Friday 1 May 2015

బాబాగారికో విన్నపం


వారు యోగాసనాల గురువు. ఆయన ఉన్నత వర్గాల వారికి గుండెల నిండుగా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తారు. ఆపై కాళ్ళూ చేతులతో అనేక విన్యాసాలు చేయిస్తారు. మంచిది, సుఖమయ జీవనానికి అలవాటైనవారికి కూసింత కొవ్వు కరిగించుకోడానికి గురువుగారు సాయం చేస్తుంటే ఎవరికి మాత్రం అభ్యంతరం?

వారికి రాజకీయ రంగం పట్ల ఆసక్తి వుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావాలని తెగ తాపత్రయ పడ్డారు. అందుకోసం గొప్ప ఉద్యమం కూడా చేశారు. మంచిది, ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. ఇప్పుడెందుకో ఆయన తను డిమాండ్ చేసిన నల్లదనం ఇంకా మన్దేశానికి రాలేదన్న విషయం మర్చిపొయ్యారు. బహుశా పని వొత్తిడి కారణం కావచ్చు!

వారికి ఆయుర్వేద మందుల వ్యాపారం వుంది. మంచిది, వ్యాపారం టాటా బిర్లాల సొత్తు మాత్రమే కాదు. 'కృషి వుంటే మనుషులు ఋషులౌతారు' అని ఏదో సినిమా ఒక పాట కూడా వుంది కదా! అంచేత - ఋషులు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నందుకు సంతోషిద్దాం. 

వందల కోట్ల విలువ చేసే వారి ఫార్మసీలో మగపిల్లల్ని పుట్టించడానికి ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు. ఇది నేరం అని కొందరు గిట్టనివాళ్ళు ప్రచారం చెయ్యొచ్చు. కానీ, సమాజంలో మగబిడ్డల కోసం ఆరాటం ఇప్పటిది కాదు. దశరథుడి కాలం నుండే వుంది. దశరథ మహారాజు పుత్రుల కోసం యజ్ఞం చేశాడే గానీ పుత్రికల కోసం చెయ్యలేదు. 

మెడికల్ సైన్సు క్షుద్రమైనది. అది - మన పవిత్ర తాళపత్ర గ్రంధాల్ని, అందుగల అమోఘమైన శాస్త్రీయ విషయాల్ని తొక్కిపట్టడానికి పాశ్చాత్యులు పన్నిన కుట్రలో భాగం. అందుకే పిల్లలు కావాలన్నప్పుడు పొటెన్సీ, మోటిలిటీ, ఫెర్టిలిటీ అంటూ ఏదో చెత్త చెబుతుంటారు. అబ్బాయే కావాలంటే క్రోమోజోముల లెక్క చెబుతారు. అవన్నీ మనం పట్టించుకోరాదు. 

మగపిల్లాణ్ని పుట్టించుకోడం కోసం యజ్ఞం చెయ్యడం అనేది ఖరీదైన వ్యవహారం, అందుకే అది ప్రజల సొమ్ముతో సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే రాజులకి మాత్రమే పరిమితమైంది. ఇవ్వాళ మనకి అంత ఆర్భాటం, ఆయాసం లేకుండా ఇన్స్టంట్ ఫుడ్ మాదిరిగా మగపిల్లల్ని పుట్టించే మందుని యోగాసనాల స్వామిగారు సరసమైన ధరకి మార్కెట్లో అమ్మిస్తున్నారు. అందుకు మనం బాబాగార్ని అభినందించాలి. 

బాబాగారికో విన్నపం. అయ్యా! తమరు మీ రీసెర్చిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సామాన్య మానవులకి మరింత మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల మీ మందుల్తో పుట్టబొయ్యే మగబిడ్డ భవిష్యత్తు గూర్చి తలిదండ్రులు ఆందోళన చెందకుండా - ఆ పుట్టినవాడు అయ్యేఎస్ అయ్యేందుకు అయ్యేఎస్ లేహ్యం, అమెరికాలో స్థిరపడేందుకు అమెరికా తైలం లాంటి మందుల్ని కూడా జనబాహుళ్యంలోకి తేవాలని కోరుకుంటున్నాను! 

(picture courtesy : Google)

19 comments:


  1. మాస్టారు, తెల్వకుండా నిందలు చెయ్యకూడదు సార్..

    ఆయన తయారు చేసిన మందు పేరు - పుత్రజీవక బీజ... ఇది వంధ్యత్వానికి మందు... sex selection కి కాదు.
    ఆయన దీనిపై Twitter లో వివరణ కూడా ఇచ్చాడు.

    media TRP కోసం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తాయి. ... మీరు కూడానా?

    ReplyDelete
  2. అదేదో బ్రంహం గారు చెప్పినట్లు వై క్రోమో జోము డబ్బులు పుట్టించే కాలం వస్తుందన్న మాటా ! ఎక్స్ క్రోమో జోము ఇక పు పుట్టగతులున్నవన్న మాట? అందుకే గా దాలిని సృష్టి మ్చినది? ఇంతకు డాలి వై యా లేక ఎక్సా?

    ReplyDelete
  3. >> గుండెల నిండుగా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తారు

    గురూ గారూ గుండెలోకి గాలి వెళ్తే ఛస్తారు. డాక్టరై ఉండీ ఇలా రాస్తున్నారేమిటి? ఎంత మాటవరసకైతే మాత్రం? మీరీ బాబాల విషయాల్లోనూ వాటిల్లోనూ తలదూర్చి బుర్రపాడుచేసుకుంటున్నారేమో. మనకెందుకండీ ఈ గోల? ఓ రావి శాస్త్రి గురించో, ఇంకో రంగనాయకమ్మ గురించో చర్చించుకుందాం రండి.

    ReplyDelete
  4. బుల్లబ్బాయి గారు ఇది ఇంకో మోసం. వ్యంధత్వానికి మందు ఐతే సంతాన జీవక్ అని పేరు పెట్టాలి గానీ పుత్ర జీవక్ ఏంటీ..పుత్ర అంటే అర్థం కూడా తెలీదా బాబా గారికి.

    ReplyDelete
    Replies
    1. I think they own the brand name.

      Delete
    2. మన పెద్దలు "పుత్ర పౌత్రాభివృధ్ధిరస్తు" అని దీవిస్తారు. అంటే కేవలం అబ్బాయిల్నే కనమనా? వాళ్ళూ అబ్బాయిల్నే కనాలనా? అంటే ఆడపిల్లలు అక్కర్లేదా? ఆడపిల్లలు లేకుండా ఆ పుత్రులు పుత్రుల్నెలా పుట్టిస్తారు? అహఁ మీ గురించి నాకేమీ తెలేదు, నాకు సాహిత్య ఙ్ఞానమూ లేదు. అందుకే నా అధర్మ సందేహం.

      Delete
  5. Outrank am is the name of the herb, beej are its seeds, hence the name. Pl. see the link below. I took it from a posting on reddit.
    http://ayurvedacart.in/outside/ayurvedic-herbs/herbs-start-with-p/putrajivak.html

    ReplyDelete
  6. పత్రికల్లో వార్త చదివి ఈ పోస్ట్ రాశాను. ఒక బ్లాగ్ పోస్ట్ రాయడానికి ఇంతకన్నా ఎక్కువ ఆధారం అవసరం లేదనుకుంటున్నాను.

    ఎవరైనా సరే - తమకున్న సామాజిక రాజకీయ కోణం నుండే విషయాన్ని అర్ధం చేసుకుంటారు. నాకు అర్ధమైనంత మేరకు నాకు తెలిసిన రీతిలో రాశాను. దట్సాల్!

    ReplyDelete
  7. http://blog.marxistleninist.in/2015/05/corporal-punishments.html
    There are many people who want shortcuts.
    Ramdev may also sell medicines for increasing marks if he reads the above link.

    ReplyDelete
  8. మా చిన్నపుడు పిల్లలు లేనివారు పూజలు చేస్తూనే గుడి కి వెళ్ళి పొర్లుదండాలు పెట్టేవారు.కోటప్పకొండ తిరణాలకు వెళ్ళినా పిల్లలు పుట్తారని చెప్పుకొనేవారు.స్వాముల వారి దగ్గర ముాడురోజులు సేవ చేసినా సత్ఫలితాలు లభించేవనేవారు.నాకు తెలిసి ఒకాయన రూపాయి పావలా తీసికొని ఒక మందు యిచ్చేవాడు.ఆమందు మూడురోజులు తింటే గ్యారంటీగా మగ పిల్లవాడు పుట్తారనేవారు.కొంతమందికి సత్ఫలితాలు లభించేవనేవారు.యిలాంటి వెర్రి వాస్తవాలు కధలు కధలు గా మనముందు వున్నాయి...అటువంటిదే బాబా రాందేవ్ పుత్ర మూలికా మాత్ర అని అనుకోవచ్చా .

    ReplyDelete
    Replies
    1. డాక్టర్ గారు,

      తిరణాల, తాయెత్తులని (నాకు తెలిసి) ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అవన్నీ నమ్మకాలు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేకపోతే లేదు.

      'మెడిసిన్' అనంగాన్లే చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఆ మందుల కంపెనీ వ్యాపారి ఒక యోగాగురువు అయినందువల్లా, ఆ మందుని మనం ప్రశ్నిస్తే హిందుత్వ ద్రోహులం అయిపొతాం. :)

      ఆయుర్వేద / మూలికా వైద్యాన్ని నమ్ముకున్న రోగుల్తో నాకు పరిచయం లేదు గానీ, ఆ మందుల వల్ల ఆర్ధికంగా బాగుపడ్డ నెఫ్రాలజిస్టులు, హెపాటలజిస్టుల్తో మాత్రం బోల్డెంత పరిచయం వుంది! :)

      Delete
  9. ఈ మధ్య నేను ఒక ఆయుర్వేద వైద్యుని దగ్గరకి వెళ్ళాను. పిరుదుల మీద మచ్చలు చూసి "అవి రక్తహీనత వల్ల వచ్చిన మచ్చలు" అన్నాడు. పండ్లు బాగా తినమన్నాడు కానీ హేమోగ్లోబిన్ పెంచే మందులు ఏమీ ఇవ్వలేదు. మచ్చలు పోవడానికి స్కిన్ రీజువెనేతర్స్ మాత్రం ఇచ్చాడు. కృత్రిమంగా హేమోగ్లోబిన్ పెరగడానికే మందులు ఇవ్వని వైద్యులు కృత్రిమంగా పిల్లలు పుట్టడానికి అంత సులభంగా మందులు ఇచ్చేస్తారా?




    ReplyDelete
    Replies
    1. చిన్నప్పుడోసారి ఒక ఆయుర్వేద వైద్యశాలకి పేషంటుగా వెళ్ళాను (ఆ అనుభవాన్ని 'శిష్ట్లావారి వైద్యం' పేరుతో ఒక పోస్టు రాశాను). అంతకుమించి నాకు ఆయుర్వేద వైద్య విధానం గూర్చి తెలీదు.

      Delete
    2. శిష్ట్లావారి వైద్యం అని వ్రాయటంలో ఔచిత్యం ఉంటుంది ఎంతలేదన్నా ఇదీ ఆయుర్వేదం సంగతి అని వ్రాయటం కన్నా. అయుర్వేదవైద్యవిధానం గురించి మీకు తెలియకపోవటంలో విశేషం ఏమీ లేదు. అనేకమంది వంశపారంపర్యంగా అయుర్వేదవైధ్యం చేసే వారిలో అధికులకే అయుర్వేదవైద్యవిధానం గురించి తఛ్ఛాస్త్రీయంగా ఆట్టే తెలియని పరిస్థితి ఉంది. శోచనీయమైన విషయం అదీ - ఎందుకంటే అలాంటి వారివలన ఆయుర్వేదం అప్రతిష్ఠపాలౌతున్నది కాబట్టి. సంయమనంతో ఆలోచించని అనేకులు దోషం వైద్యులలో కాక వైద్యవిధానంలో ఉందని పొరబడుతూ ఉంటారు కాబట్టి.

      Delete
    3. రమణ గారు, ప్రకృతికి విరుద్ధంగా ఏమీ జరగదని MBBS చదివిన మీకు తెలిసే ఉంటుంది. ఆహారం సరిగా తినకుండా మందుల వల్ల హేమోగ్లోబిన్ పెరగదు కాబట్టే ఆ ఆయుర్వేద వైద్యుడు నాకు హేమోగ్లోబిన్ పెంచే మందులు ఇవ్వలేదు. వీర్యకణాలు మరీ తక్కువగా ఉన్నవాళ్ళకి అవి పెంచే మందులు ఇస్తారు కానీ "నాకు ఒక్క రాత్రి శోభనానికే పిల్లలు పుట్టే మందు కావాలి" అంటే ఎవరిస్తారు?

      Delete
  10. పిల్లలు పుట్టించే మందులని వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనేవాళ్ళు ఉంటారా? శరీరం ఆహారాన్నైనా, మందునైనా దాని అవసరానికి మించి తీసుకోదు. శరీరం protein కణాలతో నిర్మితమైనది. Protein కణం తనకి కావలసిన పోషకాలని బయటి నుంచి తీసుకుని, తనకి అవసరం లేనిదాన్ని బయటకి వర్జిస్తుంది. ఈ నిరంతర ప్రక్రియ వల్లే జీవం అస్తిత్వంలో ఉంటుంది. మనం వీర్యకణాలని పెంచే మందు వేసుకున్నా శరీరం దాన్ని అవసరానికి మించి తీసుకోదు. మందుల వల్ల పిల్లలు తొందరగా పుడతారని నమ్మితే మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మినట్టే అవుతుంది.

    ReplyDelete
  11. ఇక్కడేదో మంట రగులు తున్నట్టు ఉంది .

    రావి వారి చుట్ట కాల్చు కోడానికి ఏమైనా ఆస్కారం ఉందంటారా !

    జిలేబి

    ReplyDelete

  12. సెహ భేషు గా వ్రాసేరు డాక్టరు గారు ! ఇట్లాంటి టపాలు మీరు ఇంకా మరిన్ని వ్రాయాలి జనాలకి కనువిప్పు కలిగించ డానికి


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  13. How can they use drugs without doctor's prescription. Once I was admitted into the hospital for headache. It was because of the fall in my sugar level. If it is advised to buy drugs promoted through advertisements, people may use placebo even for the headache caused by neurological problems.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.