మనిషి చదవగలడు, జంతువులు చదవలేవు. కావున జంతువులకి లేని ఎడ్వాంటెజ్ మనిషికి వుంది. మనిషికి చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, అర్ధం చేసుకునే శక్తినిస్తుంది. అట్టి జ్ఞానంతో మనిషి నిరంతరం తన కోసం, తన సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తాడు, పాటుపడతాడు. సమాజంలో తమ వాణి వినిపించలేని బలహీనుల్ని దయతో, ప్రేమతో అర్ధం చేసుకుంటాడు. వారి హక్కుల కోసం తపన పడతాడు, పోరాడతాడు.
అట్టి బలహీనుల్లో ఆదివాసీలు ముందువరసలో వుంటారని నా నమ్మకం. ఎందుకంటే - వాళ్ళ హక్కుల గూర్చి వాళ్ళు సరీగ్గా మాట్లాడలేరు, ఒకవేళ మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. కారణం - వారికి సరైన చదువు వుండదు, మేధావుల్లా భాషా పటిమ వుండదు, సరైన భావప్రకటన వుండదు. అందువల్ల మనం వాళ్లకి అర్ధం కాము, వాళ్ళు మనకి అర్ధం కారు.
అనాదిగా అడవుల్లో జీవనం చేస్తున్న ఆదివాసీల మనుగడ ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం అడవుల్లో లభించే ఖరీదైన ఖనిజ సంపద. ఈ ఖనిజ సంపదే వారి మనుగడకి మృత్యుఘంటికలు మోగిస్తుంది. మైదానప్రాంత ప్రజల నాగరికతకి విద్యుత్తు చాలా అవసరం. కావున అణు విద్యుత్తు కేంద్రాలు నిర్మించాలి. అందుకు మారుమూల అడవులు కావాలి, ఎందుకంటే - ప్రమాదం జరిగినా నాగరికులు రేడియేషన్ బారి పడకుండా సేఫ్ జోన్ లో వుండాలి కదా! మైదాన ప్రాంత రైతుల వ్యవసాయం కోసం నీళ్ళు కావాలి, పట్టణ ప్రజల అవసరాలక్కూడా నీళ్ళు కావాలి. అందుకు అడవుల్ని ముంచేసే డ్యాముల్ని నిర్మించాలి. ఈ విధంగా అన్ని 'అభివృద్ధి' నమూనాలు ఆదివాసీలకి ఒక శాపంగా పరిణమించాయి.
ఏసీలలో 'స్ప్లిట్ మోడల్' అని వుంటుంది. పెద్దగా శబ్దం చేసే కంప్రెసర్, వేడి గాలిని చిమ్మే ఫ్యాన్ కలిపి ఒక యూనిట్. ఇది దూరంగా బయటవైపు వుంటుంది. రూములోకి నిశ్సబ్దంగా చల్లని గాలిని పంపే యూనిట్ ఇంకోటి వుంటుంది. ఇవ్వాళ మన అభివృద్ధి మోడళ్లన్నీ ఈ స్ప్లిట్ ఏసీ లాగా ఉంటున్నాయి. వేడిగాలి, బొయ్యిన శబ్దం ఆదివాసీలకి.. చల్లగాలి మైదాన ప్రాంత ప్రజలకి. మన చల్లదనానికి వాళ్ళు వేడిని భరించాలి!
రాజ్ కపూర్ 'సంగం' తీశాడు. ఆ సినిమా చివర్లో రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్లు తాము ప్రేమించిన వైజయంతిమాల ఎవరికి చెందాలనే విషయంపై చాలాసేపు వాదించుకుంటారు.. నాకైతే విసుగ్గా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో నించున్న వైజయంతిమాల కూడా 'ఇంతకీ నేనెవర్తో వుండాలి?' అన్నట్లు టెన్షన్తో వాళ్ళ చర్చని ఫాలో అవుతుంటుంది! అయితే - ఎంతసేపూ హీరోలిద్దరే మాట్లాడుకుంటారు గానీ, వైజయంతిమాలని 'మాలో ఎవరితో జీవించడం నీకిష్టమో చెప్పు' అని మాత్రం ఒక్కమాట కూడా అడగరు!
ప్రస్తుతం మన పోలవరం నిర్వాసితుల దీనావస్థ వైజయంతిమాలని జ్ఞప్తికి తెస్తుంది. తాము ఉండాలా, ఊడాలా అన్నది ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాల వివాదంగా మారింది. ఇప్పుడు వాళ్ళు నిస్సహాయంగా (కొంత ఆసక్తిగా) వీళ్ళిద్దర్నీ గమనిస్తున్నారు (అతకుమించి చేసేదేమీ లేక).
మన మధ్యతరగతి మేధావులు డ్యాములు, గనులు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుందని అంటారు. అందుకోసం - 'అడవులు ఖాళీ చెయ్యాల్సిందే, ఆదివాసీలు త్యాగం చెయ్యాలి.' అంటారు. సరే! ఒప్పుకుందాం. మరప్పుడు ఆదివాసీల పునరావాసం నిజాయితీగా, బాధ్యతగా జరగాలి కదా? గత అనుభవాలు అలా జరగట్లేదనే చెబుతున్నాయి.
ఆదివాసీలకి ప్రత్యామ్నాయంగా భూమినివ్వాలనీ, వాళ్ళకి ఆ ప్రాజెక్టులోనే ఉద్యోగం కల్పించాలనీ.. ఇత్యాది జాతీయ, అంతార్జాతీయ సూత్రాలు కాయితాల మీద మాత్రం ఎంతో ఘనంగా రాసుకున్నారు. కానీ - ఎక్కడ పాటించారు? ఎక్కువలో ఎక్కువ.. కొన్నిచోట్ల భూమినిచ్చారు గానీ, వాళ్ళకి ఆదాయ వనరు మాత్రం చూపించలేకపొయ్యారు.
కొందరు బుద్ధిజీవులు (అమాయకంగా) 'డబ్బిస్తే సరిపోతుంది కదా?' అని వాదిస్తారు. ఆదివాసీల జీవనం వేరుగా వుంటుంది, వారిలో కొందరు సంచార జీవులు కూడా. వాళ్ళకి డబ్బివ్వడమంటే చిన్నపిల్లాడి చేతికి డబ్బివ్వడంతో సమానం. చదువు లేకపోవడం, అమాయకత్వం వల్ల వారి భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన సొమ్ము దుర్వినియోగం అయిపోతుంది. అందువల్ల - ఆదివాసీల పునరావాసం విషయంలో ప్రభుత్వాలు చట్టాల్ని తుచ తప్పకుండా అమలు చెయ్యాలని మనలాంటివారు డిమాండ్ చెయ్యాలి.
ఎన్నో విషయాల్లో ఎంతో నిక్కచ్చిగా వుందే ప్రభుత్వాలు ఆదివాసీల పునరావాసం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తాయి? ఎందుకంటే - ఈ దేశంలో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీల పేర్లు మారతాయే గానీ.. ప్రభుత్వాల స్వరూపాల్లో మౌలికమైన తేడా వుండదు. ఏ ప్రభుత్వాన్నైనా ఆడించే శక్తులు వేరే వుంటాయి. ఈ శక్తులకి దేశప్రయోజనాల కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యం. అందువల్ల - ప్రభుత్వాలు ఆదివాసీలకి పునరావాసం కోసం కంటితుడుపుగా కొంతచేసి.. చెయ్యాల్సింది చాలా వదిలేస్తాయి.
కార్పొరేట్ మీడియా తెలివిగా తమ ప్రయోజనాల కోసం ప్రజల దృష్టిని మళ్ళించి - రాజకీయ నాయకుల్ని సినీ హీరోల స్థాయిలో హైప్ సృష్టించి పబ్బం గడుపుకుంటున్నాయి. తమ ప్రయోజనాల్ని ఎవరు పరిరక్షించగలరో వారినే హీరోలుగా మీడియా ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ కార్పోరేట్ శక్తులే ఒకప్పుడు కాంగ్రెస్ ని ప్రమోట్ చేశాయి, ఇప్పుడు బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. సినిమా హాల్ వాడు వ్యాపారస్తుడు, అతనికి సినిమా కలెక్షన్లు పడిపోతే, ఇంకో హీరో సినిమా వేసుకుంటాడు. ఇదీ అంతే!
ఒకప్పుడు బాలగోపాల్ ఆదివాసీలని కలుసుకుని వారి సమస్యల్ని వివరంగా తెలుసుకుని, వారి తరఫున రిపోర్టులు, వ్యాసాలు రాసేవాడు. అవసరం అనుకున్నప్పుడు కోర్టుల్లో కేసులు వేసేవాడు, వాళ్ళ తరఫున వాదించేవాడు. ఈ రంగంలో జయధీర్ తిరుమలరావు చేసిన, చేస్తున్న కృషి అబ్బుర పరుస్తుంది. క్రమంగా నిబద్దత కలిగిన వ్యక్తులు తగ్గిపోతున్నారు (అసలు వ్యక్తుల్ని కలవకుండా - టీవీ స్టూడియోల్లో చర్చల్లో పాల్గొనేవారు ఈమధ్య ఎక్కువైపొయ్యారు).
సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది. ఈ వర్గాలు తమ వర్గంవారి ప్రయోజనాలు తప్ప ఇంకే విషయాన్ని సమస్యగా చూట్టం మానేశాయి. పైగా - తమకోసం పక్కవర్గంవాడు మాత్రమే త్యాగం చెయ్యాలనే స్వార్ధపూరిత వాదనల్ని తలకెత్తుకుంటున్నాయి. ప్రజల్లోని అనేక వర్గాలు తమ సొంత ప్రయోజనాల గూర్చే తప్ప, ఇంకే ఇతర సెక్షన్ గూర్చి పట్టించుకోరనే స్పష్టతకి ప్రభుత్వాలొచ్చేశాయి. ఇందువల్ల ప్రభుత్వాలక్కూడా హాయిగా వుంది. ప్రజల్లో లేని సున్నితత్వాన్ని ప్రభుత్వాల్లో ఆశించడం దురాశే అవుతుంది.
ముగింపు :
ఎప్పుడూ త్యాగం చెయ్యాల్సింది ఆదివాసీలేనా?
ఫరే చేంజ్ - ఈసారి మనమే త్యాగం చేద్దాం. ఆ అవకాశం ఇప్పుడు మనకి వచ్చింది కూడా!
గుంటూరు, విజయవాడ ప్రాంతం రాజధానికి అనుకూలం అంటున్నారు కదా? మన తెలుగుజాతి భావి ప్రయోజనాల కోసం, ఈ రెండు నగరాల్లోని ప్రజలం - మన ఇళ్ళూ, భూముల్ని స్వచ్చందంగా ఖాళీ చేసి ప్రభుత్వపరం చేసేద్దాం. ఆవిధంగా - ఒక అద్భుత నగర (సింగపూర్ని తలదన్నే) నిర్మాణానికి మన వంతు చేయందిద్దాం. ఒక జాతి విశాల ప్రయోజనాల కోసం ఎవరోకరు నష్టపోక తప్పదు కదా! అంచేత - ఆ నష్టమేదో మనమే భరిద్దాం. ఈ విధంగా చేసి - తమ నివాసాలపై మక్కువ చూపిస్తున్న ఆదివాసీలకి బుద్ధొచ్చేలా చేద్దాం. ఏమంటారు?
(ప్రత్యామ్నాయంగా మనకి ప్రకాశం జిల్లాలో భూములు ఇస్తార్లేండి.. అవి తీసుకుందాం.) ఇంతకీ - నా సూచన మీకు నచ్చిందా?
(picture courtesy : Google)
"ఆదివాసీలు కూడా మనవాళ్ళే"
ReplyDeleteఈ స్టేటుమెంటు మీ టపాకు కేంద్ర బిందువు. అయితే దీంట్లో నిజమెంత?
ఆదివాసీలకు సొంత వేరే మాతృభాష ఉంది. అంచేత వారు తెలుగు వారు కారు. (తెలుగు వీర లేవరా అంటూ ఎంతో ఉద్రేకంతో పాడిన పాటలో మన్యపోరాటంలోని ఒకే ఒక్క తెలుగు వాడయిన అల్లూరిని ఉద్దేశ్యించి రాసిందయినా అయి ఉండాలి లేదా గిరిజనుల భాష తెలుగు కాదన్న విషయం రచయితకు తెలియక పోయి ఉండవచ్చు)
ఆదివాసీల మతపరమయిన విషయాలు హిందూ మతానికి కొంత దూరంగానే ఉంటాయి. ఉ. వాళ్ళు గొడ్డు మాంసం తింటారు. చాతుర్వర్ణ వ్యవస్తలో వారికి కనీసం పంచమ స్థానం కూడా ఇవ్వబడలేదు. మేము హిందువులము అని గర్వంగా చెప్పుకునే ఆదివాసీలు అరుదు. అంచేత వారు హిందువులు అనికూడా అనలేము.
"మనవాళ్ళు" అనే బిరుదుకు కావాల్సిన అర్హతలు ఇంకా వారికున్నాయా ఆలోచించండి.
అయ్యా, ఇక్కడ మనవాళ్ళే, అంటే ఆదివాసీలు తెలుగువాళ్ళా, హిందువులా, మాంసాహారులా, పంచములా అన్నది విషయం కాదండి.
Deleteవాళ్ళు కూడ ఈ దేశపౌరులే అన్నది విషయం.
ఇలా అయితే ముస్లిములు కూడా మనవాళ్లయే "ప్రమాదం" ఉంది!
Deleteముస్లిములు మనవాళ్ళు కాదని ఇప్పుడు ఎవరన్నారు?
Deleteఅయినా మీకేమయిందండి, ఇలా కామెంటుతున్నారు?
అయ్యా ఐరోపావారు వారిదేశాన్ని అభివృధ్ధిచేసుకోవడంకోసం (వారికి ఆదివాసీల్లాంటి) మనల్ని కాల్చుకుతింటే అది అన్యాయం. మనం అదే అభివృధ్ధి పేరుచెప్పి ఆదివాసీలను వాళ్ళప్రాంతానుంచి తన్నితరిమేస్తే వాళ్ళు విశాలదేశహితాంకోసం త్యాగాలు చెయ్యడానికి సిధ్ధపడకపోవడం ఘోరం.
ReplyDeleteఇంతేసంగతులు
చిత్తగించవలెను
మన దేశంలో ఎన్ని అణువిద్యుత్ కేంద్రాలు అడవుల్లో కట్టరో తెలుసా?, తెలిస్తే వాటి గురించి రాయాలని కోరుతున్నా... డ్యాం లు కొండల్లో మధ్య కాకుండా మైదాన ప్రాతాల్లో కట్టే వీలుంటే ఆ టెక్నాలజీ ని ప్రభుత్వానికి తెలిపితే ఆదివాసీలకు మేలు జరుగుతుంది....
ReplyDeleteఆదివాసులకు మైదాన ప్రాంతాల వారికి వుండే విద్య, ఉద్యొగం, రవాణా, ఆసుపత్రి, సినిమా, టి వి అనేవి ఏమీ లెకుండా అలాగే ఆటవికంగా వుండాలనే వారు కొత్తగా పుట్టుకుచ్చారు. ఈ యాగీ అంతా వాళ్ళ మీద ప్రేమ కారి కాదు, పోలవరం కట్టకుండా గొడవ చెయ్యడానికి ఒక ముడి సరుకు. నక్సలైట్లు తలదాచుకోవడానికి ఇదో మంచి చోటు.
ReplyDeleteఖనిజ సంపద వుండేది అటవీ ప్రాంతంలోనే. ఇది ప్రక్రుతి ధర్మం. ఆ సంపద సమాజంలోకి రావాల్సిందే. పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తూ కూడా ఖనిజాలను తవ్వి తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందదె. సింగరేణి బొగ్గు తవ్వకాల వల్ల పర్యావరణ్ సమతౌల్యం దెబ్బతింటుంది. అలా అని, వదిలేస్తే మనకు కరెంటు వుండదు.
ఆదివాసులకు మైదాన ప్రాంతాల వారికి వుండే విద్య, ఉద్యొగం, రవాణా, ఆసుపత్రి, సినిమా, టి వి అనేవి ఏమీ లెకుండా అలాగే ఆటవికంగా వుండాలనే వారు కొత్తగా పుట్టుకుచ్చారు. ఈ యాగీ అంతా వాళ్ళ మీద ప్రేమ కారి కాదు, పోలవరం కట్టకుండా గొడవ చెయ్యడానికి ఒక ముడి సరుకు. నక్సలైట్లు తలదాచుకోవడానికి ఇదో మంచి చోటు.
ఖనిజ సంపద వుండేది అటవీ ప్రాంతంలోనే. ఇది ప్రక్రుతి ధర్మం. ఆ సంపద సమాజంలోకి రావాల్సిందే. పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తూ కూడా ఖనిజాలను తవ్వి తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందదె. సింగరేణి బొగ్గు తవ్వకాల వల్ల పర్యావరణ్ సమతౌల్యం దెబ్బతింటుంది. అలా అని, వదిలేస్తే మనకు కరెంటు వుండదు.
మరి పాశ్చాత్యుల అనాటవిక(ఆటవికంకాని {high-class-society అంటే పాశ్చాత్య సంస్కృతేకదా. ఇంకా ఆవిలువలను మనం అంగీకరించలేకున్నాంసార్!}) సంస్కృతి మనకుమాత్రం ఇష్టంలేదనా మన సంస్కృతి పరిరక్షకులు వీలైతే కర్రలు/కత్తులు/త్రిశూలాలు చేతబట్టిమరీ రక్షిస్తున్నారు? మీకు టీవీలేకుంటే గడవనంతమాత్రాన అందరికీ అది ప్రాణవాయువు టైపులో అవసరమనుకుంటే ఎలాసార్?! ఎవరికి ఏది ఇష్టమో వారు చెప్పాలేతప్ప మనకు నచ్చిందే వారికీ నచ్చుతుందని తీర్మానించడం ఏమౌతుందంటారు?
Deleteప్రకృతి ధర్మం అంటూ ఏమీ ఉండదు. ఎడారుల్లో పెట్రోలియం దొరకట్లేదా? నగరాల్లో బాక్సైటులూ, గ్రానైటులూ దొరకట్లేదా? ఒక్కసారి ఖనిజాలు దొరకడం మొదలైతే, అక్కడ అంతకుముందున్న పల్లెటూరు/అడవి స్థానంలో పట్టణం వెలుస్తుంది. మీ logic ఒక twisted logic గాక మరొకటి కాదు.
సారూ.. తమ సంస్కృతి గురించి, తమ నాగరికత గురించీ జబ్బలు చరుచుకొనేవారు ఇతరుల సంస్కృతినీ, నాగరికతనీ గౌరవించడం నేర్చుకోవాలి. ఒకణ్ణి మనకోసం త్యాగం చేయమని demand చేసేముందు మనం వాళ్లకోసం ఏం త్యాగం చేశామో ఆలోచించుకోవాలి. దేశమంటే కేవలం మనమే కాదండీ, వాళ్ళుకూడాను.
మీరు సరదాగా ఈ వారాంతంలో "గంగపుత్రులు" సినిమా చూడగలరు.
రమణ గారూ,
ReplyDeleteశ్రిధర్ రాజు, వ్రుత్తాంతి గార్ల పై వ్యాఖ్యలలో కూడా నిజం ఉంది. ఏది ఎమైనా, మీ సూచన నాకు చాలా నచ్చింది. మంచి రాజధాని నిర్మించుకోవటం మనకు ప్రస్తుతం అత్యంత అవసరం. ఎప్పటిలా తెలంగానా వారినీ, కెసిఆర్ నీ తిట్టుకోవటం, లేకపోతే ఆదివాసీలని త్యాగం చేయమనకుండా రాజధాని కోసం ఆంధ్రా వారు (ముఖ్యంగా గుంటురు, విజయవాడ వారు) "త్యాగం " చేయాల్సిన అవసరం/అవకాశం వచ్చింది.
గుంటూరు దగ్గరలో ఉన్న మా 300గజాల స్థలం ఉపయోగపడుతుంది అనుకుంటే అది ప్రభుత్వానికి ఇవ్వటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. :-)
సార్! మీరు ఉంటున్నది గుంటూరే గదా? అయితే గుంటూరు ఉంటూ గుంటూరు వాల్లని త్యాగాలకు పురికొల్పడం మీకు ఈంత దైర్యం సార్? :)
ReplyDeleteరాజధాని బెజవాడకు గుంటూరుకు "మధ్యలో" కడతారట. గుంటూరు"లో" ఉన్న మీ ఇల్లు ఎటుతిరిగీ తీసుకోరు కాబట్టి ధైర్యంగా త్యాగానికి రెడీ అన్నారా?
ReplyDeleteమిత్రులారా,
ReplyDeleteవ్యాఖ్యలకి ధన్యావాదాలు.
ఆదివాసీలకి పునరావాసంలో అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఈ పోస్ట్ రాశాను.
అయితే - ఆదివాసీలకి న్యాయం జరుగుతుందా? లేదా? అనే పాయింట్ మీద వ్యాఖ్యలు రాలేదు!
మాతృభాషలోనే విద్య అనే నినాదంతో కోయ, సవర, కొండరెడ్డి మొదలైన జాతులవారి కోసం (వారి భాషలోనే పాఠ్యపుస్తకాలు) ప్రాధమిక విద్య స్థాయిలో కొంత కృషి జరిగింది. ఈ విషయాల పట్ల ఆసక్తి వున్నవారు జయధీర్ తిరుమలరావు రచనలు చదవమని నా సలహా.
ఆదివాసి ప్రజలను ముంచకుండా ప్రాజెక్ట్ కట్టుదామన్న అందుకు అంగీకరించకపోవడం చూస్తువుంటే ఇది కేవలం కంట్రాక్టర్ల ప్రయోజనం కోసమేనని అనుమానించవలసి వస్తుంది.అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దంగా బేసిన్ లో లేని ప్రాంతాలకు నీరు తీసుకేళ్ళడం అన్యాయమని ఒకవైపు చెబుతున్నా కేవలం కొందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసారు.స్వఛ్చంగాఉన్న ఆదివాసీల సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవన విధానం అన్నింటినీ నాశనం మనం నాగరికం అనుకునే ఈ అనాగరిక జీవన విధానాన్ని వారికి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేయడమే
ReplyDeleteమనోహర్.
Cha baga vundi sir BALAGOPAL sir JALA PATALU ANE BOOK EKKADA DORUKU THUNDI http://balagopal.org/?cat=11
ReplyDeleteI bought it at Vijayawada book fest. pl. check with Visalandhra outlets.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteThe best solution is to give ownership of land and other natural resources to the residents (tribals). Any one who need them should buy it from them voluntarily by paying the prevailing market rates.
ReplyDeleteDevelopment is not a bad word. If you need to sustain the ever increasing population, a growth rate close to 10% is needed. If the economy stagnates, there is going to be poverty and hunger and direr consequences for everybody. It is unfortunate to term all development activities (mining, dams, power plants, heavy industries, etc.) as corporate greed. This is not on either or proposition. We need to exploit the nature in order to survive. Can it be done responsibly and morally without causing undue harm to nature and its inhabitants? Absolutely. That is what the intellectuals and activists should demand. There needs to be proper compensation (way above market rates I would say), relocation and rehabilitation of affected people, but, a small group does not get to veto larger interests of the society. Democracy does not mean putting up with stupidity. Every time somebody utters the words, "common man", you know the common man is doomed. It has become quite fashionable to run an NGO and obstruct progress in all kinds of ways these days. I believe that these NGO types forever want the illiterate poor constituency to further their feel good politics. And that is a charitable explanation actually, because, many of these activities are funded from abroad with national security and religious implications. I applaud the IB for highlighting the dangers of unfettered foreign funding coming to the NGOs. Yes,I am for responsible growth and development.
ReplyDelete