మనం రాజకీయాల్ని మాట్లాడుకోవద్దు. వాస్తవాలు మాట్లాడుకొందాం.
సర్వకాలములందు సత్యం సత్యంగానే వుంటుంది, అసత్యంగా మారదు. రక్తం ఎర్రగా ఉంటుంది. గిచ్చితే నొప్పిగా ఉంటుంది. ఆకలేస్తే నీరసంగా ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇవన్నీ జీవిత సత్యాలు.
అలాగే - ఒక వ్యక్తి ఆకలి చావు ఈ మానవాళి సిగ్గుతో తల దించుకోవాల్సిన నేరం. అది ఇథియోపియాలో కావచ్చు, ఇండియాలో అయినా కావచ్చు. ఇందులో మినహాయింపులు ఉండవు, ఉండరాదు. కాబట్టి ఒక మనిషిగా, ఒక ప్రపంచ పౌరునిగా సిగ్గుతో తల దించుకుందాం.
అదేవిధంగా - పిల్లల్ని హింసించే వ్యవస్థ దుర్మార్గమైనది, నీచమైనది, నికృష్టమైనది అనే ఖచ్చితమైన అభిప్రాయం నాకుంది. ఇక్కడ ఎటువంటి వాదప్రతివాదనలకి తావు లేదు. మన దేశంలో చదువుల కోసం పిల్లల్ని హింసించడం చట్టవ్యతిరేకం. శిక్షార్హమైన నేరం. అదే విషయాన్ని మనమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం కూడా.
ఆహారానికి అవసరమైన పశువధ కూడా 'డీసెంట్'గా జరగాలని కోరుకుంటాం. కానీ - చైనాలో ఏం జరుగుతుంది? చట్టబద్దమైన హింసోన్మాదం. అందునా పసిమొగ్గలు. ఇదేమి రాజ్యం! ఒలింపిక్ మెడల్స్ కోసం పిల్లల్ని పశువుల కన్నా హీనంగా హింసిస్తున్నారు. వీళ్ళేమీ కేజెస్ లో పక్షులు కారుగా!
అమ్మా సైనా! అయ్యా గగనూ! ఒక దరిద్రపుగొట్టు వెధవ మెడల్స్ కోసం పసికూనల అందమైన బాల్యాన్ని చిదిమేస్తున్నాడు. వాడికి తమ దేశపౌరుల సంక్షేమం కన్నా అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యమట! మీదగ్గరున్న మెడల్స్ ఆ దౌర్భాగ్యుడి బిక్షాపాత్రలో ముష్టిగా వెయ్యమని నా సలహా! అప్పుడైనా బుద్ధొస్తుందేమో దొంగ గాడిద కొడుక్కి!
ఒరే బూచోడా! నీక్కావలంటే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ బంగారు ఆభరణాలు నీమొహాన కొడతాం లేరా! దాంతో ఇంకో వంద బంగారు పతకాలు చేయించుకుని మెళ్ళో వేసుకుని ఊరేగి చావు! కానీ - ఆ పసికూనల్ని నీ కబంధ హస్తాల నుండి వదిలెయ్యరా దౌర్భాగ్యుడా!
చివరగా - ఈ ఒలింపిక్ ఆటల్లో మెడల్స్ కోసం మానవ హక్కుల్ని హరిస్తున్న చైనాని చెప్పుతో కొట్టి, మెడబట్టి ఒలింపిక్స్ నుండి బయటకి తన్నాలని అన్నిదేశాల ప్రభుత్వాలకి, క్రీడా సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాను
(photo courtesy : Google)
ఈ లింక్ లో మరిన్ని పోటోలు ఉన్నాయి.
ReplyDeletehttp://meeandarikosam.blogspot.in/2012/08/blog-post_315.html
http://kamyunijam.wordpress.com/2012/08/02/ఒలింపిక్సులో-మనకు-చైనాలా/
SriRam
చైనా వెధవలంటే నాకు మా చెడ్డ చిరాకు. కానీ ఈ ఒలంపిక్స్ సమయంలో ఈ వార్తా కథనం విడుదల అవ్వడం - కాస్తంత అనుమానానికి దారి తీస్తోంది. దెబ్బ తగలకుండా, కష్ట పడకుండా ఏ ఆటలో ఎవరు రాణిస్తారు గనుక? ఈ చైనావాడి మెడల్స్ జాబితా చూసి ఓర్వలేని దేశాల హస్తమేమన్నా ఉండి ఉంటుందా - ఈ ప్రోపగాండా వెనుక? పాశ్చాచ్య దేశాలు బిల్లియన్లకొద్దీ డబ్బు ఖర్చుపెట్టి తమ క్రీడాకారులను ఒలంపిక్స్‌కు పంపిస్తున్నా, ఈ చైనా వాడి పుణ్యమా అని ఆ ఇన్వెస్ట్‌మేంట్ బూడిదలో పోసిన పన్నీరవుతోందాయే. ఇక కడుపుమంట పుట్టదా ఏమిటి? ఓ సారి మీ సుబ్బు అభిప్రాయం కనుక్కొని చెబుదురు డాట్రారు.
ReplyDeleteమెడలు వంచైనా మెడల్సు సాధించాల అనే చైనా పట్టుదలను స్వాగతిస్తున్నా. ఓ కాఫీ పోయినా పరవాలేదు, ఈ విషయం మీద కామ్రేడ్ సుబ్బు అభిప్రాయం తెలుసుకోవాలి. :)
ReplyDeleteno pain no gain
ReplyDeleteఈ ఫోటో లను వెంటనే తొలగించమని మనవి , వీటిని చూసి మన టి వి బాల కార్మికుల తల్లి తండ్రులు మరింత రెచ్చిపోతారు.
ReplyDeleteViraga kaasina chettuke ralla debbalu. velugu venuka suree gaa chekkati vuntundhi... india lo entha manchi pathakamu praveshapettina.. daani edo oka sollu reason cheppi vyatirekinchevallu thappaka untaaru.
ReplyDeleteokka medal vachhinappudu vallu kastala gurinchi valla guruvula gurinchi emi chepputhaaro vinandi.
emi kastapadakundaa maaku medals ravatledhu ante kudhuruthundhaa..
mana indian lone chinnappudu anthakante inkaa kastapaddavallu endharo unnaru.
manamu saadinchakunnaa.. ila photos nu chusi happy gaa feel avudhaamu.. maname better ani .. LOL
drawayer lu vesi vesi dance lu prothasisthunna tallithandulakante chinese better.
ReplyDeleteవ్యాఖ్యానమా ! ? నాబిడ్డల ఆస్థితిలో ఉంటే ? అని ఆలోచించి చూడండి .
ReplyDeleteమన తిరుమల వేద పాఠశాల్లో కూడా child abuse లాంటి శిక్షణే ఉంటుంది. 7 సంవత్సరాల వయసున్న పిల్లల్ని పొద్దున్నే లేపి గడగడలాడే చలి లో చన్నీళ్ళతో స్నానం చేయించి మాడవీధుల్లో వేద మంత్రోచ్చారణ కి పంపిస్తారు. పోనీ ఇదంత ఆ పిల్లలు ఐచ్చికంగా చేస్తున్నరా? దుర్గేశ్వర గారు, ఇటువంటి పద్దతి ని ఆపమని మీరు కోరతారా? భారతీయత కి సంప్రదాయాలను గౌరవించే మీరు బహుశా దానిని ఒక గురుకుల విద్యా విధానం గా ఉన్నతం గా చూడొచ్చు.
Deleteచాలామంది ఆ చలి కి, పరిస్థితులకి తట్టుకోలేక కోర్స్ పూర్తిచేయకుండానే వచ్చేస్తారు. అదే పూర్తి చేసి వచ్చిన వాళ్ళు మనకు ఎక్కడన్నా గుళ్ళో తారసపడితే వాళ్ళ పాండిత్యాన్ని మెచ్చుకుంటాం. వాళ్ళు పడిన కష్టాలకు అంత ప్రాధాన్యత ఇవ్వం..
ఇంతకీ నేను చెప్పేదేంటంటే, చూసే దృష్టిని బట్టీ ఉంటుంది. దేశం, సామాజిక పరిస్థితులు, ఇష్టాఇష్టాలు బట్టీకూడా మనం తప్పొప్పుల్ని అంచనా వేస్తాం. కేవలం ఒక బొమ్మ చూసో, లేక ఆ క్రీడలకు కావల్సిన శిక్షణ గురించి అవగాహన లేకుండా మనం child abuse పేరిట వాపోవటం అమాయకత్వం.
చా , దుర్గేశ్వర గారి వ్యాఖ్యలు చూడలేదా. తనపిల్లలిని అలా వేదపాటశాల లో కష్టాలు పడనిస్తారా.వేద పాటశాలలు మూసెయ్యాలని రేపో మాపో టపాలని టప టపా రాసేస్తారు చూడండి
DeleteWith the latest Photoshop technology, we can't say which one is real and which one is morphed. It doesn't mean that I am supporting China.
ReplyDeleteWe imported communism from China and Russia, especially Telugu writers. If someone cries in China or Russia, we will wipe out our cheeks. All our communist writers say we are bad, but never open up anything against these countries. China, though it has communist government, is the most corrupted country in the world. Our communist friends talk about our state of affairs with their ideology.
For them, may be blood is thicker than water.
మెడళ్ల కోసం పిల్లల్ని హింసిస్తున్న ఈ వెధవల మెడలు విరవాలి.
ReplyDelete- పుచ్చా
Which is better, that or this?:
Deletehttp://www.google.com/search?q=street%20children%20india&rls=com.microsoft:en-us:IE-SearchBox&oe=&surl=1&um=1&ie=UTF-8&hl=en&tbm=isch&source=og&sa=N&tab=wi&ei=63gfUJPEFMvNrQeKqoDgAQ&biw=1024&bih=596&sei=73gfUNn3EcfLrQfq9YHQDQ
రమణ గారు
ReplyDeleteఈ ఫోటోలు నిజమైనవేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే ఇటువంటి శిక్షణ కి తల్లిదండ్రుల అంగీకారం ఉన్నంతవరకు, చైనా ను నిందించలేము. (మరి తల్లిదండ్రులు ఏడుస్తున్న ఫోటోలు కూడా ఇప్పటినుండి పెడతారేమో )
మౌళీ గారు,
Deleteకామెంట్స్ చూస్తున్నాను. చర్చలో పాల్గొనడానికి కుదరట్లేదు. అమ్మయ్య! ఇప్పుడు ఫ్రీ అయ్యాను.
ఈ ఫోటోలు అబద్దం అయితే చాలా సంతోషిస్తాను.
తలిదండ్రుల అనుమతి ఉన్నా చైల్డ్ ఎబ్యూజ్ నేరమే గదా! 'నా పిల్లలు. నా ఇష్టం.' అంటే చట్టం ఒప్పుకోదు.
తల్లి తండ్రులు అంగీకారం ఉంటె చైనా ని నిందించాల్సిన అవసరం లేదా ?
Deleteఅలా అయితే మన రాష్ట్రం లో ఎంతో మంది బాల కార్మికులు ఉన్నారు వాళ్ళందరిని వాళ్ళ తల్లితండ్రులే పని లో పెడుతున్నారాన్న విషయం అందరికి తెలిసిందే. So మనం బాల కార్మిక వ్యవస్తని ప్రోత్సహించాలన్నమాట. Heights of Stupidity.
:venkat
హ్మ్ అబ్బో ఇదంతా ఆవేశ మేనా ? అయినా అజ్ఞాత కి అంత విలువ ఇచ్చేది లేదు :)
Deleteరమణ గారు,
తల్లిదండ్రుల అనుమతి తోనే పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. చదువు కానీయ్యండి, క్రీడలు, సైన్యం ఏదయినా . మనదేశం లో అయినా ఇంకే దేశం లో అయినా!!!!
నిజమే ధనవంతుల పిల్లలకి ఇంత కష్టపడాల్సిన ఖర్మ లేకపోవచ్చు. ye shiwen పన్నెండు సంవత్సరాలకే జాతీయ జట్టు లో ఎలా చోటు సంపాదించుకోగలిగినది? వాళ్ళ అమ్మా నాన్నా ఆ అమ్మాయిని యెంత ఇబ్బంది పెట్టి ఉంటారో కదా అని మొదటే అనిపించినది. కాని చూస్తే ఆమె తల్లిదండ్రులు ఇద్దరి కి ఈ విభాగాల్లో ప్రవేశం ఉన్నది.
చైల్డ్ ఎబ్యూజ్ నేరమే కాని, గ్రవుండ్ చుట్టూ పిల్లల్నిఇష్టం లేకుండా పొద్దుటే పరిగెత్తించే పి.ఇ.టి కూడా ఈ జాబితా లో వస్తుందా ????
చైల్డ్ అబ్యూజ్ పేరుతొ తల్లిదండ్రుల్ని శిక్షించిన ఉదాహరణలు మనచుట్టూ ఒక్కటైనా ఉందా ? కేవలం ఆ తల్లిదండ్రులను అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తూ ఉంటాము మనం
doctor garu,
ReplyDeleteolympics medals kosam china vallu pette shareeraka himsa kante vedava engineering/medicine seats kosam manam(especially andhrapradesh people)peduthunna himsa matemti?mari mana vaalla nemi cheddamantaru?
శ్రీనివాసరెడ్డి గారు,
Deleteపరీక్ష.. విజయం.. మొదటి స్తానం.. దానికోసం ప్రిపరేషన్.. అది సాధించేందుకు పిల్లలపై ఒత్తిడి. చదువుల పోటీ, ఆటల పోటీ, డేన్సుల పోటీ, పాటల పోటీ.. ఏ పోటీ అయినా కావచ్చు.. దుర్మార్గమైనవే!
కష్టపడనిదేఏదీసాధ్యంకాదు.కానిపసిపిల్లలవిషయంలో
ReplyDeleteమందలించాలి.మృదువుగానేర్పాలి.పెద్దవాళ్ళయినా
అసక్తిఉన్నవాళ్ళకే
ఐచ్చికంగానేర్చుకోవాలన్నవారికే
కఠినమైనక్రమశిక్షణతోట్రైనింగుఇవ్వాలి.
ఈఫొటోలుపాశ్చాత్యులుఒకmotiveతోవిడుదలచేసిన
మనస్వంతబుద్ధితోఆలోచించినా,చైనావాళ్ళు
ఒలింపిక్మెడల్స్కోసంచిన్నపిల్లల్ని
హింసించడన్నిఖండించవలసిందే.ఈసారిఒల్యంపిక్స్లో
మనవాళ్ళperformanceమెరుగ్గానేఉంది.
కమనీయం గారు,
Deleteమీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
This behavior is an extreme form of showcasing one's country (we can add clan or family honor, etc as well). Luckily, Olympics come once in four years, but, child labor and child abuse is an everyday affair. The totalitarian states (including communist countries, theocracies and dictatorships) have no human rights and need false propaganda to show their countries in good light on world stage. But, in today's connected world, everybody knows the inside truth. The glossy magazines like GDR Review that once mesmarized us as children do not fly any more. I see a lot of vicarious living by the parents through their children in the US - especially Asian immigrants. They want their children in Spelling Bee, soccer, tennis, swimming, Kumon, classical music/piano, classical dance - all things they wished they learned as a child. Nothing irritates me more than parents gushing about how their 6 year old can recite Bhagavadgeeta or name all the Presidents of the US, etc. Worse is the Guiness book crowd. We turn our kids into some circus monkies and for what? We need better nations and better families - not super duper kids.
ReplyDeleteThis is inhuman. No one have guts to ask china to stop this child abuse. If they want medals they need to learn from other winning nations how they are achieving.
ReplyDeleteThat is what is happening. Hundreds of Chinese athletes are getting trained in Phoenix (Arizona, US).
Deletehttp://articles.latimes.com/2012/aug/05/nation/la-na-arizona-china-olympics-20120805
ఉదయం దినపత్రికలో ఈ ఫోటోలు చూసి నేను కూడా ఇలాగే తిట్టుకున్నాను.
ReplyDeleteమెడల్స్ కోసం పేరు ప్రతిష్టల కోసం ఈ విధమైన హింస అమానుషం. మానవ హక్కుల సంఘం దృష్టికి ఈ విషయం ఇంతవరకు వెళ్ళ లేదంటారా?
వనజ గారు,
Deleteపొద్దున్న పేపర్ లో పిల్లల బొమ్మ చూసి ఆవేశంతో ఈ టపా రాసి పడేశాను (ఆ కారణాన ఆస్పత్రికి లేట్ గా వెళ్లాను. ఆవేశం అనర్దాలకి మూలం అన్నారు పెద్దలు. కానీ ఈ టపా రాయంగాన్లే రిలాక్స్ అయిపోయ్యాను).
ఇక్కడ కొందరికి ఈ బొమ్మలు చైనాకి చెందినవి అవడం మూలానా.. కొంత అభ్యంతరం ఉంది. కానీ.. ఈ బొమ్మలు నిజమైతే.. అది చైనా అయినా, చేబ్రోలు అయినా.. నాకు అనవసరం.
(ఈ చైనా కథ మన రాష్ట్రంలోని మెడికల్ ఎంట్రన్స్ కథ తో సరిపోతుంది.)
"...మానవ హక్కుల సంఘం ..."
Deleteఅయ్యో మీకింకా తెలియదల్లే ఉన్నది. ఈ హక్కుల సంఘాలన్నీ కూడా చైనా వాళ్ళు నడిపేవో/నడిపించేవో మరి.
verevallani ane badhalu mundhu meedhi chusukondi. Mundhu manmela ennamu. mari manadeshamu ento chudandi..
ReplyDeleteIkkada chines thappu annavallu.. mari vella gurinchi mundhu matladaremiti.. mana daggarithe right.. valla diggarithe thappa...
e pics chudandi. vallau aina annamu peduthu aatalu aaduthunnaru. mari meeru chesedemiti.
Sharam karo. evo 4 pics (nijamo kaavo teliyanivi) pattukoni china motthamu alane chesthundhi ani ela anukuntaaru.....
http://www.indiancricketfans.com/showthread.php?p=2064323
http://www.google.co.in/search?hl=en&q=indian%20children%20sports%20training&psj=1&bav=on.2,or.r_gc.r_pw.r_qf.&biw=1024&bih=608&um=1&ie=UTF-8&tbm=isch&source=og&sa=N&tab=wi&ei=2JgfUPK-JsTwrQf0_IHoBg#um=1&hl=en&tbm=isch&sa=1&q=child+labour+in+india&oq=child+labour+in+&gs_l=img.3.0.0l10.208987.213265.2.216294.16.14.0.1.1.1.638.4260.0j5j2j4j2j1.14.0...0.0...1c.3Bsl7JT8-vY&pbx=1&bav=on.2,or.r_gc.r_pw.r_qf.&fp=f4f48dd3a333dd36&biw=1024&bih=608
అఙాత గారు, లెస్స పలికితిరి. మనం చైనావాడి దాష్టీకం గురించి తెగ బాధపడుతూ హోటల్లో కాఫీ సేవిస్తుంటే, పక్కనే టేబుల్స్ తుడుస్తూ ఒక బాల కార్మికుడు ప్రత్యక్షం. వీళ్ళకంటే చైనా పిల్లల గతే మెరుగేమో!
Deleteఏదేమైనా ముందు మన బాల కార్మికుల అవస్థలని బ్లాగుల్లో ఖండ ఖండాలుగా ఖండించేసి తర్వాత చైనా వాడి సంగతి చుద్దాం.
ఐననూ రమణగారు ఇంత మంచి విషయాన్ని గ్రేట్ సుబ్బు గారితో డిస్కసించకుండా రాయటం - ఇది నేరం, ఇది ఘోరం అని మనవి చేస్కుంటున్నాను.
-
ఆత్రేయ
This comment has been removed by the author.
Deleteఈ పై ఆత్రేయ ఎవరో నాకు తెలీదు.
Deleteఅజ్ఞాత లా కామెంట్లు పెట్టడం నాకు అలవాటు లేదు
ఎవరో నన్ను బాగా పెద్ద వాడిని చేసారు.
ధన్యవాదములు.
ఇంకో ఆత్రేయ ఉన్నాడని తెలిస్తే నా కలం పేరు మార్చుకుంటా.
8 August 2012 09:43
క్షమించాలి మిత్రమా!
Deleteఇది నా కలం పేరు కాదు. నా అసలు పేరె.
పైగా నేను బ్లాగరిని కాను. మంచి బ్లాగుల చదువరిని మాత్రమే.
-
ఆత్రేయ
మరిచితిని. నాకోసం మీ కలం పేరు మార్చుకొనక్కర్లేదు. నేను ఒకవేళ బ్లాగినా వేరే పేరు పెట్టుకుంటానని మీకు బ్లాగోన్ముఖంగా హామీ ఇస్తున్నాను. ఈ పేరు మీద నాకు ఎటువంటి లీగల్ పేటెంట్స్ లేవని తెలియజేయటమైనది.
Delete-
ఆత్రేయ
ఇక్కడ మన చర్చలు
Deleteఒక మత క్షేత్రం లో అన్యమత ప్రచారం లా ఉంటాయి
అంచేత ahmisaran@gmail.com కి రండి
thanks and sorry Dr.Ramana ji.
అజ్ఞాత మరియు ఆత్రేయ గారు,
Deleteపిల్లలతో పనులు చేయించరాదని మనకి చట్టాలున్నాయి. చాలా చట్టాల వలె ఈ చట్టం కూడా సరీగ్గా అమలు పరచబడటం లేదు. 'ఎందుకు?' అన్నది వేరే చర్చ. కానీ.. బాలకార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరం. అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్ లంటూ హడావుడి కూడా జరుగుతుంటుంది. ఈ పాయింట్ ముఖ్యమైనది. మరి చైనాలో (మన బాల కార్మిక వ్యవస్థ వలె) దొంగచాటుగా ఈ పిల్లల హింస జరుగుతుందా? నాకు తెలీదు.
'ఈ హింసకి చట్టబద్దత లేదు. చైనాలో ఇట్లాంటి క్యాంపుల నిర్వహణ శిక్షార్హమైన నేరం. అక్కడ కూడా మనకి మల్లే అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్ లు ఉంటాయి.' ఇదే నిజమైతే చాలా సంతోషిస్తాను.
అవును మీరు చెప్పింది నిజం
Deleteబాల కార్మికుల విషయం లో నవంబర్ పద్నాలుగుకు ఒక వారం ముందు స్పెషల్ డ్రైవ్ నడిపి కామెడీ చేసే అధికారులకు మిగతా సంవత్సరం అసలు తీరికే ఉండదు.
నాలుగేళ్ల క్రితం నాకు తెలిసిన ఒక భాద్యతాయుత అధికారి (స్నేహితుడు) ఇంట్లోనే పన్నెండేళ్ళ అమ్మాయిని పనిమనిషిగా ఇంట్లో ఉంచు కుంటే, నచ్చచెప్పి వినకపోతే, బెదిరించి మానిపించాను.
గొంగట్లో అన్నం తింటూ.. లా ఉంది మన సమాజం.
ఇంకో ఆత్రేయ గారు, చాలా మంచిపని చేసారు. మేము కూడా ఇలా 2-3 సార్లు చేయాల్సివచ్చింది. మరి పనిచేసేవారి సమస్యలు, వారు ఎందుకు అలా పిల్లలని చదువులు మానిపించి పనులకి ఎందుకు పంపుతారో చర్చించాలంటే "అనగనగా ఒక రాజుగారి ఏడుగురు కొడుకుల చేపల కధ"లా అవుతుంది. అంచేత ఆ ముచ్చట ఇప్పుడు పెట్టట్లేదు.
Deleteఅయ్యా డా.రమణ గారు,
అఙాతలాగా కామెంటుతున్నందుకు క్షంతవ్యుడను. సొంత కుంపటి పెట్టుకునేందుకు బద్ధకించే నాలాంటి పరాన్నజీవులని బ్లాగ్మిత్రులందరూ క్షమించగలరు.
-
ఆత్రేయ
నేను క్షమించేశా. కుంపటి ఈరోజుల్లో ఎవరు వాడుతున్నారు కాని, మీకో స్వంత గ్యాస్ స్టౌ అమరాలని కోరుకుంటున్నా. :))
DeleteThe bloody UNO has to speak up and condemn these type of inhuman issues. An international boycott must be declared against China.
ReplyDeleteమిత్రులారా,
ReplyDeleteనాకు మళ్ళీ తొమ్మిది ఉదయం దాకా నెట్ వైపు రావడం కుదరదు. comment moderation లేదు కావున, నా బ్లాగులో మీరు నిరభ్యంతరంగా చర్చించుకొనవచ్చును. ఐతే, దయచేసి భాష విషయంలో సంయమనం పాటించవలసినదిగా విజ్ఞప్తి. ఈ విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. టపాకి స్పందించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. సెలవు.
డాక్టరు గారు కొందరు పేషంట్‌లకే జవాబులు అమితాసక్తిగా ఇస్తున్నారు. అజ్ఞాత ప్రశ్నలకు జవాబులు ఇవ్వట్లేదు. ఇవి మానవహక్కుల వుల్లంఘన కాదా? వారిలో వున్నదేది? మాలో లేనిదేది?
Delete(Anonymous6 August 2012 20:57)
Deleteఅజ్ఞాత హక్కుల సంఘం సభ్యత్వం కోసం మీ పేరు, అడ్రెస్స్ ఒక వ్యాఖ్య గా వ్రాస్తే చాలు.
ఈ సంఘం లో సభ్యత్వం తీసికొన్న అజ్నాతలందరికీ రమణయ్య గారు సమాధానం ఇచ్చి తీరాల్సిందే.
అజ్ఞాతా (20:57),
Deleteమన బ్లాగర్లు చాలామంది రాసే విషయం మీద మంచి అవగాహనా, పట్టు ఉండి.. ఆ విషయంపై టపా రాస్తారు. నాకంత అవగాహన ఉండదు. ఓపిక ఉండదు. విషయం తెలుసుకోకుండా, కోపం వచ్చి (ఉదాహరణకి ఈ చైనా పోస్ట్) పైపైన రాసేస్తుంటాను. ఇలా రాయొచ్చా? రాయకూడదు. కానీ రాయడం మీద నిషేధం లేదు కావున రాసేస్తుంటాను.
నా అదృష్టం ఏమంటే.. నే రాసిన విషయం మీద నాకన్నా ఎన్నో రెట్లు అవగాహన కలిగిన వారు అజ్ఞాతలుగా కామెంట్లు రాస్తుంటారు. వారితో విభేదిస్తూ వేరొక అజ్ఞాత ఇంకో చక్కని కామెంట్ రాసేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం ఏముంటుంది?! (అంత సరుకు కూడా లేదిక్కడ). మనసులోనే 'వావ్.. ' అనుకుంటూ మెచ్చుకోవడం తప్ప!
అదీగాక.. నేను రాసిందాన్ని కాపాడుకుంటూ.. వాదనకి దిగడం నాకు అలవాటు లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. నా పోస్ట్ ఒక ఆలోచన. ఎవరి అభిప్రాయం వారిది. అప్పుడప్పుడు నేను రాసినది తప్పు అని భేషరతుగా ఒప్పుకున్నాను కూడా (నా యోగా టపా ఒక ఉదాహరణ).
చాలసార్లు నాకు టైం ఉండదు. పేషంట్లని చూస్తూ.. మధ్యలో హడావుడిగా (వ్యాఖ్యలు) రాస్తుండడం మూలానా.. కొన్నిసార్లు మిస్ అవుతుంటాను. ఐనా.. ఇకనుండి మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను.
డాక్టరు గారు, EAMCET కోసం పిల్లల పైన ఒత్తిడి పెడితే తప్పేముంది? విద్యార్థి దశలో వాళ్ళకు ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు కాబట్టి భయపెట్టి అయినా చదివించాలి. ఇంటర్ వరకు బాగా చదువుకొని మెరిట్లో ర్యాంకులొస్తే ఆ తర్వాత జీవితం సాఫీగా సాగిపోతుంది కదా? నాకు అయితే అందులో తప్పు కనిపించడం లేదు, తల్లిదండ్రుల తపన కనిపిస్తోంది, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తోంది.
ReplyDeleteఅన్నట్టు మీ పిల్లలను కార్పొరేట్ కాలేజీలో ఎందుకు చేర్పించారు? ఒత్తిడిలేని గవర్నమెంటు కాలేజీలో చేర్పించవచ్చు కదా?
http://100telugublogs.blogspot.com
.
ఎ రోజు నేను ఒక్క కమెంటు చదవకుండా కామెంటుతున్నను,(అంటే ఇది నా స్థిరమైన అభిప్రాయము)అసలు జీవితంతము మనతో ఉండేది బాల్యం లోని సంగతులే కదా మరి ఆ బాలలు నరకాన్ని చూస్తున్నరు కనుక చైనా వాడి కక్కుర్తి నీచమైనది.కాని ఈ హిన్స నీ సమర్దించే వక్ల్లు ఉండటం అదీ మన తెలుగు బ్లొగుల్లో సమర్థించడం దారిద్ర్యమే .సమర్ధించే వాళ్ళు వరి బాల్యం అంతా నొప్పులతో ఉంటే ఎలాగుంటుందొ ఒక్క సారి ఊహించుకోండి,పైగా ఆ చిన్నరులంతా పూట సరిగ్గ గడవని పేదకుటుంబాల నుండి వచ్చరుట...మనకు పతకాలు రాలేదని విమర్శించటం కాదు గాని ...ఆ చిన్నరుల నొప్పి నొప్పే మనసు చివుక్కుమనటం మానవ సహజం
ReplyDeleteబాల్యం కావాలంటే బావిషత్తు సీకటవ్వుద్ది. ఏది ముక్కెమో పెదోల్లకి
Deleteమూర్ఖమైన అభిప్రాయాలు సాధారణంగా స్థిరంగా వుంటాయి. ఓపన్ మైండ్ వున్న వాళ్ళు అందరి అభిప్రాయాలను చదివి తమకంటూ ఓ అభిప్రాయం ఏర్పరుచుకుంటారు. ఏదీ శాశ్వతం కాదు, అంతకన్నా గొప్ప ఆలోచన వస్తే ముందు ఆలోచన అంతరిస్తుంది. మనిషి ఎదగాలంటే అది అలా జరగాలి. స్థిర అభిప్రాయాలన్ని గొప్ప అభిప్రాయాలని భావించడం తెలియనితనం.
Deleteచైనా సొసైటీ అనాథలను చేరదీసి, అలా శిక్షణ ఇచ్చి ఓ గుర్తింపు, బ్రతుకు తెరువు కనిపిస్తోంది. మనమో?! వీధుల్లోనో, చెత్తకుప్పల్లోనో, కప్పులు కడుగుతూనో, వెట్టి చాకిరి చేస్తూనో గడిచిపోయే బాల్యాలకన్నా చైనా బాల్యాలు మెరుగ్గా అనిపించడం లేదూ?
'ఆటా' కార్యక్రమంలో డబల్ మీనింగ్ పాటలకి డాన్స్‌లు చెయ్యించి ప్రైజ్‌లు తెప్పించడానికి పిల్లల చేత కాళ్ళు పీకేలా డాన్స్‌లు చెయ్యించేవాళ్ళని అరెస్ట్ చెయ్యాలి ముందు.
ReplyDeleteఫొటోలు చూస్తే వాళ్ళు పనిష్‌మెంట్‌లో ఉన్న స్కూల్ పిల్లలలాగే కనిపించారు.
ReplyDeletehere is a blogpost on the same subject: greatbong.net/2012/08/07/some-thoughts-on-the-olympics/
ReplyDeleteవేద పాఠశాలలో చదువుకూ దీనికీ పోలికా ? హు . ద్వేషం తొచుస్తే అంతే
ReplyDeleteఅలా అయితే తమరు మెడల్స్ తెచ్చుకొంటున్న పిల్లలపై నో వల్ల తల్లిదండ్రుల పైనో కుళ్ళు తో చూడటం మానేస్తే సరిపోద్ది గా దుర్గేశ్వర గారూ ఉ ఉ ఉ ఉ
Deleteనేను పోలిక పెట్టలేదండి. మనకి పరిచయం ఉన్న దానిపట్ల, పరిచయం లేని దానిపట్ల మారే మన దృష్టి కోణం చెప్పటానికి అలా ఉదహరించాను. అంతవరకే, నేనూ మీ అంత unconditional గా కాకపోయినా మన వేదాల్ని, సంస్కృతి ని గౌరవిస్తాను.
DeleteI can easily say these pictures are morphed.
ReplyDeleteLook at the LAST picture. The kid ( between the first two kids who are in foreground) with his body along with the beam is in the room whereas his legs are behind the window. Even the second picture is also a tampered one, I can easily say.
Technology can make us believe the unreal to be true.
I know the last picture is confusing, but, no one can miss the pain and suffering of the kids in the foreground. The kid in the back may either be in an adjacent room or actually is a reflection in the mirror. Logically speaking why one needs to change the background when the the three kids perfectly show what you want to portray? There are many more pictures of this kind on the net from China which by the way nobody from china said are doctored. While many view it as child abuse or torture, the Chinese apparently see it as a rigorous program to get the "desired" results. The first picture of an adult stomping on the kid's legs - I have read elsewhere - actually represents stretching the muscles and not part of punishment. In any event, I don't believe you can dismiss the entire story on the basis of tampering.
ReplyDeleteI do sympathize with kids and do feel the pain they go through.
ReplyDeleteWe all shouldn't believe when a picture appears on the net. As I said earlier, I am not a big fan of China or their policies either. They are simply cruel. We, in India, see more and more children in hotels / shops where the owners slap their faces and beat them badly. I have seen this many times. Whether the abuse is small or big, it is an offense. That's I want to say and China definitely should be punished for any child atrocities they do.