నేను చదువుకునే రోజుల్లో చిరంజీవి సినిమాలు చాలా చూశాను. అతని సినిమాల్లో కథ ఉండదు. పక్కన రాధిక అనే అరవమ్మాయి హీరోయిన్ గా చేస్తుండేది. నెలకి రెండు కొత్తసినిమాలు రిలీజ్ అయ్యేవి. దాదాపు అన్నీ 'ఢిషుం.. ఢిషుం' సినిమాలే. ఇట్లాంటి కథలేని సినిమాలు స్నేహితులతో మంచి కాలక్షేపం. నాకున్న స్నేహితులు కూడా కబుర్లు చెప్పుకుంటూ సరదా కాలక్షేపంగా సినిమా చూసేవాళ్ళేగానీ.. అంతకుమించి సినిమాల గూర్చి పట్టించుకునేవాళ్ళు కాదు. అంత టైమూ ఉండేది కాదు.
సరే! చిరంజీవి అన్నయ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పట్నించి తెలుగు న్యూస్ చానెళ్ళలో తరచుగా కనబడటం మొదలెట్టాడు. ఆవిధంగా.. సినిమాలు చూడ్డం మానేసిన నావంటి దుష్టుల దృష్టిలో మళ్ళీ పడ్డాడు. చెప్పుల కొట్లో పని చేసేవాడు అప్రయత్నంగా అందరి కాళ్ళకేసి చూస్తుంటాడు. అటులనే (నా వృత్తిరీత్యా) నాక్కూడా ఎదుటివాడు చెప్పే విషయం కన్నా చెప్పు (కాలికి తొడుక్కునే చెప్పు కాదు) విధముపై ధ్యాస మెండు.
టీవీలో కనబడుతున్న చిరంజీవిని జాగ్రత్తగా గమనించండి. అతనికి జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు అర్ధం కావు. అయినా సరే! మొండిగా సమాధానం చెప్పబోతాడు. thought process మొదలవ్వంగాన్లే.. సడన్ బ్రేక్ పడుతుంది. ఇంజన్ స్టార్ట్ చేసి గేరెట్లా వెయ్యాలో తెలీనివాడిలా తెల్లమొహం. మైండ్ బ్లాంకయిపోతుంది.
ఆలోచనాదారాన్ని అందుకోవడానికి desperate గా ప్రయత్నిస్తుంటాడు. కానీ.. సాధ్యం కాదు. ఏవో నాలుగు ముక్కలు గొణుగుతాడు. ప్రశ్నే అర్ధం కాలేదు కావున గొణిగిన ఆ నాలుగు ముక్కలకి ఏ అర్ధమూ ఉండదు. అసలు సంగతి తెలీని అతని తమ్ముళ్ళు .. అన్నయ్య చెప్పేదేంటో అర్ధం చేసుకోలేక జుట్టు పీక్కుంటుంటారు. అందుకే అన్నయ్య తమ్ముళ్ళందరికీ బట్టతల వచ్చేసింది.
paid news లాగా paid రిపోర్టర్లని చిరంజీవి ఎరేంజ్ చేసుకుంటే మంచిది. ఈ paid రిపోర్టర్లు అడగమన్న ప్రశ్నలే అడుగుతారు. నిదానంగా.. ఆలోచిస్తూ సమాధానం చెబుతున్నట్లు.. spontaneous interaction లాగా చిరంజీవి వీక్షకుల్ని నమ్మించాలి. కానీ అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ అవుటవరాదు. అలాగే.. శత్రుక్యాంపుదారులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పోర్షన్లో లేని ప్రశ్నలడిగి తికమక పెట్టొచ్చు. అప్పుడు అన్నయ్య పని ఇంటర్ ఫిజిక్స్ పేపరయిపోతుంది!"
ఇప్పుడు మనం బాలకృష్ణ గూర్చి చెప్పుకుందాం. బాలకృష్ణకి జర్నలిస్టులడిగే ప్రశ్న అర్ధమవుతుంది. ఆలోచన కూడా ఉన్నట్లుంది. కానీ మెదడులోంచి నోటికండరాలకి కనెక్షన్లొ ప్రాబ్లెం! చిరంజీవి సమస్య స్టార్టింగ్ ట్రబులైతే బాలకృష్ణ ది బ్రేకుల్లేని డ్రైవింగ్. స్టార్టింగే డైరక్ట్ గా టాప్ గేర్. అందుకే అతను మాట్లాడుతుంటే ఏదో speed race చూస్తున్నట్లుంటుంది. మాటల్లో సూపర్ స్పీడ్. కళ్ళు మూసుకుని, చెవులు రిక్కించి, తీవ్ర ఏకాగ్రతతో విన్నా ఒక్కముక్క కూడా అర్ధమయ్యిచావదు. మొన్నామధ్య మా సుబ్బు అరగంటపాటు బాలకృష్ణ స్పీచ్ విని రెండు మాటలు పట్టాడు. అవి.. నాన్నగారూ.. ఊ.. ఊ.. . ఇంకోటి నందమూరి వంశం.. ఊ.. ఊ.. ! మూడో మాట పట్టడం సుబ్బు వల్ల కాలేదు.
బాలయ్యబాబు స్పీడుకి బ్రేకులెయ్యడం ఎవరికీ సాధ్యంకాదు. అందుకని బాలకృష్ణ టీవీ చానెళ్ళ ఓనర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది. అతని ఇంటర్వ్యూ ముందే రికార్డ్ చేసుకుని.. తరవాత స్లో మోషన్లో replay చేస్తే బెటర్. అప్పుడు మాట slow అయ్యి.. చూసేవాళ్లకి కొద్దోగొప్పో అర్ధం అవ్వొచ్చు. కానీ lip sync కుదరకపోవచ్చు. ఈ సాంకేతిక సమస్య అధిగమించడం అంత కష్టం కాకపోవచ్చు.
చిరంజీవి, బాలకృష్ణలు అమాయకులు కాదు. తాము చెప్పేది జనాలకి అర్ధం కావట్లేదని వాళ్ళకీ అనుమానం ఉన్నట్లుంది. అందుకే మీసాలు మెలేయ్యడం, తొడలు కొట్టడంలాంటి విన్యాసాలు చేస్తున్నారు.
నా కజినొకడు తెలుగు సినిమా వీరాభిమాని. రాజకీయాలు అస్సలు తెలీవు. అతగాడు చిరు, బాలయ్యలిద్దర్లో ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు కేంద్రమంత్రి కావాలని పూజలు చేస్తున్నాడు. నాక్కోపం వచ్చింది. "ఎంత సినిమా పిచ్చోడివైనా.. నీపిచ్చి సినిమాలతో ఆపెయ్యి. రాజకీయాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని పూజలు చెయ్యడం టూ మచ్." అన్నా.
నా కోపానికి నొచ్చుకున్న నా కజిన్ "నిజంగా నాకు రాజకీయాలు తెలీవు. కానీ వాళ్ళు మినిస్టర్లు కాకపొతే మళ్ళీ సినిమాల్లో నటిస్తారనే భయమే నాతో ఈ పూజలు చేయిస్తుంది. వాళ్ళు లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమా హాయిగా, ప్రశాంతంగా ఉంది." అన్నాడు!
నిన్న నా స్నేహితుడు నాదగ్గరకి తన కొడుకుతో వచ్చాడు. కుర్రాడు చాకులాగున్నాడు. తెలివైనవాడు. ఏవో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట.
నేను నా స్నేహితుడితో "మీ వాణ్ణి జర్నలిజం స్కూల్లో చేర్పించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఇతనిలో పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు. ఇంత తెలివైనవాణ్ణి వెధవ జీతాల కోసం పనిచేసే ఉద్యోగాల్లో పడేసి వృధా చెయ్యకు." అన్నా.
అతగాడు నన్ను ఎగాదిగా చూశాడు. "నీ ప్రాక్రీస్ పెంచుకోవాలంటే వేరే మార్గాలు చూసుకో. నీకన్ను నాకొడుకు మీదే పడిందా!" నిష్టూరంగా అన్నాడు.
అర్ధం కాలేదు. బిత్తరపోయి చూస్తున్న నన్ను చూసి పెద్దగా నవ్వాడు.
"నువ్వు పెద్దగా టీవీ చూడవనుకుంటా. మా తమ్ముడు హైదరాబాదులో జర్నలిస్టు. ప్రస్తుతం తెలుగు జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు జానారెడ్డి, కేశవరావులే జర్నలిస్టుల్ని తికమక పెట్టేవాళ్ళు. జానారెడ్డి గంటసేపు మాట్లాడినా ఒకట్రెండు పాయింట్లు వెతికి పట్టుకుని దాన్నే సాగదీసి రాసి.. పని అయిందనిపించేవాళ్ళు. కేశవరావు ఏభాషలో ఏంచెబుతున్నాడో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించిన ఇద్దరు రిపోర్టర్లు ఎర్రగడ్డలో తేలారు. ఉన్నవాళ్ళతోనే చస్తుంటే ఇప్పుడు కొత్తగా చిరంజీవి, బాలకృష్ణలు వచ్చి చేరారు. ఇప్పుడున్న జర్నలిస్టులే ప్రాణాలకి తెగించి.. యుద్ధ వార్తలు కవర్ చేస్తున్నట్లు పనిచేస్తుంటే.. నాకొడుకుని జర్నలిస్టు అవ్వమంటావేమిటి!" అన్నాడు.
"సారీ మిత్రమా! నాకు తెలీదు." అన్నాను.
నా మిత్రుడు చిన్నగా నవ్వాడు.
"ఇంత చిన్నదానికి సారీలు ఎందుగ్గానీ.. నా అభిమాన రాజకీయ నాయకులు మాత్రం జానా కేశవ చిరు బాలయ్యలే! రాజకీయనాయకులు తియ్యటి ప్రసంగాలు చేస్తారు. చక్కటి వాగ్దానాలు చేస్తారు. వాళ్ళు చెప్పేది విని మనం మోసపోతాం. దానికన్నా ఏవీ అర్ధం కాకుండా మాట్లాడేవాళ్ళే బెటర్." అన్నాడు.
(photos courtesy : Google)
డాక్టర్ గారు
ReplyDeleteబాగుంది సార్
నేననుకోవడం వాళ్ళకుకూడా ఈ విషయం తెలుసు సార్
అందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికి మీసాలు మెలేయడం,తొడలు కొట్టడం లేకపోతే అబిమానుల్ని కొట్టడం లాంటివి చేస్తుంటారు
ఇక మన అభిమాన కధా నాయకుడైతే వాళ్ళ అక్క వాళ్ళింటి ముందు తొడకొడతాడు
ఆమె, మన పెద్దాయనే లేకపొతే ఈరోజు ఊచలు లెక్కించే వాడు
మన పెద్దాయనే లేకపొతే ఇంగ్లీష్ కేశవరావు కొడుకు పరిస్తితి అంతే
అర్దం కాని ఇంగ్లీష్తో ఆ ఇటలీ వాళ్ళ దగ్గర మానేజ్ చేస్తారు
అయినా గురువుగారు చిరంజీవి ఫొటో రెండు సార్లు మన అభిమాన కధా నాయకుడి ఫొటో ఒక్కసారేనా పెట్టేది ఇది చాలా అన్యాయమండీ
జి రమేష్ బాబు
గుడివాడ
సినిమా తారల అభిమానులు తికమక పెట్టడం సహజమే! కానీ శాస్త్ర ఙ్ఞానం (whatever that is)వద్దని ఏడ్చేవాళ్ళూ ఉంటారా? కాస్తంత decrypt చేసి చెబుదురూ...
ReplyDeleteChaalaa bagundi Dr garu ;)
ReplyDelete@ramaad-trendz,
ReplyDeleteరమేష్ బాబు గారు,
ఈ టపా మీ కోసమే! (పోయినసారి గొల్లపూడి మారుతీరావు గూర్చి రాసి బోర్ కొట్టించానని అన్నారుగా!)
క్రిమినల్స్ కి పెద్దాయన దేవుడు. అందరికీ తెలిసిన సంగతే!
>>చిరంజీవి ఫొటో రెండు సార్లు మన అభిమాన కధా నాయకుడి ఫొటో ఒక్కసారేనా పెట్టేది ఇది చాలా అన్యాయమండీ.<<
గట్టిగా అనకండి. ఇప్పటికే భయంతో చస్తున్నాను.
తెలుగు భావాలు గారు,
ReplyDeleteమా సుబ్బూకి శాస్త్రజ్ఞానం అంటే ఎలెర్జీ సుమండీ!
'రోగాల గూర్చి ముందే చదవడం ఎందుకు? రోగమొచ్చినప్పుడు చూసుకోవచ్చు గదా!' అంటాడు.
సుబ్బు వంటి వారు చాలామంది ఉన్నారనుకుంటున్నాను.
@ఫోటాన్,
ReplyDeleteథాంక్యూ!
ఏం సారూ.. శాస్త్ర జ్ఞానం దగ్గర మొదలెట్టి అటు తిరిగి ఇటు తిరిగి జర్నలిస్టుల మీద జాలి చూపిస్తున్నారు. ఎంత ట్రెండ్ ఫాలో అవకపోతే మాత్రం, ఇది జర్నలిస్టులని జనాలందరూ తిడుతున్న సీజన్ కదా... :)
ReplyDelete"మొన్నామధ్య మా సుబ్బు అరగంట పాటు బాలకృష్ణ స్పీచ్ విని రెండు మాటలు పట్టాడు. అవి.. నాన్నగారూ.. ఊ.. ఊ.. . ఇంకోటి నందమూరి వంశం.. ఊ.. ఊ.. ! మూడో మాట పట్టడం సుబ్బు వల్ల కాలేదు."
ReplyDeleteరమణ గారు నేను నిన్నే యు ట్యూబ్ లో బాలయ్య గారి వీడియో చుసా అందులో మీ సుబ్బు లాగే ప్రాబ్లం ఫేస్ చేసా..... Super ga rasaru
Finally you did justice to your blog name "pani lEka." This post tarted with a bang but watered down towards middle and fizzled by the end. :-(
ReplyDeletepuranapandaphani గారు,
ReplyDeleteనాకు జర్నలిజం అంటే fascination. జనాలు తిట్టనిదెవర్నిలేండి!
@narsi,
ReplyDeleteథాంక్యూ!
ప్రశాంతం గా సరదాగా ఉంది పోస్టు!
ReplyDeleteసుబ్బు గారు ఈ మధ్యన కన్పించడంలేదు ఏమండి! ఏదైనా రిసర్చ్ లో బిజీ గా ఉన్నారా ఏంటి!
ReplyDeleteKrishna Palakollu గారు,
ReplyDeleteధన్యవాదాలు.
నా తరవాత పోస్ట్ సుబ్బు కబుర్లుతో రాస్తాలేండి.
@ramaad-trendz,
ReplyDeleteరమేష బాబు గారు,
హనుమంతుని తోక కత్తిరించాను (పోస్ట్ కుదించాను). థాంక్యూ!