Monday 25 March 2013

హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!


"ఉతికి ఆరవేయుట!"

"చీల్చి చెండాడుట!"

"చావగొట్టి చెవులు మూయుట!"

ఇవన్నీ అర్ధం చేసుకోవాలంటే ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' సాహిత్య వేదిక 'వివిధ'లో రంగనాయకమ్మ వ్యాసం "విప్లవాలు కుప్పకూలేది ఇందుకే!" చదవండి.


నా చిన్నప్పట్నించి రంగనాయకమ్మ సాహిత్య విమర్శ చదువుతున్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో అదే స్పష్టత, సూటిదనం! సాధారణంగా వయసు పైబడుతున్నవారి వాదనలో వాడి, వేడి తగ్గుతుంది. కలంలో పదును బండబారుతుంది. అయితే రంగనాయకమ్మ వీటన్నింటికీ అతీతం!

తెలుగు సాహిత్య విమర్శనా రంగం మర్యాదస్తుల వేదిక. అందుకే విమర్శకులు 'ఎందుకొచ్చిన గోల!' అనుకుంటూ తప్పుకుంటారు. అందుకు ఒక కారణం వారికి ఆ రచయితతో ఉండే సాన్నిహిత్యం. అంచేత మొహమాటం. అలాగే తెలుగు సాహిత్యంలో విమర్శల్ని సహృదయంతో స్వీకరించే వాతావరణం కూడా లేదు. పైగా విమర్శకులపై రచయిత ఎదురుదాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది (ఉదాహరణ.. డా.కేశవరెడ్డి 'మునెమ్మ').

'నామిని' రచనల్ని గోర్కీతో పోలుస్తూ ఎంతగానో మెచ్చుకోవడం.. అటు తరవాత అతని వ్యక్తిత్వం నచ్చక తీవ్రమైన విమర్శ చేయడం.. ఒక్క రంగనాయకమ్మకే చెల్లింది. సన్మానాల కోసం, పురస్కారాల కోసం వెంపర్లాడే రచయితలకి తెలుగు సాహిత్యం పుట్టినిల్లు. ప్రముఖ రచయితలు తమ భజన మండళ్ళని ప్రోత్సాహిస్తూ పీఠాధిపతులుగా చలామణి అవుతుంటారు. ఈ వాతావరణం కారణంగా నిష్కర్షగా, నిర్మొహమాటంగా రాసేవారి సంఖ్య రోజురోజుకీ చిక్కిపోతుంది.


రంగనాయకమ్మ 'విరసం'ని ఇంత తీవ్రంగా విమర్శించడం నాకు విశేషంగా అనిపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. రంగనాయకమ్మ రాసుకున్నట్లుగానే.. ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చలసాని ప్రసాద్ ఎంతగానో సహాయం చేశాడు. ఇవ్వాళ రంగనాయకమ్మ తీవ్రంగా విమర్శించిన కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాల ప్రచురణకి కారకుడు కూడా చలసాని ప్రసాదే! కానీ రంగనాయకమ్మకి దయాదాక్షిణ్యాలు ఉండవు!

సరే! కుటుంబరావు దయ్యాల వ్యాసాల పట్ల నా అభిప్రాయాల్ని "'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!" అంటూ ఇంతకు ముందే రాసేశాను. ఇప్పుడు ఈ టాపిక్ మీద కొత్తగా నే రాసేదేమీ లేదు.. ఒక్క రంగనాయకమ్మని అభినందించడం తప్ప!

"హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!"

(photos courtesy : Google)

60 comments:

  1. I must say she doesn't mince words! I am fully with her in rubbishing the paranormal and other magic stuff people seem to be increasingly fond of even in the 21st century. But, I am not sure the revolutions have fizzled out because of irrationality of the progressives. I would say communism collapsed precisely because common sense and rationality prevailed and people voted against their collective misery.

    I have found Ranganayakamma's unrelenting critique (actually more like a scathing personal attack) of Namini on the net. I am a bit surprised that she feels writing is not a profession and nobody can earn a living as a professional writer! She advocates Gorkyish hard life and poverty. Never mind that Maxim Gorky himself came back to Soviet Russia from exile in Italy for material reasons. He found himself without money or fame in Mussolini's Italy. He was given a mansion in Moscow, a dacha in the suburbs and of course Order of Lenin on his return.
    http://kalpanarentala.blogspot.com/2010/02/blog-post_15.html

    Minus the pinko stuff, Ranganayakamma's intellectual honesty and incisive writing are admirable.

    ReplyDelete
  2. Dont use Ranganayakamma's name in the purpose of anti-communist tendency. I had understood the meaning of the word communism only after reading her books. CPI and CPM leaders never tell "what is communism" and they always concentrate on criticising the corruption done by ruling class as Anna Hazare does.

    ReplyDelete

  3. యరమణ గారి బ్లాగు లో నూ జిలేబే !

    జిలేబీ ల విమర్శనా చాతుర్యం జిందా బాద్ !

    >> ప్రముఖ రచయితలు తమ భజన మండళ్ళని ప్రోత్సాహిస్తూ పీఠాధిపతులుగా చలామణి అవుతుంటారు.

    డాటేరు రమణ గారు,

    అబ్బ మీ లాంటి మంచి రచయత ల రచనల్ని నేను ఇంతకు మునుపు అస్సలు చదవ లేదంటే నమ్మండీ !

    (ప్రొఫైల్ డాటేరు ఫోటో పై వ్యాఖ్య తో మరో ఇంచీ వైశాల్యం లో పెరిగెను !)

    రంగ నాయకమ్మ గారి రామాయణ విష వృక్షం పై మీ అభిప్రాయ టపా రాయవలసినది !



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      నిజంగా? థాంక్యూ!

      ఇంతకు ముందు కూడా రామాయణ విషవృక్షం గూర్చి ఒకరు అడిగారు. ఆ పుస్తకం (మూడు భాగాలు) చదివి ముప్పైయ్యేళ్ళు దాటింది. నాకు దేవుళ్ళు, దెయ్యాలపై నమ్మకం లేనందున.. చదువుతూ నవ్వుకున్నాను. అంతకు మించి నాకా రచన గుర్తు కూడా లేదు. ఇప్పుడు చదివే సమయం లేదు.

      అదీగాక.. నా టపాల్లో ప్లాన్డ్ గా రాసేవి తక్కువ. ఉదాహరణకి.. ఇవ్వాళ ఆంధ్రజ్యోతి తొమ్మిదింటికి చూశాను. 'రంగనాయకమ్మ విరసాన్ని భలే కడిగేసింది.' అనిపించింది. కొద్దిసేపటికి దీనిపై ఒక టపా రాయలనిపించింది. రాసేశాను (ఆ వారా హాస్పిటల్ వర్క్ లేటయ్యింది. అది వేరే సంగతి). అదీ సంగతి!

      Delete
    2. రామాయణ విషవృక్షం పుస్తకం నేను చదివాను. కానీ ఆ పుస్తకం చదవకముందు నుంచే నేను నాస్తికుణ్ణి కనుక నేను అది చదివిన తరువాత అంతగా impress అవ్వలేదు.
      But the book is recommended for them who study the evolution of religion.

      Delete
    3. విష వృక్షం నేను చదవలేదు. చదివే ఆలోచన కూడా లేదు. కానీ దానికి సంబంధించిన బాపూ గారి జీవితంలో జరిగినది ఎక్కడో చదివినది ఇది.

      ఆ పుస్తకం అట్టమీద బొమ్మ వెయ్యమని బాపూ గారికి 300 రూపాయలు, పుస్తకం పంపించేర్ట. ఆయన ఆ చెక్ వెనకాల "రామ రామ" అని రాసి వెనక్కి పంపించేరుట, బొమ్మ వేయకుండా. బాపూ గారు రామ భక్తుడని అందరికీ తెల్సిందే కదా?

      రెండు యుగాలక్రితం జరిగినదాన్ని ఇప్పటి దృష్టితో రాయడం, ఆవిడకి మగవాళ్లంటే ఉన్న అసహ్యం రాముడిమీద చూపించటం అన్యాయం. ఏదో కొంత పేరొచ్చాక 'ఏది పడితే అది రాసేయొచ్చు. చచ్చినట్టు చదువుతారు' అనుకోవడం,ఆ వీక్నెస్ ని కేష్ చేసుకోవడం నాకు నచ్చదు. నేనెవడ్ని లెండి అయినా బ్రహ్మాండంలో పిపీలికాన్ని.

      తమ చుట్టూ ఒక వలయాన్ని గీసుకుని అందులో బతికేవారికి ప్రతి ఒక్కరూ తగలబడిపోతున్నారనే భావన కలగటం సమంజసం.

      Delete
    4. బాపు గారికి రామాయణం జీవనాధారం. చెక్కు తిప్పి పంపకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే కదా.

      రెండు యుగాలక్రితం జరిగినదాన్ని అని అందరు వదిలేస్తే ఆవిడకీ అంత వ్రాయాల్సిన నొప్పి ఉండేది కాదు అనుకుంటాను. ఆవిడకి మగాళ్ళ అంటే అసహ్యమా, ఇది మీ ఊహ మాత్రమె.

      రంగనాయకమ్మ, పేరు వచ్చిన్దనో , క్యాష్ చేసుకోవడానికో వ్రాసే మనిషికాదు అని ఆవిడని వ్యతిరేకించేవారికి కూడా తెలుసు.

      Delete
    5. @DG,

      బాపు రామభక్తితో తను పంపిన చెక్ వెనక 'రామరామ' అంటూ రాసి వెనక్కి పంపారని 'రామాయణ విషవృక్షం' ముందుమాటలో రంగనాయకమ్మే రాశారు. అలాగే కొడవటిగంటి కుటుంబరావు విమర్శకి కూడా చాలా విపులంగా సమాధానం చెప్పారు.

      రంగనాయకమ్మ దేవత కాదు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాషలో కథలు, నవలలు, వ్యాసాలు రాసిన / రాస్తున్న రచయిత. తెలుగు సాహిత్యంలో ప్రముఖురాలు. అంతే! ఇష్టమున్నవారు చదువుకోవచ్చు. చదివి.. ఆవిడ రచనలు, అభిప్రాయాలు నచ్చకపోతే.. ఎందుకు నచ్చలేదో విమర్శనాత్మకంగా రాసుకోవచ్చు. నచ్చితే మెచ్చుకోవచ్చు (ఈ టపా మాదిరిగా).

      'రంగనాయకమ్మని నేను చదవలేదు.' అని మీరే చెబుతున్నారు. మంచిది. రంగనాయకమ్మని, ఆవిడ విషవృక్షాన్ని చదవకపోతే కొంపలేమీ మునిగిపోవు. అయితే ఒక ధర్మ సందేహం. చదవకుండా.. ఆవిడ గూర్చి.. 'మగవాళ్ళంటే అసహ్యం.. ', 'వీక్నెస్ ని కేష్ చేసుకోవడం.. ', 'తన చుట్టూ వలయం గీసుకోవడం.. ' లాంటి అభిప్రాయాలకి ఎలా వచ్చారు?!

      Delete
    6. He might had read it but pretending as not read.

      Delete
    7. ఆవిడ మిగతా రచనలు చదవలేదని నేనలేదే? :-)

      Delete
    8. @DG,

      రంగనాయకమ్మ మిగతా రచనలు చదివి మీరు ఆ అభిప్రాయానికి వచ్చారని అనుకోలేదు. మీ కామెంట్ సరీగ్గా అర్ధం చేసుకోలేకపొయ్యాను. వెరీ సారీ!

      Delete
  4. మీరీ మధ్య చిన్న చిన్న టపాలు వ్రాస్తున్నారు. కొన్ని పై పైన వ్రాస్తున్నారు.ఇవికూడా బావున్నాయి. మీ పుణ్యమా అని రంగనాయకమ్మ గారి వ్యాసాలు అందుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. అవును. మీ అబ్జర్వేషన్ కరెక్ట్. నా చిన్న టపాలకి ప్రధాన కారణం.. టైం దొరక్కపోవడం. ఇంతకు ముందు నిద్ర పట్టక రాసేవాణ్ని. ఇప్పుడు నిద్రమాత్రలు బానే పని చేస్తున్నాయి. అంచేత లాప్ టాప్ ముందుండే సమయం తగ్గిపోయింది. నాకు పగలు రాసే అవకాశం లేదు (అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు రాస్తుంటాను.. ఇవ్వాళ రాసినట్లుగా). అంచేత.. బ్లాగ్ దుకాణం మూసెయ్యడం ఇష్టం లేక.. ఏదో ఇలా బుల్లి పోస్టులతో బండి లాగిస్తున్నాను.. ప్రస్తుతానికి.

      Delete
  5. డీ జీ గారు,

    రామాయణం రంగ నాయకమ్మ గారు విష వృక్షం అనడం లో తప్పేమి ఉన్నది? తెలియజెయ్యండి దాన్ని నిరూపించడానికి మూడు భాగాల పేపరు ఖర్చు కూడా ఐనది. అప్పట్లో అది ఒక 'విప్లవాత్మక' రచన.

    ఈ కాలం లో రాసి ఉంటే మరో తూచ్ సీరియల్ ఐ ఉండే దేమో కూడాను (విజ్ఞత కాలము బాయగన్ పెరుగు నని బ్లాగ్వెత!)


    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      'విరసం' ప్రచురణల పట్ల రంగనాయకమ్మ అభ్యంతరాలతో నేను ఏకీభవిస్తున్నాను. అలాగే.. తీవ్రపదజాలంతో ఆవిడ 'విరసం'ని విమర్శించిన తీరు నాకు నచ్చింది. ఈ టపాతో రంగనాయకమ్మ విషవృక్షానికి సంబంధం లేదు.

      (అయితే.. 'విరసం' తీరు గూర్చి ఎవరూ కామెంటలేదు!)

      Delete
    2. Regarding Virasam, I had read her criticisms only on SriSri and Varavararao. So, I can discuss about the both.

      Delete
    3. రంగనాయకమ్మ విషవృక్షాన్ని రాయనీ, దాన్ని ఎంతోమంది చదవనీ గాని, రామాయణాన్ని ఎంతో ఇష్టపడతారని తెలిసి కూడా బాపు కి రివ్యూ కి పంపడం తప్పు. అది ఊరకుండిన వ్యక్తుల్ని రెచ్చగొట్టడమే. అవసరమా? ఇలాంటి చర్యల వల్లే ఆమెని చాలామంది వ్యతిరేకిస్తారు. భావాప్రకటన స్వేఛ్చ మనవరకే. మరొకర్ని మన పరిధి లోకి బలవంతంగా లాగకూడదు కదా. విషవృక్షాన్ని చదివి తనంత తానుగా బాపు ఎక్కడైనా రివ్యూ రాసుంటే అది ఆమెకి,ఆమె పుస్తకానికి గౌరవంగా ఉండేది.

      Delete
    4. @kiranmayi,

      1.రంగనాయకమ్మ తన విషవృక్షాన్ని 'రివ్యూ' కోసం బాపు దగ్గరకి పంపలేదు.

      (సాధారణంగా ప్రముఖ చిత్రకారులకి పుస్తకం ముఖచిత్రం వెయ్యడానికి డమ్మీ కాపీ పంపబడుతుంది.)

      2.విషవృక్షం మొదటి భాగం 1974, రెండో భాగం 1975, మూడో భాగం 1976 లలో పబ్లిష్ అయ్యింది. అప్పటికి బాపు వృత్తిరీత్యా పత్రికల్లో కథలు, నవలలకి.. పుస్తకాలకి ముఖచిత్రాలు గీసేవాడు. వారి రామభక్తి పరంపర చిత్రాలు అప్పటికింకా మొదలవ్వలేదు. కావున బాపు రామభక్తి గూర్చి అందరికీ తెలిసే అవకాశం లేదు.

      (ఆ విషయం తెలీని రంగనాయకమ్మ బొమ్మ గీయించుకోడానికి చెక్ పంపగా.. బాపు గియ్యనని చెప్పకుండా.. చెక్ వెనుక 'రామరామ' అంటూ రాసి పంపాడు. నాకు గుర్తున్నంతమటుకు నే చదివింది ఇది. మీదగ్గర వేరే సమాచారేమన్నా ఉంటే తెలుపగలరు.)

      3.బాపురమణలతో రంగనాయకమ్మకి వ్యక్తిగత శత్రుత్వం గానీ.. బాపుని రెచ్చగొట్టేంత తగాదా గానీ ఉన్నాయనుకోను. తన ఇంట్లో పెళ్ళికి రంగనాయకమ్మని పిలవడానికి భార్యతో కలిసి వెళ్ళానని రమణ తన 'కోతికొమ్మచ్చి'లో రాసుకున్నాడు. రంగనాయకమ్మ కూడా ఎక్కడా వారిపట్ల చెడ్డగా రాయగా నేను చదవలేదు.

      4.రమణ రాసిన రివ్యూలు నేను చాలా చదివాను. చాలా చాలా సరదాగా ఉంటాయి. ఆ రోజుల్లో తన భాషతో రమణ తెలుగుదేశాన్ని ఉర్రూతలూగించాడు. బాపు రివ్యూలు రాసినట్లు నాకు తెలీదు. మీ దృష్టిలో ఏమన్నా ఉంటే తెలియజేయగలరు.

      Delete
    5. రివ్యూ కాదులెండి ముఖచిత్రం కోసమే ఐనా బాపు ఆ నవలని చదవాలి కదా. నవలాకారులు చిత్రకారులకి తమ రచనలు పంపేముందు వారి నేపథ్యం తెలీకుండానే పంపరు కదా. విషవృక్షానికి ముందు బాపు వేసిన ఏ ఒక్క చిత్రం లోనూ రామభక్తి కనపర్చలేదేమో మరి నాకైతే తెలీదు, నా దగ్గర సమాచారమేది లేదు. బాపు చిత్రాలు cronological ఆర్డర్ లో చూద్దామని గూగుల్ లో ప్రయత్నించాగాని నాకు దొరకలేదు.

      రెచ్చగొట్టడం అంటే ఇక్కడ అవతలి వ్యక్తీ ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడి అతని ప్రతిస్పందన కోసం ఎదురుచూసే కుతూహలం లాంటిది అని. ఉదాహరణకి మీ నాన్నగారు-ఎన్టీఆర్ టపాలో మాదిరి. నేను విన్నంతమటుకు రంగనాయకమ్మ ఇదే చేసారని. కాక, ఆమె నిజంగానే బాపు గురించి ఏ మాత్రం తెలీకుండానే చెక్ పంపి ఉంటె సరే. ఇక బాపురమణలది ఎవరితోనూ తీవ్రంగా differ అయ్యే మనస్తత్వం కాదని అందరికి తెలుసు.

      Delete
  6. మతగ్రంథాలలో ఎన్ని పొంతన లేని విషయాలు ఉంటాయని తెలిసినా వాటిని నమ్మేవాళ్ళు ఉంటారు. బైబిల్‌లో "భూమి బల్లపు పరుపుగా ఉందనీ, అది స్థంభాల మీద నిలబెట్టబడి ఉందనీ" వ్రాసి ఉందని తెలిసినా కూడా బైబిల్‌ని నమ్మేవాళ్ళు లేరా?


    ReplyDelete
  7. ప్రవీణు,

    బైబిల్ ని నమ్మారు కాబట్టి మనం కూడా రామాయణం లో ఏమి ఉన్నా నమ్మాలా ? రామాయణ విష వృక్షం ఇదే కదా చెబ్తోంది కూడాను?

    జిలేబి.

    ReplyDelete
  8. చూడబోతే ఈ రంగనాయకమ్మకు ఏమీ పని లేనట్టుంది. విరసం వాళ్ళు ఏవో పుస్తకాలు ప్రచురిస్తే దాంట్లో తప్పేంటి అట? ఆ రచయిత మీద అభిమానంతో ఆయన రాసినవి అన్నీ వెలుగులోకి తీసుకొచ్చారు. తమ సిద్ధాంతాల కళ్ళజోడు తో చూడకుండా ఆ రచయిత సాహిత్యాన్ని అంతా వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరికి కావల్సింది వాళ్ళు తీసుకోండి. అసలు నాకు ఒకటి అర్ధం కాదు. ఒక రచయిత రాసిన పుస్తకాలు అన్నీ ఒకే మూసలో ఉండాలని ఎందుకు అనుకుంటారు? అసలు వీళ్ళు ఎవరు ఏది తుక్కు ఏది గొప్ప అని తేల్చటానికి. ఏదో ఒకటి ఎవరో ఒకర్ని తిట్టాలి ఎప్పుడూ వార్తల్లో ఉండాలి అని తప్ప దీనివల్ల ఏంటి ఉపయోగం? ఒకప్పుడు నామినీ, ఒకప్పుడు విరసం, ఒకప్పుడు బాపు ఇంకోసారి ఇంకెవరో... ఎవరైతే ఏంటి ప్రతిసారి ఒక అర్ధం లేని గొడవ. అసలు వీళ్ళు చేసిన రచనల వలన సమాజానికి ఏం ఒరిగింది? ఆమె రచనల వల్లనే నాకు కమ్యూనిజం అంటే ఏంటొ తెలిసింది, నాకు పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటొ తెలిసింది. సరే తెలిసింది.. తెలుసుకుని ఏం చేసావ్? బ్లాగుల్లో పదిమందితో వాదన చేసావ్.. ఏంటి ఉపయోగం? సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించే వాళ్ళకు ఎదో ఒక రచయితను పిచ్చిగా అభిమానించేవాళ్ళకు పెద్ద తేడా ఏం లేదు. కో.కు. అనే పెద్దమనిషి తాత్వికత గురించి ఏదో రాసాడనుకుందాం. సరే అది తుక్కు అనే అనుకుందాం. అది చదివిన వాడికి అది ఎలాగూ తెలుస్తుంది అది ఏంటొ. అసలు అవి ప్రచురించటమే తప్పనీ ఏవో పిచ్చి గొడవలు. సినిమా వాళ్ళు తమ సినిమా ప్రమోషన్ లో భాగంగా వివాదాలు సృష్టించటం పరిపాటి. ఇక్కడ కూడా లాలూచీలు పడి లేని వివాదాలు నటిస్తున్నారా ఏంటి? నా వరకు నాకైతే ఆమె రాసిన దాంట్లో పూర్తిగా ఒక అర్ధం లేని అహంకారమే కనపడింది. చర్చ ముగిసింది అట. ఏంటి ఆ మాట?అలాంటి అహంకారులను నేనైతే అభిమానించలేను. ఆవిడ విషవృక్షం రాసిందా కల్పవృక్షం రాసిందా అనే దాంతొ ఏ సంబంధం లేకుండానే..

    ReplyDelete
  9. Varavara Rao had compared Marxism with Sufism though the both are different and opposite poles. Swecha kosam porade karmika varga viplavakarulni unnavi koodaa vadulukune sufi sannaasulatoa polchaadu Varavara Rao. What's wrong in criticising those idiots?

    ReplyDelete
    Replies
    1. ప్రవీణులవారూ, దయచేసి అపార్థం చేసికోరని భావిస్తూ ఒక మాట చెప్పదలచాను. తెలుగు బ్లాగుల్లో అత్యవసరం అయితే తప్ప ఆంగ్లలిపి మరియు ఆంగ్లభాషల వాడకం చేయకుండా ఉంటేనే శోభస్కరంగా ఉంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా మీరు చక్కని తెలుగులో మీ వ్యాఖ్యలు ప్రచురించగలరు కూడా. ఆంగ్లంలో వ్రాస్తే అదేదో శంఖుతీర్థం వంటిదనే అపోహ మీకు లేదనే విశ్వసిస్తున్నాను.

      Delete
    2. It is difficult to type Telugu on phone and I am not a native English speaker. Even Bharadwaj has same experience with phones. Now I am experiencing the same difficulty.

      Delete
    3. @kiran,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      'చర్చ ముగిసింది.'తో రంగనాయకమ్మకి సంబంధం లేదనుకుంటున్నాను. అది 'వివిధ' పేజి నిర్వాహకుల నోట్. గమనించగలరు.

      Delete
    4. I also have problem with English morphology that is very different from Telugu morphology. So, some times I write Telugu sentences in English script.

      Delete
  10. విరసం కి ఇంతమంది అభిమానులు ఉన్నారని ఈ టపా చర్చ చూసేవరకు తెలియదు. ఈ మధ్యే యండమూరి తులసిదళం వ్రాసి తప్పు చేసినట్లుగా ఒప్పుకొన్నారు. ఆవిధంగా చూస్తె విరసం చేసినది కూడా ముమ్మాటికీ తప్పే. ఏది చెత్తో అందరూ చదివి తెలుసుకోనేవాల్లయితే , ఈ చర్చ అస్సలు అవసరం లేదు. అంత తెలివైన ప్రజలకయితే సినిమాలకు సెన్సార్ బోర్డు కూడా అక్కర్లా.

    ReplyDelete
  11. ఈ మధ్య యండమూరి వ్యక్తిత్వ వికాసం అనే క్లాసులు నడుపుతున్నాడు. అందులో భాగనంగానే ఇలాంటి వాటిని ఆయన చెబుతున్నాడని అనిపిస్తోంది. యండమూరి ఒక రచయితగా తులసి దళం రాయడములో ఏమాత్రం తప్పు లేదు. అదో ఫిక్షన్, దానికి అభ్యంతరం చెప్పాల్సిన పనీలేదు. కానీ, ఎవరూ పట్టించుకోని తమ సిద్దాంతాన్ని ప్రచారములోకి తేవాడానికి .. ఇలా కొన్ని పాపులర్ అయిన వాటిని నిందించడం ఒక పద్దతి. రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం కూడా ఆకోవలోనిదే. ఆమె రాసే రాతలనే మరెవ్వరైనా రాసుంటే... ఆ రచయింతను అహంకారి అనో మరోటనో అనుండే వారు. అంతే కాదు, విమర్శించే పద్దతి ఇదేనా? మీది కేవలం గుడ్డి ద్వేషం మాత్రమే అనో, సంస్కారం లేదనో చెప్పేవారు. అది రంగనాయకమ్మ కావడముతో అభిమానులు పొగడ్తలు కురిపిస్తున్నారు. యధావిధిగానే మిగిలిన వారు చిరాకుగా పక్కన పడేస్తున్నారు. తాము చేస్తే సాహిత్య సేవ, నిశిత విమర్శ, పరులు చేస్తే మాత్రం గుడ్డి ద్వేషం, సంస్కార రాహిత్యం..!!

    ReplyDelete
  12. రమణ గారు,

    సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, రంగనాయకమ్మ వ్రాసినవి ఆవిడ పేరు లేకుండా ప్రచురిస్తే, మీ బ్లాగులో ఆ పేరు చూసి పరిగెత్తుకుని వచ్చే చెత్త ఆగిపోతుందని మనవి. ఏదో ఆవు వ్యాసం లా ఆవిడ పేరు చూస్తె విషవృక్ష భజన బాగా అతి అవుతోంది. లేదా ఒక డిస్క్లైమర్ అన్నా వుంచండి. ఉఫ్..

    మరీ మూర్ఖత్వం ఏంటి అంటే రంగనాయకమ్మ, విరసం చర్చలోకి బాపు ని దూర్చి పనికి మాలిన చర్చ చెయ్యడం. అప్పుడెప్పుడో బ్లాగుల్లో సీతకి వచ్చిన దుస్థితి , ఇప్పుడు బాపు గారికి కి ఉన్న దుస్తితి మరెవ్వరికీ లేదంటే నమ్మాలి.

    ReplyDelete
  13. తమ అభిమాన రచయిత్రి రంగనాయకమ్మ మీద ఒక్క విమర్శ రాగానే ఉడుక్కుని చెత్త రాతలు రాయడం కన్నా, హుందాగా విమర్శలను తీసుకుంటే బావుంటుందేమో కదండి. అసలు రంగనాయకమ్మ అనే పేరు తీసేయడం అనే మాట ఎలా ఉందంటే ... పురాతన కాలములో ఎవరో చేపల కొట్టు బోర్డు గురించి చేసే కామెంట్లలా లేదూ? బోర్డెందుకు స్మెల్ వస్తుంది కదా అన్నట్టు? ఏదేమైనా, పేరు తీసినా సరే స్మెల్ కచ్ఛితంగానే వస్తుందన్నది సత్యమేనేమో..!!

    ReplyDelete
  14. ఒక వ్యక్తీ సమగ్ర సాహిత్యం అందించడం లో తప్పు లేదని నా ఉద్దేశ్యం , అవి తమ సిద్దంతాలకి వ్యతిరేఖంగా ఉండవచ్చు. కాని అక్కడ ప్రచురణ ఉద్దేశ్యం అది కాదు కదా. కో.కు గారి సమగ్ర సాహిత్యం అందించడానికి ప్రయత్నించారే కాని , సంస్థ సిద్దాంతాలు విషయం లో రాజి పడలేదు , మార్పు లేదు. మిగతా వాళ్లకి అయిన గూర్చి పూర్తిగా అధ్యయనం చేయడం లో మాత్రం చాల ఎక్కువగా సహాయపడతాయి.
    రంగనాయకమ్మ గారి విమర్శలు ఎప్పుడు ఘాటు గా ఉంటాయి. ఆవిడ తన పాఠకుల గూర్చి రాసినప్పుడు కుడా గమనించవచ్చు.
    అడపా దడపా పేపర్ ల లో కుడా వస్తుంటాయి కాబట్టి, అందరకి తెలిసిందే.
    విషవృక్షం గురించి మాట్లాడటానికి ఏముంది. ఎంతో మంది ఇప్పటకి సమర్ధిస్తున్నారు, విమర్స్తిస్తున్నారు. ఆ పుస్తకం లో మొదటి కొన్ని పేజి లు ఒక ఎత్తు, మిగతా పుస్తకం అంతా ఒక ఎత్తు. కాని రామాయణాన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు ఇప్పటకి.
    రామాయణం ( జరిగిందో లేదో వేరే మాట ) కాలం నాటికి, కచ్చితంగా ఈ 'ఇజాలు ' లేవు. అప్పటి పరిస్థితులు కి , గత రెండు మూడు వందల సంవత్సరాలలో వచ్చిన కమ్యునిజం కి లింక్ ఎలా కుదురుతుందో ?,
    సమకాలిన అంశాల మీద జరిగే చర్చల్లో ఆవిడ అభిప్రాయాలు ఎక్కువగా కనబడవు. ఒకటి మాత్రం చెప్పుకోదగ్గది, ఆవిడ ధైర్యం, ముక్కుసూటి తనం కి జోహార్లు. శ్రమ గురించి , సమాజం గురించి నాకు బాగా అర్ధం అయింది విషవృక్షం చదివిన తరువాతే .

    దయచేసి ఒక disclaimer పెట్టండి,comment పెట్టేవాళ్ళ కి , తమ కామెంట్ ఇతరుల అభిప్రాయాలకి గౌరవం ఇచ్చేటట్టు ఉండాలని.

    చర్చ ఎక్కడైనా జరగాలి, తమకి ఇష్టం లేదని, ఇతరుల అభిప్రాయాలని ( అవి సంస్కారంగా ఉన్నంతవరకు ) గేలి చేసేటట్టు మాట్లాడటం మంచిది కాదు.

    ReplyDelete
  15. రంగనాయకమ్మ అభిమానులు ఎవరినా బ్లాగుల్లో ఉంది ఉంటె, ఇప్పటికే మూర్ఖ వాదనలకి విసిగి ఇలాంటి చర్చల్లోకి రావడం మానేసి ఉంటారు. ఏదో సామెత చెప్పినట్లు కనీసం ముందు వ్రాసిన వ్యాఖ్యతోనే పొంతన లేకపోతె ఎలా?

    ReplyDelete
  16. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. నేను రాసిన కామెంటు అక్కడే ఉంది. అందరూ రాసిన కామెంట్లు అక్కడే ఉన్నాయి. ఎవరిది మూర్ఖత్వమే చదివే వారు ఇట్టే పట్టేయగలరు. మరీ కష్టపడనక్కర్లేదు.

    ReplyDelete
  17. బాబూ అసలు ఎవరెవరి పేర్లు, అభిప్రాయాలు రమణగారు వ్రాయకూడ దో, వ్రాస్తే గుంపుగా వచ్చి న్యూసెన్సు చేస్తారో..అన్నవివరాలు ఒక్కచోట ఒక్కతపాలో వ్యాఖ్య వ్రాసి పడెయ్యండి అందరూ. జనాలకి ఇంకేం పనిలేదు వ్యాఖ్యల్ని చూసి జడ్జ్ చేస్తూ మెడల్స్ వేసిపోతారనుకోనేవాళ్ళు కూడా ఉంటారన్నమాట.

    ReplyDelete
  18. ఒక రచయిత విరసం సభ్యుడైనంత మాత్రాన ఆయన రాసిన ప్రతి చెత్తా ప్రచురించ వలసిన అవసరం లేదు. ముఖ్యంగా అది సదరు విరసం యొక్క భావాలకే వ్యతిరేకంగా వున్నపుడు. అలా ప్రచురించ వలసిన అగత్యం కూడా విరసానికి లేదు. ఆ విధంగా విరసం తీసుకున్న నిర్ణయం తప్పే. దాన్ని రంగనాయకమ్మ విమర్షించడం కూడా రైటే.

    సమగ్ర సాహిత్యం ప్రచురించాలని ఎటూ నిర్ణయం తీసుకొన్నప్పుడు ఆయన రాసిన అన్ని రచనలు ప్రచురించాల్సిందే. అలా కాదు, తమ భావాలకు కొన్ని అడ్డొస్తున్నాయి అనుకుంటే అప్పుడు వాటిని "ఏరిన రచనలు" అనే పేరుతో ప్రచురించాలి. అంతే కాని సమగ్ర సాహిత్యం అని చెప్పి, దాన్ని ఎడిట్ చేయడం సరికాదు. అది కామెంటేటర్లకి భయపడి హెడ్డింగు మార్చుకున్నట్టు వుంటుంది.


    ReplyDelete
  19. Yandamuri's disciple Kommuri had tried to prove that with craft is a reality and Yandamuri had published his disciple's introduction in his book itself. How do you think that Yandamuri had considered his novel as a fiction? And also we need not believe Ramayana just because it is a popular book. Chetabadulu levu kaanee devudu unnaadu anu amte nammaalaa?

    ReplyDelete
  20. సహజంగా రచన చేసినప్పుడు దాన్ని చదివిన వారు, దాన్ని గురించి చదివిన వారు వచ్చి కామెంటు చేయడం సహజమన్న సాధారణ సూత్రం తెలియని వారిని చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయలేం. కామెంట్లు రాయడం, రచణలు రాయడం, అభిప్రాయాలు పంచుకోవడం అనేవి సాహితీ రంగములో అతి సహజంగా జరిగే సాహిత్య ప్రక్రియ. విచిత్రమేమిటంటే, ఆ ప్రక్రియ అనేది టూ -వే స్ట్రీట్ లాంటిది. రాకపోకలు రెండువైపులా ఉంటాయి.

    ReplyDelete
  21. Chetabadulu levu kaanee devudu unnaadu anu amte nammaalaa?

    Don't believe it. Nobody forcing anyone to believe. The point is, just don't bother the believers. They have their right to believe it as far as science can't prove the existence or non-existence of it clearly.

    ReplyDelete
  22. Killing people and doing other things you mentioned are crimes as per Indian law, so proceed with that. Applying scientific definition to the belief it self a recognition of science. Let them do it. And all scientists need to do is to prove that they(so-called superstitions) are wrong. Let them prove it.

    If someone is not hurting anyone, and using superstitions purely for entertainment or excitement in fiction writings, nothing wrong in that. That's my point.

    ReplyDelete
  23. A person named Srinivasarao had gone mad after reading Tulasi Dalam. Ranganayakamma said that she had read Tulasi Dalam only after she had read the news about it.

    ReplyDelete
  24. Many persons wen mad after reading many marx writings, some of them even went to deep forest with a gun and occasionally come back to society to kill people in the name of justice. Everyone has their own superstitions.

    ReplyDelete
  25. Avu vyasam amte ide nayana. Deni gurimchi adiginaa meeru marxni chadivi ilaa ayyaaru amtuu marxni tidataaru.

    ReplyDelete
  26. దీన్ని ఆవు వ్యాసం అనరు నాయనా ... ఒక వేలును చూపిస్తున్న వారికి మిగిలిన నాలుగు వేళ్ళూ తమరినే చూస్పిస్తున్నాయి చూసుకోండి అని ప్రాక్టికలుగా చెప్పడం అంటారు. అర్థం అవడం లేదా? పక్క వారి అభిప్రాయాలలో ఏ లోపాలున్నాయని చెబుతున్నారో, అవే లోపాలు మీరు ప్రవచిస్తున్న సిద్దాంతములో నాలుగు రెట్లు ఎక్కువున్నాయని చూపించడం అంటారు. కావాలంటే ఒక సారి పైకెల్లి చదువుకో.. !!

    ReplyDelete
  27. మిత్రోత్తములారా,

    విరసం, రంగనాయకమ్మలపై చర్చ వాడిగా (వేడిగా కూడా) జరిగింది. అందరికీ ధన్యవాదాలు. చర్చని పొడిగించడంపై నాకు ఆసక్తి లేదు. ఇంక ఆపేద్దాం. సహకరించవలసినదిగా విజ్ఞప్తి.

    ReplyDelete
  28. రమణగారు, ఈ కామేంట్ ను ఎంతో సమయం తీసుకొని రాశాను. చర్చ ముగించినా దయచేసి ప్రచూరించంవలసినది గా విజ్ఞప్తి.
    _______________________
    ఇద్దరు శ్రీకాంత్ లు మరియు కిరణ్ అభిపాయాలతో ఏకీభవిస్తాను. విరసం ప్రచూరించటం వలన ఇతను ఇటువంటి వ్యాసాలు రాశాడని, తెలుగు సాహిత్య పుస్తకాలు ఈ మధ్యే చదవటం మొదలు పెట్టిన నాలాంటివారికి తెలుస్తుంది. లేకపోతే వాటిని చదవటం కొరకు అదే పనిగా ఎవరు ప్రయత్నించరు. రా వి శాస్త్రి పుస్తకాల కొరకు ప్రయత్నించాను, దొరకలేదు ప్రయత్నం విరమించాను.

    ఇక ఆమేకి అహంకారం ఉండకుడదు అని అంట్టున్నారు. దానితో మాత్రం విభేదిస్తాను. అహంకారం లేకుండా 99.9999% ఎవరు ఉండరు. మనుషులందరికి నమ్మిన విషయం పైన కాంఫిడేన్స్ ఉండాలి కూడాను. అది ఇతరులకు అహంకారం లా అనిపించవచ్చు. కొంతమంది వారిని అహంకారి అని విమర్సించవచ్చు. నిగర్వి లాగా నటించే వారి కన్నా వీళ్లు ఎంతో ఉత్తములు. ఆమే ఇప్పుడు ఏ కమ్యునిస్ట్ పార్టికి చెందిందో నాకు తెలియదు. రంగనాయక్కమ్మ గారి విషయం లో నచ్చనిదేమిటంటే కాలం చెల్లిన సిద్దాంతాని ఆవిడ ఇంకా నమ్మటమే కాక, ఆ సిద్దాంతం ఆధారం చేసుకొని పేపర్ లో వ్యాసాలు రాస్తారు. ఆమే దాదాపు అన్ని కమ్యునిస్ట్ పార్టిలను విమర్సిస్తూ రాస్తుంది. ఏ కమ్యునిస్ట్ పార్టి లు ఆమే సిద్దాంత పరమైన చర్చను ఆహ్వానిస్తున్నాయో తెలియదు. తెలుగు నాట ఎర్ర పార్టిల ప్రభ ఎంతో సన్నగిల్లింది. వ్యవస్థాగత పార్టిలకు ఉపయోగపడని విశ్లేషణల వలన ఎమీ ఉపయోగం లేదు. కమ్యునిజం ఒక సమూహ సిద్దాంతం, వ్యక్తిగత వాదం కాదు. జీవితంలో ఎవరైనా వాళ్లు నమ్మిన, నడచుకొనే విధంగా విశ్లేషిస్తే వారు ఫిలాసఫర్ కేటగిరికి వస్తారు.

    రంగనాయకమ్మ గారు రాసిన కొన్ని పుస్తకాలు చదివాను. ఆమే రాసిన వాటిలో బాగా గుర్తుండిపోయినది, విప్రనారయణ సినేమా గురించి రాసిన వ్యాసం. ఆమే మంచి నవల రచయిత్రి అని అభిప్రాయం. బలిపీఠం గురించి రాస్తూ హీరో పాత్ర ధారి తన జీవితం లో జరిగిన దానిని చెప్పగా ఆమే నవలగా రాశానని, ఆ తరువాత దానిని సినేమాగా తీశారని, ఆ సందర్భంలో అతడు డబ్బుల కోసం నిర్మాతలతో పేచిపెట్టాడని రాశారు. కొన్ని రోజుల తరువాత అతనికి చాలా పెళ్లిళు చేసుకొన్నాడన్న విషయం తెలిసిందని రాశారు. సాధారణ మనుషులలో వలే ఎన్నో లోపాలు ఉన్న వ్యక్తి చెప్పిన కథను విని,నమ్మి, తన రచనా సామర్థ్యంతో ఒక ఐడియల్ పాత్రగా చాల సమర్దవంతంగా సృష్టించారు. పాఠకులను కన్విన్స్ చేయటంలో రచయితగా ఆమే సత్తాను సూచిస్తుంది.

    "దెయ్యాల తత్వవేత్తని ఐన్‌స్టీన్ సరసనా, మార్క్సు సరసనా కూర్చోబెట్టడం కూడా చేశారు"
    ఈ మొత్తం వ్యాసం లో కొ కు గారిని మార్క్స్ సరసన చేర్చటం మాత్రం అంగీకార యోగ్యం కాదు. కొ కు గారిని వ్యక్తిగత జీవితం పైన విమర్శలు బ్లాగుల్లో చదవలేదు. మార్క్స్ గారి తరహానే వేరు. సంసార బాధ్యతను పెళ్లాం నెత్తిన వేసి, ప్రపంచం మారుద్దామని కలలు కనే సాహసం అతి కొద్దిమంది మాత్రమే చేయగలరు. కార్మికుల కనీస వేతనాల కొరకు పోరాడిన మార్క్స్ గారు, జీవితాంతం తన ఇంట్లో పనిచేసిన పనిమనిషికి జీతమే చెల్లించలేదు. పైగా భార్య తరపున ఇంట్లో పని చేయటానికి వచ్చిన ఆవిడతోనే పిల్లలను కన్నాడు. ఆయన కుటుంబం ఆరోజుల్లో రెండు రూముల గదిలో ఉండేది. ఆయన రోజు వారి జీవితం గురించి పాల్ జాన్సన్ రాసిన ఇంటేలేక్ట్యువల్స్ అన్న పుస్తకంలో ఈ క్రింది లైన్స్ చదివితే తెలుస్తుంది.

    "Marx leads the existence of a Bohemian intellectual. Washing, grooming and changing his linen are things he does rarely, and he is often drunk. Through he is frequently idle for days on end. he will work day and night tireless endurance when he has much work to do. He has no fixed time for going to sleep or waking up. He often tays up all night and then lies down fully clothed on the sofa at midday, and sleeps till evening, untrouble be the whole world coming and going through their room"

    Book name Intellectuals by paul johnson
    page no 77&79
    http://www.amazon.com/Intellectuals-Paul-Johnson/dp/0786100524

    వ్యక్తిగతం గా మార్క్స్ పైన నాకు కోపం లేదు. మనం గొప్ప వాళ్లమనుకొనే వారి అందరిలోను ఎన్నో లోపాలు ఉంటాయని చెప్పటమే నా ఉద్దేశం.

    ReplyDelete
  29. Dont talk rubbish about Marx. He married a woman 4 years older than him and the couple were forced to live away from their families. It lead to their poverty and hard life.

    ReplyDelete
  30. ఆహా ఇక్కడ జిలేబీలు మరీ వేడి అయి, 'వాడి' గా, వేడి గా మరీ మరీ రుచికరముగా మారుచున్నవి !

    వీటికి కారనంబైన ఆ నాయకమ్మ గారు వీటిని చడువునా !

    ఇక్కడ మరి కొంత వేడి జిలేబీలు వేయుటకు 'కా' 'మింటు' దారలు దారి చేసుకుని వస్తారా !


    జిలేబి
    (అయిన కార్యమును గంధర్వులే తీర్చినారు అనగ నేమి నారదా !)

    ReplyDelete
  31. పుస్తకం లో రాసింది చెప్పాను. నాదగ్గర ఉన్న పుస్తకం లోని పేజి నంబర్లతో సహా ఇచ్చాను కదా! ఆ పుస్తకం కొని తెలుసుకో! ఆ పుస్తకంలో ఆయన గురించి ఇంకా చాలా రాశారు. ఆయన సిద్దాంత, ఒప్పుకొన్న ఒప్పుకోక పోయినా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో మార్క్స్ ఒకడు అని ప్రత్యేకంగా ప్రస్థావించనక్కర్లేదు కదా! ఆయన పైన బురద చల్లటానికి, ఆయనేమి నా శత్రువు కాడు,నాకా ఉద్దేశంలేదు. అందువలన ఆయన గురించిఎక్కువగా రాయటం ఇష్టంలేక ఇక్కడ రాయలేదు.
    మార్క్స్ గారి గురించి ప్రజాశక్తి పబ్లిష్ చేసిన పుస్తకం చదివి, అంత గొప్ప వ్యక్తి కష్టపడి రాసిన సిద్దాంతం,ఆచరణలో ఎందుకు విఫలం అయ్యింది అని ప్రశ్న వేసుకొని, సమాధానల కొరకు వెతికే క్రమంలో ఒకప్పుడు కొన్ని పుస్తకాలు చదివాను. తెలుగు లో ఎవ్వరు మార్క్స్ గారి వ్యక్తిగత జీవితం పెద్దగా ప్రస్తావించరు. అందరు ఆయనను గొప్ప వ్యక్తి అని, పేద ప్రజలకొరకు పగలు రాత్రి కష్టపడిన వాడు అని పొగిడేవారే! సీత కష్టపడింది అని రాసే రచయితలు మార్క్స్ గారి భార్య కష్టాన్ని ఎక్కడా ప్రస్తావించినట్లు చూడలేదు. కొన్ని రోజుల తరువాత ఈ పుస్తకం కంట బడింది, కొని చదివాను.
    *********************************
    కొ.కు. గారి తరం వేరు నా తరం వేరు. ఆయన రాసిన తత్వ,రాజకీయ వ్యాసాల పుస్తకాలలో కొన్నింటిని చదివాను. ఇక్కడ ఆయన తరపున వాదనకు వకాల్తా పుచ్చుకోవటంలేదు. ఇక రంగనాయకమ్మ గారు పుస్తకాలు చదివితే రోజు వారి వ్యవహారాలలో ఆమే ఎంతో ప్రాక్టికల్,గ్రౌండ్ రియాల్టి తెలిసిన గట్టి మనిషి అని ఇట్టే తెలిసి పోతుంది. ఆమే రాసే మార్క్సిస్ట్ సిద్దాంతం కన్నా రోజు వారి వ్యవహారాలలో ఆమే వ్యవహరించే తీరు, ఆమే పుస్తకాలు చదివిన పాఠకులకు చాలా ఉపయోగపడతాయని అనిపిస్తుంది.

    ఇప్పటికే ఎక్కువగా రాశాను. ఇంతకు మించి చెప్పటానికి నాదగ్గర ఎమీలేదు. ఎవరి వైనా మనోభావాలు దెబ్బతింటే వారికి, వాటిని తట్టుకొనే మనోధైర్యం వాళ్ళు నమ్మిన సిద్దాంతం వాళ్లకు ఇవ్వాలని ప్రార్దిస్తూ,నా వ్యాఖ్యలను ప్రచూరించిన రమణగారి మరొక్కసారి థాంక్స్ చెప్పుకొంట్టు ...

    About Mr. Paul johnson,
    a former adviser to British Prime Minister Margaret Thatcher, was awarded the Presidential Medal of Freedom by President George W. Bush in 2006. His many books include Modern Times; Intellectuals; A History of the American People; and his memoir, The Vanished Landscape: A 1930s Childhood in the Potteries. His latest book is a biography of Brititsh Prime Minister Winston Churchill titled Churchill.

    ReplyDelete
    Replies
    1. మార్క్స్ గారి గురించి ప్రజాశక్తి పబ్లిష్ చేసిన పుస్తకం చదివి, అంత గొప్ప వ్యక్తి కష్టపడి రాసిన సిద్దాంతం,ఆచరణలో ఎందుకు విఫలం అయ్యింది అని ప్రశ్న వేసుకొని

      .........

      వ్యక్తి కష్టపడి రాసిన సిద్దాంతం,
      Simple, if some one works hard, it doesnt mean he should be true :-).

      సిద్దాంతం = hypothesis.

      If some one gives some explanation, it doesn't mean it i outright correct, సిద్దాంతం means, a possible and looks plausible explanation, but it just a imagination untill it proved right.

      Marx assumed that in his theory of value, the value of an object is how much effort people put to create it. It may be right in his own personal perspective, but how much effort is not a measurable function.

      Secondly, his assumption is wrong, market determines the value of an object usually, so Marx సిద్దాంతం based on false assumption and also false reasoning, hence his theory is false, and thats why it failed.

      This explanation is for his Economic Theories only. (People tried to prove Marx was right, a sect of economists called Analytic Marxists, but soon or later they couldn't do so, hence that sect slowly gone).

      Delete
  32. This comment has been removed by the author.

    ReplyDelete
  33. Samaajam kante vyakti adhikudu ani cheppi marxism ni vyatirekinche vaalla sangati cheppandi mundu. migita kaburlu taruvaata.

    ReplyDelete
  34. కష్టపడి రాసిన సిద్దాంతం,ఆచరణలో ఎందుకు విఫలం అయ్యింది
    _________________________________________________________________

    Simple - that jerk was myopic.

    He didn't know anything beyond the concept of industrial economy.

    As of that communist manifesto, he called the capitalists characterless, but he himself ended up impregnating his maid.

    When one does not follow what one preaches, thats whatz gonna happen!

    ReplyDelete
  35. Most of the capitalists do not talk about the chastity of Marx. Read all of the American anti-communist websites. They cry only about individual freedom.
    But Indian anti-communists are not even experts in such type of stereotypical propaganda.

    ReplyDelete
  36. తార & మలక్,
    ఆర్ధిక వేత్తగా మార్క్స్ విశ్లేషణలలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆయన తన సిద్దాంతం కనుగుణం గా డేటాను ట్విస్ట్ చేశాడు. వీటిని గురించి తెలుసు కూడాను. ఇంతకు మునుపు మార్క్శ్ భారతదేశం పైన చేసిన విశ్లేషణల లోని లోపాలను, అతని అవగాహనా రాహిత్యాన్ని శ్రీకాంత్ బ్లాగులో రాశాను. మీరు చూసే ఉంటారు. నాకు ఆర్ధిక శాస్త్రం అంటే ఎంతో ఇష్టం. చాలా పుస్తకాలు చదివాను. దూరపు కొండలు నునుపు సామేత తెలిసినదే. మన తెలుగు వారంతా ఆయనోక మహాను భావుడు, మచ్చలేని మనిషిగా అనుకొంటారు. వ్యక్తిలోను,అతను ప్రవచించిన సిద్దాంతం లో ను, అనుసరించిన మార్గంలోను సమస్యలు ఉన్నాయి కనుకనే రష్యా చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వలు పతనమైనాయి .

    ReplyDelete
  37. Even capitalism had failed. Why does India has only 30% urbanization while the urbanization is one of the salient features of capitalism?

    ReplyDelete
  38. >>Simple - that jerk was myopic

    Nope, first of all, as Economic Theory is concerned, he is not a jerk or myopic, he is a visionary.

    >>He didn't know anything beyond the concept of industrial economy.

    Nope, he worked very less in Industrial Organization, most of his work was on Theory of Value. (Surplus Theory of Value).

    >> ఆయన తన సిద్దాంతం కనుగుణం గా డేటాను ట్విస్ట్ చేశాడు.

    Nope, he never worked on theories which needed data, he is the first person to use advanced mathematics in his work (arguably first Economist to do so, which inspired generations of Economists to use such techniques, eventually such technique proved that he was wrong).

    And for the same reason people call him Visionary, except this, his contribution to Economic Theory is nothing substantial.

    >>ఇంతకు మునుపు మార్క్శ్ భారతదేశం పైన చేసిన విశ్లేషణల లోని లోపాలను,

    I dont know any thing about non Economics part, so I am completely unaware of his non Economic opinions and political or religious beliefs.

    To clarify more, I need to write a small para about brief history of Economic Theories, its been pending from few years, I will write that in post about John Nash, hopefully in the next month :-)

    ReplyDelete
  39. http://www.thedailyshow.com/watch/tue-april-2-2013/jonathan-sperber

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete

comments will be moderated, will take sometime to appear.