Friday, 1 March 2013

టెర్రరిజం - కొవ్వొత్తిజం


"రమణ మామ! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! దేశంలో టెర్రరిస్టులు పెట్రేగిపోతున్నారు. దుష్టులు. దుర్మార్గులు. దున్నపొతులు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. వెళ్దాం రాకూడదూ?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కొవ్వొత్తిజం' అందురు. నాకు 'వేలెంటైన్స్ డే' అంటే ఏంటో తెలీదు. అట్లాగే ఈ కొవ్వొత్తులకీ, నిరసనలకీ సంబంధం కూడా తెలీటల్లేదు. తెలీని విషయాల్ని తెలుసుకునే ఓపిక లేదు. కొవ్వొత్తి పట్టుకునేంత ఓపిక అస్సలు లేదు. మరోసారెప్పుడైనా 'కొవ్వొత్తిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ దాడులు జరగాలని కోరుకుంటావా? నీకా అవకాశం లేదు. ఉప్పల్ క్రికెట్ మ్యాచ్ కి ఎంతటి భారీ భద్రత ఉందో పేపర్లో చదివావుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్ లో ఏమీ జరగదు. ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగెదవైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. అట్లాంటిది బాంబులు పెట్టేవాడు.. ఇంకెంత తెలివిగా ఉంటాడు?" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.
"కావాలి. మనకి చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు ఉప్పల్ ఏరియా తప్పించి, హైదరాబాద్ లో మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి. మనకిది అలవాటేగా!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తీవ్ర నిఘా. అలాగే ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం. జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రతగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇట్లాంటి ఓవరేక్షన్లు చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! నాకు తెలీదులే! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని సంధించాను.

"అందుకు అమెరికాని అభినందించి తీరాలి. అయితే మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. అమెరికా చరిత్ర నిన్నమొన్నటిది. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే వారికి ప్రతి పౌరుడిపై నిఘా పెట్టగల అవకాశం ఉంది. వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన చిదంబరం బజెట్ లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. పోలీసు స్టేషన్లు ఫైవ్ స్టార్ హోటళ్ళలా ఉంటాయి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులకి కూడా చస్తుంటాం. దరిద్రంలో మగ్గిపోతుంటాం. ఒకరకంగా ఈ చావుల కన్నా ఆ నష్టమే అధికం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది. అప్పుడు ప్రధాన మంత్రి కన్నా రక్షణ మంత్రి, హోం మంత్రి ముఖ్యులైపోతారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాకి కూడా ఇదే సమస్య రావాలి గదా." కుతూహలంగా అడిగాను.

"న్యాయంగా అయితే రావాలి. అలా రాకుండా ఉండేందుకు అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఆయుధాల్ని అమ్ముకోడానికి దేశాల మధ్య తగాదాలు, యుద్ధవాతావరణం సృష్టిస్తుంది. వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది. అమెరికా కోటి విద్యలూ ఆయుధాల వ్యాపారం కొరకే!" అంటూ నవ్వాడు సుబ్బు.

"అమెరికా మోడెల్ కరెక్ట్ కాదని చెప్పడానికి.. "

"అమెరికా మోడెల్ నీకూ, నాకూ కరెక్ట్ కాదేమో గానీ.. అమెరికన్లకి మాత్రం కరెక్టే అని అనుకుంటున్నాను. అందుకేగా.. మనం రకరకాల కారణాలతో చస్తుంటే.. అమెరికా పౌరులు మాత్రం హాయిగా బీరు తాగుతూ.. నరాలు తెగేంత ఉత్కంఠతో.. బాస్కట్ బాల్ (NBA) ని ఫాలో అవుతుంటారు." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు మనమేం చెయ్యాలి? ఒకపక్క డబ్బులు లేవంటావు. ఇంకోపక్క టెర్రరిస్టు దాడుల్ని ఆపాలంటావు." విసుగ్గా అన్నాను.

"ఉగ్రవాద దాడుల్ని నిరోధించేందుకు కావలసింది ప్రజల పట్ల, దేశం పట్లా కమిట్మెంట్ ఉండి.. గొప్ప విజన్ కలిగి ఉండే రాజకీయ నాయకత్వం. ఇందుకు ఏ బజెట్ కేటాయింపులు అవసరం లేదు. అందుకే ఇందుకు బాధ్యత వహించాల్సింది రాజకీయ నాయకత్వం. ఏ దేశంలోనైనా టెర్రరిస్టు దాడులు ముమ్మాటికీ ఆ దేశ రాజకీయ వ్యవస్థలోని వైఫల్యమే." అంటూ ఖాళీ కప్ టేబుల్ పై పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." KFC లో చికెన్ రుచి చూసిన వాడిలా మొహం పెట్టి విసుక్కున్నాను.

"హోటల్ వాడు చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. అట్లాంటి మనం ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్య పరిష్కరించరు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లతో ఎలా వ్యవహరించాలో స్పష్టత లేదు. కనీసం శ్రీలంకతో ఎలా ఉండాలో కూడా అర్ధం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

ఆనందభవన్ పెసరట్టు మహత్యం! మా సుబ్బు అంతర్జాతీయ రాజకీయాలు అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు!

"సర్లే! సాయంకాలం కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఉంది. నే వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా నా నిరసన తెలియజేస్తా!" నొక్కి పలుకుతూ అన్నాను.

"అయితే మీ 'కొవ్వొత్తిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!?" ఆశ్చర్యపోయాను.

"అవును. ఆ 'కొవ్వొత్తిజం' లో డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. ఇవన్నీ టెర్రరిజం అంత ఎమోషనల్ ఇష్యూస్ కాదు. అయితే ఇవి మన దేశానికి ఉగ్రవాదం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి." అంటూ రిస్ట్ వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

తలుపు తెరుచుకుని.. ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగి.. వెనక్కి చూస్తూ నవ్వుతూ అన్నాడు.

"నాకో అనుమానం. బంగారం వ్యాపారస్తులు 'అక్షర తృతీయ' అంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే కొవ్వొత్తుల వ్యాపారస్తులు ఈ టెర్రరిస్టు వ్యతిరేక దేశభక్తులతో 'కొవ్వొత్తిజం' మొదలెట్టించి సొమ్ము చేసుకుంటున్నారా?" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photos courtesy : Google)

35 comments:

  1. కప్పు కాఫీతో‌ జతకలిపి యెన్ని విషయాలు బ్రహ్మాండంగా ప్రస్తావించారు!

    ReplyDelete
    Replies
    1. అవును కదా!

      మీకు కాఫీ బిల్లు పంపిస్తున్నాను. దయచేసి (టిప్పుతో కలిపి) చెల్లించగలరు!

      Delete
  2. agree. The candle marches do no good. WKK (Wagah Kandle Kissers) brigade and Aman ki Asha types misguidedly believe peace can be achieved through candle light vigils and feel good get-togethers. Oh by the way , who says India cannot afford security? Subbu offers up false choices. Without security, one cannot earn a living, not to mention enjoying freedoms and liberty. When a bread winner loses life in an early violent death, his or her dependents become destitute. The fundamental duty of a nation state is safeguarding security of its populace. It is a pity that citizens of India do not demand good governance. The apathy and non-participation of educated in the electoral process ensures the perennial corrupt and dishonest rule.

    ReplyDelete
    Replies
    1. Dear BSR,

      >>When a bread winner loses life in an early violent death, his or her dependents become destitute.<<

      I have a problem here. We are selectively sensitive to "early violent death" only. Why not the same kind of sensitivity (even if it is tokenism) is extended to the "early non-violent death" of tribal and other poor people dying with hunger, malaria, cholera etc., which are more shameful to the nation than terrorist kind of attacks. Is it not the failure of the system?

      >>The fundamental duty of a nation state is safeguarding security of its populace.<<

      I totally agree. 'right to live' is fundamental right. safeguarding security includes food security, job security, health security etc. also.

      ఇదంతా నా పోస్ట్ కి సంబంధం లేని చర్చ. ఏదో మీ కామెంట్ కి ప్రతి పదార్ధంలా సమాధానం రాయాలనిపించి రాసేశాను. చిత్తగించవలెను.

      Delete
    2. I am plenty sensitive to other ills as well, but, I have a problem with the thinking that if you spend money on security, there won't be any money left for other things. As someone said India has a lot of poverty, but, it is not a poor country.

      Hunger and poverty are best addressed by free market and not by command and control centralized planning as evidenced by a thousand examples in world history. The system fails because the politicians do awful things in the name of "common man". The minute the common man and garibi hatao themes are invoked, the common man better watch out because he is about to be fleeced again.

      We need equality in opportunity, meritocracy in education, jobs and politics. We need to remove corruption, caste system and religion from governance. I am not against a social safety net for the very poor and vulnerable populations, but, the administration of it is totally and utterly corrupt and needs change.

      As Churchill said, "the inherent vice of capitalism is the unequal sharing of the blessings. The inherent blessing of socialism is the equal sharing of misery." Given that I take the former any day than the latter.

      Delete
    3. Dear BSR,

      ఇవ్వాళ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ఈ టపా పబ్లిష్ అయ్యింది. చూసే ఉంటారు (చూడకపోతే ఇప్పుడైనా చూస్తారని ఆశ).

      నేను ఈ పోస్టులో మూడు పాయింట్లు కవర్ చేశాను. 1.రాజకీయ వైఫల్యం వల్ల రక్షణ వ్యయం పెరుగుతుంది. 2.అమెరికాతో మనని పోల్చుకోరాదు. 3.కొవ్వొత్తులు రాజకీయ చైతన్యానికి సింబల్స్ కావు.

      మీరు చెబుతుంది ఆర్ధిక రాజకీయాల గూర్చి. అది నేను ఈ పోస్టులో రాయలేదు (రాస్తే మీకు నేను ఆహారం అవుతానని తెలుసు).

      Delete
    4. Dear Ramana,

      Yes, I saw your article in Andhra Jyoti. My hearty congratulations to you! Your wonderful writings deserve wider readership and we are very proud of you.

      You seem to indicate that my comment is extraneous to your blog post. I beg to differ. It is my understanding that you make the following observations/conclusions:

      1. The candle vigils may make us feel better, but, are fleeting and short lived expressions of grief and anger that unfortunately may not change the ground reality.
      I completely agree.

      2. Ramping up security is a rich countries' prerogative, which India can ill afford. If you spend more on security, the social programs would suffer.
      You may not see it that way, but, this is exactly about political economy and I disagree with this and thus my criticism. I feel a) India can certainly afford safeguarding security b) no programs need to suffer c) moreover, the government welfare programs purportedly to alleviate poverty are demonstrably useless and are actually vehicles for corruption d) lastly, it is not so much about money, but, the will of the government which is sorely lacking (which you have alluded to as well).

      3. Then in your commentary, you further state that there are greater ills than people dying premature deaths due to terrorism. You imply that there is selective outrage and that people do not even have token appreciation for the suffering of tribals and other poor masses from poverty, hunger and disease.
      Once again we are essentially talking about economic systems. I am saying that the best way to eradicate them is by offering economic opportunity by creating a fair and equitable free market economy that is governed by law and order; free of corruption, nepotism, casteism, religion and regionalism.

      I think our goals are the same, but, we differ on our routes to get there.
      Peace brother!

      BSR

      Delete
    5. "The fundamental duty of a nation state is safeguarding security of its populace."

      rightly said. in-fact government's only fundamental duty should be safeguarding it's citizens and their property.

      Delete
  3. "హోటల్ వాడు చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. అట్లాంటి మనం ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్య పరిష్కరించరు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లతో ఎలా వ్యవహరించాలో స్పష్టత లేదు. కనీసం శ్రీలంకతో ఎలా ఉండాలో కూడా అర్ధం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?"

    సత్యము వచించారు. మొత్తం టపాతో ఏకీభవిస్తున్నాను. పైన లైన్లతో మరింత ఎక్కువ ఏకీభవిస్తున్నాను. కానీ అలాంటి స్పష్టత మనలో ఉంటేనే మనం స్పస్టత కలిగిన రాజకీయనాయకులని ఎన్నుకోగలము. తీవ్రవాదుల దాడులు జరిగినప్పుడల్లా దాన్ని తమతమ idealogyల వ్యాప్తికి వాడుకోప్రయత్నించేవాళ్ళు ఎక్కువౌతున్నారీమధ్య. సమస్యకి మూలకారణం ఏమిటి అన్న ప్రశ్న ప్రజల్లో చాలామందికి ఆలోచించే తీరికా వెసులుబాటూ కొండొకచో అవసరమూ ఉండవు. ఆలోచించగలిగేవారికి కొంతమందికి సంపత్తీ, సమాచారమూ ఉండవు. అవన్నీ ఉన్నవారిమధ్య ఒక ఏకాభిప్రాయం సరే కనీసం మెజారిటీ అభిప్రాయంకూడా ఉండదు. ఇక మనలో అది కుదిరేదెప్పుడు? సమస్య నివారణకి కార్యాచరణలను నాయకులనుంచి ఆశించే స్థాయికి మనచైతన్యం ఎదిగేదెప్పుడు? చెప్పండి.

    I think we need to get our priorities right well before we go to the polling booth.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete
  4. సుబ్బు గారు చాలా రొజులకొచ్చారు గురు గారు...ఎప్పటిలాగానె అదరగొట్టారు మళ్ళీ త్వరలొ ఇంకో విషయం మీద పిలవండి!మాకు సరదా గా పరిఙానం ఇస్తూ (మీకు కూడా కాలక్షేపం!)

    ReplyDelete
    Replies
    1. కొన్నాళ్ళ క్రితం సుబ్బు నా బ్లాగుకి తనే ఓనర్లా ఫీలవ్వడం మొదలెట్టాడు. అంచేత వాణ్ణి మూణ్ణెల్లుగా ఇటువైపు రానియ్యకుండా కట్టడి చేశాను. ఇకముందు వస్తూనే ఉంటాడు లేండి!

      Delete
  5. పోస్ట్ చాల బావుంది . సుబ్బు చాల మంఛి సమాచారం మరియు సలహాలు ఇచ్చారు .
    ఏంటి అండి అంత పెద్ద చర్చ లో కూడా మీరు KFC మీద కౌంటర్ వేసారు అంటే గుంటూరు లో కొత్తగా పెట్టిన KFC మీకు నచ్చినట్లు లేదు . గుంటూరు అంత పట్టణానికి kFC, Damino's అవసరమా ?అవి నడుస్తాయ ?

    ReplyDelete
    Replies
    1. థాంక్స్.

      గుంటూరుకి KFC, Damino's అవసరం లేదని అనుకోటల్లేదు. రోగిష్టి వాడికి పథ్యం పెట్టినట్లు అదోరకం రుచి. నచ్చినవాడికి బానే ఉంటుంది.

      Delete
  6. వెల్కమ్ బాక్ టు సుబ్బు. కొవ్వొత్తిజమ్ తో బాటు పనిలో పనిగా 1-2-3-100 కె రన్నులను (ఉ. 10k run for Hyderabad) లాంటి వాటిని కూడా ఉతికేస్తే పోయేది.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      ఉతికెయ్యొచ్చు.. కానీ వాషింగ్ పౌడర్ నిండుకుంది!

      Delete
  7. బాగుంది సర్‌. ఈ సబ్జెక్ట్‌ని ఇలా రాయడం కష్టం. చిన్న సూచన. అది కొవ్వొత్తుల నిరశన కాదు. నిరసన.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! సరిచేసుకున్నాను.

      Delete
  8. @నాకు 'వేలెంటైన్స్ డే' అంటే ఏంటో తెలీదు. అట్లాగే ఈ కొవ్వొత్తులకీ, నిరసనలకీ సంబంధం కూడా తెలీటల్లేదు.


    వేలంటైన్స్ డే సుబ్బుకు తెలియకపోవడం ఏమిటీ? క్రిస్మస్ తర్వాత ఇక దినాలేమి లేక ఆ సీజన్ లో విరివిగా పూసే గులాబీల మార్కెటింగ్ కోసం పుట్టిన దినం ప్రేమికుల దినమన్న మాట. ఈ కొవ్వొత్తుల గొడవ నాకూ అర్ధం కాదు. మామూలుగా నిరసన తెలుపడం నామోషీ కాబోలు.


    ReplyDelete
    Replies
    1. సుబ్బుకి ప్రేమలు, దోమలు లేవు. కాబట్టి నిజంగానే ఆ దినాలు తెలీవు.

      (నేనీ టపా రాసేముందు మన బ్లాగర్లకి నచ్చదేమో అనుకున్నాను. కానీ నా అనుమానం తప్పయింది.)

      నాకయితే కరిగిన మైనం చుక్కలు మీదకి ఒంపుకుంటారేమోనని భయమేస్తుంటుంది కూడా!

      Delete

  9. ఆ ప్రొఫైల్ ఫోటో లో ఉన్న ఆయన ఎవరండీ ? సుబ్బునా ?

    Excellent post!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      ఆ ఫొటో సుబ్బుది కాదనుకుంటా!

      Delete
  10. ఢిల్లీ రేప్ సంఘటన సందర్భంలో కొవ్వొత్తులపై నా బ్లాగులో ఒక టపా వ్రాసాను.

    "కొవ్వొత్తులు కాదు ఓట్లు వెలిగించండి" అని.

    ReplyDelete
    Replies
    1. వీలు చూసుకుని తప్పకుండా చదువుతాను. నాకీమధ్య పని వత్తిడిగా ఉంది. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  11. బాగుంది సర్, మీది, మీ ఫ్రెండ్ సుబ్బు గారి విశ్లేషణ. కొవ్వొత్తి లతో మొదలెట్టి బంగారం తో ఆపారు .మధ్యలో మీరు చెప్పాలనుకున్న దాన్ని చెప్పేసారూ
    అమెరికా తోనే ఎందుకు పోల్చుకోవాలి ? terrorism తక్కువ / లేని దేశాలు చాలానే ఉన్నాయి వాటి నాగరికత కూడా పాతదే కదా, ఆయా దేశాల మోడల్ మన దేశానికి సరిపోతుంది. కాని ఫాలో అవ్వలేము. రాజకీయ నాయకులూ జనల నుండే వస్తారు, జనాల్లో చిత్తశుద్ది లేనప్పుడు ఇంకేం చేస్తాం ( నేను కూడా అందులో ఒకడినే ) ఎన్ని కొవ్వొత్తులు, కాగడా లు వెలిగించినా ఏం ప్రయోజనం.

    ReplyDelete
    Replies
    1. ఎందుకంటే అందరూ అమెరికానే కోట్ చేస్తున్నారు కాబట్టి.

      వాస్తవానికి ఏ దేశాన్ని ఇంకో దేశంతో పోల్చడం కుదరదు. నైసర్గిక స్వరూపం, చరిత్ర, సామాజిక పరిస్థితులు.. ఇలా ఎన్నో వేరియబుల్స్ ని పరిగణనలోకి తీసుకుని రాజకీయ లెక్కలు వెయ్యాలి.

      ఉదాహరణకి అమెరికా పక్కన చైనా, పాకిస్తాన్లు లేవు. మనకి ఉన్నాయి. కాబట్టి అమెరికాలో సక్సెస్ అయిన వ్యూహం మనకి పనికి రాకపోవచ్చు.

      Delete
  12. ఈమద్య అన్ని చోట్ల ఈ కొవ్వొత్తిజం చూస్తున్నాము. బాగా వ్రాసారు

    ReplyDelete
    Replies
    1. కొంపదీసి కొవ్వొత్తుల కంపెనీల వాళ్ళు మన తెలుగు బ్లాగర్లపై చేతబడీ గట్రా చేయించరు గదా!

      Delete
  13. కొవ్వొత్తిజం గురించి సుబ్బు అభిప్రాయం బాగుంది.

    /* అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని సంధించాను.

    సుబ్బు ఏ విషయమైనా చాలా దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తాడు కదా, ' అసలు 9/11 చేసిందే అమెరికా వాళ్ళు ' అని అంటాడేమో అనుకున్నాను నేను..హ్మ్మ్

    ReplyDelete
    Replies
    1. సుబ్బు కాఫీతో మర్యాదగానే మాట్లాడతాడు.

      అదే సింగిల్ మాల్ట్ తో మాత్రం.. మీరనుకున్నట్లే.. చాలా దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తాడు!

      Delete
    2. అసలు 9/11 చేసిందే అమెరికా వాళ్ళు అని సుబ్బు అంటాడేమో అని ఎందుకు అనుకున్నానో నా బ్లాగులో వివరంగా వ్రాసాను. ఇందులో ఇచ్చిన వీడియోలు కొన్ని గంట పైన ఉంటాయి. మీకు టైం దొరికినప్పుడు చూసి మీ అభిప్రాయాలు (సుబ్బువి కూడా) తెలుపగలరు.

      http://srinivasblogworld.blogspot.com/2013/03/blog-post.html

      Delete
  14. రమణ గారు,
    చాల సీరియస్ విషయం గురంచి మీదైన శైలి లో చాల బాగా వ్రాసారు. రెండు నిముషాలు మౌనం పాటించి భాదితుల గురించి తలచు కోవడానికి కొవ్వుత్తులు వెలిగించడం లో తప్పేమీ లేదనుకుంటా. బాధితుల గురించి, సంఘటన గురించి మరుసటి రోజు నుంచి మర్చిపోవడంమే అసలు సమస్య. ఎక్కువ మంది పోలీసులు ఉండడం వలన, ఇంటలిజెన్స్ వ్యవస్థ బాగా పని పని చేయడం వలన తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఈ రెండింటికి డబ్బులు అవసరం కుడా. మిగతా అన్ని విషయాల్లో (అవినీతి తగ్గడం లాంటివి) మార్పు రాకుండా అయితే ఈ డబ్బు వేరే ఏదో ఖర్చు తగ్గించే రావాలి.

    ప్రభుత్వ పరంగా తీసుకొనే చర్యల కంటే, సమాజంలో బతుకు విలువ పట్ల ఎలాంటి వైఖరి ఉంది అనేది కుడా ముఖ్యమే. కొంత మంది జనాభా ఎక్కువ కావడం అంటారు, కొంత మంది మనది అసలే కర్మ భూమి అంటారు. నిజం ఏదైనా దేశం లో వ్యక్తి ప్రాణానికి పెద్ద విలువ లేదు. ఎవరి ప్రాణం వారికి తీపి కాదు అని కాదుగాని, సమిష్టి గా ప్రాణాలకు, జీవితానికి విలువ లేదు.
    ఎలా రాసి పెట్టి ఉంటె అలా జరుగుతుంది అనుకోవడం మన భారతీయుల లక్షణం. దీనికి మతం తో ఏమి సంబంధం లేదు. ప్రతి ఒక్కరి చావు ముందు గానే వ్రాసి పెట్టి ఉంది అని నమ్ముతాం మనం (ఆ రాసే దేవుడి పేరు వేరే గా ఉండొచ్చు). రోడ్ ప్రమాదం, రైలు ప్రమాదం, బాంబు పేలుడు ఇంకోటో ఇంకోటో, ఇవన్ని మనిషి ని పైకి తీసుకుపోవడానికి, దేవుడు కల్పించే సాకు మాత్రమే అని, మన సమయం వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి, మనం అక్కడ ఉంటాము అని చెప్పే వాళ్ళు నమ్మే వాళ్ళు కోకొల్లలు.

    విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసినట్లుగా “మనిషి వార్త యందు రమిస్తాడు, అదే వార్త తనయందు నిజమైతే ఏడుస్తాడు”. ఒక్కరు ఇద్దరు చనిపోతే మనకు వార్త నే కాదు. అయిదు మంది చనిపోతే ఒక మాదిరి వార్త. టెర్రరిస్ట్ దాడులు కూడా ప్రాణ నష్టం కంటే, అవి జరగడం లో ఉండే నాటకీయత, వాటి వెనుక ఉండే ఉద్వేగ అంశాలు (ప్రతీకారం, మతం, కాశ్మీర్, పాకిస్తాన్ ) వల్లనే ఎక్కువ మందిని వాటి గురించి ఆలోచించేలా చేస్తాయి.
    టెర్రరిస్ట్ దాడుల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రతి దేశం లో,
    1) మీ బ్యాగులు, సామానులు ఎప్పుడు మీదగ్గరే పెట్టుకోండి.
    2) అనుమానాస్పదంగా ఉన్న వస్తువుల గురించి, మనుషుల గురించి పోలీసులకో, సంబంధిత వ్యక్తులలో తెలియ జేయండి.
    మీరు ఎక్కడికి వెళ్ళినా(ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రజా రవాణా సాధనాలు), ఇవి రెండు కనీసం ఒకసారి అయినా గుర్తు చేయబడకుండా ఉండవు. ఎంతలా అంటే ఇవి ప్రజల జీవితం లో భాగం అయిపోయేంతలా.

    లండన్ లో ఒలింపిక్స్ జరగడానికి కొన్ని రోజుల ముందు నేను బి.బి.సి. న్యూస్ కార్యక్రమం లో ఒలింపిక్స్ భద్రత గురించి ఒక రిపోర్ట్ చూసాను. టెర్రరిస్ట్ ల దాడుల నుంచి ఒలింపిక్స్ గేమ్స్ కు భద్రత కోసం, ఒలింపిక్స్ స్టేడియం దగ్గర లో ఉన్న ఒక అపార్ట్ మెంట్ మీద మిలిటరీ వాళ్ళు మిస్సైల్స్ మొహరించారు (Deploy) చేసారు. దానికి అనుకూలంగా, వ్యతిరేకం గా చాల అభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. ఆ న్యూస్ రిపోర్ట్ తయారు చేయడానికి బి.బి.సి. న్యూస్ రిపోర్టర్, ఆ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి ని ఆఫ్ ది కెమెరా ఇంటర్వ్యూ చేసాడు. అతన్ని టెర్రరిస్ట్ లు దాడులు చేసే అవకాశం గురించి, చేస్తే ఎలాంటి దాడులు చేస్తారు, మిస్సైల్స్ వాటిని ఆపగలవా? ఇక్కడ మిస్సైల్స్ పెట్టడం వలన అక్కడ నివాసం ఉంటున్న వారికి ఏమిటి ప్రమాదం లాంటి విషయాల మీద రిపోర్టర్ ప్రశ్నలు అడిగాడు.
    ఇలా వీళ్ళద్దరు మాట్లాడుతూ ఉండగా, ఆ దారిన పోయే ఒక ఆమె, వారిద్దరి సంభాషణ లో చాల సార్లు టెర్రరిస్ట్, దాడులు లాటి పదాలు వాడడం విని వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. రిపోర్టర్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగానే పోలీసులు అక్కడికి రావడం, ఇది టీవీ ప్రోగ్రాం కోసం మాట్లాడిన మాటలు అని తెలుసుకొని వెళ్ళిపోవడం జరిగింది.
    చివరికి న్యూస్ రిపోర్టర్ , ఇది చెప్పి రిపోర్ట్ ను ముగించాడు.
    ఒలింపిక్స్ సేఫ్ గా జరగానికి మిస్సైల్స్ మోహరించడం ఎంత వరకు ఉపయోగ పడుతుందో లేదో తెలియదు గాని, ఇలా ప్రజలు అందరు అప్రమత్తం గా ఉండడం మాత్రం కచ్చితంగా ఉపయోగ పడుతుంది అని.

    ReplyDelete
    Replies
    1. డియర్ చంద్ర,

      చాలా వివరాణాత్మకమైన వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్తో ఏకీభవిస్తున్నాను.

      నాకు కొవ్వొత్తులతో ప్రదర్శన జరపడం పట్ల వ్యతిరేకత లేదు. అదేదో సినిమా షూటింగ్ లా, రియాలిటీ షో లా.. ఆ కొద్దిసేపు మాత్రమే ఒక తంతులా నిర్వహించడం పట్ల బాధ ఉంది, చికాకు ఉంది.

      ప్రస్తుతం ఉన్న సిబ్బంది (ఏ ప్రభుత్వ విభాగంలోనైనా) 'ఉన్నది ఉన్నట్లుగా' నిర్వహించడానికి మాత్రమే సరిపోతారు. అత్యవసరం ఏర్పడితే.. దేవుడిపై భారం వేసి చేతులు ఎత్తెయ్యడమే! (మనకి ఇన్ని మతాలు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నది ఇందుకోసమేగా!)

      Delete

comments will be moderated, will take sometime to appear.