Tuesday 10 December 2013

జ్ఞానాంధకారం


"ముళ్ళపూడి వెంకట్రవణ భలే రాస్తాడు గదా!"

"అలాగా! ఆయన రాసినవాటిల్లో నీకు బాగా నచ్చిందేమిటి?"

"శ్రీరామరాజ్యం"

"ఇంకా?"

"అది కాకుండా ఆయనింకేమన్నా రాశాడా?"

"ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, జనతా ఎక్స్ ప్రెస్, ఋణానందలహరి, రాజకీయ భేతాళ... "

"అలాగా! అయితే అవన్నీ కూడా భలే రాసుంటాడు."

ఇక్కడ ముళ్ళపూడి అభిమానం తప్ప విషయం లేదని అర్ధమైపోయింది.


"hmtv లో వందేళ్ళ తెలుగుకథ ప్రోగ్రాం చూడు. బాగుంది."

(ఈ విషయంపై ఇంతకుముందొక పోస్ట్ రాశాను.)

"నీకు నచ్చిందా?"

"ఎందుకు నచ్చదు? గొల్లపూడి కథల గూర్చి చెబుతున్నాడుగా!"

"తెలుగులో నీకు నచ్చిన రచయితల పేరు చెప్పు."

"పరుచూరి బ్రదర్స్."

ఇంకానయం! చందనా బ్రదర్స్ అన్లేదు.


"విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' చదువు. బాగుంటుంది."

"నాకైతే ప్రస్తుతానికి ఒక్క పడగ కూడా చదివే ఓపిక లేదు. ఎందుకు చదవాలో నువ్వు చెప్పు.. చదవడానికి ప్రయత్నిస్తాను."

"భలే బాగుంది. ఎందుకు చదవాలో నాకేం తెలుసు? ఊరికే చెప్పాను. నీకు తెలుసుగా.. నేను చాలా బిజీ."

"మరెందుకు చెప్పావ్?"

"వదిలెయ్యి బాసూ! వేయిపడగలు బాగుంటుందని మొన్నెవడో అన్నాడు. నీకా ఫీల్డులో ఇంటరెస్ట్ ఉందని.. ఆ విషయం నీ చెవిలో ఊదా."

పాపం! నేనన్ని ప్రశ్నలడుగుతానని ఊహించలేదు. ఏదో గొప్ప కోసం చెప్పాడు. అతగాడు బిజీట.. అక్కడికి నేనేదో పనీపాట లేకుండా ఉన్నట్లు!


"ఛస్తే తెలంగాణా రాదు."

"ఎలా?"

"అశోక్బాబు తెలంగాణా రాకుండా అడ్డుకుంటాడు."

"రాష్ట్రవిభజన అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం. విభజన విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా పట్టుదలగా ఉంది. కేంద్రస్థాయిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంటే గాని రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం లేదు."

"నీకు తెలీదులే. మధ్యలో కొన్ని చోట్ల బ్రేకులెయ్యొచ్చు."

"అప్పుడు విభజన కొద్దిగా ఆలస్యం అవుతుంది గానీ.. ఆగిపోదు కదా!"

"చూస్తూ ఉండు. మనకి స్టార్ batsman కిరణ్బాబు ఉన్నాడు."

"నే రాజకీయాలు మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ మాట్లాడతావేం?"

"పిచ్చివాడా! ఈ రోజుల్లో రాజకీయాలే క్రికెట్, క్రికెట్టే రాజకీయం."

అతనికి కొందరు వ్యక్తుల పట్ల గుడ్డినమ్మకమే గానీ, రాజకీయంగా పెద్ద జ్ఞానం లేదని అర్ధమైంది. తెలుగు వార్తల్ని మాత్రమే ఫాలో అయ్యేవారి జ్ఞానం ఇలాగే ఉంటుంది.


"నరేంద్ర మోడియే కాబోయే ప్రధానమంత్రి. బుద్ధున్నవాడెవడైనా మోడీకే ఓటేస్తాడు."

"మంచిది. అలాగే వేసేద్దాం. మరి 2002 మారణకాండ గూర్చి ఆలోచించావా?"

"అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారం."

"మరి ముస్లిముల్ని దారుణంగా చంపేసింది ఎవరు?"

"ఎవరో? నాకేం తెలుసు? నరేంద్ర మోడీ మాత్రం కాదు."

"అంటే ఆనాడు ముస్లిములందరూ సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారంటావా?"

"అవన్నీ నాకు తెలీదు. నరేంద్ర మోడీ మాత్రం మహాత్ముడు."

మోడీకి అనుకూలంగా చాలా విషయంతో వాదిస్తాడనుకున్నాను. కానీ అతనికి మోడీ గూర్చి పెద్దగా తెలీదు!


పరిచయస్తులతో మాట్లడేప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలామందికి చాలా విషయాలపై గట్టి అభిప్రాయాలుంటాయి. అయితే వారికెందుకా అభిప్రాయం ఏర్పడిందో వారిక్కూడా తెలీదు!

సాధారణంగా ఒక విషయం పట్ల అభిప్రాయం కలిగినవారు రెండు కేటగిరీలుగా ఉంటారు.

కేటగిరీ 1. వీళ్ళు ఒక విషయం పట్ల కొద్దోగొప్పో అధ్యయనం చేస్తారు. కొంత అవగాహన ఏర్పరచుకుంటారు. ఆపై విషయాన్ని విశ్లేషిస్తూ సమర్ధిస్తారు లేదా వ్యతిరేకిస్తారు. వీరితో చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కొత్త సంగతులు తెలుస్తాయి కాబట్టి.. మన జ్ఞానం, అజ్ఞానం కూడా ఏ స్థాయిలో ఉన్నాయో బేరీజు వేసుకోవచ్చు.. మార్పుచేర్పులు చేసుకోవచ్చు.

కేటగిరీ 2. వీళ్ళు ఏ విషయాన్నీ తెలుసుకోటానికి ఆసక్తి చూపరు. కనీసస్థాయిలో కూడా విషయం పట్ల అవగాహన ఉండదు. కానీ రాకెట్ సైన్స్ దగ్గర్నుండి రిజర్వ్ బేంక్ వ్యవహారాల దాకా అనర్గళంగా మాట్లాడతారు. ఒక్కోసారి తీవ్రంగా ఆవేశపడుతుంటారు. చాలాసార్లు వీళ్ళ అభిప్రాయాలు అరువు తెచ్చుకున్నవి.

మనం మొదటి కేటగిరీలో లేకపోయినా పర్లేదు.. కానీ రెండో కేటగిరీలోమాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండగలిగే స్పృహ డెవలప్ చేసుకోవాలి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈమాత్రం అవగాహన కలిగుంటే చాలాసార్లు మర్యాదగా బయటపడొచ్చు.


"ఈ పాడు కాంగ్రెస్ విధానాల వల్ల ద్రవ్యోల్పణం పెరిగిపోతుందోయ్. ఏవంటావ్?"

"నాకు ద్రవ్యోల్పణం అంటే తెలీదు గానీ.. నాదగ్గర మాత్రం ద్రవ్యం ఎప్పుడూ అల్పంగానే ఉంటుంది."

"టెన్త్ లో చదువుకున్నావుగా! గుర్తు లేదూ?"

"నాకు నిన్న చదివినవే గుర్తుండవు. అదేదో నువ్వే చెప్పి నా అజ్ఞానాన్ని పారద్రోలరాదా?"

"నాయనా! నీకు ద్రవ్యోల్పణం గూర్చి తెలీకపోతే దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. ఈ వయోజన విద్యా కార్యక్రమం నా వల్ల కాదు."

ఏవిటో ఈ లోకం! విషయం తెలీదని నిజాయితీగా ఒప్పుకున్నా హర్షించదు గదా!


"పొద్దున్నే చిన్నుల్లిపాయ టీ తాగితే బీపీ, షుగర్లు రావని రాస్తున్నారు తెలుసా?"

"నాకు తెలీదు. నేను పొద్దున్నే ఇడ్లీలు, దోసెలు తింటాను. పగలు కాఫీ, రాత్రి సింగిల్ మాల్టు తాగుతాను. ఖాళీసమయంలో బ్లాగులు రాస్తాను. ఇవి చేస్తే ఛస్తారని ఎక్కడైనా రాస్తే చెప్పు. ఆలోచిస్తాను."

"లేదులేదు. ఇకనుండి నువ్వు కూడా చిన్నుల్లిపాయ టీ తాగు."

"చెప్పాను కదా. నాకు తాజ్ మహల్ టీ తెలుసు.. తాగుతాను. చిన్నుల్లి టీ తెలీదు.. తాగను."


ప్రతి వ్యక్తికి అన్నీ తెలిసుండాలని లేదు. ఏదీ కూడా తెలుసుకోకుండానే హాయిగా బ్రతికెయ్యొచ్చు. అసలేదీ తెలుసుకోకుండా నోరు మూసుకుని బ్రతికేసేవాడే ఉత్తముడని నా అభిప్రాయం. 

(picture courtesy : Google)

43 comments:

  1. వీళ్ళు ఏ విషయాన్నీ తెలుసుకోటానికి ఆసక్తి చూపరు. కనీసస్థాయిలో కూడా విషయం పట్ల అవగాహన ఉండదు. కానీ రాకెట్ సైన్స్ దగ్గర్నుండి రిజర్వ్ బేంక్ వ్యవహారాల దాకా అనర్గళంగా మాట్లాడతారు.

    ఇలాంటి వాళ్ళు రోజూ చాలామందే తగుల్తుంటారు. ఒక్కోసారి మంచి వినోదం. మరోసారి నోరునొప్పి.

    ReplyDelete
    Replies
    1. నేను సింగిల్ మాల్ట్ వేళలోనే వాదిస్తాను. అప్పుడు నే చెప్పేది అందరూ ఒప్పుకుంటారు.
      విడి సమయాల్లో ఎవరేది చెప్పినా వింటూనే ఉంటాను.
      కాబట్టి నాకు పెద్దగా సమస్య ఉండదు. :)

      Delete
  2. పై 2 రకాలలో కాకుండా ఉండటానికి ఒక ఆలోచన... మనకు తెలుసిన విషయాల పైనే మాట్లాడాలి, మనకు తెలియని వాటి నుండి తప్పించుకోవలి లేకుంటే వాటీ మాటెత్తకూడదు :) సుమారు నేను ఇదే పాటిస్తా!!

    ReplyDelete
    Replies
    1. కంగ్రాట్స్.

      నాకో సమస్యుంది. నాకు ఏది తెలుసో, ఏది తెలీదో సరైన judgement లేదు.
      అంచేత చాలాసార్లు తెలీని విషయాల్లో కూడా (బ్లాగులు రాస్తున్నట్లు) మాట్లాడేస్తుంటాను.

      Delete
  3. సార్... మీరు మోడీ గురించి రెండు మాటలే అన్నా... ఆ మహాత్ముడిని అలా కొంతైనా విమర్శించడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నాలాంటి అజ్ఞానుల్లో సైతం సామాజిక స్ప్రుహ పెంచిన మహనీయుడు ఆయన. నాకు అంతకు ముందు నా మతం గురించి ఎలాంటి స్ప్రుహా ఉండేది కాదు. నీ పేరేమిటి అని అడగగానే చెప్పాక... ఓహో నువ్వు ఫలానావా అంటూ ఎదుటివాడు అనే వరకూ! అంతకు ముందు నేనెవరో నాకు గుర్తుండేది కాదు... తీరా అన్ని ఫార్మాలిటీస్ ముగించుకున్న తర్వాత పేరు చెప్పగానే నేనిచ్చిన అద్దెంటి అడ్వాన్ రిటర్న్ చేసే వరకూ!! ఇలా అప్పటి వరకూ నేనో మనిషననే తప్ప నేను ఫలానా అనే విషయమే మందమతినైన నా స్ప్రుహకు అస్సలు తట్టేదే కాదు. నాలాగే మన సమాజానికీ పెద్దగా తట్టేది కాదనుకుంటా. కానీ గుజరాత్ లో అల్లర్లు చెలరేగే సమయంలోనే నేను మా ఊరి నుంచి హైదరబాద్ వచ్చా. అలా వచ్చేవరకూ నాపై నాకు ఎలాంటి స్ప్రుహా లేని నన్ను... నేనెవరో నాకే తెలియజెప్పేలా మన సమాజానికి బోధించిన నిత్య చైతన్యశీలి ఆయన. ఒకరి మతాన్ని అనునిత్యం గుర్తు చేసేలా "సమాజ అవగాహానా కల్పిత ప్రబోధకు"డాయన. సమాజానికి ఏవైనా హాని కలిగిస్తామేమోననే ముందు చూపుతో కలుపు మొక్కల్లాంటి మాలాంటి వారిని ఏరి పారేయబోయే... కాబోయే భారతీయ స్టాలిన్, గుజరాతీ తైమూర్, హిందుస్తానీ హిట్లర్ ను చూస్తే నాకు అనేక రకాలుగా ఒళ్లు పులకిస్తుంటుంది. గుజరాత్ లో జరిగిన మారణకాండ దేశానికి చాలా మంచిదనీ, ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో మన దేశంలోని ముస్లింలకు దేశభక్తి పెరగకపోయినా, భయం మాత్రం పెరిగి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వని విధంగా అవగాహన పెరుగుతుందని... కొత్తగా ఉద్యోగంలో చేరిన నాకు అప్పట్లో ఒక ఆఫీస్ కొలీగ్ ఉద్బోధ కూడా చేశాడంటే... ఆయన బోధనల ప్రభావం సమాజం మీద ఎంతగా ఉందో నాకు అర్థమైంది. ఇక ఆయన ప్రధాని అయి దేశమంతటా అదే ఫార్ములా అమలు చేస్తే ఆ తర్వాత దేశంలో అసలు ఉగ్రవాద దాడి అనేదే ఇకపై ఎప్పటికీ జరగదనే వ్యాఖ్య కూడా నాలో అంతకు ముందు ఎప్పూడూ లేనంత పెద్ద క్వాంటిటీలో అవగాహన పెంచింది. అందుకే వేయిపడగల్లో శిష్యుడి మీద వాత్సల్యం పెరిగినప్పుడు తనను ముద్దు పెట్టుకోవాలనుకున్నా...జమిందారీ వంశానికి చెందిన వాడు కావడంతో శిష్యుడిని ముట్టుకుని అపవిత్రం చేయలేక మనసులోనే ముద్దు పెట్టుకున్న ధర్మారావు లా మ్లేచ్ఛుడినైన నేనూ ఆయనను మనసులోనే మెచ్చుకుంటుంటాను. ఆయనను చూసినప్పుడల్లా ఆయన దీక్షాదక్షతలకు, సంకల్ప సాధనలో ఆయన పట్టుదలకూ బుడుగులా హాచ్ఛర్యపడి... ఆ పడ్డవాణ్ని మరి ఇప్పటివరకూ లేవలేదు. ఇలా నాలోనూ ఏకకాలంలో అవతలివారిలోనూ అనేక రకాలుగా సామాజిక అవగాహన పెంపొందించేవాణ్ని మీరు ఏమైనా అంటే ఆనక నా మనసు బాధపడుతుంది. అందుకే ఆయన్నేమీ అనకండి. ఇప్పుడాయన దేశానికి కాబోయే ఆశాజ్యోతి. ఆ జ్యోతితో మాలాంటివాళ్లను కాల్చి బూడిద చేసేసి, ఆ జ్యోతి వెలుగులోనే దేశానికి, ఆ దేశంలోని యువతకూ దారి చూపగల దక్షతతో ఏకకాలంలోనే పై రెండు పనులూ చేయగల సమర్థుడిని ఏమైనా అంటే కళ్లైనా పోవచ్చు. లేదా బుద్ధికి, మదికీ వైద్యం చేయగల మీకు మతి ఐనా పోవచ్చు. వద్దు సార్ వద్దు... ఆయనను ఏమన్నా ఈ దేశంలోని చాలామంది లాగే, చాలా మందితో పాటు నేనూ చాలా చాలా బాధపడతాను.
    యాసీన్

    ReplyDelete
    Replies
    1. అద్భుతంగా రాశారు. మీరు రాసిన ప్రతి వాక్యంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete
    2. యాసిన్ గారు,
      మీరు మోడీ భాయిని ప్రశంసించిన తీరు మనసు లోతుల్ని టచ్ చేసిందండీ!!
      మోడీని ఎవరు పల్లెత్తు మాటన్నా నేనూ, మీలాగే చాలా చాలా బాధపడతాను. ప్చ్.. ఈ సెన్సిటివిటీ ఎప్పుడు పోతుందో, ఏవిటో!

      Delete
    3. అన్నట్టు, మతోన్మాద రావణకాష్టాల్ని రగిలించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందు దొందే. జోడు దొంగలే. సిక్కుల ఊచకోత మొదలుకుని అత్యధిక మత, కుల, ప్రాంతాలపరమైన అల్లర్లు, విధ్వంసం చెలరేగినది కాంగ్రెస్ హయాంలోనే. కాకపోతే బీజేజీది బహిరంగ రహస్యం, కాంగిరేసుది చిదంబర రహస్యం. అంతే తేడా! సెక్యులరిజం అన్నది ఒక మిథ్యా పదార్థం మన దేశంలో.

      Delete
    4. ఔరంజేబు వారసులు, బిన్ లాడెన్ కజిన్ బ్రదర్లు, పొరుగు దేశానికి గులాములుగా మారి బాంబు పేలుళ్ళతో సలాములు చేస్తుంటే ఎక్కడో టీ అమ్ముకుని బ్రతికే ఒక వ్యక్తి వాళ్ళకు ఎదురు చెప్పడమా?? హవ్వ! లౌకికవాద వ్యాప్తికోసం యాత్రలకు నజరానాలిస్తుంటే దాని గురించి మాట్లాడటానికి ఈ మోడీ ఎవడండీ?? కామెడీగా గర్భగుడిలో లింగాన్ని బావిలో పడేస్తే ఎవరూ ఏమనలేదు, టైం పాస్ కోసం విగ్రహాలను ఎత్తుకెళ్ళి చెప్పులు తుడుచుకునే రాళ్ళుగా వాడుకుంటే ఎదురు చెప్పలేదు, బట్టలిప్పి బతుకమ్మ ఆడిస్తే అది లెగసీ అయ్యింది. అలాంటిది పనీ పాట లేకుండా గుడికి వెళుతున్న ప్రయాణీకులను సరదాగా చంపితే దానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎక్కడైనా విన్నామా?? కాబట్టి సదరు మోడీని వ్యతిరేకించడం మన కర్తవ్యం.

      (ఎన్నిరోజులు 2002 దగ్గరే వేలాడతారు? ఏదన్నా కొత్తగా రాయడానికి ప్రయత్నించండి మాష్టారూ.. )

      Delete
    5. కార్తీక్ గారు,
      మీరు అలా అంటె, నాన్ సెక్యులర్ ఐపోతారు.
      మన గొప్ప ప్రధాని గారు, "ఈ దేశంలో వున్న వొనరుల మీద మొట్ట మొదటగా ముస్లిములకు అధికారం వుంది" అని అంటె , అదేమిటండీ కనీసం "పేద వాళ్ళకు " అని అన వొచుకదా అంటే .. అలా అన్న వ్యక్తి నాన్ సెక్యులర్ ఐపోయాడు.

      అంతేలెండి, పక్కవాడి నొరు కొట్టేసి, మనకు ప్రత్యెకంగా పెడుతుంటె, మనకు నెప్పెమీ వుండదు. ఇక ఘనత వహించిన కంగ్రెస్సు వారు గత 65 సంవత్సరాలుగా మన పైన్ రుద్దిన చరిత్ర కారణంగా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, సెక్యులరిసం అంటే, ఇదీ అనుకుంటారు. పైపెచు వాళ్ళు దాన్ని అభ్యుదయ భావాలు అని కూడా అంటారు. మనం ఒప్పుకోవాలి. లెదంటే మళ్ళీ మనం నాన్ సెక్యులర్ ఇపోతాము.
      ఔరంగజేబు గొప్పవాడు, టోపీలు కుట్టుకు బ్రతికెను, అక్బర్ , బాబరు గొప్పవాళ్ళు. అంధ్ర చరిత్ర అనగా నవాబుల చరిత్ర. అలా కకుండా నిజంగా అసలు చరిత్ర ఏమిటి అని ఎవరైన ప్రయత్నిచినా చాలు, వాళ్ళు నాన్ సెక్యులర్ ఐపొతారు.
      ఈ గొప్ప సెక్యులరిసం ప్రవాహంలొ, మనం అందరం ఒకే రకమైన వాళ్ళమని, మనం ఎప్పుడో మర్చిపొయాం.

      ఇంకా ఎన్నళ్ళు అలా మూసలొ పడి అలోచిస్తూ వుంటారు సారూ !!
      ఈ మాటతొ నేనూ నాన్ సెక్యులర్ ఇపొయానా?

      Delete
  4. ఏది ఏమైనా మీరు రాసిన ఆఖరు వాక్యం మాత్రం కరెక్టు. కానీ అలా ఉండలేక పోతున్నాం.2004 లో ఎలక్షన్ల ముందర బీజేపీ వారు తమ పరివాలన వల్ల ఇండియా వెలిగి పోతోందని చెప్పారు. మోడీని రానీండి. ఇండియా మండిపోతోందని చెప్పుకోవాల్సి వస్తుందేమో?

    ReplyDelete
    Replies
    1. అవును. నేనూ అదే అనుకుంటున్నాను.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ఏవిటి సార్‌! మోది (మోడీ కాదండీ. కాదనినాకు ఆంధ్రజ్యోతి వాల్లు చెప్పారు)గురించి చాలా చాలా రాసేస్తున్నారు. మా మోది ని విమర్శించే వారికి ఒక్కటే హెచ్చరిక. మీ విమర్శించే వారంతా ఒక్క విషయం గమనించాలి. మూడు రాష్ట్రాల్లో ఏకంగ వారి పార్టీని గెలిపించగలిగాడు. ఇంకెవరన్న వచ్చింటు ఈ పని జరిగేదా? జరగదు గాక జరగదు. అవకాశం కోల్పోయిన కాంగ్రెస్‌ మూది కి కిరిటం పెట్టింది. అయోమయమయంలో పడిపోయిన ( చాయిస్‌ లేని జనానికి) ఇంతకంటె అవకాశం వస్తుందా గెలిపించటానికి. అప్పుదే ఏమైది సార్‌! సార్వత్రిక ఎన్నికల్లో అయితే మోది గురించి మీరు మట్లడనే మాట్లాడలేరు చూడండి. కాబట్టి మోది కంటే ధయాళువు, మానవతా వాది ఉండరు,ఇకపై ఉండబోరు అని మీరే ఒప్పుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. THIRUPALU P గారు,

      నేను మీ మోదీ భారత ప్రధాని కన్నా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను. :)

      Delete
    2. మిత్రులారా,
      మీ వ్యంగ్యం చదివితె అంబాసడర్ , ఆడి కారు తో పోటిపడి గెలవలేక , ఎమి చేయాలో పాలుపోక, ఎగతాళి చేసి సంతోషించినట్లుంది :)

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. అంథే లెండీ మోడీ ఒక్కసారే దండి గా కర్ఫ్యూ చేసి మళ్ళీ 144 సెక్షను వాడలేదు గానీ మన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో 6నెలలకొక సారి సరదాగా కర్ఫ్యూ చేయనిస్తారు శుక్రవారం వస్తె 144 సెక్షను అంటారు ఈళ్ళ ముందు మోడీ ఎంత సార్.....
    అయినా ఒక్క సారి జరిగిన మారణ కాండ నష్టాన్ని, కాంగిరేసు వారు నెమ్మదిగా 5యేళ్ళు చేసి మురుస్తారు కొందరికి నెమ్మదిగా చావడం ఇష్టం కొందరికి బల్క్ గా చవటం ఇష్టం.
    చ గుజరాథ్ లో సరిగ్గా ఒక్క కర్ఫ్యూ చేయలేక.... ఒక్క బందు చేయలేక కాంగిరేసు వారు నకనకలాడుతున్నరు పదండి వారికి సహాయం చేద్దాం!!!.

    ReplyDelete
  9. 1984 రియట్స్ సెక్యులర్, 2012 అస్సం రియట్స్ సెక్యులర్, 2013 ముజఫర్ నగర్ రియట్స్ సెక్యులర్ కానీ 2002 కమ్యునల్ వాహ్ ..... అయినా మీ పోస్ట్ లో అన్ని అంశాలు ఉండగా మోడీ అంశమే కామెంటుల తోక పెంచుతోంది.... ఇది చాలు మీడీయా లో 2002 రియట్స్ ఎందుకు ఎక్కువగా నలుగుతాయో చెప్పటానికి!ఇన్సెక్యురిటీ ఇంఫీరియారిటీ ఫీల్ అయిపోయి రెచ్చిపోయె బదులు 60 యేళ్ళ పాలనలొ కాంగిరేసు ఇచ్చిన ఫలాలు చూసి మురిసిపోవచ్చు సదరు ఙాని!!!

    ReplyDelete
  10. భావి భారత ప్రధాని మోడీ భాయ్ మీద ఇంతమంది ఇన్నిన్నేసి టన్నులెక్కన అభిమానం చూపిస్తోంటే, తెగ ముచ్చటేస్తోంది. ఈ పవిత్ర భారద్దేశంలో సెక్యులరిజాన్ని మతం (మతోన్మాదం స్థాయికి అంటారు గిట్టనివాళ్లు) స్థాయికి డెవలప్ చేసి, మానవత్వాన్ని దశదిశలా పరిఢవిల్లజేస్తున్న నేతల్ని అక్కున జేర్చకుని కామెంట్ల వర్షం కురిపించిన మిత్రులకు ధన్యవాదాలు, మోడీ తరఫున. చూస్తోంటే, అభినవ, అపూర్వ మోడీయిజాన్ని మీరందరూ కలసి ఖండఖండం చేసి ఖండాంతరాలకు విస్తరింపజేసేలా ఉన్నారే. ఏవిటో, నేను కూడా మోడీ సుడిగాలిలో పడి కొట్టుకుపోతున్నా, ఛ... :-)
    రమణ గారు, మీరు మీ పోస్టులతో బ్లాగ్ భగీరథ యజ్ఞం చేసి, ఈ భూమ్మీద కేటగిరీల్లేని జ్ఞాన జ్యోెతుల్ని వెలిగించగలరు. తమసోమా జ్యోతిర్గమయా!! మీ పోస్టు బావుంది.

    ReplyDelete
    Replies
    1. నాగ రాజు,
      నిరంతరం మోడిని విమర్శించటానికి వ్యక్తులు సరిపోరని, యన్.జి.ఒ. సంస్థలనే ఆయన వ్యతిరేకులు ఏర్పాటు చేసుకొన్నారయ్యా. ఆ సంస్థలకు వచ్చే లాభాలను చూసి, ఆయనను వ్యతిరేకించే పెద్ద పరిశ్రమ ఏర్పడిందని రాంజెత్మలాని లాంటి వారు టివి చర్చలలో కొట్టెపారేస్తూంటరు. ఆ మాట అన్నపుడు, ఆయనతో ఎవ్వరూ వాదానికి దిగరు. నోరు మూసుకొని బుద్దిగా కూచొంటారు. ఎందుకంటె అతి చేస్తే ఆయనకి తిక్క రేగి, వీళ్ల బండారం బయట పెడితె అసలికె ఎసరని వారికి తెలుసు. పెద్ద ఇండస్ట్రినే మోడిని విమర్సించటానికి ఉంటె, మళ్లీ మీ లాంటి వారు సెటైర్ వేయాల్సిన అవసరం ఉందా? అయితే మోడి సమర్దిమ్కే వారికి ఇండస్ట్రీ లేక వ్యక్తి గత స్థాయిలో కార్తిక్ , నరసిమ్హ లాంటి వారు వ్యాఖ్యలు రాస్తుంటారు. దానికి మీరు ఫీలై సెటైర్ వేస్తె లా?

      Delete
    2. SriRam garu,
      కాస్తో కూస్తో లైమ్ లైటులో ఉన్నవాళ్ల మీదకే విమర్శలు ఎక్కువగా ఎక్కుపెట్టబడుతుంటాయ్. అలాంటి గొప్పోళ్లు ఏమైనా తప్పులు చేస్తే... విమర్శనాస్త్రాల తీవ్రత, సాంద్రత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అది సర్వసాధారణమే. నేను సెటైర్ వేయాల్సిన అవసరం లేదంటారా? సర్లేండి. నేను కాకపోతే ఇంకొకరు సెటైర్లు వేస్తారు. మనమే కాస్త పెద్ద మనసు చేసుకుని సర్దుకుపోవాలి.

      Delete
    3. నాగరాజు
      మీరు వయసులో చిన్న వారైనా, రమణగారిలాగా మంచి రచయిత. అందులో సందేహం ఎమీలేదు. కాని మీరు ఇంతక్రితం రాసిన కామేంట్లను చదివితే, చరిత్ర ,ఆర్ధిక శాస్త్రం, సెక్యులరిజం మీద మీ అవగాహన ప్రశ్నించదగినది. మీ పోటొను చూసిన తరువాత, మీరు వయసు అర్థమై చర్చకు దిగలేదు. మోడి మీన్స్ బిజినెస్. మీరు విమర్శించాలనుకొంటే విమర్శించుకోండి. ఎమీ ఇబ్బంది లేdu.
      అపూర్వ మోడీయిజాన్ని మీరందరూ కలసి ఖండఖండం చేసి ఖండాంతరాలకు … ఇలా రాయటం అంటే , మోడిని సమర్ధించే వారు జ్ణానంధకారం లో కూరుకు పోయి, ఆయనను గుడ్డిగా సమర్ధిస్తున్నరనే అర్థం వస్తుంది. అప్పుడు మీ తెలివి, చరిత్ర మీద మీ అవగాహనను ప్రశ్నించాల్సి వస్తుంది.

      ఇక బ్లాగులో నా అభిమాన రచయిత రమణ గారికి విశ్వానాథ్ పేరంటేనే చాలా ప్రేమ,ప్రత్యేక అభిమానం. అది శంకరాభరణం తీసిన కె విశ్వానాథ్ కావచ్చు, లేక కవిసామ్రాట్ విశ్వానాథ్ సత్యనారాయణ , వారిని సమయం దొరికినపుడల్లా గుర్తుకు తెచ్చుకొంట్టుంటారు.ఈ మధ్య బహుశ ఎన్నికల ఫలితాలను చూసి “నమో” కూడా రోజు గుర్తుకు వస్తున్నట్లు ఉన్నాడు. వీరందరి సందడిలోపడి రమణగారు, వారి అభిమాన పార్టి వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అసలికి ఆ పార్టి మొన్నటి వరకు ప్రముఖ జాతీయపార్టి గా వెలుగొందిన సంగతే మరచిపోయినట్లున్నారు. పోని మరచిపోయినవారు గమ్ముగా ఉంటారా అంటే, ఆ పార్టి మేధావులు రాసిన పుస్తకాలు చదివి, అదే కోణంలో ప్రస్తుత సమాజాన్ని విశ్లేషిస్తారు. నచ్చని పార్టిలను తూర్పార బడతారు. మీలాంటి వారన్నా రమణగారిని ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర కలిగిన వారి అభిమాన పార్టి చరిత్రలోకి తొంగి చూడమని కొంచెం చెప్పండి :). అందుకోసం ఈ క్రింది లింక్ ఇస్తున్నాను. రమణ గారు చాలా సున్నిత మనస్కులు అని తెలుసు. కనుక గుండె దిటవు చేసుకోని, ఈ వ్యాసం చదవటం మంచిది.

      http://www.mainstreamweekly.net/article2234.htmlReply

      Delete
    4. SriRam garu,
      పోనీయండి. సొసైటీలో పతనమైపోతున్న పాలిటిక్సు మీద, పొలిటీషియన్స్ మీద కోపమే తప్పిస్తే, సాటి మిత్రులనో, ప్రజలనో చులకన చేస్తున్నట్టు రాయడం నా ఉద్దేశ్యం ఎప్పుడూ కాదు. ఇక, రమణ గారికి చెప్పేంతవాడనా, నేను. ఆ చెప్పాల్సిన విషయాలేవో మీరు ఆల్రెడీ చెప్పకనే చెప్పేశారు :-) ఇక్కడ మీరిచ్చిన లింకులో సీపీఎం గూండాగిరి గణాంకాలు గగుర్పాటు కలిగించేలా ఉన్నాయి. బెంగాల్లో సీపీఎం ఫాసిస్ట్ పార్టీగా తయారైందని నేనూ ఆనోటా ఈనోటా చాలాకాలం క్రితమే విన్నా. నిజానికి సీపీఐ, దాన్నుండి వచ్చిన సీపీఎం, ఈ రెండింటినీ చీల్చుకుని వచ్చిన వెయ్యిన్నూటొక్క ముక్కలు ఏవీ కూడా నిజమైన కమ్యూనిస్టు పార్టీలుగా డెవలప్ కాలేదని, కొన్ని దశాబ్దాలుగా వాళ్లు చేస్తున్న అంతులేని చారిత్రక తప్పిదాలే నిరూపిస్తున్నాయని కూడా చాలామంది ఘాటుగా విమర్శిస్తుంటారు. నాదీ దాదాపు అదే అభిప్రాయం.

      Delete
    5. మీరన్నా ఆ వ్యాసం చదివి, తేరుకొని తిరిగి వెంటనే బదులివ్వగలిగారు, సున్నిత మనస్కులైన రమణ గారు ఆ వ్యాసం చదివి ఇంకా తేరుకున్నట్లు లేదు  :) మైన్ స్ట్రీం వాళ్లు హిందూ పేపర్ వారిలాగా, ప్రో కమ్యునిస్ట్, యాంటి బిజెపి. అటువంటి పత్రికలోనే వారి పైన అంత గొప్ప వ్యాసం వచ్చింది.

      *సొసైటీలో పతనమైపోతున్న పాలిటిక్సు మీద, పొలిటీషియన్స్ మీద కోపమే *
      సమాజం లో పతనమైనది రాజకీయాలు,రాజకీయ నాయకులు కాదు. మనదేశ రాజకీయనాయకులలో లోపాలు ఉండవచ్చేమో గాని, మీడీయా చిత్రికరించినంత చెడ్డ వారైతే కాదు. ముఖ్యంగా జాతీయ ఇంగ్లిష్ మీడియా ఈ దేశానికి పట్టిన దరిద్రం. వాళ్లు ప్రసారం చేసే అబ్బద్దాలు, అవాస్తవాలు చెప్పనలవి కావు. వీరు టివి లో జరిపే చర్చలు విని, రాసిన చెత్త చదివి అంతా నిజమని అనుకొంటారు. ఈ సభ్యులలో ఎక్కువమంది జె యన్ యు లో చదివి, ఇంగ్లాండ్ లో మీడియా మీద ఒక కోర్స్ చేసి టి వి లలో ప్రత్యక్ష మౌతారు. ప్రతి చానల్ కి నిలయ విద్వాంసులు ఉంటారు. తక్కువైతే అభిషేక్ మను సింగ్వి, వీర్ సింఘ్వి లాంటి వారిని తిరిగి ప్రవేశ పెట్టి , షో ని నడిపిస్తారు. ఈ నిలయ విద్వాంసుల బృందంలో సీనియర్ సభ్యులలో ఒకరైన అవుట్ లుక్ వినోద్ మెహతా తనరోజువారి వ్యాపారం గురించి ఎమంట్టున్నారంటే :1. With great pride, Mehta shared he was the first person to start the trend of drinking during prime time TV debates.2. “Mocking the news channels, he said “50% of their content should be taken as joke”. “They also serve entertainment along with news,” he said, and quipped: “I speak rubbish on TV debates, yet I’m called again.”3. Known for his frank and fearless opinions, Mehta said it’s almost inevitable that Narendra Modi will become the next prime minister,and added hastily, “I say this despite being labeled a Congress chamcha (sycophant).” He said Modi’s rise is more due to inept leadership of Sonia Gandhi and her son Rahul than his own merit. The veteran editor predicted that Modi’s ascendancy to the PM’s post would be bad news for English media which has been after him since Gujarat riots. “Mr. Modi is not a man who forgets and forgives. For years, English media, including Outlook (which Mehta edits), has criticised him. So our jobs would be in peril if he becomes PM,” he said.http://articles.timesofindia.indiatimes.com/2013-12-08/lucknow/44941132_1_narendra-modi-gujarat-riots-meena-kumari

      Delete
    6. @UG SriRam,

      మీ లింక్ నాకు ఓపెన్ అవ్వట్లేదు.

      Delete
    7. Narendra Modi will be next PM: Vinod Mehta

      http://articles.timesofindia.indiatimes.com/2013-12-08/lucknow/44941132_1_narendra-modi-gujarat-riots-meena-kumari

      Delete
  11. even I truly believe in the saying " Ignorance is bliss"

    ReplyDelete
  12. తెలుగు వార్తల్ని మాత్రమే ఫాలో అయ్యేవారి జ్ఞానం ఇలాగే ఉంటుంది................... nijame

    ReplyDelete
    Replies
    1. ష్.. గట్టిగా అనకండి. తెలుగు భాషాభిమానులు నోరు చేసుకోగలరు. :)

      Delete
  13. మై డియర్ రమణ,
    నా ద్రుష్ఠిలో రచయితలు 3 రకాలు.
    1. మహా పురుషుల సత్సాంగత్యం వలన లేదా తన సహజ సిధ్ధమయిన భావనలను సామాజిక స్ప్రుహతో నిస్వార్ధంగా సమాజానికి తోడ్పడుతారు.
    2. సామాజం ఏమయినా పర్వాలేదు. వాస్తవాలను అవ్వస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా ఉదా: ఒక చోట వేపచెట్టుకు గాటుపెడితే తియ్యటి పాలు వచ్చాయి. (సహజముగా చేదు, అలా వ్రాస్తే విసేషము లేదు). వీళ్ళు డబ్బు సంపాదన కోసం వ్రాసే వారు.
    3. సమాజాన్ని ఒక వైపు నుండే(రెండో వైపు తనకిష్టము లేనిది, వాస్తావాన్ని జీర్నించుకునే శక్తి లేక, లేదా ఆఖరకు తనకే అర్ధంగాని, అరువు తెచ్చుకున్న "సిధ్ధాంతాన్ని" సమాజం మీద రుద్ది తన పబ్బం గడుపుకుంటూ, కీర్తి-ప్రతిష్ఠల కోసం (భావ ప్రకటన అనె ముసుగు క్రింద) వ్రాసే వారు.
    ఈ 3రకం వాళ్ళే చాలా ప్రమాదకరం. సంఘ సంస్కర్తలు సమాజములోని సమస్యలకు ఎక్కడ పరిష్కారం ఇస్తారో అని భయంతో కేవలం "బొక్కలెతకటమే" పనిగా పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తారు.
    దాదాపుగా మాట్లాదే వాళ్ళు కూడ ఎదే విధముగా వుంటారు. వాగే వాళ్ళలో 4వ రకం "విదూషకులు"గా.

    ReplyDelete
    Replies
    1. నేను ఆ "విదూషకుల" రకంలో లేనందుకు మిక్కిలి సంతసించుచున్నాను.

      Delete
  14. రైటో రైట్‌..మోయలేనన్ని వీరతాళ్లు!

    ReplyDelete
    Replies
    1. అబ్బా! మెడ లాగేస్తుందండి!

      Delete
  15. రైటో రైట్‌..మోయలేనన్ని వీరతాళ్లు!

    ReplyDelete
  16. అద్భుతం సార్ ! నాలాంటి చాలా మంది ప్రస్తుత పరిస్థితుల గురించి లోలోపల ఆలోచించే విషయాలు మీరు సరిగ్గా చెప్పారు.

    -మమత

    ReplyDelete
    Replies
    1. నే మొదట్నుండీ అంతేనండి! నా అజ్ఞానాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించేసుకుంటా. ;)

      Delete
  17. Chaalaa bhagavundi vishayam telichina teliyakapoina edovakati mattaladhali puttaga ne vevaru emi nerchukoru Right or wrong Debateis always good Please encourage

    ReplyDelete
  18. మీరొకందుకు రాస్తే కామెంట్లు మరొకందుకు పడ్డాయి. ఐతే టపా మాత్రం బాగా పేలింది.

    ReplyDelete
    Replies
    1. రమణ గారు కార్తిక్, నర సిం హ లకు బదులివ్వకపోవటంలో ఉద్దేశం అర్థం కావటం లేదా? మొదటి నుంచి రమణ గోరికి ఇలా గిల్లటం సరదా, మా లాంటి వారు ఇలా బదులివ్వటం జరుగుతూనే ఉంది.

      Delete
    2. @UG SriRam,

      నా పోస్ట్ మోడీ గూర్చి కాదు.

      మోడీ గూర్చి అసలేం తెలీకుండా గుడ్డిగా సమర్ధించే వ్యక్తిని ఉదాహరణగా రాయడం మీకు నచ్చినట్లు లేదు. విషయం తెలీకుండా మోడీని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిని ఉదహరించినట్లైతే మీకు నచ్చి ఉండేదేమో. :)

      విషయం లేకుండా /తెలుసుకోకుండా సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ పట్ల చికాకుతో రాసిన పోస్ట్ ఇది. అంతకు మించి ప్రత్యేకంగా ఏ ఒక్కరినో దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. అదీ సంగతి.

      Delete

  19. నమో ని మీరు, భారత ప్రధాని కన్నా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను, మహాత్మా అని అనటం నచ్చలేదు. నమో మహాత్ముడో, మామూలు వాడో కాలాం తేలుస్తుంది. ఈ క్రింది టపాలుచదివి, నమో గురించి మీకెంత తెలుసో ఒకసారి పరిశీలంచుకొండి.

    Modi phenomenon: Propaganda or Reality?
    http://guruprasad.net/posts/modi-phenomenon-propaganda-or-reality

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.