పూర్వం మగధ దేశాన్ని సుందరసేనుడనే మహారాజు పాలిస్తుండేవాడు. అతను ప్రజలని దోచుకుంటూ అన్యాయాలు, అక్రమాలు చేయసాగాడు. పన్నుల భారంతో ప్రజలనడ్డి పూర్తిగా వంచేశాడు.
ఆ కాలంలో ఈ రోజుల్లో భారతదేశంలోలాగే నిరక్షరాస్యులు ఎక్కువ. చదువుకున్న అతికొద్దిమందీ.. ఈ దినాల్లో ఉద్యోగస్తులవలె కరణాలుగా పనిచేసేవారు. పల్లెసీమల్లో పన్నులన్నీ వసూలు చేసి భటుల ద్వారా రాజధానికి పంపిస్తుండేవారు. అయితే కరణాలు చిన్నజీతాలతో బతుకుతుండేవారు. వారికి వేతనశర్మ అనేవాడు నాయకుడు.
మగధ దేశంలో ఓసారి క్షామపరిస్థితి ఏర్పడింది. ఆ క్షామంలో చాలామంది పేదలు పిట్టల్లా రాలిపోయేరు. అన్యాయాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయేయి. రాజబంధువులంతా చాలా బాగుపడ్డారు.
ఆ రాజ్యంలో మార్కండేయులు అనే ఋషిసత్తముడు ఉండేవాడు. ప్రజలే రాజులైతే తప్ప ప్రజలు మరింక బాగుపడరని ఆ మహర్షి గ్రహించేడు. "రాజుని పారదోలండి. మీ రాజ్యం మీరేలుకోండి!" అంటూ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. ఆ తిరుగుబాటులో రాజు తరఫున గ్రామాల్లో పన్నులు వసూలు చేస్తుండే కరణాలు కూడా పాల్గొంటారు. రాజు కుయుక్తులతో మార్కండేయుణ్ణి దోషిగా చిత్రించి చంపించివేస్తాడు.
ఆ వెంటనే, తిరుగుబాటుదార్లందరినీ ఏ విచారణా అవసరం లేకుండానే హింసించి చంపమని సుందరసేనుడు తన సైన్యానికి ఆజ్ఞ జారీ చేసేడు. నేలంతా నెత్తురుమయమయింది. గాలంతా హాహాకారమయింది. ఆకాశం చేతగాని సాక్షిగా మిగిలిపోయింది.
సైన్యం అందర్నీ వేటాడినట్లే కరణాలని కూడా వేటాడనారంభించింది. చదువుకున్న గాడిద కొడుకులకి బుద్ధి చెప్తే మిగతావాళ్ళక్కూడా బుద్ధొస్తుందనే నమ్మకం వల్ల మహారాజు సైన్యం కరణాలని ఎక్కువగా హింసించసాగింది.
ఆ పరిస్థితుల్లో, కరణాల నాయకుడైన వేతనశర్మ ఓ పగలూ, ఓ రాత్రీ కూర్చొని ఆత్మవిమర్శ చేసుకొని "నేనెవర్ని?" అని ప్రశ్నించుకొని "నేను కరణాన్నే కాని మరెవణ్నీకాను." అని ఖచ్చితంగా తేల్చుకొని, అందువల్ల ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి, తన కరణపు అనుయాయుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు.
"ఈ దోపిడీ అనేది ఉండటం వల్ల మనకి ఏం నష్టం ఉంది? ఈ దోపిడీ నశిస్తే మనకి ఏమి లాభం చేకూరుతుంది? ఈ దోపిడీ రాజ్యం నశించిపోయి ప్రజారాజ్యం వచ్చిందనే అనుకుందాం. అప్పుడు మనకి వచ్చేదేముంది? ఏ మనిషయినా, సంఘమైనా తనకి కావలసినదేమిటో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. సమాజాలు పూర్తిగా మారితేనేగానీ జీవితాలు బాగుపడనివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విప్లవాలు తెస్తారు. చావుకి తెగిస్తారు. మనం ఆ కోవకి చెందుతామా? చెందం. మాకు వేతనాలతోనే సంబంధం ఉంది, కానీ విప్లవాలతో సంబంధం లేదు అని రాజుకి స్పష్టంగా చెప్పినట్లయితే వారు మనకి ఓ పిడెకెడు జీతం పెంచుతారు." అంటూ తోటికరణాల్ని 'ఎడ్యుకేట్' చేస్తూ సాగుతుంది వేతనశర్మ ఉపన్యాసం.
ఉపన్యాసం విన్న కరణాల కళ్ళన్నీ జ్ణానకిరణాలతో మెరిసిపోయేయి. జీవితంలో వారు సాధించుకోవలసిన లక్ష్యాలని వేతనశర్మ స్పష్టంగా తెలియజేసినందుకు మురిసిపోయేరు. వేతనశర్మని ఆశీర్వదించి.. రాజవర్గంతో తమ తరఫున సంప్రదింపులకి పంపారు. చర్చలు సఫలం అయ్యాయి. అందరికీ తలా చిటికెడు చొప్పున జీతాలు పెరిగాయి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వోద్యోగులంతా ప్రభువు నుండి జీతాలు తీసుకోడమే కాకుండా, వారికి ప్రజల నుండి పారితోషకాలు కూడా పొందే హక్కు కలదని ఆనాటి నుండి గుర్తింపబడింది. ఇది వేతనశర్మ సాధించిన విజయాల్లో చాలా ఘనవిజయం.
రావిశాస్త్రి కథని ఈ మాటలతో ముగిస్తాడు.
"ప్రభుత్వోద్యోగులకి వేతనశర్మే మొట్టమొదటి పీఠాధిపతి. ఆ తరవాత వేతనశర్మలే కార్మికనాయకులుగా కూడా రూపొందడంతో ప్రభువులంతా సకల ధనకనకవస్తువాహనాలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవించుకు వస్తున్నారు. ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప, సమసమాజం కోసం విప్లవాలు వద్దంటారు ప్రభువులు. అవునంటారు ప్రభుత్వోద్యోగులు."
1971లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కధని.. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి జరిగిన ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అదే ఆంధ్రజ్యోతిలో అప్పటి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ పునర్ముద్రించారు.
'అసలేం జరుగుతుంది? మనం ఎవరం? ఎటువైపు? ఎందుకు?' అంటూ చిన్నచిన్న లాజిక్ లతో సాగే వేతనశర్మ ఉపన్యాసం.. ఈ కథకి హైలైట్. ఈ కధలో రావిశాస్త్రి ట్రేడ్మార్కైన సిమిలీలు తక్కువ. అయినప్పటికీ.. చదువరిని కట్టిపడేసే ఆయన మాటల మాయాజాలం, 'కిక్'.. షరా మామూలే!
ఈ చిన్నకథ రాజ్యం, రాజ్యస్వభావం గూర్చి చర్చిస్తుంది. ప్రజలని దోపిడీ చేసే వర్గసమాజంలో ఉద్యోగులు ఎటు ఉంటారో వివరిస్తుంది. ఒక క్లిష్టమైన రాజకీయ అంశాన్ని సరళతరం చేస్తూ, కధారూపంగా మలచటానికి రావిశాస్త్రి జానపద నేపధ్యాన్ని ఎన్నుకున్నాడు. ఈ కధ 'బాకీ కధలు' సంపుటంలో ఉంది. వేతనశర్మ కథాశిల్పాన్నే.. ఇదే సంపుటంలోని 'పిపీలికం' లో కూడా రావిశాస్త్రి అనుసరించాడు.
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
పురాణం సుబ్రహ్మణ్యశర్మ
(photos courtesy : Google)
భలే ఉంది కథ! మొదట కొంచెం చదివి కమ్యూనిజం కంపు కొడుతుందేమో అనుకున్నాను కానీ చివరికి బ్రతకనేర్చిన ముగింపు ఇచ్చారు.
ReplyDelete-- "రాజుని పారదోలండి. మీ రాజ్యం మీరేలుకోండి!" అంటూ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు --
LOL ఇది పెద్ద జోకు. ఇలా జరిగే ఈజిప్టు, లిబియా లాంటి దేశాలిపుడు కుక్కలు చింపిన విస్తరి అయ్యాయి
http://100telugublogs.blogspot.com
.
/ఇలా జరిగే ఈజిప్టు, లిబియా లాంటి దేశాలిపుడు కుక్కలు చింపిన విస్తరి అయ్యాయి/
ReplyDeleteఓ సునామి వచ్చినపుడు అన్నీ కొట్టుకుపోయి సమంగా అవుతుంది. స్వల్పకాలిక ప్రయోజనాల దీర్ఘకాలిక ప్రయోజనాలను గురించి చూడాలి. ఆ చిరిగిన విస్తరి గడ్డాఫి, ముబారక్‌లది. అంతా బాగనే వుండివుంటే ఆ తిరుగుబాటుకు ప్రజల మద్దతు ఎందుకు వుండేది?!
సిరియా లాంటి ఫ్యూడల్ ప్రభుత్వాలకు మద్దతివ్వాలని ఈ ఎర్రగురివెందలకు (చైనా,రష్యా) మార్క్స్ బుక్కులో రాశాడా?! స్వప్రయోజనాలకు అడ్డురానంత వరకూ మార్క్స్ సూక్తులు వల్లె వేస్తూనే వుంటారన్నది వాస్తవం.
కధ పాతదే అయినా, ఈ కధ సమ కాలీన పరిస్తితులకి నిజ దర్పణం.
ReplyDelete- పుచ్చా
డాక్టరు గారూ,
ReplyDeleteమీవీ, నావీ అభిరుచులూ, ఆలోచనలూ దాదాపుగా ఒకటే ఉన్నాయి. మీ బ్లాగు పరిచయమయ్యే నెల కూడా కాలేదు. గతంలో నేను బాబా రాందేవ్ గురించి మా స్నేహితులతో చర్చించీ, విసిగిపోయాను. వాళ్ళందరిదీ ఒకటే గోల. యోగాతో అన్నీ మటుమాయమన్నది వారి నమ్మకం. మీరు డాక్టరు కనక మరింత శాస్త్రీయంగా చెప్పారు.
ఆ మధ్య బీనాదేవి కథ "ఫస్ట్ కేస్" పెట్టినప్పుడనుకున్నాను. ఈ కథ గురించి ఆ మధ్య కొంతమందితో చర్చించాను. ప్రజలకి తెలియనీ, లేదా అంత ప్రచారం లభించని మంచి కథలని ( పాపులర్ వాళ్ళవి కాకుండా ) ఓ ఏభై కథలు ఏరి, అవెందుకు గొప్ప కథలో రాయించి ప్రచురించాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ సందర్భంలో ఇలాంటి కథలు కొన్ని అనుకున్నాము. ఆ తరువాత మీ బ్లాగులో ఆ కథ గురించి చదివి నాలాగ ఆలోచించే వారొకరున్నారని సంతోషం కలిగింది.
ఇవాళ రావిశాస్త్రి కథ చూసాక మరోసారి నిర్ధారణ చేసుకున్నా. నాకు ఈ కథ ఎంత నచ్చిందంటే 2009లో కథానాటికలపోటీలకి నేను ఈ కథని నాటకంగా రాసాను. ఒంగోలు, చీరాల, వైజాగుల్లో ప్రదర్శించారు. I feel this is one of the greatest stories in Telugu. I changed the name of the Title for the play I wrote. It is చినుకు, but not వేతన శర్మ.
-సాయి బ్రహ్మానందం గొర్తి
Cupertino,CA
ఇప్పుడే పాలపిట్టలో ప్రచురితమైన మీ 'కథ - 2010 పై సమీక్ష' చదివాను. నాకు చాలా నచ్చింది. నా బ్లాగ్ వీక్షకుల కోసం ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
Deletehttp://vennello.wordpress.com/2012/04/
మీ కథల పరిచయం పుస్తకం కోసం ఎదురు చూస్తున్నాను.
'వేతనశర్మ కథ' ని నాటకంగా మలిచినందుకు మీకు అభినందనలు.
కథలో మార్కండేయులు తప్ప మిగిలిన వారందరూ తమ తమ ప్రయోజనాల కోసమే కొట్లాడారు. తిరుగుబాటుదారులు సమసమాజం కోసం తాపత్రయపడ్డారని చిత్రించడం రచయిత ఆలోచనా విధానం లోని confusion అని నాకు అనిపిస్తుంది.
ReplyDelete"మరైతే, మార్కండేయుడు లేవదీసిన విప్లవం ఏమయింది? అది రాజవర్గపు కత్తులకి ఎంతమటుకు ఎరయింది? వేతన శర్మలు పొడిచిన వెన్నుపోటుకి చాలామట్టుకు గాయపడింది. మిగతాది అలసట తీర్చుకుని మరునాడెప్పుడో చిచ్చుగా మారడానికి వీలుగా అడవుల్లో తల దాచుకుంది."
Deleteరావిశాస్త్రి స్పష్టంగానే చెప్పాడు. కథా పరిచయం కావున.. క్లుప్తత కోసం పై పేరా వదిలేశాను. కథ చదువుతారని ఆశిస్తున్నాను.
>>తిరుగుబాటుదారులు సమసమాజం కోసం తాపత్రయపడ్డారని చిత్రించడం రచయిత ఆలోచనా విధానం లోని confusion అని నాకు అనిపిస్తుంది.<<
తిరుగుబాటు జరిగింది 'సమసమాజం కోసం' అని రచయిత చెప్పడు. తమని పీడించి దోచుకు తింటున్న రాజుపై మార్కండేయులు నాయకత్వంలో తిరగబడతారు. వారితో జీతాలు చాలక బాధ పడుతున్న కరణాలు కూడా చేరతారు. అంతే.
నా మిడిమిడి తెలుగు ఈ విషయాన్ని చర్చించడానికి సరిపోదు అనిపిస్తుంది, అందుకే ఆంగ్లంలో రాస్తున్నాను.
DeleteSocial conflicts are often viewed as a clash of values (e.g. democracy vs. dictatorship). This is not only easier to comprehend but appeals better to idealists like liberals or socialists.
In reality, the clash is actually between interests. Peasants in this story are fighting for their own interests, not "lofty ideals" like social justice, democracy or republicanism.
The fact that the interests of the peasants lies in a "desirable value system" does not change the fact that these values did not motivate their fight.
The karnams protected their interests by aligning with the king. This should be taken at face value because they behaved like everyone else.
I could not understand if the author is motivated by ideology (సిద్దాంతం) or idealism (ఆదర్శం). Markandeyulu is clearly driven by idealism while the others are not. Whom does the author sympathize most? At a first glance, he appears to despise Vetana Shastri more than the king.
చాలా బావుంది. మంచి కథని పరిచయం చేశారు :)
ReplyDeleteవేతన శర్మ కధ అంటే, ఒక హీరో కధ అనుకున్నాను :)
ReplyDelete@Jai Gottimukkala గారు
భారత స్వాతంత్రోద్యమం లో 'గాంధీ' తప్ప మిగిలిన వారందరూ (సిపాయిలతో సహా ) స్వప్రయోజనాలకోసమే కొట్లాడారు అంటే ఎలా ? ( చిన్న ఉదాహరణ )
గాంధీ గారు కూడా తమ ప్రయోజనం కోసమే కొట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎవరి ప్రయోజనం కోసం వారు తాపత్రయపడడం తప్పు కాదని, దానికి విలువల పేరుతొ మేకప్ అవసరం లేదనేదే నా వ్యాఖ్య సారాంశం.
Deleteజైగో,
Deleteజగన్, పట్టాభి, ఎన్‌డి తివారి, కచరా, ఆయన కుటుంబం, లగడ, మాయా, ములాయం, యడ్డి, YSRలు కూడా మీరు చెప్పినట్లు తమ ప్రయోజనం కోసమే తాపత్రయ పడ్డారు/పడుతున్నారు. గాంధీ గారి ప్రయోజనం ఏదో మీరు విశ్లేషించి చెప్పగలరు.
@ Jai Gottimukkala
Delete>>గాంధీ గారు కూడా తమ ప్రయోజనం కోసమే
సరే, మరి దీని భావమేమి ..
"కథలో మార్కండేయులు తప్ప మిగిలిన వారందరూ తమ తమ ప్రయోజనాల కోసమే కొట్లాడారు"
ఈయన్ని, అల్లూరి సీతారామరాజుని, గాంధీని ఇంకా అందరిని :)
ప్రాణాలకు తెగించిన వారికి 'స్వప్రయోజనం' కూడా ఉంటుందా అన్నది అసలు ప్రశ్న!!!!!
In the story, the conflict is between the king and commoners. Markandeyulu's "natural ally" is the king. By opposing the king, he went against his own interests.
DeleteThe conflict in the independance movement was between the British and the Indians. Gandhiji chose to fight for his own side.
ప్రయోజనం అనగానే అదేదో తప్పు కానక్కరలేదు. ఎవరి ప్రయోజనం కోసం వారు కష్టపడడమే ధర్మమని ఐన్ రాండ్ లాంటి వారు వాదిస్తారు.
ఈ కథలో రాజు తన ప్రయోజనం ఆలోచించాడు, అది తప్పు కాదు. ఆ లక్ష్యం కోసం ఆయన ఎంచుకున్న మార్గం మాత్రమె బాలేదు.
ఓహ్ అట్లంటున్నారా? అయితే వాకే. ఏ స్వప్రయోజనమాశించకుండా కామెంట్ పెట్టారేమో అనుకున్నా. :))
Deleteచక్కగా రాశారు, అభినందనలు.
ReplyDeleteఏమండీ డాక్టరు గారు,
ReplyDeleteవేతన శర్మ గారిలా ఇప్పటి కాలపు ఐటీ 'యాతన వర్మ' ల మాటేమిటి మరి? వారి కెప్పుడు మోక్షం?
జిలేబి.
జై గొట్టిముక్కల గారు, మౌళి గారు,
ReplyDeleteమనం ఒక దాన్ని నమ్మామనుకోండి, తరువాత ప్రతి విషయాన్నీ ఆ గాటి లోనే పడేయవచ్చు.
ఉదాహరణకు మనిషి స్వలాభం కోసమే బతుకుతాడు అని ఒక తీరీ లేవ దీసి దానిని నమ్మామనుకోండి, అప్పుడు గాంధీ "తన విలువలు", "తన ప్రజలు" అనే స్వార్ధం కోసం బ్రతికాడనిపిస్తుంది. అలానే ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన వాడు, "తన సిధ్ధాంతం" గెలవాలి అనే స్వార్ధం కోసం ప్రాణాలర్పించాడనిపిస్తుంది. (అతనేమీ ఎదుటి వాడి సిధ్దాంతం గెలవటం కోసం తన ప్రాణాలర్పించలేదు కదా?!)
కానీ, "మనిషులందరూ తమ స్వలాభం కోసమే ఏ పనైనా చేస్తారనేది", ఒక తీరీ మాత్రమే. ఈ తీరీ ని నమ్మిన వాళ్ళు ప్రపంచం లోని అన్ని విషయాలనీ ఆ తీరీ అనే కట్టుగొయ్య చుట్టూనే తిప్పుతారు. ఈ తీరీ ఆధారం గా మనుషులు చేసే పనులకు లేని స్వార్ధాన్ని అంటగడతారు. వాస్తవం ఈ తీరీ కి విరుధ్ధం కావచ్చు. మనం నిజ జీవితం లో నే మన స్వలాభం తో ప్రమేయం లేని అనేక పనులను చేస్తాం. మన మూడ్ బాలేక పోతే, మన దగ్గరికి వచ్చిన వారిని విదిలించి కొడతాం, ఆ కొట్టటం లో మనకు నష్టం ఉన్నా సరే! మన మూడ్ మన కంట్రోల్ లో ఉండదు. మన స్వార్ధం మనలని ఎల్లప్పుడూ సంతోషం గా ఉండమంటుంది. కానీ అనేక సార్లు మనం మన స్వార్ధానికి వ్యతిరేకం గా విషాదం గా ఉంటాం. మన స్వార్ధం/లాభం ప్రకారమే మన ప్రవర్తన ఉండేటట్లైతే మనుషులందరూ, అన్నిపరిస్థితులలోనూ ఆనందం గా ఉండాలి. ఎందుకంటే ఆనందం గా లేక పోతే మనిషి కోల్పోయేది చాలా ఎక్కువ (డబ్బు కంటే కూడా). కానీ అలా ఎల్లప్పుడూ ఉండలేము. కొన్ని పనుల వలన మనకు విషాదం కలుగుతుందని తెలిసి కూడా చేస్తాము. విషాదం గా ఉండటం లో కూడా స్వార్ధం ఉంటుందా? ఏమో రమణ గారే చెప్పాలి.
చాలా పనులు అలవాటు ప్రకారం చేసేస్తాము. అలవాటు అనేది మన బ్రెయిన్ లోని ఎలెక్ట్రో కెమికల్స్ వలన ఏర్పడవచ్చు. అందులో స్వార్ధం ఏమీ ఉండదనుకొంటా. ఉదాహరన కు ఆహారపు అలవాట్లు ఇలాంటివే.
Bondalapati garu,
DeleteI will support your view completely.
మన ప్రవర్తన, స్వార్ధం, స్వప్రయోజనం వంటి వీషయాల వలననే కాక, మన అదుపులో లేని అనేక ఇతర విషయాల వలన కూడా నిర్ణయింపబడుతుందని చెప్పటమే , నా పై వ్యాఖ్య యొక్క ఉద్దేశం. అపార్ధం చేసుకోవలదని మనవి.
ReplyDeleteబొందలపాటి గారు,
Deleteచాలా చాలా బాలెన్సింగ్ గా వివరించారు. విశ్లేషణలో మీ చివరి ప్రశ్న కూడా బాగుంది.
-------------------------------------------------------------------------------
"విషాదం గా ఉండటం లో కూడా స్వార్ధం ఉంటుందా? ఏమో రమణ గారే చెప్పాలి. "
--------------------------------------------------------------------------------
ఆనందం, విషాదం , కోపం ఇలా ఏవైనా భావాలు స్వార్ధ పూరితమైనవి గా కొంత శాతం వరకు ఉండటం సమాజం లో సహజమే. కాని ఆ శాతం పెరిగే కొలది సమాజం లో వ్యక్తులమధ్య ,వర్గాలమధ్య దూరాలు, విద్వేషాలు పెరుగుతూ ఉంటాయి.
ముందు వ్యాఖ్యానించిన తరువాత , వేతన శర్మ కధ ఇంకాస్త ఆలోచింప చేసింది. కరణీకాలు రద్దు చేయబడ్డపుడు, ఆయా వ్యక్తులు ఉపాధి కి దూరం అవ్వడం, సమస్యను ఎదుర్కోవాల్సి రావడం జరిగింది . నాకు ఆప్తమిత్రుడు కూడా కరణం గారి అబ్బాయి అవ్వడం వల్ల వారి అభిప్రాయాలు దగ్గర గా చూసాను. వారికి వారి పోరాటం లో మిగిలిన సమాజం నుండి అప్పుడు మద్దతు ఎందుకు దొరకలేదు ??
వేతన శర్మ కధాకాలం నుండే వీరు ప్రజలకు దూరం అయ్యారా ?
*కరణీకాలు రద్దు చేయబడ్డపుడు, ఆయా వ్యక్తులు ఉపాధి కి దూరం అవ్వడం, సమస్యను ఎదుర్కోవాల్సి రావడం జరిగింది *
Deleteఇది మంచి ప్రశ్న. వాస్తవానికి ఎప్పుడు రాజ్య స్వభావం పెద్దగా మారదు. కాని ఆ రాజ్యమే సోషలిజం అజెండాను, భుజాన వేసుకొని పేద ప్రజలను ఉద్దరించటమే తమ ధ్యేమని మాట్లాడటం మొదలు పెడుతుందో, అటువంటి సమయం లో దానికి నచ్చని వారిని, ఎదురు తిరిగిన వారిని ప్రజ వ్యతిరేకులుగా ప్రచారం చేయటం లోను, వారిని ఐసోలేట్ చేయటంలోను అది సులభంగా విజయం సాధిస్తుంది. ఆనాడు తెలుగుదేశం పాలనలో కరణీకాలను, ప్రభుత్వొద్యుగులను కొంత కాలం వరకు ప్రజావ్యతిరేకులుగా ప్రచారం చేయటంలో అది విజయం సాధించింది. ముఖ్యంగా కరణాల సంఖ్య మొత్తం ప్రభుత్వోద్యుగులతో పోలిస్తే తక్కువ కనుక వారిని సులభంగా బయటికి పంపగలిగారు. అదే ప్రభుత్వం తన అలవాటు ప్రకారం తరువాత చాలా మార్లు ప్రభుత్వోద్యుగులతో తలపడే కొద్ది, వారు ఎదురుతిరగటం మొదలుపెట్టారు (వారికి అప్పటికే ప్రభుత్వంలో అల్లుళ్లు , మంత్రులు ఎలా సంపాదిస్తున్నారో వివరాలు తెలిసి ఉండేవి). ఆ వ్యతిరేకత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టి పైన ఇంకా ప్రభుత్వోద్యుగులలో ఇంకా చూడవచ్చు.
SriRam
వ్యాఖ్యానించిన మిత్రులకి ధన్యవాదాలు.
ReplyDeleteనేనీ పోస్ట్ రాసేప్పుడు కొంత క్రమశిక్షణ పాటించాను. నా రావిశాస్త్రి భక్తిని (కష్టంతో) నిగ్రహించుకుంటూ రాశాను. ఈ టపా చూసినవారు 'వేతనశర్మ కథ' ని చదవాలనుకోవాలి. అదే ఈ పోస్ట్ లక్ష్యం.
ఈ కథ నాకు నచ్చినంతగా మీకు నచ్చకపోవచ్చు. చాలా చెత్తగా కూడా అనిపించవచ్చు. అప్పుడు మళ్ళీ చర్చించబడాలి. రావిశాస్త్రి మంచిచెడ్డలు మన బ్లాగుల్లో బేరీజు వేయబడాలి. వేగంగా మారుతున్న పరిణామాల్లో రావిశాస్త్రి రచనల relevance ఏమిటి? పరిమితులేమిటి? కొత్తవాళ్ళు, కుర్రాళ్ళు రావిశాస్త్రిని డిసెక్ట్ చెయ్యాలి. ఇది నా కోరిక.
నేను చాలా కథలు చదివాను. వాటిల్లో కొన్ని కథలు నన్ను ఆలోచింపజేశాయి. నాకు నచ్చిన కథల్ని 'స్వీట్లమ్ముకునే వాడు, రుచి చూపడం కోసం ఒక చిన్న శాంపిల్ ముక్క చేతిలో పెట్టినట్లుగా'.. మీకు పరిచయం చేస్తున్నాను.
నేనొక పాఠకుణ్ణి మాత్రమే. నా కథా పరిచయాలు చదివి.. (చదవనివారికి) ఆ కథ చదవాలని అనిపిస్తే భలే సంతోషిస్తాను.
రమణ గారు, మీరు పరిచయం చేయడం వల్ల ఈ కథను ఆసాంతం చదవాలని నిర్ణయించుకున్నాను. మొన్న యానాం లో ఫ్యాక్టరీని ఆహుతి చేసి MD ని హత్యచేసిన నరరూప రాక్షస కార్మికులు... నిన్న హర్యానాలో మారుతీ కంపెనీని సర్వనాశనం చేసి, ఓ హత్య తో పాటు 90 మంది ఉన్నతోద్యోగులను ఆస్పత్రి పాలు చేసిన దేశద్రోహ కార్మికులు ఇలాంటి కథలు తప్పక చదవాలేమో.
ReplyDeleteMD lu GM lu poyinappudu papers lo highlights vastaayi. amdariki human rights gurthuku vasthaayi.
Deletemari aa kaarmikulu nelala tarabadi chesina poraatam aa time lo rajya himsa evariki kanapadavu.
adi ee society lo enlightened gaa cheppukune short sighted pseudo intellectuals manakichhe velugu(sic)
రమణ గారు "వేతన శర్మ " లు ఎప్పుడు ఎటువైపు ఉంటారో.. అర్ధమైపోయింది.
ReplyDeleteమంచి కథ ని పరిచయం చేసారు. అలాగే ఇప్పటి పరిస్థితుల్లో ఆ కథ ఈ తరం పాఠకుడి ఆలోచనకి అందించే యత్నం మాత్రం చాలా నచ్చింది.
అలాగే.. మీరు "వెన్నెల్లో " బ్లాగ్ లింక్ ఇచ్చి మంచి పని చేసారు. నేను ఇప్పుడే ఆ బ్లాగ్ లోకి వెళ్లి ఓ..కథ, కథ 2010 సమీక్ష చూసి వచ్చాను. నాకు వెన్నెల్లో బ్లాగ్ బాగా నచ్చింది. ధన్యవాదములు.
*ఈ చిన్న కథ రాజ్యం, రాజ్యస్వభావం గూర్చి చర్చిస్తుంది. ప్రజలని దోపిడీ చేసే వర్గసమాజంలో ఉద్యోగులు ఎటు ఉంటారో వివరిస్తుంది.*
ReplyDeleteఈ ఆధిఉనిక కాలం రాజ్యం, రాజ్యస్వభావానికి రాజుల కాలం నాటి రాజ్యం, రాజ్యస్వభావానికి ఎంతో తేడా వుంది. పాత రోజులలో రాజులకు సోషలిస్ట్టు పాలన అందించాలనే అజెండా ఎమీ లేదు.డి సెంట్రలైసేషన్ ఎక్కువ. అందువలన మనదేశం గ్రామీణ ప్రాంతాలు సమృద్దిగా ఉండేవి. కాని ఆధునిక కాలంలో, రాజ్యనికి ప్రజలకు సొషలిస్ట్ పాలన అందించాలనే అజేండా ఉంది, ఉద్యోగులు రాజ్యం వైపే ఉంటారు. అదే న్యాయం కూడా. కారణం రాజ్యం దగ్గర సకల సదుపాయాలు, ఆయుధాలు అన్ని ఉన్నాయి. అది అనుకొంటే సోషలిస్ట్ సామ్రాజ్యం ఎంతో తొందరగా తీసుకురాగలదని ఉద్యోగులకు తెలుసు . మనదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేహ్రూ గారి నాయకత్వం లో సోషలిజం వైపుకు మొగ్గు చూపుతూండేది, 1976సం|| మనదేశాన్ని సోషలిస్ట్ దేశంగా కూడా ప్రకటించాము. సోషలిస్ట్ రాజ్యనికి వ్యతిరేకం గా ఉద్యోగులు ఎందుకు పోరాడాలి? ఎలా పోరాడతారు? పేదలకు, సామాన్య ప్రజలకు సోషలిస్ట్ రాజ్యానికన్నా మంచి సిద్దాంతం ఉందా? ఇక రాజ్యం పై పోరాడే ప్రజల దగ్గర ఉన్న ప్రత్యేక అజెండా ఎమీటీ? నాయకుడు ఎవరు? దానిని అమలు చేయటానికి వారిదగ్గర ఉన్న ఆర్ధిక,మానవ వనరులు ఎమిటి? వాళ్ల రోడ్ మాప్ ఎమీటి? రాజ్యం పైన పోరాడేవారు వీటీపైన ఎక్కడైనా ప్రజల తో చర్చించారా? ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఉద్యోగులకు ఉంటాయి. సమాధానమిచ్చే వారు ఉండరు. కనుక ప్రభుత్వోద్యుగులు రాజ్య పక్షమే వహిస్తారు.
SriRam