"రా సుబ్బూ! భలే సమయానికొచ్చావు. రాజకీయ కారణాలతో రాష్ట్రం విడిపోదట. మన ముఖ్యమంత్రిగారు చెప్పారు. ఇప్పుడే చదువుతున్నాను." అప్పుడే లోపలకొస్తున్న సుబ్బుని చూస్తూ అన్నాను.
సుబ్బు ఎదురుగానున్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.
"మరి ఏ కారణాల వల్ల విడిపోతుందిట?"
"ఆ సంగతి చెప్పలేదు." అన్నాను.
"ఐతే ఇప్పుడు మనం ముఖ్యమంత్రిని చాలా ప్రశ్నలడగాలి. రాజకీయ కారణాలు లేకుండా ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక సంఘటన, ఒక పరిణామం చోటు చేసుకుందా? రెండు ప్రపంచ యుద్ధాలు, మన దేశస్వాతంత్ర్యం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ, ఇందిరా రాజీవ్ గాంధీల హత్య.. అన్నీ రాజకీయాలే కదా! అసలు ఈ సృష్టిలో రాజకీయం కానిదేదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.
"ఉంది. నా సైకియాట్రీ ప్రాక్టీస్!" నవ్వుతూ అన్నాను.
"నీ ప్రాక్టీస్ కూడా రాజకీయమే బ్రదర్. నీవంటి దిగువ మధ్యతరగతివాడు చదువు ద్వారా డాక్టర్ అయ్యే రాజకీయ వాతావరణం మనదేశంలో ఉంది. కొన్నిదేశాల్లో ఈ అవకాశం లేదు. కాబట్టి ఆదేశాల్లో నువ్వు ఇంకేదో చేస్తుండేవాడివి."
ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది.
"రవణ మావా! చాలామంది చదువుకున్నవాళ్ళు కూడా రాజకీయాలంటే చంద్రబాబు, కెసియార్ల రోజువారీ తిట్టుడు కార్యక్రమాలు, ఎన్నికలు మాత్రమేనని అనుకుంటారు. కానీ కాదు. రాజకీయ ఆలోచన అనేది ఒక నిరంతర ప్రక్రియ. మంచి రాజకీయాల వల్ల ప్రజాజీవితం బాగుపడుతుంది. చెడ్డ రాజకీయాల వల్ల భ్రష్టు పడుతుంది. ఏది మంచి రాజకీయం అనేదాన్లోనే రకరకాల అభిప్రాయాలున్నాయి." అన్నాడు సుబ్బు.
"అంటే చంద్రబాబుకీ, జగన్ బాబుకీ కల అభిప్రాయబేధాలా?" అడిగాను.
"కాదు. నా దృష్టిలో వాళ్ళిద్దరూ ఒక్కటే. ఇక్కడ మనం 'ఇజం' గూర్చి చెప్పుకోవాలి. కేపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన పొలిటికల్ ఫిలాసఫీలున్నాయి. యిదంతా చాలా కాంప్లికేటెడ్ ఏరియా. ఒక్కోదేశానికి ఒక్కోరకమైన సమస్యలు, పరిస్థితులు. జలుబు, దగ్గులకి అన్నిదేశాల్లో ఒకటే మందు. కానీ రాజకీయాలు చాలా సంక్లిష్టమైనవి. ఒక దేశ ఉన్నతికి కారణమైన పొలిటికల్ మోడెల్ ఇంకోదేశంలో ఘోరంగా విఫలమవుతుంది. అలా అనుకరించబోయిన చాలామంది రాజకీయ నాయకులు బోర్లాపడ్డారు." అన్నాడు సుబ్బు.
"సుబ్బు! విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నావు." విసుక్కున్నాను.
"సారీ! అయితే సింప్లిఫై చేస్తాను. విను. కొన్నిదేశాల్లో అక్కడి రాజకీయ నాయకులు అనుసరిస్తున్న రాజకీయ విధానాల వల్ల ఆదేశ ప్రజలు సుఖమయ జీవనం గడుపుతుండగా.. ఇంకొన్ని దేశాల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లో అదీ కుదరక ఆకలితోనో, బాంబు దాడుల్లోనో చస్తున్నారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు.
"అవును." అన్నాను.
"ఇక్కడ ప్రజలు హాయిగా సినిమాలు చూసుకుంటున్నారు. టీ స్టాల్లో సింగిల్ టీ తాగుతూ నచ్చని రాజకీయపార్టీని నోరారా తిట్టుకుంటున్నారు. పట్టపగలే మందుకొట్టి రోడ్లెమ్మడ పడిపోతున్నారు. కొన్నిదేశాల్లో ఈ లక్జరీ లేదు. ఇలా మన దైనందిన జీవితంలో రాజకీయ ప్రభావం లేని అంశమంటూ లేదు." అన్నాడు సుబ్బు.
"ఒక్క నీ ఉప్మాపెసరట్టు తప్ప." నవ్వుతూ అన్నాను.
"నో! నేనలా అనుకోవడం లేదు. మన రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో పెసరట్టు పేటెన్సీని ఒక MNC కి కట్టబెట్టొచ్చు. అప్పుడు మనకి ఉప్మాపెసరట్టు ఏ KFC లోనో మాత్రమే లభ్యమవుతుంది. ఆనంద భవన్ వంటి హోటళ్ళు రోగాల్ని వ్యాప్తి చేస్తున్నాయని ఒక రిపోర్ట్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో పబ్లిష్ అవుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన 'ఆరోగ్య పరిరక్షణ' నిమిత్తం ఆనంద భవన్ మూయించబడుతుంది. ఆ స్థానంలో ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్, ఫుడ్ కోర్ట్ వస్తుంది. ఆవిధంగా 'శుచికరమైన' ఆహారం తినడం మనకి అలవాటవుతుంది. ఫలితంగా మన భవిష్యత్ తరాలవారికి ఆనంద భవన్ అంటే ఏంటో తెలీకుండా పోతుంది." అంటూ వాచ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.
"మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాత్రం తెలీదంటావా?" అడిగాను.
"అతను క్రికెట్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలీకపోవచ్చు. తెలిసినా ఏం చెప్పినా చెల్లుబాటయిపోతుందనుకోవచ్చు. అతను ఎందుకలా చెప్పాడో మనమెలా నిర్ణయిస్తాం? ఇవన్నీ ఎలెక్షన్లప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.
(photo courtesy : Google)
రమణ గారు కిరణ్ అలా మాట్లాడడం కూడా రాజకీయమే ... (పిల్లలకు పెళ్లి సంబందాలు కూడా రాజకీయ కోణం లోనే జరుగుతున్నా కాలమిది ) ప్రజలు మరీ అంతా అమాయకులని ,వీళ్ళు మాట్లాడింది పత్రికల్లో అచ్చు వేసినంత మాత్రాన జనం అది నిజమని నమ్ముతారని వీళ్ళు అనుకుంటే ?????
ReplyDeleteకిరణ్ అమాయకంగా మాట్లాడాననుకోను. He was trying to address his own people (united Andhra people).
Deleteఈ పోస్ట్ వ్రాయడానికి కూడా రాజకీయమే కారణమూ గదా. నేను కామెంట్ వ్రాయడానికి నాకున్న రాజకీయ కారణాలు నాకున్నాయి. అంతా రాజకీయ మాయం జగమంతా రాజకీయ మాయం .
ReplyDeleteమీ వ్యాఖ్య బాగుంది.
Deleteఈ పోస్ట్ రాయడానికి ఏ రాజకీయ కారణం లేదండి. మనవంటి సామాన్యులు కూడా ఉదయం లేస్తే చేసే ప్రతి పని good/bad politics ఆధారితమై ఉంటుందని చిన్నప్పుడు ఎక్కడో చదివాను. అది గుర్తొచ్చి రాశాను.
ఈ ప్రపంచంలో మన తెలుగు బ్లాగర్లు మాత్రమే నిస్వార్ధ జీవులు!
Very nice post. I agree with Subbu's thoughts on this. Should have built the argument a bit more...:)
ReplyDeleteTotally agree with you. lack of time is the culprit (I was already late to my work by one hour). thanks for the compliment.
Deleteహ హ హ.. అదేంటో, సుబ్బూ ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా పొగలు కక్కుకుంటూ వేడి వేడి కాఫీ కప్పు అక్కడ, అది చదివినప్పుడు నోట్లో నీరు ఇక్కడా వస్తూ ఉంటాయి, అలా... :-)
ReplyDeleteశర్మ గారు,
Deleteఅలాగా! అయితే మీకు కాఫీ బిల్లు పంపించవలసి వస్తుంది!
"రాష్ట్రం ముక్క చెక్కలవుతుంది, నేనే సమైక్యరాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రిని హీ హీ " అనివుంటే అది రాజకీయం కాని, మేధోపరమైన, శ్టేట్స్‌మన్ టైపు స్టేట్మెంట్ అయ్యేదా? ఇలాంటి సమయంలో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి తెగింపైనా వుండాలి, మూర్ఖత్వమైనా వుండాలి లేదా అధిష్టానం ఆదేశమైనా వుండాలి. మొదటిది కాంగ్రెస్ వాళ్ళకు అరుదుగా వుంటుంది, రెండోదాని కన్నా మూడోదే ఇక్కడ బలంగా వుందనుకోవాలి.
ReplyDeleteవరుస టపాలవల్ల నాణ్యత పడిపోతోంది. లంఖణం పరమౌషధం అన్నారు, మీరు ఓ 3నెలలు బ్లాగ్-సన్యాసం చేస్తే బాగుంటుంది.
>>వరుస టపాలవల్ల నాణ్యత పడిపోతోంది. లంఖణం పరమౌషధం అన్నారు, మీరు ఓ 3నెలలు బ్లాగ్-సన్యాసం చేస్తే బాగుంటుంది.<<
Deleteసలహాకి ధన్యవాదాలు. ఆచరించడానికి ప్రయత్నిస్తాను. నాకున్న సమస్యేమనగా.. ఫలానా టపా రాయాలని ముందుగా అనుకోకపోవడం. ఒక ఆలోచనని అప్పటికప్పుడు రాసేస్తుంటాను. క్రమశిక్షణా రాహిత్యం ఇంకో కారణం.
ముఖ్యమంత్రి చెప్పిన 'రాజకీయ కారణాలు' అన్న మాట నా టపాకి స్పూర్తి. ఆ మాటని బేస్ చేసుకుని ఉప్మా పెసరట్టు ఉదాహరణగా రాశాను. నా పోస్టులో విభజన, సమైక్యం లాంటి చర్చలు చెయ్యలేదు. గమనించగలరు.
ఒకవేళ అధిష్టానం అదేశంతో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసినా అది కూడా 'రాజకీయ కారణమే' కదా! ఒక పొలిటికల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ రాజకీయాలే మాట్లాడతాడు. మాట్లాడాలి కూడా.
రాజకీయంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు 'రాజకీయ కారణాలు' అంటూ (ఒక సంఘ సేవకుడిలా) నెగెటివ్ గా మాట్లాడితే.. తన అస్థిత్వాన్ని తనే ప్రశ్నించుకుంటున్నట్లు కాదా? నే రాసింది చాలా బేసిక్ పాయింట్. లిమిటెడ్ పాయింట్ కూడా!
బాబు అధికారం లో ఉన్నప్పుడు ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు అని విమర్శించే వారు . రాజకీయ పార్టీలు రాజకీయం కాకపోతే వ్యాపారం చేయాలా ? ఆ మాట ద్వారా ఆయన ఏం ఆశిన్చారో కానీ ఫలితం ఇవ్వలేదు ... రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తున్నావా అంటూ రాజకీయం అంటే చెడ్డ పని అన్నట్టుగా మాట్లాడడం విచిత్రం. రాజకీయం చెడ్డ పని అనుకుంటే రాజకీయం మానేసి ఆధ్యాత్మిక ప్రచారం చేసుకోవచ్చు కదా
ReplyDeleteచంద్రబాబు బాగా చదువుకున్నవాడు. ఆయన అలా మాట్లాడటం విచిత్రమే!
Deleteరమణ గారు క్షమించాలి, రాజకీయమే కారణము అంటే రాజకీయమే గదా ముఖ్య అంశము అని, అంతే గాని మీరు రాజకీయ ఉద్దేశ్యము తోటి వ్రాసారు అని కాదు.
ReplyDeleteతెలుగు బ్లాగర్లు మిక్కిలి అమాయకులు. ప్రతిఫలాపేక్ష లేకుండా.. వేళ్ళు నొప్పుట్టేలా కీ బోర్డుని నొక్కుతూ దేశసేవ చేస్తున్న ఉత్తమోత్తములు! మనలో మనకి క్షమాపణలు దేనికండి?!
DeleteKFC, McDonaldలో వుప్మా, పెసరట్టు, ఇడ్లీ దోశెలు రుచిగా వుండి, క్లాస్‌గా, చవగ్గా వుంటే అక్కడే తింటాం. ఆనందభవన్ పోటీపడి రేట్లు తగ్గిస్తే ఇక్కడే తింటాం, శంకరవిలాస్ ను తట్టుకుని ఆనందభవన్ వుండట్లేదూ? ఇద్దరూ పాపరైతే మిర్చీ బజ్జి తింటాం. వినియోగదారుడికి తన డబ్బుకు తగ్గ, మించిన సరకు ప్రధానం కాని ఏ ఆనందభవన్నో వుద్ధరించాలనే సెంటిమెంటు కాదు కదా. కమ్యూనిస్టుల, కాషాయుల ఈ మాస్ హిస్టీరియా ప్రయత్నాలకు ఇంతకన్నా సహేతుక కారణాలు లేవా?
ReplyDeleteమీ వాదన పూర్తిగా వినియోగ దారుడి పాయింట్ ఆఫ్ వ్యూ. సెంటిమెంట్లు ఉండరాదనీ, ఎవర్నీ ఉద్ధరించరాదనీ మీ అభిప్రాయం. మీ చేతికి రాజకీయ నిర్ణయాధికారం వస్తే మీరు ఈ సూత్రాన్ని పాటిస్తారు.
Deleteనాకు సెంటిమెంట్లు ఎక్కువ. MNC లతో రేట్లు తగ్గుతాయనుకోను. నాకు అధికారం ఉంటే.. ఆనంద భవన్ తిరపతి పుణ్య క్షేత్రం వంటిదని బిల్లు పాస్ చేస్తా. మా ఉప్మా పెసరట్ ముట్టుకుంటే మూతి పళ్ళు రాలతాయని హెచ్చరికలు జారీ చేస్తా!
మీకూ, నాకూ ఆలోచనల్లో ఎంతో తేడా. వీటినే రాజకీయ అభిప్రాయాలు, ఆలోచనలు అంటారు!
శాంతించండి రమణ గారు, శాంతించండి. :)
Deleteమూతిపళ్ళు రాలగొడతా, జండాలు పాతుతా, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ప్రాంతాన తిరగ నీయం, బొంద పెడతాము అన్నది కమ్యూనిస్టు, తెరాస, మజ్లిస్ టైపు హింసా రాజకీయాలు. మీకు ఆనందభవన్ మీద వున్న అవాజ్యమైన వ్యక్తిగత సెంటిమెంటు అభినందనీయం. 50ఏళ్ళుగా చిలుము పట్టిన కాఫీ కప్పులు, ప్లేట్లు, 50ఏళ్ళ క్రిందట టేబుల్ సందుల్లో ఇరుక్కున్న అట్టుముక్కలు, వ్ప్మా సిమెంటులను తీసి పడేసి అధునీకరించాలి, మరో నాలుగు బ్రాంచీలు గుంటూరు బెజవాడ, హైద్రాబాద్ లలో మరింతమంది సుబ్బు-రమణలకు సేవలందించే అవసరం వుంది. ఈ పని జరగాలంటే ఈ రంగంలో అంతర్జాతీయ ఆటగాళ్ళను 49% భాగస్వామ్యం ఇచ్చి రప్పించాల్సిన చారిత్రిక అవసం గుర్తించే మనమోహనుడు, చిదంబరరహస్యుడు పన్నాగం పన్నారు. ఇది మీరు అర్థం చేసుకుని సహకరిస్తిరో సరి,
లేదా... (హార్మోనీ మాస్టారూ, ఎత్తుకో ఆరు.. టరడరణ ణణ్)
చెల్లియో చెల్లకో .. లొల్లి గతించె .. లొల్లి గతించె..
మెక్డొనాడ్, వాల్ మార్ట్, కే..ఏ..ఏ.. ఎఫ్‌సిలు మీ వ్యాపారముల చెండుచున్నప్పుడు..
ఒక్కండును.. ఒక్కన్ అన్ అన్.. డును మీ మొర ఆలకించరూ..
అప్పుడు సంతోషంబున సంధి చేయుదురే
100%FDIలతో సంతోషంబుగ సంధి చే ఏ.ఏ ఏయుదురే
హోటళ్లలో జరిగే అహార రాజకీయాల గురించి చర్చించాల్సిన సమయం వచ్చింది. ఉప్మా, పెసరట్టు, ఇడ్లీ, దోశెలు ఇవ్వన్ని బాపన,బనియా, రెడ్డి, కమ్మ, కాపు సవర్ణుల ఆహారం. ఈ దేశ మూలవాసుల ఆహరం కాదు. మరి ఈ దేశ మూల వాసుల భావాలను బహుళ జాతి కంపెనీలు పరిగణలో కి తీసుకోవలసిన అవసరం లేదా? వెంటనే KFC, McDonald మెను లో పెద్దకూరను చేర్చాలి.
ReplyDeleteమీ వాదనని నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. నాకు మాత్రం మా ఆనంద భవన్ భోజనమే ముద్దు. ఆనంద భవన్ జోలికి రానంత కాలం.. నేను ఏ అభిప్రాయానికైనా మద్దతు తెలుపుతాను.
Delete
ReplyDeleteనాకు మాత్రం మీ ఆనంద్ భవన్ లో ఉప్మా పెసరట్టు తినాలని వుంది. దాని చిరునామా ఇస్తారా దయచేసి.
తప్పకుండా. గుంటూరు, బ్రాడీపేట, లక్ష్మీ పిక్చర్ పేలెస్ పక్కన, ఓవర్ బ్రిడ్జ్ దిగువున ఉంటుంది ఆనంద భవన్.
Deleteఅక్కడ బల్లలు, కుర్చీలు, ఫ్లోరింగ్, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, క్యాష్ కౌంటర్, మైసూర్ బోండా పెట్టే అద్దాల బీరువా, వాష్ బేసిన్లు, మనుషులు.. అందరూ.. అన్నీ.. కనీసం యాభయ్యేళ్ళ క్రితంవి!
మొన్నామధ్య అక్కడకి నా భార్యనీ, పిల్లల్నీ ఎంతో ప్రేమగా తీసుకెళ్ళాను. వాళ్ళకి ఆ ప్లేట్లు, గ్లాసులు కూడా యాభయ్యేళ్ళ నాటివని డౌటొచ్చింది!
డాట్రారూ, మాట్లాడితే పొగలు కక్కుతూ కాఫీ వచ్చిందంటారు.... అసలు పొగలు కక్కడమంటే ఏవిటో సెలవిస్తారా? కక్కు ద్రవంగానో ఘనంగాలో ఉండాలిగానీ వాయురూపంలో ఎలా ఉంటుంది? ఎక్సుప్లెయిన్ రైటవే
ReplyDeleteMNC లకూ మీ ఉప్మా పెసరట్టుకీ లింకు పెట్టడం బోడిగుండుని మోకాలితో ముడివేయడం లాంటిది. ఉప్మా పెసరట్టుకి పేటెంటేమిటి తమ బొంద!! ఇలా అతి తెలివికి పోయే ఆ మధ్య ఎవడో linux కి పేటెంట్ అప్లై చేసి అందరి చేతా బూతులు తిట్టించుకున్నాడు!
ReplyDeleteఉప్మా పెసరట్టులు తెలియని బయట దేశాలకి KFC, McD తమ స్టైల్ లో పరిచయం చేసి వాటి పరువు తీయొచ్చుగాక, కాని మన దేశం లో ఆ చికెనులేమీ ఉడకవ్. మన మహిళామణుల (కొండొకొచో నలభీముల) కంటే మాంచి రుచిగా వండగలిగితేనే మన రెస్టారంటులకు పోటీ ఇవ్వగలిగేది.
మన భారతీయులకు అన్నిటికంటే రుచి ముఖ్యం. శుచి శుభ్రత సెకండరీ. ఇంతకు ముందు తరాలలో మనుషులు దిట్టంగా ఉండేవాళ్ళు (లేదా దిట్టమైనావాళ్ళే బ్రతికి బట్టకట్టేవారు) కాబట్టి శుభ్రత గురించి పట్టించుకోలేదు. కాని ఇపుడు తరం నెమ్మదిగా మారుతోంది. శ్రమజీవి చెమట తడి తగిలితే కాని మీ దోశకు ఆ రుచి రాదేమో కాని మాకు మాత్రం అందులో కాస్త ఉప్పు వేస్తే సరిపోతుంది. రాబోయే తరాలు శుభ్రత ని మరింత కోరుకుంటాయి. ఆ విషయాన్ని గమనించి తమ పధ్ధతులు ఆధునీకరించితే ఆనంద భవన్లు పది కాలాలపాటు ఆనందంగా ఉంటాయి. లేకపోతే (బాబూ హార్మొనీ మరొక్కసారి అందుకోమ్మా)
అలుగుటయే ఎరున్ న్ న్ న్ గని,
అమాయకుడగు వినియోగదారుడే.. అలిగిన నాడు..
దోశలన్నియు ఎందున చెల్లబోవు...
మీ ముత్తులు ..పది వే..వులైన.., పని నొదులురు పోదురు..శంకరన్నా.....
నా పలుకులు విశ్వసింపుమూ ఊ... విపన్నుల రమణల గావుమెల్లరన్.... ఆ ఆ ఆ .. ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ.
లెస్స బలికితిరి శ్రీసూర్య గారు, లెస్స బలికితిరి :))))
Deleteవినియోగదారుల ఆరోగ్యాన్ని, తద్వారా వారి మెడికల్ ఖర్చును తగ్గించే దిశగా ఆలోచించే వాళ్ళు బయలు దేరడం సంతోషించాల్సిన విషయం. నన్నడిగితే KFC, McDలు మన తిండ్లను అంతర్జాతీయం చేయడం వల్ల NRIలకు, టూర్కెళ్ళే వాళ్ళ అమ్మనాన్నలకు ఉపయోగపడుతుంది. నన్నడిగితే KFC, McD వాళ్ళు ఆవకాయలు కూడా పెట్టాలి, ప్రీయ వాణ్ణి పడగొట్టాలి అంటాను. :) ;) మీరేమంటారు?
పచ్చళ్ళ తాతయ్య విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంతా తెగ ఇదైపోతూ తన డైరీ లో రాసుకోడానికి కారణం ఉంది. పెట్రోలు బాబాయి తో కలిసి తనూ గొలుసు దుకాణాల్లో డబ్బు పెట్టాడు. ఇప్పుడు ఆ రంగం లో పోటీ ఎదురైతే ఎక్కడ తన లాభం తగ్గిపోతుందో అని భయం. అంతే కాని తాతయ్యేమీ పేద్ద దేశభక్తుడు కాడు. (కాకపోతే మన ఓదార్పు అన్నయ్య డైరీ కంటే తాతయ్య డైరీ కొంచెం బెటర్).
Deleteఆనంద భవన్ లో కుర్చీలు పాతవెందుకయ్యాయి? తన లాభాల్లో కొంత పునర్మదుపు (reinvest) చెయ్యకపోవడం వల్ల. 50 ఏళ్ళు బంగారు గుడ్లు పెట్టిన బాతు ని సరిగా mainTain చెయ్యకపోతే (లేదా కొత్తది రడీ గా ఉంచుకోకపోతే) ఏదో ఒక రోజు పాపం అది చచ్చ్చి ఊరుకోదూ? ఆ తరువాత "బాతు మిథ్య గుడ్డు మిథ్య " అని సామెత చెప్పుకోవలసి వస్తుంది.
శ్రీ సూర్య గారు,
Delete>>MNC లకూ మీ ఉప్మా పెసరట్టుకీ లింకు పెట్టడం బోడిగుండుని మోకాలితో ముడివేయడం లాంటిది. ఉప్మా పెసరట్టుకి పేటెంటేమిటి తమ బొంద!!<<
నేనీ టపా వ్యంగ్యంగా రాశాను. మీరు దాన్ని మక్కికి మక్కిగా అర్ధం చేసుకున్నారు. మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని వ్యాఖ్యలు రాస్తే చదువుకోడానికి హాయిగా ఉంటుంది. గ్రహింపగలరు.
అయ్యా వైద్య శిఖామణీ, నేను కూడా జవాబు ని మామూలుగానే (జంధ్యాల గారి చూపులు కలసిన శుభవేళలో కోటగారి స్టైల్ లో) రాసాను! బ్లాగుల్లో ఇదొక సమస్య. మనం ఒక భావనతో వ్రాసినపుడు అవతలివారు వేరొకరకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కష్టపడి నా మెదడుకి పదును (?) పెట్టి రాసిన పద్యాన్ని వదిలేసి మీరు ఒక చిన్నమాటపై ఏకాగ్రాత నిలిపితిరి. హత విథీ !!
Deleteఅలాగా! సారీ! సరీగ్గా అర్ధం చేసుకోలేకపొయ్యాను.
Deleteమీరు, SNKR పోటీలు పడుతూ పేరడీ పద్యాలు అద్భుతంగా రాస్తున్నారు. మీ పద్యాలతో పోటీ పడే సత్తా నాకు లేదు.
Really a Good one to current socioeconomic political scenario.
ReplyDelete