"రమణ మామ! కాఫీ!" అంటూ వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బూ! ఒలింపిక్స్ లో మన పరిస్తితి పెద్దగా బాలేదు." దిగులుగా అన్నాను.
"ఆ పోనిద్దూ! ఈ వార్త చిన్నప్పట్నించి నాలుగేళ్ల కోసారి వినేదేగా! ఆ ఒలింపిక్స్ లో చాలా ఆటలు నాకు అర్ధం కావు! అర్ధం కాని ఆటల్లో మెడల్స్ గూర్చి చింతన ఏల?" అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! ఒలింపిక్స్ లో కొన్ని ఈవెంట్స్ నాకూ అర్ధం కావనుకో. అంత మాత్రానికే మెడల్స్ పట్టించుకోకపొతే ఎలా?" అన్నాను.
సుబ్బు చిన్నగా నవ్వి అన్నాడు.
"మన దేశానికి ఒలింపిక్స్ ఆటల గోల అంత అవసరం లేదేమో! అవన్నీ యూరోపియన్ల ఆటలు. వాళ్ళకి జనాలు తక్కువ. డబ్బులెక్కువ. ఆరడుగులుంటారు. బాగా తింటారు. స్టామినా ఎక్కువ. మనకి తిండే సమస్య. మనవాళ్ళు మాత్రం వారి ఆటల్ని.. బోల్డంత డబ్బు పోసి దిగుమతి చేసుకున్న వారి పరికరాల్తోనే నేర్చుకుంటూ.. వారితో పోటీ పడుతూ.. పతకాలు రాలేదని జనాలతో నాలుగేళ్ళకోసారి తిట్లు తింటూ ఉంటారు."
"దీన్నే 'అందని ద్రాక్ష పుల్లన' అంటారు నాయనా! ఒలింపిక్స్ కేవలం ఆటలు కాదు. ఒక గొప్ప స్పూర్తి."
"ఒప్పుకుంటున్నాను. కాకపోతే అది అమెరికా, యూరప్ ఖండాల స్పూర్తి మాత్రమే అంటాను. ఈ ఆటలు పుట్టింది గ్రీస్ దేశంలో. ఆ కాలంలో ఉన్న యూరోపియన్ ఆటల్ని క్రీడాంశాలుగా చేశారు. ప్రపంచంలో తర్వాత్తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల్ని గమనిస్తూ.. అన్ని ఖండాల్లో, అన్ని దేశాల ప్రజల ఆసక్తులని పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు మార్పులు చెయ్యవలసి ఉంది."
ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"కానీ అలా మార్పుచేర్పులు చెయ్యడం జరుగుతుందా? లేదనుకుంటున్నాను. లేకపోతే మన దేశీయ ఆటలు ఈ ఒలింపిక్ స్పూర్తిలో ఎందుకు చోటు చేసుకోవు? ఏం? ఇన్ని మెడల్సే ఉండాలని మెడల్స్ నెత్తిన ఏవన్నా మేకు దించారా? మన కేరళ పడవలు, కబాడీ, ఖోఖోలు ఒలంపిక్స్ లో ఎందుకు కనబడవు?"
"ఆ విషయాల్ని చూడాల్సింది మన క్రీడా సంఘాలు." అన్నాను.
"సురేష్ కల్మాడీ లాంటివాళ్ళు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటేనే అర్ధమౌతుంది.. అక్కడుండే మిగతావాళ్ళు ఎంత దరిద్రులో! ఒక్కో దేశానికి ఒక్కో బలం, బలహీనతా ఉంటాయి. అవి పరిగణనలోకి తీసుకుంటూ ఆటల్లో మార్పుచేర్పులు జరుగుతుండాలి. నా వాదనకి ఋజువు లాంగ్ డిస్టెన్స్ రన్ లో కెన్యా విజయం. ఈ క్రీడాంశం ఎప్పట్నించో ఉన్నా.. మెడల్ కోసం పేద దేశాలు కూడా పోటీ పడగల అవకాశం ఉంది. పరిగెత్తే క్రీడాంశాల్లో గొప్ప ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరం లేదు. పరిగెత్తడం ఆఫ్రికన్లకి అలవాటే. అందుకనే కెన్యన్లు పతకాలు కొట్టేస్తున్నారు."
"ఇంతకీ నువ్వు చెప్పేదేంటి సుబ్బూ?" విసుగ్గా అన్నాను.
"రమణ మామా! నే చెప్పేది శ్రద్దగా విను. కొద్దిసేపు ఒలింపిక్స్ ఆటల పోటీల్ని పక్కన బెట్టు. ఇప్పుడు ఒలింపిక్స్ వంటల పోటీల్ని ఊహించుకో. ఈ వంటల పోటీలకి పోటీ అంశాలని ఎలా నిర్ణయిస్తాం? అన్ని దేశాలకి రిప్రజంటేషన్ వహిస్తూ కొన్ని వంటకాలని సెలక్ట్ చేసుకోవాలి. అమెరికా వాడి పిజాతో పాటు మన గుంటూరువాడి గోంగూర పచ్చడి తయారీ కూడా పోటీలో అంశంగా ఉండాలి. అంటే.. అన్ని వంటలకి సమాన అవకాశాలు ఇవ్వబడాలి. అప్పుడే ఈ ఈవెంట్ అంతర్జాతీయ వంటలకి స్పూర్తిగా నిలబడుతుంది."
ఇంతలో ఇంటర్ కమ్ మోగింది. ఒక పేషంట్ గూర్చి నర్స్ అడిగిన సమాచారం చెప్పాను.
సుబ్బు చెప్పసాగాడు.
"అంతర్జాతీయ వంటల స్పూర్తి ప్రకారం అమెరికావాడు మనతో మన గోంగూర పచ్చడి చెయ్యడానికి పోటీ చెయ్యాలి. వాడు అలా చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే వాడి దృష్టిలో గోంగూర పచ్చడి అసలు తినే పదార్ధమే కాదు! కానీ మనం మాత్రం వాడి పిజాలు, బర్గర్లని.. వాడి కత్తులు, వాడి ఓవెన్లూ వాడుతూ.. వాడితోనే పోటీ పడాలి. అప్పుడు వాడు మనల్ని అలవోకగా ఓడించి మెడల్స్ కొట్టేస్తాడు. ఈ రకమైన అసమాన పోటీ విధానాన్ని ఏ విధంగా అంతర్జాతీయ వంటలు అనరో.. ఒలింపిక్స్ కూడా అంతే."
"అంతేనంటావా?" సాలోచనగా అన్నాను.
"అంతే! ఒలింపిక్ ఆటల పోటీలకి ప్రిపేర్ అవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకు వాడే క్రీడాపరికరాలు చాలా ఖరీదైనవి. కనీస శిక్షణక్కూడా లక్షల్లో ఖర్చవుతుంది. అందుకే మన జనాభాలో కనీసం ఒక శాతం కూడా ఒలింపిక్స్ క్రీడాంశాల్లో శిక్షణ తీసుకోలేరు. జనాభా ఎక్కువ ఉండి, వనరులు తక్కువున్న మన పేద దేశాలకి ఏ మాత్రం అనుకూలం కానివి ఈ ఒలింపిక్స్." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు.
జేబులోంచి క్రేన్ వక్క పొడి ఐదు రూపాయల పేకెట్ తీసి ఒక పలుకు నోట్లో వేసుకుని చప్పరిస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"ఉదాహరణకి ఈత పోటీలు. ఇందులో డజన్ల కొద్దీ పతకాలున్నాయి. వాళ్ళ దేశాల్లో స్కూళ్ళల్లో ఈత కొలనులు ఉంటాయి. మనకి రాష్ట్ర స్తాయిలో కూడా ఆ సౌకర్యాలు ఉండవు. ఈ ఒలింపిక్స్ పేద దేశాల ముందు ధనిక దేశాలు ఆడే ఒక అహంకార క్రీడ. ఇంతకు ముందు ఆధిపత్యం కోసం అమెరికా, రష్యాలు పోటీ పడేవి. ఇప్పుడు చైనా, అమెరికాలు పోటీ పడుతున్నయ్. అందుకోసం చైనాలో పిల్లల్ని చపాతి పిండిలా పిసికేస్తున్నారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోటీ పడాలనే చైనా ఆబ్సెషన్ ఒక రోగ స్థాయికి చేరుకుంది. ఒక రకంగా మనమే చాలా నయం. జెండా ఊపేసి, క్రీడా స్పూర్తిని ప్రదర్శించేసి వచ్చేస్తాం. అంతకన్నా చేయగలిగేది ఏంలేదు గనక!" అన్నాడు సుబ్బు.
"నిజమేనుకో! కానీ ఇంతమంది జనాభాకి ఒక్క మెడల్ కూడా రాకపోడం అవమానం కదూ!" అన్నాను.
"కానే కాదు. జనాభా లెక్కే ప్రాతిపదికైతే మన గుంటూరు జనాభా యూరపులో కొన్ని దేశాల కన్నా ఎక్కువ. ఎంతమంది జనం ఉన్నారన్నది ప్రాతిపదిక కాదు. ఎన్ని ఈత కొలనులు, ఆటస్థలాలు ఉన్నాయన్నది మాత్రమే ప్రధానం. ఇక్కడ మనకి ఆట స్థలాలు, మైదానాలు సంగతి దేవుడెరుగు.. కనీసం నడవడానికి కూడా జాగా లేదు. చీమల పుట్టల్లా ఒకటే జనం. కరెంటు కటకట. తాగడానికి నీరు, పీల్చడానికి గాలి లేకుండా ఇబ్బందులు పడుతుంటే నీకు మెడల్స్ కావాలా మిత్రమా?"
"మరి మన దేశానికి మెడల్స్ వచ్చే అవకాశమే లేదా?" నీరసంగా అన్నాను.
"లేకేం! మనకి మెడల్స్ రావాలంటే ఒలింపిక్స్ ఈవెంట్స్ మార్చాలి. అమెరికా, యూరపుల పిల్లలకి మన పిల్లలతో చదువుల పోటీ పెట్టాలి. మన పిల్లల్ని పొద్దున్నే దొంగల బండిలా స్కూల్ బస్ వచ్చి ఎత్తుకుపోతుంది. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువు రోట్లో పడేసి.. పరీక్షల రోకటితో దంచుతారు. ఇలా పిల్లల్ని నలిపేసే కార్యక్రమానికి కొన్ని మెడల్స్ పెడదాం. అప్పుడవన్నీ మనకే. కాకపోతే చైనావాడి గూర్చి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల హక్కుల్ని అణిచేసే విషయంలో వాడు మనకన్నా నీచుడు!" అంటూ నవ్వాడు సుబ్బు.
"సుబ్బు! చదువుల పోటీ ఆటల పోటీ ఎలా అవుతుందోయ్?" అన్నాను.
"అవును గదా! సరే! సైక్లింగ్ పోటీలో మనదే మెడల్. ఐతే పోటీ స్టేడియంలో కాదు. మన రోడ్ల మీద.. మన సైకిల్ తో.. మన ట్రాఫిక్ లో తొక్కాలి. ఈ గతుకుల రోడ్ల మీద.. ఈ బస్సులు, ఆటోల మధ్య.. మన వాళ్ళు తప్ప అన్ని దేశాల సైకిల్ వీరులు సిటీ బస్సుల క్రింద పడి చచ్చూరుకుంటారు. అంచేత ఈ కేటగిరీలో భవిష్యత్తులో మనతో ఏ దేశం వాడు పోటీక్కూడా రాడు." అన్నాడు సుబ్బు.
"ఏం సుబ్బూ! నీకు మన దేశం మరీ లోకువైనట్లుందే." చికాగ్గా అన్నాను.
"కూల్ మామా కూల్! మెడల్స్ కావాలంటావ్! ఎగతాళి చేస్తున్నానంటావ్! త్వరలోనే మనం కూడా సూపర్ పవర్ కాబోతున్నమని లోకం కోడై కూస్తుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మన లగడపాటి రాజగోపాల్ వంటి యంగ్ డైనమిక్ లీడర్ల పాలనలోకి వస్తుంది. అప్పుడీ ఈవెంట్లని పెట్టించడం పెద్ద కష్టం కాదు. అంతగా అయితే మన తరఫున లాబీయింగ్ కి మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా ఉన్నాడుగా. ఒలింపిక్ ఈవెంట్లకీ, ఒక MNC రిటైల్ మార్కెట్ పర్మిషన్ కి కనెక్షన్ పెట్టేస్తాడు. అప్పుడు ఇంచక్కా మన గోళీలు, బొంగరాలాటల్ని కూడా క్రీడాంశాలుగా చొప్పించేద్దాం." అంటూ లేచాడు సుబ్బు.
"అప్పటిదాకా?"
"ఈ ఒలంపిక్స్ ని ఒక రియాలిటీ షోగా చూడు. రియాలిటీ షోల్లో రియాలిటీ ఉంటుందా? అయినా చూడట్లేదూ! ఒక పూరీ జగన్నాథ్ తెలుగు సినిమాగా చూడు. పూరి సినిమాల్లో పాత్రలు తెలుగు భాషని మాట్లాతాయే గానీ.. అవి తెలుగు సినిమాలు కాదుగా. అయినా టైమ్ పాస్ కోసం చూడట్లేదూ! ప్రస్తుతానికి మనకి ఒలంపిక్స్ కూడా అంతే!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.
Nice redicule
ReplyDeleteమన హాకీ అని చెప్పుకుంటున్న క్రీడ ని కూడా వాళ్ళు నేర్చేసుకుని మనల్నే తుక్కురేలకొడుతున్నారు. రేపు మనవి అని ఇంకో నాలుగు జొప్పించిన పరిస్థితి ఇంతే అవుతుందేమో.. టెన్నిస్, బ్యాడ్మింటెన్, రన్నింగ్ లాంటివి ఏమీ ఖరీదైన క్రీడలు కావు. అనునిత్యం అంతర్యుద్దం తో నాశనం అయిన సెర్భియా లాంటి దేశాలనించి జాకోవిచ్ లాంటి క్రీడాకారులు గ్రాండ్‌శ్లాంలు గెలిస్తున్నారు కదా.. బహుశా మనదేశం లో క్రీడలకు కుటుంబాలలోనూ, సమాజంలోనూ అంత ప్రాధాన్యత, ప్రోత్సాహం లేకపోవటమే ఈ పరిస్థితికి కారణం కావచ్చు. ఉన్నట్లుండి ఏదైనా పత్రికలో వార్త వచ్చే వరకు ఒక ఆటగాడ్ని పని పాట లేకుండా పొద్దెళ్ళబుచ్చుతున్న (దారితప్పిన) కుర్రాడిగానే మన సమాజం చూస్తుంది.
ReplyDeleteBadminton & Tennis too are costlier.
Deleteoh..is it?.. I am not aware of it.. How much is the annual investment for the equipment and other resources like courts/club fee etc..? (exclude the cost of training)
Deleteఇది నిజమే. ఢిల్లీ లో జరిగిన ఏషియన్ గేంస్ లో మొదటి సారి కబడ్డీని ప్రవేశ పెడితే ఆ గెంస్ లోనే ఇంకో దేశం వాళ్ళెవరో భారత్‌ని ఓడించారు.
Deleteడాక్టర్ గారు,
ReplyDeleteబాగుంది సార్
ఏదేమైనా మనకు పధకాలు తక్కువే సార్.
సార్ ఏదేమైనా ఏవిషయంలోనైనా ప్రపంచం విజేతనే కదా చూసేది.
ఇంతకుముందు రాసిన "నాది ఒక పెరేనా: శీర్షిక మీ మార్కు స్టైలుతో అదిరింది సార్.
జి రమేష్ బాబు
గుంటూరు
"పిల్లల హక్కుల్ని అణిచేసే విషయంలో వాడు మనకన్నా నీచుడు"
ReplyDeleteSuper comment!
రమణ గారు,
ReplyDeleteమాటల్లేవు. ఒక వారం నుండి ఈ ఈవెంట్స్ ని తిలకిస్తూ వస్తున్న ప్రశ్న లన్నింటికి చక్కని సమాధానాలు చెప్పారు.
ipputi daaka, manaki medals enduku ravadam ledaa ani badhapadevaanni, ippudu assalu badhapadatam ledu mee post chadivaaka.
ReplyDeleteThank you
:venkat
ఆటలని వృత్తి గా పెట్టుకోవటం ఈ దేశం లో (ప్రపంచం లో కూడానేమో) చాలా రిస్క్ తో కూడుకొన్న పని . అసలే డబ్బులుండవు, ఆపై ఇన్-ఫ్రాస్ట్రక్చర్ తక్కువ. ఆటలు వృత్తికా ఉన్న వెయ్యిమందిలో ఏ ఒక్కడి కో జీవితం ఆర్ధిక ఇబ్బందులులేకుండా సాగుతుంది (unless he is originally rich). అప్పుడప్పుడూ పతకాలు వచ్చినా, తరువాత ఆర్ధిక ఇబ్బందులు పడే అనేక మంది ఆటగాళ్ళ గురించి పత్రికలలో చదువుతూనే ఉంటాం.
ReplyDeleteఇన్-ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలు తర్ఫీదూ ఉన్నపుడు మన వాళ్ళు కూడ అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదగటం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణ కి హైదరాబాదు లో బాడ్మింటన్ అకాడమీ ఉంది, దానిన్ నుంచీ వచ్చిన వారు అనేక అంతరజాతీయ పోటీల లో సెమీ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ స్థాయి కి వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టటం అసంభవం ఏమీ కాదు. కశ్యప్, సైనా లాంటి వారు ఈ సారికి మిస్ అయినా, తరువాత అయినా మెడల్స్ సాధిస్తారు. అదే ఈ అకాడమీ నే లేక పోతే, మెడల్స్ ఆశించటం కూడా అత్యాశే అవుతుంది.
ఇక పోతే వాళ్ళ ఆటలూ మన ఆటలూ అనేది కొంత వరకూ నిజమైనా, మన ఆటలల్లో కూడా వాళ్ళే మెడల్స్ ఎగరేసుకు పోతున్నారనేదీ నిజమే! కబడీ ని అలింపిక్స్ లో పెడితే ఓ నాలుగైదు సార్లు మనకి మెడల్ దక్కవచ్చేమో, తరువ్త దాని లోనూ హుష్ కాకే!
చెస్ ఒలింపిక్స్ లో ఎందుకు లేదు చెప్మా! ఉంటే మనకు ఓ రెండో మూడో మెడల్స్ దక్కేవి కదా!
Asiad medallist Santhi working in brick kiln
Deletehttp://www.rediff.com/sports/report/london-olympics-2012-asiad-medallist-santhi-working-in-brick-kiln/20120724.htm
అవును. నా చిన్నప్పుడు మా ఊళ్ళో మంచి క్రికెట్ అడుతూ.. మాతో చప్పట్లు కొట్టించుకున్న జిల్లా స్థాయి క్రికెటర్లు.. ఇప్పుడు అతి చిన్న స్థాయిలో జీవిస్తున్నారు (నా డ్రీమ్ క్రికెటర్ ప్రస్తుతం ఒక కిళ్ళీ బడ్డి నిర్వహిస్తున్నాడు). క్రికెట్ పిచ్చితో.. కొన్ని వేల మంది ఎకడెమిక్ కెరీర్ని బ్రష్టు పట్టించిన మా ఊరు.. MSK ప్రసాద్ అనబడే జాతీయ స్థాయి క్రికెటర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగింది.
Deleteక్రీడల్ని వృత్తిగా స్వీకరించడం లాటరీ టికెట్టు లాంటిది. ఆ క్రీడలో గొప్పగా రాణించకపోయినా (ఒక స్థాయిని మించి ముందుకెళ్ళలేకపోతే).. జీవనానికి ఇబ్బంది లేకుండా.. ఏదోక గౌరవప్రదమైన వృత్తిని ఎంచుకునే ఆప్షన్ ఉండాలి. ప్రస్తుతం మనకి ఆ పరిస్థితి లేదు. అందుకే మధ్య తరగతి వారు తమ పిల్లల్ని క్రీడలకి దూరంగా ఉంచుతున్నారు (నాతో సహా).
మన ఆటల్లో మనకే మెడల్స్ రావాలని అనుకోవట్లేదు. మన కబాడ్డీ ఆటని బాగా ప్రాక్టీస్ చేసి చైనా, అమెరికా వాళ్ళు మెడల్స్ కొట్టేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. సంతోషమే.
అంతే గానీ.. ఒలింపిక్స్ పేరిట సాగుతున్న ఈ వన్ వే ట్రాఫిక్కి మాత్రం వ్యతిరేకిని.
మన ఆటలు.. రమణ గారు, ఈ మనవి అని చెప్పే ఆటలు ఒక పది ఉదహరించడి.. ఇక్కడ మీ సుబ్బు అనాలసిస్ అంతా అసలు విషయ పరిఙ్ఞానం తో కాకుండా, విభిన్నంగా చెప్పాలి అనే ఉత్సుకత తో చేసినట్లనిపిస్తుంది.
Deleteఉదాహరణకు, మన 2011 లో నిర్వహించిన నేషనల్ గేంస్ లో ఉన్న 35 విభాగాల్లో 23 ఇవాళ్టి ఒలింపిక్స్ లో ఉన్నాయి. ఇంకా ఏదో కబడ్డి లేదు, చెస్ లేదు అని మనం వంకలు వెతుకుతున్నట్లు ఉంది.. ఇప్పుటే చెస్ గేం వికీ లో చదివితే ఆ క్రీడ ఒలింపిక్స్ లో లేకపోవటం వల్ల పతకం నష్టపోయింది ఎక్కువగా so called ధనిక దేశాలే అని తెలుస్తుంది. country wise గా చూసుకుంటే no. of grand masters లిస్ట్ లో మనది 23 వ స్థానం. కాకుంటే మిగతా క్రీడలకన్నా చెస్ ఉంటే మనకు పతకం వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ (అదీ ఇటీవలి కాలంలో)
http://www.nationmaster.com/graph/spo_che_gra-sports-chess-grandmasters
http://en.wikipedia.org/wiki/Chess
ఇంక కబడ్డి ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న క్రీడ. దీనికి అంతర్జాతీయ బాడీ లాంటివి కూడా లేవనుకుంటా.. అప్పుడే దీన్ని ఒలింపిక్స్ లో చేర్చాలనటం దురాశే అవుతుంది. అయితే 2020 ఒలింపిక్స్ లో ఐనా చేర్చాలి అని బ్రిటన్, జర్మని వంటి ఐరొపా దేశాలు కూడా కోరుతున్నాయి. ఇందులో అయినా మన ఆధిపత్యాన్ని అప్పటిదాక నిలుపుకుందామని ఆశిద్దాం.
ఆదరణ, ప్రేక్షకుల మద్దతు లేదని భావిస్తే గోల్ఫ్, రగ్బీ, పోలో, బేస్‌బాల్ వాంటి *ధనిక* దేశాల క్రీడలను కూడా ఒలింపిక్ కమిటీ తొలగించిన సంధర్బాలు ఉన్నాయి.
PS: ఎందుకైనా మంచిది.. మీరు ఒకసారి మీ సుబ్బు కి సైకోఅనాలసిస్ చెయ్యండి.. :)
సత్య గారు,
Deleteఅవును. విభిన్నంగా ఉండాలనే రాశాను. మొన్న శుక్రవారం రాత్రి ఒక స్నేహితుడు మనకి మెడల్స్ రానందుకు బోల్డు బాధ పడ్డాడు. ఫోన్లోనే ఓదార్చాను.
నాకు విజయం కన్నా అపజయాన్ని విశ్లేషించటం ఇష్టం. పరీక్షల్లో విజయాలు సాధించలేనివారు కొన్ని కారణాలు చూపిస్తారు. అందులో కొన్ని పాయింట్లు ఆలోచించదగినివి.
'మనకి మెడల్స్ ఎందుకు రావట్లేదు? కారణాలేమై ఉండొచ్చు?' అన్న ఆలోచనతో ఆ రాత్రి రెండు దాకా కూర్చుని ఈ టపా రాశాను (నాతో ఈ కూలి పని చేయిస్తున్న ఆ స్నేహితుణ్ణి తిట్టుకుంటూ).
నాకు ఈ ఒలింపిక్స్ గూర్చి అంతగా విషయ పరిజ్ఞానం లేదు. కనీసం వికిపీడియాని కూడా రిఫర్ చెయ్యలేదు. నా టపా ఒక ఆలోచన. అంతే!
I beg to differ in some of the issues Subbu discussed. Even we (India) is slowly but surely improving in getting on the board (we didn't even make it to the boards for years) whether it be their own effort or some governmental help. Well Saina got Bronze as I type.
ReplyDeleteKeep going team India.
వెనకటికి ఒకాయన నేను కిటికీ ఊచల నుండి బాల్ బయటకు వేసే
ReplyDeleteఆట ఆడుతున్నాను.బాల్ ఎప్పటికి ఊచలు తగిలి లోపలకు పడుతుంది.
ఎప్పటికి గెలుస్తానో ఏమో అన్నాడంట.
స్నేహితుడు అయితే ఆట మార్చేసుకోరా...లోపలి పడేవి లెక్క వేసుకో
అన్నాడంట...అలా ఉన్నాయి మీ సుబ్బు కబుర్లు...ఎంజాయ్ చేసాను.
కేక! Change the perspective!!
Deleteఆటకు పరమార్ధం శారీరక వ్యాయమం ,మానసిక ఉల్లాసం . అదీ సమయం,ధనం వృధాకాకూడదు . అమ్దుకనే మనదేశంలో సాంప్రదాయ సిద్దక్రీడలు పైసాఖర్చులేకుండా ఎంతో సరదాగా ఆడుకునేవీ అయ్యుంటాయి . మీవాడన్నట్లు ఈ ఐరోపా సంస్కృతి మాత్రమే నాగరికత ,నైపుణ్యం అనుకునే బానిసభావజాలంలో కూరుకుని పోయాము కనుక మన ఆటలు పోయాయి వాల్ల ఆటలేవీ మనకు వంటబట్టవు . చైనా వాల్ల జిమ్నాస్టిక్స్ కు మనవీధులలో దొమ్మరిఆట పిల్లలు ఏమాత్రం తీసిపోరు . ఏంచెస్తాం పేదదేశం కనుక మనవాల్ల ఆటలకు ఆదరణరాదు . అదే ఏ రంగునీళ్ళ కంపెనీవాడో తలచుకుంటే వాడీ ఆట మన జాతీయక్రీడలైపోయి అందులో మునిగి కాలాన్ని,కుట్రలను కూడా గమనించలేని మానసిక రుగ్మతలో మునిగి పోతాం . వాస్తవం కాదంటారా ?
ReplyDeleteఒలింపిక్స్ లో క్రీడలన్నీ పైసా ఖర్చు లేకుండా సరదాగా ఆడుకోగలిగినవే.
Deleteఅదిసరే 'మనవీదుల్లో దొమ్మరి ఆట' మన పిల్లలు ఆడితే ఒప్పుకుంటామా ?
మనమే ఆదరించని ఆటలకి మీరు చెప్పిన వాస్తవాలు (కాలాన్ని,కుట్రలను కూడా గమనించలేని మానసిక రుగ్మతలో మునిగి పోతాం etc.) హాస్యభరితం గా ఉన్నాయి. కాదంటారా?
@Anon, nice question..
Deleteదుర్గేశ్వర గారు, మనదే గొప్ప, పరాయిది అంతా నీచం/తక్కువ అనే భావన కూడా ఒక మానసిక రుగ్మతే. మంచి/గొప్ప అనేది ఏ ప్రాంతానికో, ప్రజలకో, దేశానికో పేటెంట్ చెయ్యబడలేదు. పసితనం నుండి ఏళ్ళతరబడి సాధించిన కఠోర శ్రమ ని చైనా వాడనో, ఐరోపా వాడనే కారణం చేత వాళ్ళ ఆటని, నైపుణ్యాన్ని చులకనగా తీసిపారెయ్యటం తగదు.
బాగా చెప్పారు సార్...
ReplyDeleteఇది చదవగానే నాకు రంగనాయకమ్మ గారి మానవ సమాజం పుస్తకంలో 'బంగారు పతకం తేస్తే ఇండియానే రాసేసేవారే!లోని ఈ వాక్యాలు గుర్తొచ్చాయి.
"దేశానికి ప్రతిష్ఠ అనేది, ఒక మనిషి బరువులెత్తడం వల్లో, పరుగులెత్తడం వల్లో రాదు. ఆ దేశంలో జనాభా అంతా సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు ఏర్పడితే వస్తుంది. దేశంలో పేదరికం, నేరాలూ, కొట్లాటలూ, హత్యలూ, ఆత్మహత్యలూ లేకపోతేనూ వస్తుంది."
-బ్రహ్మం
బ్రహ్మం గారు,
Deleteమీరు ఉదహరించిన వ్యాసం నేను చదివాను. కరణం మల్లేశ్వరిని మనం ఆకాశానికెత్తేస్తున్న సందర్భంలో రంగనాయకమ్మ ఆ వ్యాసం రాశారు. వ్యాసంలో చాలా అంశాలతో నేనూ ఏకీభవిస్తున్నాను.
డాక్టరి గారి తరపున సుబ్బు గారికి,
ReplyDeleteరమణ గారి దగ్గర అప్పనంగా కాఫీ లాగిస్తూ మీరు మాలాంటి వాళ్ళకి చాలా క్రీడోదయం చేస్తున్నారు. మెచ్చుకోదగ్గ విషయం. రమణ గారి కాఫీ సంగతి మాకు తెలీదు కానీ, మీ ఒలింపిక్ వాదన మాత్రం చప్పగా వుంది.
మనకి క్రీడా సౌకర్యాలు లేవన్నారు. ప్రపంచంలో అత్యంత డబ్బు బలిసిన స్పోర్టింగ్ బాడీ ఎక్కడుందో తెలుసా? అక్షరాలా పేద దేశమయిన ఇండియాలో ఉంది. మాకనుమానం ఉంటే శరద్ పవార్ గారికి ఒక్క ఫోన్ కాల్ కొట్టండి. ఇండియన్ క్రికెట్ బోర్డ్ ఈజ్ ద రిచ్చెస్ట్ స్పోర్టింగ్ బాడీ యిన్ ద వర్ల్డ్. దాని వల్ల క్రికెట్టుకీ ఏవీ ఒరగదు. మిగతా క్రీడలకీ ఏవీ కాదు. మన టెండూల్కర్లూ, మిగతా ఆటగాళ్ళూ వాళ్ళ పిల్లలకి ముప్పైలొచ్చే వరకూ ఆడుతూనే వుంటారు. ఎందుకంటే వారికి క్రీడలంటే అభిమానం. పేషన్. ఏటా ఏడ్సూ, ఇంటర్వ్యూల పేరు చెప్పి క్షణానికో కోటి వెనకేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీకు తెలియవని అనుకోను.
మనకి సౌకర్యాల సమస్య కాదు. డబ్బు తెట్టంతా ఒకే మూలకి చేరుతోంది. చాలా కాలం అంటే 1992లో విషయం. మద్రాసులో ( ఇప్పుడు చెన్నై లెండి ) అడయార్లో ఒక టెన్నిస్ క్లబ్ ఉంది. అందులో కోర్టు చదునే చేసే ఒక కుర్రాడుండేవాడు. వాడు ఎప్పుడైనా కోర్టు ఖాళీ ఉన్న సమయంలో వచ్చి ఆడేవాడు. అలాంటి వాణ్ణి ఎవరైనా గుర్తించి ప్రోత్సహిస్తే వాడీపాటికి మనకి టెన్నిస్లో సింగిల్స్ లో కనీసం నాలుగైదు గ్రాండ్స్లామ్స్ నెగ్గిండువాడు. వాడు కొట్టే షాట్లకి రాకెట్ కాకుండా శరీరంలో ఎక్కడైనా తగిలితే చిల్లు పడాల్సిందే! అలాంటి వాడికి అవకాశం లేదు. మన వ్యవస్థ అవకాశం కల్పించదు. వాడికున్న ఏకైక బ్రతుకు వైకల్యం, బీదరికం. వాణ్ణి చూసి మెచ్చుకున్నా, ఆ క్లబ్బుకొచ్చే ఏ డబ్బున్న వాడూ వాణ్ణి పైకి తీసుకు రావడానికి ప్రయత్నించడు. ఇది మన వ్యవస్థకి పట్టిన చీడ.
ఇహ మిగతా దేశాల్లో జనభా తక్కువవడం వల్ల సౌకర్యాలు ఎక్కువవ్వ లేదు. ఏదైనా చెయ్యడానికి డబ్బు సమస్య కాదు. సంకల్ప లోపమే పెద్ద దోషం. ఫాక్టరీ ముడిసరుకులా మన ముందు తరాలని చదువుల పోటీకి తయారుచేస్తున్నాం. ఎందుకంటే అదొక్కటే బ్రతకడానికి టిక్కట్టు. లేదంటే జీవితమంతా ఇక్కట్లే! వందకి తొంభై తెచ్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. దాంతో కాస్త ఊపిరి తీసుకోవచ్చు. లేదంటే, నాలాగా ఏ పరాయి దేశం పంచనో చేరి "మేరా భారత్ మహాన్" పాట పాడుకుంటూ గడిపేయచ్చు.
దేనిపైనైనా ఎవరికైనా ఆసక్తి పెరగాలంటే దానిక్కావల్సింది అవకాశం, ప్రోత్సాహం. బీడు భూములో మొక్కలు నాటలాని ఎవరూ ప్రయత్నించరు. కానీ కాస్త నీరందిస్తే నూటికొకరయినా ప్రయత్నించచ్చు. ఆటల్లో రాణించిన వాళ్ళకి మంచి మంచి కాలేజీల్లో స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించ వచ్చు. లేదా మన ఇండియన్ క్రికెట్ బోర్డు వాళ్ళు నాలుగు మెతుకులు విసిరి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ప్రోత్సహించవచ్చు. ఇలాంటి "చ్చు"లు ఎన్నైనా ఉన్నాయి.ఇవేవీ జరగవు. ఎవరికీ ఏవీ పట్టదు. నాలుగేళ్ళ కోసారి జరిగే ఒలెంపిక్స్ క్రీడా జాతర గురించి మనం చక్కగా టీవీ ముందు చతికలబడి ప్రపంచ దేశాల్నీ, వ్యవస్థల్నీ ఏకి పారేయచ్చు. లేదంటే మీరన్నట్లు గోంగూర పచ్చడీ, ఆవకాయ సాంబారూ ఈ క్రీడా జాతర్లో లేవని వాపోవచ్చు. కొన్నేసి వందల కోట్లు అవినీతి క్రీడలో చేతులు మారుతున్నప్పుడు కళ్ళప్పగించి చూస్తూ వుండే వ్యవస్థ మనది.
సుబ్బు గారూ, ఒక్కసారి పేపరు చూడండి. అంతెందుకు? మనందరికీ ఇష్టమయిన క్రికెట్ తీసుకోండి. ఈ ఏడాది - ధోనీ సంపాదన 26 మిలియన్లట. టెండూల్కర్ వారి సంపాదనయితే చెప్పనవసరం లేదు. ఆయన ఇప్పుడిప్పుడే ఈ సంపాదన నుండి రిటైర్ కారట. పైగా రాజ్య సభ సభ్యత్వం పొంది క్రీడలకి సేవ చేస్తారట. ఊపిరి సలపని ఆసేవలో ఆయన ఒక్కసారే పార్లమెంటు మొహం చూస్తారు. అది ప్రమాణ స్వీకారోత్సం చేసి సంతకం పెట్టాలి కాబట్టి. ఆయనకి అందుబాటులో పవార్ ఉంటారు. పవరుంటుంది. కాబట్టి క్రికెట్ సేవలో తలమునకలు కావచ్చు. వీళ్ళందరూ ఒకరకంగా వ్యవస్థని క్రీడల పేరు చెప్పి దోచుకుంటున్నవారే. పన్నెండు మంది ఆడే ఆటలో ఒక స్థానంలో ఒకాయన పాతుకుపోతాడు. వేరే వాళ్ళకి అవకాశం రానీయరు.
ఎందుకంటే సుబ్బు గారికి కాఫీ తాగడం పేషన్లా వాళ్ళకి క్రికెట్ పేషన్. రాజకీయనాయకులకి దేశ సేవ పేషన్! యాక్టర్లకి నటన పేషన్. డాక్టర్లకి వైద్యం పేషన్. వ్యాపారవేత్తలకి బిజినస్ పేషన్! విద్యావేత్తలకి చదువు పేషన్. పేపర్ల వాళ్ళకి జర్నలిజం పేషన్. బ్రతకడం దుర్భరం అయిన వాడికి నాలుగు మెతుకులే పేషన్! అదే చచ్చే వరకూ మిషన్!
సుబ్బు గారూ - కాఫీ పక్కన పెట్టి వ్యవస్థని ఒక్కసారి చప్పరించండి. అంత చేదే.
-బ్రహ్మానందం గొర్తి
మొదటి మూడు పేరాల వరకు బాగానే సాగిన మీ విమర్శ నాల్గవ పేరా లో గాడి తప్పినట్లనిపించింది. ధోనీ సంపాదనలో అధికశాతం (>90%)స్పాన్సరర్లు, టీం యాజమాన్యాల ద్వారా వచ్చిందే గానీ ప్రజల సొమ్మునేమి ప్రభుత్వం దోచిపెట్టట్లేదు. దాన్ని వ్యవస్థ దోపిడీ అని మీరెలా ఫీలయ్యారో అస్సలు అర్ధం కావట్లేదు. ఆ స్థానానికి వాళ్ళేమి రాత్రికి రాత్రి అప్పనంగా వచ్చేసి స్థిరపడిపోలేదు. ధోని ఇప్పటికీ బ్యాటింగ్ టాప్ 10 లో కొనసాగుతున్నాడు. అలానే సంవత్సరాలపాటు అత్యుత్తమ యావరేజ్ తో ఆట లో కొనసాగటం అందరికి సాధ్యమయితే సచిన్ ఇన్ని ప్రశంసలు అందుకునేవాడే కాదు.
Deleteపాతుకుపోవటమేంటండి? అదేమి ప్రభుత్వోద్యోగం కాదు.. ఒక్కసారి తెచ్చుకొని హమ్మయ్య అని రిలాక్స్ అవ్వటానికి. ఎవ్వరి స్థానం పదిలం కాదు. అజార్, గవాస్కర్, ద్రావిడ్, కుంaబ్లే, గంగూలి వంటి మహామహుల్నే జట్టుకి పనికిరారు అనుకునప్పుడు పక్కనపడేసారు.
మీకు క్రికెట్ అంటే నచ్చకపోవచ్చు. కాని అందులోని క్రీడాకారుల శ్రమ ని తక్కువగా అంచనా వెయ్యటం, వారి సంపాదన ని గాలివాటం గానో, వ్యవస్థలని అడ్డుపెట్టుకుని దోచుకునే దోపిడి దారులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచటం మీ విమర్శ స్థాయిని తగ్గిస్తుంది.
మీ వ్యాఖ్య లో మిగిలిన క్రీడలు కూడా క్రికెట్ లా ఆదరణ పొంది, ఆ క్రీడాకారులకు కూడా క్రికెటర్ల లాగా రాబడి ఉండాలి అనే స్పూర్తి కన్నా, క్రికెటర్లు కూడా మిగిలిన క్రీడాకారుల్లా చంకనాకిపోవాలి అనే దుగ్ద కనిపిస్తుంది.
Deleteబ్రహ్మానందం గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు.
Subbu is eccentric and sometimes rhetorical. సుబ్బు London తగలబడుతుంటే భలే సంతోషించాడు. అతని సూక్తుల్ని Dr.Watson లా రాస్తున్నాను. కాబట్టి సుబ్బు తరఫున స్పందిస్తున్నాను.
క్రికెట్ మిగిలిన అన్ని ఆటల్ని మింగేసింది. ఈ దుస్థితికి క్రికెట్ ఆటదే బాధ్యత అనలేం. మన దేశంలో క్రికెట్ ఒక వెర్రి స్థాయికి వెళ్ళిపోయింది. కారణాలు అనేకం. అయితే క్రికెట్ లో మనం ఈ స్థాయికి చేరుకోడానికి కారణం.. ప్రభుత్వ పాత్ర లేకపోడం!
ప్రజాదరణ కరువైన ఒలింపిక్ క్రీడలు దీనంగా ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. సహజంగానే మన ప్రభుత్వానికి క్రీడల పట్ల ఆసక్తి ఉండదు. అత్యంత ముఖ్యమైన విద్యా, వైద్య రంగాల పట్లనే శీత కన్నేసే ప్రభుత్వాలు క్రీడల్ని ప్రోత్సాహించాలనుకోడం దురాశ.
ఒకప్పుడు ఉద్యోగాల్లో sports quota ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలే లేవు!
కార్పొరేట్ సెక్టార్ కి వ్యాపార ప్రకటనల్ని ఎండార్స్ చెయ్యడానికి ఒక పాపులర్ వ్యక్తి కావాలి. అతను అమితాబ్ అవ్వచ్చు. టెండూల్కర్ కూడా అవ్వచ్చు. బూస్ట్ సేల్స్ పెరగపోతే టెండూల్కర్ కి ఒక రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు గదా! ఇది ఒకళ్ళనొకళ్ళని లాభపరుచుకునే వ్యాపార సంస్కృతి.
టెండూల్కర్‌పై అభిమానం పక్కన బెట్టి చూడండి. నేనూ మీలాగ సచిన్ ఆటని ఇష్టపడతాను. అలాని అతన్ని చాలా విషయాల్లో సమర్ధించను. ఆటగాళ్ళు సంపాదించుకోకూడదన్నది కాదు నా వాదన. దానికోసం ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా పైకి మాత్రం పేషన్, మన్నూ మసానమంటూ టీవీలో ఇంటర్వ్యూలిస్తూ, ఇంకో పదేళ్ళవరకూ ఆడుతూనే ఉంటాను వంటివి చూసే మన వ్యవస్థ ఎలా ఉందో రాసాను. ఇదే స్థితి ప్రతీ రంగంలో తయారయ్యింది. సినిమాలయితే వంశ పారంపర కళావ్యాపారాలయ్యి కూర్చుకున్నాయి. పెట్టుబడి, పలుకుబడి లేకుండా ఎవరూ రాణించని ఒక దౌర్భాగ్య వాతావరణం మన చుట్టూ పేరుకుపోతూంటే, పలానా దౌర్భాగ్యుడు నా హీరో, పలానా ఆటగాడు నాకు స్పూర్థి అంటూ యువత పరిగెడుతూంటే ఎప్పటికి మనం మారుతావాన్నదే నా ఆవేదన.
Deleteఒలింపిక్స్‌లో చాలా ఆటలున్నాయి. స్విమ్మిగ్ పూల్సూ, విపరీతమైన స్టేడియములూ అవసరంలేని కొన్ని ఆటలున్నాయి. వాటి సంగతి మాట్లాడరేం? వాలీబాల్, బేస్కెట్‌బాల్ వంటి ఆటలకి విపరీతమైన ఖర్చేవీ అవ్వదు. అయినా మనకి ఆటలూ, కళలూ కూడుపెట్టవు. ఎందుకంటే మన వ్యవస్థ డబ్బున్న వాడి చుట్టూనే ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది.
నాకు ధోనీ అంటే చాలా ఇష్టం. ఉన్నవాళ్ళల్లో చాలా చాలా బెటరు. కాబట్టి నేను చెప్పేది ఒక సిస్టం గురించి. మనమెంత మారినా అది మారకపోతే దేశం ముందుకెళ్ళదు.
-బ్రహ్మానందం గొర్తి
బ్రహ్మానందం గారు,
Deleteనాకు టెండూల్కర్ పై అభిమానం లేదు. పైపెచ్చు బొంబాయి వాళ్ళంటే కోపం కూడా ఉంది. క్రికెట్ ముంబాయి ముష్కరుల మీద ఒక టపా కూడా రాశాను.
బూస్ట్ కి టెండూల్కర్ అవసరం ఉంది. టెండూల్కర్ తన మనీని బూస్ట్ తో బూస్ట్ చేసుకొంటాడు. అయినా మన దేశంలో క్రికెట్ క్రీడా దశ ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడది ఒక కార్పోరేట్ బ్రాండ్.
*టెండూల్కర్ వారి సంపాదనయితే చెప్పనవసరం లేదు. ఆయన ఇప్పుడిప్పుడే ఈ సంపాదన నుండి రిటైర్ కారట.వీళ్ళందరూ ఒకరకంగా వ్యవస్థని క్రీడల పేరు చెప్పి దోచుకుంటున్నవారే.*
ReplyDeleteసచ్చిన్ క్రికేట్ నుంచి రిటైర్ కారట అనే రాసేదానికి బదులుగా, సంపాదన నుండి రిటైర్ కారట అని రాసిన మీ వ్యాఖ్యను చదివితే,బహుశా వీరు ఇంకొక్క పాయింట్ రాయటం మిస్ అయ్యారు అది ఆయన బ్రాహ్మణుడు కాబట్టే ఇంకా క్రికేట్ టిం లో ఆయనని ఆడిపిస్తున్నారని రాస్తే విమర్శ సంపూర్ణం అయ్యివుండేది (ఆ మధ్య ఒకసారి క్రికేట్ లో కూడా బ్రాహ్మణ ఆధిపత్యమే నా? అంట్టూ ఒక దళిత రచయిత రాసిన వ్యాసం చదివాను అది గుర్తొచ్చింది).
మనదేశం లో చాలా మందికి ఎవడు ఏ పని చేస్తున్నా, అతనిలో ఎంత టాలేంట్ ఉన్నా వాటిని అన్నిటిని పక్కన పెట్టి అతను ఎంత సంపాదిస్తున్నాడనే దానిమీదే దృష్టి నిలుపుతారు. మీ వ్యాఖ్య దానికి అద్దంపడుతున్నాది. సచ్చిన్ ఊరకనే తండ్రి పేరు, తాతల వంశం గురించి డబ్బా కొట్టుకుంట్టు సినేమా, రాజకీయ రంగాల వారిలాగా దేశాన్ని దోచి పారేయలేదు. టాలేంట్ లేకుండా, గూడ్స్ డేలివరి చేయకుండా ఇన్ని రోజులు నెట్టుకువచ్చేస్తున్నాడా? అతను ఆడే ప్రతి ఆటలో కిరికిరి చేయటానికి స్కొప్ కూడా ఎమీ లేదు. అంతా లైవ్ షోనే! అతను ఎలా ఆడుతున్నాడో క్రికేట్ ఆట చూసే ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు అర్థమౌతుంది. ఆయన క్రిడల పేరు చెప్పుకొని వ్యవస్థను దోచుకొంటున్నారు అని అంట్టున్నారు ఆయన సంపాదన మీద చట్ట ప్రకారం టాక్స్ కట్టకుండా ఎగవేశాడా?
SriRam
ఏంటీ.. ఈ వీరుడు బామ్మడా.. ఓ అదన్నమాట సంగతి..
ReplyDeleteజిడ్డుగాడిలాగా టీం ని వదల్లేకుండా ఉండటం, 90ల్లోకి రాంగానే అప్పుడే మొదటిసారి బ్యాటింగ్ కి వచ్చిన వాడిలాగా వనికిపోవడం.. చంచరీ రికార్డుల కోసం ఆడుతూ, పైగా దేశం కోసం పెద్ద త్యాగాలు చేస్తున్న వాడిలా ఫోజులుకొట్టడం..ఇలాంటి లక్షనాలన్నీ చూసి చిరాకేసేది. ఇప్పుడర్థమైంది.. మనోడి బ్లడ్డులోనే తేడా ఉందన్నమాట.
HareRam
మీ సుబ్బు మూర్ఖిస్టు అనుకుంటా. పక్కోడి గోచీకి మంటెట్టి, దాంతో చలి కాచుకుందామనే మనస్తత్వం.
Delete"ఏంటీ.. ఈ వీరుడు బామ్మడా.."
ReplyDeleteఅయ్యా! వీరుళ్లు,ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్లు, మడమ తిప్పని వాళ్లు మొద|| వారికి బ్రాహ్మణులలో పెద్ద క్రేజ్ ఉండదు. అవి కొన్ని వర్గాలకే ప్రత్యేకం. ఇక క్రికేట్ లో గత 50సం|| లలో ఎంతమంది ఆంధ్రా నుంచి ఎంతమంది వీరులు ఆడారు? ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జాతీయ స్థాయి లో ఎన్నిసార్లు క్రికేట్ లో పాల్గొన్నడు? వేరే రాష్ట్రలలో ఉంటే అర్థమౌతుంది తెలుగు వారి ఘన చరిత్ర, లో స్టాండర్డ్స్. తెలుగు వీరుల గురించి తెలియంది ఎవ్వరికి? గుంపు కడితే గాని విజయం సాధించటం చేతగాదు. రాజకీయాలైతే వారికి అనుకూలం. కుల పిచ్చి రేగొట్టి గుంపు కట్టుకోవచ్చు.అందులో కొద్ది మంది లాభపడితే మిగతావారు వారిని చెక్క భజన చేస్తూంటారు. క్రికేట్ లాంటి ఆటల లో ఒక్కరుగా పర్ఫర్మ్ చేయాలి గాబట్టి వీరులు వాటి జోలికిపోరు, విమర్శలు మాత్రం చేస్తారు.
గత 25సం|| నుంచి మొన్నటి వరకూ ఈ వీరుళ్లు ఆంధ్రాను అభివృద్ది పథం లో తీసుకు పోతున్నామని ఓ తెగ డవిలాగులు కొట్టి ఒక్కొక్కరు (రాజకీయ, పారిశ్రామిక వేత్తలు) మెల్లగా జైళ్లకు జారుకొన్నారు. ఇన్ని రోజులు ఈరులనుకొన్నాం కాని మా అసలు సంగతి మాకర్థమైంది అని తెలుసుకొన్న , పేపర్ ఆయన నిన్ననే రాష్ట్రానికి నాయకుడు కావలని ప్రకటించాడు.
ఈ రాష్ట్రానికి ఓ నాయకుడు కావాలి!
ఎంతలో ఎంత మార్పు. నాలుగైదు ఏళ్ల క్రితం వరకు 'బ్రాండ్ హైదరాబాద్'గా ఉన్న మన రాజధాని ఇప్పుడు 'బ్యాడ్ హైదరాబాద్'గా పేరు పొందుతోంది. అభివృద్ధిలో కాకుండా పతనం అవ్వడంలో ఇప్పుడు మన రాష్ట్రం పోటీ పడుతోంది. అభివృద్ధి వెలుగుల స్థానంలో చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. అయిదారేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీపడిన వారు, రుణాలు ఇవ్వడానికి వెనుకా ముందు చూడని బ్యాంకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ప్రశంసలతో ముంచెత్తిన వారే ఇప్పుడు "దొంగలుగా" అనుమానిస్తున్నారు.
*మనోడి బ్లడ్డులోనే తేడా ఉందన్నమాట*
పర్వాలేదు మాలో మీలాంటి ఈరరసం, అవినీతి రసం ఉప్పొంగే బ్లడ్ లేకుంటే అవమానంగా ఫీలవం. చరిత్రలో చిత్తు కాగితం అంత విలువలేని మీ లాంటి వీరుళ్లు లేకుంటే పీడబాయ!
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/4/edit/4edit2&more=2012/aug/4/edit/editpagemain1&date=8/4/2012
అజ్ఞాత గారూ
ReplyDeleteనేను ఐరోపావాడి ఆటలు చైనావాడి ఆటలను తక్కువచేయలేదు . మనవంటికి పడేవి మనవైన ఆటలతో అటు శారీరిక మానసిక వ్యాయామాలతో మేలు పొందగలగిఉండీ నిర్లక్ష్యం చెస్తున్న విషయం ప్రస్తావించాను. ఇక క్రికెట్ను విదేశాలతో యుద్దంగా భావిమ్చే ఉన్మాదస్థాయికి నా మనస్సువెళ్లలేదు . ఏవాతావరణానికి ఆ ఆహారం పడుతుంది. దేశీయ క్రీడలద్వారానే మనకు మేలు జరుగుతుంది అనేది సత్యం. ఇన్నేళ్లబట్టి ఆడుతున్న క్రికెట్ వల్ల ఈదేశానికి ఒరిగినదేమిటో ....జరిగిన వినాశనమేమిటో పరిశీలిస్తే తెలుస్తుంది .
ఏవా "మనవైన" ఆటలు? ఏవి దేశీయ క్రీడలు? వాటివల్ల "మాత్రమే'జరిగే మేళ్ళు ఏమిటి? ఒక ఆటలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కలగటం/కలగకపోవటం అనేది వాళ్ళు దానికి ఎంత వరకు కనెక్ట్ అవ్వగలరు అనే దానిపై ఆధారపడుతుంది. అంతే కాని ఇది దేశీ ఆట కాబట్టి నీకు ఇది పుట్టుకుతో వచ్చేయాలి అనే మ్యాపింగ్ ఏమీ ఉండదు.
Deleteక్రికెట్ ఏమైనా వినాశనకారి క్రీడ? చూసే జనాల్లో క్రీడాస్పూర్తి లేకపోతే కబడ్డి వల్ల కూడా ఉన్మాదం ప్రబలుతుంది. మన అనుకునే హాకీ లో కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పరిస్థితి హద్దులు దాటుతుంది. అయితే ఇటువంటి అత్సుత్సాహం మనకే కాదు. అమెరికా లో బేస్‌బాల్ జరిగేప్పుడు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య రగ్బీ జరిగేప్పుడు కూడా చూస్తుంటాం. గ్రామల్లో జరిగే కబడ్డి పోటీలు కూడా కొట్లాటలు దాకా వెళ్ళిన సంధర్బాలున్నాయి.
ఏ వాతావరణానికి ఆ ఆహరం అనేది కూడా పూర్తి వాస్తవం కాదు. మనదేశం నించి చలి దేశాలకు వెళ్ళిన ఎంతో మంది ఇక్కడి అలవాట్లు తోనే జీవిస్తున్నారు కదా.. అంతేకాని రాత్రికి రాత్రి బీఫ్, పోర్క్ ఈటర్లు గా మారట్లేదు కదా.. పైగా క్రీడలకేమి మిలటరి శిక్షణ లాగా భీబత్సమైన ఆహారపు మార్పులు అవసరం లేదు. అదే నిజమైతే రెజ్లింగ్, బాక్సింగ్ లాంటి పోటీల్లో మనవాళ్ళు పతకాలు సాధించేవాళ్ళే కాదు.
స్థానిక ఆటలను కూడా అంతర్జాతీయ స్థాయి కి తీసుకెళ్ళి ప్రాచుర్యం లోకి తేవాలనటంలో తప్పు లేదు. అయితే మన వాళ్ళు ఈ స్థానిక ఆటలు మాత్రమే ఆడాలని గిరిగీయటం, లేక ఇవే మన వంటికి పడతాయనుకోవటం, వీటిలొన్నే మానసిక వ్యాయామం లభిస్తుందని భావించటం సరైన ధోరణి కాదు.
మంచి సుభాషితం చెప్పించారు సుబ్బుగారితో. కానీ ఈ టపాలో సుబ్బుగారితో అసలు ఆటస్థలమేలేని స్కూళ్ళ గురించి కాస్త విశదీకరించి చెప్తే బాగుంటుందేమో. కానీ మన ఆటలు వగైరాలంటూ ఎక్కడికోవెళ్ళి అసలు మన పిల్లలు ఆటలు ఆడట్లేదు అన్న సంగతి మరుగున పడింది.
ReplyDeleteఅయినా మన పిచ్చకానీ, పిల్లలకి అసలు ఆటలేవద్దు, ఆ సమయంలోకూడా ఇంకో కోచింగ్ సెంటర్లో పడేస్తే అమెరికా కి, వీలైతే అంతరిక్షానికి, అంగారకగ్రహానికి కూడా "పోతాడని" ఆలొచించే తల్లితండ్రులున్న ఈ "ఖర్మ"భూమిలో, ఈ ఒలింపిక్స్, పతకాలు అంటూ వ్యర్ధవాదమెందులకు? వాటి గోల మనకెందులకు? మాంఛి కాఫీ తాగి పిల్లల్ని బందులదొడ్లో - అదే కాన్సెప్ట్ స్కూళ్ళో పడేద్దాం.
-
ఆత్రేయ
అయ్య బాబోయ్,
ReplyDeleteసుబ్బు ఆంధ్రా పాలిటిక్స్ కే పరిమితం అని ఎప్పుడో ఎక్కడో డాట్రారు గారు రాసినట్టు మేము చదివినట్టు గురుతు!
ఇప్పుడు సుబ్బూ మరీ అంతర్జాతీయ 'కుట్ర' దారుల దారు 'ణా' లని వెతికి మరీ అణా పైసలతో సహా లెక్క పెడు తున్నాడు సుమీ !
చీర్స్
జిలేబి.
This comment has been removed by the author.
ReplyDeleteChina - Asian country. Not European/American. They won 30+ gold
ReplyDeleteIndia - Asian country. Not European/American. They won zero gold and a couple of bronze and a silver.
This excuse is invalid.
The craze for cricket exploded after 1983 World-cup victory, followed by B&H cup in 1985. India reached Semi-finals of the next world-cup. After a trough in the 90s, India came back strongly to win Champions Trophy once, reach the finals on another occasion, won 20-20 World cup and then 2012 World-cup.
ReplyDeleteHow many other sports got so many victories for Independent India?
1. Billiards and Chess are worth a mention but they are not action oriented.
2. Tennis picked up and Leander and Bhupati were winning but then Tennis is a game wherein Singles games are valued way above doubles
From a friend of mine.
ReplyDelete1. Olympic sports, with some few exceptions, don't make commercial sense. Also, cricket with Ranji / IPL / international forms lure youngsters with short + longer-term financial gains and also occupies ~80% of the TV time. Hence, there is little (money) space for other sports to grow and/or get exposure.
2. As long as the Baaaabu's (no reference to CBN) are eager to fill their personal coffers, there is barely any money left for building the right infrastructure e.g. recent Common Wealth games fiasco.
3. Olympic medals are mostly for the "pride" element.....and we (Indians) don't give a rat's ass about that. At least not yet. So, no motivation for Govt. to kidnap kids at "3," provide parental visits once a month, train them 24/7 until they are thirteen, forge their birth certificates as sixteen and push them into Olympics. At least not yet.
4. Personal motivation is key for winning Olympic medals. While developed countries have good infrastructure and "top-level coaching" available to their athletes, even all things being equal countries like India lack such top-level coaching talent (because of poor Olympic/athletic history). So, any medal won is literally against "all odds" and need to be commended.
So, drop comparisons with any other country (China) or individual (Phelps). Doesn't make sense.
There were years where we sent 500+ contingent to Olympics and no medal to show for it. We were the laughing stock for the world. Now, we sent 88 contingent team....and won 3 medals with a promise of couple more.....
So, a lot to cheer!!
చాల చక్కగా వ్రాసారు.
ReplyDeleteఒలింపిక్ పతకాల గురించి నేను రాసిన పోస్ట్.
ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం మనకు అంత ముఖ్యమైన విషయమా?
http://manahakkulu.blogspot.co.uk/2012/08/blog-post.html
చంద్ర గారు,
Deleteనాకు మీ లింక్ పోవట్లేదు.
క్షమించండి. ఎందుకు పని చెయ్యడం లేదో తెలియదు.
Deletehttp://manahakkulu.blogspot.co.uk
ఇది నా బ్లాగ్ హోం పేజి. ఇది అయినా పని చేస్తుంది అని అనుకుంటున్నాను.