ఇవ్వాళ సోమవారం. ఆస్పత్రి పేషంట్లతో హడావుడిగా వుంది. ఆవిడకి సుమారు ముప్పయ్యేళ్ళుండొచ్చు. నల్లగా వుంది, పొట్టిగా వుంది, గుండ్రంగా ఉంది. విష్ చేస్తూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది. ఔట్ పేషంట్ స్లిప్ మీద ఆవిడ పేరు చూశాను.
'వెంకట రమణ'
అబ్బా! మానుతున్న గాయంలో నిమ్మరసం పిండినంత బాధ. ఈ గాయం ఈ జన్మకి మానదేమో - నాదీ ఒక పేరేనా?! హ్మ్ .. !
'నేములో నేమున్నది?' అంటారు. కానీ - నేములోనే చాలా వుంది, ఇంకా మాట్లాడితే - చచ్చేంత ఉంది. నా పేరు చూడండి - 'వెంకట రమణ'. ఈ పేరు నాకస్సలు నచ్చదు. ఇది ఉభయలింగ నామం. అర్ధం కాలేదా? తెలుగులో చెబుతాను - ఈపేరుకి లింగం లేదు! అనగా ఆడా, మగలిద్దరికీ ఈపేరు ఉంటుంది!
నాపేరు నాన్న పూర్వీకులది. ఆయన నానమ్మ పేరు రమణమ్మ. ఇంకానయం! ఆపేరు ఏ పిచ్చమ్మో అవలేదు. అప్పుడు నేను పిచ్చయ్య నయిపోయేవాణ్ణి. నాన్నకి దేవుడు లేడు కానీ తన వంశం గొప్పదని నమ్మకం. అమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. ఈ విధంగా - అన్ని విషయాల్లో కీచులాడుకునే అమ్మానాన్న, నాపేరు విషయంలో మాత్రం వొక అంగీకారానికొచ్చి - 'వెంకట రమణ' అని పెట్టేశారు.
నన్ను చిన్నప్పుడు 'రమణి!' అంటూ ముద్దుగా పిలిచేవారు. స్కూల్ ఫైనల్ చదువుతుండగా - ఒకరోజు 'రమణి' అనబడు శృంగార కథల పుస్తకం (వెచ్చటి ఊపిరి, వేడినిట్టూర్పులతో) చదవడం తటస్థించినది. ఆ మేగజైన్ నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. కథలయితే బాగున్నాయిగానీ, అర్జంటుగా నన్ను 'రమణి' అని ఎవరూ పిలవకుండా కట్టడి చేసేశాను!
నాకు హైస్కూల్లో స్థాయిలో కూడా 'ణ' రాయడం సరీగ్గా వచ్చేది కాదు. తెలుగు లిపిలో అనేక మెలికలతో కూడిన 'ణ' అక్షరం అత్యంత కష్టమైనదని నా నిశ్చితాభిప్రాయం. మా తెలుగు మేస్టరు 'నీ పేరు నువ్వే తప్పు రాసుకుంటే ఎలా?' అంటూ విసుక్కునేవారు. మహానుభావుడు! ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు - మూడేళ్ళపాటు సవర్ణదీర్ఘ సంధి మాకు నేర్పడానికి విఫలయత్నం చేశారు. నాకు మాత్రం గుణసంధి కూడా కొద్దిగా వచ్చు, మాక్లాసులో నేను బ్రిలియంటుని లేండి!
ఎనాటమి పరీక్ష మార్కుల లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు. నాపేరు పక్కన (F) అని ఉంది! హడావుడిగా ఎనాటమి ట్యూటర్ని కలిశాను. ఆయనకి నా జెండర్ ఘోష అర్ధం కాలేదు. అందుకే కూల్ గా 'నీ నంబరు, మార్కులూ సరీగ్గానే ఉన్నాయిగా? ఈసారికి ఎడ్జస్టయిపో!' అన్నాడు. నాకు మండింది. నేను ఆడవాడిగా ఎలా ఎడ్జస్టయ్యేది!
గట్టిగా అడగాలంటే భయం, మొహమాటం. నాపేరు పక్కన ఈ మాయదారి (F) వల్ల అమ్మాయిలు నన్నుచూసి 'రవణమ్మ' అంటూ కిసుక్కుమనుకోవడం గుర్తుంది. నేనంటే పడని ఒకళ్ళిద్దరు కసిగా 'ఒరే! వంకర్రవణా!' అని పిలవడం కూడా గుర్తుంది.
ఇడ్లీసాంబార్ తిందామని హోటలుకి వెళ్తాను. అక్కడ టేబుళ్ళు తుడిచే చింపిరిజుట్టువాడు రమణ! 'అరేయ్ రవణగా! ఈ టేబులు మీద ఈగలేందిరా? సరీగ్గా తుడవరా దున్నపోతు!' కత్తితో పొడిచినట్లుండేది. నేను వర్గ ధృక్పదంతో రాయట్లేదు, నామ ధృక్పదంతో రాస్తున్నాను.
నా డొక్కుస్కూటర్ పంక్చర్. నెట్టుకుంటూ, రొప్పుకుంటూ.. పంక్చర్ షాపుకెళ్ళాను. అక్కడా నాఖర్మ కాలింది. అక్కడి బక్కచిక్కిన అసిస్టెంటు రమణ! 'క్యాబే సాలా! చక్రం హిప్పటం హెంతసేపురా సువ్వర్ కా బచ్చా!'
నా పేరుని హత్య చెయ్యడంలో తెలుగు సినిమావాళ్ళు కూడా తమదైన పాత్ర పోషించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ తమ్ముడి పేరు రమణ! ఆ వెధవ ఏ తిక్కలోడో, తింగరోడో అయ్యుంటాడు. వాణ్ణి పోషించటానికి హీరోయిన్ నానా కష్టాలు పడుతుంది. సినిమాలో ఆ దరిద్రుడి పాత్ర ప్రయోజనం హీరోయిన్ కష్టాలు పెంచడం తప్ప మరేదీ కాదు.
నాకు అర్ధం కానిది.. పొరబాటున కూడా ఏ ఉత్తముడికో, ఏ డాక్టరుకో (ఒక మనిషి ఉత్తముడో, డాక్టరో.. ఏదో ఒకటే అయ్యుంటాడని.. డాక్టర్లల్లో ఉత్తములుండరని మా సుబ్బు అంటుంటాడు.) - 'వెంకట రమణ' అన్న పేరు ఎందుకుండదు అనేది.
తెలుగేతరులకి నాపేరు 'రమన' అవుతుంది! వారి 'న'ని.. 'ణ'గా మారుద్దామని తీవ్రప్రయత్నాలు చేశాను. ఆ ప్రాసెస్ లో నాపేరు 'రామన్న', 'రావణ్ణ' అంటూ మరింత ఖూనీకి గురయ్యేది. ఆవిధంగా నేను MD చేస్తున్న రోజుల్లో పంజాబీలు, బెంగాలీయులు నాపేరుని సామూహికంగా పిసికి పరోటాలు వేసేవాళ్ళు.
నాకెందుకో ఈ 'రమణ' అన్నపేరు బోడిగా, తోకతెగిన బల్లిలా ఉంటుంది. అందుకే కామోలు - నా పేషంట్లు నన్ను రమణయ్యగారు, రమణారావుగారు, రమణమూర్తిగారు అంటూ తోకలు తగిలిస్తారు. అప్పుడు నేను దిగులు చెందుతాను.
నాపేరు ఏ నరసింహారావో, రంగారావో అయితే ఎంత బాగుండేది! ఈపేర్లలో ఎంత గొప్ప మెసేజుంది! ఈ నామధేయుడు మగవాడు, తెలుగువాడు, గంభీరమైనవాడు.. ఇంకా చాలా 'వాడు'. నాకా లక్జరీ లేదు. నన్ను చూస్తేకానీ నేనెవరో తెలీదు.
కాలం గడుస్తున్న కొద్దీ నాకు నాపేరుపై గల 'పేరు న్యూనతాభావం' పోయింది. ఇప్పుడు పెద్దమనిషినయినాను. పరిణితి చెందాను (ఇదిమాత్రం డౌటే). అంచేత నాపేరు గూర్చి వర్రీ అవడం మానేశాను. అయితే - కొందరు పేషంట్లు అప్పుడప్పుడు ఇట్లా గుండెల్లో కత్తులు, కొడవళ్ళు గుచ్చుతుంటారు.
ఇవ్విధముగా బ్రతుకుబండిని గవాస్కరుని బ్యాటింగు వలె స్తబ్దుగా లాగుచుండగా, ఒక దుర్దినాన నా కజిన్ ప్రసాదుగాడు తగలడ్డాడు. నా చిన్నాన్న కొడుకైన ప్రసాదు చిన్నాచితక వ్యాపారాలు చేసి, అన్నిట్లో నష్టపోయి (వాడు నష్టపోతాడన్న సంగతి వాడికితప్ప అందరికీ ముందే తెలుసు) ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏజంటుగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు (ఇళ్ళస్థలాల బ్రోకర్లని స్టైలుగా రియల్ ఎస్టేట్ ఏజంటందురు).
వీడుచేసే ఎస్టేట్ ఎంత రియలోగానీ, ప్రిస్టేజి మాత్రం ఫాల్సే! ప్రసాదుకి నిమిషానికో ఫోన్ వస్తుంది. వంద ఎకరాలంటాడు, సింగిల్ సిట్టింగంటాడు, డెవలప్మెంటంటాడు, పది కోట్లకి తగ్గేది లేదంటాడు.
ప్రసాదుగాడి ఫోనుకి క్షణం తీరికుండదు, నోటికి తాళం ఉండదు. అనేక ప్రముఖుల పేర్లు ఫోను సంభాషణల్లో విరివిగా దొర్లుతుంటాయి. వీడి భార్య మాత్రం ఇల్లు గడవడం కష్టంగా ఉందని వాపోతుంటుంది!
ఓ రోజున - మా ప్రసాదుగాడితో పాటు ఒక శాల్తీ రంగప్రవేశం. నల్లటి శరీరం, తెల్లటి బట్టలు, మెళ్ళో పులిగోరు చైను, సెంటుకంపు! పులిగోరు సెంటుగాళ్ళు సంఘవిద్రోహశక్తులని నా నమ్మకం.
చికాకుని అణుచుకుంటూ 'ఏంటి సంగతి?' అన్నట్లు ప్రసాదుని చూశాను.
ప్రసాదు మాట్లాడలేదు, బదులుగా సెంటుకంపు పులిగోరు మాట్లాడింది.
"సార్! మీపేరు చాలా బాగుంటుంది."
ఊహించని స్టేట్ మెంట్! ఆ శాల్తీని ఆశ్చర్యంగా చూశాను.
"నాకు వెంకటరమణ అన్న పేరు చాలా ఇష్టమండి. ఈపేరు విన్నప్పుడల్లా నాకు ముళ్ళపూడి వెంకటరమణ గుర్తొస్తాడు!"
అవునుకదా! ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన బుడుగు, రెండుజళ్ళ సీత , సీగానపెసూనాంబ.. అందరూ కళ్ళముందు కదిలారు. నిజమే! ఇన్నాళ్ళూ నాకీ చిన్న సంగతి తోచలేదేమి! పోన్లే - ఇంతకాలం హోటల్ క్లీనర్లకి మాత్రమే పరిమితమైన నాపేరు మీద ఒక ప్రముఖుడు ఉన్నాడు. సంతోషం. సెంటుకంపు కొడితే కొట్టాడు గానీ చాలా మంచివాళ్ళా ఉన్నాడే!
"ఎవరైనా తమ పిల్లలకి వెంకటేశ్వరస్వామి పేరు పెడదామనుకుంటే వెంకట్రమణే బెస్ట్ నేమండి!"
అవునా! నాచెవుల్లో 'ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గొవిందా.. గొవిందా!' అంటూ గోవిందనామ స్మరణం వినిపించసాగింది! తిరువణ్ణామలై రమణ మహర్షి కనబడసాగాడు.
ఛ.. ఛ.. నేనెంత అజ్ఞానిని! ఇంతటి పవిత్రమైన పేరుని ఇన్నాళ్ళూ ఎంతలా అవమానించితిని. ఎంతలా కించపరిచితిని. అయ్యా! సెంటుకంపు పులిగోరు బాబూ! నాకళ్ళు తెరిపించావ్. నీకు థాంక్సురా అబ్బీ!
"అసలు 'ణ' అక్షరం స్వచ్చమైన తెలుగు నుడికారానికి ప్రతీక! ఈ అక్షరమే లేకపోతే తెలుగుభాష పేదరికంలో మగ్గిపొయ్యేది!"
అవును సుమీ! ఇదీ కరెక్టే! ఈ 'ణ' ఎంత గొప్పక్షరం! ఉన్నట్టుండి తెలుగు లిపి రక్షకుడిగా ఫీలవడం మొదలెట్టాను. తరచి చూడగా.. నాపేరు తెలుగుభాషకే మకుటాయమానంగా తోస్తుంది. సడన్ గా నాకు నేను చిన్నయ సూరిలా, గిడుగు రామ్మూర్తిలా ఫీలవడం మొదలెట్టాను!
ఈయనెవరో దైవదూత వలె నున్నాడు, నా అజ్ఞానాంధకారమును ఎవెరెడీ టార్చ్ లైటు వెలుగుతో పారద్రోలినాడు. సందేహము వలదు. ఇతగాడు మహాజ్ఞాని, మహామేధావి, మహానుభావుడు. అయ్యా! మీకు శిరసు వంచి నమస్కృతులు తెలుపుచున్నాను, నమోన్నమః.
గర్వంతో, స్వాతిశయంతో గుండెలుప్పొంగగా.. నాపేరు గొప్పదనాన్ని విడమర్చిన ఆ మహానుభావుని పట్ల కృతజ్ఞతతో తడిసిపోతూ ఒకక్షణం అతన్నే చూస్తుండిపోయాను. ఎంతయినా, గొప్పవారికే గొప్పపేర్ల గూర్చి అవగాహన ఉంటుంది. వారే సరైన అంచనా వెయ్యగలరు. వారు కారణజన్ములు.
ఒరే ఫాల్స్ ప్రిస్టేజి రియల్ ప్రసాదుగా! ఒక గొప్పవ్యక్తిని పరిచయం చేశావ్! నీ ఋణం తీర్చుకోలేనిది.
అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! నేనెంత మర్యాద తక్కువ మనిషిని! నాపేరుని ఇంతలా అభిమానిస్తున్న ఈయన నామధేయము తెలుసుకొనవలెనన్న కనీస మర్యాదని మరచితిని.
"అయ్యా! తమరు.. " అంటూ అగాను.
"నా పేరు చినపుల్లయ్య సార్! మీ తమ్ముడు ప్రసాదు క్లాస్మేట్నండి. చిట్స్ బిజినెస్ చేస్తాను."
ఒహో అలాగా! చిట్స్ వ్యాపారం చేస్తూకూడా నాపేరు మీద ఎంత రీసెర్చ్ చేశాడు! జీతే రహో బేటా! ఒకవేళ దేవుడనేవాడే ఉంటేగింటే నీ చిట్టీల వ్యాపారం బాగా సాగాలని ఆయన్ని కోరుకుంటున్నాను. లేదులేదు, ప్రార్ధిస్తున్నాను.
చినపుల్లయ్య గొంతు సవరించుకున్నాడు.
"సార్! రేపట్నించి కొత్తచీటీ మొదలెడుతున్నాను. మీరుకూడా ఒక చీటీ వెయ్యాల్సార్! అంతా మీ డాక్టర్లే సార్! మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్! చినపుల్లయ్య ఎట్లాంటివాడని ఎవర్నైనా అడగండి సార్! చీటీ పాడిన రోజే ఎమౌంట్ పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తా సార్! నాకు మార్కెట్లో ఉన్న గుడ్‌విల్ అట్లాంటిది.. " చినపుల్లయ్య మాట్లాడుతూనే ఉన్నాడు.
'టప్'మని బెలూన్ పగిలిన శబ్దం! ఉప్పొంగిన నాగుండె ఫ్లాట్ అయిపోయింది!
నాదీ ఒక పేరేనా?! హ్మ్.. !
(నిట్టూర్చుచూ, వగచుచూ, వాపోవుచూ, చింతించుచూ, ఖేదించుచూ, దుఃఖించుచూ, శోకించుచూ.. ఇంకా చాలా 'చూ'లతో.. )
చివరి తోక -
'వెంకట రమణ' నామధేయులకి క్షమాపణలు.
'వెంకట రమణ' నామధేయులకి క్షమాపణలు.
Nice post.
ReplyDeleteపేరులో 'నేము'oది లెండి :)
guDDU
ReplyDeleteKaburlu bagunnai, chaala gap vachindi e saari, practice lo busy aipoyara doctor garu, Not only name, u also look like Mullapudi Venkata Ramana, in this angle, cheer up :)
ReplyDeleteనాల్రోజుల క్రితమేగా రావిశాస్త్రి కథ గూర్చి రాశాను! మిస్సయితివా మిత్రమా?
Deleteనా ముళ్ళపూడి look! thanks to my bald head!
Thank you for the hearty laughter I had.
DeleteRamana female name aa ? surprising for me to hear. I was thinking ramana ( in telugu ) means husband or lord , it's a 100% masculine name. sanskrit meaning may be different... my parents are from guntur, but i'm born & raised in telangana. so may be I won't know that it's used as a unisex name.
for eg: Janaki ramana means husband/ lord of Janaki. there's a song starting with the lyrics ... janaki ramana. Listen to it if possible.http://www.youtube.com/watch?v=ODPZjcUxuRI
Ramana maharshi ( I'm not a fan ) also has the same name, he's worshipef by many as Bhagwan !
upendra also means the same as your name, but in telangana, females & males both get that name.
రమణ గారూ, నవ్వుల రేడు పొట్లకాయి (అదేనండి రమణా రెడ్డి) పేరు కూడా మీ పేరే. అంతెందుకు హాస్యబ్రహ్మలు ఎందరో ఈ నామధేయాన్ని ధరించి ఉన్నారు.
ReplyDeleteనేను కొత్త చీటీ పెడుతున్నాను. నెలకి కేవలం పది వేలు మాత్రమె. అంతా మీలాంటి తెలుగు బ్లాగర్లే, కావాలంటే ఎంక్వయిరీ చేసుకోండి. మీరు ఒక చీటీ వేయాల్సిందే లేకపోతె రమణా రెడ్డి మళ్ళీ పుట్టినంత ఒట్టు.
పేరే పెన్నిధి. నీ అంత మంచి పేరు మరి ఎవరికీ లేదు.
ReplyDeleteఒక పది లక్షలు ఇస్తే అంతకంటే భాగ్యం లేదు.
శివరాత్రి దాకా వడ్డీ లేదు. ఆ మర్నాటి నుండి అసలే లేదు.
ఏడాది తర్వాత ఎప్పుడడిగినా తిరిగి పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తా ..
(రుణా నంద లహరి ప్రభావితుడు )
- పుచ్చా
ముక్కోటి రూపాల్లో రమణ ని చూపిస్తూనే ఉన్నారు రోజు . ఇది కాక రమణాష్టకం!!! , శతకం!!!! .. పోన్లెండి , హారం లో మీ టపానో వ్యాఖ్యలో లేకపోతె అస్సలు బాగోదు.
ReplyDeleteమిమ్మల్ని మీరే ఇన్నిన్ని మాటలు అనేసుకుంటే పాపం అజ్నాతోత్తములు పదాలు వెతుక్కోవాల్సిందే :P
మీ బ్లాగు తో ఒకేఒక్క ఉత్తమ/మంచో ఏదో ఒక బ్లాగు అని క్రొత్త సంకలిని మొదలుపెడుతున్నారట. మరి మీ బ్లాగు లేకపోతె సంకలినులు చూడడం ఆవాల్టికి వృధానే కదా :D
ముందు నన్ను నేనే అన్నీ అనేసుకుంటే సేఫ్. ఆ తరవాత నన్నడానికి ఎవరికీ ఏమీ మిగలదు. ఇదో టెక్నిక్!
Deleteనా టపాలన్ని కాలక్షేపం బఠాణీలేనండి. సరదాగా నవ్వేసుకోండి. సీరియస్ విషయాలు నాకర్ధం కావు.
ఛ, పుచ్చు బఠాణీ, ఒక్క చిరునవ్వు కూడా రాలేదు. :(
Deleteడియర్ రమణా,
ReplyDeleteపేరులో పెన్నిధి ఉందొ లేదో కాని పేరు మీద పేజీలు పేజీలు రాసి హాయిగా నవ్విపించావు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, చిన్నప్పుడు గురజాడ మీద వ్యాసం రాసి ప్రైజు కొట్టేసినప్పుడే అనుకున్నాను - ఈ మనిషి దేనిమీదయినా అలవోకగా అరదస్త తెల్లకాయితాలు నలుపు చెయ్యగలడని. మేధావులని మేధావులు మాత్రమే గుర్తించ గలరనే సూత్రాన్ని మరోసారి రుజువు చేసావు. మెయిల్ లో చూసానో లేదో గుర్తు లేదుకాని ప్రస్తుతం అదిరింది.
గోపరాజు రవి.
మీరే ఇలా అంటే ఎలా అండి , మా తమ్ముడు పేరు మంగారావు , అందరు వాన్ని మంగా అని పిలుస్తారు.
ReplyDeleteఇంటర్మీడియట్ వరకు నా పేరు మార్చుకుంటాను అని తిరిగాడు, ఆ తరువాత పెద్దమనిషయ్యాక గవర్నమెంట్ తో పెట్టుకుని పేరు మార్చుకోవడం కన్నా, ఉన్న పేరే బెటర్ అని సైలెంట్ అయిపోయాడు.
నా పేరు వెంకట్ అని, మా తమ్ముడు పేరు మంగా అని పెట్టి మా అమ్మ తిరుపతి మా ఇంట్లోనే ఉందని సంబరపడిపోతుంది.
ఇక నుండి వెంకట రమణ లకి మీరే ఆదర్శం.
:venkat
టపా మొదట్లో - తెల్లగా పొట్టిగా ఉన్నావిడ మీ పేరునుబట్టి ఆడవారుగా ఎందుకు అపార్థం చేసుకున్నదో అర్థం కావటంలా. 'వేంకట రమణ' మగవారికి మాత్రమే పెట్టే పేరు కదా! రమణి అంటే అనుకోవచ్చు.
ReplyDeleteకాస్తంత దట్టించి త్రీట్మెంట్ చెయ్యండి డాట్రారు. ఆ కార్జియాలజిస్టుకు అర్థమయిపోయుంటుంది - తను కాదు ట్రీట్ చెయ్యాల్సిందని. :-)
మా ఏరియాలో ఆడ 'రమణ'లు కూడా బానే ఉన్నారండి. నా పేషంట్లలోనే కనీసం పాతిక మంది ఉన్నారు.
Deleteవిషయంలోకి వెళ్ళడానికి ఆవిడని వాడుకున్నాను. అంతకు మించి మరేం లేదు.
డాక్టర్ వేంకట రమణ గారూ,
ReplyDeleteమీ పేరు మీరే తప్పు రాసుకుంటే ఎలా? "వే"కి కొమ్ము విరిచేస్తే ఎలా చెప్పండి?
వెంకట రమణ కాదు సార్!, వేంకట రమణ. unicornలా వేకి పెద్ద కొమ్ముంది.
నాకు రమణారావని ఒక మిత్రుడున్నాడు. ఆయన్ని రమణ, నాలాంటి దౌర్భాగ్యులు రవణా అని పిలుస్తూ ఉంటాం. అమెరికన్లు ఆయన పేరుని మధ్యలో శక్తి కొద్దీ సాగతీసి, "రమాణ" అని పిలుస్తూంటే మా ఫ్రెండుకి చిర్రెత్తుకొచ్చేది. "ఇంకానయం! నువ్వు పిలుస్తున్నట్లుగా "రవాణా" అంటే చచ్చుండేవాణ్ణి," అని - "రవణ కాదు, రమణ" అని సవరించేవాడు. నేను మాత్రం అతన్ని రమాణా, కాస్త స్నేహం ఎక్కువయితే రవాణా అనే పిలుస్తూ ఉంటాను.
నాకు తెలుసున్న ఇంకొకాయనున్నారు. వేటూరి వేంకట రమణగారు. ఆయన శ్రీశ్రీని చూసి ముచ్చటపడి తన పేరుని కూడా వే.వే అని రాసుకున్నాడు. నవ్వుకోలేక చచ్చాను. ఆయన పేరుని ఆయనే వెక్కిరించుకుంటున్నాడని. మొదట్లో ఆయనకి అర్థం కాలేదు. వేవే అంటే వెక్కిరింత అని చెప్పి శ్రీశ్రీని కాపాడేసాను.
సరదాకి రాసాను. నొప్పి కలిగిస్తే క్షమించేయండి. ఇండియా వచ్చినప్పుడు మీ క్లినిక్కొచ్చి ఫీజు చెల్లించుకుంటాను.
(నా పేరు మీద కూడా చాలా జోకులున్నాయి. అవన్నీ వింటే నాకు డోకొస్తుంది లెండి. అది వేరే విషయం.)
-బ్రహ్మానందం
చక్కని వ్యాఖ్యకి ధన్యవాదాలు.
Deleteమీరు రాసినట్లు 'వేంకట' నే కరెక్ట్. మరి నా పేరులో ఆ దీర్ఘం లేదు. నాకు తెలిసి నా స్నేహితులకి (medicine లో మా క్లాసులో ఏడుగురు రమణలున్నారు) కూడా దీర్ఘం లేదు. ఎందుకో తెలీదు.
ఏదో సరదాగా నా స్నేహితుల కోసం రాశాను. మీకు నచ్చినందుకు సంతోషం.
నేను కూడా 'వెంకట రమణ' నే! మా తల్లి తండ్రులు నాకు 'మూర్తి' కూడా తగిలించారు చివర్లో. నేనే టెన్త్ అప్లికేషను లో ఆ మూర్తి ని 'కట్' చేసాను. బహుశా 'సుబ్బారావు' తరువాత తెలుగు వాళ్ళ లో ఎక్కువగా పెట్టే పేరు (మన రోజుల్లో) 'వెంకట రమణ' నే! ఎందుకంటే చాలా మందికి ఆ ఏడుకొండల మీద వుండే ఆయనే 'ఫేవరెట్ గాడ్' గదా!
ReplyDeleteనువ్వు చెప్పిన వాళ్ళే కాకుండా 'రమణ' అనే పేరు గల పని అమ్మాయిలు కూడా వున్నారు. నీకు మణిపాల్ లో వొచ్చిన కష్టం నాకు కూడా వొచ్చింది 'బనారస్' లో చదివే రోజుల్లో! మా హెడ్ 'రామన్న' అని పిలిచేవాడు, అంతే కాదు 'రాజ రామన్న'కి నీకు ఏమన్నా నీకు 'relation ' వుందా అని అడిగాడు. లేకపోతె 'C V రామన్' కి నీకు ఏమన్నా 'relation ' ఉందా అని అడిగేవాడు. నేను అక్కడ వున్న మూడు సంవత్సరాలలో ఏనాడు ఆయన నన్ను సరిగా పిలవలేదు. కాకపోతే చాలా గొప్ప వాళ్ళతో పోల్చాడు కాబట్టి చాలా సంతోషించాను.
కాబట్టి 'రమణి' (నాకు తెలుసు మీ అక్క ముద్దుగా నిన్ను అలా పిలుస్తుందని) "పేరులో ఏముంది"? ఏదో మన కొక identity తప్ప.
పొద్దున్నే 'మన' పేరు గురించి నే కధ బాగుంది.
గో వె ర
వేంకటరమణా గోవిందా ! సం కట హరణా గోవిందా
ReplyDelete'రమణి' కాదని సంకటం లో పడిపోయిన దుర్గేశ్వర గారు
Deleteమీదింకా ఫరవాలేదు. విశాఖ వైపుకొస్తే "పైడితల్లి", "నాయుడమ్మ" లాంటి పేర్లు మగవాళ్లకి కూడా ఉంటాయి. అది ఇంకా పెద్ద confusion
ReplyDeleteరామన్ గారు,
ReplyDeleteబాగున్నారా?
రావణ్ గారు కుశల మేనా ?
ఏమిటో నండీ ఇట్లా జిలేబీ అని పేరు పెట్టేస్తారు. ఆ పై మన తంటాలు మనం పడవలసిందే మరి.
చీర్స్
జిలేబి.
Ramanaji,brilliant ee blogs to yekkadiko yellipotunnaru(fame wise).Aa photolo ramanagari face nedi almost same.Good Luck,busyga unna keep writing,we r enjoying.
ReplyDeleteఆవిడ కార్డియాలజిస్టు గారు మీ గురించి చెబుతూ "డా. వెంకట రమణ గారు మంచి డాక్టరు, ఆయన హస్తవాసి చాలా మంచిది, ఆయన మీ రోగం బ్రహ్మాండంగా నయం చేస్తారు" లాంటివి చెప్పే ఉంటారు. ఆ క్రమంలో మిమ్మల్ని ఆయన "ఆయన" అంటూ ఎన్నోసార్లు ఉదహరించే ఉండాలి. అలాంటప్పుడు ఆవిడకు ఈ సందేహం రాకూడదు.
ReplyDeleteపిచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చే అమాయక పేషెంట్లు మీ అంచనాలకు అందరులెండి.
Delete35 ఏళ్ల వయసులో ఉన్న మనిషిని కార్డియాలజిస్టు మానసిక వైద్యునికి రెఫరెన్సు చేయాడానికి కారణం ఏమిటి చెప్మా? ఇదిగో ఊహాగానం:
Deleteపే: డాక్టరు గారూ, నాకు అర్జెంటుగా ఓపెన్ హార్టు సర్జరీ చేయండి.
కా: అమ్మా, మీ పరీక్షలన్నీ చూసాక మీకు ఏ రకమయిన హృద్రోగమూ లేదు. మీరు బాధ పడుతున్న జబ్బు పేరు హైపోకాండ్రియా. దీన్ని నాకంటే బాగా నయం చేయగలిగిన మానసిక వైద్యుడి రెఫరెన్సు ఇస్తాను. ఆయనను కలవండి.
రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకుంది అని, నా పేరు మరీ మీరు చెప్పినట్టు ప్రతీ వాళ్ళకీ లేకపోయినా నా పేరుని తిన్నగా, సక్రమంగా, అందంగా, ఇలా ఎన్నో "గా" పలికేవాళ్ళంటే నాకు చాలా గౌరవం.
ReplyDeletedoctor garu,
ReplyDeletemee peru gurinche mee badhaithe 'seenu' gaallamu maa badha yevaritho cheppukovalandi?edo vasanthakokila lo oka pichchi heoien,ninnepelladutha lo tabu mammalni kasta romantic gaa pilichare kani akhariki maa peruto 'dubai seenu' antu o vekili cinema ne vachesindi.
kaabatti maa seenu galllanu choosi ooradillandi.
http://www.free-naturewallpaper.com/quotes/lit-poetry/1440x900/images/Rose_Shakespeare.jpg
ReplyDeleteయ-రమణ గారికి,
ReplyDeleteనెలరోజుల క్రితం మా బ్రహ్మం గాడు మీ బ్లాగు పరిచయం చేసిన్నాటి నుంచి 'రోజూ రాసే పనిలో ఉన్న నీకు ఇంతమాత్రం చేతనైతే చాలురా' అంటూ నిత్య చీవాట్లూ, బోల్డన్ని ఎత్తిపొడుపులు! వాడి దెప్పి పొడుపులతో నెత్తిన తేలిన బొప్పి కదుములు కాస్తా... (మోహన్ గారి భాషలో చెప్పాలంటే)మనలోని వేపకాయంత వెర్రి... మీలో గుమ్మడికాయలంతగా కనిపిస్తుంటే నాకెంతటి వెర్రి ఆనందం! మీ రాతలు ఎంజాయ్ చేస్తూ మానిటర్ అద్దంలో నన్ను నేను చూసుకుంటున్న ఆనందం పొందుతున్న. నువ్వు యూతేంట్ర స్టైల్లోనే మళ్లీ వాడు తయారు.'నువ్వు రమణ ప్రతిబింబం ఏంట్రా? ఆర్టిస్ట్ కానివాడు వేసిన క్యారికేచర్ లాంటి రాత నీది. అద్భుతమైన ఆర్టిస్టు లాంటి రాత ఆయనది' అంటూ మళ్లీ వాడి వెక్కిరింత. మీరు రమణ అయితే నారాత మాత్రం వర్ణవ్యత్యయమైన మీపేరులాంటిదట. వాడింతగా పనిగట్టుకుని తిడుతున్నా వాడి తిట్లనూ, మీ రాతనూ కుళ్లుకోక ఆనందిస్తూ... ఇలాగే ఎప్పుడూ నాలాంటి ఎందరినో ఆనందింపజేయాలని కోరుతూ...
మీ రెండు రెక్కల ఫ్యాన్...
యాసీన్
యాసీన్ గారు,
Deleteమీ వ్యాఖ్య నన్ను 'ఎక్కడికో' తీసుకెళ్ళింది. ధన్యవాదాలు.
నాకున్న కొద్ది సమయాన్ని బ్లాగేస్తున్నాను . ఇలా ఎంతకాలం చేస్తానో తెలీదు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
బావుందండీ మీ పేరోగతం(భాగోతం లాంటిది). మీరింకా చాలా అదృష్టవంతులండీ బాబూ. మీ పేరు చాలా మందికి ఉండడమే కాక పెద్ద ఖూనీ చేసే అవకాశం లేని పేరు. నా పేరు చూడండి, మంచి, చక్కని పేరు కానీ ఏం లాభం? ఒక్కరు కూడా తిన్నగా పలికి ఛావరు. అసలు ముందు అర్థమే కాదు చాలామందికి. రెండు, మూడు సార్లు చెబితే అప్పుడు ఖూనీ చేసి మరీ పలుకుతారు. ఇహ అమెరికాలో అయితే అడగనే అక్కరలేదు. వాళ్లు పిలుస్తుంటే ఎవరిని పిలుస్తున్నారా అని వెతుక్కోవాలి. మొన్నకసారి హాస్పటలుకు వెళితే అక్కడ న్ను ఏదో వింత పేరుతో పిలిచారు. అది అర్ధం కాక నన్ను కాదేమో అనుకుని పలకకుండా కూర్చున్నాను. ఐదునిమిషాల తర్వాత మ అనే అక్షరం స్పష్టంగా వనిపించి నాదే అనుకుని లోపలకు వెళ్ళాను. చూసారా దీన్ని బట్టి మీరు చాలా మంచి పేరున్న అదృష్టవంతులు.
ReplyDeleteఇందుమూలముగా నాకర్ధమైనేదేమనగా.. ఇక నుండి పిల్లల పేర్లలో 'ణ'లు, 'జ్ఞ'లు రాకుండా పేర్లు పెట్టవలెను.
Delete'మోక్షజ్ఞ' అనే పేరు ఈ మధ్య పత్రికల్లో చదివాను.
ReplyDeleteబాలకృష్ణ కొడుకు పేరు.
ఇది కూడా అమ్మాయిల పేరులా ఉందే.
పిల్లలకి నోరు తిరగని పేర్లు పెట్టిన 'అన్న' గారి మీద మీ అభిప్రాయం?