Tuesday 5 June 2012

అధికారం - యుద్ధనీతి


"సుబ్బూ! నువ్వెన్నయినా చెప్పు. కాంగ్రెస్ మాత్రం దుర్మార్గమైన పార్టీ! రాజకీయంగా సీబీఐ ని వాడుకోవడం నీచం. ఇవ్వాళ జగన్ - మొన్నటిదాకా మూలాయం , మాయావతి , లాలూ.. ఈ లిస్ట్ ఇలా పెరుగుతూనే వుంటుందేమో?" అన్నాను.

కాఫీ సిప్ చేస్తున్న సుబ్బు ఆశ్చర్యంగా చూశాడు.

"ఇందులో దుర్మార్గం ఏముంది? ఇద్దరు వ్యక్తులు తన్నుకోవడం మొదలెట్టారు. ఒకడి చేతిలో కర్ర అనే ఆయుధం ఉంది. ఇంకోడి చేతిలో ఏ అయుధమూ లేదు. కర్ర చేతిలో ఉన్నవాడు, దాంతో వీలైనంత త్వరగా ఎదుటివాడి బుర్ర పగలగొట్టాలి. అలా చేతిలో ఉన్న ఆయుధం వాడుకోలేనివాడొట్టి పనికిమాలిన వాడి కింద లెక్క. అటువంటివాడిని యుద్ధభూమి నుండి తరిమివేయవలె! వాడికి యుద్ధం చేసే అర్హత లేదు." అన్నాడు సుబ్బు.

"ఏంటి సుబ్బూ? నేను రాజకీయాలు మాట్లాడుతుంటే.. నువ్వు కర్ర, యుద్ధం అంటూ ఏవో చెబుతున్నావ్!" విసుక్కున్నాను.  

"రవణ మావా! నే చెప్పేదీ రాజకీయాలే! నా ఉద్దేశ్యంలో కర్ర అంటే అధికారం! ఇప్పుడు రాష్ట్రంలో యుద్ధం మొదలయ్యింది. చతురంగ బలాలతో విజయమో, వీరస్వర్గమో తేల్చుకోడానికి అందరూ ఉపఎన్నికల క్షేత్రంలోకి దూకారు. కాంగ్రెస్ వాళ్ళు యుద్ధతంత్రంలో భాగంగానే జగన్ని లోపలేశారు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో! కానీ - మరీ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు కదా?" అన్నాను.

"రాజకీయాల్లో చౌకబారు అన్న పదానికి అర్ధం లేదు. గెలవడమే యుద్ధానికి పరమావధి. రాజకీయ పరుగు పందెంలో రజత కాంస్య పతకాలుండవు. ఒకటే మెడల్, ఆ మెడల్ కి నీ ఇష్టమైన పేరు పెట్టుకో. గెలుపు అరంగుళంలో మిస్సయినా, ఆరడుగుల్లో మిస్సయినా ఐదేళ్ళపాటు కుక్కబ్రతుకు బతకాల్సుంటుంది." అన్నాడు సుబ్బు.

"కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. "

"రాజకీయాల్లో రాజ్యాధికారం అనేది అత్యున్నతమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా! ఇందులో భాగస్వామ్యులైనవారికి అధికారంతో పాటు ధనకనకవస్తువాహానములు సంప్రాప్తించును. మధ్యతరగతి మేధావుల భాషలో జరిగేది ప్రజాపరిపాలన. సామాన్య ప్రజల కోణంలో చూస్తే జరుగుతుంది శాస్త్రబద్దంగా, రాజ్యాంగం సాక్షిగా ప్రజల్ని దోచుకోవటం అనే ప్రక్రియ." అన్నాడు సుబ్బు.

"మరీ అంత ఘోరమా!" ఆశ్చర్యపోయ్యాను. 

"రాజకీయాల్లో stakes చాలా ఎక్కువ, ఇక్కడంతా cut throat కాంపిటీషన్, winner takes it all, అందుకే రాజకీయాలు క్రూరమైనవి కూడా! అధికారంలో వున్నవారికి నీవల్ల రాజకీయంగా ఇబ్బందుందనుకుంటే నీ జాతకం మొత్తం తవ్వి తీస్తారు. పుట్టుక దగ్గర్నుండి నీ చరిత్ర మొత్తం పరిశోధించబడుతుంది, అందులో తొర్రలు కనుగొనబడతాయి. ఆ ఫైల్ దగ్గరుంచుకుంటారు, బెదిరిస్తారు. అప్పటికీ మాట వినకపోతివా? నీమీద కేసులు పెడతారు, అదేమంటే - చట్టం తన పని తను చేసుకుపోతుందంటారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అంటే జగన్ అమాయకుడంటావా?" అడిగాను.

"అస్సలు అనను. రాజకీయాల్లో అమాయకులకి స్థానం లేదు, ఇక్కడందరూ వాహినీ వారి పెద్దమనుషులే! అందరివీ రక్తచరిత్రలే. అందుకే సాధ్యమైనంతవరకూ బయటపడకుండా లోపాయికారిగా మేనేజ్ చేసుకుంటారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"అవుననుకో! కానీ పాపం జగన్!" నిట్టూర్చాను.

"పాపం జగనేమిటోయ్! అతను కడప ఎంపీ. వేల కోట్లకి అధిపతి, పెద్ద పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి క్యాండిడేట్. అందుకేగా చిన్న బెయిల్  పిటిషన్ కి కూడా ప్లీడర్లని ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపిస్తున్నాడు. అతను జరుగుతున్న పరిణామాల్ని ముందే అంచనా వేసుకునుంటాడు, అసలీ యుద్ధం ప్రారంభించింది జగనే కదా! లేకపోతే - హాయిగా బెంగుళూరులోనే వ్యాపారం చేసుకుంటూ ఆస్థుల్ని ఈపాటికి ఇంకో వందరెట్లు పెంచేసేవాడు, సోనియా గాంధీ చెప్పేది కూడా అలా పెంచుకుని హేపీగా ఉండమనే గదా!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ!" అన్నాను. 

"ఈ సత్యం బోధపడింది కాబట్టే కావూరి, లగడపాటి అధికారం అనే చల్లని మర్రిచెట్టు నీడకింద హాయిగా విశ్రమిస్తున్నారు. సోనియాకి ఎదురు తిరిగినట్లయితే, తమక్కూడా జైల్లో జగన్ పక్క సెల్ రిజర్వ్ అయిపోతుందని వీరికి తెలుసు. అందుకే వీరిది ఎల్లప్పుడూ ఢిల్లీ రాగం." అంటూ లేచి టైం చూసుకున్నాడు.

"మరి లగడపాటి ఎందుకంత హడావుడి చేస్తుంటాడు?" కుతూహలంగా అడిగాను.

"సినిమాలో హీరోతో పాటు కమెడియన్ షో కూడా సమాంతరంగా నడుస్తుంటుంది, అలాగే - లగడపాటిది ఓ సైడ్ షో. కాంగ్రెస్ లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఉన్నట్లుండి పదవేదైయినా ఒళ్ళోకొచ్చి వాలుతుందేమోనని లగడపాటి ఆశ. అందుకే లైమ్ లైట్ లో ఉండటానికి తిప్పలు పడుతుంటాడు. బెస్టాఫ్ లక్ టు లగడపాటి." అన్నాడు సుబ్బు.

"కానీ - కాంగ్రెస్ తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా బెదిరించడం అన్యాయం కదా." మళ్ళీ మొదటి పాయింటుకొచ్చాను.

సుబ్బు అర్ధం కానట్లు చూశాడు.

"అందుకు కాంగ్రెస్ ని తప్పు పట్టడం దేనికి? ఇక్కడ స్వచ్చమైన రాజకీయాలు నడిపేందుకు ఎవరూ లేరు. ఇదే అధికారం జగన్ చేతిలో ఉండుంటే.. ఇంతకన్నా కర్కశంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రత్యర్ధుల్ని అణిచేసేందుకు వాడుకునేవాడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు చాలా సమయం వృధా చేశారు, జగనయినట్లైతే ఆర్నెల్ల క్రితమే అందర్నీ అరెస్ట్ చేయించేవాడు. కొందరు జైల్లోనే చచ్చేవాళ్ళు, ఈ మాత్రం వాతావరణం కూడా వుండేది కాదు." అంటూ నిష్క్రమించాడు  సుబ్బు!

(picture courtesy : Google)

20 comments:

  1. Ramana, we have got addicted to your blogs, so , we wish to read, at least one blog per day. Night patients vundaru kada, so roju okato rendo blogs raastu vunte, chadivi, maa manasu nimpukuntamu, cheers

    ReplyDelete
    Replies
    1. అయ్యా! ఇప్పుడు రాస్తుంది రాత్రుళ్ళే! ఇంట్లోవాళ్ళు హెచ్చరికల్లో మూడో ప్రమాద సూచిక ఎగరేశారు. లాప్ టాప్ వంక క్రూరంగా చూస్తున్నారు. నీ మనసు నింపుకోటానికి నా కాపురానికి ఎసరు పెట్టుకోలేను.

      ఈ బ్లాగు రాతలు కూడా ఒక ఎడిక్షనే. బహుశా de-addiction కోసం నీ దగ్గరకి రావాలేమో! నీ ఆస్పత్రిలో ఒక మంచి ఏసీ రూం రెడీగా ఉంచు మిత్రమా!

      Delete
  2. >>de-addiction
    దీనికోసమైతే డాక్టర్లు అనవసరం. మీరు పాత పేషంట్లను కలుసుకోవాలి.

    ReplyDelete
  3. డాట్రారండి - గురు పుత్రుడా? ఈ కితాబేమిటో కాస్త మీ సుబ్బూనడిగి చెబ్దురూ...

    ReplyDelete
    Replies
    1. సుబ్బుని అడిగానండి. ఇప్పుడున్న ఎంతోమంది కాంగ్రెస్ నాయకుల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాజశేఖరరెడ్డి అక్షరాభ్యాసం చేయించాట్ట! కాబట్టి ఆయన్ని చాలామంది గురువుగా భావిస్తారు. అంచేత ఆయన కొడుకు గురుపుత్రుడే అవుతాడని సుబ్బు ఉవాచ!

      Delete
  4. "ఇంకోడి చేతిలో ఏ అయుధమూ లేదు"

    రమణ గారూ, నాకెందుకో ఈసారి సుబ్బు గారు పప్పులో కాలేసారని అనిపిస్తుంది. అధికారం ఒక్కటే ఆయుధం కాదు. డబ్బు, అంగ బలం, సొంత (or captive) ప్రసార సాధనాలు, గ్లామరు, sentiment, వాగ్ధాటి etc. ఇవి కూడా ఆయుధాలే.

    ఇకపోతే లగడపాటిని కమీడియన్ అన్నందుకు ఆయన వీరాభిమానులతో బాటు బ్రాహ్మి అభిమానులు కూడా మిమ్మల్ని & సుబ్బు గారుని ఆడిపోసుకోవడం ఖాయం.

    ReplyDelete
    Replies
    1. లగడపాటి, కావూరి కమెడియన్లే కాని, కచరా, అరదండ్రామ్‌ల తరవాతే ఎవరైనా అని సుబ్బుకు తెలుసు.

      Delete
    2. సుబ్బు గారికి ఏమి తెలుసో మీకెలా తెలుసు? ఆయన మీకూ మిత్రుడా?

      Delete
    3. >>డబ్బు, అంగ బలం, సొంత (or captive) ప్రసార సాధనాలు, గ్లామరు, sentiment, వాగ్ధాటి etc. ఇవి కూడా ఆయుధాలే.<<

      అవును. ఒప్పుకుంటున్నాను. కానీ రాజకీయాల్లో ఇవేవి అధికారానికి సాటి రావేమో!

      >>లగడపాటిని కమీడియన్ అన్నందుకు ఆయన వీరాభిమానులతో.. <<

      లగడపాటికి అభిమానులా!!!

      Delete
  5. ఇక్కడ స్వచ్చమైన రాజకీయాలు నడిపేందుకు ఎవరూ లేరు. ఇదే అధికారం జగన్ చేతిలో ఉండి ఉంటే.. ఇంతకన్నా కర్కశంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రత్యర్ధుల్ని అణిచేసేందుకు వాడుకునేవాడు. ఆర్నెల్ల క్రితమే అందర్నీ అరెస్ట్ చేయించేవాడు. కొందరు జైల్లోనే చచ్చేవాళ్ళు. ఈ మాత్రం వాతావరణం కూడా ఉండేది కాదు." అంటూ నిష్క్రమించాడు సుబ్బు!

    yes,it's True subbu.

    ReplyDelete
  6. *ఈ సత్యం బోధపడింది కాబట్టే కావూరి, లగడపాటి అధికారం అనే చల్లని మర్రి చెట్టూ నీడ క్రింద హాయిగా విశ్రమిస్తున్నారు. సోనియాకి ఎదురు తిరిగినట్లయితే.. తమకి కూడా జగన్ *
    రమణ గారు,

    కావురి ఒక నాయకుడా? గోదావరి జిల్లా వారికి తప్పించి పక్కాతని గురించి ఎవరికి తెలియదు. సీనియర్ నాయకుడై ఉండి చిన్న మంత్రి పదవిని కూడా సంపాదించుకోకుండా, వ్యాపారాలకి ప్రాముఖ్యత ఇస్తూ, వ్యాపారం కొరకు రాజకీయాలలో కొనసాగే రాజకీయ నాయకుడు. ఇతను శరద్ పవర్ మద్దతు దారుడు. పవర్ ఎంత నికృష్టుడో డిల్లి రాజకీయాలు తెలిసిన వారికి అందరికి తెలిసు. లగడపాటి ఇతనోక పెద్ద కామేడి. అసలికి ఆంద్రా వాళ్లు రాజకీయ నాయకులా? వాళ్లకి పోరాటం చేసే సత్తా ఉందా? ఒక్క యన్.టి.ఆర్. మినహాయించి,
    ఆ ప్రాంత రాజకీయ నాయకులకి అంత సీన్ లేదు. వ్యాపారం కోసం,ఆస్తులను రెట్టింపు చేయటానికి కొరku రాజకీయాల లోకి వచ్చిన వాళ్లు. అదే జగన్ వేల కోట్ల వ్యాపారాలను పణ్ణంగా పెట్టి, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పగలు, రాత్రి, యండనకా వాననకా తిరుగుతూ ఆంధ్రా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాడు (అది మంచో చేడో వేరే సంగతి). అదే జగన్ స్థానం లోకోస్తా జిల్లాలవారు ఉండి ఉంటే, మీరు చెప్పినట్లుగా అధికారం అనే చల్లని మర్రి చెట్టూ నీడ క్రింద పెద్ద వ్యాపారాలు చేసుకొంట్టు, హాయిగా విశ్రమిస్తూండేవారు.

    ReplyDelete
  7. రమణ గారు, మీ సుబ్బు కాఫీ తాగే ఇంత చెబితే ఇక బీరు తాగితే ఇంకెంత చెబుతాడో అనిపిస్తోంది. :))

    ReplyDelete
    Replies
    1. సుబ్బు గారు బీరు తాగరని, సింగిల్ మాల్ట్ మాత్రమె సేవిస్తారని చదివిన గుర్తు :)

      Delete
    2. SNKR గారు,

      సుబ్బు సింగిల్ మాల్ట్ విస్కీ మాత్రమే ఇష్టపడతాడు.

      Jai Gottimukkala గారు,

      సుబ్బు అలవాట్లు గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలండి!

      Delete
  8. హమ్మయ్య!

    మళ్లీ ఓ మంచి పోస్టు! చాల బాగుంది డాక్టర్ సాబ్!
    ఇపుడు మీకంటే మీ సుబ్బు కి ఎక్కువ పేరు వస్తే, సీరియల్ లో లాగ ఒకరోజు సుబ్బు కారెక్టర్ ని మాయం చేస్తారా :-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. ఆ సీరియల్ ఏదో నాకు తెలీదు గానీ.. మా సుబ్బుని మాయం చేస్తే మీరూరుకుంటారా! మా సుబ్బు ఊరుకుంటాడా!

      Delete
  9. మిత్రులారా,

    గత రెండ్రోజులుగా నా బ్లాగుకి ఏదో రోగమొచ్చి ఓపెనవ్వలేదు. హమ్మయ్య! ఇప్పుడే తెరుచుకుంది. కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  10. సుబ్బూ ఎప్పుడూ సూపరే :))
    మొత్తానికి యుద్ధం ముగిసింది. ఫలితాల తరువాత పరిస్థితి:

    అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి...బోల్తా కొట్టిందిలే కాంగ్రెస్ పిట్ట
    గుట్టు ఈరోజే తెలిసిందిలే...గుండె దిగజారి నిలుచుందిలే!!

    అయ్యయ్యో చేతిలో సైకిలు పోయెనే, అయ్యయ్యో ఓట్లు ఖాళీ ఆయెనే!
    ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది....ఊర్లో ఉన్న డిపాజిట్టుతో సహా తిరుక్షవరమైపోయింది!!

    బొమ్మను చేసి, ప్రాణము పోసి ప్రజారాజ్యమన్నావు నీకిది వేడుక!
    గారడీ చేసి, డిపాజిట్ దోచి నవ్వేవు ఈ వింత చాలిక!!

    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...ఇక ఓట్లేల, సొంత TRS ఏల......ఓ చెల్లెలా!!
    ఏల ఈ ఎన్నికలు, ఏది నా రాష్ట్రం...ఓ చెల్లెలా!!

    నేనే నంబర్ 1, నేనే నంబర్ 1, వైయెస్సార్ పార్టీ నంబర్ 1, ఓట్లన్నీ పోగేసే పార్టీ నంబర్ 1.....నంబర్ ...1.... నంబర్1 .... నంబర్ 1 !!

    .................

    Just for fun :))

    ReplyDelete
  11. @సౌమ్యా
    పేరడీలు బలే బాగున్నాయి.

    శారద

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.