Friday, 22 June 2012

అభిమానం.. ఆవేదనతో..



"కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

'అచ్చా తొ హమ్ చల్తీ హై! ' అంటూ 'కిషోర్ దా' దగ్గరకి వెళ్దామని తొందరపడకు.

'చలా జాతా హూ! ' అని పాడుతూ పంచమ్ ని చేరుకుందామనుకొని ఆశ పడకు.

'నన్ను వదలి నీవు పొలేవులే.. అదీ నిజములే!'

అందుకే..

నా దగ్గర నీ పప్పులేం ఉడకవ్ ఆనంద్!

ఇప్పుడే 'బాబూ మొషాయ్' ని పంపిస్తున్నాను.

నిన్నెలా హేండిల్ చెయ్యాలో బాబు మొషాయ్ కి బాగా తెలుసు.

అప్పుడు మనం..

'యే షామ్ మస్తానీ.. ' అంటూ పాడుకుందాం.

'మేరె సప్నోన్ కి రాణి.. ' అంటూ జీప్ లో చక్కర్లు కొడదాం.

'జైజై శివశంకర్.. ' అంటూ భంగ్ తాగి గంతులేద్దాం.

మిత్రమా! రాజేష్ ఖన్నా!

గమ్మత్తులు చేసి మమ్మల్ని మత్తులో ముంచేశావ్!

వెర్రివాళ్ళని చేసేశావ్!

అందుకే అడుగుతున్నాను.. బరువెక్కిన గుండెతో..

"కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

వుయ్ లవ్ యు! గెట్ వెల్ సూన్ మ్యాన్!


(photos courtesy : Google)

16 comments:

  1. డాక్టర్ గారు,

    ఎవరు సార్ ఈయన.

    మనోళ్ళు గనక ఆయనెవరో చెగువేరా బొమ్మ పెట్టు కొని అరాధించినట్టు,లవర్స్ డే అని ఆయనెవరో వాలెంటైన్ ని అరాధించినట్టు ఈయన ఎవరు సార్.మనకెటూ ఎంచక్కా మన భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,అంబేద్కర్,మన బాలయ్య బాబు మనకుండగా.

    రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
    Replies
    1. రమేష్ బాబు గారు,

      రాజేష్ ఖన్నా మా రోజుల్లో సూపర్ స్టార్. అతన్ని 'కాకా' అంటారు.

      'అచ్చా తొ హమ్ చల్తీ హై!' కిషోర్ కుమార్ (కిషోర్ దా) పాడిన ఈ పాట 'ఆన్ మిలో సజనా' లోనిది.

      'చలా జాతా హూ!' పాట R.D.బర్మన్ (పంచమ్) సంగీతం వహించిన 'మేరే జీవన్ సాథి' లోనిది.

      రాజేష్ ఖన్నా, కిషోర్, బర్మన్ మంచి స్నేహితులు.

      'ఆనంద్' హృషికేశ్ ముఖర్జీ క్లాసిక్. కేన్సర్ పేషంట్ (రాజేష్ ఖన్నా), డాక్టర్ (బాబు మొషాయ్ - అమితాబ్ బచ్చన్) ల కథ. గుండెల్ని పిండేస్తుంది.

      'యే షామ్ మస్తానీ.. ' కటీ పతంగ్, 'మేరె సప్నోన్ కి రాణి.. ' ఆరాధానా, 'జై జై శివ శంకర్.. ' ఆప్ కి కసమ్ సినిమాల్లోని హిట్ సాంగ్స్.

      పొద్దున్న రాజేష్ ఖన్నా ఫోటో చూసి దిగులేసింది. హడావుడిగా ఒక టపా రాసేశాను. మీకు అర్ధం కాలేదన్నారని.. ఇప్పుడు తీరిగ్గా వివరం రాస్తున్నా!

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
    2. *'ఆనంద్' హృషికేశ్ ముఖర్జీ క్లాసిక్.*

      ఇదే సినేమాని కరణ్ జోహర్ కల్ హో న హో అని షారుఖ్ ఖాన్,ప్రీతి జింతాలతో తో తీశాడు.రాష్ ఖన్నా నటించిన వాటిలో అమర్ ప్రేం సినేమా కూడా చాలా బాగుంట్టుంది. అందులోని కుచ్ తో లోగ్ కహేంగే, లోగోం కాం హై కేహనా అనే పాట మంచి హిట్. అమర్ ప్రేం సినేమా లోని ఈ రెండు పాటలను చూస్తే దుఖం లో కూడా చాలా ఆనందం ఉందనిపిస్తుంది.

      http://www.youtube.com/watch?v=95UdAo4JdJI

      http://www.youtube.com/watch?v=kpM0jPd6-7w&feature=relmfu


      SriRam

      Delete
  2. ఈ మద్య ఏదో ఆడ్ లో రాజేష్ ఖన్నా ను చూసి ముందు గుర్తుపట్టలేదు . ఆ తరువాత ఇదేమిటి ఇలా ఐపోయాడు అని నేనూ చాలా అనుకున్నాను .

    ReplyDelete
  3. అయ్యో! ఏమిటిలా.. !? అలనాటి ..రొమాంటిక్ హీరో.. యేనా..ప్చ్.. :(:(
    గెట్ వెల్ సూన్ ..మేరి సప్నో కి రాణి కబ్ ఆయా గీత్.. రిమేక్ చేయాలి ..అని ఆశ

    ReplyDelete
  4. TIME!! The curse against God's grace of beauty on humans!

    ReplyDelete
  5. అయ్యో రాజేష్ ఖన్నా ... :((
    పాడు జీవితమో యవ్వనం
    మూడు నాళ్ళ ముచ్చటనే

    ReplyDelete
  6. I recently heard that his ex wife Dimple kapadia stood by his side since there was no one to take care of him at this age and I thought that was really so nice of her!

    ReplyDelete
  7. Sad to see him in a cachectic state. He apparently was treated for some type of cancer not too long ago. Wish him speedy recovery. Dimple is not an ex, but, an estranged wife. They are very much married legally from what I can gather. I have seen a video clip of gaunt, but, energetic Kaka appearing on a terrace with his son-in-law.
    http://ibnlive.in.com/videos/267369/superstar-rajesh-khannas-journey.html

    ReplyDelete
  8. అసలు గుర్తు పట్టలేదు కాకా ని. దిగులేసింది ఒక్కసారి మీరు చెప్పినవన్నీ చూసి.

    బాబూ మోషాయ్ ని కూడా మాటల గారడీతో మాయ చేసి మళ్ళీ ఇప్పుడే వస్తానని పోగల చాలూ ఈ ఆనంద్. అలా అప్పుడే ఇంత తొందరగా జరగకూడదని కోరుకుంటూ :-(

    ReplyDelete
  9. తప్పకుండా. I support you.
    కాలం యెంత పని చేస్తుందో చూడు.
    ఒకప్పుడు ఫాన్స్ కి కొదవ లేని రాజేష్ ఖన్నా ఈ మధ్య తిరిగే పంఖాలకు ( ఫాన్స్) అడ్వర్టైజుమెంట్ ఇస్తూ బ్రతుకు వెళ్ళ దీస్తున్నాడు.
    Again, thanks for reminding us all about this great artiste.
    - పుచ్చా

    ReplyDelete
  10. Sad to see how the man who was once the heartthrob of millions is looking now. I hope Kaka (my former MP) gets well soon.

    ReplyDelete
  11. రమణ గారు నేనైనా మీరైనా ఎవరయినా వయసుతో పాటు మారు తుంటాం కానీ ఎందుకో రాజేష్ కన్నా లాంటి హీరోలను ఇలా చూసినప్పుడు బాధగా ఉంటుంది

    ReplyDelete
    Replies
    1. రాజేష్ ఖన్నా స్పృతులు నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. స్కూల్ రోజుల్లో అతని 'ఆరాధనా' ఫస్ట్ రిలీజ్ చూశాను. ఒక్క ముక్క అర్ధం కాలేదు. కానీ నచ్చింది!

      మా ఇంటికి దగ్గర్లో ఉన్న రంగమహల్ (ఇప్పుడు లేదు) లో దాదాపు రాజేష్ ఖన్నా సినిమాలన్నీ రిరిలీజుల్లో చూశాను. స్నేహితులం (ఇప్పుడు దాదాపుగా అందరూ అమెరికాలో ఉన్నారు) ఈ సినిమాలు చూసి కిషోర్ కుమార్ పాటలు నెమరు వేసుకుంటూ నైజాం హోటల్లో టీ తాగి ఇళ్ళకి చేరుకునేవాళ్ళం. సినిమా చూడ్డం కన్నా స్నేహితులతో గడిపిన ఆ సరదా క్షణాలు (ఇప్పటి క్రికెట్ పరిభాషలో extra ఇన్నింగ్స్ అనొచ్చేమో) నాకు బాగా గుర్తు. చాలా ఇష్టం కూడా.

      నాకు రాజేష్ ఖన్నాతో ఇంత ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ఉన్నట్లు టపా రాసే దాకా నాక్కూడా తెలీదు!

      (రాజేష్ ఖన్నా ఫొటో చూడంగాన్లే ఎందుకంత బాధ పడిపొయ్యాను? పన్లు మానుకుని మరీ ఒక టపా ఎందుకు రాశాను? అన్న ప్రశ్నలు నాకు నేనే వేసుకుంటే వచ్చిన సమాధానం ఇది!)

      Delete
  12. Ramanagaru
    Rashtramlo inni parinamaalu jarugutunte mirala nimpadiga kurchunnarenti? Mi subbuto kalisi visleshana cheyandi Sir.. We're missing both of you

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.