా రెండుసార్లు చూపించినట్లు జ్ఞాపకం.
Deleteనువ్విక్కడ లేవనే ధైర్యంతోనే నా ఇష్టాయిష్టాలు రాస్తున్నాను మిత్రమా.:)
"'ఊతప్పానికి ఉల్లిపాయలే రుచి.
ReplyDeleteఅమెరికా అధ్యక్షుడి మాటకి తల ఊపే ఇండియా ప్రధాన మంత్రిలా అన్నాను.
నిండుసభలో శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దన పద్యాన్ని మెచ్చుకుంటున్నట్లుగా..
అదే సభలో ముందునించి మూడో వరసలో నించున్న నాలుగో భటుడిలా
అయితే ద్రోహులే అతి వినయంగా ఉంటారని ఆ రోజు అనుభవ పూర్వకంగా గ్రహించాను."
అద్బుతః
థాంక్యూ, ఎంతైనా 'రావిష్టు'లం కదా!
Delete"తరవాత కాలంలో హేమమాలిని ఏం చేసిందో తెలీదు"
ReplyDeleteఅయ్యో! మీరు "బాఘ్‌బన్" చూడలేదా? అదే మన "బడిపంతులు" లా ఉంటుంది. ఈ సారి TVలో వస్తే చూడండి. హేమమాలిని అందులో కూడ బాగుంటుంది.
మీకో చిన్న షాక్. మీకు తెలుసా? తెలుగులో కూడ ఒక హేమమాలిని ఉంది. బ్రహ్మానందంతో నటిస్తుంటుంది.
నిజమా!
DeleteGreat writing Ramana. Never a great fan of Hema Malini, but, she was/is very pretty. I would rank Smita Patil and Rekha higher. To each his own I guess.
ReplyDeletethank you, i agree with you. Hema malini is known for beauty only.
Deleteప్రగతి హేమామాలినియే కొలబద్ద. అందుకే రోడ్లని హేమామాలిని బుగ్గల్లా చేస్తామని లాలూ బాబాయి అప్పుడెప్పుడో ప్రకటించాడు. రేఖ ముఖంపైని పెయింట్ కోటింగ్ లాగా చేస్తాననలేదు. అందుికే హేమామాలినికే నా ఓటు. (నాకు అక్కడ ఓటు లేదు. అందుకే ఎవరికైనా చెప్పి నా తరఫున వేయిస్తా)
ReplyDeleteమొదట్నుండి.. గవాస్కర్, విశ్వనాథుల్ని పోల్చినట్లుగా హేమమాలిని, రేఖల్ని పోలుస్తుంటారు, మీరు హేమమాలిని పక్షం అన్నమాట!
Deleteఈ విషయంలో మాత్రం నాది చంద్రబాబు 'రెండుకళ్ళ సిద్ధాంతం'. :)
సార్,
ReplyDeleteమీకు వయసులో ఉన్న/మీరువయసులో ఉన్న హెమ మాలిని అందంగ ఉంటుందా? వయసు మీరిన (మీరు కూడా మీరారు కధా) హెమమాలిని అందంగా కనిపి(చ్చి)స్తుంధా?. ఇది నా సైంటిపిక్ ప్రశ్న. మీరు తెలిసీ చెప్పక పోయారో........................................!
మీ ప్రశ్నకి సమాధానం పోస్టులో ఉంది కదా!
Delete>>ఒకప్పుడు హేమమాలిని అందాన్ని అభిమానించాను. ఇవ్వాళ నా దృష్టిలో అందానికి వీసమెత్తు విలువ కూడా లేదు.. అదసలు విషయమే కాదు.<<
"ఆమెలో ఇంకా అదే అందం, అదే డిగ్నిటీ"
ReplyDeleteSo true. She was considered as the most beautiful, sincere, decent and dignified actress among her contemporaries. Dharmendra, Jitendra and Sanjeev Kumar were madly in love with her. Sanjeev Kumar remained single all his life when she said NO to him. She never enjoyed her married life with Dharmendra as the later neither left his first wife/family to live with Hema, nor supported her financially. She raised both her daughters almost as a single parent. She struggled a lot through out her personal life. So Dharmendra is not a reason for her successful life. Coming to the point of beauty even at this age, I think her dance keeps her fit, healthy and beautiful.
Rekha is beautiful too but she was never loyal in any of her relationships.
Although I do not belong to your generation, my vote is always for one and only Hemaji !!!
$
Is it! I don't all this, thanks for sharing the information.
DeletePleasure is mine sir. I really enjoy your posts. It is one of the most favorite blogs for me. The way you translate English terminology into Telugu (for example, Sishupaludu for Pediatrician; Gundelu marchu Gokhale for Cardiologist; Vetapalem for Huntsville [this is highlight. I live very close to this city and now on wards people may think that I am crazy as I laugh all by myself when ever I see Huntsville sign boards on Interstate LOL]) is awesome. I wanted to write a lot about humor in your posts but I am very poor in Telugu writing but fortunate enough to read, understand and enjoy it perfectly.
Deletethanks for the compliments.
Deletethe credit (Huntsville = వేటపాలెం) should go to my friend Gowtham (in pic with Hema), who refers his own place as వేటపాలెం!
Liking differs from age to age. Some looks beautiful, pretty etc..etc.. and some people s.... Varies from eye to eye. Agree that hemamalini is keeping up her beauty whatever her age. We also worshipped Sridevi for sometime when she acted in 'padahaarella vayasu'. Pran jaaye par vachan na jaaye is rekha's first movie and she acted without inhibitions and the director utilised her fully. Obviously this attracted a big crowd of fans. We were all young at that stage and you can imagine. If you want to keep on writing blogs about our childhood, you can write a 500 pages book. Hemamalini is looking good in 'Baghban' as well but it is difficult to bear that movie as the story line is old and boring. Gone are the days when we used to watch movies only for the sake of heroine, actually we used to have tubular vision watching only heroine on the screen and the rest is blank. What do you say?
ReplyDelete'ప్రాణ్ జాయె పర్ వచన్ న జాయె' మనం చండీగఢ్ లో కూడా చూశాం.. నీకు గుర్తుందా?
DeleteBaghaban? nevre heard this word!
>>we used to watch movies only for the sake of heroine, actually we used to have tubular vision watching only heroine on the screen and the rest is blank.<<
చంద్రబాబు vision 2020 లాగా మన heroine tubular vision గూర్చి ఒక పోస్ట్ రాశానని గుర్తు (ఈ మధ్య నేనేం రాశానో నాకే గుర్తుండి చావట్లేదు).
Huntsville = వేటపాలెం ...చాల బాగుంది మీ అనువాదం
ReplyDelete'Musalodivi ayipoyyaavu' encheddaam. yes I remember seeing the movie etc.. etc.. in chandigarh. You need a secretary to keep track of the blogs you wrote and to arrange them nicely.
ReplyDeleteI too remember that incident and several other incidents too. I remember begging an auto wala who came to see the movie with his family to take us back to PGI, as we couldn't dare to walk back 10/15 KM after the second show, in the cold weather! I wonder how 15 of us fit in that small regular auto (not a share auto - they weren't there in those days). We wouldn't fit now!
ReplyDeleteI am afraid if Dharmendra looks at the photograph his horses will ready to invade our
Deletebrodipet member?
Pardhu
Beauty and our Naughty together!
DeleteJai Ho
రమణ గారూ, మీ బ్లాగ్ మళ్లీ ఇన్నాళ్ళకి చదవగలిగానండి. పాత బ్లాగ్ అడ్రస్ మర్చిపోయాను. మళ్లీ ఇన్నాళ్ళకు. ఎప్పుడు కామెంట్ అయితే చెయ్యలేదు గాని ఇప్పుడు మీ బ్లాగ్ మళ్లీ కనిపెత్తగాలిగాను అనే ఆనందం లో కామెంట్ పెడుతున్నాను. మంచి మంచి చలోక్తులతో నిండిన బ్లాగ్ పోస్ట్ లు రావాలని ఆశిస్తున్నాను.
ReplyDelete