'ఈ టీవీ' లో చంద్రబాబు నాయుడు పాదయాత్రని చూస్తున్నాను. మనిషి బాగా చిక్కిపోయ్యాడు. కర్రకి బట్టలు తోడిగినట్లున్నాడు. కోట్ల రూపాయిలున్నాయి. అయినా ఏం లాభం? పాపం! కడుపు నిండా తినలేడు. కంటినిండా నిద్రపోలేడు. ఏమిటీ ఖర్మ? నా మనసు దిగులుగా అయిపొయింది.
"రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.
"కూర్చో సుబ్బూ! పాపం చంద్రబాబుని చూడు. వృద్ధాప్యంలో ఎన్నికష్టాలు పడుతున్నాడో!" దిగాలుగా అన్నాను.
సుబ్బు ఆశ్చర్యపొయ్యాడు. క్షణకాలం టీవీలో చంద్రబాబుని చూశాడు.
"నీ దుఃఖానికి కారణం అర్ధం కావట్లేదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంది తనకి పెన్షన్ అందట్లేదనో, ఇంటిస్థలం పట్టా కావాలనో కాదు. ఆయనక్కావలసింది ముఖ్యమంత్రి పదవి. అది మన చేతిలోనే లేదు. చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా నీకులా జాలిపడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తారేమో. కానీ నాకెందుకో అది చాలా కష్టం అనిపిస్తుంది." అన్నాడు సుబ్బు.
"కష్టమా! ఎందుకని?" అడిగాను.
"అసలు చంద్రబాబు ఏం చెబుతున్నాడో నాకర్ధం కావట్లేదు. ఒక పక్క అభివృద్ధి చేశానంటాడు. ఇంకోపక్క తప్పులు తెలుసుకున్నానంటాడు. మారిన మనిషినంటాడు. అంటే ఇంతకుముందు ఆయన చేసిన తప్పు రాష్ట్రాన్నిఅభివృద్ధి చెయ్యడమేనా? అంటే తను చేశానని చెబుతున్న అభివృద్ధిని disown చేసుకుంటున్నట్లే కదా!" అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! చంద్రబాబు 'మారిన మనిషి' సందేశం పార్టీ కాడర్ కోసం. పార్టీపరంగా తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకుంటున్నాడు." అన్నాను.
ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.
"రాజకీయాల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు లెక్కలే ఉండవు! ఎక్కాల ప్పుస్తకంలో రెండురెళ్ళు నాలుగనే ఉంటుంది. రాజకీయాల్లో రెండురెళ్ళు పది అవ్వచ్చు. సున్నా కూడా కావచ్చు."
"సుబ్బు! నీకు లెక్కలు రావన్న సంగతి నాకు తెలుసు. కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పు." విసుక్కున్నాను.
"రాజకీయంగా ఇవ్వాళ ఉన్నపరిస్థితి రేపు ఉండదు. కొత్తసమస్యలు రావచ్చు. పాతసమస్యలు పెద్దవిగా మారవచ్చు. ఉన్నట్లుండి కొన్నికారణాల వల్ల పరిస్థితి పూర్తిగా ఒకపార్టీకి అనుకూలంగా మారిపోవచ్చు. దరిద్రం నెత్తి మీదుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల్లాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.
"సుబ్బు! ఎప్పుడో అరుదుగా జరిగే ఎమోషనల్ సంఘటనలని ప్రస్తావించడం రాజకీయ విశ్లేషణ అవ్వదు. కష్టేఫలి అన్నారు పెద్దలు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కష్టపడుతున్నాడు. కష్టపడ్డప్పుడు ఫలితం ఎందుకుండదు?" చిరాగ్గా అన్నాను.
"కూల్ డౌన్! ముందుగా నువ్వు గ్రహించవలసింది నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే. రాజకీయాల్లో భగవద్గీతలకీ, తెలుగు నిఘంటువులకీ కూడా చోటులేదు. అంచేత కష్టం, ఫలితం వంటి మాటలకి విలువ లేదు. అదృష్టం బాగుంటే పదవి ఫెవికాల్ లా పట్టుకుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు?"
"అవును గదా!" సాలోచనగా అన్నాను.
"చంద్రబాబు ఈ రాష్ట్రానికి CEO నని తనకితానుగా ప్రకటించుకున్నాడు. CEO లు ప్రభుత్వాలకి ఉండరు. కార్పొరేట్ కంపెనీలకి ఉంటారు. తధాస్తు దేవతలు ఆయన్ని దీవించారు. అందుకే తెలుగు దేశం పార్టీకి CEO గా మిగిలిపొయ్యాడు. అయితే ఈ TDP కంపెనీ పాతబడిపోయింది." అంటూ ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
ఒకక్షణం ఆలోచించి నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.
"ఒకప్పుడు కారంటే ఎంబాసిడర్ మాత్రమే కారు. కలర్ టీవీ ఒక పెద్ద డబ్బాలా ఉండేది. సెల్ ఫోన్ కిలో బరువుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబాసిడర్ కారు చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అన్నిఇళ్ళల్లో విస్తరాకుల్లాంటి LED లు. అందరి చేతుల్లోనూ తమలపాకుల్లాంటి ఐ ఫోన్లు. మార్పు ప్రకృతి ధర్మం. ఇప్పుడెంత కష్టపడ్డా చంద్రబాబు తన పాత మోడల్ కారు, టీవీ, సెల్ ఫోనూ అమ్మడం కుదరదు. రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలు కుర్రాళ్ళు. లేటెస్ట్ మోడల్ కార్లు, 3D LED, సామ్సంగ్ గెలాక్సీల్లాగా పెళపెళ లాడుతున్నవారు. వాళ్లకి ఆ మేర ఎడ్వాంటేజ్ ఉంది. మన CEO చంద్రబాబుకి ఈ సంగతి తెలియనిది కాదు. కానీ ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు."
"సుబ్బు! నువ్వు చెప్పే కార్లు, టీవీల బిజినెస్ థియరీ రాజకీయాలకి వర్తించదు. నేను ఒప్పుకోను." అన్నాను.
"పోనీ ఇంకోభాషలో చెబుతా విను. తెలుగు దేశం పార్టీ ఒక పెద్ద ఇల్లు వంటిది. ఒకప్పుడు ఆ ఇల్లు లేటెస్ట్ మోడెల్. కళకళలాడింది. ఇప్పుడది పెచ్చులూడిపోయిన పాతబడ్డ బిల్డింగ్. మామూలు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మాసికలు వేయించి, దట్టంగా wall care పెట్టించి ఏదోరకంగా నెట్టుకొచ్చేవాడే. కాకపొతే ఆ పాతబిల్డింగ్ కి తెలంగాణా వాదం అనే పెద్ద తొర్ర పడింది. బిల్డింగ్ ఒక వైపు కూలిపోయింది. రిపైర్ చేయించడానికి ఇసుక, సిమెంట్ సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడు. అయితే రిపైర్ పనులు ముందుకు సాగనీయకుండా ఢిల్లీ KCR అనే మేస్త్రీని కాపలా పెట్టింది. KCR పని ఆ తొర్ర పూడకుండా, వీలయితే ఇంకా పెద్దదయ్యేట్లు చెయ్యటమే! అందుకే ఒక్కోసారి పాతఇల్లు రిపైర్ చేయించేకన్నా కొత్తఇల్లు కట్టుకోవటం సులువు." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.
"సుబ్బూ! నువ్వు వంద చెప్పు. చంద్రబాబుని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ వయసులో చంద్రబాబు అంత కష్టపడటం అవసరమా?" అన్నాను.
"పూర్తిగా అనవసరం. ఈ బుట్టలల్లడాలు, ఇస్త్రీ చెయ్యడాలు, చెప్పులు కుట్టడాలు చేస్తే మిగిలిది ఆయాసం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎసెంబ్లి స్థాయి నాయకులు ఓట్లడుక్కునేప్పుడు చేసే చౌకబారు విన్యాసాలు. చంద్రబాబు స్థాయి చాలా ఎక్కువ. ఆయన తన హయాంలో ఆర్ధిక సంస్కరణలు ప్రజలకి మేలు చేస్తాయని నమ్మాడు. వేగవంతంగా అమలు చేశాడు. ఆ విధంగా భారత రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు." అంటూ తలుపు తీసుకుని వెనక్కి తిరిగాడు సుబ్బు.
"మళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు." అంటూ హడావుడిగా వెళ్ళిపొయ్యాడు సుబ్బు.
(photos courtesy : Google)
బాగా రాశారు. మీ సుబ్బు చెప్పినట్టు బాబుకు విషయం తెలుసు... కాని ఆయన అభిమానులకే తెలియడం లేదు
ReplyDeleteఅందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఎవరికీ ఏమీ తెలీనట్లుంటారు!
Deleteఎన్నికలకి కి చాలా ముందు నుంచే ఒక పద్ధతి ప్రకారం ముందుకి పోతున్నాడు బాబు. గతం లో సగం పోలింగు పూర్తయ్యాకా రెడ్డి గారు చేసిన వ్యాఖ్య పోలింగు సరళి నే మార్చి ఆయనకి అధికారం దక్కించింది. ఎప్పుడు ఏమైనా జరగ వచ్చు. మొత్తానికి రాబోయే ఎన్నికలు రసవత్తరం గా వుంటాయని మాత్రం నమ్మకంగా వుంది.
ReplyDeleteచంద్రబాబుది చాలా సైంటిఫిక్ ఎప్రోచ్. ఎలక్షన్లకి exams ప్రిపేర్ అయినంత సీరియస్ ప్రిపరేషన్ ఉంటుంది. అందుకు మనం ఆయన్ని అభినందించాలి. అయితే అట్లాంటి ఎప్రోచ్ ఆంధ్ర రాజకీయాల్లో పాజిటివ్ రిజల్టుని ఇవ్వట్లేదు. అదే సమస్య.
Deleteapproach is not the problem. Problem is that common man saw through his SCIENTIFIC(sic) approach.
DeleteI dont think he can deceive common man again with his gimmicks
EXCELLENT WRITE UP. UR STYLE OF WRITING IS VERY GOOD
ReplyDeletethank you.
Deleteచాలా బాగుందండి. చాన్నాళ్ళ తర్వాత కామెంట్ పెట్టే అవకాశమిచ్చారు. సుబ్బూ కెప్పుడూ కాఫీయేనా, ఏవైనా టిఫిన్ లాంటిది పెట్టించకూడదూ
ReplyDeleteసుబ్బు కాఫీకే చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. ఇక టిఫిన్లు కూడా పెట్టిస్తే కంట్రోల్ చెయ్యడం కష్టం!:)
Delete(ఇవ్వాళ కార్తీక పౌర్ణమిట. 'పని లేక.. ' చంద్రబాబుని కార్లు, టీవీలతో కలిపి రుబ్బేశాను!)
ఎప్పుడూ సుబ్బు యేనా?
Deleteఅప్పుడప్పుడు సుబ్బలక్ష్మికి కూడా కాఫీ పోయించండి.
bonagiri గారు,
Deleteమీరు నా కాపురానికే ఎసరు పెట్టే ప్లాన్లో ఉన్నట్లున్నారు. ఇది అన్యాయం!
కార్తీక పౌర్ణమి అయితే పేషంట్లు రారా ఏమిటి? :-)
ReplyDeleteఇంకా ఆలోచించండి సార్, ఇంకా బాగా వ్రాయండి. సం థింగ్ ఈజ్ మిస్సింగ్....
అయినా జనాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, గెలుపు గుర్రాలు, వంటి ఈక్వేషన్లు తేకుండా ఓట్లు వేస్తారా, ఒక్క బాబు గారిని చూసి. నా ఉద్దేశ్యం బాబు గారు ఆ ఈక్వేషన్లు సాల్వ్ చెయ్యాలని చూస్తూ గెలవాలని ఈ యాత్రలో చూస్తున్నాడు.
ఇంకా ఆలోచించాలా! నా వల్ల కాదు. ఇప్పటికే ఈ బ్లాగుల మూలానా చాలా టైం ఖర్చయిపోతుంది. చంద్రబాబుదేం పోయింది. లక్షల మైళ్ళు నడుస్తాడు. ఆయన గూర్చి ఇంతకన్నా ఆలోచించే ఓపిక లేదు.
Deleteమొన్నటి నా బ్లాగులో 'అన్నీ పాటలేనా? ఈమధ్య రాజకీయాలు రాయట్లేదేంటి?' అని ఎవరో అడిగారు. అంచేత సమయం దొరికిందని రాసి పడేశాను.
సాధారణంగా నేను రాత్రిళ్ళు రాస్తాను. ఇవ్వాళ (అప్పుడప్పుడు) పేషంట్లని చూస్తూ.. మధ్యాహ్న సమయాన రాశాను. అంచేత బుర్ర పూర్తిగా పని చెయ్యలేదు. కాబట్టి టపాకి ఫినిషింగ్ టచ్ మిస్సయి ఉండొచ్చు.
ఏమో ఏమి జరగబోతున్నదో ఎవరికీ అర్థం కావటం లేదు .చివరకి సుబ్బు కూడా ఎవరు గెలుస్తారో చెప్పకుండా ముగించాడు . మీరు చెప్పండి ఎవరు గెలుస్తారు తరువాతి ఎన్నికలలో
ReplyDeleteనాకు మా వూళ్ళోనే ఎవరు గెలుస్తారో అంచనా లేదు. ఇక స్టేట్ గూర్చి ఎక్కడ చెప్పేది!
Deleteతెలంగాణా సంగతి తేలకుండా రాజకీయంగా ఏదీ చెప్పలేం.
మీరు కూడా రాజకీయ నాయకుల లాగా "తేలేదాకా" అంటున్నారేమండీ! తెలంగాణా వచ్చేదాకా సంగతి తేలదు.
DeleteTelangana is at a "point of no return". The sooner everyone realizes (and accepts) this, it is better.
@Jai Gottimukkala,
Delete>>Telangana is at a "point of no return".<<
నేనలా అనుకోవడం లేదు. కాంగ్రెస్ వారికి రాజకీయంగా గిట్టుబాటు అవుతుందనుకుంటేనే తెలంగాణా ఏర్పడుతుంది. లేకపోతే లేదు.
రమణ గారు,
Deleteమీరన్నది నిజమే కావచ్చు. కాని కాంగ్రేస్ కలకాలం రాజ్యం చెయ్యదుగా?
శ్రీకాంత్ చారి గారు,
Deleteకాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణా ఇవ్వకుండా ఉంటుందని నేననుకోవట్లేదు. ఢిల్లీ పెద్దలకి తెలంగాణా ఏర్పడితే రాజకీయంగా తమకి లబ్ది చేకూరుతుందనిపిస్తే తక్షణం తెలంగాణా ఇచ్చేస్తారు.
We relish all posts, this one is also good. Chandrababu during his tenure lost touch with common man. In his anxiety To Get power, now he seems to have lost touch with reality. As you rightly compared he is a old model, out dated, and it is the time for him to bring in new blood, and definitely not his son or brother in law
ReplyDeleteIn Indian politics new blood means leaders' sons and in-laws only.
DeleteIt appears CBN has a problem in promoting his son.
ఫుటోలో, బాబు పక్కనున్నోళ్ళు ముక్కు మూసుకున్నారెందుకు?
ReplyDeleteజలుబు చేసినట్లుంది!
Deleteబాబు గారు సరదాగా ఒకటి వేసి ఉంటారు..మరి పక్కనే ఉన్నారుగా..అందుకే ముక్కు మూసుకున్నారు ...కాని బాబు గారు ఏమి తెలియనట్టు జీవిస్తునారు ఫోటో లో.
ReplyDeleteDoctorgaru thanq... apudapudu AJ kuda chaduvutundandi.. manchi manchi postlaki inspiration vastundi.. gud analysis Sir... miru manchi visleshakulu suma...
ReplyDeleteమళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు
ReplyDeleteముష్టిదొంగెదవ ఓదార్పుకన్నా ఈ యాత్ర మేలు
ReplyDeleteషర్మిలమ్మ యాత్రలో ఏమాత్రం ఇస్తున్నారు? ఏ యాత్ర లాభదాయకంగా వుంది?
రాజకీయ లబ్ధి ఓ చోట చారణా వచ్చి మరోచోట ఆఠణా పోయేట్లుంటే ఏ ఎదవైనా ఎలా తేలుస్తాడు? వస్తుందనుకునేవాళ్ళు ఎర్రి ఎదవలు అంటాను.
ReplyDeleteమీ టైటిల్ బాగుంది. నడుస్తున్న చరిత్ర. a good Oxymoron
ReplyDeleteఅయితే చంద్రబాబు చేస్తున్న పని బాగానే ఉన్నట్లుంది. వెంటనే అందరూ అనుకరిస్తున్నారు.
kamudha గారు,
Deleteఆరోగ్యరీత్యా CBN ది ఒక దుస్సాహసం. రాజకీయరీత్యా పాదయాత్ర తెలంగాణాలో కొద్దో, గొప్పో ప్రయోజనకరంగా ఉండొచ్చు.
CBN రాజకీయాల్లో తల పండినవాడు. ఆయన బుర్రలో ఏఏ ఆలోచనలున్నాయో ఊహించడం మనలాంటి సామాన్యులకి అసాధ్యం. కావున.. వెండితెరపై వేచి చూడుడు!:)
Good Analysis Dr gaaru!
ReplyDelete
ReplyDeleteడాక్టర్ గారు వేరే వాళ్ళ సంగతి మనకి ఎందుకు గాని మీ వోట్ ఎవరికీ వేస్తారు ? నా వోట్ వెయ్యటానికి నేను భారత దేశం లో లేను . ఇప్పుడు భారత దేశం లో ఉండి చుస్తున్న వాళ్ళు మీరు కనుక మీరు చెప్పండి .
nice post sir
ReplyDelete