Saturday 11 August 2012

చైనా ఆటలు - ఇండియా చదువులు



మొన్న  నేరాసిన  "నీచనికృష్ట చైనా! దీన్ని మెడబట్టి గెంటండి!" టపాపై  చర్చ  జరిగింది. ఆ  టపాలోని  కొన్ని వ్యాఖ్యలకి  సమాధానం  రాసే  కార్యక్రమం  మొదలెట్టగా  నిడివి  ఎక్కువైపోయింది. మన  కార్పొరేట్  విద్య  చర్చకి  వచ్చింది. అంచేత  ఆ  ఆలోచనల్ని  ఇప్పుడు  ఒక post గా publish చేస్తున్నాను. కావున  ఈ post  చైనా పిల్లల  గూర్చి  చర్చ  కొనసాగింపుగా  అనుకోవచ్చు.

విద్యార్ధులు - ప్రతిభ :

'merit'. నిజంగా  ఈ  పదం  చాలా  గౌరవప్రదమైనది. అయితే.. ప్రస్తుతం  మనం  ఏదైతే merit అనుకుంటున్నామో  అది  నిజమైన  మెరిటేనా? అసలు  ప్రతిభ  అంటే  ఏమిటి? ఉదాహరణకి  ఒక వందమంది  విద్యార్ధులు  రోజుకి  ఆరు గంటలు  క్లాసుల్లో  పాఠాలు  నేర్చుకుని, రెండు గంటలు  ఆటలాడుకుని, ఇంకో గంట  టీవీ  చూసి  నిద్ర  పోతారు. అప్పుడే  వారు  మానసికంగా, శారీరకంగా  ఆరోగ్యవంతులై  ఉంటారు. అందుకే  ఎటువంటి  పరిస్థితుల్లో  ఒక  నిర్ణీత  సమయాన్ని  మించి  వారిపై  పాఠాల  ఒత్తిడి  పెంచరాదనే  నియమం  ఉండాలి. కఠిన  చట్టం  ఉండాలి.

ఇలా  అందరికీ  ఒకే  రకమైన  curriculum  ఉన్నప్పుడు  మాత్రమే  వారి  ప్రతిభని  కొలవాలి. ఈ  కొలమానం  కూడా  చాలా ఖచ్చితత్వంతో  ఉండాలి. ఎవరెవరికి  ఏ  వృత్తి  పట్ల ఆసక్తి ఉందో.. వారు  ఆ  కోర్సుల్ని  అభ్యసించే  అవకాశం  ఉండాలి. అప్పుడే  మనకి  ఆటల్లో  కూడా  ప్రవేశం  ఉన్న  సైంటిస్ట్  తయారవుతాడు. సమాజం  పట్ల  అవగాహన  ఉన్న  వైద్యుడు  దొరుకుతాడు. లైబ్రరీల్లో, పుస్తకాల  మధ్యన  మాత్రమే  తయారయ్యే  నిపుణుడు  చిన్న వయసులోనే  రోగిష్టివాడైపోతాడు. దేశానికి  నష్టం.

కార్పొరేట్  విద్యా సంస్థల  పుట్టుక :

'పరీక్షల్లో  మార్కులే  కొలమానం  అయినప్పుడు  ఆటలకి, పాటలకి  సమయం  కేటాయించడం  దండగ! హాయిగా  ఆ  సమయాన్ని  కూడా  చదివించడానికి  ఉపయోగిస్తే  మరిన్ని  మార్కులు  సాధించొచ్చు!' అన్న  ఆలోచనతో  పుట్టిందే  కార్పొరేట్  విద్య. ఇది  కస్టమర్ల  అవసరాలు  తీర్చే  దుకాణదారుల  తరహా  ఆలోచన.

అయితే.. ఈ  అలోచన  అశాస్త్రీయమైనది. ఒక  విద్యార్ధి  శారీరకంగా, మానసికంగా  ఆరోగ్యంగా  ఉండాలి. చిన్నపిల్లలు  కూడా  ఈ  దేశ పౌరులే. రోజూ  కొంతసమయం  ఆడుకోవడం  వారి  హక్కు. వారికి  రాజ్యాంగమే  ఈ  హక్కుని  కల్పించింది. జైళ్ళల్లో  ఖైదీలకి  కూడా  ఆటలాడుకునే  సౌకర్యం  ఉంది. అయితే.. ఖైదీలక్కూడా  ఉన్న  హక్కు  బాలలకి  ఎందుకు లేదు?!

విద్యార్ధులు - తలిదండ్రులు :

తమ  పిల్లలు  బాగా  చదివి  మంచి  ఉద్యోగంలో  స్థిరపడాలని  తలిదండ్రులు  అనుకోవడం  సహజం. అయితే.. నా  కొడుకు  కావున  రోజంతా  చదివిస్తాననే  హక్కు  చట్టరీత్యా  నేరంగా  పరిగణింపబడాలి. అందుకే.. 'మీ  పిల్లాడు  ఆటలాడి  చెడిపోతాడు. మేం  దాన్ని  కట్టడి  చేసి.. ఆ  సమయాన్ని  కూడా  చదువుకే  కేటాయింపజేస్తాం.' అంటూ  ఎవడన్నా  చదువుల  దుకాణం  తెరిస్తే.. వాణ్ణి  తక్షణం  జైల్లో  పెట్టాలి.

కొడుకు  పెద్దయ్యాక  పోలీసాఫీసర్  కావలనుకునే  తలిదండ్రులు.. వాడికి  ఐదేళ్ళకే  పిస్టల్  షూటింగ్ లో  ట్రైనింగ్  ఇప్పించలేరు గదా! పిల్లల్ని  చదువుల  పేరుతో  ఒత్తిడి పెడితే.. వాళ్ళు మంచి  మార్కులు  సాధించవచ్చును గానీ.. భవిష్యత్తులో  మానసిక సమస్యల  పాలవుతారు. 'ఏం  పర్లేదు. రిస్క్  బేర్  చేసేది  మేమే గదా!' అన్న  వాదనకి  తావు  లేదు. అప్పుడు  తిండి  లేక  పిల్లల్ని  అమ్ముకునే  తల్లుల్ని  కూడా  మనం  సపోర్ట్  చెయ్యవలసి ఉంటుంది.

ప్రభుత్వ పాత్ర :

'ఇవ్వాళ  వందరూపాయలు  డిపాజిట్  చెయ్యండి. ఎల్లుండికల్లా  వెయ్యి రూపాయిలు  ఇస్తాం.' లాంటి  మోసపూరిత  ప్రకటనల  ప్రచారం  చేసుకోడానికి  ప్రభుత్వాలు  అనుమతినివ్వవు. ఒకవేళ  ప్రభుత్వం  ఉదాసీనంగా  ఉందనుకుందాం. ఆశ పడి  కొందరు  మోసపోతారు. వందకి  వెయ్యి  సంపాదించాలనే  దురాశపరులుగా  ఆ  మోసపోయినవారిని  మనం  చూడొచ్చు. కానీ.. అందర్నీ  రక్షించవలసిన  బాధ్యత  ప్రభుత్వాలదే. మనకి  రక్షణ  కల్పించడానికే  కదా ఈ  ప్రభుత్వాలుంది. అందుకే  ప్రభుత్వాలు  డిపాజిట్ deposit సేకరణ  విషయంలో అనేక  నిబంధనలని  పెట్టాయి.

డబ్బు  విషయంలోనే  ఇన్ని rules ఉన్నప్పుడు.. పిల్లల  విషయంలో  ఇంకెన్ని  కఠిన నిబంధనలుండాలి? కానీ.. అసలు  రూల్సంటూ  మనకున్నాయా? 'పిల్లల  విషయంలో  ఎందుకంత  కఠిన నిబంధనలు  ఉండాలి?' ఎందుకంటే  సమాజంలో  బలహీనులు  రక్షించబడాలి. అందుకే  వీరిని  రక్షించే  చట్టాలు  మరింత  పకడ్బందీగా, ఖచ్చితత్వంతో  ఉండాలి.

పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం  కలవారు.. వీరంతా  ఒక special category. వీరిని  ఇబ్బంది  పెట్టే వారిని  నాగరిక  సమాజాలు  క్షమించరాదు. వీరిని  ఇబ్బంది  పెట్టే  సమాజం  రాతియుగానికి  చెందిందిగా  భావించాలి. వీరిని  కాపాడవలసింది  మనం  ఓట్లేసే  ప్రభుత్వాలు. కానీ  మన  ప్రభుత్వాలకి  ఈ spirit ఉందా?

ప్రభుత్వం + కార్పొరేట్  విద్యా సంస్థల  కుట్ర :

కానీ  మన  ప్రభుత్వాలు  చదువుల  దుకాణదారుల lobbying కి  లొంగిపోయాయి. ఉదాసీనంగా  ఉండటం  మూలానా.. ఈ  దుకాణ దారులు  ఒకరిని  మించి  ఒకరు  పిల్లల  హక్కుల్ని  హరించడంలో  పోటీ  పడుతున్నారు. ఒక  మాఫియాగా  రూపాంతరం  చెందారు. ఇది  మన  జాతికే  నష్టం. కొందరంటారు.. 'ఆ  పిల్లలు  విజయం  సాధిస్తున్నారుగా!' అని. నిజమే! వాళ్ళకి  మంచి  జీతం  వచ్చే  ఉద్యోగ  భవిష్యత్తు  ఉంటుంది. కానీ.. at what cost?


పిల్లల  భవిష్యత్తు  బాగుంటుందని  తలిదండ్రుల్ని  నమ్మించి.. పసి పిల్లల్ని  హింసించే  చదువుల  కార్ఖానాలే  ఈ  కార్పొరేట్  విద్యాసంస్థలు. ఇవి  పూర్తిగా  చట్టవ్యతిరేకం. ఈ  కార్ఖానాలే  లేకుండా  చెయ్యాల్సిన  బాధ్యత, అధికారం  ప్రభుత్వానికే  కదా  ఉంట! మన  ఊళ్ళో  కనీసం  లెబోరేటరీ  ఫెసిలిటీ laboratory facility కూడా  లేకుండా..shopping malls పైనా, ఎపార్ట్ మెంటుల్లో  నడుపుతున్న  కార్పొరేట్  కాలేజిలు.. కూతవేటు  దూరంలో  ఉన్నా  ఉన్నత  విద్యశాఖాధికారులకి  తెలీదు! వందలమంది  విద్యార్ధుల్ని  కుక్కే ఒక  పెద్ద physical structure అధికారులకి  కళ్ళకి  కనబడదు!!

EAMCET ప్రహసనం :

ఇప్పుడు  ఇంకో  పాయింట్. కొందరు  వాదించవచ్చు. 'quality డాక్టర్, ఇంజనీర్  అవ్వాలంటే  కష్టపడకపోతే  ఎలా?' అని. ఇక్కడ  మనం  ఆ  రకంగా  కూడా fail అవుతున్నాం. ఉదాహరణగా  మన  EAMCET  నే  తీసుకుందాం. ఒక  విద్యార్ధి doctor course లో  చేరాలంటే intermediate board పరీక్ష  పాసయితే  చాలు. కానీ  మనకి  అభ్యర్ధులు  ఎక్కువమంది  ఉండటం  చేత  మళ్ళీ  ఇంకో  రకం వడపోత (objective type) పరీక్ష  పెడుతున్నాం. పోనీ  ఇందులో  ఏమన్నా creativity చూపిస్తున్నామా? అంటే  అదీ  లేదు. అరిగిపోయిన  ప్రశ్నల్నే  మళ్ళీ మళ్ళీ  అడుగుతూ  కేవలం  ఒక  విద్యార్ధి  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తున్నాం. (జ్ఞాపక శక్తి  తెలివితేటల్లో  ఒక  భాగం  మాత్రమే.)

ఎప్పుడైతే  కేవలం  జ్ఞాపక శక్తిని  మాత్రమే  పరీక్షిస్తామో.. అప్పుడు  బండగా  చదువే  వారికి advantage ఉంటుంది. ఉదాహరణకి  వానపాము  గూర్చి  ఐదు సార్లు  చదివిన వాడి  కన్నా  ఇరవై సార్లు  చదివినవాడికి  ఎక్కువ  మార్కులు  వచ్చే  అవకాశం  ఉంది. అంటే.. అతను  రాష్ట్ర స్థాయిలో  ప్రధమ స్థానాన్ని  సంపాదించినా.. "తెలివైన"వాడన్న భరోసా  లేదు. మంచి  "చదువరి" మాత్రమే  అయ్యుండొచ్చు.

అయితే.. ఈ  మాత్రం  మన  ప్రభుత్వాలకి  తెలీదా? తెలుసు. కానీ.. ఈ  రకమైన  బట్టీయం  వేసే  విధానం  కార్పొరేట్  కాలేజిలకి  అనుకూలం. అక్కడ repeated గా  చదివిస్తారు. పరీక్షలు  పెడుతుంటారు. కాబట్టే  ఒక  పాఠాన్ని  ఎక్కువసార్లు  చదివించి, అరగదీసే  కార్పొరేట్  కాలేజిల  హవా  నడుస్తుంది. ప్రభుత్వం  మాత్రం  నిద్ర  పోతుంటుంది!

వైద్య విద్య - లోపభూయిష్టం :

ఇక  మన  వైద్య విద్యా విధానం. ఒక medical college నుండి  ఒక యేడాది వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారనుకుందాం. వారందరూ  ఏవరేజ్  స్టూడెంట్లే. కానీ  సాధారణ  వ్యాధుల  పట్ల  అవగాహన ఉంది. పేషంట్లు  చెప్పేది  ఓపిగ్గా  విని  వైద్యం  చేసేంత నాలెడ్జ్ ఉంది. కామన్  సెన్సూ  ఉందివారిలో  ఏ ఒక్కరూ  గొప్ప cardialogist కాదు. గొప్ప  నెఫ్రాలజిస్టూ  కాదు. కానీ.. పేషంట్  పట్ల గౌరవంగా, నిజాయితీగా  వ్యవహరించే  విషయంలో  మంచి training పొందినవారు. పేషంట్ల  పట్ల  నిజాయితీ  అనేది  ఒక  డాక్టర్ యొక్క  ప్రాధమిక  గుణం  అయ్యుండాలి. మిగిలినవన్నీ secondary. శంకర్ దాదా MBBS  సినిమా  చూశారుగా.

ఇప్పుడు  ఇంకో  మెడికల్  కాలేజి. ఇక్కడ  నుండి  కూడా  ఇంకో  వందమంది  డాక్టర్లు  బయటకొచ్చారు. వాళ్ళు  అసాధారణ  మేధావులు. అద్భుతమైన  నాలెడ్జ్  ఉంది. అందరూ  అనేక  స్పెషాలిటీల్లో  నిష్టాతులు. ఈ  కాలేజి product ని  అన్ని కార్పొరేట్  ఆస్పత్రులు  ఎర్ర తివాచీ  పరిచి  మరీ  చేర్చుకుంటారు. మన  దేశానికి  ఆధునిక  వైద్యంలో  వీరే  దిక్సూచిలు. కానీ.. వారికి  పేషంట్ల  ఆర్ధిక స్థితిగతుల  పట్ల  తేలిక  భావం  ఉండొచ్చు. 'డబ్బుల్లేకపోతే  ధర్మాసుపత్రికి  పోవచ్చు కదా! మా  టైం  చెడగొట్టటం  దేనికంటూ'  చిరాకు  పడే  మనస్తత్వం  కలిగినవారై ఉండొచ్చు.

నా  దృష్టిలో  ఈ  మేధావుల  కాలేజి  కన్నా.. ఇందాక  సాధారణ  నాలెడ్జ్  కలిగిన  డాక్టర్లని produce చేసిన  కాలేజియే  గొప్పది. దేశానికి ఉపయోగపడేది. ఎందుకో  తెలీదు.. వైద్యవిద్యలో  పేషంట్లతో  ఎలా  మసులుకోవాలో  తెలిపే  సబ్జక్ట్  లేదు. ఇందువల్ల  చాలా  సమస్యలు  వస్తున్నాయి. ఈ  కాలేజిల  ఉదాహరణ  నే చెప్పే  విషయానికి  సపోర్ట్  కోసం  తెచ్చానే  తప్ప  స్పెషలిస్ట్  డాక్టర్ల  పట్ల  నాకేవిధమైన  వ్యతిరేకత  లేదని  మనవి  చేసుకుంటున్నాను.

అందరికీ అనారోగ్యం - కొందరికే వైద్యం :

దగ్గు, జ్వరం, విరేచనాలు.. ఇవి  సాధారణ  సమస్యలు. షుగరు, బిపి  సాధారణ  దీర్ఘకాలిక  రోగాలు. ఈ  రోగాలకి reasonable treatment జరుగుతుందంటే  ఆ ఊరు  వైద్యపరంగా  బానే  ఉందని  అర్ధం. వారికి speciality సేవలు  కూడా  ఉంటే  మంచిదే. కానీ  అవి  సెకండరీ.

ఈ  పాయింటునే  తిరగేద్దాం. ఇంకో  ఊళ్ళో open heart surgery లు  అద్భుతంగా  జరుగుతాయి. కానీ  జ్వరాలు, దగ్గులకి  వైద్యం  దొరకదు. ఒక  పక్క  మలేరియాతో  మనుషుల  చస్తున్న  ఊళ్ళో  గుండె  ఆపరేషన్లు  అద్భుతంగా  జరుగుతున్నాయంటే.. పరిస్థితి  బాలేదని  అర్ధం. ఒక  వ్యక్తి  గుండెజబ్బుతో  చావడం  గౌరవప్రదం. మలేరియాతో  చచ్చిపోవడం  దేశానికి  సిగ్గుచేటు. 'ఆరోగ్యశ్రీ' లో  జరుగుతుందిదే!

సమాజం - ఆటల స్పూర్తి - Olympic medals :

ఇప్పుడు  ఈ  పాయింటునే  ఆటలకీ  అన్వయించుకోవచ్చు. ఆటలనేవి  మనిషికి  తిండి, గాలి, నీరంత  ముఖ్యం. ఒక ఊళ్ళో  బోల్డన్ని  స్కూళ్ళు, ఆ  స్కూళ్ళకి  ఆట స్థలాలు  ఉన్నాయనుకుందాం. పిల్లలు  రోజూ  సాయంకాలం  హాయిగా  ఆడుకుంటారు. ఆ  ఊళ్ళో  పెద్దా చిన్నా  తమదైన  రీతిలో  ఏదోక  క్రీడ (చాలా  సాధారణ స్థాయిలో)  ఆడతారనుకుందాం. ఎవరూ  కూడా  చెప్పుకోతగ్గ  ఆటగాళ్ళు  ఉండరు. కానీ.. ఊరంతా  కనీసం  ఒక గంట పాటు  ఆటలాడతారు. మంచి fitness తో  ఉంటారు.

ఆ  ఊరికి  పక్క  ఊళ్ళో  ఆట మైదానాలు  లేవు. ఊళ్ళో  జనాలకి  క్రీడలు  అంటే  ఏంటో  తెలీదు. అందరికీ  షగరు, బిపి  రోగాలు. కానీ.. ఆ  ఊళ్ళో  ఒక  అభినవ్ బింద్రా  ఉన్నాడు. అతను  పొద్దున్నుండి  సాయంకాలం  దాకా  నాలుగ్గోడల  మధ్య  గంటల కొద్దీ  షూటింగ్  ప్రాక్టీస్  చేస్తూనే  ఉన్నాడు. అతను  అరుదుగా  బయటకొస్తాడు. ఒలింపిక్స్ లో gold medal సాధించాడు. ఆ  ఊరికి  గొప్ప  పేరు  సంపాదించాడు. కానీ  నా  దృష్టిలో  ఘనత  వహించిన  ఈ  రెండో  ఊరి  కన్నా  మొదటి ఊరే  ఉత్తమమైనది.

పిల్లలపై ఒత్తిడి :

పాసవడం  వేరు, select కాబడటం  వేరు. రెంటికీ  చాలా  దూరం  ఉంది. ఆటలు, చదువు.. ఎప్పుడయితే  మొదటి స్థానంలో  ఉండాలనుకుంటూ  శిక్షణ  పొందుతుంటారో  వారి  మానసిక క్షోభ  వర్ణనాతీతం. ఒక్కోసారి  ధైర్యం, మరెన్నోసార్లు  దైన్యం! పోటీలో  ఎక్కడుంటామో  తెలీక  సతమతమైపోతుంటారు.

నేను  వృత్తి రీత్యా  అనేకమంది long term coaching students చూస్తుంటాను. వారికి  అనేక రకాల నొప్పులు, నీరసం, నిరాశ, నిర్లిప్తత, ఆత్మహత్య ఆలోచనలు.. చాలా  జాలేస్తుంటుంది. వారితో  మీరు  మాట్లాడినట్లయితే  నేను  రాసేది  చాలా  తక్కువని  అర్ధమవుతుంది.

మన పిల్లల్ని రక్షించుకుందాం :

ఒక  దేశ పరిస్థితుల్ని  అంచనా  వెయ్యలంటే  మొత్తం  సమాజాన్ని  ఒక unit గా  తీసుకోవాలి. కేవలం  ఒక  వ్యక్తి  యొక్క  "గొప్ప" వ్యక్తిగత ప్రతిభ  అనేది  దేనికీ  సూచిక  కాదు. talent hunt పేరుతో  చైనావాడు  పిల్లల్ని  హింసిస్తూ  భవిష్యత్  బంగారు పతాక  గ్రహీతల్ని  తయారు  చెయ్యబోవడం.. ఇండియాలో  కార్పొరేట్  విద్య వాడు  పిల్లల్ని  కాల్చుకు  తింటూ  భవిష్యత్  IIT వాడిగా  తయారు  చెయ్యబూనడం.. చట్టరీత్యా  "ఘోరమైన"  నేరంగా  ప్రకటింపబడాలి. ఈ  చట్టాల్ని  అమలు  చెయ్యని  అధికారుల్ని  కఠినంగా  శిక్షేంచేందుకు  కూడా  "పకడ్బందీ"గా  చట్టాలుండాలి.


(photos courtesy : Google)

44 comments:

  1. I completely agree with you Ramana - it is high time we stopped robbing childhood and innocence from children. "Education" for passing exams produces just that - great exam takers - not free thinkers, tinkerers and complete individuals.

    As you know, we have just returned from a trip to Scandinavian countries (Denmark, Finland and Sweden). I was most impressed by their societies. Remarkably, school starts for children at age 7! The mothers get up to 3 years of maternity leave (with pay) to nurture their kids. Significantly every citizen gets 5 weeks of paid vacation. And lastly, their shopping malls are closed on Sundays.

    We should be happy if our kids become productive citizens to their fullest capacity and natural ability. They need not become anything great. At least that is my position regarding my kids. We create problems for kids by pushing them into studies and professions that are ill suited to them and can result in considerable future stress.

    ReplyDelete
  2. Doctor garu,
    meeru cheppina vishayalu 100% correct.ade time lo EAMCET baditha pillala gurinchi marintha vivaram gaa chebithe bagundedi.
    ALTERNATIVE EDUCATION perutho oka vidyavidhanam popular avuthuvundi.
    India lonu ALTERNATIVE SCHOOLS vunnayi kani avi kondarike parimitham avuthunnayi,kaaranalu chalaa vunnayi.
    meelanti varu mundugaa pillala kante peddalaku counselling cheste baguntundi.
    parents chala mandi cheppe mata okatundi 'ammo! kashtapadakunte yela?EEROJULLO prapanchamantha yela parugeduthondo choodandi ani" kaani nenu antanu competition anedi yeppudoo vundi.EEROJULLO matrame kadu mee rojullo leda?mari meerantha aa rojullo doctors/engineers yendukavvaledu?
    ivvala A.P lo degree colleges kante engineering colleges ekuuva,every year seats migilipothunna parents ku ee bhayam yenduko artham kadu.EAMCET lo statistics theesthe 50% ABOVE ante 80/160 score chese vaallu ONLY 100% matrame.mari okko subject lo 90%above score chestunna students knwoledge inthena?
    ika mana students ye rojoo labs chusindi ledu kaani practicals lo 100%labs lo yelanti disection cheyyani vaallanthaa "suer speciality" doctors ayyaru.
    ee students ku manasika vikasame leka pogaa mallee veellaku 'vyaktitva vikasam' antoo specialists(?) tho classes.
    nijame vyakti vikasame important ayindi kaabatte ye hospital lo choosinaa doctor gari sontha manushula medical shops matrame kanipistunnayi.
    mothaniki doctor garu,parents ku vyaktitva vikasa nipunulaku mee laanti varu counselling isthe kasta janala pitchi thagguthundi.

    ReplyDelete
  3. sorry eamcet lo 50% above chesevaalu only 10%(ten)regrets for mistake.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాసరెడ్డి గారు,

      తలిదండ్రులకి counselling! ఇచ్చిన ఫీజు లాగేసుకుని వెళ్ళిపొతారండి బాబూ!

      (మీరు lekhini.org తో తెలుగు లిపిలో కామెంటవచ్చు. ప్రయత్నించండి.)

      Delete
  4. చాలా రోజుల తర్వాత ఆలోచింపచేసే టపా రాసినందుకు అభినందనలు.
    నువ్వు రాసిన నిజాలు ఎందరికి నచ్చుతాయో అని ఆలోచించకుండా ఇటువంటి విషయాలపై నీ అభిప్రాయాలు రాస్తూ ఉండు.
    నిజాలు అందరికీ అన్ని సమయాలలో నచ్చక పోయినా, అవే కాకర కాయ మందు.
    - పుచ్చా

    ReplyDelete
  5. చక్కటి ఆలోచింపజేసే వ్యాసం రాసారు. ముందు తల్లిదండ్రుల్లో జ్ఞానం రావాలి. తాము సాధించలేనివన్నీ పిల్లల చేత సాధింపజేయాలని ప్రయత్నిస్తూ వారి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. మీ వ్యాసం విశ్లేషణాత్మకంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. జగదీష్ గారు,

      అవును. తలిదండ్రుల్లో మార్పు రావాలి. కానీ వారికి ప్రత్యామ్నాయం చూపించాలి గదా! ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా!

      Delete
  6. Very good post. I wish everyone start thinking like you.

    ReplyDelete
  7. Good Analysis of one of the burning problems of our society. If a parent attempt to encourage children to pursue their interested area, society ridicules them, such is the madness. If a person want to make good living, he need not be a just doctor or engineer, society needs all kinds of professionals. We need artists, lawyers, accountants, teachers, bankers and after all good politicians. I appreciate your thought provoking article. I want to hear thoughts regarding currant political thinking of freebies " such as free mobiles, free laptops". Does anything comes free, some body has to pay for them. Governments robbing people by means of various taxes and trying to garner votes by bribing poor with corrupting them. Don't we need long term plans to improve our basic infrastructure for people. If a person is not able to have good drinking water, good drainage system, what is the need for mobile phones.

    ReplyDelete
  8. మీ సమాధానాలు బ్లాగు కే పరిమితమా ?

    ReplyDelete
    Replies
    1. అంటే ఈ టపాను ప్రభుత్వానికి, మీడీయా వారి పరిశీలనకు పంపాలా? ఈ టపాలో రమణగారు ప్రతిపాదించింది కొత్త పాయింట్ ఏమైనా ఉందా? పాత కాలం నాటి విద్యా విధానాన్నే ప్రతిపాదించారు. అలాగే అమేరికా డాక్టర్ చెప్పిన సలహాలలో ఎమైన కొత్త ఉందా? అమేరికాలో డాక్టర్లకి మంచిడిమాండ్ గాబట్టి జి ఐ డాక్ గారు తన పిల్లల తరపున ఆయనే ఇప్పటికి సంపాదించి ఉండవచ్చు. జీవితం లో బాగా స్థిరపడ్డ ప్రతి ఒక్కరు చెప్పే సూక్తిసుధలు :)

      ఇప్పుడు సిటి మొదలుకొని పల్లే వరకు ఎంతోమంది ప్రజలు చదువుతున్నారు. వారికి భవిషత్ లో ఎదో ఒక ఉపాది చూపించకపోతే, అప్పుడు తగులుతుంది సమాజం లో అందరికి అసలైన సెగ. ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంతర్జాతీయ గణాంకాలతో పోల్చుకొంట్టు, భారత దేశం విద్య లేక వేనకపడిపోయిందని ఉపన్యాసాలు ఇచ్చినట్టుకాదు. ఆ చదువుకొన్న కొత్తతరానికి ఉద్యోగాలు చూపకపోతే ఆత్మహత్యలు చేసుకోవటమో, సమాజం పైతిరగబడీ పట్టపగలు దోచుకోవటమో చేస్తారు. తెలియక అడుగుతాను ప్రైవేటికరణ ప్రథమ భాగం లోనే ఇలా గోల చేస్తే ఎలా?

      రమణ గారు మీరు మరి సున్నిత మనస్కులు గా ఉన్నట్లున్నారు, విద్యార్దుల కష్ట్టాలనుచూసి తట్టుకోలేక టపారాశారు, ఇక పేషంట్ల కష్ట్టాలు విని, మానసిక సమస్యలు తెలుసుకొని వారి బాధలను షేర్ చేసుకొంట్టు, ఫీజు తీసుకోవటం మరచిపోవటం లేదు కదా! :)

      Delete
    2. అజ్ఞాతా,

      జీవిత పరమార్ధం మంచి ఉద్యోగం సంపాదించడమేనా? దానికోసం అన్నీ వదులుకుని చదివేస్తూ ఉండటమేనా!

      ఉద్యోగాల కోసం చదవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. సమస్యల్లా.. చిన్నపిల్లల్ని హింసించడమే. ఈ బ్లాగులో ఫొటోలు చూడండి. వారికి ఒలింపిక్స్ అంటే ఎలా తెలుస్తుంది? గొప్ప ఉద్యోగం అంటే ఏం తెలుస్తుంది?

      పసిపిల్లల్ని రుద్ది చదివించడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో గొప్ప ఎకడెమీషియన్లవుతారనడానికి ఆధారాల్లేవు.

      ఈ చదువుల దుకాణాల వారికి విద్య గూర్చి అవగాహన సంగతి అటుంచండి. విద్యార్హతలు కూడా సరీగ్గా ఉండవు.

      Delete
    3. "జీవిత పరమార్ధం మంచి ఉద్యోగం సంపాదించడమేనా?"

      ఉద్యోగం సంపాదించడమేనా అంటే అంతే! అంతకుమించి ఎమీ లేదు. పైపేచు ఇప్పుడు ఆడవారికి కూడా ఉద్యోగం ఉండటం అవసరమనే స్థితికి తీసుకొచ్చారు. మగవారికి ఉద్యోగం లేకపోతే, తిండికి, నివాసానికి లోటు లేకుండా ఆస్థి ఉన్నా పిల్లను ఇస్తారా? సమాజంలో అందరు పెద్దలు సంపాదించిన దానిని తిని కూచుంట్టునాడనే ప్రచారం మొదలు పెట్టి,అతనిని తక్కువగా చూడరంటారా? ఈ చెత్త నిందలు పడేకన్నా ఉద్యోగం చేయటం ఎంతో మిన్న. ఇప్పుడు వ్యాపరం చేసుకొనే వైస్యులు, వ్యవసాయం చేసుకొనే రేడ్లు,కమ్మ,కాపు అన్ని కులాల వారికి, ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా ఉద్యోగం చేయటమే జీవిత ధ్యేయం గా మారింది.

      "దానికోసం అన్నీ వదులుకుని చదివేస్తూ ఉండటమేనా!"

      ఉద్యోగం వద్దు అనుకొనేవాడు పెళ్లి గురించి పెద్ద ఆశలు పెట్టుకోకుడదు. అటువంటి వారికి ఓల్గ అక్కయ్యంత గొప్ప లక్ష్యం ( తెలుగు స్రీజాతిని పైకి తీసుకురావాలనే అంత )ఉండాలా. లేకపోతే వాడి ఆస్థి వాడు పెట్టుకొని తింట్టున్నా, గిరిజా తోటమాలి లాంటి వారు, మగవాడు ఉద్యోగం లేకుండా ఇంట్లో కూచోకుడదు అనే సందేశాన్ని బ్లాగుల ద్వారా, రేడియో, టివి ,మీడీయా ద్వారా వినిపిస్తారు. ఉద్యోగం ఉన్న ఎంత మంది ప్రేమమూర్తులైన స్రీలు, ఉద్యోగం లేని పురుషులను చేసుకొంటారో మీకు తెలుసనుకొంటాను. వారి శాతం సున్నాకు నేగటివ్ వైపుగా ఉంట్టుంది. ఉద్యోగం లేకపోతే ఎమి? అదని ఇదని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే , ప్రశ్నలు వేస్తే పెళ్లి కాకుండా ఎడారిలో ఎండమావుల కోసం వెదుక్కునే కలల బేహారిగా మిగిలిపోతాడు. ఎక్కడొ కోటి మంది లో ఒకటి రెండు కేసులు వేరుగా ఉండవచ్చు.

      Delete
    4. Let me address a couple of things. Yes, I am a doctor in the US and yes you could say I am settled in life (without going into boring details of how I got there). That does not mean I cannot talk about societal issues. Neither of my two kids is going to medical school - by their choice. Neither of them is going to get any inheritence from me. What they got or will get is values and education from us. It is completely up to them to pursue their goals, dreams and aspirations and I will support them towards that to the best of my ability.

      By the way, why marriage is seen as an end point or a major goal in life? Why the marriage needs to be arranged? And more importantly, why everyone needs to get married? You are damn right no woman with a job should marry a bum. When I say the children should not be pressured, I am not advocating a life without a job or purpose. There are dime a dozen jobs outside of medicine and engineering. When a person is properly educated in life which does not have to be in a class room, they can pursue productive careers and lives. This settling in life thing is a myth. Nothing is settled. You earn your keep every day in a free market society. The day you don't perform you are out and rightly so.

      I think a lot of our (regressive) thinking about job and life are not entirely based on earning a livelihood, but, have to do with shame, social stigma and class and caste structure.

      Delete
    5. అగ్నాతా,
      మీ విగ్నానాన్ని పదిమందికి పంచి నందుకు ఇక్కడి పాఠకులు సంతొషించాలి కాబోలు! బ్లాగర్‌ గారు చెప్పినవి జరిగితే మీరు చెప్పినవి జరగవు. మీరు చెప్పినవి జరిగినప్పుడు బ్లాగర్‌ చెప్పినవి జరగవు. ఏవి జరగాలో ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వ గూడదా? ఉన్న సమస్యలకు ఆయన పరిష్కారం చెప్పారు. ఆపరిష్కారానికి ఒక అడ్డంకి వేస్తున్నారు. ఇది పాత పోష్టు అయినా కామెంటాలనిపించింది.

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. * చక్కగా రాశారండి.

      Delete
  10. Excellent post, thanks a lot. I do not agree with certain parts of this post. However I don't want to rake them up in view of the fact that I agree with the big picture.

    Democracy, by far the best system developed by mankind, suffers from serious infirmities by ignoring stakeholders other than voters. The interests of children & sections outside the society (e.g. Andaman tribes who refuse to "integrate" with "civilization") are routinely violated. We condone atrocities outside our own state/country as we don't consider them to be "stakeholders". We believe animals exist only to amuse humans. Unborn generations are deprived of their future rights by our brazen onslaught on the environment.

    ReplyDelete
  11. రమణగారు,

    మీరు అన్ని మంచి పాయింట్లను కవర్ చేశారు. మీరు రాసిన చాలా సహేతుక కారణాలు, సలహాలు, చదవటానికి వినటానికి బాగుంటాయి. మీ సలహాలలో ఐడియలిజం చాలా చాలా ఎక్కువగా ఉంట్టుంది. మీరు చెప్పిందే చదవండి "ఒక దేశ పరిస్థితుల్ని అంచనా వెయ్యలంటే మొత్తం సమాజాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలి. కేవలం ఒక వ్యక్తి యొక్క "గొప్ప" వ్యక్తిగత ప్రతిభ అనేది దేనికీ సూచిక కాదు".
    ఈ రోజులలో చాలా మంది ప్రజలు చదువులు వెనక ప్రజలు పరిగెట్టటానికి అసలు కారణం బాగా చదువుకొంటే ఆర్ధిక పరిస్థితిని మెరుగుపడుతుందని నమ్మటమే. వ్యక్తిగత ప్రతిభ ను పరిగణలోకి తీసుకోకపోతే డబ్బులు ఎక్కువ ఎలా సంపాదిస్తారు? చదువుల మీద రిటన్ ఆన్ ఇన్వేస్ట్ మెంట్ రావటం లేదని ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో అప్పటివరకు ఈ ట్రెండ్ ను ఆపలేము. ఆ తరువాత చదువంటే ఇష్ట్టమున్న వాళ్లే చదువుకొంటారు. ఒక్కపుడు బ్రాహ్మణులు వేద విద్యను ఇతర కులాల వారికి చెప్పకుండ తొక్కేశారు,అణచేశారు అని చాలా ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు ఆ విద్యను అన్ని వర్గాలకు చెపుతాము, మా పాఠశాలలో వచ్చి చేరండి అని ప్రకటనలు ఇస్తున్నా , ఎంత మంది అబ్రాహ్మణులు నేర్చుకోవటానికి ఉత్సాహం చూపుతున్నారు? ఆ విద్య కన్నా ఇంగ్లిష్ విద్యకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అందరు ఇంగ్లిష్ విద్య వైపు మళ్లారు, ఆసక్తి ఉన్న వారు మాత్రమే వేదవిద్యను చదువు తున్నారు.

    మీరు అధికారుల్ని కఠినంగా శిక్షేంచే వరకు వెళ్లారు. చట్టాలను అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఇప్పుడు లేదు.
    SriRam

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      అవును. నా రాత నాకూ 'ఐడియలిజం' అనిపిస్తుంది. ఈ రంగంలో చూసినవి, తెలిసినవి కలిపి నా అభిప్రాయాల్ని ఒక చోట రాయాలనిపించి.. రాశాను. చాలా బేసిక్ పాయింట్స్ కవర్ చేస్తూ రాశాను. మీరు చెప్పిందే ప్రస్తుతం జరుగుతుంది.

      Delete
  12. నేను మీతో ఏకీబవిస్తున్నాను, దీని గురించి అందరు ఓప్పుకుంటారు కాని ఎవ్వరూ అమలుపరచరు . ఈ విషయం లో చదివిన వారి కన్న చదవని వారే నయం అనుకుంటున్న.

    ReplyDelete
  13. BOMMAKANTI KRISHNAKUMARI11 August 2012 at 21:25

    రమణా.

    విలువలు చాలా మారిపోతున్నాయి. కాదు, మారిపోయాయి.

    వొక ౩౦ సం. క్రితం దాకా కూడా బాగా చదువుకున్న వాళ్ళని, ఏదయినా విద్యలో నిష్ణాతులను, నిజాయితీగా బతికేవాళ్ళను గౌరవంగా చూసేవాళ్ళు. ఈ రోజుల్లో డబ్బుకి తప్పితే మరి దేనికి గౌరవం లభించటం లేదు. అంతేకాకుండా చాలా తక్కువగా చూస్తున్నారు. తల్లిదండ్రులే కాదు, పిల్లలు కూడా డబ్బు వచ్చే చదువులవే చదువుతారు. సమాజంలో తక్కువగా చూడబడటం ఎవరికీ ఇష్టం ఉండదు.

    ఇంజనీరింగ్లో డబ్బు అయిపోతే, అంటే డబ్బు సంపాదించుకునే అవకాశాలు తగ్గితే, కొన్నాళ్ళలో ఎందులో డబ్బు వస్తుందనుకుంటే దానికి వెడతారు.

    దానికోసం మనం, మన జీవితాలను పణంగా పెడుతున్నాం అనే స్పృహ ఎవరికీ ఉండటంలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే అందరూ కలసి నవ్వుకున్న క్షణాలు ఎంత తక్కువ ఉంటాయో.

    వైద్యం దేనికి చెయ్యాలో, చేయించాలో నాకేమి బోధపడటం లేదు.

    మీ పోస్ట్ వొక్కరిని ఆలోచింపచేసి, పిల్లల పట్ల సానుకూలంగా స్పందించేలా చేసి, జాగ్రత్తలు తీసుకునేలా చేస్తే చాలనిపిస్తుంది.

    కృష్ణ కుమారి

    ReplyDelete
  14. మీరు బ్లాగులు రాయకముందు, అమ్మ ఓడి అనే బ్లాగును ఆదిలక్ష్మి అనే ఆవిడ , రోజుకొక టపా సుమారు మూడు సం|| రాsimdi. ఆమే లెక్చర్ గా పని చేస్తున్నపుడు విద్య వ్యవస్తలో లొసుగులు మోసాలు చూసి ఎంతో ఆవేదనకు లోనై బ్లాగు పెట్టి రాసింది.

    http://ammaodi.blogspot.in

    ReplyDelete
  15. మీరు రాసిన అన్ని విషయాలతో ఏకీభవించాల్సిందే! కానీ ఒకటో రెండో అదనపు పాయింట్లు...

    'పక్కవాడు అది చదివి అలా పైకొచ్చాడు కాబట్టి మనవాడూ అలాగే చదివి అలాగే పైకి రావాలి' అనే గొర్రేల మెంటాలిటీని తల్లిదండ్రులు వదులుకోవాలి - ఇది సామాజిక పరివర్తన.

    టీచర్‌/లెక్చరర్‌లకు మంచి జీతభృత్యాలనిచ్చి - అధ్యాపకులకు విలువనివ్వాలి. సినిమాలలో జోకర్లలాగా చూపించి వారిని కించ పరచటం మానుకోవాలి. ఇప్పటి కాలంలో టీచింగ్ అనేది కేవలం ఒక వృత్తిగా మారిపోయింది. ఒక అధ్యాపకుడిగా పని చేయటానికి ఆర్థిక సామాజిక కారణాలవల్ల మేధావులు జంకుతున్నారు. పదేళ్ళ అనుభవం ఉన్న సగటూ లెక్చరర్ జీతం - IT కంపనీలో ఇప్పుడే చేరిన సగటూ ఇంజినీర్ జీతం కన్నా తక్కువ. మంచి ఉపాధ్యాయులు లేకపోతే భట్టీయం వేయడం తప్పదు. ఇది కూడా ఒక సామాజిక మార్పు.

    డబ్బున్నవాడి పిల్లలు బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. వీరికి కావలిసిన చదువు డబ్బుతో కొనుక్కోవచ్చు. అంతటి సంపన్నులూ, ఎటువంటి రిజర్వేషన్లూ లేనివారితోనే ఈ ఇబ్బందులన్నీ. తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికి బాల్యాన్ని పణంగా పెట్టడానికి మధ్యతరగతి తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇదీ సామాజిక మార్పేనంటారా?

    చివరిగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న జనాభా. ఇంతగా పెరిగిపోతున్న జనాభావల్ల అన్ని వనరులమీదా ఒత్తిడి పెరిగిపోతోంది. చుట్టూ అంత కాంపిటీషన్ ఉండగా, ఏ తల్లిదండ్రులు మాత్రం ధైర్యంగా తమ పిల్లలను ఆడుకోనిస్తారు? ఇది ఏ మార్పో దేవుడికెరుక...

    ReplyDelete
    Replies
    1. >>చుట్టూ అంత కాంపిటీషన్ ఉండగా, ఏ తల్లిదండ్రులు మాత్రం ధైర్యంగా తమ పిల్లలను ఆడుకోనిస్తారు?<<

      అదే గదా సమస్య. సమాజంలో కొన్ని వ్యవస్థలు అడ్డదిడ్డంగా మారిపో్కుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఎప్పుడైతే ప్రభుత్వాలు నిద్రపోతుంటాయో.. అక్కడ విద్య, వైద్య వ్యవస్థలు దుకాణాల స్థాయికి దిగజారిపోతాయి. ఇదొక మహా ప్రవాహం. వ్యక్తిగత స్థాయిలో మీరూ, నేను చేసేదేముండదు.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప!

      Delete
  16. డాక్టర్ గారు,
    క్రితజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. కంగ్రాచులేషన్స్!

      Delete
  17. కార్పొరేట్ విద్యా సంస్థల పుట్టుక గురించి మరింత సమాచారం

    గుంటూరు కార్పోరేట్ కాలేజీల్లో
    http://ammaodi.blogspot.in/2009/03/54.html
    http://ammaodi.blogspot.in/2009/03/55.html

    ఇంటర్ పేపర్ లీక్
    http://ammaodi.blogspot.in/2009/03/56.html

    ఎంసెట్ కోచింగ్
    http://ammaodi.blogspot.in/2009/03/57.html

    ఎంసెట్ ర్యాంకుల మోసంపై ఫిర్యాదు
    http://ammaodi.blogspot.in/2009/03/58.html

    ఎంసెట్ ర్యాంకుల మోసపు తీరుతెన్నులు
    http://ammaodi.blogspot.in/2009/03/59.html

    ఎంసెట్ ర్యాంకుల మోసపు తీరుతెన్నులు
    http://ammaodi.blogspot.in/2009/04/60.html

    వ్యవస్థీకృత వేధింపు
    http://ammaodi.blogspot.in/2009/04/61.html

    విద్యార్ధుల సమీకరణకు, ఫలితాల పంపకానికి నెట్ వర్క్!
    http://ammaodi.blogspot.in/2010/05/11.html

    కణిక నీతి
    http://ammaodi.blogspot.in/2008/12/1.html

    ReplyDelete
  18. డాక్టరు గారు, ఒక చదువుకున్నవాడిగా మీరు ఇలాంటి పోస్టు వేయడం చాలా బాధాకరం. ఒక కార్పొరేట్ కాలేజీ విద్యార్థిగా చెబుతున్నాను - ప్రతివిద్యార్థి కూడా హైస్కూలు నుండి IIT టార్గెట్ చేసుకొని చదవాలి. ఆ చదువు ఎంత పనికివస్తునది అన్నది ముఖ్యం కాదు, ఇప్పుడున్న కాంపిటీషన్‌లో IITలో ర్యాంకు తెచ్చుకున్నాడంటే అది ఆ విద్యార్థి పట్టుదలకు, క్రమశిక్షణకు తార్కాణం. అలాంటివారే భవిష్యత్తులో ఏ రంగంలో అయినా రాణించగలరు.

    అయినా EAMCET కోసం పిల్లల పైన ఒత్తిడి పెడితే తప్పేముంది? విద్యార్థి దశలో వాళ్ళకు ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు కాబట్టి భయపెట్టి అయినా చదివించాలి. ఇంటర్ వరకు ఓ నాలుగైదేళ్ళు బాగా చదువుకొని మెరిట్లో ర్యాంకులొస్తే ఆ తర్వాత జీవితం సాఫీగా సాగిపోతుంది కదా? నాకు అయితే అందులో తప్పు కనిపించడం లేదు, తల్లిదండ్రుల తపన కనిపిస్తోంది, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది.

    అన్నట్టు మీ పిల్లలను కార్పొరేట్ కాలేజీలో ఎందుకు చేర్పించారు? ఒత్తిడిలేని గవర్నమెంటు కాలేజీలో చేర్పించవచ్చు కదా?

    ReplyDelete
    Replies
    1. జీడిపప్పు గారు,

      సందేహము వలదు. చదువుకున్నవాడిగానే ఒక బాధ్యతతో ఈ పోస్ట్ రాశాను.

      నేను పిల్లల్ని కాంపిటీటివ్ గా ఉండొద్దని రాయలేదు. గొప్ప చదువులు చదవొద్దనీ రాయలేదు. మనం అనుకుంటున్న ఈ 'కాంపిటీటివ్' అన్న వ్యవహారంపై నా అభిప్రాయాలు రాశాను.

      ప్రస్తుత వాతావరణంలో 'సక్సెస్' కాలేనివాడి పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా?

      నా పోస్ట్ ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం మీద. పల్లెటూళ్ళల్లో తెల్లారక ముందే బస్సుల్లో, ఆటోల్లో పిల్లల్ని తోలుకెళ్ళి.. అర్ధరాత్రిళ్ళు ఇళ్ళల్లో దించుతున్నారు. పరీక్షలు దగ్గ్గరకొస్తుంటే ఇరవై నాలుగ్గంటల చదువు. ఈ ప్రతాపమంతా పదేళ్ళ పిల్లల మీద! ఇదేమి విద్య! పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

      'పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం పసి పిల్లల్ని హింసిస్తాం. తాట తీస్తాం. వారిని హింసించడానికి మాకు వారి తలిదండ్రుల అనుమతి ఉంది.' అంటున్న చదువుల దుకాణం వాడిని శిక్షించాల్సిన ప్రభుత్వం మాత్రం ఎటో చూస్తుంటుంది. మనం మాత్రం మెరిట్ గూర్చి చర్చింటుకుంటాం.

      పసి పిల్లల హింస భవిష్యత్ గొప్ప చదువుకి ఎట్లా పునాది అవుతుంది?!

      ఈ రోజు చదువు పేరిట గ్రామాల్లో పిల్లల హింస అప్రతిహతంగా సాగుతుంది. కొందరు పిల్లలు అది తట్టుకోలేక ఇళ్ళల్లోంచి పారిపోతున్నారు కూడా! వాళ్ళని 'పట్టి' సైకియాట్రిస్టుల దగ్గరకి తీసుకొచ్చి 'కౌంసెలింగ్' చెయ్యమని కోరుతున్న తలిదండ్రుల్ని చూస్తే జాలేస్తుంది.

      అసలీ చదువుల దుకాణాలే అశాస్త్రీయం. నిర్వహణే నేరం. ఇవి సారాయి బెల్ట్ షాపులతో సమానం. విద్యారంగం నుండి తప్పుకుంటున్న ప్రభుత్వాల కుట్ర.

      Delete
    2. జీడిపప్పు గారు,

      >>అన్నట్టు మీ పిల్లలను కార్పొరేట్ కాలేజీలో ఎందుకు చేర్పించారు? ఒత్తిడిలేని గవర్నమెంటు కాలేజీలో చేర్పించవచ్చు కదా?<<

      మీరెలాగైతే మీ వివరాలు గోప్యంగా ఉంచాలనుకున్నారో.. అలాగే నాక్కూడా కొన్ని విషయాలు బ్లాగుల్లో చర్చించడానికి ఇష్టం ఉండదు.

      మీ సందేహం 'నేను బ్లాగుల్లో నీతులు చెబుతున్నాను. ఆచరణలో వేరే రకంగా ఉంటున్నాను.' అని అయినట్లయితే.. (కాకపోయినట్లయితే.. ఈ వివరణ పట్టించుకోకండి.)

      చదువుపై, మెరిట్ పై నేను బ్లాగులో రాసిన అభిప్రాయాలు నా పిల్లలకి తెలుసు. వాళ్ళతో చర్చిస్తుంటాను. సలహాలూ చెబుతుంటాను. కానీ వాళ్ళకి నేనో 'చిత్తూరు నాగయ్య'ని. నేను ఎవర్నీ ఎక్కడా 'చేర్పించను.' చేరమని సలహా ఇస్తాను. వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతమేరకు నా అభిప్రాయాలు పట్టించుకుంటున్నారు. లేకపోతే లేదు.

      నా గూర్చి నా భార్య observation ఇంకోరకంగా ఉంటుంది. నేను extreme cases చూసి భయస్తుడిగా మారిపొయ్యానని.. అందువల్లనే ఏదీ ఎసెర్టివ్ గా చెప్పలేనని. అందుకనే పిల్లలతో మరీ సాఫ్ట్ గా ఉంటానని. నిజమేనేమో!

      ఇంతకన్నా ఏది రాసినా మరీ పెర్సనల్ అయిపోతుంది. క్షమించగలరు.

      Delete
    3. /అసలీ చదువుల దుకాణాలే అశాస్త్రీయం. ఇవి సారాయి బెల్ట్ షాపులతో సమానం. విద్యారంగం నుండి తప్పుకుంటున్న ప్రభుత్వాల కుట్ర/

      నిజం. బాగా చెప్పారు.
      'కార్పొరేట్ రథచక్రాలొస్తున్నాయ్ లొస్తున్నాయ్
      పదండి ముందుకు పదండి తోసుకు'
      ఏదీ దారి? అని ఆలోచించేతలో ఆ చక్రాల కింద పడి నలిగిపోతున్నాము.

      Delete
  19. మనకి బాల్యం గురించి తలచుకుంటే ఎన్నో మధుర అనుభూతులు ఉన్నాయి.ఇప్పటి పిల్లలకి పెద్దయిన తర్వాత గుర్తు తెచ్హుకోవడానికి ఏమీ ఉండవు.

    ReplyDelete
  20. నువ్వు చెప్పింది అక్షర సత్యం. అయినా ఎంత మంది follow అవుతారు? నువ్వు చెయ్య గలవా? మనది చాలా 'competitive ' మెంటాలిటీ. పక్కింటి పిల్లాడికి 85 % వస్తే మన పిల్లాడికి 90 % రావాలి. అందుకని ఏమైనా చేస్తాము.

    ఈ 'corporate ' స్కూళ్ళు పెట్టిన వాళ్ళది కాదు తప్పు. దాని వెనక పరిగెత్తే జనాలది. వెనకటికి ఒకాయన చెప్పినట్టు పిల్లో, పిల్లాడో పుట్టగానే తల్లి తండ్రులు డిసైడ్ అయిపోతున్నారు వాడు ఫలానా డాక్టరో, ఇంజనీరో అవ్వాలని ఇంకా వీలయితే అమెరికానో, అఫ్రికానో వెళ్లాలని. ఈ మెంటాలిటీ మన అదృష్టం కొద్ది మన టైం లో రాలేదు, లేకపోతె చచ్చేవాళ్ళం.

    ఇక్కడ (UK) ఎడ్యుకేషన్ తో పోలిస్తే ఇండియాలో పిల్లల్ని చదువు పేరుతో ఎంత బాదుతున్నారో అర్ధమవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ని ఎంజాయ్ చేసేట్టుగా చెప్తారు గాని 'burden ' గా కాదు. మా పిల్లల్ని మా ఆవిడ బెదిరించేది మంచి సెకండరీ స్కూల్ లో సీట్ రాకపోతే ఇండియా లో పెట్టించి చదివిస్తానని.

    ఇప్పటి generation తో పోలిస్తే మనమెంత అదృష్టవొంతులమో అనిపిస్తోంది (ఇంత టెక్నాలజీ, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్ లేకపోయినా). నీ 'బ్లాగ్' చదివి కొంతమంది తల్లి తండ్రులన్నా మేలుకొంటే బాగుంటుంది.

    గో వె ర

    ReplyDelete
  21. పిల్లాడో పుట్టగానే తల్లి తండ్రులు డిసైడ్ అయిపోతున్నారు వాడు ఫలానా డాక్టరో,ఇంజనీరో అవ్వాలని ఇంకా వీలయితే అమెరికానో, అఫ్రికానో వెళ్లాలని. ఇలా ఎంత కాలం జరుగుతుంది లేండి త్వరలో ఆ వాస్తవం తెలుసుకొన్న పిల్లలు తల్లిదండృలను చావగొట్టి, మోహానా పేడ నీళ్లు జల్లి, ఉమ్మేసి ఇంటి నుంచి బయటపడతారు. వాస్తవంగా చెప్పలి అంటే కత్తేత్తుకొని పొడుస్తారు. పిల్లిని గది లో పెట్టి కొడితే అది పులి లాగా మారుతుంది. అప్పుడే తల్లిదండృలు కలలు కల్లలై భూమీదకు వస్తారు.

    ReplyDelete
  22. I think a lot of our (regressive) thinking about job and life are not entirely based on earning a livelihood, but, have to do with shame, social stigma and class and caste structure.
    ------------------------
    GIdoc గారూ మీరు చెప్పింది అక్షరాలా నిజం. అమెరికాలో మన వాళ్ళల్లో ఇంకా నిజం. మనం చెయ్యాల్సినదల్లా చదువులో గైడెన్స్ అంతే గానీ బండగా దానిలోకి నెట్టటం కాదు.ఇష్టా ఇష్టాలు ఎప్పుడూ అందరికీ ఒక విధంగా ఉండవు. అది గ్రహిస్తే అందరి జీవితాలు బాగుంటాయి.

    ReplyDelete
  23. Thanks Rao garu! I agree with your sentiment as well.

    ReplyDelete
  24. మంచి విశ్లేషణ రమణ గారు.. మన దేశంలో చదువులు కమర్షియల్/ఫార్ములా సినిమా లాగా ఒక వ్యాపారాత్మక మార్గం పట్టాయి. ఎలాగైతే వాటిల్లో 6 పాటలు అరగంట కి ఒక ఫైట్ అని కొలతలు ఉన్నట్లే వీటిల్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. 7 వ తరగతి చదివే వాడు అందులో ఉన్న సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టకుండా 6 సంవత్సరాల తర్వాత రాసే IIT కి ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి. ఇవి కాక ఇంకా సమ్మర్ కోచింగ్ ఇంక ఈ కమర్షియల్ ధోరణి ఎలా తయారయ్యిందంటే కొన్నాళ్ళ క్రితం కంప్యూటర్ విద్య చదివిన వాళ్ళకు వేలల్లో జీతాలు అని పత్రికల్లో, టీవీల్లో ఊదరగొట్టగానే అందరూ పొలోమంటూ అటుపడ్డారు, ఆ తర్వాత రిసెషన్ అనగానే అంతా ఎలక్ట్రానిక్స్ అని దానివైపు, ఈ మధ్య కొత్తగా ఆ క్రేజ్ సంతరించుకున్న కోర్స్ సి్ఏ... ఇలా ఏది చదివితే ఇంకా బాగా సంపాదిస్తారు అనేగాని , ఏ వృత్తి లో మనకు ఆ job satisfaction దొరుకుతుందో దాన్లో నిలదొక్కుకునేవాళ్ళు చాలా అరుదు. ఇలాంటి వ్యాపారాత్మక చదువులు వల్ల, ఆయా ఉద్యోగాల్లో ఉన్న చాల మందికి మనసొక చోట, మనిషొక చోట అన్నట్లు ఏదో వెలితిగా గడుపుతుంటారు.

    ReplyDelete
  25. excellent. every thing must not be thrown on government head. one diamond merchant gave security to 1400 families with his profits. why not rich do the same to elevate govt schools. they are spending /throwing crores of rupees in temples. that money can be utilised to improve govt institutions. good articulation.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.