"ఇది టాప్ సీక్రెట్, ఎవరికీ చెప్పకు."
"యేంటది?"
"పాకిస్తాన్ పీడా ఒక్కరోజుతో వొదుల్చుకునే ప్లాన్ నాదగ్గరుంది."
"ఒక్కరోజులోనా!"
"అవును. నాక్కావల్సిందల్లా ఓ విమానం, పదిబాంబులు. ఆ పదిలో ఓ రెండు పేలని బాంబులు."
"ఎందుకు!?"
"చెబ్తా! ఆ బాంబుల మీద 'మేడిన్ పాకిస్తాన్' అని తాటికాయ కన్నా పెద్దక్షరాల్తో ప్రింట్ చేసుండాలి."
"ఎందుకు!?"
"చెబ్తా! ఆ విమానంలో యే అర్ధరాత్రో చైనావాడి భూభాగంలోకి ప్రవేశించి, గప్‌చుప్‌గా ఆ బాంబుల్ని జారవిడిచేసి వెనక్కొచ్చెయ్యాలి. చైనాగాడు పేలని బాంబుల మీదున్న 'మేడిన్ పాకిస్తాన్' చూస్తాడు. బాంబులేసింది పాకిస్తాన్‌వాడే అనుకుని కోపంతో రగిలిపోతాడు, వెంటనే పాకిస్తాన్‌గాడి మీద యుద్ధం మొదలెడతాడు. ఆ దెబ్బకి మనకి పాకిస్తాన్ పీడా విరగడౌతుంది. మనం తమాషా చూస్తూ ఎంజాయ్ చేద్దాం. శత్రువుని శత్రువుతోనే దెబ్బతియ్యాలి. ఇదీ నా ప్లాన్, ఎలా వుంది?"
"అయ్యా! ఎవరండీ తమరు?"
"ఇంత చెప్పినా తెలుసుకోలేరా!? నేను తెలుగు సినిమా రచయితని."
(picture courtesy : Google)
awesome
ReplyDelete