ఇవ్వాళ 'హిందూ'లో గాయని శంషాద్ బేగం మరణవార్త చదివి ఆశ్చర్యపొయ్యాను. ఆవిడ ఇంకా ఉందని అనుకోలేదు. ఎప్పుడో చనిపోయిందనుకున్నాను. ఒక వ్యక్తి మరణం గూర్చి ఇంత దుర్మార్గంగా ప్రస్తావించడం తప్పే, క్షమించండి. సూర్యుడు పడమరన మాత్రమే అస్తమిస్తాడని తెలీకపోవడం, ఆ తెలీనివాడి తప్పే అవుతుందిగానీ, సూర్యుడుది కాదు. ఫిల్టర్ కాఫీ అత్యంత మధురంగా ఉండునన్న సత్యం గ్రహించలేకపోవడం, ఆ గ్రహింపలేనివాడి గ్రహపాటే అవుతుంది గానీ, ఫిల్టర్ కాఫీది కాదు.
'శంషాద్ బేగం మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది, ఆ గానసరస్వతి లేని లోకం చిన్నబోయింది. ఆ స్వరమాధుర్యం దేవుడు ప్రసాదించిన వరం, ఆ గానం నిత్యనూతనం. చిరకాలంగా ఆబాలగోపాలానికి అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించిన శంషాద్ బేగం ఇక లేరు అన్న వార్త విని సంగీతాభిమానులు ఖిన్నులయ్యారు.' అంటూ పడికట్టు పదాలతో.. ఏడుస్తూ.. శంషాద్ గూర్చి సంతాపం రాయబోవట్లేదు. శంషాద్ బేగంకి వయసైపొయింది. పోయింది. ఈ సందర్భంగా శంషాద్ పాటొకటి ఇస్తున్నాను. చూడండి.
మనం ఒక వ్యక్తిని చూడంగాన్లే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నీటుగా ఉండేవాడు మంచివాడనీ, నాటుగా ఉండేవాడు రౌడీ అనీ.. ఇట్లా. కొందరైతే పేదవారంతా దొంగలేననీ, అలగాజనాన్ని నమ్మరాదనీ కూడా నమ్ముతారు.. ఇది వారి వర్గతత్వ రోగాన్ని సూచిస్తుందేమోగానీ.. మరి దేన్నీ సూచించదు. తెలుగుకవులకి మాత్రం రిక్షా తొక్కువాడు పీడితుడిగా, కారు నడుపువాడు పీడకుడిగా భావిస్తారు. అలా భావిస్తేనే వారికి నమస్కారాలు, పురస్కారాలు లభిస్తాయి. మరికొందరినైతే వ్యక్తి యొక్క అందచందాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇందుకు కారణం బహుశా మన మైండ్ లో ముద్రించుకు పోయిన 'స్టీరియోటైపి' కావచ్చు. ఇది అందరికీ తెలిసిన సంగతే.
నా మైండ్ గొంతుల్ని కూడా స్టీరియోటైప్ చేసేసింది. లతా మంగేష్కర్, లీల, సుశీల.. నాకు చాలా ఇష్టం. వీరి గొంతులో మాధుర్యం, తీపిదనం, లాలిత్యం నన్ను కట్టిపడేస్తాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వలె కనులు మూసుకుని నా స్వప్నసుందరిని గాంచుతూ.. ఆనందపారవశ్యం చెందెదను. నా సుందరి అందాలరాసి, ముగ్ధ, బేల, అమాయకురాలు, పరాయి పురుషుణ్ణి పరాకుగానైనా దరిచేరనీయని గుణవంతురాలు.
భానుమతి, డి.కె.పట్టమ్మాళ్, బెజవాడ రాజారత్నం, శంషాద్ బేగం.. నాకు వీళ్ళ వాయిస్ అంటే భయం. ఇవి చాలా క్లీన్ వాయిస్ లు. వీరి వాయిస్.. వోకల్ కార్డ్స్ ని చీల్చుకుంటూ ఒక సుడిగాలిలా, ఒక సునామీలా.. ఊపిరి తిత్తుల ఫుక్ థ్రాటిల్ తో.. ఫడేల్మని ప్రళయ గర్జన చేస్తూ బయటకొస్తుంది. అసలు వీరి గొంతే ఇలా ఉండగా.. పాడే విధానం మరింత విలక్షణంగా.. చాలా డైనమిక్ గా ఉంటుంది. నాకైతే దందా చేస్తున్న రౌడీ వార్నింగ్ ఇస్తున్నట్లుంటుంది.
మరీ ముఖ్యంగా.. శంషాద్ బేగం పాట వింటుంటే.. 'ఈ ప్రపంచం నాది. దీన్ని నేను శాసిస్తున్నా! ఇక్కడ నా మాటే ఒక వేదం.' అంటూ గర్వంగా డిక్లేర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే అయితే పర్లేదు. ఇంకా.. 'నాతో వేషాలేస్తే మాడు పగలకోడ్తా' అంటూ ముఖం మీద ఈడ్చి తంతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.
'నీ మొఖం! నీదంతా అతితెలివి. ఆడలేడీసు గొంతులన్నీ ఒకటే. వారికి అవకాశాలొచ్చాయి. దేవుడిచ్చిన స్టోన్ తో పాడారు. దానికంత విశ్లేషణలు ఎందుకు? ఈ మధ్య నీకు ఆడాళ్ళంటే భయం పెరిగిపోతుంది. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. బీ హేపీ!'
'అంతేనంటారా? అలాగైతే ఓకే!'
(photos courtesy : Google)
ReplyDelete'ఆడ లేడీస్ 'గొంతుకలన్నీ ఒకటి ఎలా అవుతాయి?మామూలుగా అవి పంచమం,షడ్జమాల్లో ఉంటాయి.కాని ఎవరి కంఠంలోని ప్రత్యేకత వారిదే.అలాగే షం షాద్ బేగం,లతా మంగేష్కర్ల స్వరాలు పూర్తిగా విభిన్నం.లీల,భానుమతుల గొంతుకలు శాస్త్రీయసంగీతానికి అనువుగా ఉంటాయి.అందరిలోకి లతా,సుశీలల కంఠస్వరాలు మధురంగా ఉంటాయి.
కమనీయం గారు,
Deleteపెద్దలు. తెలివైనవారు. విషయాన్ని నాలుగు ముక్కల్లో తేల్చేశారు.
నాది కొద్దిగా క్లిష్టపరిస్థితి. శంషాద్ బేగం గూర్చి రాస్తూ.. ఒడ్డునపడే దారి తోచక.. ఏదో రెండు ముక్కలు గెలికి.. అలా బయటపడ్డాను.
(అసలు విషయం.. పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు. అంచేత హడావుడిగా ముగించేశాను.)
:)
ReplyDeleteఈ మధ్య నీకు ఆడాళ్ళంటే భయం పెరిగిపోతుంది. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. బీ హేపీ!' Seems true !
ReplyDeleteఅసలు విషయం అదికాదనుకుంటానండి........ఆ హస్కీ వాయిస్ ఎందరినో కాకుండా మిమ్మల్ని కూడా కవ్వించి ఉంటుంది....అది ఒప్పుకోలేక ఇలా :-)
ReplyDeleteఅయ్యుండొచ్చు. :)
Deleteశంషాద్ గొంతు 'ఖయ్' మన్నట్లుగా కూడా ఉంటుంది. :-)
శంషాద్ బేగం గొంతులో మాధుర్యం లేకపోవచ్చు. ముబారక్ బేగం పాడిన హమ్రాహి (1963) చిత్రంలోని ఈ పాట విని ఆనందించవచ్చు. ముబారక్ బేగం గొంతులో ఏదో జీర, ఇన్ని సంవత్సరాల తరవాత కూడా పాటని గుర్తుంచుకునేలా చేస్తుంది.
ReplyDeletehttp://youtu.be/D7vA3gKYIvA
మంచి పాటకి లింక్ ఇచ్చారు. థాంక్యూ.
Deleteఅవును. అందరూ ఒకేలా పాడాలని లేదు. లతా పాట బందరు లడ్డైతే.. శంషాద్ పాట దోసావకాయ. మనం హాయిగా అన్ని రుచుల్నీ ఆరగించేద్దాం.
నిజమేనండీ.. ఆవాజ్ మే ఖనక్ వుంటుందని హిందీ చానెలోళ్ళు కూడా బాధపడ్డారు. ఆ రౌడీ వాయిస్ వల్లేమో ఆవిడ పాడిన చాలా పాత పాటలు ముమాయిత్ ఖాన్ లకీ, రాఖీ సావంత్ లకీ రాత్రికి రాత్రి పేరు తెచ్చిపెట్టేసిన రీమిక్స్ నెంబర్లయ్యాయి. ఆడవాళ్ళ గొంతు ల బట్టీ కూడా అభిమానులుంటారు కదూ. చాలా మంది రేడియో కళాకారులని అలానే అభిమానించేవాళ్ళం.
ReplyDeleteఅవును. నండూరి సుబ్బారావు పద్మనాభం టైపులో ఉంటాడనుకునేవాణ్ణి. అందుకే ఆయన ఫొటో చూసి ఆశ్చర్యపొయ్యా!
Deleteనమస్కారం,
ReplyDeleteమీ పని లేక బ్లాగ్, నేను పని లేక చదువుతాను. ఈ మధ్య మీకు ఆడవాళ్లంటే భయం పెరిగిపోతుంది అని వ్రాసారు.
శంషాద్ బేగం, భానుమతి, d.k.pattamaal ఈ మధ్య వాళ్ళు కాదుగా, మీరు వాళ్ళని చూసి భయం పెంచుకోవటానికి, మీరు పుట్టక ముందే వున్నారు. మీరు ఇప్పుడు భయపడటం చాల దండుగ. శంషాద్ బేగం గొంతు మీకు రౌడి గొంతు లాగ, దందా చేస్తున్న రౌడి వారనింగ్ ఇస్తునట్లు ఉంది అన్నారు. మరి అదే గొంతు o.p.nayyar కి "గుడిలో గంట" లాగ వినపడింది. పుర్రె కొక బుద్ధి జిహ్వ కొక రుచి. ఏమి చేయలేము కదా. మీరు వ్రాసిన "భానుమతి వద్దు, రాజసులోచనే ముద్దు " మరియు "హాట్సాఫ్ టు రంగనాయకమ్మా" కూడా చదివాను. ఉతికి ఆరవేసి, చీల్చి చెండాడి, చావగొట్టి చెవులు మూయించే ఆవిడకి హాట్సాఫ్ ఏంటి? ధైర్యంగా, ఆత్మ విశ్వాసం తో పాట పాడేవాళ్ళకి అహంకారం, రౌడీయిజం అంట గట్టటం ఏంటి?
అనూరాధ బండ్లమూడి.
మీరు ఈ కామెంట్ సీరియస్ గా రాశారా?!
DeleteThis is my tribute to the great Samshad begum.
'రౌడీ గొంతు' పదాన్ని పాజిటివ్ గానే తీసుకో ప్రార్ధన.
'అహంకారం' పదాన్ని నేను వాడలేదు.
చీ...వెధవ జీవితం...రోజు రోజుకి మగవాడికి విలువ లేకుండా పోతోంది..అక్కటా..!
ReplyDeleteపెద్దలు నా అఙ్నానాన్ని మన్నించగలరు. నాకు గురుదత్ ని చూడగానే, కాసేపు ఆర్.నాగేశ్వరరావు ఏమిటి హిందీలోకి వెళ్ళాడు అని గాభరాపడ్డా. కానీ తర్వాత నిజం తెలుసుకొని తేలికపడ్డా. ఐనా నాకు శంషాద్ బేగం గొంతు భానుమతిగారంత దబాయింపులో లేదనిపిస్తుంది. ఐనా అదో ఠీవి.
ReplyDeleteముందుగా.. మన తెలుగు బ్లాగర్లకి కృతజ్ఞతలు.
Deleteఈ పోస్టుకి ఇన్ని కామెంట్లు వస్తాయనుకోలేదు. శంషాద్ గొంతు గమ్మత్తుగా.. ఆరున్నొక్క రాగంలో ఉంటుంది. నిన్నటి సందర్భాన్ని పురస్కరించుకుని టపటపా ఒక పోస్ట్ రాసేశాను.
గురుదత్ మీకు అలా కనిపించాడా! దయచేసి ఒక్కసారి 'ప్యాసా' చూడండి.
R.Nageswara Rao -Old Villain: http://3.bp.blogspot.com/_BbJAArGDIEA/R9jVPq9iNDI/AAAAAAAADf0/_wC-hjdAYgM/s320/IMG2806A.jpg
DeleteGurudatt:
http://media2.intoday.in/indiatoday/images/stories/guru-dutt_350_053012021121.jpg
ఇంక మీరే చెప్పండి
మీతో కామెడి చేసేంత చనువు లేదండి. ట్రిబ్యూట్ ఇలా కూడా వ్రాస్తారా? లేక ట్రిబ్యూట్ అనే పదం అర్థం మార్చేశారా ?
ReplyDelete(అసలు విషయం.. పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు. అంచేత హడావుడిగా ముగించేశాను.)
అంత హడావుడిగా ముగించటానికి మీరు తినే పెసరట్టు ఉప్మా కాదు. తీరిక ఉన్నప్పుడే వ్రాయండి.
"ట్రిబ్యూట్ ఇలా కూడా రాస్తారా?"
Deleteఎందుకు రాయకూడదు!? రాయొచ్చు.
"హడావుడిగా ముగించటానికి మీరు తినే పెసరట్టు ఉప్మా కాదు."
హడావుడిగా ఎందుకు రాయకూడదు!? రాయొచ్చు.
(వెల్, నాకు తోచింది నేన్రాశాను. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించి వదిలెయ్యండి.)
రమణగారు,
Deleteమీరిచ్చిన సమాధానం చదివితే శ్రీ శ్రీ గారు గుర్తొచ్చారండి :)
"పాత పాటను పాడలేను. కొత్త బాటను వీడలేను" - మహాప్రస్థానం
రమణగారు, మీరు వ్రాసిన జవాబు నచ్చింది.
Delete@@Anuradha Bandlamudi
ReplyDelete@భానుమతి, డి.కె.పట్టమ్మాళ్, బెజవాడ రాజారత్నం, శంషాద్ బేగం ...ఇవి చాలా క్లీన్ వాయిస్ లు. వీరి వాయిస్.. వోకల్ కార్డ్స్ ని చీల్చుకుంటూ ఒక సుడిగాలిలా, ఒక సునామీలా.. ఊపిరి తిత్తుల ఫుక్ థ్రాటిల్ తో.. ఫడేల్మని ప్రళయ గర్జన చేస్తూ బయటకొస్తుంది. అసలు వీరి గొంతే ఇలా ఉండగా.. పాడే విధానం మరింత విలక్షణంగా.. చాలా డైనమిక్ గా ఉంటుంది.@@@
ఇంతకన్నా గొప్ప ట్రిబ్యూట్ ఏముందండీ. నాకయితే నిజాయితీ తో కూడిన అభిమానమే టపా అంతా కనిపించి స్మైలీ పెట్టాను .
అబ్బే రమణగారు పెసరట్టు ఉప్మా గురించి అయితే హడావిడి గా కాక పేషెంట్స్ ని గంట సేపు వెయిట్ చేయించి మరీ వ్రాసి మనల్ని పనిలేక చదివిన వాళ్ళని చేస్తారండీ :)
Mauli garu, ila chepthe bavundunu ani anukuntunnaanu meeru sariggaa ade vraasaaru. Avunu abhimaname kanapadindi!
Deleteఏంటి సర్ ఎక్కడున్నారు , బొత్తిగా నల్లపుస అయిపోయారు .
ReplyDeleteటపా రాసి అప్పుడే పది రోజులైపోయింది .
గుంటూరు లో తెలుగు పుస్తకాలు ఎక్కడ అమ్ముతారో చెప్పగలరా ?
రమణ గారు బిజీ గా ఉన్నట్టున్నారు , మన బ్లాగ్ రీడర్స్ అయినా చెప్పగలరా ?
నా గూర్చి వాకబు చేసినందుకు ధన్యవాదాలు.
Deleteరాయాలనిపించడం లేదు.. ఎందుకో తెలీదు.
గుంటూరులో 'విశాలాంధ్ర' ఉంది. అక్కడకి వెళ్ళకండి. స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కనీస సమాధానం కూడా చెప్పరు. పుస్తకాల మీద విరక్తి పుట్టిస్తారు.
'ఎందుకో తెలీదు ' అని మీరు చెప్పడం ఏంటి , మీరు అలా చెప్పకూడదు . అది మేమే చెప్పాలి , మీరు ఎందుకో చెప్పాలి .
Deleteఅసలు ఆ ' ఎందుకో ' అనేది తెలుసుకోవడానికే మీ దగ్గరకి వస్తుంటారు జనం , మీరే ఎందుకో తెలీదు అని చెప్తే అది మీ వృత్తికే వ్యతిరేఖం
రమణ గారూ,
ReplyDeleteగుంటూరు లోనే వున్నారా?మీరేదో hill station కు వెళ్ళి మంచి travelogue రాయబోతున్నారని అనుకున్నానే?
doctor garu,
ReplyDeleteblog nu vadilesara emiti
G Ramesh Babu
Guntur