Wednesday, 24 April 2013

మనుషులు - మమతలు


అవి మేం చదువుకునే రోజులు . ఆ రోజుల్లో 'బీజీస్' అనే పేరుతో పాటలు పాడే ఒక గ్రూప్ చాలా పాపులర్. వాళ్ళ పాటల్ని మేం శ్రద్ధగా ఫాలో అయ్యేవాళ్ళం. బీజీస్ మ్యూజిక్ తో 'సాటర్డే నైట్ ఫీవర్' అనే సినిమా వచ్చింది. హడావుడిగా బెజవాడ లీలామహాల్లో వాలితిమి.

ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే మాకు బెజవాడే గతి. ఇంగ్లీషు సినిమాలు గుంటూరుకి తాపీగా, అరిగిపోయిన రీళ్లతో.. ఉరుములు, మెరుపుల రీరికార్డింగుతో వచ్చేవి. ఆ స్పెషల్ ఎఫెక్టుల్ని తట్టుకోలేని మేం బెజవాడ పొయ్యి మరీ నవరంగ్, లీలామహల్ మరియూ ఊర్వశిని పోషించేవాళ్ళం.

బీజీస్ మ్యూజిక్ కోసం 'సాటర్డే నైట్ ఫీవర్' కి వెళ్ళిన మమ్మల్ని.. ఆ సినిమా హీరో జాన్ ట్రెవోల్టా తన నడుం ఊపుడు డ్యాన్సులతో పిచ్చెక్కించాడు. దాంతో ఆ సినిమాని అలవోకగా మూడుసార్లు చూసి పడేశాం. పిమ్మట జాన్ ట్రెవోల్టా నటించిన తదుపరి చిత్రం 'గ్రీజ్' కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాం.

ఈ లోపు ఏదో పని మీద మద్రాస్ వెళ్లాను. అక్కడ 'గ్రీజ్' ని బ్లూ డైమండ్ లో ఒకేరోజు మూడుసార్లు చూసేశాను. ఎలాగనగా.. ఆ హాల్లో ఒకే సినిమా వరసగా, ఆపకుండా వేసేస్తుంటారు. మనం ఎప్పుడైనా లోపలకి వెళ్ళొచ్చు.. వెళ్లిపోవచ్చును కూడా. ఆ విధంగా ఒకే టికెట్టుతో 'గ్రీజ్'ని మూడుసార్లు గిట్టించితిని. తరవాత అదే 'గ్రీజ్'ని స్నేహితులతో కలిసి బెజవాడలో యధావిధిగా మళ్ళీ చూసి.. నా విద్యుచ్ఛక్తి ధర్మాన్ని.. సారీ.. నా విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించితిని.


మీ కోసం అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాలు కలిసి పాడుతూ (వాళ్ళిద్దరూ గాయకులు కూడా) నటించిన యూట్యూబ్ పాట ఇస్తున్నాను. చూసి తరించండి. అన్నట్లు ఈ పాట సినిమా చివర్లో వస్తుంది.




ఇప్పుడు నా మనసంతా భారంగా అయిపోయింది. 'గ్రీజ్' నా జీవితంలో అత్యంత ముఖ్యమైన దినాల్లోని ఒక తియ్యని జ్ఞాపకం. ఈ పాట చూస్తుంటే నాకు నా మెడిసిన్ చదువు, నా మైసూర్ కేఫ్ ('మైసూర్ కఫే' అనినచో నా జ్ఞాపకాల్లో తేడా వచ్చును) రోజులు గుర్తొస్తాయి. అలివియా న్యూటన్ జాన్ అందానికి మూర్చపోయిన నా స్నేహితుడు.. ట్రెవోల్టా డ్యాన్సుని ప్రాక్టీస్ చెయ్యబోయి నడుం పట్టేసిన ఇంకో స్నేహితుడు గుర్తొస్తాడు. ఇప్పుడు కొద్దిసేపు 'గ్రీజ్' ని పక్కన పెడదాం.

మొన్ననే ఓ గెస్ట్ హౌజ్ లో మా క్లాస్మేట్స్ పార్టీ జరిగింది. విదేశాల్లో స్థిరపడ్డ మిత్రులు మాతృభూమికేతెంచినప్పుడు ఇట్లాంటి జన్మభూమి పార్టీలు జరుపుకుంటుంటాం. నాకీ పార్టీలు చాలా ఎనెర్జీనిస్తాయి. ఒకప్పటి మా హార్ట్ త్రోబ్ లు, బ్రోకెన్ హార్టుల గూర్చి కబుర్లు.. ప్రేమగా తిట్లు.. ఇవన్నీ వింటూ.. ద్రవపదార్ధాలు సేవిస్తూ.. ఓ ముప్పైయ్యేళ్ళు వెనక్కి వెళ్తాం. చిత్రంగా మధ్యలో జరిగిపోయిన ముప్పైయ్యేళ్లు మర్చిపోతాం. ఐదేళ్ళపాటు ఒక ప్రొఫెషనల్ కోర్స్ కలిసి చదువుకుని.. తరవాత విడిపోయి.. కొన్నాళ్ళకి కలుసుకున్న స్నేహితులందరికీ ఈ భావనే ఉంటుందా!?

నా క్లాస్మేట్స్ ని కలుసుకోడంలో నాకెందుకంత ఆనందంగా ఉంటుంది? వాళ్ళ కంపెనీ అంత ఉత్సాహాన్ని ఎందుకిస్తుంది! మానవ మేధస్సు కంపార్టమెంటలైజ్ అయ్యుంటుంది. ఒక వ్యక్తి, ప్రదేశం, సంఘటన.. మన మదిలో అనేక ఇతర విషయాలతో కలగలసిపోయి ఒక పెద్ద పెయింటింగ్ లా ముద్రించుకుని ఉంటుంది. ఇదోరకమైన పావ్లావ్ కండిషనింగ్. చిన్ననాటి స్నేహితుల ముఖాలు, వారి మాటలు.. మనని ఆటోమేటిగ్గా గతంలోకి తీసుకెళ్తాయి. అందుచేతనే మన వయసు.. టైమ్ మిషన్లో వేసి తిప్పినట్లు.. తగ్గిపోతుంది.

ఇందుకు ఇంకో ఉదాహరణ నా సినిమా అనుభవాలు. ఈ విషయంపై "సప్తపది (నా సినిమా జ్ఞాపకాలు)" అంటూ ఇంతకు ముందు ఓ టపా కూడా రాశాను. నాకు నా స్నేహితులతో సినిమా చూడ్డమే ఒక గొప్ప అనుభూతి. అది అత్యంత చెత్త సినిమా అయ్యుండొచ్చు. అసలిక్కడ సినిమా ముఖ్యం కాదు. అది కేవలం ఒక వెహికల్ మాత్రమే. ఒక సినిమా జ్ఞాపకం.. దానితోపాటు అనేక ఇతర జ్ఞాపకాల్ని లాక్కొస్తుంది. ఈ జ్ఞాపకాల కలనేత ఒక మధురానుభూతి.

ఇప్పుడు మళ్ళీ 'గ్రీజ్'లోకి వెళ్దాం. ఆ రోజుల్లో అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాల మధ్య తీవ్రమైన ప్రేమ వ్యవహారం నడిచిందని మా రావాయ్ గాడు చెప్పేవాడు. వాడికి సినిమావాళ్ళ మధ్య ప్రేమలు, స్పర్ధల పట్ల అమితాసక్తి. అసలిట్లాంటి కబుర్ల కోసమే ఆ రోజుల్లో 'స్టార్ డస్ట్' లాంటి మేగజైన్లు ఉండేవి.

సరే! ఇప్పుడీ విడియో చూడండి. మా క్లాస్మేట్స్ మీటింగు లాగానే మన జంట కూడా ఏదో సందర్భంలో కలుసుకున్నారు. చాలా రోజుల తరవాత ఇట్లా కలుసుకుని ఆనందపడిపోయ్యే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుంది.





దశాబ్దాల తరవాత కూడా అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాల కళ్ళల్లో ఎంత ఆనందం.. ప్రేమ! తమకెంతో ఇష్టమైన పాట పాడుకుంటూ 'గ్రీజ్' రోజుల్లోకి వెళ్ళిపొయ్యారు. దటీజ్ నోస్టాల్జియా! ఇందాకట్నుండి నే చెప్పే పాయింట్ ఇదే!

(photo courtesy : Google)

16 comments:

  1. Replies
    1. thank you!

      (బ్లాగర్లకి మన ముసిలాళ్ళ గోల అర్ధమైనట్లు లేదు!)

      Delete
  2. sir,
    intaki indulo emicheppaaro ardam kaledu
    aananda nilayamto poliste chappaga vundi

    G Ramesh Babu
    Guntur

    ReplyDelete
    Replies
    1. డియర్ రమేష్,

      ఈ టపాలో నేను ఏమీ చెప్పలేదు. ఒకప్పుడు నాకెంతో నచ్చిన సినిమా గూర్చి రాశాను. ఆ హీరోహీరోయిన్లు కలిసి మళ్ళీ పాడిన విడియో నాకు బాగా నచ్చింది. ఈ రెంటిని కలుపుతూ కొంత సొంత గోల రాసుకున్నాను. మీ వయసు రీత్యా.. మీకు డెబ్భైల గూర్చి తెలీదు కావున.. ఈ టపా చప్పగా, విసుగ్గా అనిపించి ఉండొచ్చు. అంతే!

      Delete
  3. ఏమిటో,

    ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదే కామోసు !

    నోస్టాల్జియా లో కెళితే ఇక ఆనంద నిలయం వైకుంటం అవక మానదా!!!



    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. వర్తమానం నీరసంగా ఉన్నవాడికి గతమే వైకుంఠం!

      Delete
  4. guruvu garu naaku oka vishayam ardham ayindi meeru balyaanni baagaa enjoy chesaru

    ReplyDelete
    Replies
    1. అవునా!? బాల్యాన్ని కంపేర్ చెయ్యడం కుదర్దు. కాబట్టి ఎక్కువ తక్కువలు ఉండకపోవచ్చు.

      ఇక్కడ మీకో విశేషం చెప్పాలి. మా చిన్ననాటి స్నేహితులం.. 'Brodipet Gang' ని (e-mail group, Facebook group) "BEE GEES" గా పిలుచుకుంటున్నాం.

      Delete
  5. మీరు ప్రస్తావించిన వ్యక్తులెవరూ నాకు తెలియదు.
    కాని nostalgia, contrast నచ్చాయి.
    మన సినీ పండగలలో నాగేశ్వరరావు, జమున లాంటి వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళ పాత సినిమాలు గుర్తుకొస్తాయి.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      Performance by the original artistes is always a treat to watch. మనం అలా తెలుగులో ఊహించుకోవటం కష్టమేమో!

      I just watched Robert Plant of Led Zeppelin performing 'black dog'. He is 60+ now. But still too good. That is nostalgia!

      Delete
  6. Simple yet beautiful post, as usual. For this reason I got addicted to your blog and before opening Koodali, I peep into your blog to check if you have any new post for that day. Keep going sir !

    ReplyDelete
    Replies
    1. thanks for the nice words. i'll try my best.

      Delete
  7. డాట్టరు గారూ, మీరిక్కడ కొత్త టైపు పావ్లావ్ కండిషనింగ్ create చేసారు.. మీ బ్లాగు (మీ CR/CS), మా కామెంట్లు (UR/US) :)

    ఊర్వశి లో ఇంగ్లీష్ సిన్మాలు తక్కువ వచ్చేవి. లీలామహల్, నవరంగ్ లో ఎప్పుడూ ఇంగ్లీష్ సిన్మాలేవచ్చేవి.

    ఐతే లీలమహల్ పాత బస్టాండ్ ఎదురుగ్గా వుండటంతో బస్సుల కోసం వైట్ చేసే ఫ్లోటింగ్ జనాలు ఎక్కువొచ్చేవాళ్ళు.. దాంతో కొంచెం మురికిగా వుండెది..

    నవరంగ్ మాంచి క్లాస్ గా వుండేది. నవరంగ్ లో వాడే రూం ఫ్రెష్నర్ చాలా బాగుండెది. మావోడొకడు ఆ సెంటు వాసన కోసం ఎప్పుడూ నవరంగ్ పోదామనేటోడు

    ఇక సమోసా ఐతే నవరంగ్, ఊర్వశి బెస్ట్..
    నవరంగ్ పేరు వింటే సమోసా ఘుమ ఘుమ (జై పావ్లావ్)

    ఇక కుర్ర కారు కోసం వెర్రి సిన్మాలు పాడుబడ్డ థియేటర్లలో వచ్చేవి. మంగళగిరిలో ఒక థెయేటరుండెది గుర్తు రావటంలే..

    ReplyDelete
    Replies
    1. ఊర్వశి మన కోస్తాలో మొదటి 70mm theatre. అందులో 'మెకన్నాస్ గోల్డ్' చూసి అద్దిరిపొయ్యాను. ఊర్వశిలో సినిమా చూసుకుని.. గాంధీనగరం రోడ్లంట సినిమా distribution offices చూసుకుంటూ.. రైల్వే station ప్లాట్ ఫాం మీద సినిమా స్టిల్స్ చూసుకుంటూ.. రైలు కోసం ఎదురు చూస్తూ.. ఆ రోజులు బాగానే గుర్తున్నాయి.

      నవరంగ్ గూర్చి చెప్పేదేముంది? మీ అభిప్రాయమే నాది కూడా. అన్ని 007 సినిమాలు అక్కడే (టైటిల్స్ మిస్ కాకుండా) చూశాను.

      Delete
    2. Mangalagiri antey srinivas mahal kaani gopala krishna kaani ayyundochu!

      Delete
  8. 'grease' ...
    still refreshing movie ...
    just enjoyable even now ...
    like you said - not for folks of the day ...
    thanks for the revival ...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.