Monday, 28 May 2012

'అపరిచితుడు' అప్పారావు


"జగన్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నట్నుండి మా వంటింట్లో పొయ్యిమీద గండుపిల్లి గురకలు పెట్టి నిద్రోతుంది. రెండునెల్ల పసిగుడ్డుతో సహా ఎవరూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. నా భార్య జగన్  జైల్నుండి విడుదలయ్యే దాకా కాపురం చెయ్యనంటూ పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది. మా నాన్న 'జగన్బాబూ!' అంటూ గుండెనొప్పితో మెలికలు తిరిగిపోయాడు. ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన అటూఇటుగా ఉన్నాడు. మా అమ్మ 'జగన్! జగన్!' అంటూ పిచ్చిపట్టి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అన్నా! జగనన్నా! నువ్వు పోరాటం సాగించన్నా! నీ వెనక మేమున్నామన్నా! నువ్వు దేవుడవన్నా! జై జగన్!" అంటూ భోరున విలపిస్తూ కూలిపోయాడు అప్పారావు.

"కట్!" చెప్పాడు 'సాక్షి' చానెల్ విలేఖరి

కెమేరామెన్ కెమేరాని సర్దుకుంటున్నాడు.

"ఏం బాబు! ఎమోషన్ బాగా కేరీ అయ్యిందా? కావలంటే ఇంకో టేక్ తీద్దాం." అన్నాడు అప్పారావు.

"అవసరం లేదు. ఇప్పటికే ఎక్కువ చెప్పారు." అన్నాడు 'సాక్షి' విలేఖరి.

అటు తరవాత అప్పారావు భార్య వారికి జీడిపప్పు ఉప్మా, నేతి పెసరట్లు వడ్డించింది.

వాళ్ళ పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మీ ఎడిటర్ తో మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా శృతి పెంచమన్నా పెంచుతాను, తగ్గించమన్నా తగ్గిస్తాను. మీ చానెల్ కి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తా!" ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు అప్పారావు.

అప్పారావు భార్య ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

"మీకు ఏ టాపిక్ మీద బైట్ కావలన్నా నన్ను సంప్రదించండి. రూపాయి పతనాన్ని ఆపలేక దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశాడు. ఆయనతో నాకు లైవ్ షో ఏర్పాటు చెయ్యండి. నా సలహాలకి సుబ్బారావు స్పృహ తప్పిపోవాలి." గర్వంగా అన్నాడు అప్పారావు.

వారికి వేటపాలెం జీడిపప్పు ప్యాకెట్లు చేతిలో పెట్టాడు.

"ఇవి ఉంచండి. గుర్తుంచుకోండి, అప్పడం నుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టుల్నీ కరకరలాడించి మింగేశాను. 'పనామాలో పందిమాంసం రేటెందుకు డౌనయ్యింది? ఇరాక్ లో ఉబ్బసానికి చేపమందు పని చేస్తుందా?' వంటి ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాల్లో కూడా నా అభిప్రాయం తీసుకోండి." ప్రాధేయపడ్డాడు అప్పారావు.

అప్పారావు ఆతిధ్యాన్ని స్వీకరించి 'బ్రేవ్!' మంటూ సెలవు తీసుకున్నారు 'సాక్షి' వారు.

అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో కూలబడ్డాడు అప్పారావు. తన 'అభిప్రాయం' సాక్షి చానెల్ వాళ్ళకి చెప్పడానికి 'మూడ్' (కన్నీళ్ళు) కోసం వంటింట్లో నాలుగు ఉల్లిపాయలు తరిగాడు. అంచేత కళ్ళు మండుతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.


"అప్పు! అప్పు! లేలే! నీ కోసం ఇంకో చానెల్ వాళ్ళొచ్చారు." అంటూ భార్య అరవడంతో ఉలిక్కిపడుతూ లేచాడు.

"నమస్తే! మేం ABN ఆంధ్రజ్యోతి చానెల్ నుండి వచ్చాం. జగన్ అరెస్టు గూర్చి మీ అభిప్రాయం చెబుతారా?" అంటూ ఆ చానెల్ వాళ్ళు వచ్చీ రావడంతోనే మొదలెట్టారు.

అప్పారావు వంటింట్లోకి పరిగెత్తాడు. నిమ్మకాయని కత్తితో రెండు బద్దలుగా కొశాడు. ఒక్కోకంట్లో ఒకబద్ద పిండుకున్నాడు. కళ్ళు ఎర్ర్గగా, చింతనిప్పుల్ల్లా మారిపొయ్యాయి. హాల్లోకొచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు.

"కెమెరా స్టార్ట్!"

"జగన్! జగన్! జగన్! అసలెవరీ జగన్? అఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. విక్రమార్కుడా? కాదు, అక్రమార్కుడు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్. ఈ దేశం ఏమైపోతుంది? జగన్ని సమర్ధించేవాళ్ళలారా! ఖబడ్దార్! ఒక విషయం గుర్తుంచుకోండి!" అంటూ కెమెరాలోకి కౄరంగా చూశాడు.

"జగన్ని సమర్ధిస్తే మీరు సద్దామ్ హుస్సేన్, ఒసమా బిన్ లాడెన్ని సమర్ధించినట్లే! జగన్ అవినీతి వల్లే ఎండలు మండిపోతున్నయ్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నయ్, సినిమాలు ఫ్లాపయిపోతున్నాయి." అంటూ గర్జించాడు అప్పారావు.

ఆంధ్రజ్యోతి వారిక్కూడా టిఫిన్లూ, కాఫీలు ఎరేంజ్ చేయబడ్డయ్.

తింటున్నవారి పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మొన్నామధ్య మీరు మా ఎదురింటి మంగతాయారుకి, పక్కింటి కృష్ణారావుకీ గల అక్రమ సమ్మందమ్మీద ఎనిమిది గంటల చర్చా కార్యక్రమం నడిపారు. ఎంత బ్రతిమాలినా నాకు మాట్లాడ్డానికి ఛాన్సివ్వలేదు. దయచేసి విలువైన నా అభిప్రాయం కూడా తీసుకోండి. నాకు బయాలజీ నుండి బూర్లెపాకం దాకా అన్ని  సబ్జక్టుల మీద మంచి గ్రిప్పుంది."

ఆంధ్రజ్యోతివాళ్ళు వెళ్ళేప్పుడు నూజివీడు రసాలు, ఆవకాయ జాడీలతో నిష్క్రమించారు.

అప్పారావు భార్యకి అనుమానం వచ్చింది.

"అప్పు! నువ్విట్లా చానెల్ చానెల్ కీ 'అపరిచితుడు'లో హీరోలాగా రంగులు మార్చేస్తున్నావ్. జనాలకి తెలిస్తే ప్రమాదమేమో?"

అప్పారావు నవ్వాడు.

"పిచ్చిమొహమా! అలా చెబితేనే వాళ్ళు చూపిస్తారు. అయినా - ఎవడికి నచ్చిన చానెల్ వాడు చూస్తాడు. ఒకవేళ అన్ని చానెళ్ళు చూసే పని లేని సన్నాసి ఎవడైనా ఉంటే అది వాడి ఖర్మ. సర్లే! నువ్వు వంట పని చూడు. ఈ దెబ్బకి మన పేరు ఆంధ్రదేశంలో మోగిపోవాలి." అన్నాడు అప్పారావు! 

(picture courtesy : Google)

27 comments:

  1. అంటే అన్ని పేపర్లు (ఉచితంగా నెట్ లో దొరికేవి) చదివే నేను పనిలేని సన్నాసినా? మీ వ్యాఖ్యని నేను అప్పారావు నిమ్మకాయ కోసిన కత్తితోనే అడ్డంగా ఖండిస్తున్నాను!

    ReplyDelete
  2. డాక్టర్ గారు,

    చాలా బాగుంది పోస్టు!
    రాజకీయాల మీద నో కామెంట్ :-)

    ReplyDelete
  3. సుబ్బు తర్వాత అప్పారావా... బాగుబాగు...

    ReplyDelete
  4. నెత్తి మీద రూపాయి పెట్టినా పావలా చెయ్యని అనామకులు విశ్లేషకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో మీరు ఒక సామాన్యుడిపై గురి పెట్టడం చాలా అన్యాయం.

    మీరు మీ మిత్రులు ఎంత మేదావులయినా ఇలా అప్పారావు లాంటి సగటు జీవిని ఆడిపోసుకుంటారా? అన్ని మీడియాలు నడుస్తున్నది ఇలాంటి అప్పారావుల పుణ్యమేనని గుర్తుంచుకోండి. కావాలంటే ఏ తెల్కపల్లి రవినో, జ్వాలా నరసింహారావునో విమర్శించండి. అప్పారావుల పొట్ట కొట్టొద్దు ప్లీస్.

    ReplyDelete
  5. సమకాలీన రాజకీయాలమీద మీ వ్యంగ్య రచన చాలా బాగుంది. బాగా ఆస్వాదించాం.
    - సుపరిచితుడు

    ReplyDelete
  6. అబ్బా! ఏం దెబ్బ కొట్టారు డాక్టర్ గారు.

    ఇప్పుడు జగన్ అరెష్టుకు వ్యతిరేకంగా ఏదన్నా బ్లాగ్ పోస్ట్ రాస్తే "ఉల్లిపాయ" ఎఫెక్ట్‌ అవుతుంది; సమర్ధిస్తూ రాస్తే "నిమ్మకాయ" ఎఫెక్ట్‌ అంటారు!

    పక్కవాడి పొట్టమీద కొట్టడం అన్నది మాత్రమే తెలుసు. ఈ మీ పోస్ట్ పుణ్యమా అని "ఒక మనిషి కీబోర్డ్‌ మీద కొట్టడం" అంటే ఏంటో తెలిసొచ్చింది.

    ఇలాంటి गल्ती बात मत करो भाइ! :-)

    ReplyDelete
  7. మీ పేరు మాత్రం బ్లాగు దేశం లో మోగిపోటున్నది , నిన్న ఉల్లిపాయలు ఇవ్వాళ నిమ్మకాయలు తో భలే ప్రయోగం చేసారు.

    అది సరే మీరే చానెల్ చూస్తారు ;-)

    ReplyDelete
  8. రమణ గారు మీరు ఒక పత్రిక( చానల్ ) వదిలేశారు . ఇక్కడ మా మనోభావాలు దెబ్బ తిన్నాయి ఆ పత్రిక వారి చానల్ ఏదో మీకు తెలుసు, నాకు తెలుసు . వెంటనే దాన్ని కూడా కలపండి

    ReplyDelete
  9. రమణ గారు!
    మామూలు గా నేను బ్లాగ్స్ అన్ని bookmark చేస్తాను. చూడాలనిపించినపుడు ఆ బుక్ మార్క్స్ లో నుంచి చూస్తాను. తెలుగు బ్లాగ్స్ పేర్లతో తప్ప బ్లాగ్ url తో గుర్తు పెట్టుకోను.
    కాని మీ బ్లాగ్ మాత్రం డైరెక్ట్ గా url వచ్చేస్తుంది. అంతలా మెమరీ లో ఉండిపోయింది!
    నైస్ పోస్ట్స్!

    ReplyDelete
  10. sree గారు, Krishna Palaokollu గారు, puranapandaphani గారు, Jai Gottimukkala గారు, kastephale గారు, తెలుగు భావాలు గారు, Mauli గారు మరియు అజ్ఞాతలు..

    ఇవ్వాళ బంద్. మధ్యాహ్నం పేషంట్లు పెద్దగా రాలేదు. 'పని లేక.. ' కాలక్షేపంగా ఒక టపా రాసి పడేశాను. ఉదయం తప్పించుకున్న వర్క్ సాయంకాలానికి ఏడ్ అయ్యింది. బాగా బిజీ.

    నా పేషంట్ ఒకమ్మాయికి (నా కూతురు వయసుంటుంది) చాలా చాలా క్రిటికల్ గా ఉంది. ఆ అస్పత్రికి వెళ్ళి చూసి.. తలిదండ్రుల్ని పలకరించి ఇప్పుడే వచ్చాను. మనసు బాగాలేదు.

    అందరికీ ధన్యవాదాలు. టపా గూర్చి చర్చించే ఓపికా, మూడ్ లేదు. దయచేసి అర్ధం చేసుకుని మన్నించగలరు.

    ReplyDelete
  11. గురూ గారూ మీరేమనుకోకపోతే ఒక్కమాట

    ఈ పైన జనాలంతా ఏమి చూసి ఇంత మెచ్చేసుకుంటున్నారో గానీ, నాకు మాత్రం అంత విషయం కనిపించదు మీ బ్లాగులో. చాలా మీడియో కేర్‌ రాతలు రాసే అతి సామాన్య బ్లాగరు మీరు. కత్తి మహేష్‌ లాగానో, భర్ద్వాజలాగానో తాడేపల్లి, రాము లాగానో ఒక కాంట్రావర్షియల్‌ టాపిక్‌ తీసుకుని రాయరు. ఎవర్నీ విమర్శించే ధైర్యం లేదుగనక నాణానికి రెండువైపులా చూస్తున్నట్లు ఎవర్నీ నొప్పించని బ్లాగుల్రాయడం. దానికి వీళ్ళంతా పక్కంజేరి ఆహా ఓహో అంటం. ఇది నమ్మి మోసపోకండి గురూజీ.
    మీరే ఓసారాలోచించుకోండి, ఆ సుబ్బూ, ఈ అప్పారావూ వీళ్ళనోట్లోంచొచ్చే అరువు డవిలాగులూ రెండురోజులు టివీ చూసినవాడికీ, రెండువారాలు మనతెలుగువారి సపరివారపత్రిక చదివే నాబోటివాళ్ళకీ కొట్టినపిండి. ఈ మామూలు నుంచి అతిమామూలు రాతల్ని గత రెండు మూడు వారాలుగా అతిగా పొగిడేస్తున్నారు అంటే, అదేదో కొంచెం ఆలోచించాలి మరి. పైగా మీ బ్లాగుల్లో రాసేటోళ్ళు మహా గడుసోళ్ళు సుమండి, ఎంత త్వరగా ఆకాశమెక్కించారో అంతే త్వరగా కింద పడేస్తారు. జాగ్రత్తండో..

    ReplyDelete
  12. http://www.youtube.com/watch?v=R-KDQtkRGQk&feature=player_embedded#!

    ReplyDelete
  13. సారీ మీ మూడ్‌ బాలేదు అన్న కామెంటు సంగతి రాసేశాక తెలిసింది. మీ మనసు నొప్పించాలని కాదు.

    నేను చెప్పేదేంటంటే మనం మామూలుగా రాసిన రాతల్ని ఎవ్డో బాగుందంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వకండి. సాధారణంగా ఇలాంటి అనవసర రేషన్‌ లెస్‌ పొగడ్తల వెనకాల హిడెన్‌ అజెండాలు ఉంటాయి. మీరు ఆ ఉచ్చులో పడకుండా మీ రాతలు మీరాసుకోవాలనేది నా అభిలాష.

    ReplyDelete
  14. పిల్ల నిచ్చిన మామ ను వెన్నుపోటు పొడిచి, జడ్జి కి జయ ప్రద ని ఎరగా వేసి, పార్టీ ఫండ్ ని ఆధీనం లోకి తెచ్చుకొని మామ చావుకి కారణం అయ్యాడు. అంబానీ లకి 2 లక్షల కోట్లు దోచి పెట్టి , సింగపూర్ ,స్విట్జర్లాండ్ ,మలేసియా లో ఆస్తుల సమకూర్చుకొని ,తన కుల పత్రికలో అంబానీల ద్వారా పెట్టు బడులు పెట్టించిన ఎదవ ఒకడు.

    మైనారిటీ వక్ఫ్ భూములు కాజేసి, ఎ ఎండకి ఆ గొడుగు పట్టి విద్యుత్ ప్రాజెక్ట్ కట్టకుండానే బిల్లు కాజేసి,దొంగ ప్రాజెక్టులు రాజస్తాన్ లో పెట్టి , మామ ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని, ఆస్తిని కాజేసి ,భార్యకి విడాకులు ఇవ్వకుండానే మలయాళ అమ్మాయి ద్వారా ఇంకో కొడుకుని కని, పిల్లల పెంపకం గురించి క్లాసు చెపుతున్న పరమ లాంకో నీచుడు ఒకడు.

    గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ 250 బినామీ పేర్ల ద్వారా సారాయి షాపులు పెట్టి , ఆ రోజు ఆజాద్ కి నగ్మా ని ఎర వేసి టికెట్ లు తెచ్చుకున్న పరమ నీచాతి నీచుడు ఇంకొకడు.

    దొంగ బియ్యం స్మగ్లింగ్ చేసి , దొంగ రాతలు రాసి ,పైరవీల ద్వారా విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టి వేసి, పొట్ట కూటి కోసం ఉద్యోగం లో చేరిన ఉద్యోగిని వశబరుచుకొని, ఒక నాడు కూటికి గత లేని ఒక వెధవ ఇవాళ ఒక జ్యోతి పత్రిక పెట్టుకొని విలువలు గురించి బోధిస్తున్న ఇంకో జఫ్ఫా .

    పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టి,రాష్ట్రం లో కుల పిచ్చి ఎగ దోసి, తన కుల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ప్రతి రోజు ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు కాజేశాడు. తన కుల ప్రభుత్వాన్ని ఆదేశించి రాష్ట్ర సహకార బ్యాంకు లు మూసేసి ,మార్గదర్శి ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా పెట్టుబడులు సేకరించి ఆస్తులు పెంచు కున్న పరమ నిక్రుస్టుడు ఇంకొకడు.

    హై కమాండ్ కి సూట్ కేసు లు మోసి, రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసు లు పెట్టి, ప్రజల దృష్టిలో పైసా విలువ చెయ్యని ముఖ్య సీటులో కూర్చున్న పరమ మురికి,లేకి వెదవ ఇంకొకడు.

    మీ ఇంటి పెద్ద పాలేరు ను నేను అని రాజన్న దగ్గర కుక్క లాగ పడి ఉన్న ఒక వెదవ ఇవాళ మంత్రి పదవి రాగానే హైదరాబాద్ మొత్తం నాదే అనే దానాల బాబు ఇంకొకడు.

    తుపాకి పెట్టి ప్రొడ్యూసర్ ని కాల్చి, వాచ్ మెన్ ను బలి ఇచ్చి, పాహిమాం అని రాజన్న కాళ్ళ మీద పడి , పెట్టిన చేతిని కరిచి, ఇవాళ సినిమాల్లో అవాకులు చెవాకులు వాగుతున్న బండ వెదవ ఇంకొకడు.

    అనధికారంగా ఇంకో వనిత ద్వారా ఒక రాముడ్ని కని , వాళ్లకి వయసు వచ్చే వరకు వారిని నిర్లక్ష్యం చేసి, అంది వచ్చిన అదే కొడుకు అండ చూసుకొని ,ఆడపడుచులు ,తాళి బొట్లు అని నీతులే చెప్పే తాగు,తిరుగు బోతు వెదవ మరొకడు.

    పార్టీ ని, టిక్కెట్లని హోల్ సెల్ గా అమ్మి , డబ్బుల కట్టలు మంచం కింద వేసుకొని నిద్ర పోతూ ,ఆడంగి కొడుకు ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ సమర్ధ త మీద రాసే తాగుబోతు చిరు జీవి ఇంకొకడు.

    తనని అధికారం లోకి తీసుక వచ్చిన కుటుంభాన్ని రోడ్ల మీదకి గుంజి, నీతు లు చెప్తూ స్విస్స్ బ్యాంకు లో వేల కోట్లు పోగేసుకున్న ఇటాలియన్ వనిత మరొకరు.

    రామలింగ రాజు గారిని మోసం చేసి ,టీవీ తొమ్మిది పెట్టి , పారిశ్రామిక వేత్తలని బ్లాకు మెయిల్ చేసి ,పాపం పొట్ట కూటి కోసం యాంకరింగ్ చేసే ఆవిడని లోబరుచుకొని ,విదేశాల్లో ఆస్తులు కొని ,కుల గజ్జి తో రగిలి పోయి ,మెరుగయిన కుల సమాజం కోసం ఏడ్చే పరమ నీచుడు మరొకడు.

    ఫీజు రిఎమ్బర్స్ మెంట్ ,ఉచిత విద్యుత్ ,పావాల వడ్డీ పధకాలు,ఇల్లు, వాకిళ్ళు కట్టించిన రాజన్నని ఇవాళ అవినీతి పరుడు అని ప్రచారం చేస్తూ ఒక నాడు ఆయన మోచేతి నీళ్ళు తాగిన పరమ నికృష్ట పు వెదవలు మరికొందరు నూ.

    ఆనాడు విజయమ్మ ఈ కాంగ్రెస్స్ చెత్త వెదవల ని అందరిని అన్న అని పిలిచి, అన్న తిని వెళ్ళండి అన్న అని వ్యక్తిగతంగా అన్నం వడ్డించిన తల్లి లాంటి పెద్ద ఆమెని పట్టుకొని విజయ అని సంబోదించే నీతి,జాతి లేని కుక్కలు ఇంకొందరు.

    రెండు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని, అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ,ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని మీకే నీతులు చెప్తూ సన్నాయి నొక్కులు నొక్కే విషపురుగులు మరికొన్ని.

    కలి కాలం లో ఇంతే నండీ. ఇవాళ వీళ్ళంతా శ్రీరంగ నీతులు బోధిస్తున్నారు ,పాడు లోకం ఇది . తోట కూర కధలు, వంకాయ కధలు చెప్తూ నీతులు బోధిస్తున్నారు. మనకి వినే ఖర్మ తప్పడం లేదు. తప్పదు అండీ తప్పదు ,పాడు లోకం ఇది. మీరు ఇలాంటి రాతలు రాస్తే మీ మీద కూడా సిబిఐ కేసు వెయ్య గలరు జాగ్రత్త!!!!

    ReplyDelete
  15. Anonymous at 3.19,

    What you wrote is true. But, for completeness, tell us how "rajanna" made his money, how he came to power and why he was licking Gandhi familys' shoes( remember slapping their name on airport and welfare programs in the state?). Why leave him out?

    ReplyDelete
  16. @above anon,

    migata vaallu raastunnaru kada,inka nenu enduku raayadam????

    ReplyDelete
  17. /migata vaallu raastunnaru kada,inka nenu enduku raayadam????/
    :)) wah! good reply!! hee hee.. You are not condemning them. Don't you think YSR,Jagan are innocent decoits? compare, explain - 20marks

    /జడ్జి కి జయ ప్రద ని ఎరగా వేసి, /
    Give details. YSR tried to pull-in movie stars Vijayashanti, Roja,Jayaprada... What for?! give details. Did YSR gave any assignments to prove themselves? Elaborate- 10marks

    /అన్న తిని వెళ్ళండి అన్న అని వ్యక్తిగతంగా అన్నం వడ్డించిన తల్లి /
    Ahaahaa! What a sentiment! btw, what was offered & how much? (food or grass(booty)? What was their share?;) - 20marks

    / హై కమాండ్ కి సూట్ కేసు లు మోసి,తనని అధికారం లోకి తీసుక వచ్చిన కుటుంభాన్ని రోడ్ల మీదకి గుంజి, నీతు లు చెప్తూ స్విస్స్ బ్యాంకు లో వేల కోట్లు పోగేసుకున్న ఇటాలియన్ వనిత మరొకరు./

    Exactly!! Elaborate... reveal shares, accounts... spill the beans - 50marks.

    Hope you get distinction and pursue higher leveles (in Tihar) :))

    ReplyDelete
  18. Suresh గారు,

    >>నాకు మాత్రం అంత విషయం కనిపించదు మీ బ్లాగులో. చాలా మీడియో కేర్‌ రాతలు రాసే అతి సామాన్య బ్లాగరు మీరు.<<

    మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకే భ్రమలూ లేవు. ఈ మాట నేను వ్యంగ్యం కోసం అనడం లేదు. సీరియస్ గానే అంటున్నాను.

    నేను ఇంతకు ముందు కూడా అనేక సార్లు మనవి చేశాను. నేను కేవలం సరదా కోసం మాత్రమే రాస్తున్నాను. నా ఆలోచనలు "అచ్చు" లో చూసుకోవడం కోసం రాస్తున్నాను. అంతే!

    ReplyDelete
  19. సినీతార గురించి ఎవరో అడిగారు
    1995 లో చందరబాబు యంటి ఆర్ ను దించినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాడు పార్టీ నాదే అని అప్పుడు ప్రభాశ్జంకర్ మిశ్ర హై కోర్టు జడ్జి... ఈ కేసు వచ్చినప్పుడు బాబు జయప్రద సేవలు ఉపయోగించుకున్నారు. మిశ్ర సంతృప్తి పడ్డారు . రాష్ట్ర విస్తృత ప్రజోజనల కోసం కొన్ని తప్పవు . ఇలాంటివ్బి బయట చెప్పారు కానీ పార్టీ లో అందరికీ తెలుసు

    ReplyDelete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
  21. @Anonymous 29 May 2012 03:19:

    "భార్యకి విడాకులు ఇవ్వకుండానే మలయాళ అమ్మాయి"

    ఆవిడ మలయాళీ కాదు, తమిళ మహిళ. Please check again.

    ReplyDelete
  22. మరుసటి రోజు శంకర్ విలాస్ లో టిఫిను చేస్తున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణ కాసేపు ఊహించుకుందాం.

    జగన్ వీరాభిమాని (జవీ): నిన్న మా టీవీలో (అదేనండి సాక్షిలో, నిమ్మగడ్డ వారి "మాటీవీ" కాదు) అప్పారావనే ఆయన ఎన్ని నిజాలు చెప్పాడో. జగన్ మీద కేసులన్నీ బూటకమని నిరూపించాడు. ఆయనను జైలులో పెట్టినందుకు తన కుటుంబమంతా బాధ పడ్డారు పాపం.

    జగన్ వ్యతిరేకి (జవ్య): నిన్న మా టీవీలో (అదేనండి ABN, నిమ్మగడ్డ వారి "మాటీవీ" కాదు) అప్పారావనే ఆయన ఎన్ని నిజాలు చెప్పాడో. జగన్ అక్రమార్కుడని నిరూపించాడు. ఆయనను సద్దాముతో ఒసామాతో పోల్చాడు.

    జవీ: మీ అప్పారావు బోగస్. మా అప్పారావు నిజమయిన మేధావి.
    జవ్యా: మీ అప్పారావు బోగస్. మా అప్పారావు నిజమయిన దేశభక్తుడు.

    ఇలా జవీ, జవ్యలిద్దరూ తమ తమ అప్పారావుల గురించి, వారి టీవీ ప్రకటనల గురించి టిఫిను అయ్యేంతవరకూ వాదించుకుంటారు. కాఫీ తాగుతూ అవతల వారి అప్పారావుని బూతులు తిడతారు.

    ఇదే సీను ఇతర హోటళ్ళలో ప్రతిరోజూ కనిస్పిస్తుంది. ఈ చర్చలను అన్ని టీవీలు లైవులో చూపిస్తాయి.

    కాలక్రమాన జవీ జవ్యలిద్దరూ జగన్ కన్నా బాబు కన్నా ఇతర నాయకుల కన్నా అప్పారావే గొప్పని అనుకోవడం మొదలెడతారు. రేపో మాపే జైలులో సెటిల్ అయిపోయే జగన్ కానీ, మరో వందేళ్ళ వరకూ అధికారం వచ్చే అవకాశం లేని బాబు కానీ ప్రజాసమస్యలు పరిష్కారం చెయ్యలేరని తెలుసుకుంటారు.

    అమెరికా నుండి అప్పడాల దాకా, బయాలజీ నుండి బూరెల దాకా పాండిత్యం ఉన్న అప్పారావే మనకు సరయిన నాయకుడు. అయితే ఇద్దరు అప్పారావులు ఉన్నారు కదా? వీరిద్దిరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలని సందిగ్త పడతారు.

    ఒక శుభ మహూర్తాన అప్పారావు ముందుకొచ్చి తాను ఒకడినే అని, ప్రజలలో చైతన్యం రావాలని రెండు వైపులా చేరి రెచ్చగొట్టానని చెప్పేస్తాడు. జై జగన్, జై బాబు బాచులు అందరూ జై అప్పారావు పార్టీలో చేరతారు. ఎన్నికలలో అప్పారావు ఘన విజయంతో సర్వేజనా సుఖినోభవంతు.

    ReplyDelete
  23. పని లేని వాల్లు బాగనే ఒక దెగ్గిర చెరారు. there is seeming difference in the gossips men enjoy and blog gossip is widespread now . Dr. Ramana is contributing to an very important phenomena of social bonding and may be it is his solution to meriad problems of isolatedness/individuation of our times

    ReplyDelete
  24. డాక్టర్ గారు,

    బాగా రాసారు సార్

    అయితే అప్పారావు ఒక చానల్లో చెప్పినా,సుబ్బారావు ఒక చానల్లో చెప్పినా,ఇంకో పుల్లారావు ఇంకో తోక చానల్లో చెప్పినా ఏం పర్వాలేదు సార్.

    ఎవరెన్ని చెప్పినా, జగన్ ముమ్మాటికీ ప్రజా నాయకుడే
    ఎవరెన్ని విమర్శలు చేసినా మరెన్ని కుయుక్తులు పన్నినా ఎలెక్షన్ రిజల్ట్ చూసి మూర్చ పొవాల్సిందే.

    ఇంకోటి సార్, మొన్న మరియు ఇంతకుముందు టఫాలలో నేను అంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నప్పుదు అని రాసారు.మా అభిమానదనులైన మీరు అంధ్రజ్యోతి పేపర్ చదవడం మాకు ఇష్టం లేదు సార్,ఎంచక్కా మన సాక్షి చదువుకోండి మీ నెగెటివ్ ఫీలింగ్స్ మారతాయ్.


    ఈ కామెంట్లలో ఆ అజ్ఞాత ఎవరోగాని ఇరగదీసి రాసాడు.

    ఒకప్పుడు రాజన్న అంటే లాగులు తదుపుకునే రకాలు మరియు లేని కంపేనీకి 20 కోట్లు డబ్బు ఇచ్చిన సన్నాసులుకూడా ఈరోజు మట్లాడేవాడయారు.


    రమేష్ బాబు

    ReplyDelete
  25. డాక్టర్ గారు,

    ఇందాక ఒక విషయం చెప్పడం మర్చి పోయాను

    నిన్న మన అభిమాన నటుడు కూడా చేసిన దానికి అనుభవించాలని చెబుతున్నాడు

    ఆరోజు మనవాడు చేసినప్పుడు, రాజన్న చేసిన మేలు మర్చిపోయి తిక్కలమాటలు మట్లాడుతున్నాడు.
    జగనన్న సియం అయ్యాక ఆకేసు తిరగదోడితే అప్పుడు తెలుస్తుంది. చేసిన దానికి అనుభవించడమంటే ఎమిటో.
    సొంత బావ, మాజీ సియం 5 రోజులపాటు పలకరించడానికి కూడా పోలేదు.ఈరోజు సిగ్గులేకుండా యన్ టి ఆర్ తరువాత మాబావే అలాంటి సియం అని సిగ్గులేకుండా చెబుతున్నాడు.

    జగన్ కి వున్న ధైర్యం వీల్లకుంటే తెలుగుదేశం పరిస్తితి ఇలావుండేది కాదు.


    రమేష్ బాబు

    ReplyDelete
  26. @Ramesh gaaru: రాజన్న , జగనన్న , అబ్బొ అభిమానం హద్దులు దాటిపొతుందనుకుంట.
    నీకు అన్నలేమొ వాల్లు, కాని మాకు మాత్రం ఈ రాష్త్రానికి పట్టిన దున్నలు వాల్లు.
    వాల్లని విమర్సిస్తున్ననని నేనెదొ సిబియన్ అభిమనినని అనుకుంటవెమొ, మనకలంటివి ఏమి లేవు. పాపం, చుస్తుంటె మీరు బొరు బొరు న ఎదుస్తున్నరనుకుంట, పరవలెదులెండి, మీ so called అన్న వస్తాడు ఇంకొ ఓదర్పు కి. ఈ రొజె పేపెర్ లొ చదివాను, ఈ రాష్త్రం లొ చాల మందిని చంపేసారు అప్పుడె. Jagan's crime is big organized one. You can not see its impact immediately, in next few years how our state will be begging for funds in front of center , you can see.
    Lakhts of crores are spent on many projects, but still not even single project completed and all the money has gone to his pocket.
    :venkat

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.