"రమణ మామ! కాఫీ." అంటూ హాడావుడిగా వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బు! ఒక తెలుగువాడికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. నాకు బాధగా ఉంది." దిగులుగా అన్నాను.
"ఎవరా తెలుగువాడు? ఏమా అన్యాయం?" ఆసక్తిగా అడిగాడు సుబ్బు.
"మన పి.వి.నరసింహారావు మీద ఏదో కుట్ర జరుగుతుంది సుబ్బు. పేపర్ చదవలేదా?" ఆశ్చర్యంగా అన్నాను.
"ఓ అదా! నేనింకేదో అనుకున్నాను." అంటూ నవ్వాడు సుబ్బు.
"సుబ్బు! నీ నవ్వు పరమ దరిద్రంగా ఉంది. ఒకపక్క తెలుగుజాతి పరువు నట్టేట మనిగిపోతుంది." చికాగ్గా అన్నాను.
"ఇందులో తెలుగుజాతికి జరిగిన నష్టమేంటో నాకర్ధం కావట్లేదు. పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమర్జన్సీలో కూడా పార్టీలో కీలక వ్యక్తి. ఒకానొక ప్రత్యేక పరిస్థితుల్లో.. అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రధానమంత్రి అయ్యాడుగానీ.. తెలుగువాడు కాబట్టి ప్రధానమంత్రి కాలేదు." అన్నాడు సుబ్బు.
"కానీ ఆయన తెలుగువాడు.. "
"అవును. నే చెప్పేదీ అదే! ఆయన మాతృభాష తెలుగు. గొప్పపండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు. ఆయన భాషాశాస్త్ర పాండిత్యానికి శతకోటి వందనాలు. అయితే పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి కావడానికి ఇవేవి కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కారణం. కానీ.. మనం ప్రముఖులైనవారికి మన తెలుగుభాష ముద్ర వేసుకుని వారిని మనలో కలిపేసుకుని ఆనందిస్తాం. వారి గూర్చి తెగ తాపత్రయ పడిపోతాం. మంచిదే. ఇక్కడిదాకా నాకు పేచీ లేదు."
ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"కానీ ఈ కారణాన ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి చెందిన రంగంలో గుడ్డిగా సమర్ధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి ఆల్ ఇండియా ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో కార్డియాక్ సర్జన్ వేణుగోపాల్ కి, కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రాందాస్ కి గోడవయింది. అది కేవలం రెండుగ్రూపుల మధ్య తగాదా. అప్పుడుకూడా ఆ డాక్టరుకి 'తెలుగు తేజం' అంటూ ఒక కిరీటం తగిలించి ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టాం. మనకిదో రోగం."
"సుబ్బు! నీకసలు భాషాభిమానం లేదు. నీ చెత్త ఎనాలిసిస్ ఆపెయ్యి." విసుగ్గా అన్నాను.
"నాకు భాషాభిమానం లేకపోవచ్చు. కానీ నీది భాషా దురభిమానం. ఇప్పుడు ఢిల్లీలో రాబోయే ఎన్నికలకి సన్నద్ధమయ్యే తతంగం నడుస్తుంది. బాబ్రీ మసీదు కూలగొట్టినప్పటి అలసత్వం ఒక మరకగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది. ఎలాగైనా ఆ మరక తుడిచేసుకోవటానికి తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఆ మురికంతా పి.వి.నరసింహారావుకి పూసే ప్రయత్నం జరుగుతుంది. 'మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజామందిరంలో ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడా?' అన్నవి ప్రజలకి సంబంధం లేని అనవసర విషయాలు. పి.వి. తెలుగువాడయినా, బెంగాలీవాడయినా ఈ ప్రచారం జరగక మానదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. మధ్యలో మనమెందుకు బాధ పడటం?" అంటూ చిన్నగా నవ్వాడు సుబ్బు.
"కానీ తెలుగువాడి రక్తం.. "
"రక్తం లేదు. రసనా లేదు. ఎవడి రాజకీయ అభిప్రాయాలు వాడికున్నాయి. గ్లోబలైజేషన్ అనుకూలం వాళ్ళకి పి.వి. దేవుడు. వ్యతిరేకులకి ఆయనొక దెయ్యం. హిందూమత రాజకీయ భావాలు కలవారికి పి.వి. రాజకీయ చాణుక్యుడు. సెక్యులర్ భావాలవారికి ఆయనొక అసమర్ధ ప్రధాని. రాజకీయాలు మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటాయి." అన్నాడు సుబ్బు.
"కానీ పి.వి.నరసింహారావు దేశప్రధానిగా చేశాడు. ఇవ్వాళ కాంగ్రెస్ ఆయన్ని గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తుంది." అన్నాను.
"రాజశేఖరరెడ్డి నిన్నగాక మొన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినవాడు. ఇప్పుడు రాజశేఖరరెడ్డి ఫొటో గాంధీభవన్లో పెట్టటానికి ప్రయత్నించి చూడు. కాంగ్రెస్ నాయకులు నిన్ను పిడిగుద్దులతో చంపేస్తారు. ఇవి రాజకీయాలు నాయనా! అత్యంత క్రూరమైనవి. ఇవ్వాళ నిన్ను ఒకందుకు పల్లకిలో ఎక్కిస్తారు. రేపు మరొకందుకు కుళ్ళబొడుస్తారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ పై పెట్టాడు సుబ్బు.
"నువ్వు చెప్పేది బాగానే ఉంది. కానీ నాకు నచ్చలేదు." అన్నాను.
"నీకు నచ్చకపోతే కొంపలేమీ మునగవులే! స్వాతంత్ర్యానంతరం మనదేశంలో సంభవించిన అత్యంత ముఖ్యమైన ఘటనని రాజకీయ కోణం నుండి కాక.. ప్రాంతీయ, భాషాకోణం నుండి ఆలోచించే నీకు నేను అర్ధం కాను. పి.వి.నరసింహారావుకి జరుగుతున్న అన్యాయానికి నువ్వు తీరిగ్గా బాధపడు. నాకు పనుంది. వెళ్ళాలి!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు!
Bagundi, chala rojula taruvatha vachina " subbu gariki " dhanyavadalu.
ReplyDeleteDoctor gaaru,mee (subbu?)analysis bagundi.next elections lo minority votes kosame ee thapatrayam.
ReplyDeleteనాకు బాగా గుర్తుంది. పాములపర్తి వేంకట నరసింహారావు గారు మరణించినపుడు CNN-IBN లో అనుకుంటా "P.V.Narasinga Rao is dead" అని వార్తను చదివారు. కొన్ని నెలల తరువాత, ఒక హిందీ సినిమా హీరోయిన్ మరణించినపుడు "So and so is no more" అని ప్రకటించారు. బాషాపరంగా రెండిటి అర్థం ఒకటే; కానీ తేడా కూడా ఉన్నది. నాకు అర్థంకానిది - ఈ ద్వేషం. అభిమానించే వారికన్నా, ఢిల్లీలో ఆయన్ను ద్వేషించేవారే ఎక్కువ. నా మటుకు నేను అభిమానించేది ఆయన తీసుకువచ్చిన economic reforms వల్ల. Of course, ఆయన ఒక తెలుగువాడు కావడం కొసమెరుపు. నేనూ ఒక తెలుగువాడిని కావడం - ఆయనతో నాకున్న ఏకైక సామ్యం. ఈ రెంటినీ కలిపితే వచ్చేది మీరు ప్రస్తావించిన వికారం. నేను బాధ పడేది ఒక తెలుగువాడికి తక్కువ జరిగిందని కాదు; ఒక గొప్ప వ్యక్తికి తక్కువ చేశారు అని.
ReplyDeleteమీ సుబ్బుకి చెబుతారు కదా - నాలా అభిమానించేవాళ్ళు కూడా ఉంటారని? :-)
"రక్తం లేదు. రసనా లేదు.
ReplyDeleteనీకు నచ్చకపోతే కొంపలేమీ మునగవులే!"
Hilarous!!!
మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటాయి.
ReplyDeleteసుబ్బు బాగా చెప్పాడండి.
పి.వి గారిని అలా అన్నందుకు.. తెలంగాణా వారికి కోపం రాలేదేమిటబ్బా!
సుబ్బు అని అడిగి చెప్పండి డాక్టర్ గారు.
*పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమర్జన్సీలో కూడా పార్టీలో కీలక వ్యక్తి*
ReplyDeleteఇక్కడ మీరు ప్రత్యెకంగా ఎమర్జెన్సి ప్రస్తావించటనైకి కారణమేమైన ఉందా రమణగారు.
*ఆల్ ఇండియా ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో కార్డియాక్ సర్జన్ వేణుగోపాల్ కి, కేంద్ర ఆరోగ్య మంత్రి అంబుమణి రాందాస్ కి గోడవయింది. అది కేవలం రెండు గ్రూపుల మధ్య తగాదా. *
పప్పు వేణుగోపాల్ కి ఉన్న గ్రూప్ ఎమీటో కొంచెం చెప్పగలరా?
SriRam
నా స్నేహితులు (AIIMS లో పని చేసినవారి ప్రకారం) ఇద్దరు ఈగోయిస్టుల మధ్య జరిగిన యుద్ధం అది. అప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా ఇదే రాశాయనుకుంటాను.
Delete*పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమర్జన్సీలో కూడా పార్టీలో కీలక వ్యక్తి*
ReplyDeleteరమణ గారు, మీరు ఇక్కడ ఎమర్జన్సీ సంగతిని గుర్తుచేస్తూ, ప్రత్యేకంగా నొక్కివక్కాణించటానికి గల కారణమేమిటో తెలుసుకోవచ్చా?
*ఆల్ ఇండియా ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ లో కార్డియాక్ సర్జన్ వేణుగోపాల్ కి, కేంద్ర ఆరోగ్య మంత్రి అంబుమణి రాందాస్ కి గోడవయింది. అది కేవలం రెండు గ్రూపుల మధ్య తగాదా*
సర్జన్ వేణుగోపాల్ కి ఉన్న గ్రుపు గురించి, ఆ గ్రుపు చేసిన రాజకీయాల గురించి మీకు తెలిసిన విషయాలని మాతో పంచుకోగలరా ?
SriRam
నాకు emergency చీకటి రోజులు అంటే భయం! ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న (ప్రణబ్ ముఖర్జీతో సహా) కాంగ్రెస్ నాయకుల పట్ల చాలా contempt కూడా ఉంది. అందువల్లనే ప్రస్తావించాను.
Deleteఇంకొక ప్రశ్న అడగటం మరచాను, ఇంతకీ మీరు పి వి ని ఏ కోణం నుంచి చూస్తున్నారో మేము తెలుసుకోవచ్చా?
ReplyDeleteSriRam
నేను టపాలో స్పష్టంగానే రాశాను గదా! ఈ టపా పి.వి. ని రాజకీయంగా అంచనా వెయ్యడానికి కాదు. ఆయన్ని భాష, ప్రాంతం ఆధారంగా ఆకాశానికి ఎత్తేసేవారి పట్ల చికాకుతో రాశాను. ఇది ఒక రకంగా మన మాజీ ప్రధానిని అవమాన పర్చడమే! ఒక మనిషి "తెలుగు తేజం" కాకపోయినప్పటికీ అత్యుత్తముడు కావచ్చుననుకుంటున్నాను. నా టపా ఉద్దేశ్యం ఇదే!
DeleteArjun Singh says (from the grave) that PVN opposed Sonia Gandhi ("Why should Congress party be hitched to the Nehru-Gandhi family like train compartments to the engine"). For that alone I must respect the man. Whether out of necessity or pure pragmatism he changed the course of Indian economy. It is not Manmohan Singh, but, PV Narasimha Rao that allowed liberalization of the economy and brought in much needed reforms. Manmohan Singh is back as Finance Minister now, but, I can assure you that nothing revolutionary is going to happen because his PM, er.. (darn it, I almost forgot he is the PM too!) Congress leader Sonia is the boss. Madhu Limaye (also very much dead) blames him for Babri Masjid demolition ("My information was that Rao had connived at the demolition. He sat at puja when the kar sevaks began pulling down the mosque and rose only when the last stone had been removed"). Real heroes are not much honored in India - Sri. PV Narasimha Rao and Gen. Sam Manekshaw come to mind. I must say, I am fascinated by this tactic by the political parties of trying to bury their mistakes with the dead by posthumous blame. But, even more fascinating is the phenomenon of dead men blaming the other dead!
ReplyDeleteYep. Many folks throw dirt on PVN for thier personal gains for no fault of him. I always wonder there could have been more support for him had his name be narasimha teddy or narasimha nayudu!
ReplyDeleteYes,I fully agree with 'chatakam 'and Gldoc '.
ReplyDeleteఇవి రాజకీయాలు నాయనా! అత్యంత క్రూరమైనవి
ReplyDeleteThis is true.
ఇది కాంగ్రెస్ పార్టీ ముఠాలకు సంభదించిన విషయం మనం కప్పులకు కప్పులు ఫ్రీ కాఫీ తాగడం తప్ప ఏమీ చేయలేమనే సుబ్బు నిర్వేదంతో విభేధిస్తున్నాను.
ReplyDeleteఇక్కడ తెలుగు వాడు అన్నది ఓ ప్రాంతీయ/భాషా కారణం అయితే కావచ్చు, బహుభాషా కోవిదుడైతే నాకేటి అని సుబ్బు అనుకున్నా అనుకోవచ్చు, కాని అదే కారణం అని సుబ్బు భావించడం పరిణితితో కూడినట్టు అనిపించలేదు. ఓ దేశానికి మొదటి సారి సంకీర్ణంతో ఫుల్‌టర్మ్ పనిచేసి ఆర్థిక సంస్కరణలు జరిపిన ప్రధానిగా సముచిత గౌరవం ఇవ్వలేదనేది పాయింట్. నేతాజీ, వివేకానందలు మా వాళ్ళు అని బెంగాలీలు గర్వపడటం తప్పులేదు కాదు, ఆ అంశం వాళ్ళకు ఓ గుర్తింపు వచ్చాకాని గమనించాలి. లాలూ, రబ్రిదేవి మా బీహారి పుల్కాలు, జయ, కరుణానిధి, కనిమొళి, రాజా, చిదులు మా సాంబారోళ్ళు, కల్మాడి, శరద్పవార్లు మా మరాఠీ భేల్ పురీలు, YSR, కెసిఆర్, అంజయ్య, జగన్లు... మా ఆంధ్ర ఆవకాయ జాడీలు అని ఎవరైనా చెప్పుకోవడం చూశామా? కమ్యూనిస్టుల్లో ఏ మార్క్సు, మావో అని కొట్టుకు చచ్చేవాళ్ళే కాని చికెన్ నారాయణ,రాఘవులు మా తెలుగువాళ్ళు, జ్యోతి బాసు, బుద్ధదేవ్‌లు మా బెంగాలి అని గర్వంగా చెప్పుకోవడం చూశామా?! వూహూ నేనైతే చూళ్ళేదు.
అంచేత ... సుబ్బు ఈ విషయంలో ఫ్రీ కాఫీ తాగుతూ వుపన్యాసాలు దంచడమేకాక అప్పుడప్పుడు కాస్త ఆలోచించాలని అభ్యర్తిస్తున్నాను. :)
That's all honourable Comrade... :P
ఫలానా నాయకుడి వల్ల దేశానికి, ప్రజలకి మంచి జరిగింది అని అంచనా వేసుకుని.. ఆ నాయకుడి పట్ల అభిమానం కలిగి ఉండవచ్చు. ఈ అంచనాలో ఎవడి స్కేలు వాడిది. వారి స్కేళ్ళతో నాకు విబేధాలు ఉన్నా.. వారి అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను.
Deleteఇవన్నీ కాదయ్యా.. ఫలానా నాయకుడు మనవాడు (మన తెలుగువాడు, మన ప్రాంతం వాడు, మన కులం వాడు.. ఇలా చాలా 'మన'లు) అవడం మూలానా ఆయన మీద ఈగ కూడా వాలనీయరాదు అనుకున్నా మంచిదే! ఎవరి ఇష్టం వారిది. కాదనడానికి నేనెవణ్ణి? సుబ్బు ఎవడు?
నేనొక POV రాశాను. మీకు నచ్చితే ఆనందం. నచ్చకపోతే మహదానందం!
/"సుబ్బు! నీకసలు భాషాభిమానం లేదు. నీ చెత్త ఎనాలిసిస్ ఆపెయ్యి." విసుగ్గా అన్నాను/
Deleteభాషాభిమానం కాదు కాని, సుబ్బు ఎనాలిసిస్ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నా... బాగా చెప్పారు, నేను మీ పక్షం. :)
థాంక్యూ!
Delete(నేను నా పోస్టులో రాసిన అభిప్రాయం మీకు చెత్తగా అనిపించిందని డైరక్టుగా రాస్తే ఇంకా బాగుండేది. నా అభిప్రాయాలు నచ్చకపోవడం, వాటితో విబేధించడం మీ హక్కు. ఇందులో మొహమాటాలు ఎందుకు!?)
డాక్టారు, నన్ను క్షమించాలి, నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు. నేను సూటిగా మీ అభిప్రాయానికే మద్దతు సూటిగా తెలిపాను. శాశ్వతాభిప్రాయాలంటూ ఇన్ జెనరల్, లేవు. చాలావరకూ సుబ్బు అభిప్రాయాలతో ఏకీభవిస్తుంటాను,ఇప్పుడు మీతో ఏకీభవిస్తున్నా. కాని "ఏ ఒక్కరి యందు అభిమానము కాని ద్వేషము కాని లేవు". అవి తాత్కాలికమైనవే అంటే ఇష్యూ బేస్డ్ అభిప్రాయాలే సాధారణంగా వ్యక్తీకరించడం జరుగుతుంది, పథకం ప్రకారం కాదు.
Deleteనేను అభిమానించే రచయితల్లో మీరు మొదటి పంక్తిలో వున్నారు అని సిగ్గువీడి ఓపన్‌గా చెబుతున్నా... ఏమనుకోకండి. :)
మనలో మాట... మన సుబ్బుకు నార్కో అనాలిసిస్ చేయిస్తే ఎలా వుంటుందంటారు? కనీసం సైకో అనాలిసిస్ అయినా చేసి మూడు సిండ్రోంలు, ఆరు ఫోబియాలు వున్నట్టు ఓ రిపోర్ట్ ఇవ్వండి. :)
పివి " చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అనడం... ఆ! మీరు చేయనిస్తే గా! అనుకునేవాడిని. సచ్చినోడు అర్జున్ సింగ్ పుస్తకం వల్ల తెలిసింది, రాజీవ్ సచ్చాక సోనియా చెప్పులు మోయడానికి అర్జున్ సింగ్‌లా ఎగబడడానికి తెగువ చూపపోవడమే కాక అపోజ్ చేసారని! దాంతో గౌరవం పెరిగింది, ఆర్థిక సంస్కరణలు కూడా ( అదే కమ్యూనిస్టు పరిభాషలో ...బూర్జువా, పెట్టుబడిదారీ, ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద, వగైరా వగైరాలకు అనుకోవచ్చు)
ReplyDeleteఅడ్డదారుల్లో 6నెలలు ప్రధాని అయిన చరణ్ సింగ్ లాంటి వాడికి ఢిల్లీ కబరిస్థాన్లో కల్పించిన మెమోరియల్ లాంటి ఎదవలకి కల్పించిన చోటు, పివి కి కల్పించకపోయినా అంత అనిపించలేదు కాని, కాంగ్రెస్ సమావేశాల్లో ఒక మాజీ ప్రధానికి కనీస గౌరవం ఇవ్వక, వెలివేసినట్టు పేపర్లలో ఫోటోలు రావడం చివుక్కు మనిపించిన పర్యవసానమే దక్షిణ భారత మొదటి ప్రధానిగా, తెలుగు వాడిగా, ఇంకా పోతే తెలంగాణ వాడిగా, కరీంనగర్ వాడిగా, పాముల పర్తి వాడిగా.. ఆత్మాభిమానాలు దెబ్బతినడం సహజమే, అంగీకారమే అని సుబ్బు గారు గ్రహించక పోవడం భవిష్యత్తులో ఓ చారిత్రాత్మక తప్పిదం కాగలదని, కారత్ దంపతులు క్షమాపణ చెప్పాలిసిన చేతాండంత పట్టీకి మరో ఆంశం చేర్చిన వారవుతారని సుబ్బు గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. :D
Boring post!
ReplyDeleteమీరు విరామం తీసుకోవల్సిన సమయం వచ్చినట్టుంది :-)
నేనూ అదే అనుకుంటున్నాను. కానీ.. కుదిరి చావట్లేదు. అయినా.. ప్రయత్నిస్తాను!
DeleteI don't agree with Oremuna, this is basic cuase to bring other factors into any issue like, relegion, cast, region factors. Politicians make samll issue to big by bringing various other non relevent factors in to the issue
DeleteAll issues should be resolud out side these factors. that is crux of the post. The way it was told is very good and example is very very powerful. I loved this post very much
Kamudha.
I Second Kumudha. Here authour's point of view is not to blame any one, but again not to praise any one on the premise of region, language bias.
Delete(Off Topic) WOW.. T protaganists approving that "one should not bring cast, religion, and region in political issues".
Deletewhere all this wisdom gone when they make allegations 'just because PV & MCR are from T, andhra politicians did not allow them to continue in the chair". why the hell they can't understand it is the same BLOODY DAMN POLITICS irrespective of regional bias. best contemporary example. Jagan. He is eagerly waiting to topple a CM/govt from his own region.
@satya,
DeleteDon't worry, we always think in the same way. Unlike the people like you who thought our late CM to be a God just because of one 'particular' reason even though every one knew that he was the leader of thugs.
గద్సరే గాని ఆచారి పటేలా, ప్రొఫైల్లో ఆ నింజా టర్టిల్ బొమ్మ తీసుడు మరో బొమ్మ పెట్టుడు వరకూ తెలగాన మీ మీగ్గావల అయితలేదంట, ఎరికేనా? వచ్చేనెల్లో ఇస్తారంటగదా! కంగ్రాజులేషన్స్, ఇగ కాంగీలో కలిపేసుకొనుడు సంబురాలు షురూ చేయున్రి. :)) :P
DeletePeople like me thought he is GOD? For me Thats most hilarious statement u ever wrote... You might not know, but I am dead against to his character (both political and personal).. btw.. I second ur statement that he is a leader of thugs.. and the thugs belong to all 3 regions..
Deleteత్రవ్వకాలలొ ఇండియన్ బొమ్మలు(అదే హిందూ శిల్పాలు) బయట పడినట్టు కొర్టు తీర్పులొ నిరూపణ అయినట్టు నాకు కల వచ్చింది(నిజం అంటే ఒప్పుకొరని ) కనుక ఫి.వి.నరసి0హ రావు గారు ఎం చెసినా తప్పు లెదు అనెది నా అభిప్రయాయం
ReplyDeleteమీ సుబ్బు లోని భాషా సెక్యులరిస్టుకు (లేదా ప్రాంతీయ సెక్యులరిస్టు)జోహార్లు.
ReplyDeleteకానీ..
well said subbu
ReplyDeleteఆ సమయం లో పివిఏం చేశారు అనే దాని జోలికి వెళ్ళాను కానీ .. రాజకీయంగా కాంగ్రెస్స్ మాత్రం చాలా లాభసాటి నిర్ణయం తీసుకుంది .. కాంగ్రెస్స్ పివి నీ దూరం చేసుకోవడం ద్వారా మైనరితిలకు దగ్గరయింది. ఈ ఎత్తుగడ తెలియని పార్టీ లు కాంగ్రెస్ తప్పు చేసిందని అనడం ద్వారా మైనరితిలను కాంగ్రెస్ వైపు తోసేస్తున్నారు
ReplyDeleteపీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు అని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు కంప్యూటర్ రంగంలో కూడా మంచి ప్రవేశం ఉండేది. ఉ. ఆయన గురించి "He is fluent in x languages including COBOL & FORTAN" అనే వారు.
ReplyDeleteనాకు programming రాదు. అయితే కొన్ని కారణాల వల్ల COBOL & FORTRAN నేర్చుకునే "భాగ్యం" కలిగింది. ఆపై కొంత కష్టపడి వాటిని మర్చిపోవడం లోనూ, ఆ ఛాయలు కూడా నా మీద పడకుండా జాగ్రత పడడంలోనూ సఫలీకృతమయ్యాను.
As an ex-"almost programmer", I condemn this brazen attack on the great IT visionary by computer illiterates.
జావా అంటే ఒక ద్వీపం పేరు అనుకునే అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు, కంప్యూటర్ మౌసుకు వినాయకుడి వాహనానికి తేడా తెలియని కులదీప్ నయ్యర్ లాంటి వాళ్ళు ఒక IT genius పై బురడద చల్లడం అన్యాయం. వారి సాంకేతిక ఆగ్యానానికి నిదర్శనం. "భాష"తో నిమిత్తం లేకుండా COBOL, FORTRAN, Java, VC++, Oracle, SAP వగైరా cubile slaves & nerds అందరూ ఈ దిగజారుడు చర్యలను ఖండించాలి. సదరు అర్జున్, కులదీప్ లాంటి వారిపై బ్లాగులు రాయాలి, ఇంకా కుదిరితే వాళ్ళపై గూగుల్ బాంబులు నాటాలి,వారి పేరుతొ వైరసులు తయారు చేయాలి, వారి వెబ్ సైటులు hack చేయాలి.
PS:
ప్ర. మసీదు కూల్చివేత సమయంలో ఆయన పూజా మందిరంలో ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడా?
జ. కాదు కంప్యూటరు లాబులో ఉన్నారు.
గట్లనా!? గయితే, పివి గారి ఇగ్రహం టాంకుబండు గేల పెట్లేదు అని లొల్లి షురూ చేయున్రి మరి. ఇంకా ఆలిశం దేనికి?! పాయింటు దొరికింది కదా. :))) :P
DeleteIn view of his stature in the IT field, Golden Gate is a better option!
Delete@SNKR
Deleteపీవీ మొదటి నుంచీ సమైక్యవాది కదా. ఆయన విగ్రహం ట్యాంక్‌బండ్ పైన అంటే.... :)
@puranapandaphani
Deleteఆయన పుట్టకముందునుంచే(పూర్వీకులతో సహా) తెలంగాణ ఆంధ్రుడు, ఆ తరవాతనే అయితే గియితే సమైక్యవాది, కోటిరతనాల వీణలోని ఓ అమూల్య రత్నం. అయినా మన పిచ్చి గాని, కోతుల చేతిలో రత్నమైతేనేమి కొబ్బరిచిప్పైతేనేమి? అంతా ఒకటే. ఆయన సమైక్యవాది అయితే ఆనాడే 'దంచుడే దంచుడు షురూ చేసి తెలంగానలో తిరగనిచ్చేవారు కారేమో కదా? ఒకవేళ అలాంటి భావాలున్నా ముక్కాసురులు తెలగానకు జై అని బలవంతంగా,సినారె లాగా అనిపించేవాళ్ళేమో!
అదో ..పివి ఫీల్డ్ IT అని ఓ మాజీ కోబాల్ సర్టిఫై చేస్తుండు, అలాగన్న మాట!
SNKR
పీవీ తెలుగు వాడు కాబట్టి సమర్ధించాలి అన్నది వితండమే అన్న మీ మాటతో ఏకీభవిస్తూనే... ఎన్నికల సీజన్ కాబట్టి పీవీని డిస్ఓన్ చేసుకోడం ద్వారా మైనారిటీలను చేరదీసే ప్రయత్నం చేస్తోంది అన్న మాటతో విభేదిస్తున్నాను, పీవీ విధేయత పార్టీకి విధేయత. వ్యక్తులకు విధేయత కాదు. అందుకే ఇందిరా గాంధీ కూడా ఆయన్ని అవసరానికి ముఖ్యమంత్రిని చేసి అది తీరాక గద్దె దింపేసింది. అందుకే ప్రధానిగా పని చేసినా ఆయనకు కాంగ్రెస్ ఏ గుర్తింపునీ ఇవ్వలేదు.
ReplyDeleteరేప్పొద్దున్న జగన్‌తో బేరసారాలు కుదిరితే వయ్యెస్ మళ్ళీ మహా నాయకుడు కాగలడు. ఇప్పటికీ వయ్యెస్‌ని పార్టీ డిస్ఓన్ చేసుకోలేదు, వ్యూహాత్మక దూరం పాటిస్తోంది, మొన్న వయ్యెస్ --- రోజు నాడు (పుట్టినా? చచ్చినా?) కాంగ్రెస్ కూడా నివాళులు అర్పించింది కదా. కానీ పీవీ విషయంలో అలాంటి అవసరం కాంగ్రెస్‌కు ఒక్కనాటికీ పడదు. ఒకవేళ పడినా సోనియా నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తుంది.
రాజీవ్ గాంధీ తర్వాత అర్జున్ సింగ్ సహా పలువురు ప్రధాని అయిపోవాలని కోరుకున్నా పీవీ ఆశపడలేదు. అప్పటికే కాషాయం కట్టి కుర్తాళం పీఠాధిపతిగా వెళ్ళిపోడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పీతలు ఒకదాన్ని ఒకటి వెనక్కి లాక్కున్నట్టు ఒక వర్గం కింద మరో వర్గం మంటలు పెట్టుకుంటున్న దశలో అందరూ కలిసి తాము చెప్పినట్టు పడుంటాడు అన్న భావనతో పీవీకి ముళ్ళ కిరీటం తగిలించారు. ఆయన ఐదేళ్ళు పని చేయడం ఆనాటి విపక్షాల కంటె కాంగీయులకే పెద్ద షాక్,
సోనియాకూ, ఇతర కాంగ్రెస్ నాయకులకూ పీవీతో ఏనాడూ పొసగలేదు. కారణం ఆయన నాయకుడు కాదు, స్టేట్స్‌మ్యాన్. అలాంటివాణ్ణి భరించడం కష్టం... బతికున్నప్పుడైనా, చనిపోయాకయినా. ఆయన తీసుకువచ్చిన ఆర్ధిక సంస్కరణల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు గాక. మరే రకంగానూ ఆయన్ను ఎదుర్కోలేకనే మాటిమాటికీ బాబ్రీ విషయం బయటకు తీస్తారు, చివరాఖరికి బుడ్డాడు రాహుల్ గాంధీ కూడా మా కుటుంబం గద్దె మీదుండి ఉంటే మసీదు కూలేదే కాదు అంటూ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. అదే పదవిలో ఏ సింధియాయో ఉండి ఉంటే ఇవాళ నోరెత్తగలిగేవాడా?
ఇంక తెలుగు వాళ్ళకు అంత భాషాభిమానం ఎక్కడ ఏడిసిందండీ, మీరు మరీనూ...! తమిళ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, హిందీ వాళ్ళ భాషాభిమానంతో పోలిస్తే తెలుగుల భాషా ప్రేమ వెంట్రుకవాసి. ఇక రాజకీయాల్లోనైతే మరీనూ. జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల్లో ఎవడికి నిజంగా సరుకుందంటారు, వాళ్ళవాళ్ళ ప్రాంత, భాషా ప్రాతిపదికల మీదనే కదా చక్రం తిప్పగలుగుతున్నారు, అంత స్పృహ తెలుగులకు ఇంకో ఐదారు వేల యేళ్ళయినా రాదు.
మీ వాదనని అంగీకరిస్తూనే..
Deleteపి.వి. ఎందుకని రాజీవ్ గాంధీ కుటుంబాన్ని పక్కన బెట్టాడు? అలా చెయ్యడం వల్ల పి.వి. కి కలిగిన లాభం ఏమిటి? అది తనకి రాజకీయంగా నష్టం కలగచెయ్యొచ్చని ఎందుకు అంచనా వెయ్యలేకపొయ్యాడు? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా?
ఈ ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పగలరని ఆశిస్తూ..
నాకు తెలిసినంత వరకూ రాజీవ్ కుటుంబాన్ని పీవీ తనంత తాను పక్కన పెట్టలేదు. ఆనాటికి సోనియాగాంధీకి రాజకీయాల మీద ఆసక్తి లేదు. రాజీవ్ మరణ సమయంలో ఈ దేశపు రాజకీయాల మీద తీవ్ర వ్యతిరేకత స్వయంగా ప్రకటించింది. ఆమెను ముందుకు తీసుకురావడం కోసం పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇతర నాయకులు హడావిడి చేశారు, ఒక పొలిటికల్ నోవిస్ కాబట్టే సోనియాకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి పీవీ వ్యతిరేకించాడు. అంతే తప్ప రాజకీయంగా తనకు ఒరగగల లాభాల గురించి కాదు, ఆయన ఖర్మ కాలి సీతారాం కేసరి అధ్యక్ష భారాన్ని నిభాయించుకోలేకపోయాడు. నిరంకుశురాలైనా ఇందిరను ఆమెలోని నాయకత్వ లక్షణాలకే ఆమోదించాడు. అంతే తప్ప తనకేదో ఒరగబెడుతుందని కాదు. రాజకీయాల ద్వారా వైయక్తిక లాభ నష్టాల గురించి పట్టించుకోని నేతల్లో ఆఖరి వాడు పీవీ అని చెప్పుకోవచ్చేమో.
Deleteమీ ధర్మ సందేహాలకు నాకు తట్టిన జవాబులివీ. ఆ "తెలుగు తేజం" పై వీర మూర్ఖాభిమానంతో అతి చేసానా? ఏమో.
"రాజకీయాల ద్వారా వైయక్తిక లాభ నష్టాల గురించి పట్టించుకోని నేతల్లో ఆఖరి వాడు పీవీ"
Deleteకొంచం మోతాదు ఎక్కువయ్యిందా మీరే ఆలోచించండి. తన పదవిని కాపాడుకోవడం కోసం జాముమో వారికి లంచాలు ఇచ్చారని & తెదేపా వారిపై దాడి చేసారనే అభియోగం మరిచిపోయారా?
తన పదవిని కాదు... అప్పటి ప్రభుత్వాన్ని అనుకుంటా... అదీ, కాంగ్రెస్ కోసం కాక, అప్పుడే తాను మొదలు పెడుతున్న సంస్కరణల కోసం.
Deleteవ్యవస్థలో అవినీతి అంతర్భాగమైనప్పుడు, పెద్ద స్థాయి మేలు కోసం కొంత అవినీతి తప్పనిసరిగా చేయవలసి వస్తే చేయడానికి వెనుకాడలేదేమో ఆయన.
నాకు గుర్తున్నంత వరకూ జాముమో కేసులో కూడా ఆయన నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చినట్టు గుర్తు. వీలయితే క్లారిఫై చేయగలరు. ఇక తెదేపా విషయం నాకు గుర్తురావడం లేదు. వీలయితే చెప్పగలరు.
నా అతి సంగతి పక్కన పెట్టినా పీవీ దేశంలోని రానాల్లో అరుదైన వ్యక్తిత్వం ఉన్నవాడు అనడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటున్నా.
Yes, PV was acquitted in both JMM & Lakhubhai Pathak cases.
DeleteTDP: PV survived only by luring away 5-6 TDP MP's (including Bhupatiraju Vijay Kumar).
*ఆ "తెలుగు తేజం" పై వీర మూర్ఖాభిమానంతో అతి చేసానా? ఏమో*
Deleteమీరేమి మూర్ఖ వాదన చేయలేదు. మంచి వాదన చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా మధ్య తరగతి వారికి పివి వలన ఆర్ధిక లాభం కలిగింది కనుక దాని గురించే మాట్లాడుతూంటారు. ఆయన లో ఉన్న థాట్ లిడర్షిప్ గురించి ఎవరు గుర్తించినట్లు ఎక్కాడా కనపడదు. పి వి గారు చేసిన, సాధించిన పనులలో విజయాలలో పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచి శాంతిని నెలకొల్పటం, లుక్ ఈస్ట్ పాలసి, ఇజ్రాయల్ తో సంబంధాలు మెరుగు పరచటం, కొత్త టేలికాం పాలసిని పాత యంప్లాయిస్ ప్రతిఘటన లేకుండా ప్రవేశపెట్టి, ఇప్పుడు చూస్తున్న టెలికాం రేవల్యుషన్ కి నాంది పలికాడు. ఎన్ని సవాళ్లెదురైనా, పరిస్థితులు ఎంతో క్షిణించిన కాష్మీర్ లో ఎన్నికలు జరిపటం ఇంకొక విజయం. అంతర్జాతీయంగా భారత మిత్ర దేశమైన రష్యా పతనాంతరం ఆయన ఆ ప్రభావాన్ని మనదేశం మీద పడకుండా ఎంతో చాకచక్యంగా అంతర్జాతీయ వ్యవహారాలను మెరుగు పరుస్తూ, స్వదేశంలో అనేక ప్రధాన మార్పులకు శ్రీకారం చుడుతూ, దేశాన్ని ప్రజలకి కష్ట్టం తెలియకుండా ముందుకు తీసుకుపోయాడు. గాంధి కుటుంబంవారు, అధికారం కొరకు దేశం లో సృష్ట్టిమించిన (పంజాబ్, కాష్మిర్ etc., )సమస్యలన్నిటిని పి వి తన కాలంలో పరిష్కరించాడు.
Sri P V Narasimha Rao, Mauna Muni And Deng Tsiao Ping of India
http://www.drthchowdary.net/index.php?option=com_content&task=view&id=579&Itemid=57
రమణగారు,
ReplyDeleteప్రస్తుతం బ్లాగులోకంలో మీరు మంచి ఫాం లో ఉన్నారు. టపాలో పసలేకపోయినా, నలుగురి సామాన్యమైన పాఠకులకు అర్థమయ్యే తార్కికతతో రాసి, హిట్ చేసేశారు. మీ టపా చదివితే మీకు చాలా వాస్తవాలు తెలియని అర్థమౌతున్నాది. .
*ఈ ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పగలరని *
ఎవరి సందేహాల నివృతికి వారు ప్రయత్నం చేయాలి. దానికి గూగులమ్మ,యుట్యుబ్ నాన్న ఉన్నారు. అందులో మీ సందేహాలు నివృతి చేయటనికి ప్రస్తుత రాజకీయలలో దళితులైన సుబ్రమణ్య స్వామి,అరుణ్ షౌరి లాంటి బాపనోళ్లు ఉంటారు. వారిని ఎవరు పట్టించుకోకపోయినా గత కొంత కాలం గా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆవిషయాలన్ని చదివి మీకు మీరే తెలుసుకోండి.
పి వి రాసిన ఇంసైడర్, డిసెంబర్ 6 చదవండి. పి వి ఆర్ కె ప్రసాద్ రాసిన అసలేమైంది, రాజివ్ హత్య పైన సిట్ చీఫ్ కార్తికేయన్ రాసిన పుస్తకం మొదలైనవి అన్ని చదివితే మీప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
ఏదో మిడిమిడి జ్ఞానంతో సరదాగా రాసేస్తున్నాన్లేండి. పూర్తి అవగాహనతో రాయడానికి నేనేం ప్రొఫెషనల్ రైటర్ని కాదు గదా. లైట్ గా తీసుకోండి.
DeletePV ఆత్మకథ చదవాలనే తీవ్రమైన కోరిక ఉంది. తప్పకుండా చదువుతాను.
రమణగారు,
Deleteమీరు రచయితగా ఎంత మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చుకొంటే అంతసంతోషిస్తాను. మీ మనసును బాధ పెట్టటానికి అలా రాయలేదు.రా వి శాస్త్రి,కొకు పుస్తకాలు చదవటంకనా పి వి ఇంసైడర్ పుస్తకం చదవటం ఎంతో ఉత్తమం. ఆ పైన చెప్పిన పుస్తకాలు చదివితే, దేశం కొరకు స్వంతానికి ఎమీ ఆశించకుండా , డబ్బులు ఉన్న ఒక తెలివిగల వ్యక్తి నిస్వార్ధంగా అన్ని సంవత్సరాలు ఇంకొకరి కింద ఎలా పని చేశాడో అని తలచుకొంటే ఒళ్లు జలదరిస్తుంది. అందరూ ప్రపంచంలో ఇది బాగా లేదు అది బాగ లేదు దీనిని మార్చాలి దానిని మార్చాలి అని సలహాలు పడేసేవారే, సాహిత్య సృష్టించేవారే. అలాంటి భావలు ఉన్నవాడు, పవర్ పాలిటిక్స్ లో ఉంట్టూ, అవకాశం వచ్చినపుడు pani చేసి చూపినవాడు పి వి .
*ఏదో మిడిమిడి జ్ఞానంతో సరదాగా రాసేస్తున్నాన్లేండి.*
Deleteపి వి గారిని అర్థం చేసుకోవాలంటే పెద్ద జ్ణానం అవసరం లేదండి. కొంచెం నిజాయితి,మధ్య తరగతి back gground, దేశ భక్తి ఉంటే చాలు. జాతీయ చానల్స్ లో చూస్తూంటాం కదా, ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ జ్ణానులందరు అతనిని అర్థం చేసుకోవటానికి కిందా మీదా పడుతూంటారు. వారలా పడటానికి కారణం ఆయనని వారు సెక్యులర్ కోణంలో నుంచి, బాబ్రి మసీదు ఘటన కోణం నుంచి, చంద్రస్వామి, యం.పి. లు కొన్న వాడి కోణం లో నుంచి ఇలా చూస్తూ వారు కంఫ్యుస్ అవుతూ అందరిని గందరగోళానికి గురిచేస్తారు. ఎంత ఎక్కువ చదివినోడైతే అంత ఎక్కువ కంఫ్యుషన్ వినోద్ మెహతా, వీర్ సింగ్వి, సాగరికా గోష్, రాజ్దీప్ సర్దేశాయ్, కరణ థాపర్ లాంటి వారి షోలు చుస్తే అర్థమైంది. వారి బుర్రలో ప్రశ్నలు తప్ప , ఇంగితజ్ణానం అనేది ఏ కోశానాలేని వారే ఈనాటి మేధావులు. మనం పి వి ని వీశ్లేషిస్తూ చేసే చర్చల ద్వారా అటువంటి నిజాయితి, తెలివిలేని వారిని, వారి వాదలలో డొల్లతనం బయట పడేయవచ్చు. నలుగురు ఈ చర్చను చదివినా చాలు.
SriRam
"దేశ భక్తి ఉంటే చాలు":
Deleteఒక మనిషిని లేదా సమస్యను అర్ధం చేసుకోవడానికి దేశభక్తి ఏ రకంగా ఉపయోగమో నాకయితే తెలియడం లేదు.
పి.వి.నరసిమ్హారావుగారు తెలుగువాడుకావటం,మహామేధావి కావటం మన అభిమానంచూపించడంలో తప్పేమీ లేదు.అంతేగాక ప్రధానిగా ఆయన ఆర్థికవిధానాన్ని ,పారిశ్రామికవిధానాన్ని సరళీకృతం చేయడంవలననే మనదేశం పెరుగుదల growth rate పుంజుకొని నేడు ప్రపంచదేశాలలో జాతీయ ఆదాయంలో G.D.P.లో 7వ స్థానాన్ని పొందగలిగింది.అది చాలు.మిగతా ఆయన చేసిన పనులు అంత ముఖ్యం కాదు.కనీసం ఆంధ్రప్రదేశ్లోనైనా ఆయనకు తగిన స్మారకచిహ్నం ,గొప్పగా మనం నిర్మించుకోవాలి.
ReplyDeleteమీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా..
ReplyDeleteఇక్కడ రెండు విషయాలు ముఖ్యమైనవి, 1. PV వల్ల దేశానికి ఏమి జరిగింది. 2. PV వల్ల కాంగ్రేస్ కి ఏమి జరిగింది అనేది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడంలో PV పాత్ర చాలా ఉందనడంలో ఎవరికీ ఎలాంటి అణుమానాలు లేవనుకుంటా. అట్లే బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపలేకపోవడంలో ఆయన వైఫల్యం కూడా తోసిపుచ్చలేనిది. ఆ.. బోడి ఓ పాత మసీదు కోసం దేశానికి అంత సేవ చేసిన వారిని అవమానిస్తారా అని ఎవరైనా అంటే అనొచ్చు కానీ, ఆ పాత మసీదుతో పాటూ, కాంగ్రెస్ కంచుకోటలు కూడా తుడిచి పెట్టుకుపోయిన మాట తిరుగులేని సత్యం. ఆ ఒక్క ఘటన వల్ల యు.పి, బీహార్ లాంటి రాస్ట్రాల్లో దాదాపు 25% ఉన్న ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కి శాశ్వతంగా దూరమై, లాలూ, ములాయం లాంటి ప్రాంతీయ నాయకులు బలపడటానికి ఆస్కారమిచ్చింది. కాబట్టి, PV పై కాంగీయుల కడుపుమంట కూడా అర్థం చేసుకోదగిందే..
*అట్లే బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపలేకపోవడంలో ఆయన వైఫల్యం కూడా తోసిపుచ్చలేనిది.*
ReplyDeleteభలే చెప్పారు. పుట్టినప్పటి నుంచి రాజకీయాలలో ఉన్న పి వి గారికి ఆమాత్రం తెలియదన్నమాట. దేశాన్ని పాలించటం అంటే తన పదవిని కాపాడుకోవటానికి ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రప్రభుత్వాలను రద్దు చేయటం అన్నట్లు ఉంది వాదన. పేపర్ల్లో వచ్చే గాలి మాటలు ఇవి. భవిషత్ లో ఇలాంటి ప్రశ్నలు వేస్తారనే , డిసెంబర్ 6 పుస్తకం రాసి పోయాడు. ప్రతి విషయం డాక్యుమేంట్ ఎవిడేన్స్ లతో సహా జత చేశాడు. అందులో నాలుగు పేజిలు చదివినా ఇలాంటి మాట, ఏ చదువుకొన్న వాడి నోట రాదు. ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలియని పేపర్లో రాసే నాసిరకం అనాలిసిస్ మాటలు ఇవి. ఇప్పుడు పేపర్లో సలహాలతో పాలిస్తున్న నాయకుల పాలన, ఎలా ఉందో స్వయంగా చూస్తున్నం కదా! ఆనాడు పి వి పాలన ఇలా ఉండిందా? కోర్ట్టు చిన్న తప్పు పడితే నేదురుమల్లి జనార్ధన రెడ్డిని పదవి నుంచి తొలగించాడు. మరి ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా సుప్రిం కోర్టు స్వయంగా ప్రధాన మంత్రిని అఫిడవిట్ అడిగింది. ముఖ్యమంత్రుల సంగతి చెప్పక్కరలేదు.
పి వి ఎంత దూరదృష్ట్టితో ఆలోచించాడొ ఆయన రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అధికారం ఉంది గదా అని అందరి ప్రభుత్వలను తప్పు చేయక ముందే అనుమానం తో బర్తరఫ్ చేసేస్తారా? అది కూడా ముఖ్యమంత్రి శాంతి బద్రతలను రక్షిస్తానని, మసీదు కూల గొట్టకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చిన తరువాత.
SriRam
అయ్యా అపర దేశభక్త అనానిమస్సూ,
ReplyDeleteఅర్జున్ సింగ్ రాసుకున్న పుస్తకాలు చదివితే, అర్జున్ సింగ్ ఎంత దూరదృష్టితో PVకి సలహాలు ఇచ్చాడో తెలుస్తుంది. అట్లే ఏ బోడి మల్లయ్య రాసుకున్న పుస్తకాలు చదివినా,ఆ మల్లయ్య ఎంత దూరదృష్టితో ఉన్నాడో తెలుస్తుంది. ఈ చదివితే, చదివితే అనే ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ఇంతకి తమరు చదివి తెలుసుకున్న ఆ మహా ఙాన మేదో తమరి బ్లాగులో రాయండి.ఓపికుంటే మేము కూడా చదివి తరిస్తాము. ముసుగు కామెంట్లు పబ్లిష్ చేస్తున్నారు కదా అని చెప్పి, ఓ ముసుగేసుకొచ్చి,ఇలా ఇతరుల బ్లాగుల్లో అందరి కామెంట్లను కెలకడం కాదు.అదికూడా ఒక్కొక్క లైన్లను పట్టుకుని.
*ఈ చదివితే, చదివితే అనే ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ఇంతకి తమరు చదివి తెలుసుకున్న ఆ మహా ఙాన మేదో తమరి బ్లాగులో రాయండి.ఓపికుంటే *
ReplyDeleteఅయ్య సింగ్ గారు పంచలోహ విగ్రాహాలను విదేశాలకమ్ముకొన్న నీ చరిత్రను దేశ విదేశాలలో ఉండే భారతీయులకు సుబ్రమన్య స్వామి దండోరా వేస్తూంటే ఎక్కడ చచ్చావు. ఈ రోజు ఇక్కడి కి వచ్చావు. మళ్లి పెద్ద రోషం పొడుచుకొచ్చి మాట్లాడుతున్నావు. విగ్రహాలు అమ్ముకొన్న నీ యదవ బతుక్కి మళ్లీ మాటలా? జ్ణానమేలేని నీ యదవ జన్మకు మళ్లి పి వి గురించి మాట్లాడే హక్కా? పి వి గురించి చదవటం ఇష్ట్టంలేక పోతే పైన కిందా మూసుకోని పో!
అయినా నాకు అర్ధం కానిది. బాబ్రీ మసీదు పగలకొట్టిన వాళ్ళు మేమే పగలగోట్టాం అని పబ్లిక్కా వచ్చి చెపుతుంటె వాళ్ళని వదిలేసి పివి ని దానికి బాధ్యుడిని చెయడం ఆడలేక మద్దెల సామెత చెప్పినట్లుంది.
ReplyDeleteకాముధ
కథలినిపించటం, మోసం, కుట్ర, దగా చే్యటమే గదా నేటి రాజకీయాలంటే!కాదంటావా?
ReplyDelete