Friday, 1 June 2012

case sheet ఆలోచనలు


ఈ మధ్య నా పోస్టుల పట్ల కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నేను గోడమీది పిల్లిలా, కర్ర విరక్కుండా పాము చావకుండా అందరితో మంచిగా ఉండాలన్నట్లుగా రాస్తున్నానని. 'నిజమా!' ఆని ఆశ్చర్యపోయాను. 'నిజమేనా?' అని ఆలోచించాను. 'నిజమే  కదా!' అని convince అయిపోయాను. మరైతే.. నేనెందుకిలా రాస్తున్నాను!?

నా రాతలు శరత్‌చంద్ర చటర్జీ కథల్లో మాత్రమే కనిపించే 'అందరూ మంచివారే!' తరహా కేరక్టర్లతో, ఆలోచనలతో రాసినట్లున్నాయా? అయితే - 'నేరం నాది కాదు, నా వృత్తిది' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నీ defense రాజకీయ జీవుల వాదనలా అధ్వాన్నంగా ఉందని విసుక్కోకుండా నా గోడు వినమని విజ్ఞప్తి.

నేను వృత్తి రీత్యా కొన్ని దశాబ్దాలుగా నాలుగ్గోడల మధ్య ఉండిపోయాను. ఏ రాజకీయపార్టీతోనూ ఎప్పుడూ సంబంధాల్లేవు. నాది కేవలం పుస్తక పాండిత్యం. ఎన్నిపుస్తకాలు చదివినా జనాలతో కలిసి పని చేయడం అనేది విలువైన అనుభవం. అది నాకులేదు. అంచేత mood of the common man నాకు తెలిసే అవకాశం లేదు. కావున నా బ్లాగుల్లో నేరాసే విశ్లేషణలు పూర్తిగా నా బుర్రలో పైత్యమే! నాకున్న పరిమితుల గూర్చి నాకు పూర్తి అవగాహన ఉంది.

మరెందుకు రాయడం? చేతిలో laptop ఉంది, దానికో wifi connection ఉంది, బుర్రలో కావలసినంత అజ్ఞానం ఉంది. రాయడానికి ఇంతకన్నా సరంజామా ఏంకావాలి? నేనేమీ టీవీల్లో కనబడే మేధావిని కాదు. వారు ప్రజలందరి తరఫున ఆలోచిస్తూ, మన అందమైన భవిష్యత్తు కోసం విలువైన సలహాలు ఇవ్వగలరు. నాకంతటి శక్తి లేదు. నేను నా తరఫున, నా ఆలోచనలని మాత్రమే రాయగలను, రాస్తున్నాను. నా అవగాహన పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా వుంది. ఆపాటి జ్ఞానం, స్పృహ నాకున్నాయని మనవి చేస్తున్నాను.

మొన్నో డాక్టర్ మిత్రుడితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా - ఆయన నవ్వుతూ "మనం చేసే రాజకీయ విశ్లేషణ medical case sheet లా ఉంటుంది. గమనించారా?" అన్నాడు. అప్పుడు వెలిగింది నాకు లైట్ - నేను ఇలా ఎందుకు రాస్తున్నానో!

ఇప్పుడు మీకు కొన్ని వైద్యశాస్త్ర విషయాలు. మీకు విసుగ్గలక్కుండా సాధ్యమైనంత సింపుల్ గా చెప్ప్డడానికి ప్రయత్నిస్తాను. వైద్యవిద్య శిక్షణలో case sheet రాయడం అనేది చాలా ముఖ్యమైనది. రోగలక్షణాలు (symptoms) తెలుసుకున్న తరవాత diagnostic formulation రాయాలి. అటుతరవాత differential diagnosis (DD) రాయాలి. ఆ DD కి అనుకూల, ప్రతికూల పాయింట్లు రాయాలి. prognosis (ప్రస్తుతం ఉన్న condition మున్ముందు ఎలా వుండబోతుంది) రాయాలి. చివరాఖరికి treatment గూర్చి చర్చించాలి. 

వైద్యవిద్య శిక్షణలో ఈ case sheet రాసే process ని చాలా repeated గా చేయిస్తారు. ఇది ఒక scientific approach. అందుకే అంతలా ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక సైకియాట్రీలో శిక్షణ మరీ భీకరం. కేస్ షీట్లు పేషంట్ల బయోగ్రఫీల్లా ఉంటాయి, అలాగే రాయాలి కూడా. ఇక్కడదాకా బాగానే ఉంది. అయితే - క్రమంగా వైద్యేతర విషయాల్లో కూడా case sheet kind of thinking వచ్చేస్తుంది. ఈ రోగాల లాజిక్‌తో రాజకీయాల్ని విశ్లేషించొచ్చా? 

విషయం అర్ధం అవడం కోసం జ్వరాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం (వాస్తవంగా ఈ జ్వరంతో నాకు సంబంధం లేదు. కానీ.. సైకియాట్రీ సబ్జక్ట్ సంగతుల్ని simplify చేసి వివరించేంత సమర్ధత నాకులేదు). ఒక వ్యక్తి నాల్రోజుల్నుండి జ్వరంతో డాక్టర్ దగ్గరకి వెళ్తాడు. జ్వరంతో పాటు దగ్గు, ఆయాసం, కళ్ళె కూడా ఉన్నాయా? అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కావొచ్చు. chest x ray తీయించి నిర్ధారించాలి.

చలి, వణుకు కూడా ఉండి.. జ్వరం తగ్గుతూ వస్తూ ఉందా? మలేరియా కావచ్చు. రక్తపరీక్ష చేయించాలి. platelet count పడిపోయిండా? డెంగీ కావచ్చు. Widal positive వచ్చిందా? టైఫాయిడ్ కావచ్చు. ఏదీకాకపోతే సాధారణ viral infection అనుకోవచ్చు. మొదట్లో కనిపించే symptoms, clinical condition బట్టి working diagnosis ఉంటుంది. మధ్యలో diagnosis మారిపోవచ్చు. final diagnosis ఇంకోటవ్వచ్చు! ఇవన్నీఅత్యంత టూకీగా వైద్యవిద్యకి సంబంధించిన సంగతులు. 

ఇప్పుడు మళ్ళీ నా సొంత గోడు. ఈ రకమైన శిక్షణ వల్ల నేనేది ఆలోచించినా case sheet రాస్తున్నట్లుగానే ఆలోచిస్తాను. అందువల్లనే కామోలు - నా ఆలోచనలు 'ఫలానా రాజకీయపార్టీది ఫలానా లక్ష్యం. ఫలానా నాయకులు ఇలా చెబుతున్నారు. ఈ మాటలు ప్రజలు నమ్మితే ఇలా ఉండొచ్చు, నమ్మకపోతే అలా ఉండొచ్చు.' అనే వాతావరణ శాఖ bulletin ధోరణిలో వుంటాయి. కావున అవి bland గా ఉండొచ్చు!

కానీ - దానికి నేనేం చెయ్యగలను? లేని మేధావిత్వాన్ని తెచ్చుకోలేను గదా? తోచింది రాస్తున్నాను. నాకు రాజకీయ పార్టీలు, నాయకులు - మలేరియా, టైఫాయిడ్‌లతో సమానం. ఎవరు గెలిచినా, ఓడినా నాకు కొంపలు మునిగేదేమీ లేదు. నా జీవితం సాఫీగానే గడిచిపోతుంది. ఒక సాధారణ జ్వరమే ఊసరవల్లిలా అనేక రంగులు మార్చగా లేనిది.. కొన్ని కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాజకీయాంశాలు ఎన్నిరకాలుగా మారిపోవచ్చు!?

కాబట్టి - వీడికి 'పని లేక.. ' AC గదిలో కూర్చుని (ఈ పాయింట్ ముఖ్యమైనది. చల్లదనంలోనే ప్రశాంతంగా ఆలోచించగలం అని నమ్ముతున్నాను) ఏదో రాసుకుంటున్నాళ్ళే పాపం! అనే సానుభూతితో మీరు చదవగలిగితే సంతోషం.

'మాకేం అవసరం? వంట రానివాడు వంట చేసి - ఏదో నేర్చుకుంటున్నాను. తినెయ్యండి ప్లీజ్! అంటే తిని నోరు పాడు చేసుకోవాలా? అవగాహన లేకుండా నువ్వు రాసే చెత్త మేమెందుకు చదవాలి?' అని మీరంటే నే చేసేదేమీ లేదు.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టడం మినహా!

(pictures courtesy : Google)

46 comments:

  1. హమ్మయ్య, మీరీ పాయింటు కు వచ్చేసారన్న మాట - నేనెందుకిలా రాస్తున్నాను ? అన్న ప్రశ్నా మార్కు కి !

    ఇక కొన్ని రోజుల లోనే, నేను బ్లాగ్ లోకం నించి విరామం పొంద గోరు తున్నాను, అయ్య లారా, అమ్మలారా మీ అభిప్రాయం ఏమిటి అన్నది రాబోయే టపా !


    అ తరువాయి కొన్ని రోజులు కి చెయ్యి మరీ కీ బోర్డ్ మీద తప తప చెయ్యాలని చూస్తుంది అనుకొండీ, అది ఫ్యూచర్ దయాగ్నోసిస్ !



    డైనమిక్ దయాగ్నోసిస్ !


    ఇది జిలేబీ విశ్లేషణ!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. డాక్టర్ గారు, మీరు కూడా కామెంట్స్ ను మరీ serious గా తీసేసుకుంటున్నారు .
    మీరు సరదాగా, ఎవరిని నొప్పించకుండా రాస్తారు. చాలామంది కామెంట్స్ పెడతారు అర్ధవంతం గా కాబట్టి నేను ఎప్పుడు పెట్టలేదు, కాని తప్పక అన్ని పోస్ట్లు చదువుతాను. ఒక్కోసారి ఫ్రెండ్స్ కి కూడా forward చేస్తాను. మీరు మరీ ఇంత deep analysis చేసుకోవద్దు (మీ వృత్తి బలహీనతనుకోండి అది! :) )..మీకు మనసులో అనిపించింది రాసెయ్యండి. నాలాంటి అభిమానులు మీకు చాలా మంది ఉంటారని ఆశిస్తూ...

    ReplyDelete
  3. డాక్టర్ గారు మీరు బాగా రాస్తున్నారు అలానే రాయండి . ప్రతి వ్యక్తి ఏదో ఒక పార్టీ నీ ఇష్ట ఇష్ట పడతారు .ఆ పార్టీ కి వ్యతిరేకంగా ఎక్కడయినా రాతలు కనిపిస్తే మీరు పక్షపాతం అంటూ ఏదో కమెంటలతో దాడికి దిగుతారు .రాజకీయాల గురించి ఎవరు రాసిన బాబు, జగన్ ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది . విల్లిద్దరిని రోజూ విమర్శించే వారు కొన్ని లక్షల మంది ఉంటారు . అయినా వాళ్ల దారిలో వాళ్ళు వెళుతుంటారు . విమర్శిస్తున్నారు కదా అని నీరు కారి పోతారా ? లక్షలమంది విమర్శించిన నీరుకారి పోనీ వారి గురించి రాస్తూ ముగ్గురు నలుగురు ఏదో అన్నారని నీరుకారి పొతే ఎలా? ఆ మధ్య అన్న హజారే అవినీతి పై ఉద్యమించినప్పుడు . కొన్ని విమర్శలు కూడా వచ్చాయి . నెట్ లో ఆ విమర్శల పై ... ఇలా రాసినందుకు కాంగ్రెస్స్ నీకు ఎంతిచ్చిందో చెప్పు అనే కామెంట్ అన్ని చోట్ల కనిపించింది . అలానే మన రాష్ట్రం లోని రాజకీయాల పై రాసినప్పుడు కొందరు ఒక్కో నాయకుడిపై అనేక కారణాలతో విపరీత మయిన అభిమానం చూపుతూ .... వ్యతిరేకంగా రాసిన వారిని తిడుతుంటారు ఏదో ఆశించి రాస్తున్నారని కామెంట్ చేస్తారు .లక్షల సర్క్యు లేషన్ ఉన్న పత్రికల రాతలకే ప్రభావం లేకుండా పోయింది నాలుగైదు వందల మంది చదివే బ్లాగ్స్ లో ఏదో రాస్తే నాయకులు డబ్బులిస్తారా ? జగన్, బాబు, కిరణ్ ఎవరయినా మరీ అంత తెలివి లేని రాజకీయ వ్యాపారులేమి కాదు

    ReplyDelete
  4. Zilebi గారు,

    చంద్రబాబు రాజకీయాల్లోంచి, మీరు బ్లాగ్లోలోంచి విరామం తీసుకోరని నా నమ్మకం!

    ఇవ్వాళ ఈ అంశంతో పోస్ట్ రాస్తానని నిన్న నాకు తెలీదు. కాబట్టి మీలా విరామం ప్రకటించేంత సాహసం నేను చెయ్యను.

    'ఏ నిమిషానికి ఏమి టపా రాయుదుమో ఎవరూహించెదరు.. ' అని అనుకుంటుంటాను!

    ReplyDelete
  5. జలతారువెన్నెల గారు,

    ముందుగా నా పోస్టులు ఓపిగ్గా చదువుతున్నందుకు మీకు ధన్యవాదాలు.

    నేను కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోలేదండి!

    'కాదేది పోస్టుకనర్హము.' అనుకుంటూ ఆ కామెంట్స్ కి నా ఆలోచనల్ని జోడించి కొత్త టపాగా వండి వార్చాను. అంతే!

    ReplyDelete
  6. డాక్టరు గారు నేను కూడా ఇలానే అలొచించి చాలా రోజులనుంచి బ్లాగ్ వ్రాయటము మానివేసా కాని ఇది ఒక అరొగ్యవ్యాపకము అనిపించింది. ఎలాగు రంధ్రాన్వేషణ చేసే అఙ్ఞాత వలన మనకు ఇంకొంత ఆలోచనా శక్తి పెరుగుతుంది.కావాలని కొంతమంది అడ్డదీడ్డ కామెంట్స్ వ్రాస్తారు.మన భావాలు మనవి.

    ReplyDelete
  7. Yes, you have crossed first stage. wish u all the best :)

    ReplyDelete
  8. buddha murali గారు,

    అయ్యో! నేను నీరుకారి పోలేదండి! నా బ్లాగ్ గూర్చి చాలా నిక్కచ్చిగా ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ నాకు నచ్చింది కూడానూ! నేను ఆ వ్యాఖ్య రాసినవారికి ధన్యవాదాలు కూడా తెలిపాను.

    నేను బాధ పడుతూ రాసినట్లుగా మీకు అనిపించిందంటే అది నా పోస్ట్ లోపమే!

    ఒక అంశాన్ని ఎనలైజ్ చేస్తున్నప్పుడు.. ఆ చేసేవారి పరిమితులు మనం గుర్తెరిగి ఉండాలని చెప్పడానికి మాత్రమే ఈ పోస్ట్ రాశాను. ఎక్కడో తన్నింది!

    ReplyDelete
  9. I don't know about others, but you are one of my favourite bloggers. I really appreciate your gentle sense-of-humor, astounding logic and keen observations.
    Please keep writing your tongue-in-cheel commentaries on everything, sir.
    Sharada

    ReplyDelete
  10. Zilebi గారు,

    చంద్రబాబు రాజకీయాల్లోంచి, మీరు బ్లాగ్లోకలోంచి విరామం తీసుకోరని నా నమ్మకం!

    ఇవ్వాళ ఈ అంశంతో పోస్ట్ రాస్తానని నిన్న నాకు తెలీదు. కాబట్టి మీలా విరామం ప్రకటించేంత సాహసం నేను చెయ్యను.

    'ఏ నిమిషానికి ఏమి టపా రాయుదుమో ఎవరూహించెదరు.. ' అని అనుకుంటుంటాను!

    ReplyDelete
  11. Alapati Ramesh Babu గారు,

    నాదంత సున్నిత మనసు కాదులేండి!

    వృత్తి రీత్యా నాకు బూతులు తిట్టించుకోవడం కూడా అలవాటే! ఆ బూతుల్లో కూడా ఎంతో వెరైటీ ఉంటుంది! వీలయితే ఈ టాపిక్ మీద ఓ పోస్ట్ రాస్తాను!

    ReplyDelete
  12. " ఆగి ఆగి, సాగి పోరా
    సాగి వెనుకకు చూడరా
    వేడుకుంటూ ఎన్నెన్ని చేతులు
    వేగి పోయే ఎన్నెన్ని బ్రతుకులు
    వేచి వున్నాయిరా..."

    మీకు తోచింది మీరు రాయడం ఎంత సహజమో, వారికి తోచింది అనడం బూచాళ్ళకి (అదే.. మన అజ్ఞాత పోరాట యోధ, యోధనీ మణులకు) అంతే సహజం, ధర్మం కూడా. :)

    మీ రాతలు కొన్ని బాగుంటాయి, కొన్ని పరవాలేదు అనిపిస్తాయి. నేను నచ్చే అతికొద్ది బ్లాగుల్లో మీది ఒహటి అనేస్తున్నా మీరు ఒప్పుకోవాలి, అంతే! :) :P ఎప్పుడూ మసాల దోశెలంటేనే విరక్తి కలుగుతుంది, అప్పుడప్పుడు పెసరట్టు-ఉప్మా( ఇదేమి వెధవ కాంబినేషనూ అనకండి, కనిపెట్టిన బెజవాడ వాళ్ళు నొచ్చుకుంటారు :P, వాళ్ళ తిండి వాళ్ళది. :) ), పూరీ, లాంటివి మారుస్తూ వేస్తూండండి. "పిల్లలు ఇష్టంగా తింటారు" (-Blossom Era స్టైల్లో ;) )

    ReplyDelete
  13. ఒకటి : :D - మీరు మామూలుగా ధన్యులు కారు. (ఎకార్డింగ్ టూ సుమతీ శతకం)

    రెండు : ఈ బ్లాగ్ లోకం లో ఎవర్ని నొప్పించినా మీకు వాయింపు తప్పదు. ఎవర్నీ నొప్పించకుండా ఏదో రాసుకుంటూ పోతేనే, మనకి ఏ నొప్పులూ వుండవు.

    మూడు : మీ కేస్ షీట్ ఉటంకింపు చదివాకా అనిపించింది - చదూకునేటప్పుడు రాసీ రాసీ చేతులు పడిపోయి కామోసు డాక్టర్ల చేతి రాత అర్ధం అయ్యీ అవ్వకుండా చెండాలంగా వుంటుంది.

    I enjoyed this post. Thanks.

    ReplyDelete
  14. /చంద్రబాబు రాజకీయాల్లోంచి, మీరు బ్లాగ్లోకలోంచి విరామం తీసుకోరని నా నమ్మకం!/
    హ్హ్వాహ్వాహ్వా ... జిలేబి గారు మ డ మ తిప్పే ప్రసక్తే లేదు. :P

    ReplyDelete
  15. మీక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది, మాకు అది చదివే లక్కుంది, ఇక ఇందులో ఏమి చిక్కుంది?

    ReplyDelete
  16. డాక్టర్ గారు,

    "ఎవరేమన్ననూ...... తోడురాకున్న.... ఒంటరిగానే పొరా బాబు పో..... నీదారి నీదే సాగిపొరా... నీగమ్యం చేరుకోరా...."

    సార్ ఒక వ్యక్తి అందరికీ మంచివాడు ఎలా అవుతాడు.దాని గురించి మీరేమి భాదపడొద్దు.ఎందుకంటే ఈ టఫా చదువుతుంటే మీరు బాధ పడ్డారని అనిపిస్తుంది.



    లోకంలో అందరూ అందరికీ నచ్చరు(ఏసుప్రభువు,రాముడు లాంటివారే నచ్చడం లేదు మనమెంత)

    డోంట్ వర్రి, అయినా మీరు సమకాలీన సామాజిక అంశాల మీద మంచి విశ్లేషనలే రాస్తారు.

    రజనీకాంత్ లా మీ హవా కంటిన్యూ చేయండి సార్.

    రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  17. "తోటకూర పప్పులా బ్లాండ్ గా"... :)

    ReplyDelete
  18. డాక్టర్ గారు ,
    మొత్తానికి పనిలేక మీరు మంచి మంచి పోస్ట్ లు రాస్తున్నారండి.

    ReplyDelete
  19. డాక్టర్ గారు కేస్ షీట్ గురించి విపులంగా చెప్పారు. బహు బాగుగా చెప్పారు.
    నా లాటి తెలియని వారికి ఇవన్నీ ఎవరు చెపుతారు చెప్పండి? మీరు పని లేక వ్రాసుకున్నా..మేము పని లేక చదువుకున్నా..ఎవరికీ ఏమి నష్టం చెప్పండి!?
    మీరు వ్రాస్తూనే ఉండండి సర్! వ్రాస్తూనే ఉండండి.

    ReplyDelete
  20. రమణ గారు, మీరు వ్రాయడం వల్ల మాకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలామంది మంచి బ్లాగర్స్ వ్రాయడం మానేసి మీ వ్యాసాలు చదివి ఎంజాయ్ చేస్తు ఉన్నారు. వాళ్ళందరి వాటా కూడా మీరే వ్రాసేట్లయితేనే, లేదంటే మీకు ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు మరిన్ని ప్రాప్తిరస్తు. వారికి సమాధానం చెప్పడానికి ఆయినా బోలెడు టపాలు వ్రాస్తారని కుట్ర అన్నమాట.

    ఈ వ్యాసం మీ భాషా పటిమని సూచిస్తున్నది. శరత్చంద్ర చటర్జీ ఉపమానం భేషుగ్గా సరిపోయింది.

    ReplyDelete
  21. ఈ సారి మీరు రాసిన కేస్ షీట్ ఏ మాత్రం బాగోలేదండీ...

    ReplyDelete
  22. ఇక లాభం లేదు డాక్టారూ. మీరు బాధపడినా పడకున్నా పడినట్టు నటించకపోతే ఆంధ్రదేశం ఆడపడుచులు వూరుకునేలా లేరు, ముక్కు చీదడాలు చెదురుమదురుగా వినిపిస్తున్నాయ్. మీరు బాధ పడుతున్నారు... ఇక మారు మాటాడకండి...అంతే! ఇంద రుమాలు, తీసుకోవాల్సిందే, లేదంటే... మిమ్మల్ని అర్జంటుగా ఓదార్చలని జైల్లోని మహానేత బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడట, ఆపై మీ ఇష్టం, బుగ్గలు బూరెలవుతాయి జాగర్త! :P :)))

    ReplyDelete
  23. @sbmurali2007,

    శారద గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  24. SNKR గారు,

    థాంక్యూ! నిన్న బంద్ వల్ల రాలేని పేషంట్లు ఇవ్వాళ వచ్చారు. అంచేత ఇప్పటిదాకా కొద్దిగా బిజీ. మీపై అజ్ఞాతలు చేసిన కామెంట్లు తొలగించాను.

    ReplyDelete
  25. Sujata గారు,

    >>ఈ బ్లాగ్ లోకం లో ఎవర్ని నొప్పించినా మీకు వాయింపు తప్పదు.<<

    అవును. నా స్నేహితులు ఆల్రెడీ నన్ను హెచ్చరిస్తున్నారు.

    >>డాక్టర్ల చేతి రాత అర్ధం అయ్యీ అవ్వకుండా చెండాలంగా వుంటుంది.<<

    అలాగంటారా! మరి డాక్టర్ కాకముందు నుండే నా చేతి రాత చండాలంగా ఉందే!

    ReplyDelete
    Replies
    1. బహుశ మీ చేతివ్రాత బాగా లేకపోవడం వల్లనే మీరు డాక్టర్ అయ్యారేమో

      Delete
    2. @Indira Hari,

      హహహా! అయ్యుండొచ్చు.:)

      థాంక్స్ టు కంప్యూటర్స్. ఈ టెక్నాలజి లేకపోతే నేను ఒక్క పేజి కూడా రాసే(రాయగలిగే)వాణ్ని కాదు.

      Delete
  26. @ramaad-trendz,

    రమేష్ బాబు గారు,

    మీ ఓదార్పుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  27. puranapandaphani గారు,

    థాంక్యూ!

    మాలా కుమార్ గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  28. వనజవనమాలి గారు,

    అందరూ కూడబలుక్కున్నట్లు నన్ను రాయడం ఆపొద్దొంటున్నారేమిటి!

    నా పేరు రమణ. జిలేబి కాదు. గమనించగలరు!

    ReplyDelete
  29. "కర్ర విరక్కుండా పాము చావకుండా.. అందరితో మంచిగా ఉండాలన్నట్లుగా.. రాస్తున్నానని"

    నాకెందుకో ఈ విమర్శ సరి కాదని అనిపిస్తుంది. మీరు బట్టతలా పెళ్ళికొడుకుల నుండి ఆటోవాలా దాకా, సుబ్బారావు నుండి అప్పారావు దాకా ఎవరిని వదిలారు? అందరినీ నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడిన మీపై ఇంత అభాండం తగదు.

    కేసుషీటు పద్దతిలో టపాలు రాయండి నాకయితే నచ్చింది. నేను రాసే ISO 9001 audit log పద్దతి కన్నా నయం లెండి.

    ఇట్లాంటి విమర్శలను పట్టించుకోకుండా ఇలాగే సాఫీగా కాఫీ తాగుతూ (తాగిస్తూ) సాగిపొండి.

    చిన్న ప్రశ్న: "నాకు జగన్, చంద్రబాబులు మలేరియా, టైఫాయిడ్ లతో సమానం." అన్నారు. మరి హార్ట్ ఎటాక్, కాన్సరు లాంటివి ఎవరు?

    ReplyDelete
  30. గురు గారు,

    జిలేబి గోవిందంటే వాళ్ళు గోవిందనాలి :D

    ReplyDelete
  31. డాట్రారండి - మీ బ్లాగుద్వారా field experiments ఏమన్నా చేస్తుంటారా అని నాకో చిన్న అనుమానం. మీరు Psychiatrist కదా, అందుకే ఈ అనుమానం. పన్లో పని దీనినీ కాస్త క్లారిఫై చేద్దురూ. :-)

    ReplyDelete
  32. Mauli గారు,

    మనగ చెట్టు ఎక్కించేశారు. థాంక్యూ!

    (ఈ మునగ చెట్టు లాంటి అరిగిపోయిన పద బంధాల నుండి బయట పడాలనే దురాశయితే ఉంది. కుదరట్లేదు.)

    ReplyDelete
  33. రాజీవ్ రాఘవ్ గారు,

    బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. పోస్టుగా రాసి పడేశాను. మీకు బాలేదు. మంచిది.

    ఈ సారి నాకొచ్చే ఐడియా మీకు నచ్చాలని ఆ బ్లాగ్దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను!

    ReplyDelete
  34. Jai Gottimukkala గారు,

    అబ్బే! నన్నెవరూ విమర్శించలేదు లేండి! మాడు పగిలే సందర్భమే వస్తే.. మెల్లగా నేనే సైడయిపోతాను.

    మొత్తానికి నావి కూడా పదునైన టపాలేనంటారు! థాంక్యూ! ఇక చూస్కోండి! నా పెన్నుకి ఇంకా పదును పెడ్తున్నా!

    ఏదో టపా సందర్భంగా జ్వరాల గూర్చి రాస్తే.. మీరు అన్ని రోగాల గూర్చి వాకబు చేస్తే ఎలా?!

    ReplyDelete
  35. @ తెలుగు భావాలు,

    నా బ్లాగు నందు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ.. ఏ విధమైన కుట్రలు, కుతంత్రాలు లేవని విన్నవించుకునుచున్నాను.

    ReplyDelete
  36. kastephale గారు,

    thank you!

    ReplyDelete
  37. నాఉద్దేషంలో కర్ర విరగితే గానీ పాము చస్తే గానీ వచ్చే ఆనందం(?) కంటే కర్ర విరిగితే ఏమవుతుంది, విరక్కపోతే ఏమవుతుంది, పాము చస్తే ఏమవుతుంది, బతికితే ఏమవుతుంది అని తెలుసుకోవడమే ముఖ్యం. మీరిలాగే ప్రొసీడయిపోండి.

    మీరచనలు బాగుంటున్నాయి.

    ReplyDelete
  38. విశ్వరూప్ గారు,

    ధన్యవాదాలు.

    అటులనే! మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము.

    ReplyDelete
  39. sree గారు,

    >>మీక్కొంచెం తిక్కుంది, కాని దానికో లెక్కుంది, మాకు అది చదివే లక్కుంది, ఇక ఇందులో ఏమి చిక్కుంది?<<

    హ.. హ.. హా! మీ కామెంట్ భలే బాగుంది.

    ReplyDelete
  40. "ఏదో టపా సందర్భంగా జ్వరాల గూర్చి రాస్తే.. మీరు అన్ని రోగాల గూర్చి వాకబు చేస్తే ఎలా?!"

    ఏమీ లేదు. మీరు ఇలా (as per below) రాయడం మొదలు పెట్టి గొడవలు ఎందుకొని చివరి 3 వాక్యాలను కత్తిరించారా అని చిన్న అనుమానం. అడిగిస్తే పోలా అని కామెంటాను. Good to know there is no hidden agenda :)

    "నాకు జగన్, చంద్రబాబులు మలేరియా, టైఫాయిడ్ లతో సమానం. వీళ్ళతో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ప్రాణానికి ప్రమాదం లేదు. కాంగ్రెస్ (లేదా XYZ పార్టీ) ఈ దేశానికి హార్ట్ ఎటాక్ లాంటిదయితే భాజపా (లేదా ABCD పార్టీ) కాన్సరు వంటిది. ఇవి దేశాన్ని సర్వనాశనం చేస్తాయి"

    ReplyDelete
  41. /మీపై అజ్ఞాతలు చేసిన కామెంట్లు తొలగించాను./

    చూడలేదే! థాంక్స్.
    గజదొంగ జగ్గు గారి వాడేసిన టూత్‌పిక్ అయ్యుంటాడు, :P :)) అలాంటివి పట్టించుకోను.

    ReplyDelete
  42. /నాఉద్దేషంలో కర్ర విరగితే గానీ పాము చస్తే గానీ వచ్చే ఆనందం(?) ...మీరిలాగే ప్రొసీడయిపోండి. /

    నమస్తే అన్న.
    హిక్.. మస్తుంది మీ ఉద్దేషం. ఇంతకీ తెలంగాన కర్ర గెప్పుడు విరుగుడు? ముక్కన్న పాము చచ్చుడు? మనది మాగ్గావాలె , గెప్పుడిస్తరు? త్యాగాలు షేషినా ఇస్త లేరు. హిక్... జగన్ బొక్కుడు మన లొల్లిని హైజాక్ చేషిండు, మరి షురూ జేయాల, గెప్పుడు గది జెప్పున్రి. ఏదో ఒకటి చెప్పున్రి ;) :D

    ReplyDelete
  43. mee blog chala baguntundi

    ReplyDelete
  44. Okkokka sari mee blogs lo aa pogadthalu chusthunte ee madhya cinema audio release functions ni, logo release functions ni (meeku telise untundi anukuntunnanu) thalapisthunnaru. vishayam cheppali ante meeru vraasina prathi topic/item pedda hits emi kaadu. konni bagunnayi, konni baago levu. kaani anntiki ooka dampudu daruvu emito teliyadu. jilebi jhangri ee mahanubhavudu evaro kaani, aa comments ki artham emito vaarike teliyali. intha time ela dorukuntundo , anni blogs lo atuvanti comments pettadaniki, mechukolekunda undaleka pothunnanu.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.