దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది.
దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో!
ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని.
ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని.
తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత్యంతరం లేని అనివార్య పరిస్థితులు తనకుతానే సృష్టించుకున్నాడు. తనని తాను హింసించుకుంటూ తనచుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెట్టాడు. అందుకే సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist గా తేల్చేశారు. తాగుడు వల్ల బాధ మర్చిపోవచ్చనుకుంటే.. తాగుబోతు అవ్వాల్సింది పార్వతి. దేవదాసు కాదు!
పార్వతి చేసుకున్న పాపం దేవదాసు పొరుగున పుట్టటమే. పిచ్చిపిల్ల.. దేవదాసుని unconditional గా ప్రేమించేస్తుంది. ధైర్యవంతురాలు. తమ ప్రేమ సంగతి తండ్రికి చెప్పమని దేవదాసుని కోరుతుంది. దేవదాసు తండ్రి తన వంశంని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అహం దెబ్బతింటుంది. జీవితంలో మొదటిసారి దేవదాసుని ప్రశ్నిస్తుంది.
పెళ్లి కుదిరిన తరవాత కూడా అర్ధరాత్రి దేవదాసు ఇంటి తలుపు తడుతుంది. తనని తీసుకెళ్ళిపొమ్మని ప్రాధేయపడుతుంది. పార్వతికున్న ధైర్యంలో ఒక నలుసు దేవదాసుకి కూడా ఉండిఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ దేవదాసు అర్భకుడు. పార్వతి ప్రేమకు అపాత్రుడు. సమాజ (కృత్రిమ) విలువలకి తలవంచిన పిరికివాడు. 'ధైర్యం' అన్న పదానికి అర్ధం దేవదాసు dictionary లోనే లేదు.
దేవదాసు గూర్చి పార్వతికి సరియైన అవగాహనే ఉన్నట్లు 'అంతా భ్రాంతియేనా!' అనే ఈ పాట వింటే తెలుస్తుంది. అందుకే ఆ అమ్మాయి దేవదాసు కోణం కూడా అర్ధం చేసుకుని పాడింది. నాకర్ధం కానిదల్లా.. ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!
(photo courtesy : Google)
మీ టపాతో నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తానండీ... ఇక పార్వతి ఎందుకు ప్రేమించింది అంటారా... ఇలాంటివాళ్ళని చూసే ప్రేమగుడ్డిదని చెప్పారేమో.
ReplyDeleteవేణూశ్రీకాంత్ గారు,
Deleteదేవదాసు పార్వతితో జీవితం పంచుకోలేకపోవడానికి పొలిటికల్ ఏంగిల్ కూడా ఉంది. కొంచెం ఓపిగ్గా రాయాలి. సమయం కుదిరినప్పుడు రాస్తాను.
True!!
ReplyDeleteఅంత ఆలోచించి చేసేది ప్రేమెందుకౌతుంది చెప్పండి:-)
ReplyDeletePadmarpita గారు,
Deleteఅవును. మీరన్నది నిజమే!
అయితే ప్రేమకి ఆలోచన తోడయితే మంచిది. లేనిచో మనకి దేవదాసులు, పార్వతులు ఎక్కువైపోతారు!
అయ్యో..పార్వతి ! బలహీనమైన మనసున్న దేవదాసుని ఇష్టపడి.. చరిత్రకి ఓ..విషాద ప్రేమికుడిని పరిచయం చేసింది.
ReplyDeleteచేతకానితనమే హీరోయిజం అయిపోతుందని తెలియని పార్వతి అనుకుంటాను నేను.
వనజవనమాలి గారు,
Deleteప్రేమ పట్ల దేవదాసు కన్నా పార్వతికి స్పష్టత ఉంది. పాట పార్వతి POV తో ఉంది. కావున నేను దేవదాసుని పిరికివాడిగా రాశాను. దేవదాసుని విశ్లేషించాలంటే పెద్ద పోస్ట్ రాయవలసి ఉంది.
దేవదాసు నవల రాయబడిన రోజుల్లో వంగదేశంలో జమీందారీ సంతానం British influence తో ఇంగ్లాండ్ చదువులు, ఫుల్ సూట్లతో 'బాబు'లుగా మారిపొయ్యారు. ఆ 'జాతి'వారు పార్వతి వంటి గ్రామీణ యువతిని పెళ్ళి చేసుకునే అవకాశం లేదు. ప్రేమ సఫలం కాని (కాలేని) పాత్రల్ని సృష్టించి.. వారి వేదనతో మన గుండెలు పిండేశాడు శరత్ చంద్ర చటర్జీ.
(అందుకే రచయిత దేవదాసు ప్రేమని తిరస్కరించిన దేవదాసు తండ్రిని కూడా justify చేస్తూ రాస్తాడు.)
*ప్రేమ పట్ల దేవదాసు కన్నా పార్వతికి స్పష్టత ఉంది.*
Deleteరమణగారు,
ఈ వాక్యం చదవటం నవ్వొచ్చేసింది. మీరు పార్వతి వరకు వెళ్ళారుకాని, ప్రేమ పెళ్లి పట్ల స్రీల కున్న స్పష్టత పురుషులకు ఉండదు. చాలా మంది మగవారికి పెళ్ళి అయిన తరువాతే వాళ్ల అజ్ణానం వారికి కళ్లకు కట్టినట్లు అర్థమౌతుంది.తప్పు ఎక్కడ చేసామో తెలుసుకొన్నా, ఆ తప్పుని దిద్దుకొలేని నిస్సహాయతలో కురుకుపోయి ఉంటాడు. అందరు మగవాళ్ళు హిట్లర్ అంత తెలివైన వారు కారు కాబట్టే , పెళ్ళి చేసుకున్న తరువాత ఆత్మహత్య చేసుకోకుండా గానుగెద్దు బతుకు బ్రతుకుతూంటారు.
అజ్ఞాతా,
Deleteస్త్రీపురుష సంబంధాల గూర్చి చర్చించవలసి వస్తే మనం సమాజాన్ని compartmentalized గా చేసి ఆలోచించాలి. ఉన్నతవర్గాల సమస్యలు, వర్కింగ్ క్లాస్ సమస్యలు వేరుగా ఉంటాయి.
వర్కింగ్ క్లాస్ మరియూ పేద వర్గాల్లో ఈ రోజుకీ మగరాయుళ్ళు 'పెదరాయుళ్ళు' గానే చలామణి అవుతున్నారు. చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న మగవాళ్ళకి ఈ luxury దూరమైనట్లుగా తోస్తుంది.
It's just a novel, far from reality. If its a successful love story, we would not even know of its existstance or discuss it with movies being made. If its real story, Parvathi might probably end up used & dead to say it bluntly considering law and order rules in those days towards ultra rich.
ReplyDelete@చాతకం,
Deleteఅవును. దేవదాసు కేవలం కథ మాత్రమే. అయితే కొన్ని రచనలు సమాజం, మానవ సంబంధాల గూర్చి వ్యాఖ్యానించుకోవడానికి ఉపయోగపడతాయి. రచయితగా శరత్ బాబుకి పరిమితులున్నాయి. ఆయన రచనలు ఆ నాటి బెంగాలి ఉన్నత కుటుంబాల ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తాయి. ఇందుకు 'బాటసారి' కూడా ఒక ఉదాహరణ.
మళ్ళీ...
ReplyDeleteఅన్నట్టు దేవదాసు తండ్రి జమిందారు కదా, దేవదాసుని మానసికవైద్యుని దగ్గరకు ఎందుకు తీసుకువెళ్ళలేదు?
bonagiri గారు,
Deleteఆ రోజుల్లో మన దేశంలో మానసిక వైద్యం లేదు. కాబట్టి అతని తండ్రి దేవదాసుకి ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం లేదు.
ఇప్పుడంటే అన్నింటికీ వైద్యం ఉంది. గంజాయి, ఆల్కహాల్, సిగరెట్లు, గుట్కా.. అన్నింటికీ చాలా స్పష్టమైన treatment protocol ఉంది. కాబట్టి పార్వతి, చంద్రముఖి కలిసి దేవదాసుని ఏ drug de-addiction సెంటర్లోనో పడేసి ధర్మన్నని కాపలా పెడితే దేవదాసు కథ వేరేలా ఉండేది!
శరత్ ఏమి ఆశించి ఈ కధ వ్రాసాడు అంటారు. అంటే ఏమీ సందేశం ఇవ్వాలనుకొన్నాడు.
ReplyDeleteశరత్ చంద్ర చటర్జీ వంగదేశంలో ఉన్నత కుటుంబంలో పుట్టినవాడు. మంచివాడు. మంచినే చూశాడు. మంచినే రాశాడు. ఆయన తన వర్గానికి చెందిన వ్యక్తుల / కుటుంబాల భావ సంఘర్షణలని ప్రతిభావంతంగా రాశాడు. ఏ కథలోనూ చెడ్డవారు ఉండరు. పాత్రలు పరిస్థితులు / విధి చేతిలో బానిసలు.
Deleteదేశీ ప్రచురణల (బొందలపాటి శివరామకృష్ణ) శరత్ సాహిత్యం (చిన్నప్పుడు) కొన్ని సంపుటాలు చదివాను.
ఆ రోజుల్లో మధ్యతరగతి వారికి శరత్ ని చదవడం ఒక స్టేటస్ సింబల్. శరత్ నవలల్ని గొప్పగా చెప్పుకునేవారు. శరత్ ప్రభావంతోనే తెలుగులో ఒకప్పుడు రచయిత్రీమణులు ఒక వెలుగు వెలిగారు.
@తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు.
Deleteసంపన్నుల బిడ్డలందరి బాపతే దెవదాసూ. కుక్కపిల్ల కన్నా పార్వతి తో ఎక్కువ కాలక్షేపం అవుతుంది మరి .
దేవదాసు చెడ్డవాడు కాదు అనడానికి రుజువు అతని తరువాత జీవితం పార్వతికే అంకితం కావడం. అలాగని పార్వతి కి ఆలోచన ఉండే వయసు కాదు. కాదు కాబట్టే తను కూడా అన్నీ తొందరపాటు నిర్ణయాలే తీసికొంది.
శరత్ కుడా రచనలు కాక ఇంకేమన్నా పని చేసాడా :)
Mauli గారు,
Deleteమనం 'దేవదాసు' ని విశ్లేషించుకుంటున్నాం. మీకు కొన్ని వాస్తవాలు చెప్పాలి.
నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను. అన్నిసార్లు ఘోరంగా ఏడ్చాను. దేవదాసు సినిమా చివరి అరగంట (ముఖ్యంగా దేవదాసు బండి ప్రయాణం) అత్యంత హృదయ విదారకం. తెలుగు సినిమా చరిత్రలో ఇంత దుర్మార్గంగా (డబ్బులు తీసుకుని మరీ) ఏడిపించిన సినిమా మరోటి లేదు.
మొన్నామధ్య ఏడవకుండా చూద్దామనుకుని కూర్చున్నాను. 'కల ఇదని.. నిజమిదని.. ' పాటని దాటుకుని సినిమా చూసే ధైర్యం లేకపోయింది. బ్లాగుల్లో దేవదాసుని విశ్లేషించగలిగిన నేను.. సినిమా చూస్తే కన్నీరు కారుస్తాను. ఏమిటీ వైరుధ్యం!
నా అనుమానం.. నాగేశ్వరరావు, సావిత్రి, సి.ఆర్.సుబ్బురామన్, వేదాంతం రాఘవయ్య, సీనియర్ సముద్రాల, ఘంటసాలలు కలిసి తెలుగువారిపై ఏదన్నా 'ప్రయోగం' లాంటిది చేశారా అని!
"తెలుగు సినిమా చరిత్రలో ఇంత దుర్మార్గంగా (డబ్బులు తీసుకుని మరీ) ఏడిపించిన సినిమా మరోటి లేదు." -- చిత్రమేంటంటే... అది 'వినోదా' వారి దేవదాసు కూడా. :)
Deleteఒన్స్ అగైన్!
ReplyDelete"'స్వామీ , అదియే కదా 'స్త్రీ' సిరి ! మీరు మమ్మల్ని ఏడిపించినా , మేము మిమ్మల్ని ఏడి పించినా , కాల గతి లో మీ పైకే ఆరోపణ లన్నీ వస్తాయి '"!
ఈ వాక్యం ఎవరిదీ?
చీర్స్
జిలేబి.
జిలేబి జీ,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు.
చదువుకునేప్పుడు external examiners అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలీనప్పుడు బిక్కమొహం వేసేవాణ్ణి.
మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ప్రశ్న వల్ల.. పాతరోజులు గుర్తొచ్చాయి. నాకు ఈ వాక్యం ఎవరిదో తెలీదు. మీరే సమాధానం చెప్పి.. ఈ అజ్ఞానిని విజ్ఞానిగా చేయ ప్రార్ధన!
వర్కింగ్ క్లాస్ మరియూ పేద వర్గాల్లో ఈ రోజుకీ మగరాయుళ్ళు 'పెదరాయుళ్ళు' గానే చలామణి అవుతున్నారు. చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న మగవాళ్ళకి ఈ luxury దూరమైనట్లుగా తోస్తుంది.
ReplyDeleteyes sir.
"దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు."
ReplyDelete------------------
నేను వప్పుకోను. ఎందుకంటే తను "నేను నిన్ను ప్రేమించాను లేచిపోదాంరా" అని ఎప్పుడూ అనలేదు. పక్కింటి అమ్మాయి తనతో కలిసి తిరిగి ప్రేమ లో పడితే తన తప్పేముంది? ఆ అమ్మాయి "లేచిపోదాం రా" అంటే వచ్చేయాలా? అయినా తను తన తండ్రి మీద ఆధారపడిన వాడు. మీరుకూడా అన్నారు
"తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు."
అమాయకుడిని పట్టుకుని అమాంతంగా అన్యాయం చేశాడు అనటం అంత బాగాలేదు.
Rao S Lakkaraju గారు,
Deleteనేను రాసిన మొదటి వాక్యాన్నే మీరు ఒప్పుకోవట్లేదు. ఇది చాలా అన్యాయం! దేవదాసు అమాయకుడైనా చివరాకరికి పార్వతికి కన్నీళ్ళే మిగిల్చాడు. ఇక్కడ ఎండ్ రిజల్ట్ ని బట్టి చూస్తే నేను రాసిందే కరెక్ట్!
ఇక ఈ 'లేచిపోయే' కాన్సెప్ట్ కొద్దిగా కాంప్లికేటెడ్. దీనికి సోషల్ ఏంగిల్ ఉంది. సాధారణంగా ప్రేమికుల మధ్య లేచిపోయే ప్రపోజల్ సామాజికంగా, ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపు నుండి వస్తుంది. 'పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్ళు తప్ప' అన్నట్లు.. 'లేచిపోతే పోయేదేముంది? అప్పులు, ఆకలి తప్ప!'
(ఇదంతా కేవలం సరదా కోసం మాత్రమే రాశాను. సీరియస్ చర్చకి నేను దూరం.)
"ఇక ఈ 'లేచిపోయే' కాన్సెప్ట్ కొద్దిగా కాంప్లికేటెడ్. దీనికి సోషల్ ఏంగిల్ ఉంది. సాధారణంగా ప్రేమికుల మధ్య లేచిపోయే ప్రపోజల్ సామాజికంగా, ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపు నుండి వస్తుంది. 'పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్ళు తప్ప' అన్నట్లు.. 'లేచిపోతే పోయేదేముంది? అప్పులు, ఆకలి తప్ప!'"
Deleteఈ కధలో సావిత్రి గురించి అనిపించే భావం ఇదే!
నిజం కాని, సామాజికం గా ,ఆర్ధికం గానే కాక మానసిక స్థాయి కి కూడా సంబంధం లేదా. అంటే సామాజికం గా ఆర్ధికం గా బలవంతుడయినా, అమ్మాయికన్నా మానసికం గా బలహీనుడు అయితే?
Mauli గారు,
Deleteనేను ముందే చెప్పాను.. నేను సీరియస్ చర్చకి దూరం అని (అజ్ఞాతలతో తిట్టించుకునే ఓపిక లేదు)!
అన్నీ ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. వాడికున్న ఎనర్జీ సమాజంలో తన కుటుంబానికున్న హోదా, డబ్బు అవుతుంది. సాధారణంగా ఈ వర్గం వాడు ప్రేమలో పడడు. ఆ పిల్లతో సరదా చేస్తాడు. ఆ అమ్మాయి వాడి ఇంటి ముందు మౌనపోరాటం లాంటిదేదో చేస్తుంది. ఇక్కడ కులం చాలా చాలా ప్రధానం. రావిశాస్త్రి ఒక మంచి కథ కూడా రాశాడు.
మన తెలుగు సినిమాలు నేల విడిచి సాము చేస్తుంటాయి. ప్రేమని రొమేంటిసైజ్ చేస్తారు గానీ.. సమాజంలో ప్రేమ విఫలం కావడానికి అత్యంత ముఖ్యమైన ఈ పాయింటుని సూచనాప్రాయంగా కూడా చెప్పరు (మాలపిల్ల, రోజులు మారాయి, జయభేరి వంటి కొద్ది సినిమాలు మింహాయింపు).
'దేవదాసు' కథ కొద్దిసేపు ఏడ్చుకోటానికి తప్ప.. సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి పనికి రాదు.
"ఆ పిల్లతో సరదా చేస్తాడు."
Deleteమీరు వామపక్ష రచయితల పుస్తకాలు చదివిన (రావి శాస్రి,కొ కు, ఓల్గా) ఒక్క విప్లవాత్మకమిన ఆలోచన మీ దగ్గర లేదు. పిల్లతో సరదా చేయటం తప్పా? ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకోకుండా ఇద్దరు సరదా చేసుకొని (ఆనందిస్తూ) పండగ చేసుకొంటే తప్పేమిటి? పాత చింతకాయ పచ్చడి, పుచ్చిపోయిన వివాహ వ్యవస్థలో పురుషుడు బాగం కాకపోతే పెద్ద నేరమా?
డాక్టర్ మీవన్ని హిందుత్వ వాదుల చాదస భావాలు. మీరు ప్రొగ్రెసివ్ అని అనుంకొంటారుగాని ఒక్క ప్రొగ్రెసివ్ ఆలోచన మీలోలేదు. ముఖ్యంగా మగవారి విషయంలో మీ మైండ్ సేట్ మారల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అజ్ఞాతా (18:18),
Deleteవివాహ వ్యవస్థ గూర్చి మీ అభిప్రాయం గౌరవిస్తాను.
'వివాహవ్యవస్థ పాతచింతకాయ పచ్చడి. అదొక పుచ్చిపోయిన concept. కాబట్టి మనిద్దరం కొంతకాలం 'సరదా' చేసుకుందాం.' అనే స్పష్టతతో ఒక జంట 'సరదా' చేసుకుంటే మనకెందుకు అభ్యంతరం?!
అయితే నేరాసింది మన ఆంధ్రదేశంలో ప్రేమ, పెళ్ళి పేరు చెప్పి వంచన చేస్తున్న దుర్మార్గుల గూర్చి. వివాహ వ్యవస్థపై మన అభిప్రాయాలకీ, ఈ పచ్చి మోసాలకి సంబంధం లేదు. 'సరదా' కోసం పెళ్ళి పేరు చెప్పే నమ్మకద్రోహుల్ని మీరు కూడా వ్యతిరేకిస్తారని అనికుంటున్నాను.
" 'సరదా' కోసం పెళ్ళి పేరు చెప్పే నమ్మకద్రోహుల్ని మీరు కూడా వ్యతిరేకిస్తారని అనికుంటున్నాను"
Deleteపెళ్ళి అయిన తరువాత కూడా మగవారు నగలు,నట్రలు చేయిస్తానని,ఆమేకి ఉన్న తీరని కోరికలు తీరుస్తానంటేనే స్రీలతో సరదా , కొంచెం ఎక్కువ సాఫిగా సాగుతుందని పెళ్ళైన ప్రతి మగవాడికి తెలిసిన విషయమేకదా! ఇది మీకు అంగీకారమా?
నేను చెప్పదలచుకున్నది చాలా సింపుల్ పాయింట్.
Deleteపెళ్ళి చేసుకోవడం (లేదా చేసుకోకపోవడం) అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎగ్రిమెంట్. ఒక వ్యక్తికి వివాహవ్యవస్థపై నమ్మకం ఉన్నప్పుడు.. రెండో వ్యక్తి తనకి నమ్మకం లేని ఆ వ్యవస్థని ఒప్పుకున్నట్లు నటించడాన్ని (సరదా కోసం) నమ్మకద్రోహం అంటున్నాను.
చర్చ కోసం రాస్తున్నానే కానీ.. మన సమాజంలో డబ్బు, హోదా గల బలిసిన వాడి పిల్లలు ప్రేమ పేరుతో చేసేది పచ్చి మోసం. స్త్రీపురుష సంబంధాల గూర్చి ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ.. నేరాసింది ఒక నేరం (breach of trust) గూర్చి.
చప్పట్లు రమణ గారు.
Delete(**పెళ్ళైన ప్రతి మగవాడికి తెలిసిన విషయమేకదా! మగవారు నగలు,నట్రలు చేయిస్తానని,ఆమేకి ఉన్న తీరని కోరికలు తీరుస్తానంటేనే స్రీలతో సరదా***)
Delete@Anonymous26 November 2012 18:14
దీన్నే కొన్నిప్రాంతాల్లో పచ్చ కామెర్లు అంటారు.
"మన సమాజంలో డబ్బు, హోదా గల బలిసిన వాడి పిల్లలు ప్రేమ పేరుతో చేసేది పచ్చి మోసం."
Deleteహోదా గల బలిసిన వాడి పిల్లలు ప్రేమ పేరుతో చేసేది పచ్చి మోసం చేస్తారని చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా, మళ్ళీ మళ్ళీ కన్యకామణులు హోదా గల బలసినవాడి పిల్లల వెనుకనే మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని తెలిసినా వాడి వలలో ఎందుకు పడతారు? కారణం మొదట్లో మీరే చెప్పారు, లేచిపోయే ప్రపోజల్ సామాజికంగా, ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి వైపు నుండి వస్తుంది. 'పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్ళు తప్ప' అన్నట్లు.. 'లేచిపోతే పోయేదేముంది? అప్పులు, ఆకలి తప్ప! తక్కువ రిస్క్ తో, ఎక్కువ లాభం పెళ్ళి ద్వారా పొందటానికి ఆడవాళ్ళు చాలా ఎత్తులు వేస్తారు,ప్రయత్నాలు చేస్తారు. వెంట్రుకతో కొండను లాగి చూద్దామను కొనే స్వభావం. వస్తే కొండా, పోతే వెంట్రుక.
మీరు పురుషుడిని డబ్బు, హోదా ల కోణం లో చూస్తూ అతనిని విశ్లేషిస్తున్నారు. వివాహ వ్యవస్థ అనేదే లేకుండా ఉండి ఉంటే ఆడా, మగా సరదా చేసుకొవటం మానుకొంటారా? అప్పుడు డబ్బు హోదా ఉన్నపురుషులను మీరు ఇలా మోసం,నమ్మకద్రోహం చేశారని అనగలగడానికి అవకాశం ఉంట్టుందా!? వివాహ వ్యవస్థ వలనే కాదా మగవాడు మోసం,ద్రోహం అనే మాటలు పడవలసి వచ్చింది కదా! మొదటి నుంచి వివాహ వ్యవస్థ మగవాడిని పూర్ లైట్ లో చూపిస్తున్నాది. వివాహ వ్యవస్థ వలన శకుంతలకు సానుభూతి, దుషంతుడిని తప్పు పట్టటం, తక్కువ చేసి చూడటం జరిగింది. లేకపోతే దుషంతుడి లో ఉన్న అవగుణాలు ఎమీటి?
నేను చెప్పదలచుకున్నది చాలా సింపుల్ పాయింట్. వివాహ వ్యవస్థ యాంటి మేల్ స్వభావం గలది. దానిని మీలాంటి వారు స్రీల తరపున చేరి పురుషులను నిందించటం రిటోరిక్ గా ఉంది.ఎప్పుడొ గురజాడ కాలంలో నివసిస్తున్నారేమో మీరుఅని అనుమానం వస్తుంది. మీకు డబ్బున్నోళ్ళపైన,హోద గలవారిపైన కోపముంటే దానికి, దీనికి సంబంధం పెట్టకండి.
మరి ఈ క్రింది టపాని చదివి చూడండి చాలా ఆసక్తి కరమైన కొత్త విషయాలు ప్రస్తుత సమాజం గురించి తెలుస్తాయి. టపాలోని వార్తను మీరే విధంగా విశ్లేషిస్తారో చూద్దాం!
ఆలి కోసం కులంచెడ్డా,మిగిలింది ఎగతాళే!
http://ssmanavu.blogspot.in/2012/11/blog-post_2982.html
yaramana మీరు రెండు keypad (నాలుకలు) తొ రాస్తున్నారు. టపా దేవదాసు కి వ్యతిరేకంగా రాసి కామెంట్స్ లొ దేవదాసుని బలపరుస్తున్నారు.
ReplyDeletekamudha గారు,
Delete>>తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు.<<
తన వాదన ఏమిటో yaramana కే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు!
అసలు సమస్యల్లా మన నాయేస్రావు, సావిత్రులే అని నేను భావిస్తాను. నాయేస్రావు కాకుండా ఏ రామ్ చరణో, జూ ఎన్టీయారో అయితే లోకాన్ని ఎదిరించి మరీ, ఓ వంద రొండొందల మందిని చంపేసి మరీ... పారూను పెళ్ళి చేసుకుని ఉండేవాడు (తండ్రిని ఎదిరిస్తే సరిపోతుంది కదా, లోకాన్ని ఎదిరించటాలూ, చంపటాలూ ఎందుకని అడక్కండి, అదంతే!). అలాగే హీరోయినుగా ఏ ముంబై అమ్మాయిని పెట్టినా హాయిగా ’దా దేవ్‍దా, పెల్లి చేస్కోపోయినా, యట్లీస్ట్ సోబనమైనా చేస్కుందాం దా’ అని నాలుగు గంతులేసేది. మనకీ మనసు తేలిక పడేది, సినిమా కూడా సుఖాంతమై కూచ్చునేది.
ReplyDeleteహా.. హ.. హా! very funny. బాగా నవ్వించారు. ధన్యవాదాలు.
Deleteరమణ గారు ఒకసారి ఏదో ఇంటర్వూ లో అక్కినేని ఇలానే చెప్పారు .దేవదాసు పిరికితనం తనకు అస్సలు నచ్చలేదని ... ఆ పాత్రకు అక్కినేని జీవం పోసినా ఆ పాత్ర తిరు నచ్చలేదని చెప్పారు
ReplyDelete