"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."
"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి."
"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద."
"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు."
"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును."
అదొక హై స్కూల్. ఆ స్కూల్ గోడల నిండా ఇట్లాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి.
ఒక పక్కగా హెడ్మాస్టర్ గారి ఆఫీస్. ఆ గదిలో ఇద్దరు కుర్రాళ్ళు గోడకుర్చీ వేసి ఉన్నారు. ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు గుంజిళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చేసిన నేరం.. పొరబాటున ఆ రోజు తెలుగు వార్తాపత్రిక చూశారు!
హెడ్మాస్టర్ గారు ఏవో కాయితాలపై సంతకాలు చేసుకుంటూ అంటున్నారు.
"వెధవల్లారా! ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? 'ఇంక జన్మలో తెలుగు పేపర్లు చదవం' అని రేపటికల్లా వందసార్లు రాసుకు రండి. అర్ధమైందా?"
ఏమిటీ అనర్ధం? ఎందుకీ అరాచకం? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది? హతవిధీ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా?
అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..
కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు. పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు.
'ఈ స్కూల్ బహు ముచ్చటగా యున్నది. పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా యుండునో?' అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు.
ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు.
"నీ పేరేంటి బాబూ?"
"నిఖిల్ రెడ్డి."
"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు.
"వై.యస్. రాజశేఖర రెడ్డి." తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి.
ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు.
"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"
"చంద్రబాబు నాయుడు." ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి.
ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు. బట్ట బుర్ర గోక్కున్నారు.
"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."
"వై.యస్. జగన్మోహన రెడ్డి." బుల్లెట్లా సమాధానం వచ్చింది.
ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు.
ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు.
"నీ పేరేంటి?"
"నవీన్ చౌదరి."
"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.
"ఎన్టీరామారావు." గర్వంగా చెప్పాడా కుర్రాడు.
ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి.
"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు. ఎవరాయన?"
"చంద్రబాబు నాయుడు." బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి.
ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది. నీరసంగా అడిగారు.
"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"
"వై.యస్.జగన్మోహన రెడ్డి." సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది.
ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు. ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు. ఒక్క ఉదుటున లేచి.. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు.
పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు. మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్. హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు. ఆనక నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.
"మీ అమ్మ కడుపులు మాడ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం?" అంటూ ఫేనంత ఎత్తు ఎగిరారు.
నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు.
"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"
"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి.
"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి.
హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిమ్మట ప్యూన్ పుల్లారావుతో ఆ రెండు పేపర్లు తెప్పించారు. పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు.
'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు. నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు.
అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు హెడ్మాస్టర్ గారు. ఆపై స్కూల్ విద్యార్ధులెవరూ తెలుగు వార్తాపత్రికలు చదవరాదనే నిబంధన పెట్టారు. ఆ నిబంధన కనుగుణంగా స్కూల్ గోడల నిండా కొత్త నీతివాక్యాలు రాయించారు. క్రమశిక్షణ తప్పిన పిల్లల్ని కఠినంగా శిక్షించసాగారు.
అయ్యా! అదండీ కథ!
(photos courtesy : Google)
పోస్ట్ చాల సింపుల్ గా బావుంది అండి . ఇంకా కొంచెం ఎక్కువ గా రాస్తే ఇంకా కొంచెం బావుండేది . మధ్యలో ఆంధ్ర జ్యోతి ని వదిలి పెట్టారే ?
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteమీరు నమస్తే తెలంగాణ పేపర్ చదవరా ? ఒక సారి చదవండి మీ జెనరల్ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది
Deleteఐడియా వచ్చింది. రాసేశాను.
Delete(ఆంధ్రజ్యోతి గూర్చి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉందంటారా!?)
హహ్హహ్హహ్హ...సూపర్ టపా!! చాలా బాగా చెప్పారు..
ReplyDeleteదేశీయ చానళ్ళ వ్యవహారం కూడా ఇలాగే ఉన్నట్టుంది - కొన్ని బిజెపికి పూర్తిగా వ్యతిరేకం, కొన్ని కమ్యునిస్టులకి అనుకూలం, కొన్ని పూర్తిగా అమెరికా/బ్రిటన్ ల నుంచి వచ్చే డబ్బుతో నడిచేవి!! :-(
థాంక్యూ!
Deleteఅవును. మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.
బాగుంది . మీరూ ఇద్దరికీ వ్యతిరేకులవుతున్నారు .. ఎవరో ఒకరికి వ్యతిరేకం అయితే మరొకరు మిమ్ములని అకాశాని కేత్తడానికి సిద్ధమవుతారు
ReplyDeleteనన్ను ఆకాశానికెత్తేవారు లేకపోయినా పర్లేదు గానీ.. ఇద్దరూ ఏకమై తిట్టకుండా ఉంటే చాలు!
Deleteటపా వివాదాస్పదంగా లేకపోయినా విచిత్రంగా ఉంది. తెలుగు వార్తాపత్రికలు చదవడం అవసరమే. కాని తెలుగునాటి నేటి రాజకీయ జ్ఞానాన్ని విద్యార్థులకు పంచకపోవడమే మంచిది.
ReplyDeleteఈ మధ్య నా ఆలోచనలు విచిత్రంగానే ఉన్నాయి. అంచేత టపా కూడా అలాగే ఉంది!
Deleteఇదేలే తరతరాల చరితం. నా చిన్నతనం లో కూడా టీచర్స్ బలవంతం తో న్యూస్ పేపర్ చదివి ఇలాంటి వార్తలే నోట్ చేసినట్లు గుర్తు. ఒక రోజు ఎవరో నాయకుడు చనిపోతే అన్నీ అవే వార్తలు, నోట్ చేసుకోవడాని ఆ చంపబడ్డ నాయకుడు పలానా అని తప్ప, పేపర్ అంతా తిరగేసినా ఇంకో విషయం లేదు.
ReplyDeleteఒకప్పుడు తెలుగు న్యూస్ పేపర్ చదవడమే ఒక education. ఇప్పుడు మాత్రం Manufacturing Consent.
Deleteనేనైతే తెలుగు న్యూస్ పేపర్లు చదవడం మానేసి చాలా యేళ్ళైంది. అప్పుడప్పుడు ఫలానా ఆర్టికల్ బాగుంది అని ఎవరైనా చెబ్తే చూస్తాను. అయితే ఆ సందర్భాలు చాలా అరుదు.
తెలుగు న్యూస్ పేపర్లు.. పత్రికాధిపతుల అభిప్రాయాల కరపత్రాలనే విమర్శ మాత్రం ఎప్పట్నుండో ఉంది.
ఏ పేపర్ చుసిన ఏమున్నది గర్వకారణం
ReplyDeleteసమస్త పత్రికలూ పరపూజ పారాయణత్వం
"ఔను నిజం, ఔను నిజం,
Deleteఔను నిజం, నీ వన్నది,
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!"
ఏమండీ డాటేరు గారు,
ReplyDeleteతెలుగు పత్రికల్ని ఇన్నేసి మాట లంటారా ? హమ్మ ! ఉండండి మీ పని బడతా !
తెలుగు పత్రికల వాళ్లకి మీ మీద కేసు బెట్ట మంటా!
చీర్స్
జిలేబి.
జిలేబి జీ,
Deleteనా మీద కేసు పెట్టిస్తారా? ఏదీ పెట్టమనండి చూదాం!
(అసలు ఈ టపా రాయడానికి ఐడియా ఇచ్చిందే మీరని వాళ్ళకి చెబ్తాను!)
బాగా వ్రాసారు. పైన చెప్పినట్లు ఇంకా కొన్ని పత్రికలు లెక్కలోకి తీసుకుంటే, మీ పోస్ట్ చాలా పేజీలు వచ్చేవి.
ReplyDeleteమీతదుపరి టపా తెలుగు చానల్స్ మీద వస్తుంది అనుకుంటున్నాను :-)
నాకు తెలుగు న్యూస్ పేపర్లు చదివే అలవాటు లేదు. కాకపోతే ఏ పేపర్ ఎవరికి ప్రొపగాండ చేస్తుందో తెలుసు. అందుకే రెండు ప్రధాన పత్రికల (పక్షాల) ప్రచారాన్ని మాత్రమే తీసుకుని టపా రాశాను. ప్రస్తుత రాజకీయాల్లో థర్డ్ వ్యూ ఏమిటో నాకు తెలీదు. అంచేత ఇంకే పత్రిక గూర్చి రాయలేదు.
Deletebaagundi sir,
ReplyDeleteayite mee blogulo comment rayadaniki try chestunte,comment meeda nokkagane screen disappear avutundi sir.
Salaha ivvandi
G Ramesh Babu
Guntur
@G.Ramesh Babu,
Deleteఅందుకా మీ కామెంట్లు మిస్సవుతున్నాను!
మీకు సలహా ఇచ్చేంత జ్ఞానం నాకు లేదు. ఏదో తెలుగు టైపింగు చేస్తూ బ్లాగు పబ్లిష్ చెయ్యడం దాకా నేర్చుకున్నాను. అంతకు మించి ఒక్కంగుళం నాలెడ్జ్ కూడా నాకు లేదు. అయినప్పటికీ ప్రయత్నిస్తాను.. మూడ్రోజుల తరవాత.(ఓ ఎకడెమిక్ ప్రోగ్రాం ఎటెండ్ అవుతున్నాను.)
అయ్యా వైద్యులు గారు,
ReplyDeleteమీ టపా చదివినతరువాత, నకు తెలిసినతలొ మన వార్తా పత్రికలు ఎంత దిగజరయొ ఇంకొ ఉదాహరణ చెప్పలని పించింది.
నాకు కొద్దిగ టోఈ మీద ఎదొ గౌరవం వుందెది. మొన్నమధ్య 'సాన్వీ అనె చిన్న పాప హత్య ఊశా లొ జరిగింది. ఆ సమయంలొ, నాకు మొట్ట మొదటిసారి మన పత్రికలని , ఊశా లొ వార్త మధ్యమాలని సరి పొల్చె అవకాశం వచింది.
ఒక పక్క ఎవరు చెసారొ అని పరిసొధన సాగుతుండగానె, మన (దిక్కుమలిన ) గౌరవనీయులైన టోఈ పత్రికవరు, ఆ చిన్న పాప తల్లికి ఎవరెవరికొ సంభాందాలు , కుతుంబ తగాతాలు, అన్నీ అంట గట్టెసారు. ఆ వార్తలు చూస్తుంటె, టోఈ కి వున్న ఒకె ఒక్క లక్ష్య్మ, 'ఎది రాస్తె బాగ మసాల వుంటుంది , ఎది రాస్తె జనలు ఆసక్తిగ, ఒక కధలాగ చదువుతారు ! అంతె. అదొక్కటే వల్లకి కావాలి అని అనిపించింది.
అది చూసిన తరువత వ్యక్థిగతంగా నెను ఏ పత్రికని నమ్మటం మనేశాను.
చిన్న కొసమెరుపు, మీరు ఏందుకనొ , సాక్షిని మిగత వాటితొ కలిపెశారు. ఆ పత్రిక అవినీథికి కొత్త నిర్వచనం ఇచింది. మన అంధ్ర (దేశానికి కూడ) దరిద్రానికి కొత్త రెచొర్ద్ స్థాపించింది.
నకు తెలిసినంతవరకు, కొదిగ అంధ్రప్రభ మెరుగు. ఇక సాక్షి , జ్యొతి లగురుంచి ఎంత తక్కువ మాట్లాదితే అంత మంచిది.
క్రుష్ణ
TOI ante TIMES OF INDIA ga chadavagalaru.
DeleteLooks like lekhini changed my TOI and USA to some funny Telugu words. Please read them apropriately.
Deleteఅయ్యా కృష్ణ గారు,
Deleteమీరు లేఖినిలో టైప్ చేసి కాపీ పేస్ట్ చేసినప్పుడు ఆంగ్ల పదాల్ని మళ్ళీ టైప్ చెయ్యాల్సి ఉంటుంది. If you want incorporate English words 'Google transliteration' may be a better option.
ఒక మహిళ హత్య జరిగిన వెంటనే 'వివాహేతర సంబంధం' కారణం అంటూ రాసెయ్యడం మన తెలుగు పేపర్ల వాళ్ళకి ఎప్పట్నుండో అలవాటు. ఇట్లాంటి వార్త ఆ కుటుంబ సభ్యుల్ని తీవ్రమైన వేదనకి గురి చేస్తుందనే కనీస జ్ఞానం మన పత్రికలకి లేదు. ఇప్పుడు TOI వాడు కూడా అదే చేశాడు. ప్రస్తుతం బ్లాగుల్లో బాధ పడటం మించి మనం చెయ్యగలిగిందేం లేదు.
here is the link that shows what I explained.
ReplyDeletehttp://ramugvs.blogspot.com/2012/10/blog-post.html
వార్తా పత్రికలూ చదవడం శిక్ష తో సమానమని భలే చెప్పారండి. 25 ఏళ్ళుగా నన్నే అంటిపెట్టుకుని ఉండే పత్రిక ని ఈ మాసం నుండి గేటు దాటి లోపలి రానీయడం లేదు విరక్తి వచ్చేసింది
ReplyDeleteఇకపై ఎవరు వార్తాపత్రికలు చదవాల్సిన అవసరం లేదు రా. నా లు, పత్రికల లో పనిచేసే ఉద్యోగ గణం తప్ప అని నా అభిప్రాయం
తెలుగు న్యూస్ పేపర్ల ప్రపంచం చాలా చిన్నది. అది చంద్రబాబుతో మొదలై జగన్ తో ముగుస్తుంది. సీరియస్ గా తీసుకోకుంటే.. బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.
Deleteమీ టపా కంటే ఈ కామెంట్ బాగుంది.
Deletewow.. super .. haha :)
ReplyDeletethank you!
Deletekevvvvvvvvvvvvv.. బాగుందండీ ;)
ReplyDeleteపాత సినిమాల హీరోయిన్లు విలన్ని చూసి భయంతో 'కెవ్వు' మనేవాళ్ళు. కొంపదీసి మీరూ నా టపా చదివి భయంతో 'కెవ్వు' మన్లేదు గదా!:)
Delete(థాంక్యూ!)
చదువుకు పనికి రాక , అల్లరి చిల్లరగా తిరిగి , ఎందుకూ పనికి రాక తుదకు మన తెలుగు పత్రికల పుణ్యాన న్యూస్ కంట్రిబ్యూటర్ అవతార మెత్తిన వాళ్ళిందులో ప్రథాన పాత్ర పోషిస్తున్నారు . నెలంతా పని చేసినా వీళ్ళకిచ్చే డబ్బులు వెయ్యి దాటవు . కానీ , కొన్ని వర్గాలను బెదిరించి బాగానే సంపాదిస్తున్నారు . పై పెచ్చు గవర్నమెంటు వీళ్ళకు ఐడీ కార్డులిచ్చి ప్రోత్సహిస్తున్నారు కూడాను . వీళ్ళ కోసమైనా మీరు తెలుగు పత్రికలు చదవండి సారూ !
ReplyDeleteDoctor garu, sandatlo sademiya la Eenadu ni Sakshi ni oke gata ni kattesaru. Sakshi level ki digajaradam, ye ithara paper ki sadhyam kadu.
ReplyDeleteGood post. People should be aware of law and should drag these media folks to courts instead of pardoning them doing nothing. If repeated such court cases happen the media owners would feel the pinch and effect the way of thier employee's news reporting. Courts also should increase punishment exponentially for repeat offenders.
ReplyDeleteఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?
ReplyDelete-- చిత్తూరు నాగయ్య
అల్లూరి సీతారామరాజు ని పొట్టన పెట్టుకుంది ఎవరు?
--ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
ప్రపంచం లో ఎక్కువ రేపులు చేసింది ఎవరు?
--కైకాల సత్యనారాయణ