"శీను! ఎంతకాడికి అట్టా పడుకునుంటే ఎట్టా గడుసుద్దిరా? ఇంట్లో తాగడానికి మంచిళ్ళు లెవ్వు. అట్టా బాయి కాడికెళ్ళి నాలుగు బుంగలు నీళ్ళు మోసుకురా!" గద్దింపు.
".................................."
"మూడుపూట్లా టయానికి తిని తొంగుంటావు. నీ సెల్లెలు కాడికెళ్ళి బావకి కొద్దిగా బయ్యం సెప్పయ్యా! ఆ యెదవ తాగొచ్చి బిడ్డతల్లని కూడా సూడకుండా మీ సెల్లెల్ని రోజూ తంతన్నాడు." పురమాయింపు.
"..................................."
"రేత్రి నించి మీ నాయన ఉలుకూ పలుకూ లేకండా ఆ ఇదాన మంచాన పడున్నాడు. అసలే షుగరు పేషంటు. నీకు దణ్ణం పెడతా! ముసలయ్యని ఆచారి డాట్టరు కాడికి తీసుకెళ్ళు. నాకు బయమేస్తంది శీనా!" ఏడుపు.
"..................................."
"కూడొండుదామంటే బియ్యం లెవ్వు. ఆడదాన్ని, రోజూ వొక్కదాన్నే కూలీ కెళ్లలేకపోతన్నానయ్యా! ఇయ్యళ నా కాళ్ళు పట్టేసినయ్యి. బాబ్బాబు! ఈ ఒక్క రోజన్నా పన్లోకెళ్లరా!" వేడికోలు.
"...................................."
ఇంతలో బయట్నుండి గావుకేక!
"రేయ్ శీనాయ్! దారుణం జరిగిపోతాంది. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పోస్టర్లని అళ్ళెవళ్ళో తగలబెడతన్నారంటా! మన పవర్ స్టార్ కి అవమానం జరిగిపోతాంది! అర్జెంటుగా రారా! మన మెగాఫ్యాన్స్ దెబ్బేందే ఇయ్యాళ నా కొడుకులుకి సూపించాలా!"
అప్పటిదాకా దుప్పటి ముసుగేసుకుని తడికె వైపు తిరిగి బద్దకంగా పడుకునున్న శాల్తీ శరవేగంతో బయటకి దూసుకెళ్ళింది!
(picture courtesy : Google)
సాగుతున్నంత కాలం జీవితంలో ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది.
ReplyDeleteRao S Lakkaraju గారు,
Deleteకొందరు తెలుగు సినీ అభిమానులకి (జీవితం సాఫీగా సాగకపోయినా) అభిమానం సాగుతూనే ఉంటుంది.
కరెక్ట్ గా చెప్పారు సార్.
Deleteచెప్పాలనుకున్నది సున్నితంగా చెప్పారు, రమణగారు.
ReplyDeleteపోతే ఇలాంటి చవుకబారు సినిమాల మీద దాడికి తెలబాన్లకి నా వ్యూహాత్మక మద్దతు వుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి దాడులవల్ల, ఒళ్ళు దగ్గరుంచుకోని సినిమాలు తీసే అవకాశాలు వుంటాయి. ఆ టైటిల్ చూశాక, తెలబాన్లు అలాంటి సినిమాల మీద వసూళ్ళకు పాల్పడాలని నిర్ణయించడం ముదావహం, లోలోన ఎంతైనా సంతోషించాల్సిన విషయం. దీనిలో తెలగాణ ఆంగిల్ చూసిన వారి కపులు, లొల్లికారుల మేతావిత్వానికి జోహార్లు తెలపాలి. ఏదేమైనా... కాగల కార్యం కాలకేయుల్లాంటి తెలబాన్లు తీర్చారు. :))
SNKR గారు,
Deleteపూరీ జగన్నాథ్ అవసరాలకి తగ్గట్టుగా సినిమాల్ని పూరీల్లా వత్తేసి జనాల మీదకి వదుల్తుంటాడు. ఆయన సినిమాలు ఆయన కూడా సీరియస్ గా తీసుకోడేమో!
(నాకీ సినిమా చూసే ఉద్దేశ్యం/ధైర్యం లేదు.)
@SNKR
ReplyDeleteనీ మద్దత్తు ఉంటే ఎంత పోతే ఎంత. బ్లాగుల్లో ఇంఫోసిస్ నారాయణమూర్తి తర్వాత అంత పెద్ద అచీవర్ లాగా.. ప్రతీ బ్లాగుకీ వచ్చి చెత్త కూతలూ నువ్వూ.. ప్రతీ యదవ బ్లాగులోనూ నీ కామెంట్లే .. బ్లాగులకి విరామం ఇవ్వవయ్యా బాబు.
మళ్ళీ నన్ను తెలబాన్ అనుకోకమ్మా ..
నువ్వూ నీ పైత్యం చూసి విసుగుచెందిన ఒక సగటు బ్లాగరుని నేను.
This comment has been removed by the author.
Delete@SNKR
ReplyDeleteప్రతీ బ్లాగుకీ వచ్చి నీతిసూక్తులు వల్లించే ముందు. నిన్నెవడన్నా అడిగాడా, ఏ హక్కుతో చెప్తున్నావు అని నిన్నునువ్వు ఒకసారి ప్రశించుకోవాలి. నీకు తప్ప ఇంకెవడికీ నీలాగా బేవార్స్ కామెంట్లు రాసే హక్కులేదానా నోరుపెట్టుకు పడిపోతావు .
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteఆ డిలీట్ చేసిన కామెంట్ల కోసం నీవు హారంలో వెతుక్కుంటని తెలుసు, నీకు ఆ పనైనా ఇచ్చాను, థేంక్స్ చెప్పుకో. ;)
Deleteమీరు చదివారో లేదో కాని, ఇదే కథాంశంతో కొన్ని నెలల క్రితం స్వాతి మాసపత్రికలో ఒక అనుబంధ నవల వచ్చింది.
ReplyDeleteనేను చదవలేదండి.
Deleteచిన్నప్పుడు ఆంధ్రప్రభ, పత్రిక చదివేవాణ్ని. గత మూడు దశాబ్దాలుగా నాకు తెలుగు మేగజైన్లు చదివే అలవాటు పోయింది. ఆ మధ్య 'నవ్య' అని ఒక మేగజైన్ చూశాను. నాకు నచ్చలేదు.
నిజంగా చూసినట్టే రాసారు (మాండలికంలో చెప్పడం వాళ్ళ కాబోలు). ప్చ్ ఏం చేస్తాం. తెలంగాణా మహోద్యమం పనికి రాని సినిమా దియేటర్లలో ఇరుక్కుపోయింది. శీను లాంటోల్లు మన బ్లాగుల్లో కూడా ఉన్నారండి. ( నేను అలా కాకూడదని కోరుకుంటున్నాను ).
ReplyDeleteఎప్పటి నుండో నాదొక సందేహం, ఎందుకు జనాలు సినిమా నటులని అభిమానిస్తారు, అంటే అభిమానం హద్దులు దాటేలా ఎందుకు ఆ పిచ్చి. అది నటన అని తెలిసి కూడా ఎలా పడి చస్తారు. ఇది ఎమన్నా identity crisis లాంటిదా ?
:venkat
/శీను లాంటోల్లు మన బ్లాగుల్లో కూడా ఉన్నారండి./
Deleteబాగా చెప్పారు, ఎందుకు లేరూ? ఆ పైన వుండే మనోభావాలు దెబ్బతిన్న అనానిమస్‌ది ఆ బాపతే ... :))
వెంకట్ గారు,
Deleteమీ ప్రశ్నకి సమాధానంగా ఒక పోస్ట్ రాయొచ్చు. నాకు ఈ సినిమాలు, సినిమా హీరోల వెర్రి అభిమానులపై జాలి తప్ప వేరే అభిప్రాయం లేదు. అయితే ఎంత balenced గా రాసినా.. 'మనోభావాలు' దెబ్బతిన్న హీరోల అభిమానులు నన్ను అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో తప్పకుండా రాస్తాను. కొద్దిగా బుర్ర పెట్టి రాయవలసి ఉంది. ప్రస్తుతం నా పోస్టులు ఒకటీ, అరా పాయింట్లతో పొట్టిగా సాగిపోతున్నాయి.
ఎవరి మ్యూజిక్ వారిది వెంకట్ గారు మీకు తెలియనిదేముంది. ఒకరికి సినిమా నటులు, ఇంకొకరికి రాజకీయ వేత్తలు, మరొకరికి సాహితీ వేత్తలు, వేరొకరికి క్రీడాకారులు, ఇంకొందరికి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇలా తమ వృత్తిలో నైపుణ్యం సాధించిన వారు... ఇలా పలురకాలు.. సినిమా గురించి ప్రచారమెక్కువ కనుక అందరికీ ఎక్కువ తెలుస్తుంటుంది అంతే. ఇక్కడో చిత్రమైన విషయమేంటంటే తమకి ఇష్టమైన రంగంలో ప్రావీణ్యం సంపాదించినవారిపై హద్దులుదాటిన అభిమానం పెంచుకున్న ప్రతి ఒక్కరికి పక్కవారిది పిచ్చి లాగానే కనిపిస్తుంది :-)
Deleteఅంతెందుకు పైటపాని కాస్త అటూ ఇటూ మార్చి చివర్న రమణ గారి బ్లాగ్ లో కాంట్రవర్షియల్ టపా వచ్చిందోయ్ ఫలానా వర్గానికి అన్యాయం జరుగుతుంది అని పిలిస్తే పనులన్ని వదిలేసి ఇక్కడ కామెంట్ల యుద్దం చేయడానికి పరిగెట్టుకొచ్చినట్లు కూడా రాయవచ్చు :) ఏమంటారు రమణ గారు :-))
వేణూ శ్రీకాంత్ గారు,
Deleteఎవరి మీదనైనా 'హద్దులు లేని అభిమానం' సరికాదు. అది అమాయకత్వం, అజ్ఞానం నుండి పుడుతుంది.
అయితే human developmental stages theory ప్రకారం.. ఒక్కో దశలో ఒక్కోకళ్ళని విపరీతంగా అభిమానిస్తాం. ఉదాహరణకి పిల్లలు మొదట్లో తల్లినీ, తరవాత తండ్రినీ అభిమానిస్తారు. ఇంకో దశలో క్రీడాకారుల్నీ, సినిమా నటుల్నీ అభిమానిస్తారు. అయితే ఈ దశలన్నీ టెంపరరీ. జీవితం unfold అవుతున్నకొద్దీ, ఈ 'హద్దులు లేని అభిమానం' అనే భావన తుడిచిపెట్టుకుపోతుంది.
అయితే కొందరిలో ఈ normal behaviour కనబడదు. మానసిక ఎదుగుదల లేక వారి intellectual ability ఒక చోట ఫిక్స్ అయిపోతుంది. వారిలో ఈ సినీ అభిమానులున్నారేమో పరిశీలించవలసి ఉంది. కొందరిలో affectionate childhood కరువైన కారణాన, లేక కుటుంబ వత్తిడుల మూలానా తమ అభిమాన నాయకుడి వల్ల dependency needs తీర్చుకోవచ్చు.
ఒకప్పటి అరవ హీరో అభిమానుల్లా ఇప్పుడు మన తెలుగు హీరో అభిమానులు ఎందుకు మారారన్నది సీరియస్ గా విశ్లేషణ చేయవలసి ఉంది.
నిన్న సినీజీవులమీద అభిమానం అనగానే భుజాలు తడుముకుని వెంటనే పై కామెంట్ రాసేశానండీ... ఈ రోజు మీరు కామెంట్స్ లో చెప్పిన ఈ పోస్ట్ వెనుక ఉద్దేశ్యం ప్లస్ పైకామెంట్ చదివాక మీ ఈ పోస్ట్ తో నేనూ ఏకీభవిస్తున్నాను. దురభిమానం ఎప్పుడూ చేటే.
Delete18 న సినిమా రిలీజ్ అయితే, ఆ రోజు ఎవ్వడు నోరు మెదపలేదు.
ReplyDeleteమన కెసిఆర్ వేలు నమస్తే తెలంగాణా లో 19 న న్యూస్ రాగానే మన ఉస్మానియా యువ కిశోరాలు, నలభై సంవత్సరాల విధ్యార్ది నాయకులు వాళ్ళకి చేతనైన , ఇష్టమైన రీతిలో రభస చేసి వెళ్ళారు. నిజంగా అభ్యంతరాలు ఉంటె, సినిమా విడుదల అయిన రోజునే జనం నిరసన తెలిపే వారు. Though I am not against Telangana movement, but I dont agree with the people saying the movement is in the hands of Telanganites.
నేనీ పోస్ట్ తెలంగాణా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. సంజయ్ గాంధీ 'కిస్సా కుర్సీ కా' మాయం చేసేశాడు. 'ఆంధీ' నిషేధానికి గురయ్యింది. సినిమా ఏమీ పవిత్రమైన పుణ్యకార్యం కాదు. వ్యాపారం. వ్యాపారస్తుల పట్ల జాలి చూపనవసరం లేదు.
Deleteఈ పోస్ట్ సినిమా నటులకి వీరాభిమానులైన పేదవారిని ఉద్దేశించి రాశాను. నాకు ఎందఱో శీనులు తెలుసు. వారి కుటుంబాల పరిస్థితి దుర్భరం.
దయచేసి అటువంటి వీరాభిమానుల గురించి కూడా రాయండి. సందేశం ఇవ్వమని అడగడం కాదు, జాగ్రత్త గా ఉండటానికి అడుగుతున్నాను. మీరు చెప్పే అనుభవాలు చదివి ఇతరులు కొంచెమైన మారవచ్చు or ఇటువంటి శీను లకి చెప్పడానికి అవి ఉపయోగపడవచ్చు
Delete:venkat
/ఈ పోస్ట్ సినిమా నటులకి వీరాభిమానులైన పేదవారిని ఉద్దేశించి రాశాను. /
Delete'సందేశాత్మకంగా' ఈ వ్యాసారని రాశాను అని ఇండైరెక్ట్‌గా ఒప్పేసుకుంటున్నారు, అవునా? :) ఏదీ ఓ సారిలా మీ సుబ్బు గారిని పిలవండి, చర్చించాలి ;)
రమణ గారు.. ఈ శీను నిన్న పవన్ కి జరిపే పాలాభిషేకంలో పాల్గొన్నాడు అప్పు చేసి మరీ ఓ..చేయ్యివేసాడు.
ReplyDeleteవనజవనమాలి గారు,
Deleteపాలాభిషేకాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు sponsored events. వీటి వెనక పెద్దపెద్దవాళ్ళే ఉంటారు. శీను ఒక అమాయకపు వీరాభిమాని. కార్యకర్తగా హడావుడి చేస్తూ.. 'ఉపయోగించుకోబడతాడు'.
ReplyDeleteనా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి సినీ నటులను ఆరాధించేది పేదతనంవుండే చదువు రాని వాళ్ళు మాత్రమే కాదు. బాగా చదువుకుని బలిసిన వాళ్ళకు కుడా (డబ్బు పరంగా) ఈ జాబితాలొ వుండారు. అదీ విదేశాలలొ వాళ్ళ అబిమాన నటుల సినిమాలకు కేక్ కట్ చెయ్యడం లాంటివి చేస్తారు. ఆ అభిమానం వెనుక కులం కుడా ప్రదాన పాత్ర పొషిస్తుంది.అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిన వారుకూడా ఒక నటుడి పక్కన కూర్చుని బొజనం చేయడానికి పొటీలు పడి డబ్బులు చెల్లిస్తున్నారు దీనికేమంటారు?
సినిమా సాహిత్యం అనేది చాలవరకు తక్కువ స్తాయి గల అల్పమైన సాహిత్యం. అయితే చలం గారు అన్నట్టు ఒకడు ఠాగూరు కవిత్వాన్ని చదివి మైమరచి పొవచ్చు ఇంకొకడు సినిమా వాల్ పొస్టర్ చూసి మైమరచి పొవచ్చు.అనుభూతి చెందేదాంట్లొ తేడా లేకపొవచ్చు ఆ వస్తువులొ తప్ప.
నిద్దుర లేచినదగ్గరనుంచీ పేపర్లలొనూ , T.V ల లొనూ సినిమాలగురించి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు దాంతొ వాళ్ళు సాదారణ మానవమాత్రులుగా కనపడటం లేదు. దాంతొ వ్యక్తిగత పూజ ఎక్కువ అయిపొయింది, డబ్బు కీర్తి ప్రటిష్టలు కుడా తొడయ్యాయి. కీర్తి ప్రటిష్టలులలొ శ్రమ అణువంతైనా వుండదు కానీ దాన్ని డబ్బుగా మార్చుకునే వీలు పెట్టుబడీదారీ సమాజం కల్పించింది ఒక షాపు ఓపెన్ చేసిందానికి 9 కొట్లు. రమణ గరూ తప్పులు సవరించాను పైదాన్ని తీసెయ్యండి.
నిజమా రామ్మోహన్ గారూ, కీర్తి ప్రతిష్ఠలలో శ్రమ అణువంతైనా ఉండదా? intesting. సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ బేటింగ్ చెయ్యలేదు కదూ,
Deleteజస్ట్ అలా అలా స్టేడియం లో జనాలకి బేట్ చూపించేవాడు, అందుకే అతనికి అంత పేరు వచ్చింది. ఆ మధ్య సానియా మీర్జా, సైనా నెహ్వాల్ చేతుల్లో ఏమిటవి? టెన్నిస్ బేట్ లు అనుకున్న ఇన్నాళ్ళూ. కావన్న మాట, అదేదో హారీపోట్టర్ సినిమాలో చూపించినట్లు అటూ ఇటూ ఊపే కర్రపుల్లలేమో కదూ. మరి మన కరణం మల్లీశ్వరి మాత్రం తక్కువ తిన్నదా ఏమిటి? జస్ట్ దారికి అడ్డుగా ఉన్న చీపురు పుల్లని పైకెత్తి అవతల పడేసింది అంతే.. ఆమెకు అవార్డు ఇచ్చేసారు. ఎంత ఘోరం! మన డాక్టర్ గారు అభిమానించే చలం, కొ.కు. లు కూడా జస్ట్ తెల్ల పేపర్లు ఉన్న పుస్తకాలు అమ్ముకునే మామూలు మనుషులు కదూ! వారికేమో గొప్ప రచయితలుగా పేరు. ఎంత విడ్డూరం!
నేనేదో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను అనుకోకండి. పెద్దగా శ్రమ పడకుండా పేరు తెచ్చుకున్న ఇద్దరి పేర్లు నాకు తెలుసు. ఒక పుస్తకాన్ని మూలరచయిత ఏ భావం తో రాసాడో తెలుసుకోకుండా, చరిత్ర తెలుసుకోకుండా నోటికొచ్చినది రాసి పడేసి పేరు తెచ్చుకున్న ఒకామే గొప్ప రచయిత్రి. రంగనాయకమ్మగారనీ.. మీరు వినే ఉంటారు. ఇక రెండోవారు. సినిమా చూడకుండానే కథ చెప్పే ప్రబుధ్ధుడిలా ప్రామాణికంగా అంగీకరించే పుస్తకాలు పూర్తిగా చదవకుండా కేవలం అట్టమీదున్న బొమ్మ చూసి "ఇదుగో ఇతనే ఈ కథలో విలన్. ఇతని చేతిలో చచ్చిపోయినవాళ్ళందరూ హీరోలు, కావాలనే రచయిత వీళ్ళని చెడ్డగా చిత్రీకరించాడు" అని చెప్పే ఓ పెద్దాయన ఉన్నాడు, పేరు ఐలయ్య.
శ్రీ సూర్య గారూ. ప్రేరు ప్రతిష్టలలొ శ్రమ వుందా లేదా అనేది ఇక్కడ చర్చించలేము అది ఆర్దిక శాస్త్రానికి సంభంధించినది .
Deleteఒక వ్యక్తి చేసిన శ్రమకు బిల్డింగ్ శ్రమ గానీ లేక చెక్క పని లేద ఒక నటుడి శ్రమ గానీ అతను చేసిన శ్రమ కాలాన్ని బట్టీ వాడిన ఉత్పత్తి సాదనాలను పట్టీ ఒక వస్తువుకు విలువ ఎర్పడుతుంది. ఒక సారి వినియొగించబడిన వస్తువుకు మళ్ళీ, మళ్ళీ విలువ ఎర్పడటం జరగదు మళ్ళీ దానిపైన కొత్తగా శ్రమ వెచ్చిస్తే తప్ప. వెచ్చించిన శ్రమ వస్తువులొ వుంటుంది ప్రేరు ప్రతిష్టలు వస్తువు బయట వుంటాయి. ఇద్దరి వ్యక్తుల మద్య మార్పిడి జరిగిండంటె సమానమైన విలువుల మద్య మార్పిడి జరుగుతుంది మరి షాపతనికీ,ఈ నటుడికీ 9 కొట్ల మారకం ఎంజరిగిందీ?
పైన నేను చెప్పింది అర్దం కాకపొతే చెయ్యగలిగింది ఎమీ లేదు ఆర్దిక శాస్త్రాన్ని ఒకటి రెండు మాటల్లొ చెప్పగలిగే విషయం కాదు. మీరు క్రీడల గురించి చెప్పారు క్రీడలనేటివి శ్రమల కిందకు రావు. నిద్రపొవడం, బొజనం చెయ్యడం, వ్యాయామం చెయ్యడం శ్రమలు కానట్టె క్రీడలు కుడా శ్రమ కాదు.అవి వ్యక్తిగత ఉల్లాసం మాత్రమే.
ఇక రంగనాయకమ్మ గారి మీద మీ విమర్శ పస లేదు. మీ ఆనందంకొసం . మిమ్మలను మీరు సంత్రుప్తి పరుచుకొండి.
అల్లిబిల్లిగా పదాలు వరుస కట్టి వాక్యాలు చెప్పేసి మాట్లాడటం ఇక్కడే కాదు, ప్రతి బ్లాగు లోనూ చూసేదే. క్రీడలు శ్రమ కిందికి రావా? ఏదీ కపిల్ దేవ్ ని ఒక బాలు వెయ్యమని చెప్పి మీరు బేటింగ్ చెయ్యండి చూద్దాం. అపుడు తెలుస్తుంది క్రీడలు ఎంత వీజీనో. మీకంటే ఆర్థిక శాస్త్రం ఎక్కువ తెలుసుకాబట్టేనా అమెరికన్ పెట్టుబడిదారీ కంపెనీలని బీజింగ్ లో షాపులు ఓపెన్ చెయ్యనిచ్చింది ఓ గొప్ప కమ్యూనిస్టు దేశం? ఓహ్ మర్చిపోయాను చైనా "నిజమైన" కమ్యూనిస్టు దేశం కాదు కదూ. అది మీ ఊహల్లోనే ఉంది. దాన్ని గురించి చెప్పమనను. ఎందుకంటే పైన చూసానుగా, తెలిసిన తెలుగు పదాలన్నీ అటూ ఇటూ విసిరెయ్యటం!
Deleteరామ మొహన్ గారు,
Delete>> బాగా చదువుకుని బలిసిన వాళ్ళకు కుడా (డబ్బు పరంగా) ఈ జాబితాలొ వుండారు. అదీ విదేశాలలొ వాళ్ళ అబిమాన నటుల సినిమాలకు కేక్ కట్ చెయ్యడం లాంటివి చేస్తారు. ఆ అభిమానం వెనుక కులం కుడా ప్రదాన పాత్ర పొషిస్తుంది.<<
బాగా చదువుకోవడం, డబ్బు సంపాదించడం, విదేశాల్లో స్థిరపడటం.. ఇవన్నీ సుఖవంతమైన జీవితం కోసం మాత్రమే. వారికి కులాభిమానం, ప్రాంతీయాభిమానం ఉండకూడదని మనం అనుకోరాదు.
మన సినిమా అభిమానం కులం రంగు పులుముకుని చాలా రోజులయ్యింది. మా ఊళ్ళో ఏ కులం హీరో సినిమా రిలీజుకి ఆ కులం కుర్రాళ్ళు మోటార్ సైకిళ్ళకి సైలన్సర్లు పీకేసి 'శబ్ద యుతంగా' ర్యాలీ చేస్తారు. ఈ మధ్య కార్లు కూడా కుల ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయట. వారికదో తుత్తి! కాదనడానికి మనమెవరం?!
"వారికి కులాభిమానం, ప్రాంతీయాభిమానం ఉండకూడదని మనం అనుకోరాదు "
Deleteమీ సమాధానం విని ఆశ్చర్యపోయాను డాక్టరు. మీ నాలుగు జిల్లాలకి సామాన్య మైన చరిత్ర ఉందా? స్వాతంత్ర పోరాట కాలంలొ దేశం వెనుకబడి పోవటానికి మన ఆచార వ్యవహారాలు,సరైన చదువు లేక పోవటనికి బ్రాహ్మణులు కారణమని, రష్యా సాహిత్యాన్ని,సిద్దాంతాలను వంటబట్టిచుకొన్న, ఆ నాలుగు జిల్లాలోని ఆధిపత్య భూస్వామ్యవర్గం అభ్యుదయమంటూ ,కులాలు నశించాలని, ఉపన్యాసాలు,ఉద్యమాలు చేసిన చరిత్ర చాలా ఉంది. మరి ఇప్పుడు ఆ వర్గం వారే చిన్న నుంచి పెద్ద వరకు హద్దులు మీరిన కులగజ్జిని బాహాటంగా, బహిరంగంగా ప్రదర్శిస్తూ, సామాన్య ప్రజలకు సైతం వెగటు పుట్టించే వరకు పరిస్థితిని తీసుకొచ్చారు. మీకు కుల,ప్రాంతీయ అభిమానం ఉంటే మీ జిల్లాలో నే స్థిరపడి ఒకడి వెనుక ఒకడు గోతులు తవ్వుకొంట్టూ ఆస్థులు సంపాదించుకొండి. రాజకీయాలు చేసుకొండి.
అజ్ఞాతా (10:07),
Deleteఒక వ్యక్తి యొక్క డిగ్రీల చదువు, ఆస్థుల సంపాదన, విదేశీయానం.. సమాజ అవగాహనకి సంబంధం లేదన్నది నా పరిమితమైన పాయింట్. ఇందులో ఆశ్చర్యపోయేదేముంది!
Reproducing my comment on the post "తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చి థియరీ!" below. This comment is relevant to the current post as well.
ReplyDeleteమీరు సినిమా కస్టమర్ల (audience) కోణం నుండి బ్రహ్మాండంగా విశ్లేషించారు. నేను మీ అంతటి వాడిని కాకపోయినా సినిమా సప్లయర్ల (industry) కోణం నుండి అదనపు (supplementary) మసాలా అందించ తలిచాను. అందుకొనుడి నా supply side థియరీ రాజము.
5'6" పొడుగు, 90 కిలోల బరువు చామనచాయ సగం నత్తి డయలాగులతో రాజ్యం ఏలుతున్న నటన కూలీలకు కాలక్రమేణా విపరీతమయిన అహం ఎదిగింది. తమ వల్లే సినిమాలు నడుస్తున్నాయని, అదే ఎల్లకాలం కొనసాగాలని, తమ తరువాత తమ వారసులకూ అదే స్తాయి దక్కాలని పట్టుదల పెరిగింది. ఈ లక్ష్యం కోసం ముఠాలు, వంధిమాగధులు, వీరాభిమానుల బృందాలు, అభిమాన సంఘాలు, అభిమానుల కోసం బ్లడ్ బాంకులు/కాన్సరు ఆసుపత్రులు, ఇతరత్రా infrastructure ఏర్పరుచుకున్నారు. ఆడియో ఫన్క్షన్లూ, కుల పెద్దలతో మంతనాలు, రాజకీయ పోకడలు, కొడుకుల పెళ్ళిళ్ళూ, అప్పుడప్పుడూ కాల్పులు ఇతరత్రా మసాలా కార్యక్రమాలతో పబ్లిసిటీ చేసుకుంటూ తమ పొసిషన్ కాపాడుకుంటూ వచ్చారు.
ఏతావాతా ప్రతి నాయకుని చుట్టూ ఒక పెద్ద పరిశ్రమే వెలిసింది, maintenance ఖర్చులూ పెరిగాయి. This is like riding a tiger: you can't get off.
ఇంతటి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అడ్డంకులు ఉండవా? హీరోల ఏకచత్రాధిపత్యం సాగాలంటే మిగిలిన సినీ కూలీల ప్రాముఖ్యత తగ్గి వారు నాయకులకు జోహుకుం చెయ్యాలి. హీరో గారి చలువతో అన్నం తింటున్న దర్శకులు & టెక్నీషియన్లు తొందరగా లొంగిపోతారు కానీ నాయికలకు ఈగో అడ్డం వస్తుంది. వారిలో కొందరికి మహానటి/సూపర్ హీరోయిన్/లేడీ అమితాభ్/ఊర్వసి లాంటి బిరుదులు కూడా ఉండి చచ్చాయి. కొద్దో గొప్పో అభిమాన సంఘాలు & ఇతర సరంజామా కూడా ఉంది.
మగ మహారాజులం మనం ఆడంగులతో పోటీ పడాలా అని ఆలోచిస్తే ఒక మహత్తరమయిన పరిష్కారం కనిపిస్తుంది. దీంట్లో మొదటి భాగం నాయికల పాత్రను ఎక్స్త్రాకు ఎక్కువ వాంపుకు తక్కువగా మార్చడం. పనిలో పనిగా తెలుగు రాని ముంబాయి పిల్లను (ఆవిడది గోవా, హరియానా, కేరళ ఏదయినా మనకు ముంబాయి) పెట్టుకుంటే మనకు అడ్డం రాదు. సొంత ఊరిలో సినిమాలు దొరికే అవకాశం లేదు కాబట్టి మనన్నే బాకా పడుతుంది. భాష రాదు కాబట్టి ఇంగ్లీషులో ఇంటర్వ్యూలు ఇస్తుంది అదో సరదా.
తొండ ముదిరి ఊసరవెల్లి కాకుండా ఒకటి రెండు సినిమాల తరువాత పిల్లను మార్చేస్తే సరి. ఈ బాపతు అమ్మాయలందరూ దాదాపు ఒకే లాగుంటారు కాబట్టి మన కస్టమర్లకు సమస్య లేదు. దుమ్ము సినిమాలో "నటించిన" రైనాకు, రొచ్చు సినిమాలో ఐటెం బాంబిన రూనాకు తేడా సగటు ప్రేక్షకులకే కాదు, ఇంకెవరికీ తెలీదు. The show goes on..
మీ వాదన నిజమే. అయితే మన తెలుగు సినిమా కేవలం వ్యాపారం మాత్రమే. చిల్లర కొట్టు, బట్టల షాపుల వ్యాపారాలు కొడుక్కే గదా దక్కేది! మరి సినిమా వారసులపై ఈ నెగెటివిటీ ఎందుకు?!
Deleteబొంబాయి తెల్లతోళ్ళ దిగుమతికి పెద్దగా కుట్రలున్నాయని అనుకోను. కురచ దుస్తులు ధరించడానికి అనువైన శరీర కొలతలు కలిగి ఉండటమే వారి ప్రధాన అర్హత. నాకస్సలు అభ్యంతరం లేదు. చౌగ్గా వస్తున్నాయని చైనా వస్తువులు వాడుతున్నాం గదా!
ముంబాయ్ అమ్మాయిలకి హిందీ లో అవకాశాలు రాకపోవటానికి ఎన్నోకారణాలు ఉంటాయి. అక్కడ నిర్మాత,దర్శక,హీరో,హీరోయిన్ కూతుర్లే అన్నిటికి సంసిద్దంగా ఉంటారు. మాములు మధ్యతరగతి అమ్మాయిలకి ఫిల్మ్ ఇండస్ట్రి బాక్ గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావటం చాలా చాలా కష్టం. చాలా మంది ప్రముఖులు సుభాష్ గయ్,యాష్ చొప్ర, అశుతోష్ గౌరికర్,విధు వినోద్ చోప్ర మొద|| తక్కువ సినేమాలు తీస్తారు. కొత్త వారికి మహేష్ భట్ , రామగోపల్ వర్మ అవకాశాలు ఇచ్చారు, ఇస్తున్నారు. ఒకప్పుడు రామగోపల్ వర్మ దగ్గర పని చేసిన అనురాగ్ కశ్యప్ ఇప్పుడు అద్భుతమైన దర్శకుడుగానే కాక చాలా విభిన్నమైన సినేమాలు తీస్తూ, ఎంతో మందికి బ్రేక్ ఇస్తున్నాడు. కాని వీరి సినేమాలు పెద్ద హీరోలైన ఖాన్ ల తో, యాష్ చోప్రా,కరణ జోహర్ కంపెనితో పోలిస్తే భారీబడ్జేట్ కావు. ఎంత హిట్ అయినా మీడీయా వాటిగురించి పబ్లిసిటి ఇవ్వవు.
ReplyDeleteఓకే, అయితే ఇపుడేంటి?
Delete"మంచాన పడి ఖల్లు ఖల్లున దగ్గుతున్న తండ్రి, ఇల్లెలా గడుస్తుందో అని బెంబేలెత్తిపోయి ముక్కు చీదుతూ చీరతో తుడుచుకుంటున్న తల్లి,
ReplyDeleteపెళ్ళై అత్తారింట్లో కష్టాలు పడ్తున్న చెల్లి, మందు కొట్టే బావ " ఇలాంటి సన్నివేశాలు తప్ప మీ బ్లాగుల్లో ఇంకేదీ వాడరెందుకు డాక్టరుగారూ.
మీ టేస్ట్ ఇంత భయంకరంగా ఉంటుందెందుకో. మీకన్నా ఆ పాత తెలుగు సినిమావాళ్ళు నయం. వీల్లందరికోసం ఆ మిగిలిన "ఒక్క మగాడిని" కష్టపెట్టేవారు.
శ్రీ సూర్య గారు,
Deleteఅప్పుడప్పుడు సెంటిమెంటు + కష్టాలు కూర్చి హెవీగా రాయకపోతే బ్లాగు తేలిపోతుంది!
"శ్రమ పడకుండా పేరు తెచ్చుకున్న ఇద్దరి పేర్లు నాకు తెలుసు. పేరు ఐలయ్య"
ReplyDeleteఐలయ్య గారి పేరు ప్రఖ్యాతులతో ఎవరు పోటి పడగలరు? ఎలా పోటిపడగలరు? ఆయన రూటే సేపరేటు. మాజి డి. ఐ.జి. కె.అరవిందరావు ఆంధ్రజ్యోతి పేపర్లో హిందూమతానంతరం పుస్తకం పైన చర్చను లేవదీస్తు రాసిన వ్యాసం లో ఆయన ఐలయ్య అసలు రంగు ప్రస్తావిస్తే,వెంటనే ఐలయ్యగారి మితృడు, ఆచార్య బాంగ్యా భుక్యా ఐలయ్యని దేశద్రోహి అంటారా? అని అమాయకంగా ప్రశ్నించాడు. అమేరికా యునివర్సిటీలలో జరిగే కాంఫెరెన్స్ లకు ఐలయ్య గారికి ఆహ్వానం వెనుక మతమార్పిడి చేసే క్రైస్తవ మత సంస్థలు ఎలా పనిచేస్తాయో బ్రెకింగ్ ఇండియా అనే పుస్తకంలో చర్చించారు. అందులో ఈయనొక్కరి గురించే కాదు, ఇంకా చాలామంది గురించి,యన్ జి ఓ ల గురించి పేర్లతో సహా చర్చించి, ఆధారలతో సహా జతపరచి అంతర్జాతీయ స్థాయిలో అన్ని యునివర్సిటిలో ఆ పుస్తకం విడుదల చేశారు.
ఇంతకు...మీరు సినిమా చూసారా...!!
ReplyDeleteఈ ప్రశ్న నాకేనా? పూరీలు, చపాతీలు తీసే గొప్ప సినిమాలు చూసేంత గుండె ధైర్యం నాకు లేదు!
Deleteఆ సినిమా సీరియస్ తప్పిదమే. ఈ వ్యాసం చదవండి: http://forproletarianrevolution.mlmedia.net.in/jux/613087
ReplyDeleteడియర్ ప్రవీణ్,
Deleteనేను ఈ సినిమా చూళ్ళేదు. ప్రస్తుతం మన తెలుగు సినిమాల దర్శకులకి సామాజిక, రాజకీయ అంశాల పట్ల అవగాహన ఏ మేరకు ఉందో నాకు తెలీదు. ఒకప్పుడు ఫలానా అంశం పట్ల అవగాహన లేకుండా కథైనా రాయకూదనేవారు. ఇప్పుడు వర్మ, కృష్ణ వంశీ, పూరీలే మనకి దిక్సూచిలు. మనం బ్లాగులు రాస్తున్నంత ఈజీగా వాళ్ళు సినిమాలు తీసేస్తున్నారు. నచ్చని వాళ్ళు గోల చేస్తున్నారు. ఇది తీసేవాళ్ళకి, చూసేవాళ్ళకి మధ్యన గోల.
అసలు సినిమాలకి సెన్సార్ అనేది ఉండరాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ పూరీ అభిప్రాయం తెలంగాణా రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఉంటే.. ఆయన అదే తీసుకుంటాడు. ఉద్యమం మీద సెటైర్లు వేస్తాడు. తప్పేముంది!? చూసేవాళ్ళు చూస్తారు.
ఒకప్పుడు సమాజంలో చదువుకున్నవాళ్ళు తక్కువ. చదువు లేని 'ఆజ్ఞానులు' సినిమాలు చూసి పాడైపోతారని చదువుకున్న 'విజ్ఞానులు' సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అక్షరాస్యత పెరిగింది. పైరవీలు చేసుకుని సెన్సార్ బోర్డు సభ్యులయిన 'విజ్ఞులు'.. అజ్ఞానులైన ప్రజలు చూడొచ్చో లేదో నిర్ణయిస్తారు. (వారి విజ్ఞతని టెస్ట్ చేసే అవకాశం మనకి లేదు). ప్రజల్లో సినిమా చూసి పాడైపొయ్యే అమాయకులు లేరు.
సినిమాలకి సెన్సార్ బోర్డ్ ఉండాలి. Something is better than nothing.
ReplyDelete