"కన్నా! నీ కోసం మన వి.హనుమంతరావు దగ్గరుండి మరీ చేయించాడు, హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో తెప్పించాను." అంటూ ఘుమఘుమలాడుతున్న హైదరాబాద్ బిరియానిని ప్రేమతో రాహుల్ గాంధీకి వడ్డించబోయింది సోనియా గాంధి.
మొహం చిట్లించాడు రాహులుడు.
"అమ్మా! బిరియాని నాకొద్దు, ఆ హైదరాబాదు పేరు వింటే చీమలు పాకినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నాయకులంటేనే నాకు ఎలెర్జీ!" అన్నాడు.
ఆశ్చర్యపోయింది సోనియా.
"అదేంటి కన్నా! తరతరాలుగా మన కుటుంబసేవలో తరించిపోతున్నారు ఆంధ్రానాయకులు. వాళ్ళు విశ్వాసానికి, వినయానికి మారుపేరు. ఏం? ఈ మధ్య నువ్వు కనపడినప్పుడల్లా పొర్లిగింతల దండాలు పెట్టటం తగ్గించారా? మరేం పర్లేదు. వయలార్ రవితో చెబుతాను. కావాలంటే రోజల్లా గుంజిళ్ళు తీయించుకో, గోడకుర్చి వేయించుకో." ఆనునయంగా అంది సోనియా.
"వాళ్ళు నన్ను ఉపఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారమ్మా!" కోపంగా అన్నాడు రాహుల్.
అర్ధమయ్యిందన్నట్లు తల పంకించింది సోనియా.
"నాకు తెలుసు, ఎండలు మండిపోతున్నాయి, నువ్వు తట్టుకోలేవు. అయినా నీవంటి గొప్ప దేశనాయకుణ్ణి ఉపఎన్నికల ప్రచారానికి పిలవటానికి వాళ్ళకసలు బుద్ధుందా? ఇదంతా ఆ గులాం నబి నిర్వాకం. నువ్వు సీరియస్ గా తీసుకోకు కన్నా!" అంది సోనియా.
"అమ్మా! నన్ను ప్రచారానికి రమ్మంటుంది మన పార్టీవాళ్ళు కాదు, జగన్ పార్టీవాళ్ళు. వాళ్ళకి తమ గెలుపు మీద డౌటుగా ఉందిట. నేవెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నది వారి నమ్మకమట!" పళ్ళు పటపటా నూరాడు రాహుల్.
సోనియాకి కూడా కోపం వచ్చింది.
"ఎంత పొగరు. ఇప్పుడే అహ్మద్ పటేల్ కి పురమాయిస్తాను. చిదంబరంతో చెప్పి జగన్ మీద ఇంకో రెండొందల కేసులు వేయిద్దాం, బెయిల్ వచ్చేప్పటికి ముసలాడయిపోతాడు. తిక్క కుదుర్తుంది వెధవకి!" కసిగా అంది.
రాహుల్ ఒక్కక్షణం ఆలోచించాడు. అప్పటికప్పుడే ఒక స్థిరనిర్ణయానికొచ్చేశాడు.
"ఇంక ఊరుకుని లాభం లేదమ్మా! నేనిప్పుడే ఉపఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రా వెళ్తున్నాను. జగన్ పార్టీవాళ్ళకి బుద్ధొచ్చేలా ప్రచారం నిర్వహిస్తాను." అన్నాడు.
సోనియా గాంధి కంగారుపడింది, ఆందోళన చెందింది, భయపడిపోయింది, తెల్లని మొహం నిండా చిరుచెమటలు!
"కన్నా! వద్దు, వద్దు. నువ్వంత కఠోరనిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఈ సమయంలో నువ్వెళ్ళావంటే మొదటికే మోసం.. " అని సోనియా అంటూండగా..
'దబ్బు'మన్న శబ్దం!
రాహుల్ గాంధీ డైనింగ్ టేబుల్ మీద నుండి కింద పడిపోయాడు. దొర్లుతూ, వెక్కివెక్కి ఏడుస్తూ అన్నాడు.
"అమ్మా! నువ్వు కూడానా!!"
(photo courtesy : Google)
డాక్టర్ గారు,
ReplyDeleteఅహా... ఎంత బాగా చెప్పారు గురువుగారూ, ఇప్పటికిగాని సోనియాకి తన కుమారుడి ప్రతిభ అర్ధమయినట్లుంది.
పనిలో పని రాహుల్ తో పాటు జొడీగా మన చిరంజీవినో,బాలక్రిష్ణనో పంపితే జనం మైండ్లు
పోయి ఎటుపడితే అటు పరుగు తీస్తారు.
ఎందుకంటే మన చిరంజీవికి "నీవు పడగొడితే నేను నిలబెడతా" బాలక్రిష్ణకి "నాన్నగారూ..... అప్పట్లో..... నందమూరివంశం...... ఆఆఆఆ......" ఇవి తప్పితే మరింకెమీ రావు కదా.
అయితే గురువుగారూ మీరు రాసినదానిలో "జగన్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి తమ గెలుపు మీద డౌటుగా ఉందిట" బహుశా ఇది కరెక్టు కాదనుకుంటా, ఎందుకంటే నా ఎనాలిసిస్ ప్రకారం జగనుకి 17 సేట్లు గారాంటీగా వస్తాయి.
రమేష్ బాబు
గుడివాడ
మీరీ మధ్య ఏం చెప్పినా 'జగన్మోహనం'గా ఉంటుంది.
DeleteEt tu, Brute?
ReplyDeleteరేపు కిరణ్ కుమార్ కి ,చెంద్ర బాబుకి ఓడిపోతే ఒక రీజన్ కావాలి. అందుకే జగన్ ని జైలు లోవేసి సానుభూతి వల్ల గెలిచాడు అని తప్పించుకుందామని ప్లాను అంట. ఇక ఈ రాహుల్ అనే అరటిపండు వస్తే అసలు ప్లాను పాడవుద్ది.
ReplyDeleteఎప్పటికయినా ఈ రాహుల్ పండు, లోకేష్ పుష్పం లు కలిసి మన రాష్ట్రం లో ప్రచారం చేస్తే చూడాలని ఉంది. అది సాధ్యమో కాదో మీ సుబ్బు గారిని ఒక సారి అడిగి చూడొచ్చుగా గా రమణ గారు.
రాహుల్ తనేమిటో ఆల్రెడీ యూపిలో నిరూపించుకున్నాడు. లోకేష్ సంగతి తెలీదు. కానీ వీళ్ళిద్దరూ 'కలిసి' ఎలా ప్రచారం చేస్తారు?! సుబ్బుని అడిగి చెబ్తా లేండి!
Deleteవచ్చే జెనరల్ ఎన్నికల సమయానికి ఈ ముసుగులో గుద్దులాట పోయి ,చందర్ బాబు, కాంగిరేసు వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు చూడండి.అప్పుడు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తారు. ఈ కామెంట్ నోట్ చేసుకోండి.
Deletehi,hi, bhagundandi rahul story
ReplyDeleteRecently Gulam Nabi Azad said "power can not be inherited in Democracy" , has he forgot Nehru dynasty, which has been ruling India since independence. Though I am supporting Jagan, congress can not escape responsibility by giving such dumb statements, and at the same time, all the corruption that is said to have committed by Jagan , took place during congress governance.
ReplyDeleteఇంత పెద్ద దేశానికి పార్టీ పాలసీలు కాకుండా.. వ్యక్తుల పరంగా, కుటుంబ పరంగా రాజకీయాలు చర్చింప బడటం ఒక విషాదం. గులాం నబి ఆజాద్ ఈ దేశంలో ఉన్న అసంఖ్యాక గాలివాటం కాంగ్రెస్ నాయకుల్లో (టెన్ జన్ పత్ సేవకుల్లో) ఒకడు. గొప్ప ఎలెక్షన్ మానిప్యులేటర్ గా పేరొందిన వాడు. పాపం! ఏమరు పాటునో, ఎండ దెబ్బకో.. అర్ధ సత్యాలు, నగ్న సత్యాలు కక్కేసాడు.
Deleteయూ టూ బ్రూటస్ :)
ReplyDeleteA friendly warning for puranapandaphani:
Deleteఈ సీజరు డయలాగు నేను ఆల్రెడీ వాడేసా (Jai Gottimukkala 8 June 2012 11:54 Et tu, Brute?)
మీరు వేరే ఏదయినా ఎంచుకోండి. కాదంటారా నేను మీ ఊరికి వచ్చి ప్రచారం చేస్తా!
హహహ పాపం రాహుల్ :))
ReplyDelete"నన్ను ప్రచారానికి రమ్మంటుంది మన పార్టీ వాళ్ళు కాదు. జగన్ పార్టీ వాళ్ళు."
ReplyDeleteసూపరో సూపరు
"తరతరాలుగా మన కుటుంబ సేవలో తరించిపోతున్నారు ఆంధ్రా నాయకులు. వాళ్ళు విశ్వాసానికి, వినయానికి మారు పేరు. ఏం? ఈ మధ్య నువ్వు కనపడినప్పుడల్లా పొర్లిగింతల దండాలు పెట్టటం తగ్గించారా?'
కొన్నాళ్ళ క్రితం అమ్మగారి దర్శనభాగ్యానికి, రాహుల్ కాళ్ళకు మొక్కడానికి మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కట్టకట్టుకొని వెళ్ళి ఇటాలియన్ మాత ఇంటి ముందు తెల్లవారినుండి లైన్లో నిలబడి పడిగాపులుగాచి చివరకు దర్శన భాగ్యం కలగక 'కనీసం మన ఇటాలియన్ మాత ఇంటిముందు కుక్కల్లా తిరిగాము. అది చాలు ' అని వెనక్కి తిరిగి వచ్చిన దృశ్యం మళ్ళీ కదలాడింది.
మంచి తెలుగు బ్లాగులు
YSR కూడా మీరు అంటున్న ఇటాలియన్ మాట ఇంటి ముందు లైన్ లో నిలపద లేదా ?? స్టేట్ లో అన్ని పదకలకి గాంధీ ఫామిలీ పేర్లు పెట్టినప్పుడు మీరు అందరు ఏమి ఇనారు బ్రదర్స్ ??
Deleteజగన్ ని CM చేస్తే మీకు దేవత గ కనపడేది ???
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్!
ReplyDeleteరాహుల్ హిందీ ఎన్నికల ప్రచార సంభాషణ లకి కి జిలేబీ తెనుగు సేత !
చీర్స్
జిలేబి.
@ జై గొట్టిముక్కల...
ReplyDeleteనేను చూసుకోలేదు. ఈసారికి ఇలాక్కానిచ్చేయనీయండి. :) మీరు మా తూగోకి వచ్చి ఎవరికి ప్రచారం చేస్తారో చూడాలని ఉంది. పైగా మా రాజమండ్రీకి ఇప్పుడు ఎన్నిక లేదు, రామచంద్రపురంలో పిల్లి బోసుకి చెయ్యాలంతే :)
అలాగేలెండి ఇప్పటికి వదిలేద్దాం. ఇకపోతే నా ప్రచారం అంటారా మీరు ఎవరికి చెయ్యమంటే వారికి చేస్తా. Please select the candidate you want to be defeated :)
Deleteపిల్లి బోసు గారు ఓడిపోయారట నిజమేనా. నేను ఆయనకు ప్రచారం చేయలేదు మీమీద ఒట్టు!
Delete18సీట్ల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీ సుబ్బు ముందస్తు విశ్లేషణలు, అభిప్రాయాలు వినిపిస్తే వింటాం. :) మీ ఏరియాలో వోటుకు గిట్టుబాటు ధర ఏమాత్రం వుందండి?
ReplyDeleteపరకాలలో ఎంత వుందో జైగో గారు చెప్పాలి, కలెక్షన్లు చేసుకొనుడేనా, ఏమైనా ఇచ్చుడు వుందా?
@SNKR re గిట్టుబాటు ధర: ఈ కింది వ్యాఖ్య చూస్తె ఒక అంచనాకు రావచ్చు.
Deletehttp://manajagan.com/2012/06/05/garcia-media-more-than-twelve-million-read-the-new-sakshi-daily-of-hyderabad-india/
==============================================
Jai Gottimukkala
June 6, 2012 at 5:15 PM
కొండా సురేఖపై కేసు నమోదు
http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=114382
Reply
NLR
June 6, 2012 at 5:27 PM
@ Jai Gottimukkala …
The whole world knows that Candidates will distribute money during the elections . Nothing knew . Everyone knew that tdp and cong gave 1000 rupees per vote in kovvur and prasanna gave only 200 rupees .
But the results were the opposite . Prasanna won with three times bigger majority than he won last time on tdp ticket .
Everyone wants to target YSRCP bcs they are scared of losing deposits.
Reply
==============================================
వైకాసుర పార్టీ 200 వైట్, 1800 బ్లాకులో చెల్లించారట కదా. అందుకే అంత మెజారిటీ. :)) కాంగ్రెస్, తెదెపా 1000 బ్లాకులో ఇచ్చివుంటారు, అదీ తేడా.
DeleteSnkr
Need to ask NLR
Delete@ జై గొట్టిముక్కల...
ReplyDeleteపిల్లి బోసయినా... తోట త్రిమూర్తులైనా... ఏ రాయయినా ఒకటే సామాన్య జనాలకి. ఎవరి స్టైల్లో వాళ్ళు జనాలని వాడుకుంటారంతే... మీకు తెలీనిదా... డాక్టరు గారికి తెలీనిదా :)
అంతేలెండి, "పిల్లి"కి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నారట వెనక్కెవరో.
Delete