అబ్బ! బుర్ర వేడెక్కిపోయింది. భార్యాభర్తల మధ్య తగాదా కేసు. చాలా టైం పట్టింది. ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మనసంతా చికాగ్గా అయిపోతుంది. లాభం లేదు. ఒక మంచి తెలుగు సినిమా పాట చూసి రిలాక్స్ అవ్వాలి.
ఈ వేడెక్కిన బుర్రని చల్లార్చుకోడానికి నాకు యూట్యూబ్ పాత పాటలు ఎంతో ఉపయోగపడతాయి. నాకు కొత్త పాటలు తెలీదు. అంచేత పాత పాటల్లోనే తిరుగుతుంటాను.
'మనసున మల్లెలు మాలలూగెనే.. ఎంతహాయి ఈరేయి.. ఎంత మధురమీ హాయి!' మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడిన ఈపాట నాకు చాలాచాలా ఇష్టం. ఇప్పటికి వెయ్యిసార్లు విని ఉంటాను. అయినా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. ఎప్పుడువిన్నా మనసంతా హాయిగా, తేలిగ్గా అయిపోతుంది.
అంచేత ఇప్పుడు మళ్ళీ 'మనసున మల్లెలు మాలలూగెనే.. ' వినడం మొదలెట్టాను. కంప్యూటర్ మానిటర్ పై పాటని చూస్తూ తన్మయత్వం, పరవశం చెందుచుండగా..
"రవణ మావా! కాఫీ." అంటూ సుబ్బు వచ్చాడు.
శబ్దం చెయ్యొద్దన్నట్లుగా చూపుడువేలు నోటివద్ద పెట్టుకుని సైగచేస్తూ.. అరమోడ్పు కన్నులతో పాట వినడంలో పూర్తిగా మునిగిపొయ్యాను. పాట అయిపోయింది. తపస్సులోంచి అప్పుడే బయటకొచ్చిన మునివలే ఫీలయ్యాను. గదంతా నిశ్శబ్దం.. ప్రశాంతత.
"ఆహాహా ఏమి ఈ భానుమతి గానమాధుర్యము! ఒక ప్రేయసి తన ప్రియుడి కోసం ఎంత అద్భుతంగా పాడింది! ఈపాట విన్నవాడి జన్మధన్యం. విననివాడి ఖర్మం. సందేహము వలదు. ఈ భూప్రపంచంలో ఇంతకన్నా గొప్పపాట లేదు. ఇకముందు రాదు కూడా!" తన్మయత్వంతో అన్నాను.
"నేనలా అనుకోవడం లేదు." సుబ్బు గొంతు విని ఉలిక్కిపడ్డాను.
కర్కశంగా సుబ్బుని చూశాను. ఈ దరిద్రుడి వల్ల నాజీవితంలో నేనుపొందే చిన్నచిన్న ఆనందాలు కూడా కోల్పోతున్నాను. వీడు మొన్న నీలం తుఫాన్లో కొట్టుకుపొయినా బాగుండేది.
"నువ్వు కోపంతో అలా పిచ్చిచూపులు చూడనవసరం లేదు. భానుమతి పాట అద్భుతం. ఒప్పుకుంటున్నాను. కానీ నాదృష్టిలో 'సడిసేయకోగాలి.. ' ఇంతకన్నా అద్భుతం." అన్నాడు సుబ్బు.
"నువ్వు చెబుతుంది 'రాజమకుటం' పి.లీల పాడిన పాట గురించేనా? ఆపాట గూర్చి నువ్వు చెప్పేదేముంది? చాలా మంచి పాట. నాక్కూడా చాలా ఇష్టం. మాస్టర్ వేణు సంగీతం అమోఘం. కానీ ఆపాటని భానుమతి పాటతో పోలిక తేవడం నీ పూర్ టేస్ట్ సూచిస్తుంది. నా స్టేట్మెంట్ ఖండిద్దామనే దుగ్ద తప్ప నీవాదనలో పసలేదు." చికాగ్గా అన్నాను.
ఇంతలో కాఫీ వచ్చింది.
"నాది ఇంటలిజెంట్ టేస్ట్ అనుకుంటున్నాను. పూర్ టేస్ట్ ఎలానో చెబితే విని సంతోషిస్తాను." కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.
"మల్లీశ్వరి బి.ఎన్.రెడ్డి అద్భుతసృష్టి." అన్నాను.
"మరి రాజమకుటం ఎవరి సృష్టో!" నవ్వాడు సుబ్బు.
"నా 'సడిసేయకోగాలి.. ' కూడా అక్కణ్ణుండే జాలువారింది మిత్రమా!" అందుకున్నాడు సుబ్బు.
"సరే! నీ సడిసేయకోగాలి నా మనసునమల్లెల కన్నా ఎలా ఎక్కువో నువ్వే చెప్పు. ప్రూవ్ యువర్ పాయింట్!" అన్నాను.
"అలా అడిగావ్ బాగుంది. రెండు పాటలు రాసింది కృష్ణశాస్త్రే. కానీ రాయడంలో ఎంత తేడా చూపించాడో గమనించు. మల్లీశ్వరి పాట సబ్జెక్టివ్ గా ఉంటుంది. రాణీవాసంలో మగ్గిపోతున్న మల్లి ఎంతోప్రయత్నం మీద తనబావ నాగరాజుని తుంగభద్ర ఒడ్డున కలుసుకుని.. ఆనందంతో పరవశం చెందుతూ.. తన భావాల్నికవితాత్మకంగా పాట రూపంలో వర్ణిస్తుంది. అద్భుతమైన పాటే! కానీ మనమెవరం? మగాళ్ళం. మన దృష్టికోణం మగవాడివైపు నుండి ఉండాలి." అన్నాడు సుబ్బు.
"అంటే!" ఆసక్తిగా అడిగాను.
"రాజమకుటం పాట విను. 'సడిసేయకోగాలి.. సడిసేయబోకే! బడలి ఒడిలో రాజు పవలించేనే!' ప్రియుడు అలసిసొలసి ఉన్నందున గాలిని శబ్దం చెయ్యొద్దని అడుగుతుంది. అతన్ని రారాజు, మహారాజుగా భావిస్తుంది. తనకంటూ ఏమీ కోరుకోదు. ఏమగాడికైనా కావలసింది తనకోసం వరాలు కోరుకునే నిస్వార్ధ నారీమణిగానీ, తన భావాలు అందంగా వ్యక్తీకరించే కవియిత్రి కాదు. కవిత్వం కడుపు నింపదు. అందుకే రామారావు అదృష్టానికి రాజనాల కుళ్ళుకుంటాడు." అంటూ నవ్వాడు సుబ్బు.
"నేనీ ఏంగిల్లో ఆలోచించలేదు." ఆలోచనగా అన్నాను.
"గాలికూడా శబ్దం చెయ్యరాదంటూ మనని అపురూపంగా చూసుకునే యువతి భార్యగా వస్తే ఎంత సుఖం! రోజూ గుత్తొంకాయ, దోసకాయ పప్పు చేయించుకుని కడుపునిండా భోంచెయ్యొచ్చు. ఎన్నిసార్లడిగినా విసుక్కోకుండా ఫిల్టర్ కాఫీలిస్తుంది. ఈరోజుల్లో ఎన్నిలక్షలు పోసినా ఒక్కరోజుకూడా ఇంతసుఖం దక్కదు." అన్నాడు సుబ్బు.
"భానుమతికేం తక్కువ?" నేనివ్వాళ భానుమతిని వదలదల్చుకోలేదు.
"ఏమీ తక్కువ కాదు. అన్నీ ఎక్కువే. అసలు భానుమతి, రాజసులోచన మొహాల్ని నువ్వెప్పుడన్నా పరిశీలనగా చూశావా? మనమేం చెప్పినా నమ్మేట్లుగా.. అమాయకంగా, బేలగా ఉండే రాజసులోచనతో.. తెలివిగా, ఆత్మవిశ్వాసంతో ఎసెర్టివ్ గా ఉండే భానుమతిని పోల్చడానికి నీకు బుర్రెలా వచ్చింది? బుద్ధున్న ఏమగాడైనా రాజసులోచనని వదులుకుంటాడా!" అన్నాడు సుబ్బు.
"రవణ మావా! నేను భానుమతిని తక్కువ చెయ్యట్లేదు. ఆవిడొక అద్భుతనటి. బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆవిడకి శతకోటి వందనాలు. భానుమతి స్థాయి మనకన్నా లక్ష మెట్లు ఎక్కువనే చెబుతున్నాను. ఆడవారిలో తెలివి ఆటంబాంబు కన్నా ప్రమాదకరమైనది. వారికి ఎంతదూరంలో ఉంటే మనకంత మంచిది. తెలివైన యువతిని కట్టుకుని బాగుపడ్డ మగాడు చరిత్రలో లేడు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
"నేను చరిత్ర చదువుకోలేదు సుబ్బు!" నవ్వుతూ అన్నాను.
"బి.ఎన్.రెడ్డిది కూడా నా అభిప్రాయమే! అందుకే పాటల చిత్రీకరణలో చాలా తేడా చూపాడు. 'మల్లీశ్వరి'లో భానుమతి పాట పాడినంతసేపూ రామారావు పక్కనే కూర్చునుంటాడు. పైగా భానుమతి తనమీదకి ఒరిగినప్పుడు ఆవిడ బరువు కూడా మోస్తాడు. ఎంత ఘోరం! అదే 'రాజమకుటం' పాట చూడు. హాయిగా రాజసులోచన ఒడిలో తల పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. తనకి లభించిన ఈ ప్రమోషన్ రామారావుకి కూడా సంతోషం కలిగించినట్లుంది." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.
"ఇన్నాళ్ళు భానుమతి పాటే అద్భుతమనుకున్నానే!" డిజప్పాయింటింగ్ గా అన్నాను.
వెళ్ళబోతూ ఆగి, వెనక్కితిరిగి అన్నాడు సుబ్బు.
"ఇవన్నీ పబ్లిగ్గా చెప్పే మాటలు కాదు మిత్రమా! యే అందర్ కి బాత్ హై! ఇప్పుడైనా ఎవరన్నా అడిగితే భానుమతి పాటే గొప్పని చెప్పు. లేకపోతే నిన్నో పురుష దురహంకారిగా భావించే ప్రమాదముంది. అసలే రోజులు బాలేవు!" అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.
మళ్ళా ఏదో లిటిగేషన్ పెడుతున్నారు. యన్టీ ఓరికి రెండూ కమ్మగా ఉన్నట్లు నాకయితే అనిపించింది.
ReplyDeleteనాకయితే యన్టీ ఓరు భానుమతి పక్కన భయంతో, క్రమశిక్షణతో ఆనందంగా ఉన్నట్లు నటించినట్లుగా అనిపించింది!
Deleteఅవునవును...
Deleteభానుమతమ్మ ప్రక్కన ఎన్టీవోడైనా ఎమ్జీవోడైనా
ఎవుడైనా సరే సిగ్గుతో కూడిన భయం వల్ల
వచ్చిన గౌరవంతో ... ఆనందంగా ఉన్నట్లు ...
నటించాల్సిందే ... మరి.
*ఆడవారిలో తెలివి ఆటం బాంబు కన్నా ప్రమాదకరమైనది. వారికి ఎంత దూరంలో ఉంటే మనకంత మంచిది. తెలివైన యువతిని కట్టుకుని బాగుపడ్డ మగాడు చరిత్రలో లేడు.*
ReplyDeleteరమణగారు, మంచి మాట చెప్పారు. ఇదే మాటని కొంత కాలం క్రితం నాతో పనిచేసిన పెద్ద యునివర్సిటిలో, ఎకనామిక్స్ లో పి. చ్ డి చేసి, మంచి ఉద్యోగం (సంవత్సరానికి 20లక్షలు జీతం) చేసే అమ్మాయి చెప్పింది. చదువుకొనే రోజులలో తెలివిగల అమ్మాయిలతో అబ్బాయిలు మంచి స్నేహితంగా ఉంట్టారే గాని, పెళ్ళి చేసుకోవటానికి మాత్రం ఆసక్తి చూపరని చెప్పింది. అబ్బాయిలు తక్కువ క్వాలిఫికేషన్ గల అమ్మాయినే పెళ్ళి చేసుకొవటానికి ఆసక్తి చూపుతారని, ఒక వేళ పెళ్లి చేసుకొన్న సక్సెస్ రేట్ (సంతోషంగా కలసిజీవించటం)వారిలో చాలా తక్కువ అని.
కంపేనీలలో ఈ మధ్య గమనించిన ట్రెండ్ ఏమిటంటే అమాయిలందరికి పెళ్ళిళు కావటంలేదు. అందంగా కూడా ఉంటారు. అయినా సుమారు 20% మంది అవివాహితులుగానే ఉండిపోతున్నరు.
ముప్పై వరకు చాలా ధైర్త్యం గా,ఆత్మ విశ్వాసంతో కనిపించే వీరు ఆ తరువాత ధైర్యాన్ని కోల్పోవటం మొదలు పెడతారు. వారి ఇంట్లో తండ్రో, తల్లో ఎవరైనా ఒకరు చనిపోయిన తరువాత, అప్పటి వరకు ప్రొటేక్టేడ్ గా పెరిగిన వీళ్లకి ప్రపంచం గురించి అర్థం కావటం మొదలౌతుంది. మేకపోతు గాంభిర్యం తో జీవితాన్ని ఎదో అలా నేట్టుకొస్తూంటారు.
SriRam
శ్రీరాం గారు,
Deleteఏదో ఫ్లోలో అలా రాసేశాలేండి!
మీ ఎనాలిసిస్ బాగుంది (బయటకి ఎన్ని కబుర్లు చెప్పినా లోపల "పురుషులమే!").
యూనివర్శిటీ వాళ్ళిచ్చే డిగ్రీలే తెలివికి కొలబద్ద అనుకుంటే వైద్యవృత్తిలో ఉండే జంటల్లో (చాలాసార్లు) భార్యలకే డిగ్రీలు పెద్దవి. ఇక్కడ డబ్బు సంపాదన ప్రధానం.
నాకు తెలిసి అబ్బాయిలు అమ్మాయిల్లో తెలివి కన్నా అందానికే పడిపోతారు. 'కనపడని తెలివి కన్నా కనపడే అందమే బెటర్!' అనుకునే వాస్తవ దృక్పధం కూడా కావచ్చు!
నేను రాయటనికి కారణం ఉందండి. మొన్న శనివారం ఒక పెద్ద కార్పోరేట్ ఆసుపత్రికి వేళ్ళాను. అక్కడ నా పాత కోలిగ్ ఒక అమ్మాయి కనిపించింది. ఈమేకు సుమారు 35 సం|| వయసు, పెళ్ళికాలేదు. చాలా మంచిది. స్రీవాద సాహిత్యంలో రచయితలు చెప్పే అన్నిలక్షణాలు ఉన్న ఆ అమ్మాయి (ఎంతో తెలివి,చదువు,సంపద, చురుకు, స్మార్ట్ నేస్, స్వతంత్ర ఆలోచన విధానం,తన కాళ్ళమీద తాను నిలబడిన )అలా అయింది ఎమీటా అని ఆరా తీశాను. ఈ మధ్య తండ్రి చనిపోయాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆమేకి ఒక చెల్లెలు ఉంది. వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్నాది. అమ్మ ఆరోగ్యం ఎప్పుడు బాగోతుందో తెలియక దిగులు,ఆమే మొహంలో భీతి, భయం చూసి ఆశ్చర్యపోయాను. ఆఫీసులో ఎంత కాంఫిడేన్స్ గా కనిపించేదో (బర్ఖా దత్ మాదిరిగా )అక్కడ అంత నిస్సహాయురాలిగా కనిపించింది. కార్పోరేట్ ఆసుపత్రికి పదే పదే తిరుగుతూండటం వలన అక్కడ జరిగే తతంగం (మోసం)అంతా అర్థమైంది. ఉదయం ఆసుపత్రికి వేళితే చెకప్ ల పేరు తో రోజంతా అక్కడే ఉండవలసి వస్తూండటం తో వీకేండ్ లో విశ్రాంతి లేదని వాపోయింది. ఆమేలో ఒక విధమైన భయం మొదలైందని అనిపించింది. మాటలో అర్థమైంది ఎమిటంతే భవిషత్ లో వంటరిగా ఉండే తన పరిస్థితి ఎలా ఉంట్టుందో అని గుబులు, ఆమే కళ్ళలో స్పష్టంగా కనిపించిది. బంధువులు ఎవరైనా సహాయాంచేయటం లేదా అని అడిగాను. అందరు ముసలి వారైపోయారు, వాళ్ల కసిన్స్ విదేశాలలో ఉన్నారు అని చెప్పింది. ఆమేతో మాట్లాడుతున్నపుడు , ఈ రోజుల్లో చిన్న కుటుంబాలవలన భవిషత్ లో చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని కళ్ళకు కట్టినట్లు కనిపించింది.
Delete___________________________
వైద్యవృత్తిలో ఉండే జంటల్లో (చాలాసార్లు) భార్యలకే డిగ్రీలు పెద్దవి. ఇక్కడ డబ్బు సంపాదన ప్రధానం
వైద్య వృత్తే కాదండి, మిగతా రంగంలో కూడా అంతే. కొన్నిసార్లు అమ్మాయిలకు పెళ్ళిళు కావటం ఆలస్యమౌతుంటే, ప్రస్తుతం మా అమ్మాయి ఇంట్లో ఖాళిగా కూచొని ఉన్నాది అని చెప్పుకోవటానికి నామోషి అయి తల్లిదండృలు ఎదో ఒక పి జి కోర్స్ చదివిస్తూంటారు. ఇప్పుడు పి జి ల బాధ లేదు. ఎదో ఒక కంప్యుటర్ కోర్స్ చేస్తున్నాదని చెప్పితే ఇక ఎవరు ప్రశ్నించరు :)
తెలివి డబ్బు గా మారకపోతే జీవితంలో తెలియని పెద్ద వెలితిగా తయారౌతుంది రమణగారు . ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత శ్రీమతి ఉద్యోగం చేయనని మొండికేస్తే , డబ్బుగా మారని తెలివి వలన పెద్ద ఉపయోగం ఉండదు. కనుక అందమే మొదటి చాయిస్.
SriRam
డాక్టరుగారూ. మీరు మీ సుబ్బు మాటను లెక్క చేయకపోవటం యేమీ బాగా లేదు. అతగాడు వద్దన్నా విషయం పదిమందికీచెప్పేస్తారా? ఏదో సుబ్బును బయట పెట్టాలనే దుగ్ధతో చివరికి పురుష దురహంకారి అని కూడా అనిపించుకుందుకు సిధ్ధమైపోయారే! కానివ్వండి, సుబ్బుకేమీ నష్టం లేదు.
ReplyDeleteశ్యామలీయం గారు,
Deleteసుబ్బు కూడా నా మాట లెక్కచెయ్యడండి! ఒకళ్ళనొకళ్ళం లెక్కచేసుకోకపోవటంలో మా ఇద్దరి మధ్యా పోటీ ఉంది!
ఆ పోటీలో పడి ఈ పురుష దురహంకారం సంగతే మర్చిపోయాను సుమండీ! ఔరా సుబ్బూ!
అవును డాక్టరు గారు! కొన్ని విషయాలు నిజాలే కావచ్చు అంతమాత్రంచేత అవి బయట పెట్టేస్తామా ఏమిటి?మీ సుబ్బు చెప్పినమాట నిజంగా అక్షరాలా నిజం.
ReplyDeleteఅంచేతఒక కోణం నుంచి మాత్రమె చూడండి. మరోకోణం జోలికి మాత్రంవెళ్ళకండి.
ఎమన్నా అయిపోవచ్చుఅసలు ప్రళయమేరావచ్చు.
పూర్వ ఫల్గుణి గారు,
Deleteనాకంత ప్రమాదం రాదులేండి. నా బ్లాగుల్లో దూషణములన్నీ సుబ్బు ఖాతాలోకి, భూషణములన్నీ నా ఖాతాలోకి వచ్చేట్లుగా జాగ్రత్తగానే రాస్తుంటాను.
డాక్టర్ గారు,
ReplyDeleteబాగుంది సార్,
అయితే పుట్టే పిల్లలు తెలివితక్కువ వారుగా పుట్టే ప్రమాదం వుంది.
ఒకమారు ఆలోచించండి.
జి రమేష్ బాబు
గుంటూరు
డియర్ రమేష్ బాబు,
Deleteమీవంటి విశాల హృదయులు తెలివైన పిల్లల కోసం తెలివైన స్త్రీ భార్యగా రావాలని నిస్వార్ధంగా కోరుకుంటారు. మంచిదే. మీ సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్!
డాట్రుగారు, మీరు గమనించినట్టులేరు...
ReplyDeleteఇక్కడ భానుమతి ఎస్సర్టివ్ నెస్ కంటే రాజసులోచనదే ఎక్కువ..
పాటలో ఎక్కడో "నిదుర చెదిరిందంటె నేనూరుకోనే!" అని గాలినే బెదిరుస్తది..
మనకోసం అట్టా చేసే ప్రేయసి ముందు భానుమతీ గీనుమతీ బలాదూర్ అంటా!
అయ్యా బుల్లబ్బాయ్ గారు,
Deleteరాజసులోచన గాలితోనో, చంద్రుడుతోనో ఎసెర్టివ్ గా ఉంటుంది. భానుమతి మనతోనే ఎసెర్టివ్ గా ఉంటుంది. అదీ సమస్య!
ఈవిషయాన్ని ఒక కోణం రెండు కోణాలేమున్నదిలే ఇంకా ఇంకా చాలాకోణాల్లో చూడొచ్చు. అలా అని నీకోణాలన్నీ బయటెట్టమాకు భద్రం బ్రదరూ !!!
ReplyDeleteఇప్పుడు అన్ని కోణాలు అరిగిపోయాయి మిత్రమా! ఇంక మిగిలింది చిత్తూరు నాగయ్య కోణమే!
Deleteఫస్ట్ టైం ఈ రోజే మీ పోస్ట్ లు చూశాను...
Deleteమీ హాస్య చతురతకు జేజేలు...
మీ దగ్గర కొచ్చిన మానసిక రోగులు
తమలో తాము కాక తమ వాళ్లతో
నవ్వుకుంటూ వెళ్తూ ఉండి ఉంటారనుకుంటున్నాను...
* నిజమేనండి, కొందరు భర్తలు తమ భార్యలకు ఎక్కువ తెలివితేటలు ఉండడాన్ని అంతగా సహించలేరన్న సంగతి అందరికి తెలిసిందే.
* అయితే, ఈ విషయం తెలివైన ఆడవారికీ తెలుసు కాబట్టి, వారు అణకువగా కూడా ఉంటూనే చాకచక్యంగా కుటుంబాన్ని దిద్దుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.
* అయినా తెలివితేటలు ఎక్కువగా ఉండే ఆడవాళ్ళకు అణకువ ఉండదని అనుకోవటం పొరపాటు. అన్నీ ఉన్న ఆకు అణగిమణగి ఉంటుందట.
* అయితే, తెలివితేటలు ఉన్నాయని గర్వించే ఆడవాళ్ళూ లేకపోలేదు.
* తక్కువ తెలివితేటలు ఉన్నా అణకువగా , పద్ధతిగా ఉండే ఆడవాళ్ళూ ఎందరో ఉంటారు.
* తక్కువగా తెలివితేటలు ఉండి, అందుకు గిల్టీగా ఫీలవుతూ ఇతరులను బాధించే ఆడవాళ్ళూ ఉంటారు.
* ఇలాంటి ఎందరో స్త్రీ, పురుషుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలంటే సమాజంలోకి వెళ్ళనవసరం లేదండి, పెద్దలు అందించిన పురాణేతిహాసాలలో సమాజం అంతా కనిపిస్తుంది.
........................
* మాకు తెలిసిన వాళ్ళు ఎంతో ఆలోచించి , ఒక కోడలిని తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి తనకుతానే గిల్టీగా ఫీలైపోతూ అత్తింటివారిని ఎన్నో ఇబ్బందులు పెడుతోంది. అణకువ అనేది సంస్కారం వల్ల వస్తుందనుకుంటున్నాను.
..............
* సత్ప్రవర్తన కలిగి దైవాన్ని ఆరాధిస్తే ఎవరైనా తెలివితేటలను పొందే అవకాశం ఉందండి.
* సామాన్యుడైన కాళిదాసు దైవం దయవల్లే మహా పండితుడయ్యారు.
* తనకే బోలెడు తెలివి తేటలున్నాయని ఎవరైనా గర్విస్తే , ఎంత తెలివిగలవాళ్ళయినా పొరపాట్లు చేసే అవకాశం ఉంది.
* సత్ప్రవర్తన, దైవభక్తి కలిగి ఉంటే , పెద్దగా తెలివితేటలు లేకున్నా చక్కగా జీవించే అవకాశం ఉంది. ఎంత తెలివితేటలున్నా దుష్టులైతే ఎప్పటికో ఒకప్పుడు జీవితంలో దిగజారిపోయే ప్రమాదముంది.
...............
* తెలివితేటలు అనేవి వంశపారంపర్యంగా వస్తాయని అంటారు. ఆ మాటా కొంతవరకు నిజమే కానీ, పూర్తిగా కాదండి.
* ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో కూడా కొందరికి ఎక్కువ తెలివితేటలు, కొందరికి తక్కువ తెలివితేటలు ఉంటున్నాయి కదా !
* ఒకే వ్యక్తి కూడా కొన్ని సార్లు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తే, కొన్నిసార్లు తెలివితక్కువగా పొరపాట్లు చేస్తారు.
............
* భానుమతి గారు రచించిన ఒక పుస్తకం మా ఇంట్లో ఉందండి.
* టపాలా వ్యాఖ్యను రాసాను. దయచేసి తప్పుగా అనుకోకండి.
anrd గారు,
Deleteఈ పోస్ట్ ఎందుకు రాశాను?
నాకు భానుమతి, పి.లీలలు పాడిన ఈ రెండు పాటలు చాలా ఇష్టం. నాకు నచ్చిన పాటలకి సరదా వ్యాఖ్యానాలు జోడిస్తూ రాయడం నాకిష్టం. ఇంతకుముందు 'మిస్సమ్మ' పాట కూడా ఇలానే రాశాను.
ఈ పోస్టులో ఆడవారి తెలివితేటల గూర్చి రాసిన వ్యాఖ్యానాలు సీరియస్ గా రాసినవి కావు. నూటికి నూరు పాళ్ళు హ్యూమర్ కోసం రాసినవి మాత్రమే. కాబట్టి చదివేసి హాయిగా నవ్వేసుకోండి.
డాక్టర్ గారు, ఇందులో నేను సీరియస్ గా తీసుకోవటానికేముంది. పోస్ట్ సరదాగా బాగుంది.
Deleteఅయితే , సందర్భం వచ్చింది కాబట్టి, ఆడవారి తెలివితేటల గూర్చి నా అభిప్రాయాలను కొన్నింటిని రాయాలనుకున్నాను.
నిజమేనండి , నా అభిప్రాయాలను నా బ్లాగులో కూడా రాయవచ్చు. కానీ, ఈ టాపిక్ గురించి గురించి మీ బ్లాగులో చదివి , నేను నా బ్లాగులో నా అభిప్రాయాలను రాస్తే , మళ్లీ మీరు ఎలా ఫీలవుతారో తెలియదు కదా ! అందుకే పనిలో పనిగా నా అభిప్రాయాలను ఇలా రాసాను. అంతేనండి.
anrd గారు,
Deleteచర్చ ఆడవారి తెలివితేటలపై మళ్లడం మూలానా (నాకు ఇబ్బందిగా అనిపించి) వివరణ రాశాను. అంతే.
మీ అభిప్రాయాలు నా బ్లాగులో నిరభ్యంతరంగా రాయొచ్చు. రాసెయ్యండి.
"ఎందరో స్త్రీ, పురుషుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలంటే సమాజంలోకి వెళ్ళనవసరం లేదండి, పెద్దలు అందించిన పురాణేతిహాసాలలో సమాజం అంతా కనిపిస్తుంది"
ReplyDeleteకథలలో, పురాణాలలో, సినేమాలలో అందరు కొద్ది పాటి అనుభవంతో హీరో ఎవరు,విలన్ ఎవరు, ఎవరు మంచి వాడు,ఎవరు చెడ్డవాడు అని ఇట్టే పసిగట్టేస్తేయవచ్చు. అదే జీవితం లో ఎన్నోఏళ్ల నుంచి పక్కన ఉన్నవాడు ఎటువంటి వాడో చెప్పలేరు. అంతదాక ఎందుకు స్వంత భర్తను/భార్యను అంచనావేయటం చాలా కష్ట్టం. కావాలంటే కొండపల్లి సీతారామయ్య భార్య రాసిన నిర్జన వారధి చదవండి. ఎన్నోసంవత్సరాలు కాపురం చేసిన ఆమే భర్తే కొన్ని కారణాల వలన వదిలేశాడు.
ఇంకొక ఉదాహరణ రామారావు. ఆయన ప్రతి సినేమాలో విలన్ ఏ వేషంలో వచ్చినా ఇట్టే పసిగట్టేసి అతని ఆటలు కట్టించేవాడు. అదే నిజజీవితంలో పక్కన ఉన్న స్వంత అల్లుడు ఎమీ చేయబోతున్నాడో కనీసం ఊహించలేకపోయాడు :)
SriRam
నిజమేనండి, ప్రక్క వాళ్ళ వరకు అవసరం లేదు . మనకు మనం అర్ధం కావటం కూడా కష్టమే. ఎవరి మనస్సే వారికి ఎన్నో సార్లు సరిగ్గా అర్ధం కాదు. అందుకే కాబోలు ఎందరో పెద్దలు దైవనామ స్మరణను చేయమన్నారు. ధ్యానం వంటి ఎన్నో ప్రక్రియలను తెలియజేసారు. పురాణేతిహాసాలను అందించారు. రమణమహర్షి గారు " నేను " అంటే ఏమిటో ముందు తెలుసుకోమన్నారు.
Delete"ఎందరో స్త్రీ, పురుషుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలంటే సమాజంలోకి వెళ్ళనవసరం లేదండి, పెద్దలు అందించిన పురాణేతిహాసాలలో సమాజం అంతా కనిపిస్తుంది"...అంటే నా అభిప్రాయం....
మనుషుల్లో ఉండే రకరకాల మనస్తత్వాల గురించి , ఒకే మనిషి కూడా విభిన్న పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించే అవకాశాల గురించి, మనుషుల జీవితాల్లో ఎదురయ్యే ఎన్నో సంఘటనల గురించి.........ఇలా ఎన్నో విషయాలను పెద్దలు తెలియజేసారు.
అయితే పురాణేతిహాసాలలోని కొద్దిగా అయినా లేక ఒక పాత్ర గురించి కొద్దిగా అయినా తెలుసుకోవటం కూడా చాలా కష్టం. పురాణేతిహాసాల గురించి అతి కొద్దిగా తెలుసుకున్నా కూడా, జీవితంలో ఎంతో ఉపయోగం కలుగుతుందన్నది పెద్దల అభిప్రాయం కావచ్చండి.
నాకు చాలా చాలా ఇష్టమైన రెండు పాటల గురించి రాశారు మాస్టారు. వెన్నెలంత హాయి గొలిపే గీతాలు. జుంటి తేనె వంటి పాటలు. కవిత్వం కోసం సంస్కృతం దగ్గరికి పరిగెట్టక్కర్లేదని నిరూపించిన పాటలు రెండూను.రత్నపీఠిక లాంటి సందర్భాల్లో తప్ప తత్సమాలు ఎక్కువగా కనిపించవు. తేట తెనుగు రుచి చూడాలంటే దేవులపల్లిని వినాలి. లేదంటే జాలాదిని వినాలి. ఒకరు తన రెక్కలపై ఊహాలోకాలకు తీసికెళ్లి అలా అలా అందాల మాయాలోకం అంతా తిప్పుకొస్తారు. మరొకరు బరబరా చేయిపట్టుకు లాక్కెళ్లి బతుకు లోతును చూపుతారు. అయినా డాక్టర్ గారూ మీరిలా మామిడిపండుకు సీతాఫలానికి పోటీ పెట్టి వినోదం చూడడం ఏమిటండీ. రెండూ రెండూనే. మీరు రాజకీయ అభిప్రాయాలతో ముడిపెట్టినారు కానీ లేదంటే మామిడిపండుకు ఒక తులం ఎక్కువ రుచికలదేమో అని చెప్పి ఉండేవాడిని.
ReplyDeleteఈ రెండు పాటలూ ఆశేషాభిమానాన్ని చూరగొన్న పాటలే. అయితే మల్లీశ్వరి సినిమా, భానుమతి గాత్రం.. 'మనసున మల్లెలు.. ' పాటని పైమెట్టున నిలబెడుతుంది. చాలామంది అభిప్రాయమూ ఇదే.
Deleteనాకు పి.లీల గాత్రం చాలా ఇష్టం. అందుకే మల్లీశ్వరి పాటతో 'సడిసేయకో గాలి.. ' ని పోలిక తెచ్చాను. ఎంత ఇష్టమైనా.. భానుమతి సరసన పి.లీలని తీసుకురావడానికి ధైర్యం చాల్లేదు. అందుకే సుబ్బు సాయంతో చిన్న లాజిక్ రాశాను. కాబట్టే మీవంటి వారు కొంచెం మొహమాట పడుతున్నారు. నా పాచిక పారింది!
భానుమతి సరసన పి.లీలని తీసుకురావడానికి ధైర్యం చాల్లేదు ...
Deleteచూశారా...భానుమతమ్మంటే...
ఆవిడ లేకపోయినా హడలే .. హహ...
Thanks for melody songs, As " one wise man said" u can not live with them and also u can not live without them" , assertive, non assertive, confident, timid all other characters finally make no sense. As there is no ideal drug, there is no ideal spouse(wife/husband), the last word is for my insurance.
ReplyDeleteమిత్రమా,
Deleteఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది,
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!
రసభంగం అయ్యింది డాట్రు గారూ.....
Deleteలేదు సుఖం, లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృథా, చదువు వృథా
కవిత వృథా, వృథా, వృథా
మనమంతా బానిసలం గానుగలం,
పీనుగులం: వెనుక దగా, ముందు దగా
చాలా బావుందండీ!రెండు పాటలు వేటికవే చాలా గొప్ప పాటలు. ఆ పాటలని మీ దృష్టితో చూడటం ఆనంద మానందమాయే!
ReplyDeleteఆడవారిలో ఉన్న తెలివి తేటలని, అహంకారాన్ని, ఆదిపత్య దోరణి ని భరించ గల్గె మగవాళ్ళు ఉంటారు.(భర్త) సమయానుసారంగా పొగిడి , ఇంకా ఎక్కువ అహంకారం చూపి అణచి , ఇంట్లో ఆధిపత్య దోరణి భరించి నట్లు నటించి బయట వేరే పనులు చేసి కక్ష తీర్చుకుంటారు.
అయినా ఆడవాళ్ళ వెదవ తెలివితేటలూ ఎందుకు పనికి వస్తాయి చెప్పండి ? ఇల్లునే దిద్దుకోలేరు.ఇక భర్తని కూడానా!? టోటల్ ఫెయిల్యూర్ అని అంటాను నేను.
రమణ గారు..అందుకే భార్య భార్త లకి ఇక పై మీ వైద్య, కౌన్సిలింగ్ సేవల అవసరం ఎంతైనా ఉంది :)
" పని ఉన్నా . పనిలేక ఉన్నా.." మీరు కూడా.. భానుమతి పాట వీలైనంత ఎక్కువగా ఇంట్లో చూడండి.
క్లినిక్ లో అయితే "రాజ సులోచన " పాట చూసేయండి. :) :)
వనజవనమాలి గారు,
Deleteనేను తెలివైనవాణ్ణనే అనుకుంటాను. కానీ నా భార్యతో సహా ఎవరూ ఒప్పుకోవట్లేదు. కాబట్టి తెలివితేటల జోలికి పోను.
భార్య తెలివితేటల్ని ఒప్పుకోని భర్తల్ని గృహహింస చట్టం కింద లోపలేయించి రోజంతా కుమ్మిస్తే సరి! అందరూ దారికొస్తారు.
రమణ గారు.. LOL
Deleteభానుమతి, రాజసులోచనలా!! శివ శివా... నయం కన్నాంబ, లక్ష్మీరాజ్యం అన్నారు కాదు.
ReplyDeleteడాక్‌ట్రారూ ఓ ప్రశ్న. భానుమతి తెలివైనదని మీరెలా చెప్పగలరు? నోటి దురుసు వున్నావిడ అని మా నాన్న గారు చెప్పేవారు, ఆయన ఆవిడ అభిమానే.
పిక్చరైజేషన్, ఆక్షన్ గొప్పగా లేకున్నా ఆ రెండు పాటలు వినడానికి బాగుంటాయి. లీల భానుమతి కన్నా తక్కువా? మిస్సమ్మ, మాయాబజార్ ఇష్టపడే మీరీమాట అనడం నే జీర్ణించుకోలేకపోతున్నాను. కాబట్టి ఈసారి నే సుబ్బు పక్షం, అంతే..
SNKR గారు,
Deleteమీ కామెంట్ స్పామ్ లో ఇరుక్కుపోయుంది. ఇప్పుడే చూశాను.
>>భానుమతి తెలివైనదని మీరెలా చెప్పగలరు?<<
భానుమతి 'అత్తగారి కథలు' చదివాను. అందువల్ల.
>>లీల భానుమతి కన్నా తక్కువా?<<
సంగీతం గూర్చి నాకు నాలెడ్జ్ లేదు. నాకు తెలిసినవారిలో ఎక్కువమంది అభిప్రాయం ఇది. ముఖ్యంగా మా అమ్మ అభిప్రాయం. విఎకె రంగారావు వంటి సినీసంగీత విమర్శకులు కూడా భానుమతికి పెద్దపీట వేస్తారు. నాకయితే ఇద్దరి పాటలూ ఇష్టం. ఇద్దర్నీ ఇష్టంగా వింటాను.
@భార్య తెలివితేటల్ని ఒప్పుకోని భర్తల్ని గృహహింస చట్టం కింద లోపలేయించి రోజంతా కుమ్మిస్తే సరి! అందరూ దారికొస్తారు.
ReplyDeleteLOL..it is hapening ;-)
భలే, మీ ఆనందం చూసి చాలా ముచ్చటైంది. ఆరిపోయే దీపం పెద్దగా వెలిగుతుంది. ప్రస్తుతం మహిళలు సాధించామనుకొన్న పై చేయికూడ అదే. గుర్రం అహంకారం తో సకిలిస్తూ కాళ్లను ఎంత పైకి ఎత్తుతుందో మళ్ళి అంతకిందకి దించాలి. తప్పదు.
Deleteఒకటి గుర్తుంచుకోవలసింది ఎమీటంటే మనదేశం వరకు వివాహవ్యస్థ అనేది మత వ్యవస్థలో అంతర్భాగంగా బ్రాహ్మణులు చేశారు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి స్రీ పురుషుల మధ్య జరిగే ఐదు నిముషాల పనికి, వాళ్ళు పెద్ద ప్రాసేస్(సంస్కృతి) సృస్టించారు. పెళ్ళికి ముందు మంత్రాలు నుంచి రామయణం వంటి గ్రంథాల వరకు వివాహ బందం గురించి నొక్కి చెపుతూ, పెద్ద పుస్తకాలను ఎంతో కష్టపడి సామాన్య ప్రజలకొరకు రాశారు. మగవారికి పెళ్ళి అనేది జీవితం లో చాలా ముఖ్యమని వేల సంవత్సరాల నుంచి బ్రైన్ వాష్ చేశారు. ఆ దెబ్బతో తరతరాలుగా మగవారు మారుమాటాడకుండా పెళ్ళి చేసుకొంట్టు పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.దీనిని అలుసుగా తీసికొని వారిని పూర్తిగా అదుపు చేయటానికి సెక్యులర్ చట్టాలను (ఈ సెక్యులర్ చట్టాలు సంస్కృతి మీద అవగాహన లేని, విదేశీ చట్టాలను కాపికొట్టే వారు చేస్తున్నారు. వారికి రామాయణం అంటే ఒక పాత చింతకాయ పచ్చడి అనే భావం ఉంట్టుంది) చేసి దోచుకోవటం మొదలుపెట్టారు. ఉద్యోగం, డబ్బులను చూసుకొనో, స్వంత ఊరికి దూరంగా ఉంటే లభించే స్వేచ్చ చూసుకొనో,చట్టం అండచూసుకొనో మారుతున్న స్రీల మనోభావాలు, వారి ప్రవర్తనను సమాజంలో వచ్చే మార్పులను మగవారు నిశితంగా పరిశీలిస్తున్నారు. సమయం చూసి వాళ్ళు రియాక్ట్ అవుతారు. వివాహ వ్యవస్థను కూల దోస్తారు. దానిని ఎంత త్వరగా పడగొడితే మగవారికి అంత మంచిది. మీవంతు సహాయంగా ఆడవారు గృహ హింస కేసులు ఎన్ని పెడితె,మగవారికి పెళ్లి చేసుకోవలానే కోరిక పైన అంత విముఖత ఏర్పడుతుంది. పైగా ఈ కేసుల భయం వలన అబ్బాయి తల్లే ఒప్పుకోదు. నిన్ను నేను ముద్దుగా పెంచుకొంది, ఆడరౌడిలతో( పెళ్ళాం చేత) నిందలు పడటానికి కాదు అని పెళ్ళికి అడ్డుపడుతుంది. కావాంటే ఆ కొరీక ఎక్కడైనా డబ్బులు పడేసి తీర్చుకో అని తల్లిదండృలే చెప్పె రోజు ఎంతో దూరంలో లేదు. ఇప్పుడిప్పుడే మొదలైంది కూడాను.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా చూస్తే పెళ్ళికాని మగవాడు ఎక్కువ సంతోషంగా ఉన్నాడని ఎన్నోసర్వేలు చెప్తున్నాయి. ఒకసారి మనదేశంలో మగవారికి ఇది అర్థమైతే చాలు, ఇక పెళ్ళి చేసుకోరు. ఇక తరతరాలుగా మగవరి మీద ఆరోపణలు చేసే అలవాటైన ఆడవారికి, కంటికి మగపురుగు కనపడకపోతే, వాగటానికి అవకాశంలేక డిప్రెషన్ లో పడతారు. భవిషత్ లో జరగబోయేది ఇదే. ఇప్పుడు 5 సం|| వయసు ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని కాపురం చేస్తారని ఎవరైనా ఊహించుకొంటే వారిని చూసి జాలి పడాలి.
ఇన్నిరోజులు సమాజంలో ఆచారం వ్యవహారం, సంస్కృతి, సభ్యత మొద|| వన్ని కంటిన్యు కావాలంటే ముఖ్యమైనది వివాహ వ్యవస్థ అని గుర్తించిన బ్రాహ్మణ వర్గం వాళ్ళే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇప్పటివరకు సమాజంలో ఉన్న సంస్కృతి విమర్శించటం లో మాత్రం , అబ్రహ్మణ వర్గాలు అందెవేసిన చేయి. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా వివాహవ్యవస్థను విమర్శిస్తున్నారు. అందరు కలసి వేరు వేరు మార్గాలలో వివాహవ్యవస్థపైన దాడి చేస్తే అదినిలవటం చాలా కష్టం .
Deletehttp://www.facebook.com/Taadepalli/posts/10151194524969131
http://www.facebook.com/Taadepalli/posts/10151194925474131
అది ఎంత త్వరగా పోతే మగవారికి అంత మంచిది. LOL :)
@ Anonymous (7 November 2012 11:31,7 November 2012 11:49)
Delete"భార్య తెలివితేటల్ని ఒప్పుకోని భర్తల్ని గృహహింస చట్టం కింద లోపలేయించి రోజంతా కుమ్మిస్తే సరి! అందరూ దారికొస్తారు. "
LoL
"భార్య తెలివితేటల్ని ఒప్పుకోని భర్తల్ని గృహహింస చట్టం కింద లోపలేయించి రోజంతా కుమ్మిస్తే సరి"
Delete@జూ||ఓల్గా అలియస్ మౌళి,
భార్యకు (ఆడవారికి)తెలివితేటలా!? ఈ మాటచదివి ఒక్కసారిగా అదిరిపడ్డాను, చుక్కలు కనిపించాయి. అరేరే ఆడవారు ఏ లోకం లో ఉన్నారు? వాళ్ళగురించి వాళ్ళు ఎంత అతిగా ఊహించుకొంట్టున్నారు? మీకు తెలియని విషయమేమీటంటే పెళ్లి చేసుకోవటమే మగవారికి ఒక హింస మళ్లి వారినెత్తిన గృహహింస కేసులా!? తరతరాలు గా ఆడవారి చేతిలో మగవాడు పడ్డ హింస, నరకయాతన మాటల్లో చెప్పలేనిది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎంతో మంది మగవారికి నెత్తిన జుట్టు రాలిపోయి, అది ఒక్క తరంతో ఆగకుండా కొన్నితరాల వరకు బట్టనెత్తి గా వారికి సంక్రమిస్తున్నాది. మగవారితో పోలిస్తే ఆడవారికి బట్టనెత్తి ఎందుకులేదో ఇప్పటికైనా అర్థమైందా? ఇంతకంటే ప్రత్యక్షసాక్ష్యం వేరేదైనా మీకు కావాలా? కావాలంటే డా || రమణగారే దానికి నిదర్శనం.
ఆయనకి పెళ్ళైన తరువాత జుట్టు రాలిపోవటం ఎక్కువై అయి, 50వ పది వచ్చేసరికి బట్టనెత్తితో ఆగింది :) స్వార్ధ వాదం పేరుతో సోది పుస్తకాలు రాసే ఈగ లాంటి రచయితలకు మగవారు ఎంతటి దారుణ గృహహింసకి గురౌవ్తున్నారో కంటికి కనిపిస్తున్నా చూసి చూడనట్లు నటిస్తూ, ఆరోపణలు చేస్తూంటారు.
అజ్ఞాతా,
Deleteమీరు మౌళి గారితో చర్చ జరుపుచున్నారు. మంచిది. మగవారి పక్షాన మీరు చేస్తున్న వాదన అభినందనీయం. మగవారి బట్టతలకి ఆడవారి హింసే కారణమంటున్నారు. ఆలోచించవలసిందే. కానీ.. మధ్యలో నా బట్టతలని ఉదాహరించడం అన్యాయం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
గత కొన్నేళ్లుగా ప్రపంచ రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యల పట్ల తీవ్రంగా యోచిస్తూ, మధనపడటం మాత్రమే నా బట్టతల కారణంగా నేను భావిస్తున్నాను.
భవిష్యత్తులో ఎవరైనా నా బట్టతలని వారివారి వాదనలకి అనుకూలంగా వాడుకున్న యెడల నేను తీసుకోనబోవు సివిల్ మరియూ క్రిమినల్ చర్యలకి గురి కాగలరని హెచ్చరించుచున్నాను!:)
రమణగారు, మీకు బట్టతల ఉందని వాస్తవాన్నొప్పుకొని,మగవాడి గొప్పతనాన్ని మరొక్కసారి నిరూపించారు. వారి కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారు. హాట్స్ ఆఫ్. అదే ఆడవారైతే వాస్తవాన్ని చచ్చినా అంగీకరించరు. ఈ మధ్య చందూ శైల గారు రాసిన "అందమా అందుమా " టాపాను చదవండి. వయసైపోయిన తరువాత అందం చేజారిపోతుందని తెలిసినా, ఆ నిజాన్ని ఒప్పుకోకుండా అందంకోసం, ఆరాటపడే ఆడవారిపాట్లు, ఇక్కట్లు ఆ టపాలో చాలా చక్కగా రాశారు.
Deleteరమణగారు, అజ్ఞాత తైలమర్ధన చేస్తున్నారు. అయిననూ ఏదో కొంచెం పలుచనైన జుట్టును బట్టతల అంటూ బ్లాగుల్లో అవమానించడం క్రిమినల్ చర్యే అవుతుందని మనవి చేసుకుంటూ, మీరు కనీసం పాతిక లక్షలకైనా సివిల్ దావా మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పైగా ఎవరినో ఇక్కడ మీ బ్లాగులో పొగడటం కూడా నేరమే అనిపిస్తోంది.
DeleteDr.Ramana gaaru...
Deleteమానసిక రోగులతో ఎక్కువ కాలం గడపటం
మీకెంతో లాభించినట్లుగా కనబడుతోంది...
సినిమాల్లో చూస్తుంటాం కదా ...
డాక్టరు గారిని మెళ్ళో స్టేతస్కోపుతో లాగుతూ
ఆటలాడటం, ఇంకా రకరకాల ఫన్నీ పనులతో
ఆట పట్టించడం వగైరాలతో మీ హాస్య చతురత
దినదిన ప్రవర్దమానమౌతున్నట్లు నా డౌటు.
థాంక్సండీ...ఈ సాయంత్రమంతా...రాత్రయ్యేదాకా...
మీ సరదా కబుర్లతోనే గడిచిపోయింది...
రియల్ థాంక్స్...
ReplyDeleteభానుమతి వద్దు!
రాజసులోచనే ముద్దు!!
పని లేక డాక్టరు కద్దు!
వారి టపాయే కదూ ముద్దు!!
కామెంటు అచ్చు గుద్దు
వాహ్ వాహ్ ఈ బలాగు అల్లారు ముద్దు !
చీర్స్
జిలేబి.
(అనామతు పద్దు!)
జిలేబి జీ,
Deleteకామెంట్ బహు బాగు. థాంక్యూ!
(ఇవ్వాళ వర్క్ ఎక్కువగా ఉంటం చేత బుర్ర వేడెక్కిపోయుంది. ఇంతకన్నా రాయడానికి బుర్రలో ఐడియా తట్టటం లేదు.)
నేను కూడా మోహనరాగం గారితో ఏకీభవిస్తాను. You cannot compare Apples and Oranges. To each their own. ;)
ReplyDeleteకానీ, షట్కర్మాచరణను చేసే ధర్మపత్నిగురించి పెద్దలు చెప్పిన దాన్నిబట్టి వోటింగ్ చేస్తే,
కార్యేషు దాసీ - రాజసులోచన
కరణేషు మంత్రీ - భానుమతి
రూపేచ లక్ష్మీ - టై
క్షమయా ధరిత్రీ - రాజసులోచన
భోజ్యేషు మాతా - టై
శయనేషు రంభా -టై
and the winner is - రాజసులోచన ;)
ఈ "బహుముఖ ప్రఙ్ఞాశాలి" ఏంటండీ.. శంకరశాస్త్రిగారి "ఆర్థ్రత" లా.. నా "ఆతృత" లా ఓ కొరకరాని చెఱకుగడలా అనిపిస్తోంది? ఆవిడకుండేది ఒక్కటే మొహం. అపుడు బహుముఖ...అదేదో ఎలా అవుతిందిషా?
ReplyDeleteశ్రీ సూర్య గారు,
Delete>>ఈ "బహుముఖ ప్రఙ్ఞాశాలి" ఏంటండీ.. శంకరశాస్త్రిగారి "ఆర్థ్రత" లా.. నా "ఆతృత" లా <<
కొన్ని పదాలు వాడటం నాకూ చికాగ్గానే ఉంది. కానీ 'ఫ్లో' లో రాసేస్తున్నాను. వేరే పదం వెంటనే తోచక (గతి లేక) ఇలా రాస్తుంటాను. ఈ అలంకారిక పదాల పట్ల మీకు లాగానే నాక్కూడా ఎలర్జీ ఉంది.
Subbu for president!
ReplyDeleteఏ మగాడికైనా కావలసింది తన కోసం వరాలు కోరుకునే నిస్వార్ధ నారీమణి గానీ, తన భావాలు అందంగా వ్యక్తీకరించే కవియిత్రి కాదు.>>>>
ReplyDelete:))
నా ఉద్దేశంలో మగాడికి కావాల్సింది: కృష్ణప్రియ గారి వ్యాఖ్యని కొద్దిగా మారుస్తున్నాను.
ReplyDeleteఏ మగాడికైనా కావలసింది తన కోసం వరాలు తీర్చే నిస్వార్ధ నారీమణి; ఏ రూపంలోనైనా సరే.
మగవాడికి కావాల్సింది నారీమణుల బాదరబందీలేని మరోలోకం
ReplyDeleteమరోలోకం మరోలోకం
మరోలోకం పిలిచింది
పదండి పోదాం
@భార్యాభర్తల మధ్య తగాదా కేసు
ReplyDeleteఅసలు టపా సంగతి వదిలేసి :) మీ టపా ల లో సంబంధం లేని వ్యాఖ్యలు మధ్య విష్యం వెతుక్కోడం కష్టం. మీకు మాత్రం బానే గిట్టుబాటు అవుతూ ఉండాలి మరి :)
ఇంతకీ భానుమతిని ఇప్పుడెలా మార్చుతాం గాని, రాజ సులోచనలా కనపడాలంటే వాళ్ళకేం కళ్ళజోళ్ళు కొనిపెట్టాలో కాస్త చెపుదురు , (పిచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్ళమనడం తప్ప )
రిటైర్ అయ్యిన వాల్లకి రాజసులోచన కనబడక పొతే రమాప్రభ, కోవై సరళ అంటున్నారండీ. చివరికి మీ దగ్గరికి వచ్చి చేరుతున్నారు.
@చాలా టైం పట్టింది. ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మనసంతా చికాగ్గా అయిపోతుంది.
ఇప్పుడు నా బుర్ర ఇలానే ఉంది, మీకు ఫీజన్నా వచ్చుద్ది.. దారిన పొయ్యేవాళ్ళ సంగతి నాకెందుకు అని వదిలెయ్యబుద్ది కూడా కావడం లేదు. :)
మౌళీ గారు,
Deleteస్త్రీపురుష సంబంధాలు, స్త్రీవాదం, పురుష వాదం.. ఎవరి వాదం వారిది. సమాజం మొనోలితిక్ గా ఉండదు.
(వృత్తి రీత్యా) ఈ కుటుంబ గొడవల్లో.. తల కాకపోయినా వేలయినా దూరుస్తూ ఉండవలసిన తప్పనిసరి పరిస్థితి నాది. కొంతమందికి సైకియాట్రిస్ట్ అంటే తీర్పులు చెప్పేవాడనే అభిప్రాయం ఉంది. కానీ కాదు.
కొన్నేళ్ళ క్రితం మన కుటుంబ వ్యవస్థలో స్త్రీల పట్ల హింస, నిరాదరణ కేసులు విన్నప్పుడు చలం, రంగనాయకమ్మలు పూని బిపి తెచ్చుకునేవాణ్ని. ఇప్పుడు చిత్తూరు నాగయ్యనయిపోయాను.
(ఇంకోసారి 'పిచ్చి డాక్టర్' అని రాస్తే మీ మీద లీగల్ ఏక్షన్ తీసుకుంటాను!)
"చలం, రంగనాయకమ్మలు పూని బిపి తెచ్చుకునేవాణ్ని"
Deleteకష్టాలనీ స్రీలకే ఉంటాయని, మీ మైండ్ బాగా కండిషన్ అయిపోయింది. మీలో బాగా పురుషాదిక్యత జీర్నించుకోవడం వలన, ఆడవాళ్ల కష్టాలను చూసి సానుభూతి, సొల్యుషన్ ఇచ్చే బాధ్యత మీ పైన (మగవారి)ఉందని ఫీలైనట్లున్నారు. కాబట్టే మీరు అనవసరంగా బి పి పెంచుకొన్నారు. అదే పురుషుల సమస్యలు వింటే,చూస్తే ( షాపింగ్ చేసేటప్పుడు బజారు లో పిల్లవాడిని చంకనేత్తుకుని మోస్తూ, భార్య వెనుక నడుస్తూ పోతుంటే :) ) మీకు ఎప్పుడైనా బి.పి పెరిగిందా? పెళ్లి అయిన మగవాడు అణచివేతకు గురౌతున్నాడు అని తెలిసినా, ఎప్పుడైనా బహిరంగంగా నోరు విప్పారా? స్రీల కష్టాలు స్వేచ్చ గురించి ఆలోచించటం కాదు, మగవాళ్ళకి ఉన్న స్వేచ్చ ఎమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అదే వాళ్ళ కష్టాలను "దీపం పురుగుల అజ్ఞానం!" టాపా రాసి తేలికగా తీసిపారేసారు. ఎప్పుడైనా భార్యా భర్తలు రోడ్డు పైన కలసి వేళుతున్నపుడు, ఆ భర్తను చూస్తే మీకు మీకు జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి జాలి,కనీసం దయ కలిగిందా? పాపం, ఆ భర్త పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వాడి బుర్ర లోగుజ్జును స్రీమూర్తి , ఎలా తినకపోతే బట్టతల వచ్చిందో అని ఒక్కసారి అయినా ఆలోచించారా?
హం లీగల్ యాక్షన్ దాకా ఎందుకు అండీ :) .. వారికి మిమ్మల్ని డైరెక్ట్ గా సజెస్ట్ చేసే అదృష్టం లేదు. అలాగే నా వ్యాఖ్య మీ టపాకి ఎక్కువగాను, మీ వృత్తికి చాలా తక్కువ గాను వర్తిస్తుంది.
ReplyDeleteఅయినా వ్యాఖ్య వ్రాయుటకు ముందు కూడా , ఔరా రమణ గారు భానుమతి, రాజసులోచన ,సావిత్రి లను పలుమార్లు ఉపయోగించుకొండం లో నాకు అభ్యంతరం ఎందుకు తోచడం లేదు అనియును...అదే సమయం లో ఈ టపా లో కేవలం సినిమాకు సంబంధించి కాకుండా ఇంకా చాలా విలువైన సమాచారం మీరు ఉచితంగా అందిస్తున్నారని తోచడం తో , నేను వ్రాయ దలచిన ఒక పెద్ద టపా ను చిన్న వ్యాఖ్య గా వ్రాసితిని. మీకు నచ్చనిచో ఆలోచించవలసిందే .
ఇక మీ సమాధానం, ఒక డాక్టరు గా కాక వ్యక్తులగా జనం నుండి నేను ఆశిస్తున్నది ఇదే అభిప్రాయం.
@మన కుటుంబ వ్యవస్థలో స్త్రీల పట్ల హింస, నిరాదరణ కేసులు
సమస్య కు పరిష్కారం వెదకడం లో మీకున్న చాలా పరిమితులు నాకు లేవు. మీకున్న కాస్త స్వేచ్చ కూడా లేదు .కాబట్టి స్త్రీల పట్ల హింస, నిరాదరణ ను దాటి లోపలి సమస్యను చూడగలను.
అప్పుడు సమస్యకి మూలాలు భార్య భర్తకి మధ్య కాక, మొత్తం కుటుంబ వ్యవస్థలోను, సమాజం లోను కనిపిస్తున్నాయి. అంటే నాకేమాత్రం సంబంధం లేని సమస్యలో నాకు చాలా ముఖ్యమయిన విషయాలు వున్నాయేమో. 'టపా' వ్రాసి గుడ్డి వాళ్లకు రంగుల గురించి వివరించే సాహసం చెయ్యాలని లేదు. చాలా వరకు నా వ్యాఖ్యలను కూడా తగ్గించు కొంటున్నాను కూడా, ఈ ఒక్క వ్యాఖ్య చాలు ...అవసరం ఉన్నవారు ఉపయోగించుకుంటారు అన్నది నా అభిప్రాయం.
మీరు చెప్పింది అర్థంకాపోయినా ఆలోచించాల్సిన విషయం. మీరు వ్యాఖ్యలు తగ్గించుకుని ఆలోచించడం మొదలు పెట్టండి.
Deleteఅజ్ఞాతా నా వ్యాఖ్యలు తగ్గించాల్ల్సిన మోతాదులో ఉండవు. నువ్వు ఎక్కడ బడ్డ బ్లాగుల్లో అడ్డంగా పడి వ్రాస్తున్నావు. 'అర్ధం కాకపోయినా వ్రాయడం ' ముక్యం గా చేస్తున్నావు. ఆలోచిస్తానన్నావ్ గా. ఆలోచించి వ్రాయడం మానెయ్యి.
Deleteపోనీ వ్యాఖ్యలు పెంచుకో. 10% అయినా అర్థమయ్యేలా రాయడానికి ప్రయత్నం చెస్తావు కదూ?
Deleteనీకు అర్ధం అయ్యే చాన్స్ లేదు, పశువుల భాష ఎక్కడుందో చదువుకొని అర్ధం చేసికో
Deleteఅంతేకాని మనుషులభాషలో నీవు రాయలేవంటావ్, అంతేనా మౌళి?
DeleteGoogle
ReplyDeleteEnthaina abbayilaki telivunte adi qulification ade ammayilakunte adi over confidence ledaa pogaru.nenoppukonu...abbayilantha inthe...
ReplyDeleteస్వానుభవంతో చెబుతున్నాను.. బాగా చదువుకున్న భార్య (ఆ చదువుతో మనకేమి లాభం?) కన్నా వంట బాగా తెలిసిన భార్య వందరెట్లు మేలు. :)
Deleteనా వోటు సుబ్బు గారికే. మధురాంతకం రాజారాం గారి ' కమ్మ తెమ్మెర " కథ చదివితే మనల్ని కంటికి రెప్పలా చూసుకునే భార్యనే గొప్పది అని తెలుస్తుంది.
ReplyDeleteఆహా ! కలకాలం నిలిచి పోయే సాహిత్యమంటే పనిలేక పిపీలిక మైన వారిదే కదా! రెండువేల పన్నెండు లో ని టపాకి రెండువేల పదహారు చేరువలో కూడా చదువరులు ఆకర్షితులై కామింటి తమ ఆనందాన్ని పంచు కుంటున్నారు !
ReplyDeleteపనిలేని డాటేరు బాబు గారు గమనిస్తున్నారా ? మీరు మళ్ళీ టపాలు మొదలెట్టాలి ! కనీసం వారానికి ఒక టపా అయినా వ్రాయాలి . మళ్ళీ అగ్రిగేటర్ లో కి రావాలి
చీర్స్
జిలేబి