Wednesday 1 April 2015

'రావిశాస్త్రి' నా అభిమాన కవి!


"నీ అభిమాన కవి పేరు చెప్పుము."

"ఓస్! అంతేనా.. శ్.."

"ఆగు. ఆ కవి పేరు 'శ' తో మొదలవ్వకూడదు."

"ఇదన్యాయం."

"నాకు తెలుసు, నువ్వు శ్రీశ్రీ, శివసాగర్, శివారెడ్డిల్లో ఏదోక పేరు చెబ్తావని!"

"ఆరి దుష్టుడా! ప్రశ్న వెనక చాలా కుట్ర దాగుందే! కొంచెం ఆలోచించుకోనీ!"

"హీహీహీ.. భలే కష్టమైన ప్రశ్నడిగా కదా?"

"గాడిద గుడ్డేం కదూ! రాసుకో - నా అభిమాన కవి 'రావిశాస్త్రి'."

"హోల్డాన్! రావిశాస్త్రి కవి కాదు నాయనా!"

"ఆ విషయం నాకూ తెలుసు. కాకపోతే - నీలాంటివాడికి తెలీని విషయం ఒకటుంది."

"ఏంటది?"

"రావిశాస్త్రి కవితల్నే కథలుగా రాశాడు."

"అర్ధం కాలేదు."

"నీకర్ధం కావాలంటే ఓ పన్జెయ్! రావిశాస్త్రి రాసిన కథ, నవల - ఏదైనా సరే! అందులోంచి ఒక పేరాగ్రాఫ్ తీసుకో!"

"ఆఁ! తీసుకుని?"

"ఇప్పుడా పేరాగ్రాఫ్‌ని చిన్నచిన్న ముక్కలుగా నరికెయ్!"

"ఆఁ! నరికేసి?"

"ఆ ముక్కల్ని పంక్తులుగా రాసుకో."

"ఆఁ! రాసుకుని?"

"ఆరి అమాయకుడా! ఇంకా అర్ధం కాలేదా? ఇప్పుడది ఒక బ్యూటిఫుల్ పొయిట్రీ అయిపోయిందోయ్!"

"అవును కదూ!" 

(picture courtesy : Google)

4 comments:

  1. మీ పోస్ట్ చదవలేదు కానీ మీ కామెంట్స్ పాలసీ చదివాను. ఈ లెక్కన మీ పాలసీ పొడుగు ముందు ముందు పోస్టులని మించేలా వుందే! మీ అవస్థ నాకు తెలుసు లెండి :)

    ReplyDelete
    Replies
    1. కామెంట్స్ పాలసీని పొడిగించడానికి ఇంకొన్ని టిప్స్ చెబితే సంతోషం. :)

      Delete
  2. హమ్మయ్య ! నేను కూడా కవయిత్రి నే!

    'కౌలు' కౌయితరులు' అంటే నా కెందు కో మరీ బెరుకు! అబ్బే మనకు అట్లాంటి వి రావుస్మీ అనుకోవడం తో సరి పెట్టేసు కోవడం తో సరి !

    ఈ టపా తో నాకు మంచి ఊపు నిచ్చేరు ! అబ్బా మనం కూడా రావి వారంతటి వారమేస్మీ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఇంకెందుకాలీసం? రాసెయ్యండి మరి! :)

      Delete

comments will be moderated, will take sometime to appear.