ఈ ఫొటో చూస్తుంటే నా మనసు బాధతో మూలుగుతుంది. 'ఎక్కడైనా రోగిష్టి మనిషి నీరసంతో మూలుగుతాడు, తోక తెగిన కుక్క ఏడుస్తూ మూలుగుతుంది, సూడిపంది డజన్లకొద్దీ పిల్లల్ని కనేప్పుడు ప్రసవవేదనతో మూలుగుతుంది. ఇవేమీ లేకపోయినా, డబ్బులిస్తే సినిమా యాక్టర్లు మూలుగుతారు (దీన్నే నటన అందురు). కానీ - మనసు కూడా మూలుగుతుందని ఇప్పుడే వినడం, అంటే ఏంటి?' అంటూ కష్టమైన ప్రశ్నలేస్తే, నాదగ్గర సమాధానం లేదు.
ఈ ఫొటోలోని తెల్లగడ్డం వ్యక్తి నా చిన్నప్పట్నించి రాజకీయాల్లో ఉన్నాడు. కాకలు తీరిన రాజకీయనాయకుడు. ఆయన స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా రాజకీయాలే ఆలోచిస్తాడు, చేస్తాడు. ఒకప్పుడు దేశరాజకీయాల్ని శాసించాడు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళపాటు అభివృద్ధికి పోస్టర్ బాయ్. రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో.. ప్రతిపక్ష నాయకులు అన్యాయంగా కుట్ర పన్ని.. రాజ్యాధికారాన్ని లాగేసుకుని.. (ఆ విధంగా) రాష్ట్రాభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. ఆనాటి నుండి బాధతో పక్షులు ఎగరడం మానేశాయి, చేపలు నీళ్ళు తాగడం మానేశాయి, పశువులు గడ్డి తినడం మానేశాయి, మనుషులు మందు తాగడం ఎక్కువ చేశారు. ఇదంతా పాతకధే!
ఫొటోలోని నల్లగడ్డం వ్యక్తి ఒక సినిమా నటుడు. ఇతని అన్నయ్య చాలా పాపులర్ హీరో. తెలుగు సినిమాల్లో వారసత్వం అనే అర్హత లేకుండా హీరో అవ్వలేరు. అంచేత - ఇతను కూడా అన్నయ్య వారసుడిగా, అన్నయ్య కనుసన్నల్లో తెలుగు సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం పెద్దహీరోగా వెలుగొందుతున్నాడు. కొన్నాళ్ళకి ఎందరో సినిమా నటులకి మల్లే ఈ నటుడిక్కూడా రాజకీయ దురద పట్టుకుంది, మంచిది. ఇందు నిమిత్తం ఏదో పుస్తకం కూడా రాసుకున్నాడు, మరీ మంచిది. చాలా ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తాడు, మరీమరీ మంచిది.
లంచాలు మరిగిన అధికారి లంచాలకి వ్యతిరేకంగా మాట్లాడరాదని రూలేమీ లేదు, అలాగే - వారసత్వంతో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తికి వారసత్వ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉండకూడదని కూడా రూలేమీ లేదు. బంగారం అమ్మి పొలం కొనుక్కోవచ్చు, పొలం అమ్మి ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే సినిమా హీరోలు తమ వెర్రి అభిమానుల్ని గొర్రెల మందలుగా మార్చి తమ రాజకీయ సోపానానికి మెట్లుగా కూడా మార్చుకోవచ్చు.
లంచాలు మరిగిన అధికారి లంచాలకి వ్యతిరేకంగా మాట్లాడరాదని రూలేమీ లేదు, అలాగే - వారసత్వంతో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తికి వారసత్వ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉండకూడదని కూడా రూలేమీ లేదు. బంగారం అమ్మి పొలం కొనుక్కోవచ్చు, పొలం అమ్మి ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే సినిమా హీరోలు తమ వెర్రి అభిమానుల్ని గొర్రెల మందలుగా మార్చి తమ రాజకీయ సోపానానికి మెట్లుగా కూడా మార్చుకోవచ్చు.
నీ మనసు మూలుగుతుందన్నావు, ఎందుకో చెప్పకుండా ఈ సోదంతా ఏమిటి?
అమెరికావాడు ఇండియావాణ్ని అప్పడిగినట్లు, పులి తన పిల్లల పాల కోసం పిల్లిని అర్ధిస్తున్నట్లు.. అంత పెద్దనాయకుడు, ఒక సినిమా నటుణ్ని (ఇంటికి వెళ్లి మరీ) సహకరించమని అడుక్కోవడం ఎంత ఘోరం! ఇది తెలుగుజాతికే అవమానం.
నీ మొహం! ఒక తెలుగువాడు సాటి తెలుగువాణ్ని అడుక్కోవటం తెలుగుజాతికి అవమానం ఎలా అవుతుంది? అవ్వదు. అయినా ఇవన్నీ రాజకీయాలు, నీకర్ధం కావులే! మూలిగింది చాలు, ఇంక ఆపు!
(photo courtesy : Google)
ఏంది సార్, పులి గిలి అని మాట్లాడు తున్నారు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టు కోవడం రాజకీయాల నైజం. దీని పేరే రాజకీయం అంటారు.లేకపోతే ఎన్ను పోతూ అంటారా ఏమిటి?
ReplyDeleteపులులు అంతరించిపోతున్నాయి, అయినా రాసేప్పుడు పులి ఉపమానం వాడుకోవటం చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే రాశాన్లేండి. :)
Deleteeverybody knows that if NCBN gets majority the next moment he will become a Hulk and sideline everybody, threaten everybody .... but we dont have choice.
ReplyDelete>>ఆయన స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా రాజకీయాలే ఆలోచిస్తాడు, చేస్తాడు.<<
DeleteI admire CBN for his great political management.
మనకెందుకండి బాధ?
ReplyDeleteవాళ్ళ లెక్కలేవో వాళ్ళకుంటాయి.
1+1+1= 111 :)
Deleteవసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. దానికి పోలిస్తే ఇదెంతలెండి పోనిద్దురూ!
ReplyDeletePS: apologies to Vasudeva & donkey
:))
Deleteబాబు ఈ సారి అధికారం లోకి రాకుంటే జైలే గతి సర్. అందువల్ల ఎవరి సహాయమైన కోరతాడు, ఎవరి కాళ్ళైనా పడతాడు. తప్పదు మరి.
ReplyDeleteబాబుకి జైలా! ఎందుకు?
Deleteనాకు తెలిసి, చంద్రబాబు పట్ల ఎవరికీ వ్యక్తిగత వైరం లేదు. ముఖ్యమంత్రి కావటానికి చంద్రబాబు, జగన్.. ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు (తప్పదు కదా).
బాబుకి జైలేమిటి? మీరు జగన్ గురించి మాట్లాడుతున్నట్లున్నారు.
Deleteఈ జైళ్ళ గోలేంటి? జగన్ కి మాత్రం జైలెందుకు?
Deleteకాంగ్రెస్ ని కాదన్నందుకే జగన్ జైలుకెళ్ళాడు.. అంతేకాని అతను అవినీతిపరుడైనందుకు కాదు. ఈ పాయింట్ అర్ధం కాకపోతే, ఇంతకన్నా ఎన్నోరెట్లు అవినీతిపరులు జైలుకెందుకెళ్ళలేదో అర్ధం కాదు.
రాజకీయపార్టీల్లో బేరాలు కుదరకపోతే అవతలవారిపై కేసుల దుమ్ము దులుపుతారు. ఇప్పటిదాకా చంద్రబాబుకి జగన్ పరిస్థితి రాలేదు, అంతే.
రేపు ప్రధాని ఎవరైనా (మోడీ / రాహుల్).. తమ దారికి రానివారిపై మాత్రమే కేసులు పెట్టిస్తారు.
NCBN is good with paperwork. He wont be caught in any of these crimes.
Deleteవీళ్ళిద్దరూ పక్కా అవకాశవాదులు. వీళ్ళు ఇద్దరూ ఎంత ముక్కినా, మూల్గినా జనము వెళ్ళని నమ్మరు. అసలు వీళ్ళ ఈ మీటింగ్, సర్దుబాటు అవకాశవాదానికి పరాకాష్ట. కాక పోతే టెంట్ హౌస్ లలో అద్దెకు ఇవ్వబడే మైక్ లా తయారయిన ఈ నల్ల గడ్డపు ఆయన ను ఈ ఘనత వహించిన గొప్ప పరిపాలకుడు, అపర చాణిక్యుడు అయిన తెల్ల గడ్డపు ఆయన ఎందుకు మస్కా కొడుతున్నాడో అర్థము అయ్యి చావటము లేదు. బహుశా చావో రేవో అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి కావచ్చు. జనము త్వరలోనే వీళ్ళకి బుద్ది చెబుతారు
ReplyDeleteచిత్రమయిన గొప్పవాళ్ళు- అని నేనొక పోష్టు మొదలు పెట్టా. అందులో బాబు గురించిన ఝలక్ ఇది
ReplyDelete"ఒక్క మాటలో చెప్పాలంటే రాజులాగా ఉండాలనుకుంటాడు, కానీ స్వభావంలో రాజసం లేదు.ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డట్టుగా ఉంటాడు కానీ ప్రజాస్వామ్య స్పూర్తి లేదు."
రాం గోపాల్ వర్మ, దాసరి నారాయణ రావు, నారా చంద్రబాబు నాయుడు, మన్ మోహన్ సింగ్, నరేంద్ర మోడీ - గొప్పవాళ్ళే అయినా వీళ్ళ వ్యక్తిత్వాల లో ఉన్న చిత్రమయిన విషయాల్ని గురించి తెలుసుకోవాలని ఉందా? ఒకసారి ఇటు వచ్చి నవ్వుకుంటూ వెళ్ళండి!
ReplyDeletehttp://harikaalam.blogspot.in/2014/04/blog-post_5.html
ఇలా మీ బ్లాగులో నా బ్లాగు పోష్టు లింకు ఇవ్వచ్చా?మీ ఇష్టం!