ఉదయాన్నే కాఫీ తాగుతూ 'ఆంధ్రజ్యోతి' తిరగేస్తున్నా. 'జగన్ అవినీతిపరుడు.' ఒప్పుకున్నాం! ఇంకేమన్నా వార్తలున్నాయా? ఎంత వెతికినా వేరే వార్తలు కనిపించట్లేదు. ఈ ముక్క రాయడానికి ఇన్ని పేజీలు దేనికబ్బా!
ఇంతలో "రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బు! జగన్ని లోపలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా హర్షించదగిన మంచి పరిణామం. ఒక అవినీతిపరుణ్ణి లోపలేస్తే గాని మిగిలినవారికి బుద్ధిరాదు." అన్నాను.
సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.
"నేనలా అనుకోవడం లేదు. జగన్ని అరస్టు చెయ్యడం కాంగ్రెస్ చేస్తున్న చివరి తప్పిదం అవుతుందేమో. రాజకీయంగా ఆలోచిస్తే జైలుకెళ్ళడం జగన్ కే మంచిదిగా అనిపిస్తుంది. అవినీతి రాజకీయాల గూర్చి మాట్లాడే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ దేశంలో ఎవరు అవినీతిపరులు కాదు? ములాయం, మాయావతి, లాలూ, కరుణానిధి.. వీళ్ళంతా ఎవరు? సీబీఐ కేసులనేవి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం చేతిలో ఉండే ముకుతాళ్ళు. నువ్వు నీతిసూత్రాల్ని, న్యాయసూత్రాల్ని ఖచ్చితంగా అప్లై చేస్తే ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాల్సి వుంటుంది." అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! యువార్ టాకింగ్ నాన్సెన్స్! జగన్ని ఎలా సపోర్ట్ చేస్తావు?"అన్నాను.
"నేను ఎవ్వర్నీ సపోర్ట్ చెయ్యడం లేదు మిత్రమా! వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాను. మనది రాజకీయంగా నిరక్షరాస్య దేశం. మధ్యతరగతి మేధావులు ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తుంటారు. తల్లిని చంపేశారని రాజీవ్ గాంధీకి బంగారు పళ్ళెంలో అధికారమిచ్చాం. రాజీవ్ గాంధీని చంపేశారని సోనియాకి పట్టం కట్టాం. ఇంత పెద్దదేశంలో రాజకీయాలు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపర్చే పథకాలతో కాకుండా సెంటిమెంటుతో నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా లేదూ!" అన్నాడు సుబ్బు.
ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"మన అనుభవంలో ఉన్న విషయాల్ని మాత్రమే మనం అర్ధం చేసుకోగలం, అనుభూతి చెందగలం. ఈ అనుభూతి లేనిదే ఫలానావాడు దుష్టుడు, దుర్మార్గుడు అని ఎంత చెప్పినా మనకి అర్ధంకాదు. ఇవన్నీ మన మైండ్ కి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి - అమెరికావాడు అంతర్జాతీయంగా చేస్తున్న రౌడీయిజం మనకి పట్టదు. అదే ఒక వీధిరౌడీ అరాచకానికి మాత్రం కోపం తెచ్చుకుంటాం. విమానం కూలి నాలుగొందల మంది మరణించారన్నా పెద్ద బాధగా ఉండదు, అదే ఏ రైలేక్సిడెంట్లోనో ఇద్దరు చనిపోయినా చాలా బాధ పడతాం." అన్నాడు సుబ్బు.
"సుబ్బు! నువ్వు జగన్ అవినీతి గూర్చి మాట్లాడకుండా ఏదేదో చెబుతున్నావ్." గుర్తు చేశాను.
"నేను రిలవెంట్ గానే మాట్లాడుతున్నాను. అమెరికావాడి రాజకీయం లాగే, సమాజంలో సామాన్య జనాలకి అర్ధం కాని, ఐడెంటిఫై చేసుకోలేని అవినీతి ఉంటుంది. 2 జి స్పెక్ట్రమ్ అంటే ఏంటి? క్విడ్ ప్రోకో (quid pro quo) అంటే ఏదో తిట్టులా లేదు? గాలి జనార్ధనరెడ్డి చేసిన తప్పేంటి? ఏవో గనులు అక్రమంగా తవ్వాట్ట! మనకి మనూళ్ళో మునిసిపాలిటీవాడు అడ్డదిడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన గుంటలు మాత్రమే తెలుసు. అట్లాంటి మనం - ఎక్కడో కొండల్లో తవ్వే గనులు, గుంటలు ఎలా ఊహించుకోగలం? నువ్వూహించుకోగలవా?" అడిగాడు సుబ్బు.
"నావల్ల కాదు." అన్నాను.
"లక్షకోట్ల అవినీతి అంటారు. ఎవడన్నా కోటిరూపాయిలు ఎప్పుడన్నా లెక్కబెట్టాడా? కనీసం కంటితో చూశాడా? ఇవన్నీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాని, కాలేని తెలివైన భారీనేరాలు. ఈ నేరాలు అర్ధం చేసుకోవాలంటే మనం సి.ఎ. చదివుండాలి." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.
"సుబ్బూ! నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకోని సమాజం మనది అంటావ్. అంతేనా?" అడిగాను.
"నా పాయింట్ అది కాదు! మనం మన స్థాయికి తగ్గ నేరాల్ని మాత్రమే గుర్తించగలం. జేబుదొంగల్ని తన్ని పోలీసులకి అప్పజెబుతాం. అర్ధరాత్రి ఇళ్ళల్లో పడే దొంగల్ని కరెంటు స్థంబానికి కట్టేసి చావగొడతాం. ఆస్పత్రిలో పది, ఇరవై అడుక్కునే వార్డ్ బాయ్ ని అసహ్యించుకుంటాం. అందుకే శంకర్ తీసిన 'భారతీయుడు' అంత హిట్టయ్యింది, అన్నాహజారే అంత పాపులరయ్యాడు." అన్నాడు సుబ్బు.
"అవును కదా!" ఆశ్చర్యపొయ్యాను.
సుబ్బు చెప్పడం కొనసాగించాడు.
"ఒక తప్పుడు జీవోతో, అదే ఆస్పత్ర్లి భూమిని కాజేసి వందకోట్లు లబ్ది పొందే ప్రభుత్వ పెద్దల్ని పెద్దగా పట్టించుకోం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేసి వేల కోట్ల అవినీతి చేస్తే, అసలా ప్రాసెస్సే అర్ధం కాక, కొద్దిసేపు బుర్ర గోక్కుని వదిలేస్తాం." అన్నాడు సుబ్బు.
"జగన్ అవినీతి సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యేది కాదంటావ్! అంతేగా? మరి జగన్ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో చెప్పలేదు." అడిగాను.
"కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఎన్నికల్లో గెలిచే దాకా వదిలేట్టులేరు! నా లాజిక్ సింపుల్. దొంగని రెండు దెబ్బలేస్తే జనాలు తృప్తినొందుతారు, 'తిక్క కుదిరింది వెధవకి' అనుకుంటారు. అదే దొంగని చెట్టుకి కట్టేసి కొడితే 'అయ్యో పాపం!' అనుకుంటారు. కాంగ్రెస్ జగన్ని ఒకస్థాయిదాకా ఇబ్బంది పెడితే జనాలు పట్టించుకోరు. అవినీతికి శిక్ష పడిందనుకుంటారు. కానీ - దానికొక లక్ష్మణ రేఖ ఉంది, ఆ రేఖని కాంగ్రెస్సోళ్ళు దాటుతున్నారు. ఇది కాంగ్రెస్ కి సూసైడల్." అన్నాడు సుబ్బు.
"సోనియాగాంధీకి జగనంటే కోపం ఉండి ఉండొచ్చు." అన్నాను.
"రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకి తావులేదు. ఇందిరాగాంధీకి బేడీలు వేయించి కక్ష తీర్చుకున్న చరణ్ సింగ్ ఏమైపొయ్యాడు? నిండు కొలువులో జయలలిత చీరని లాగించిన కరుణానిధి తరవాత ఎలక్షన్లో మట్టి కరిచాడు. ముసలి కరుణానిధిని అర్ధరాత్రి ఎత్తి అవతల పడేయించిన జయలలితని ఆ తరవాత ఎలక్షన్లో ప్రజలే ఎత్తి అవతల పడేశారు!" అన్నాడు సుబ్బు.
"అదంతా సానుభూతి కోసం రాజకీయ నాయకులు చేసిన నటన సుబ్బూ!" నవ్వుతూ అన్నాను.
"అదేంటి మిత్రమా నటనని అంత తేలిగ్గా తీసిపడేశావ్? 'రక్తసంబంధం'లో రామారావు, సావిత్రి నిజమైన అన్నాచెల్లెళ్ళనుకుని ఆంధ్రదేశం యావత్తూ రోదించిందా? ఎన్టీరామారావు నిజమైన రాముడని ప్రజల నీరాజనం అందుకున్నాడా? గత వారం రోజులుగా అన్ని న్యూస్ చానెళ్ళు జగన్ని తప్పితే వేరేదీ చూపించట్లేదు. జనాలు కూడా ఏడుపుగొట్టు సీరియళ్ళు చూడ్డం మానేసి జగన్ అరెస్టు గూర్చి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇది జగన్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. లక్ష్మణ రేఖని దాటుతున్న కాంగ్రెస్ నాయకత్వం జగన్ని అధికారం అనే గారెల బుట్టలోకి తంతుంది." అన్నాడు సుబ్బు.
"ఆ లక్ష్మణరేఖ ఎక్కడుందో నీకుమాత్రం ఎలా తెలుసు?" అడిగాను.
"నాకు తెలుసని నీకు చెప్పానా? నాకూ తెలీదు. కానీ అమ్మకి తెలుసు! ఆవిడ నిన్నట్నించి 'పాపం! తండ్రి లేని పిల్లాడు, ఆ అబ్బాయిని ఎందుకంతలా వేధిస్తున్నారు?' అనడం మొదలెట్టింది. ఇది కాంగ్రెస్ కి దుర్వార్త. మా పనమ్మాయి 'పాపం! వాళ్ళ నాన్న మా నాన్నకి ఫ్రీగా గుండాప్రీషన్ చేయించాడు. ఆ బాబుని జైల్లో యేయించినోడు పురుగులు పడి చస్తాడు.' అని పొద్దున్న అంట్లు తోముతూ అంది. ఇది జగన్ కి శుభవార్త. మన ప్రభుత్వాల్ని నిర్ణయించేది వీళ్ళే." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు.
"రాజకీయ విషయాలు మాట్లాడేప్పుడు ఏ ఎన్.రామ్ నో, రామచంద్ర గుహానో కోట్ చెయ్యాలి. నువ్వు మీ అమ్మనీ, పనిమనిషినీ కోట్ చేస్తావేమిటి?" చికాగ్గా అన్నాను.
"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా! ఇంక మళ్ళీ నేనెందుకు? ఈ దేశంలో మధ్యతరగతి మేధావులు వాస్తవాల్ని గుర్తించడం మానేసి చాలాకాలం అయ్యింది, అందుకే నేను వాళ్ళ ఆలోచనలు పట్టించుకోను. ఇంక నేవెళ్తా! దారిలో చాలా పనులున్నయ్." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
గమనిక : ఈ పోస్ట్ రాసేప్పటికి జగన్ అరెస్టవ్వలేదు.
కృతజ్ఞత : ఆత్మీయ మిత్రుడు గోపరాజు రవికి..
(photo courtesy : Google)
chaala chaala bhaga raasarandi,
ReplyDeletemana voter psychology.
ippatidaka mee blog chadavaledu
inka chaadavali, anni.
తినగా తినగా వేము తియ్యనుండు అంటే ఇదే మరి
ReplyDeleteExcellent
ReplyDeleteమీ సుబ్బు, వైకాపాలో తీర్థం పుచ్చుకోబోతున్నాడంటారు, అంతేనా!
ReplyDelete/తినగా తినగా వేము తియ్యనుండు అంటే ఇదే మరి/
:)) బాగా చెప్పారు. ఒక్క వేమే కాదు, గడ్డిగాదం కూడా తియ్యనుండు.
"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా. ఇంక మళ్ళీ నేనెందుకు?"
ReplyDeleteఇంతకీ మేధావి ఎవరు? ఇన్నాళ్ళూ సుబ్బుగారు మేధావి అనుకున్నాం. మరి ఆయన ఇప్పుడు రమణగారికి ఈ బిరుదు అంటకట్టారెంటి?
నిజం, నిజం, జగన్ అరస్టు కాడు, ఎన్నికలయీదాకా.సుబ్బు ది గ్రేట్
ReplyDeleteSubbu musugu vesukuni baga cheppavu ramana "mama", Jagan is only tip of the iceberg, 99 percent of us are corrupt, the society is corrupt, unless we change, we can not expect politicians to be honest, in a way I appreciate todays politicians for thier energy, for managing massess and keeping them sedated with populist measures and Varuna (Daruna ) Vahini. Many of us may not be accepting bribes directly, but each one in society should try to be honest to the possible extent and help the needy.
ReplyDelete*ఎన్.రామ్ నో, వినోద్ మెహతానో *
ReplyDeleteఇద్దరు ఇద్దరే పెద్ద కామేడి మనుషులు. ఎన్.రామ్ రామోజి ని వెనుకవేసుకొని వచ్చాడు. హిందూ గ్రూప్ లో వచ్చిన విభేదాల సందర్భంగా ఆయన ఎలా ప్రవర్తించాడో తెలిసిన విషయమే. ఇక వినోద్ మేహతా సోనియా కి చెక్క భజన చేస్తాడనేది బహిరంగ రహస్యం. వినోద్ మెహత, వీర్ సింగ్వి లు వీరంతా ఒక జట్టు. తమకి ఉన్న కమ్యునికేషన్ స్కిల్స్ వలన ఇంగ్లిష్ మీడియాలో సొల్లు వాగుతూంటారు. వీర్ సింగ్వి భండారం బయట పడింది కనుక మీడియాలో కనపడటం లేదు. వినోద్ మెహత జర్నలిస్ట్ లు గా సాధించిన విజయాలు ఎమైనా ఉన్నాయా?
@anonymous,
ReplyDeleteనా పోస్టుకి ఓ ఇద్దరు పాపులర్ జర్న్లలిస్టుల పేర్ల అవసరమొచ్చింది. గుర్తొచ్చిన ఈ ఇద్దరు పేర్లు రాసేశాను. అంతే! అంతకు మించి వాళ్ళేదో గొప్ప జర్నలిస్టులని రాయలేదు.
rajasekhar Dasari గారు,
ReplyDelete>>తినగా తినగా వేము తియ్యనుండు అంటే ఇదే మరి.<<
నాకు మీ కామెంట్ అర్ధం కాలేదండి!
@the tree,
ReplyDeletethank you.
@Truely,
thank you.
SNKR గారు,
ReplyDeleteమీరు సుబ్బుని అపార్ధం చేసుకున్నారు.
నాకు తెలిసి (పాపం!) సుబ్బుకి వైకాపా కి ఏవిధమైన సంబంధమూ లేదు.
Jai Gottimukkala గారు,
ReplyDeleteసుబ్బు నన్ను మేధావి అని వెటకారంగా అన్నాడు లేండి. సుబ్బునే మేధావి. నేను కాదు.
kastephale గారు,
ReplyDeleteజగన్ అరెస్టయిపోతాడనే భయంతో ఏకబిగిన, హడావుడిగా ఈ పోస్ట్ రాసేశాను.
ఇప్పుడు మీరు జగన్ అరెస్ట్ కాడంటున్నారు!
సి బి ఐ జగన్ పాపాన వాళ్ళని వదిలేస్తే పోయేది...
ReplyDeleteఈ న్యూస్ చానల్స్ వారు కూడా పక్కన పడేస్తే పోయేది...
అనవసరముగా జగన్ హీరో గా మార్చేశారు...
తనకోపమే తనకు శత్రువు అంటే ఇదేనేమో...
జగన్ మీద ఉన్న కోపం తో ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ ఇచ్చేసి జనాల్లో జగన్ ఇంక నానేలా చేశారు...
ఈ రోజు జగన్ కి ఇంత ఫోల్లోవింగ్ పెరిగింది అంటే అది ABN TV9 ఈనాడు చానల్స్ వాళ్లనే...
ఏమి ఏమి వ్రాస్తునారో కూడా వారికే తెలియకుంట పోయింది..
జగన్ మీద కోపం తో వీళ్ళు మూర్ఖులుగా మారిపోయారు...
ఏ రోజుతో వీళ్ళని ఎవరు నమ్మని స్థితి కి తెచ్చుకున్నారు...
ప్రతి చిన్న విషయాన్నీ సినిమాగా మర్చి చూపెట్టారు...
అయ్యో ! పిచ్చి డాక్టర్ గారు.. మీరు,నాలాంటి వారు లక్షల మంది జగన్ అరెస్ట్ ఖాయం అనుకుంటున్నారు.
ReplyDeleteసుబ్బు .. చెప్పినది నిజం .. అరెస్ట్ చేస్తే సానుభూతి ఓట్లు పడతాయండి. మళ్ళీ జగన్ హీరో అవడం ఇష్టమా చెప్పండి?అందుకే.. అవినీతి అలా నానుతూనే ఉంటుంది. అవినీతి రాజకీయాన్ని ఉతికే సబ్బులు లేవని.. సానుభూతి పవనాలతోనే దేశం నడుస్తూ ఉంటుంది.సుబ్బు బాగా చెప్పారు. సుబ్బు గ్రేట్ ! మీరు మరొక సారి కాఫీ తాగండి.
(పిచ్చి డాక్టర్ గారు అన్నది అభిమానం తోనే నండీ!)
Excellent analysis. I totally agree. Everyone says he swindled 100,000 cr. If you look at CBI charge sheets they don't even cross a fraction of the fraction of it. I also do not know how anybody can prove quid pro quo in a capitalist economy. People have invested in Jagan's businesses. It is not Jagan's concern or responsibility how and why they invested. The fact that those investments have actually profitable give them a chance to argue...they invested because there is an opportunity and here is the proof. I do not know how to argue with that. My belief is if CBI wants to pursue, the order should be in reverse. The cabinet who signed those GOs followed by the bureaucracy followed by the industrialists then Jagan. At the end Jagan will be arrested for a violation of some obscure law for a very small money (relatively)at best.This harassment only going to help him. Its a pity that we may end up ruled by a culprit.
ReplyDeleteరమణా, చాలా బాగా రాశావు. పొలిటికల్ కాన్షస్ నెస్ అన్ని దేశాల్లొనూ తక్కువే అనుకుంట. ఇక్కడ అమెరికా లో కూడా ప్రజలు వాళ్ల సొంత ఇంటరెస్టుల కే వ్యతిరేక మైన కాండిడేట్స్ కి వోటేస్తారు. ఎందుకంటే పాలిటీషీన్స్ ప్రజల్ని వెడ్జ్ ఇస్స్యూస్ తో మోసం చెస్తుంటారు - అదే- గే మేరేజ్, స్కూల్ ప్రేయర్, దేశ భక్తి, వగైరా. క్రిష్ణ మోహన్ గారు చెప్పినట్లు అందరూ కరప్టయిపోయారు. గత ఇరవై ఏళ్లలో ప్రపంచంలో అవినీతి, లంచగొండితనం, గ్రీడ్ అన్-ప్రెసిడెంటెడ్ లెవెల్స్ కి వెళ్ళాయి. పెరుగుట విరుగుట కొరకే లేదా ఇట్ నీడ్స్ టు గెట్ వర్స్ బిఫొర్ ఇట్ గెట్స్ బెటర్ అన్నట్లు మంచి రోజులు ముందున్నాయేమో మరి!
ReplyDeleteబి ఎస్ ఆర్
(ప్రస్తుతం జమైకా నించి)
బై ద వే , నీ రాతలెప్పుడూ తియ్యగానే ఉంటాయి. నో ఎడాప్షన్ నీడెడ్. ఐతే కొన్ని టాపిక్స్ కొంత మంది కి చేదు గా ఉండ వచ్చు! మరి అది వాళ ప్రాబ్లం!!
ఇవ్వాళా నేను కూడా తెలిసిన వారితో ఫోన్ లో మాట్లాడుతున్నపుడు ఇదే గొడవ (వాళ్ళు ఏదో ఎలెక్షన్ పని లో ఉన్నారు )..
ReplyDeleteమీ పిచ్చి కాని, ఇందులో తప్పేమి ఉంది. రామారావును వదిలేసి బాబుకు పట్టం కట్టిన ప్రజలే కాంగ్రెస్ ని వదిలేసి, జగన్ కు పట్టం కడుతున్నారు. టి డి పి అంటే బాబు అని నమ్మినట్లే ,కాంగ్రెస్ అంటే జగనే అని నమ్ముతున్నారు.
జగన్ ని వదిలేసినా , వేధించినా రెండూ తప్పిదాలే కాని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది రైటే అనుకొంటున్నాను. దీనివల్ల కాంగ్రెస్ జగన్ తర్వాతి స్థానం లో అయినా ఉంటుంది అవినీతి పై పోరాటం చేసినందుకు. ఈ కేసులు ,గొడవలు అన్ని కేవలం రెండవస్థానం కోసం అన్నమాట .కాబట్టి లక్ష్మణ రేఖ అన్నది ఒక మిధ్య అని సుబ్బు కి చెప్పండి.
రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోని, పైగా చిరాకు పడే సంతానం నాన్న ఒక్క విషయం అడుగుతాను చెప్పు జగన్ ను ఒక్కన్ని చేసి అంతా వేదిస్తున్నారు కదా ఉప ఎన్నికల ముందు అతన్ని ఇలా వేదించడం కరక్టేనా కాదా నీ అభిప్రాయం చెప్పు అనే ప్రశ్న వచ్చింది ?
ReplyDeleteజగన్ కు ఎదురు లేదు ఉప ఎన్నికల్లో ఈ ప్రశ్నకు సమాధానం వస్తుంది చూడు అని అన్నాను. మీ పోస్ట్ లోని తల్లి, పని మనిషి మాటలు చదివాక గుర్తుకొచ్చింది
పావని గారు,
ReplyDelete? It is not Jagan's concern or responsibility how and why they invested. The fact that those investments have actually profitable give them a chance to argue...they invested because there is an opportunity and here is the proof. I do not know how to argue with that.??
ఇది చూస్తే ఇంకో లాజిక్ రామాయణం లో కనిపిస్తున్నది,
సీత గీత వెలుపలి కి రాగానే రావణుడి నిజరూపం చూసి దడుచుకొని సొమ్మసిల్లి పడిపోతుంది, ఇంట్లో చుస్తే ఎవరు లేరు, పాపం అని రక్షించడానికి జాగ్రత్తగా కనీసం తాక నైనా తాక కుండా లంకకు తీసికొని వెళ్తాడు. హనుమంతుడే మో చూసి వెళ్ళకుండా కాల్చి వెళ్ళాడు. పాపం రావణుడు అందుకే యుద్దమే సరి అన్నాడు. ఆ యుద్ధం లో కూడా మోసం చేసి గెలిచాడు రాముడు.
మీరు చెప్పిన వివరం చూస్తే ఇలా అనిపించింది , సరదాగా తీసికోండి, జగన్ అవినీతి పై నాకేం అభ్యంతరం లేదు :)
"పాపం రావణుడు అందుకే యుద్దమే సరి అన్నాడు. ఆ యుద్ధం లో కూడా మోసం చేసి గెలిచాడు రాముడు. "
ReplyDeleteఈవిడ ఎవరో ఇప్పుడే రంగనాయకమ్మ విషవృక్షం చదివి వచ్చినట్లు ఉంది (మోసం చేసి గెలిచాడు రాముడు అంటారా!). ఈ ఆంధ్రోళ్ల కి ఎప్పుడు విలన్ లో మంచి గుణాలు, హీరోలో చెడ్డ గుణాలు కనిపిస్తాయి కాబోలు. యన్. టి.ఆర్. వారసులు బ్లాగులో చాలామంది ఉన్నారన్నమాట. ఆయన కి దుర్యోధనుడు సుయోధనుడిలాగా, పాంచాలి కర్ణుడిని పెళ్లి చేసుకోవలనుకొన్న కోరికను కృష్ణుడి కి చెప్పినట్లు దానవీరశూరకర్ణ సినేమాలో చూపుతారు. పేరు ప్రఖ్యాతులు హీరోగా వచ్చేకొద్ది ఇటువంటి పైత్యపు ఆలోచనలు చాలా వచ్చి , తన వర్గ రచయితల చేత కథలు రాయించి, నటించి ఆ పైత్యన్ని సినేమా తెర మీద వాంతి చేసుకొనేవారు.
అజ్ఞాతా,
ReplyDeleteపేరు చెప్పుకోలేని అభాగ్యుడివి, కాబట్టి భాష అయినా సరిగా ఉండేట్టు చూసుకో. విషవృక్షం నేను చదవలేదు , రంగనాయకమ్మ రాసింది ఏది నావ్యాఖ్యలో ఉండదు.
రాముడు ధర్మ యుద్ధం చేస్తే రావణున్ని వధించ లేడు, ఇది నీకు కూడా తెలుసు. అయినా సరదాగా పావని గారు జగన్ ని సమర్ధించే లాజిక్ ఇలా ఉంది అని చెప్పిన వ్యాఖ్య అది. అందులో రావణుడు హీరో అని అన్నట్లు కనిపించిందా నీకు ? పాపం నీకు నా ప్రగాఢ సానుభూతి !!!!!!!
ఇంత చిన్న సరదా వ్యాఖ్యలోనే, మళ్ళి ఆంద్రోళ్ళు అని ప్రాంతీయ విద్వేషం, కులాలు, ఎన్ టి ఆర్, వర్గాలు అహహా ఒహోహో ...ముందే రాసిపెట్టుకున్నావా ఏంటి ?
మీకు సినిమా పిచ్చి ఉంటె వెకిలి సినిమా వ్యాసాలు వచ్చే చోట ఆ కబుర్లు చెప్పుకోండి.మాకూ ప్రశాంతం గా ఉంటుంది .
రమణ గారు ఇటువంటి కామెడి అజ్నాతల కి మీ బ్లాగు పెట్టింది పేరు. మీ బ్లాగులో వ్రాయడానికి వీళ్ళు ఒక పది వ్యాఖ్యలు ముందే రెడీ చేసిపెట్టుకొని కాపీ-పేస్టూ చేస్తున్నట్లు ఉంటాయి. మంచి టైం పాస్ మీకు.
వినోద్ మెహతాలు, ఎన్ రామ్‌లూ పోలింగ్ బూత్ కెళ్ళి ఓట్లేయరు. ఈ అమ్మలు, పనమ్మాయిలే ఓటింగ్‌కి వెళ్తారు.
ReplyDelete1. రావణుడు "పాపం" అని రక్షించడానికి జాగ్రత్తగా కనీసం తాక నైనా తాక కుండా లంకకు తీసికొని వెళ్తాడు.
ReplyDelete2. "పాపం" రావణుడు అందుకే యుద్దమే సరి అన్నాడు.
3. హనుమంతుడే మో చూసి వెళ్ళకుండా కాల్చి వెళ్ళాడు
4. యుద్ధం లో కూడా మోసం చేసి గెలిచాడు రాముడు
5. రాముడు ధర్మ యుద్ధం చేస్తే రావణున్ని వధించ లేడు.ఇది నీకు కూడా తెలుసు
ఒకసారి పైన రాసినది మళ్లి చదువుకో. రెండు సార్లు రాశారు "పాపం" రావణుడు అని అతనిమీద సానుభూతి చూపుతూ, రాముడు యుద్దంలో మోసం చేసి గెలిచాడు, ధర్మ యుద్దం చేస్తే గెలవలేడు, హనుమతుడు లంకను కాల్చాడు. ఇవ్వన్ని ఇతరులకు వినిపించి/ ఎవరికైనా చూపించి వారిని అడిగి అభిప్రాయం తెలుసుకొంటే నీకేతెలుస్తుంది. రామాయణాన్ని ఒక్క వాక్యం లో చెపప్పొచ్చు. రామో విగ్రహవాన్ ధర్మ: (Rama the embodiment of dharma)అటువంటి రాముడిని అసందర్భంగా కోట్ చేస్తూ, ధర్మాత్ముడు కాడని రాయటం మీ లాంటి మేధావులకే చెల్లింది.
*అయినా సరదాగా పావని గారు జగన్ ని సమర్ధించే లాజిక్ ఇలా ఉంది అని చెప్పిన వ్యాఖ్య అది *
ఓ హో హో ఆ హ హ అనిపొట్ట చేక్కలయ్యేంత నవ్వు వచ్చింది. మీరు భలే కామేడి చేస్తారoడి.
మీరు రాసింది జగన్ సమర్ద్జంచే లాజిక్ అని తెలియక నేనే పొరబడ్డానన్న మాట. రాముడి ధర్మ యుద్దం చేయలేదని చెప్పటం , జగన్ వ్యవహారం తీసుకేళ్లి రామాయణం లో ని కథ తో ముడి పెట్టినపుడే అర్థమైంది మీ ప్రతిభ, పాటవం.
*పేరు చెప్పుకోలేని అభాగ్యుడివి*
అమ్మో పేరే! రామాయణం తెల్సిన మీలాంటి గొప్ప పండితుల ముందు పేరు చెప్పుకొనేంతటి, పేరును నేను ఇంకా సంపాదించలేదండి బాబు. నన్ను వదిలేయండి. మరి నాపేరు తెలుసుకోవాలని మీకు కోరికుంటే గనుక ప్రస్తుతానికి 12345# అనుకోండి.
చివరిగా రామాయణం గురించి మీ అభిప్రాయాలు చదివి, వ్యాఖ్యల రూపంలో చర్చిస్తూ నాకు చాలా టైంపాస్ అయింది. వీకేండ్లో ఖర్చులేకుండా ఇంట్లో కుచొని టైంపాస్ చేసే, ఇటువంటి సదవకాశాన్ని నకు కలిగించినందుకు మీకు, రామయణం మీద ఉన్న మీ పట్టుకి మరొక్కమారు ధన్యవాదాలు.
"మరి నాపేరు తెలుసుకోవాలని మీకు కోరికుంటే గనుక ప్రస్తుతానికి 12345# అనుకోండి."
ReplyDelete12345# గారూ
" ఈ ఆంధ్రోళ్ల కి ఎప్పుడు విలన్ లో మంచి గుణాలు, హీరోలో చెడ్డ గుణాలు కనిపిస్తాయి కాబోలు."
అసలు ఆంధ్రోళ్ల అంటూ అక్కసు వెళ్ళగక్కాల్సిన సందర్భం ఏముంది ఇక్కడ? ఇలా అసందర్భంగా ప్రాంతాల పేరుతొ హేళన చేయడం బాగాలేదు. బహుశా మీ నరనరాల్లో పేరుకుపోయిన అకారణ ద్వేషం ఇలా మాట్లాడిస్తోందేమో. డాక్టర్ గారు మానసిక వైద్యులే. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్లి చూపించుకుని రండి. తప్పకుండా మీకు నయమవుతుంది.
పెద్ద అక్షరాల శంకరు యస్,
ReplyDeleteఆంధ్రోలో వుండను కనుక మీ సలహాను తీసి రీసైకిల్ బిన్ లో (అదే నండి చెత్త బుట్టలో)వేయడం జరిగింది. ధన్యవాదాలు.
12345#
ఓహో మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉండరా. అయినా పరవాలేదండీ. శలవు పెట్టుకుని రాగలిగితే మన డాక్టర్ గారు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.
ReplyDelete@12345# గారు
ReplyDeleteఅన్నట్టు మీకున్న వ్యాధిని "ఆంధ్రోఫోబియా" అంటారటండీ. సూర్యుడు తూర్పున ఉదయించినా ఆంధ్రోల్లేకారణం అనుకోవడం, చివరాఖరికి తమకి జలుబు చేసినా అందుకు కారణం ఆంధ్రోల్లే అని ఆడిపోసుకోవడం ఈ వ్యాధిగ్రస్తుల లక్షణాలట.
This comment has been removed by the author.
ReplyDelete/రామో విగ్రహవాన్ ధర్మ: , అటువంటి రాముడిని అసందర్భంగా కోట్ చేస్తూ, ధర్మాత్ముడు కాడని రాయటం మీ లాంటి మేధావులకే చెల్లింది. /
ReplyDeleteవహ్వా! గట్టి పట్టే పట్టావు. తిరుగులేదు, శహభాష్! శెభాష్!!
( నాలో... తెలగాన్లంతా తెలబాన్లు కారు, కొండొకచో బుద్ధిమంతులు వుంటారు అని నిరూపణ అయ్యింది. బహుశ ఆంధ్రోళ్ళ 50ఏళ్ళ సాంగత్యంతో <10% అలా అయివుంటారు). :D
/ఓ హో హో ఆ హ హ అనిపొట్ట చేక్కలయ్యేంత నవ్వు వచ్చింది. మీరు భలే కామేడి చేస్తారఒడి. /
ఇది మాత్రం నేను ఒప్పుకుంటున్నా...
రమణ గారు,
ReplyDeleteమీ రు మీ అభిమాన అజ్నాతల కి, కెలుకుడు వ్యాఖ్యాతలకి ఇంకా వ్యాఖ్యలు చదవడం , చదివి సమాధానం ఇవ్వడం కుడా నేర్పించలేదు , జగన్ లాగే రావణుడు కూడా అమాయకుడు అని వెటకారం చేస్తే అర్ధం కాక మీ బ్లాగు పెంట పెంట చేస్తున్నారు. మళ్లీ సానుభూతి గుంపు గుంపు కి ప్రకటించేస్తున్నాను.
'పాపం జగన్' అనడం బాగున్నప్పుడు, 'పాపం రావణుడు' అనడం ఎందుకుబాగుండదో, అసలు ఈ చర్చ అంతా చేసిన మీ సుబ్బు ని అనాలి.
పెద్దక్షరాల శంకర్ యస్,
ReplyDeleteఇంతక్రితం బహుశా మీ నరనరాల్లో పేరుకుపోయిన అకారణ ద్వేషం ఇలా మాట్లాడిస్తోందేమో! అని అన్నారు గదా. గురివింద సామేత గుర్తుకు చేసుకొంట్టూ, మరి మీ నరనరాలలో పేరుకుపోయిన కులగజ్జి సంగతి ఒకసారి స్పురణకు తెచ్చుకొండి. మీ కుల గజ్జి, అధికారన్ని అడ్డుపెటుకొని దగ్గరిత్రోవలో సంపాదించే డబ్బు పిచ్చి చూసి, మేము వంట పట్టిచుకొన్నాం తెలంగాణా పిచ్చి.
మొదట కృష్ణా, గుంటూరు జిల్లాల ఆంధ్రోళ్లు వాళ్ల కులగజ్జికి డాక్టర్ గారి దగ్గర చికిత్స చేయించుకోమనండి. వాళ్లకి చికిత్స చేసి, ఆయన అందులో విజయంసాదిస్తే చికిత్స చేయించుకోవటానికి నేను తప్పక వస్తాను.
*బహుశ ఆంధ్రోళ్ళ 50ఏళ్ళ సాంగత్యంతో <10% అలా అయివుంటారు.*
నాలుగక్షరాల శంకరు,
మాకొచ్చే ప్రతి క్రేడిట్ లోను, అంతా మాతో ఉండబట్టే వచ్చిందని, తెలివిగా క్రేడిట్ లో భాగం కొట్టేయాలనే మీ ఎత్తులు ఇక సాగవ్. ఆంధ్రోళ్ళ 50ఏళ్ళ సాంగత్యంతో వారి వ్యూహాలన్ని తెలిసిపోయాయి.
లేడి ఆర్కే,
పాపం డాక్టర్ గారిని ఈ విషయం లో లాగకు. ఆయన మనసులో మార్క్స్ సిట్ భావాలు ఎన్నో ఉన్నా, పైకి బాహాటంగా కనపడనీయకుండా,వాటిని అణచుకొని రాజకీయ వ్యాసాలకు మంచి హాస్యాన్ని జోడించి బ్లాగులో టపాలు రాస్తున్నారు. ఈ మధ్య డాక్టర్ గారి బ్లాగులో చాలా మార్పులు చేసుకొన్నాయి. గమనించారో లేదో బ్లాగులో ఉండే ఐదు పోటోలలో మూడు తెలుగు వారి పోటోలు ఎర్ర భావాల వారివే (తెల్ల వాళ్ల పేర్లు తెలియదు.) వీరు తెలుగు ప్రజలందరు యాక్స్పేట్ చేసిన గొప్ప రచయితలు, ఇక ఆ ఇద్దరే మిగిలి పోయారు. వాళ్లను తెచ్చి బ్లాగులో పెట్టుకొంటే ఎమనుకొంటారోని ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. డాక్టర్ గారికి మనసులో రంగనాయకమ్మ, ఓల్గా ల పోటొలు కూడా తెచ్చి పెట్టుకోవాలనే ఉన్నట్లుంది :)
ఇక ఆంధ్రోళ్ల సంగతి అందరికి తెలిసిందే. ప్రజలు దేవుడిగా పూజించే రాముడిని, గతి తార్కిక వాదం కోణంలో ఒకరు, హేతువాద కోణంలో మరొకరు రామాయణన్ని విశ్లేషించి ఒక సాధారణ మానవుడి స్థాయికన్నా ఆయనని తక్కువ వాడులాగా పుస్తకాలు రాశారు. ఆరోజుల్లో మా తాతలు అప్పుడే మార్కేట్ లో వచ్చిన కొత్త సిద్దాంతాలతో వారు చేసే విశ్లేషణలని ఎలా ఎదుర్కోవాలో వెంటనే తెలియక నిర్ ద్వందం గా ఖండిచలేక పోయారేమో అనిపిస్తుంది. ఇప్పుడు చర్చకు రమ్మనండి.
To be continued ...
డాక్టరు గారూ... మీరూ మా మీడియా వాళ్ళలా కక్ష్య సాధిస్తే ఎలా అండీ? అలా ఆకాశంలోకి ఎగిరిపోకుండా మామూలు కక్ష సాధించండి. :)
ReplyDeleteడాక్టరు గారూ... మీరూ మా మీడియా వాళ్ళలా కక్ష్య సాధిస్తే ఎలా అండీ? అలా ఆకాశంలోకి ఎగిరిపోకుండా మామూలు కక్ష సాధించండి. :)
ReplyDeleteకామెంటిన మిత్రులందరికీ.. పేరు పేరునా ధన్యవాదాలు.
ReplyDeleteబుర్రలోని ఐడియాలని నా బ్లాగులోకి unload చేస్తున్నాను. భయంకర ఎండాకాలం. కావున.. నిజంగానే 'పని లేక.. ' రాస్తున్నాను. సరదాగా రాస్తున్నాను. అంతే!
నాకు కాంగ్రెస్ కపట రాజకీయాల పట్లా.. చంద్రబాబు అవకాశవాద రాజకీయాల పట్లా.. జగన్ రౌడీ రాజకీయాల పట్లా అపార గౌరవం ఉంది. సందర్భాన్ననుసరించి ఒక్కోసారి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ రాసినట్లు అనిపించవచ్చు. అది కాకతాళీయం మాత్రమే.
మన ఇష్టం వేరు. చాలా హేతుబద్దంగా ఆలోచన చేసి.. ఇలా జరిగితే బాగుండుననిపిస్తుంది. కానీ అలా జరగదు. ఉదాహరణకి మధ్యతరగతి వారికి అత్యంత ముఖ్యమైన ఎజెండా అవినీతి. మీడియాలో వీరిదే హవా. అయితే ఈ ఎజెండాని దిగువ తరగతివారు పట్టించుకోరు! ఎందుకు?!
నాకు కబుర్లంటే ఇష్టం. నా పేషంట్లతో మాట్లాడుతుంటే చాలా ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. వారు నాకన్నా తెలివైనవారు. అప్పుడప్పుడు ఆ ఆలోచనలని కూడా టపాగా రాస్తుంటాను.
ఇహ నా బ్లాగులో ఉంచిన ఫొటోల గూర్చి. వీరు నాకు అత్యంత ఇష్టులు. వీరి పేర్లు.. రావిశాస్త్రి, శ్రీశ్రీ, కొడవటిగంటి, సోమర్సెట్ మామ్ , చెహోవ్. నా రాతలకి ఆనుకుని వీరి ఫోటోలని ఉంచడం నాకు సంతోషాన్నిస్తుంది. ఎందుకు? నాకు తెలీదు!
నా బ్లాగుని చదువుతూ, కామెంట్లు రాస్తూ.. ప్రోత్సాహిస్తున్న మిత్రులకి కృతజ్ఞతలు.
/డాక్టర్ గారికి మనసులో రంగనాయకమ్మ, ఓల్గా ల పోటొలు కూడా తెచ్చి పెట్టుకోవాలనే ఉన్నట్లుంది :)/
ReplyDeleteఅనోన్, తెలివిమీరుతున్నామంటే ఏమో అనుకున్నాగాని మరీ ఇలా డాట్రు గారి మనసులోవుంది కూడా తోడేస్తారని అనుకోలా. :D
విగ్రహాన్ ధర్మః అన్నారు, మరి టాంక్ మీద విగ్రహాలు కూల్చేటప్పుడు గిది యాద్గిట్ల రాలే? గిప్పుడే యాద్కొచ్చిందా? గది చెప్పున్రి. :)) :P
మీ చుట్టాలబ్బాయి ఒకరు జగన్ పార్టీలో చేరాలని తాపత్రయపడుతున్నారని అప్పుడెప్పుడో రాసారు. ఏమి జరిగింది? ఇప్పుడు ఆయన పెద్ద నాయకులు అయ్యారా?
ReplyDelete"విగ్రహావాన్న్ ధర్మః అన్నారు, మరి టాంక్ మీద విగ్రహాలు"
ReplyDeleteఇదే ఆంధ్రోళ్లతో వచ్చిన చిక్కు.తెలిసింది కొంతేఅయినా తమకే మొత్తం తెలుసు అనే ఓవర్ కాంఫిడేన్స్ . విగ్రహావాన్ ధర్మః అంటే గుడిలో విగ్రహాలు, టాంక్ మీద విగ్రహాలు కాదు. రాముడి వ్యక్తిత్వమే మూర్తిభవించిన ధర్మం అని అర్థం. ఆ ధర్మమేట్లుంట్టుందో తెలుసుకోవాలంటే పుస్తక రూపంలో వాక్యాల ద్వారా వాల్మికి రాశాడు. ప్రజలకు తెలియ జెప్పాడు.
ఇక లేడి ఆర్ కే విషయానికి వస్తే, ఆర్ కే అని ఎందుకంట్టున్నానంటే ఆయన ఓపెన్ హార్ట్ లో ప్రతి రంగానిక చెందిన ప్రముఖ వ్యక్తులనందరిని ఇంటర్వ్యు చేస్తాడు. మంచి దుస్తులు వేసుకొని, తన ఒత్తైన జుట్టును చక్కగా దువ్వుకొని ట్రిం గా తయారై, డిమ్ము ప్రశ్నలేస్తాడు. ఆప్రశ్నకు వచ్చిన వాళ్లు సమాధానం ఇస్తూంటే, సబ్జేక్ట్ లేని ఈయన తన స్వంత ఇంటర్ప్రిటేషన్ మొదలు పెడతాడు. మనిషి ట్రింగా తయారై బాగుంటాడు, సబ్జేక్ట్ ఉండదు, అలాగని తెలిసిన వాళ్ళు చెప్పింది వినడు, తనకెంతో తెలుసన్నట్లు ప్రశ్నలు మాత్రం వేస్తాడు. అలాగా లేడి ఆర్.కే. రామాయణం తెలుసనుక్కుందే గాని ఆమేకి ఎమీ తెలియదని, ఆమే రాసినది చదివితే ఎవరికైనా అర్థమౌతుంది. అంతటితో ఆగక స్వంత ఇంటర్ప్రిటేషన్ మొదలు పెట్టింది. ఇలా వక్రీకరించబోతూంటే తట్టుకోలేక రంగం లోకి దిగవలసి వచ్చింది. ఆమే రంగనాయకమ్మ విష వృక్షం చదవలేదని నాకు తెలుసు. కాని ఆమే ఎక వచనతో తిట్టిపోయడం ఎమీ బాగో లేదు. అంతటితో ఆగక గుంపు గుంపు పెంట పెంట అనే పదాలను ఉపయోగిస్తూ వ్యాక్యరాయటం శొచనీయం. దూకుడు,గోకుడు,గీకుడు, కెలుకుడు మూథాలతో నాకు సంబంధం లేదు.
"మళ్లీ సానుభూతి గుంపు గుంపు కి ప్రకటించేస్తున్నాను."
లేడి ఆర్.కే,
మీరు చూపించిన సానుభూతి కి సమాధానం ఇవ్వాలనిపించిది. మీకు రాముడి గురించి ఎమీ తెలియక పోయినా, తెలియదని ఒప్పుకోకుండా నన్ను పట్టుకొని "అభాగ్యుడివి,భాష సరిగా ఉండేట్టు చూసుకో, ఇది నీకు కూడా తెలుసు, పావని గారు,రావణుడు హీరో అని అన్నట్లు కనిపించిందా నీకు, పాపం నీకు నా ప్రగాఢ సానుభూతి " నాపై ఏకవచనంతో దాడికి దిగారు. తెలీయని వారికి చెప్పగలం, తెలిసిన వారికి మరింత వివరించగలం, తెలిసి తెలియని హాఫ్ నాలేడ్జ్ ఉన్నమీలాంటి వారికి ఎవ్వరు చెప్పలేరు, "పొరపాటు నాది" మీ వ్యాఖ్యలకు సమాధానం ఈ వీడియోలో ఇప్పిస్తున్నాను.
http://www.youtube.com/watch?v=9ReJGKiZDPA
12345#
జగన్ని లోన వేసారుగా. ఇక మీ పని అమ్మాయి పని బంద్ లు, అమ్మ వంటగదికి రాస్తా రోకోలు చేసి మీ కడుపు మాడ్చుతారేమో కొంచెం చూసుకోండి!!
ReplyDeleteIN THE PRESENT SOCIO POLITICAL SITUATION WHO IS CORRUPT AND WHO IS NOT . IS IT SONIA, CHANDRA BABU, KIRAN, BOTSA JAGAN. IS THERE ANY CHOICE BEFORE THE PUBLIC. EVERYBODY IS TRYING TO TAKE ADVANTAGE BY USING THEIR RESOURCES EITHER POWER OR SYPATHY OR ANY OTHER AVAILABLE MEANS. THE COMMAN MAN IS FORCED TO GO BY EITHER ONE OF THEM. THAT IS THE PATHETIC SITUATION. LET US AAL FEEL PAIN ABOUT THESE HAPPENINGS. WHY DO YOU DRAG RAMUDU RAVAUDU RANGANAYAKAMMA ANDHRA TELANGANA WHICH ARE TOTALLY IRRELAVENT INTO THIS DISCUSSION JUST TO PASS YOUR TIME AND BLAME EACH OTHER.
ReplyDelete