ప్రస్తుతం నడుస్తున్నవి అవకాశవాద రాజకీయాలు. అవినీతి రాజకీయాలు. చాలాసార్లు చికాకేస్తుంది. ఒక్కోసారి దిగులేస్తుంది. అతి అరుదుగా మాత్రమే సంతోషంగా ఉంటుంది.
ఇవ్వాళ ఆ అరుదైన సంతోషం. ఉదయాన్నే ఆంధ్రజ్యోతి పేపర్లో తీపివార్త.
"వర్గీకరణకు సై! తెలంగాణాకు జై!" తెలుగు దేశం పోలిట్ బ్యూరోలో చర్చ.
ఇది నిజంగా శుభపరిణామం. ఒక రాజకీయపార్టీకి ఒకే విధానం ఉండాలి. ఆ విధానాన్ని వ్యతిరేకించే నాయకులు బయటకి వచ్చేస్తారు. ఆ పార్టీ నాయకుణ్ణి నమ్మడం లేదా నమ్మకపోవడం.. అలాగే ఆ పార్టీ విధానాల్ని ఒప్పుకోవడం లేదా తిరస్కరించడం అనేది ప్రజల ఇష్టం. అది వారి విజ్ఞతకి వదిలేద్దాం. ఇది ప్రజాస్వామ్యం.
నేను అల్పసంతోషిని. లేటుగానయినా లేటెస్టుగా.. ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందామనుకుంటున్న చంద్రబాబుని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
"శభాష్ చంద్రబాబు!"
(photo courtesy : Google)
రమణ గారు.. మీలాగే నేను అల్ప సంతోషి..నే!
ReplyDeleteఈ మాట నాలుగేళ్ల క్రితమే చెప్పి ఉంటే చాలా మార్పులు జరిగి ఉండేవేమో! కొందరి నోళ్ళకి ఇప్పుడిక " చెక్" అన్నమాట.
వనజ గారు,
Deleteచంద్రబాబు ఇంకా ఏం చెప్పలేదు. చెబుదామనుకుంటున్నాడు. నాకదే మహా ప్రసాదం! నేను ఆయన రెండుకళ్ళ సిద్ధాంతంతో తికమక పడుతున్న ఒక అజ్ఞానిని!
(కింద మురళి గారి వ్యాఖ్య చూశారుగా.)
వనజ గారూ, రమణ గారూ,
Deleteగతంలో చంద్రబాబు తెదేపాలు ఇవే విషయాలలో ఇంతకంటే స్పష్టంగా మాట్లాడారు. తీరా సరయిన సమయం వచ్చినప్పుడు వారిచ్చిన "చెక్" బౌన్సు అయింది. ఇక ప్రత్యర్థులకు "చెక్" పెట్టాలంటే డ్రాఫ్టు ఇవ్వాలెమో?
రమణ గారు నిజంగా మీరు అల్పసంతోషి ఆయన స్పష్టం చేశారు అని మీరు అనుకుంటున్న విషయాలు ఎక్కడ స్పష్టం చేశారు ? ఆ వార్తను మరోసారి చదవండి . తెలంగాణపై సెప్టెంబర్ లో స్పష్టం చేద్దామని అనుకుంటున్నట్టు మీడియాకు లీకు ఇచ్చారు . ఆయన నేరుగా మీడియాకు ఆ విషయం చెప్పలేదు . ఇక వర్గీకరణ అంశం రాష్ట్రానికి సంబంధం లేదు. రాజ్యాంగ సవరణ జరగాలి . వర్గీకరణకు అయన కొత్తగా అంగీకరించడం ఏమిటో ? అధికారం లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశాడు . మళ్లీ అన్గికరించాల్సిన అవసరం ఏమిటి ?
ReplyDeleteపోన్లేండి. నేటి లీకులే రేపటి నిర్ణయాలు. అవ్వా బువ్వా రెండూ కావలనుకునే ఈ రాజకీయ పార్టీలు చేసే విన్యాసాలు చూసి చూసి విసుగొచ్చేసింది.
Delete(నాకెందుకో ఈ మధ్య చంద్రబాబులో బాడీ లేంగ్వెజ్ లో చాలా మార్పు కనిపిస్తుంది.)
హైదరాబాద్ రాష్ట్ర విలీనంతో సంబంధం లేని పొట్టి శ్రీరాములు పేరు చెప్పి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించినవాళ్ళలో చంద్రబాబు మొదటివాడు. అతను అంత సులభంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటాడంటే నేను నమ్మలేను. SC వర్గీకరణకైతే ఒప్పుకుంటాడు. రిజర్వేషన్‌ల విషయంలో అన్ని పాలకవర్గ పార్టీల అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయి.
ReplyDeleteప్రవీణ్ గారు,
Deleteరాత్రంతా హాయిగా నిద్ర పొయ్యాను. పొద్దున్నే మంచి కాఫీ తాగుతూ.. పేపర్ చూశాను. చంద్రబాబు గూర్చి వార్త చదవంగాన్లే.. చాలా సంతోషంగా అనిపించింది.
అప్పటికింకా..'ఈ లీకు వెనుక రాజకీయం ఏమైయ్యుంటుంది?' అని ఆలోచించేంతగా బుర్ర ఏక్టివేట్ అవ్వలేదు. ఆ దశలో రాసిన రెండు ముక్కలే ఈ టపా.
ఇందు మూలముగా తెలియజేయునేదేమనగా.. 'ఉదయాన్నే మనసు ప్రశాంతంగా ఉంటుంది!' అని.
డాక్టరు గారు, ఒక చదువుకున్నవాడిగా మీరు ఇలాంటి పోస్టు వేయడం చాలా బాధాకరం. ఒక కార్పొరేట్ కాలేజీ విద్యార్థిగా చెబుతున్నాను - ప్రతివిద్యార్థి కూడా హైస్కూలు నుండి IIT టార్గెట్ చేసుకొని చదవాలి. ఆ చదువు ఎంత పనికివస్తునది అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడున్న కాంపిటీషన్‌లో IITలో ర్యాంకు తెచ్చుకున్నాడంటే అది ఆ విద్యార్థి పట్టుదలకు, క్రమశిక్షణకు తార్కాణం. అలాంటివారే భవిష్యత్తులో ఏ రంగంలో అయినా రాణించగలరు.
ReplyDeleteఅయినా EAMCET కోసం పిల్లల పైన ఒత్తిడి పెడితే తప్పేముంది? విద్యార్థి దశలో వాళ్ళకు ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు కాబట్టి భయపెట్టి అయినా చదివించాలి. ఇంటర్ వరకు ఓ నాలుగైదేళ్ళు బాగా చదువుకొని మెరిట్లో ర్యాంకులొస్తే ఆ తర్వాత జీవితం సాఫీగా సాగిపోతుంది కదా? నాకు అయితే అందులో తప్పు కనిపించడం లేదు, తల్లిదండ్రుల తపన కనిపిస్తోంది, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది.
అన్నట్టు మీ పిల్లలను కార్పొరేట్ కాలేజీలో ఎందుకు చేర్పించారు? ఒత్తిడిలేని గవర్నమెంటు కాలేజీలో చేర్పించవచ్చు కదా?
ఈ వ్యాఖ్య బహుశా వేరే టపాకు సంబందించింది అనుకుంటాను.
Deleteపిల్లలను భయపెట్టి చదివిస్తే చదువు అబ్బుతుందా? ఇంటరెస్టు లేని విషయాలను యాంత్రికంగా చదువుతే వాటిలోని కాన్సెప్టులు అర్ధం అవుతాయా? ఫార్ములాలు బట్టీ పట్టిన ప్రతి ఒక్కడూ ఇంజనీరు అవుతాడా? ఇలాంటి ప్రశ్నలు మీకు కొత్త కాదని నీ అనుమానం.
ఇవన్నీ పక్కకు పెట్టినా, తల్లితండ్రులకు తపన ఉన్నంతమాత్రాన సరిపోదు. చాలా మంది పెద్దలకు తమ పిల్లలు చదవాలని కోరుకుంటున్న సబ్జెక్టులపై అవగాహన ఉండదు. ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి కావాల్సిన లక్షణాలు పొందు పరుచుకోవాలంటే అవేంటో తెలియాలి. అవి తెలుసుకోకుండా ఎండమావులను వేటాడడం సమంజసం కాదు.
Most parents & "well-wishers" are not qualified to decide (or even make recommendations) for their children. The fact that they mean well is by itself irrelevant. I am sure you see similar instances yourself.
This is my recent article on reservations: http://4proletarianrevolution.mlmedia.net.in/cpi-cpm-29292
ReplyDeleteడాక్టర్ గారు,
ReplyDeleteఏమిటేమిటి శెబాష్ చంద్రబాబా.
ఏమిటి సార్ ఇంత దారుణం, నేరం ఘోరం.
ఎదేమైనా మీరీమద్య(లేకపొతే మొదటినుండిగాని) అంధ్రజ్యొతి పేపరు ఎక్కువగా చదువుతూ, అదే టివి ఎక్కువగా చూస్తూ, చంద్రబాబు గురించి ఎక్కువగా వింటూ, ఆయన చెసే కాపీకొట్టిన యాత్రలు అలోచిస్తూ,
ఇలాంటి "శెబాష్ చంద్రబాబు" లాంటివి రాస్తూ,
మీమీద బ్లాగర్లకు వున్న అభిమానాన్ని తగ్గిచుకుంటున్నారేమో అలోచించండి.
ఎందుకంటే చంద్రబాబు ఈరోజుల్లో నమ్మెవాడు ఎవరూ లేరు.పాపం మీలాంటి కొంతమంది( బహుశా మీలాంటి ఒకరో అరో మాత్రమే) తప్ప.
అయినా నా అనుమానం ప్రకారం మీరు పక్కా తెలుగుదేశం అటుకుంటా
ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు పక్క మీరుండడం చాలా దారుణం.
జి రమేష్ బాబు
గుంటూరు
రమేష్ బాబు గారు,
ReplyDeleteఒక మంచి నిద్ర.. ఒక మంచి ఉదయం.. ఒక మంచి కాఫీ.. ఒక మంచి చంద్రబాబు నాయుడు!
ఇంతకు మించి నేనే పాపమూ ఎరుగను.
ఈ సారి ఒక మంచి జగనంటూ రాస్తాన్లేండి!
అమ్మో అంత పనిచేయకండి డాక్టర్ గారూ,
Deleteమీరు మరీ చోద్యమండి. జగన్ అభిమానులకోసం, చంద్రబాబు అభిమానులకోసం అంత తపన అవసరమాండి? ఐనా మీరు అల్పసంతోషి అనేస్కొని ఇలా డిప్లమాటిక్ గా తప్పించుకుంటే ఎలా?
ఐనన్నూ నిజానికి ఈ రాజకీయనాయకులను చూసి ఊసరవెల్లి కూడా విస్తుపోతుంది. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడని మీరు అనుకున్నా రేప్పొద్దున దాన్ని ఖండించెయ్యగలడు కూడా. దానికయ్యే ఖర్చు ఒక ప్రెస్ మీట్, అంతే. ఐనా అధికారలాలసతో తన "మనసులో మాట" నే మనసులోనుండి తుడిచేసిన బాబు ఇంకా నమ్మదగినవాడు ఎంతమాత్రం కాడు అని నా అభిప్రాయం.
షర: నేను జగన్,బాబు అని తేడాలేకుండా అవకాశవాద రాజకీయనాయకులకీ సమదూరం పాటిస్తాను. అసలైన సామాజికన్యాయం అంటే ఇదే.
-ఆత్రేయ
(కలంపేరు కాదు -అసలు పేరే!)
రిజర్వేషన్ ఫలాలు మాదిగలకి అందకుండా మాలలు ఎగరేసుకు పోతున్నారు. కాబట్టి రిజర్వేషన్లలో వర్గీకరణ ఎంతైనా ముదావహం.
ReplyDeleteరమణ గారు ఇప్పుడు చెప్పండి బాబు తెలంగాణపై తన వైలరి స్పష్టం చేశారా ?
ReplyDeleteఅఖిల పక్షం ఏర్పాటు చేయమని లేఖ రాశారు కానీ తన వై ఖరి స్పష్టం చేయలేదు
మురళి గారు,
Deleteనాకున్న తెలివి చంద్రబాబుని అర్ధం చేసుకోడానికి సరిపోదు. బాబు లోపలి మనిషిని మీరు కాచి వడపోశారు. వేసుకోండి రెండు వీరతాళ్ళు!