Saturday, 21 June 2014

భాషా రుద్దుడు, గుద్దుడు


భాష యొక్క ప్రయోజనమేమి? భావప్రకటన. భావప్రకటన అనగానేమి? నావంటివాడికైతే 'సర్వర్ బాబూ! రెండిడ్లీ సాంబారు, సాంబారు వేడిగా వుండాలి సుమా'. కవులకైతే 'ఆహా! ఏమి ఈ లలనామణి హొయలొలుకు జఘన సౌందర్యము! ఈ నాట్యమయూరి పదఘట్టము బహుసుందరము, కడుసుకుమారము, అతిలాలిత్యము!'.

ఇలా మనకి మన భాషతోనే అన్నిపనులూ జరిగిపోతున్నప్పుడు, పరాయి భాష నేర్చుకొనుట ఎందుకు? సూటిగా చెప్పాలంటే - ఉపాధి అవకాశాల్ని మెరుగు పర్చుకునేందుకు మాత్రమే (ఒక భాష పట్ల ప్రేమతో నేర్చుకునేవాళ్ళు వేరే కేటగిరీ, ఇక్కడ చర్చ అది కాదు). అందుకే - తెల్లవాడి నౌకరీ కోసం ఇంగ్లీషు విద్య అవసరం అని అగ్నిహోత్రుడికి మన గిరీశం కూడా చెప్పాడు!

ఇప్పుడు కేంద్రం హిందీకి ప్రాముఖ్యతనివ్వాలంటుంది. హిందీ భాష అధికార భాషట! ఇంతకీ అధికార భాష అనగా యేమి? అధికారులు మాత్రమే మాట్లాడే భాషా? సర్లే! ఏదోటి, అధికార భాష కాబట్టి, ఆ భాషకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ప్రాముఖ్యత అంటే ఏమిటి? 'గుంటూరు రైల్వే స్టేషన్' అని తెలుగు, ఇంగ్లీషుతో పాటుగా హిందీలో కూడా వుండాలి. అలాగే - ఎల్లైసీ రశీదుల మీద, టెలిఫోన్ బిల్లుల మీద కూడా హిందీ ఉంటుంది. ఇక్కడిదాకా ఎవరికీ అభ్యంతరం వుండకపోవచ్చు (నాకు మాత్రం లేదు). ఇప్పటిదాకా జరుగుతుందీ ఇదే.

ప్రభుత్వం తన వెబ్ సైట్లలో ఇంగ్లీషుతో పాటు హిందీలో కూడా సమాచారం వుంచుతుంది. మంచిది. ఎంతైనా హిందీ 'అధికార భాష' కదా! తాజాగా సోషల్ సైట్లలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. ఇక్కడ మాత్రం నాకు పేచీ వుంది. సోషల్ సైట్లలో ఏ భాషకి ప్రాముఖ్యతనివ్వాలో చెప్పడం ప్రభుత్వాల పనికాదు.

ఇదే సూచన కాంగ్రెస్ పార్టీవాళ్ళు చేస్తే? భాష గూర్చి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ పట్టింపు లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ! పురాతనమైన పార్టీ! ప్రజాస్వామ్యం ఎక్కువగా వున్న పార్టీ! అందువల్ల - వాళ్లెప్పుడూ ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోలేదు. ఎందుకంటే - కాంగ్రెస్ వాళ్ళు 'స్కాము' వీరులే గానీ, బీజేపీ వాళ్ళలా 'సాంస్కృతిక' వీరులు కారు!

అసలు హిందీతో ఈ గొడవెందుకు వస్తుంది? కొన్ని రాష్ట్రాల్లో హిందీ మాతృభాష, కొన్ని రాష్ట్రాల్లో కాదు. హిందీ వాళ్ళు బాష పేరుతొ తమ మీద పెత్తనం చేస్తారేమోనని హిందీయేతరుల అనుమానం, భయం (నాకీ మాతృ, పితృభాషల్తో పేచీ వుంది. కానీ ఇంకెలా రాయాలో తెలీటల్లేదు). ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాల్లో హిందీ మాట్లాడే వారి ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది (అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా). ఢిల్లీ చుట్టుపక్కల గల్లీ లీడరు కూడా జాతీయ స్థాయి నాయకుడే!

మనం తెలుగు భాష మాట్లాడతాం, ఎందుకంటే - మనింట్లో అదే భాష మాట్లాడతారు కాబట్టి. స్కూళ్ళల్లోఇంగ్లీషు భాషలో సబ్జక్టులు చదువుకుంటాం, ఎందుకంటే - మనకి ఆ భాష అన్నం పెడుతుంది కాబట్టి. ఇప్పుడు కాలేజీల్లో ఇంటర్ స్థాయిలో పిల్లలు సంస్కృతం పరీక్ష రాస్తున్నారు. ఎందుకంటే - తెలుగులో కన్నా సంస్కృతంలో మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి!

మరప్పుడు హిందీ భాష నేర్చుకోవటం ఎందుకు? నాకు తెలిసి హిందీ వచ్చుండటం వల్ల ఒక్కటే ప్రయోజనం, ఎప్పుడన్నా ఉత్తర భారత దేశానికి వెళ్తే ఆటోవాళ్ళు మనని మోసగించకుండా కాపాడుకోగలం! ఇంతకుమించి హిందీ వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. మరి హిందీ భాషని మన పిల్లలు నేర్చుకునేలా చేసేదెలా? సింపుల్ - అమెరికా, ఇంగ్లాండుల్లో కూడా హిందీని 'అధికార భాష'గా చేసినట్లైతే, మన పిల్లలు ఆటోమేటిగ్గా హిందీ మీడియంలోనే చదువుతారు.. ఇంకే మీడియంలోనూ చదవరు!

మన ప్రధాని హిందీలో మాట్లాడతారు. అది ఆయన ఇష్టం, ఆయనకి ఏ భాషలో సుఖంగా, సౌకర్యంగా వుంటే ఆ భాషలో మాట్లాడవచ్చు. రేపాయన గుజరాతీలోనే మాట్లాడతాను అన్నా కూడా నేను స్వాగతిస్తాను. అది ఆయన హక్కు. కానీ, సోషల్ సైట్లలో ఫలానా భాషకి ప్రాధాన్యం ఇమ్మని మాత్రం చెప్పరాదు. ఎందుకంటే - అది ఇతరుల హక్కు. ఎవరికి ఏ భాష ఇష్టమైతే ఆ భాషే వాడుకునే స్వేచ్చ కల్పించటం ప్రజాస్వామిక స్పూర్తి అని నమ్ముతున్నాను.

హిందీ జాతీయ భాష కాదు, అధికార భాష మాత్రమే! ఒకవేళ జాతీయ భాషైనా మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. జాతీయ పక్షి నెమలిని అడవుల్లో వేపుడు చేసుకుని విస్కీలో నంజుకుంటున్నారు. జాతీయ క్రీడైన హాకీలో - జట్టుకి ఎందరుంటారో కూడా చెప్పలేని దుస్థితి! కాబట్టి - మనకి భావనలో జాతీయత వుంది కానీ, చేతల్లో జాతీయత ఉన్నట్లుగా తోచదు.

హిందీ భాషలో మాధుర్యం వుంది, మంచి సాహిత్యం వుంది.. ఇత్యాది ఊకదంపుడు మాటలు నేను నమ్మను. ఏ భాషకి మాత్రం ఏం తక్కువ? అన్నిట్లో అన్నీ వున్నాయి. కన్నడం తక్కువా? బెంగాలీ తక్కువా? అన్నీ సమానమే. ఏ భాష సొగసు ఆ భాషదే!

పీవీనరసింహారావుకి చాలా భాషలొచ్చుట. ఆయన అన్ని భాషలు ఎందుకు నేర్చుకున్నాడో మనకి తెలీదు కానీ, ఆయనా భాషల్ని ఎంతో ఇష్టంగా నేర్చుకునుంటాడు. అలాగే ఎందఱో విద్యావంతులు బహుభాషా పండితులు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం - ఒక భాషని ఇష్టపూర్వకంగా నేర్చుకోటం వేరు, రుద్దించుకోటం వేరు అన్నది.

నా భయమల్లా - ఈ రుద్దుడు కొంతకాలానికి గుద్దుడు స్థాయికి వెళ్తుందేమోనని!

గమనిక :

నాకు కొద్దిపాటి హిందీ కూడా రాదు. అందువల్ల - ఈ పోస్టులో మీకు కొంత ఉక్రోశం, మరికొంత ఆక్రోశం, ఇంకా కొంత ఆక్రందన కనిపిస్తే.. తప్పు నాదే!

(picture courtesy : Google)

39 comments:

  1. I am for choice and freedom of languages. I think the government clarified about the social media language. Hindi apparently will be used in Hindi speaking states. Nothing wrong with that as long as English is not abolished as a link language and other languages are not suppressed. English speakers in India are often automatically seen as educated, erudite and cultured and this misconception I think needs to be quickly dispelled.

    You said the congress party has democracy, really?! You must be kidding! And also to think congress is above linguistic and cultural fray is incorrect. They are the ones that caused the biggest ruckus vis-à-vis imposition of "national language" that burned Tamilnadu in 1965. The protests started after a clash between students and congress party members that resulted in a riot in Madurai and soon engulfed the entire state that resulted in arson, looting, police firings and death of 70 people. Soon there after DMK came to power and Congress was forever banished from ruling the state since.

    And I very much doubt cultural neutrality of Congress. Thy were just as likely to use caste and religious groupings to win elections as anybody else. Increasingly, they have become anti-Hindu and anti-so called upper castes in the last few decades. Mayawati's formula is actually the one Congress perfected previously.

    ReplyDelete
    Replies
    1. >>You said the congress party has democracy, really?! You must be kidding!

      yes boss, i am kidding. :)

      Delete
  2. ..... "ఏ భాషకి మాత్రం ఏం తక్కువ? అన్నిట్లో అన్నీ వున్నాయి. కన్నడం తక్కువా? బెంగాలీ తక్కువా? అన్నీ సమానమే. ఏ భాష సొగసు ఆ భాషదే!"


    Well said sir !!!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      (ఏవిటో! అప్పుడప్పుడు బాగా రాసేస్తుంటాను. హిహిహీ!)

      Delete
  3. ఆ సూచన అందరికీ కాదండీ కేవలం అధికారిక కార్యక్రమాల గురించి చేసె పోస్ట్ లకి మాత్రమె .. ఉదా: ఒక జిలా కలెక్టరు కలెక్టరు హొదా లో ప్రభుత్వ పథకాల గురించి పోస్ట్ చేస్తే హింది లో చేయాలని ప్రభుత్వం ఉద్దేశ్యం మీరు....నేను సోషల్ మీడియాలో ఏ భాష అయినా వాడొచ్చు ..పై ఉదాహరనలొ సదరు కలెక్టరు తన పేరిట వేరె అకౌంటు ఉంటే అందులో తన ఇష్టం వచ్చిన భాష వాడొచ్చు ...

    అసలు ఈ సూచన ప్రకారం అకౌంటు కల్గిన అధికార య త్రాంగం చాల తక్కువ!.

    కానీ మన తమిల తంబి ల ఆరాటం రాజకీయం చేసి భా జ పా నొ తమిలులకి దూర్ అం చెయ్యటం కోసమే.

    ఒక మంత్రిత్వ శాఖ గనక తమ చర్యలను టీట్ చేయాలనుకుంటే ..... కానీ అసలు అలాంటి అకౌంట్లు ఎక్కువ లేవు...
    తమిళులు తాము తమిలమే వాడుతాం అంతే బాగుండేఇ కానీ అలా అనక రాజకీయ లభం చూసి రాద్ధాంతం చేస్తున్నారు.....
    ఇది అందరూ వాడాలి అనే ఆర్డర్ కాదు సామాన్యులు ఏ భష వాడినా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కి సంబంధం లేదు.

    ReplyDelete
    Replies
    1. అబ్బే! మనకన్ని వివరాలు అనవసరం. హిందీ రుద్దుతున్నారనే అనుమానం వచ్చేసినంతనే ఈ పోస్ట్ రాసేశాను.

      చూశారుగా? మన పోస్టు చదివి సెంట్రల్ గవర్నమెంటు వణుక్కుంటూ వెనక్కిపోయింది! అదీ మన పోస్ట్ పవర్. :))

      Delete
  4. అసలీ "హిందీ చరిత్ర యేమిటి?" అని సందేహం వొచ్చి గూగులిస్తే క్లుప్తంగా ఇది:

    The dialect upon which Standard Hindi is based is Khariboli, the vernacular of Delhi and the surrounding western Uttar Pradesh and southern Uttarakhand region. This dialect acquired linguistic prestige in the Mughal Empire (1600s) and became known as Urdu, "the language of the court". In the late 19th century, the movement standardising a written language from Khariboli, for the Indian masses in North India, started to standardise Hindi as a separate language from Urdu, which was learnt by the elite. In 1881 Bihar accepted Hindi as its sole official language, replacing Urdu, and thus became the first state of India to adopt Hindi.

    దాని మొదటి రూపంలో అది కూడా డిల్లీ వోళ్ళు మాట్లాడుకున్న ఒక ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాషే.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు,

      ప్రస్తుతానికి వెనక్కిపోయిన ఈ హిందీ - దొడ్డిదోవన, ఏదోరూపంలో మళ్ళీ వచ్చే ప్రమాదం పొంచి వుంది.

      మనం ఇకముందు కూడా జాగ్రత్తగా వుండాలి. రాత్రిళ్ళు నేను కాచుకుంటాను, పగళ్ళు మీరు చూసుకోండి. :))

      Delete
  5. Disclaimers: హిందీ లేదా ఎ భాషనయినా రుద్దడానికి నేను వ్యతిరేకం. ఇకపోతే సోషల్ మీడియాలో ప్రభుత్వ అధికారులు (ఎ భాషలోనయినా) దూరడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకయితే అర్ధం కాలేదు.

    ఇక విషయానికి వద్దాం. హిందీ కేవలం ఉత్తరాదిన ఆటో వాళ్ళతో మాట్లాడానికి పనికి వస్తుందా? అలా అయితే ఆటో ఎక్కడానికి సరిపోయినాన్ని డబ్బులు లేని వారికి హిందీ నేర్చుకొనే అవసరమే లేదన్నమాట.

    దేశంలో కొన్ని కోట్లమంది హిందీ/ఉర్దూ వారున్నారు. ఇంకా ఎన్ని కోట్ల మందో ఈ భాష(ల)ను మాట్లాడగలిగిన వారు. ఇంకా పంజాబీ/గుజరాతీ లాంటి భాషలు మాట్లాడే ఎందరో హిందీ కొద్దోగొప్పో అర్ధం చేసుకోగలరు మరియు కొంచం కష్టంతో నేర్చుకోగలరు. ఒరిస్సా వారు హైదరాబాదులో సర్వరు ఉద్యోగం చేసినా, గూర్ఖాలు బెంగుళూరులో వాచుమాన్ పనిలో ఉన్నా, అస్సామీయులు బొంబాయిలో హమాలీగా ఉన్నా ఇదంతా హిందీ చలువే. అంతెందుకు హిందీ నేర్చుకుంటే దేశంలో రెండు మూడు రాష్ట్రాలు మినహా ఎక్కడయినా బతికేయొచ్చు.

    ఇంగ్లీషు నేర్చుకోవాలంటే ఖర్చు కష్టం అవసరం. అంత మొత్తాన్ని వ్యయం చేసే స్తోమతు లేని బీదవారికి దేశ ఉపాధి బాజారు తెరిచే తాళం హిందీ. అమెరికా నామజపం కలలో కూడా చేయలేని వారికి బతుకు తెరువు ఇవ్వగలిగిన భాషను తేలికగా కొట్టేయలేము.

    భాష యొక్క భావప్రకటనలో "ఆరో నంబరు పానా అందివ్వు", "సార్ మీ బిల్లు ఇరవై రూపాయిలు", "ఎన్ని లీటర్లు పోయాలండీ", "అమ్మగారూ బాసన్లు కడగడం అయిపొయింది" వగైరాలు కూడా ఉన్నాయి. ఇవి హిందీలో అనడం నేర్చుకోవడం మరీ కష్టం కాదేమో.

    ReplyDelete
    Replies
    1. గుంటూరులో వ్యాపారాలు చేస్తున్న జైన్స్ తెలుగు చక్కగా మాట్లాడతారు. అలాగే ఆటోమొబైల్ spare parts వ్యాపారం చేస్తున్న అనేకమంది సిక్కులు స్వచ్చమైన తెలుగు మాట్లాడతారు. క్వారీ కార్మికులైన తమిళులు చక్కటి తెలుగు (తమిళ యాసతో) మాట్లాడతారు. ఇవన్నీ భాషా అవసరాలు, తప్పదు.

      మరి - హిందీ స్పెషాలిటీ, గొప్పదనం ఏంటో తెలీదు.

      కానీ - సంఘపరివార్‌కి హిందీ అంటే మక్కువ! ఎందుకో!?

      Delete
    2. రమణ గారూ, సంఘ పరివారుకు హిందీ పచ్చ కామెర్ల పార్టీకి తెలుగు, శివసేనకు మరాఠీ ఇట్లా ఎందరికో ఎంతో భాషా దురహంకారం ఉంది. దాన్ని వార్వారి మరియు వారి చంచాల విచక్షణకు వదిలేద్దాం.

      హైదరాబాదులో నాకు తెలిసిన వ్యక్తులెందరో ఇంటి పక్క మార్వాడీ దుకాణం కాదని ఇరవై నిమిషాలు ప్రయాణం చేసి "అసమదీయుల" కొట్టుకెళ్ళే వారున్నారు. పైగా "మార్వాడీ వెధవ వాడికి ఇక్కడ పనేంటి" అనే కామెంట్లు. సదరు మార్వాడీ నాలుగు తరాల నుండి ఇక్కడే ఉన్నాడని తానె నిన్నమొన్న వచ్చానని కానీ హైదరాబాదులో ఉర్దూ శతాబ్దాలుగా అగ్రస్థానంలో ఉందనే సోయి కానీ వీరికి ఉండదు.

      ఇంతకీ నా వ్యాఖ్యలో ఇంగ్లీషు నేర్చుకొనే అవకాశం లేని "అలగా జనం" హిందీ ద్వారా ఎలా బాగు పడతారో అన్న విషయం చెప్పాను. దీని గురించి మీరు స్పందించలేదు.

      కొంతవరకు నా వ్యాఖ్యలో హిందీ ప్రస్తావనను ఉదాహరణగా తీసుకోవచ్చు: ఇదే మాట పాక్షికంగా తమిళ కన్నడ తదితర భాషలకు కూడా వర్తిస్తుంది. ఒకప్పుడు హిందూపురం/ఆదోనీ ప్రాంతాలలో కన్నడ, చిత్తూరు/గూడూరు లాంటి ఊళ్లలో తమిళం అందరికీ రావడం వల్ల వారికి బెంగుళూరు/చెన్నయి నగరాలలో కనీసం కూలి దొరికేది. ఇటీవలి (> 1983) తెలుగు రుద్దుడు వల్ల ఆ అభాగ్యుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి.

      Delete
    3. ఇంకో రంగు చెంచాల గురించి లేదే , అవి స్పూన్స్ కన్నా పెద్ద సైజు అని ఇక్కడ mention చేయలేదా .
      మావన్నీ మా అసమదీయులకే అని మాట్లాడేవాళ్ళు ఇది చెప్పటం 'kettle called the pot black' అన్నట్లు లేదు బొత్తిగా .



      Delete
    4. @Jai,

      నాకు హైదరాబాద్‌లో ఏదో పనుండి (కాన్ఫరెన్స్ లాంటివి) ఒకట్రెండ్రోజులు (అదీ హోటల్ రూములో మాత్రమే) వుండడమేగానీ, ఆ ఊరితో పెద్దగా పరిచయం లేదు.

      ఏ భాషైన తెలుసుంటే మంచిదే. అందులో కాదనడానికేమున్నది!

      NH 5 పొడుగుతా వున్న అన్ని ఢాబాల్లో వంట చేసేది ఒరియావారు. అదీ ఒరిస్సాలోని ఒక జిల్లాకే చెందినవారు.

      కూలీ పన్లకి భాష తెలియాల్సిన అవసరం వుందా! (నాకు తెలిసి కూలీలు ఒక ముఠాగా ఏర్పడి ఒక మేస్త్రీ కింద పనికి వెళ్తారు, అవసరమైనంత మేరకు అక్కడి లోకల్ భాష నేర్చుకుంటారు).

      ఏ భాషనైనా నేర్చుకోటం సమస్య కాదని నా అభిప్రాయం - ఎటొచ్చీ నేర్చుకునే అవసరం పడాలి. లేకపోతే ఎక్కళ్ళేని బద్దకం వచ్చేస్తుంది.:)

      Delete
    5. జై గారి వ్యాఖ్యలు చదివితే ఆంధ్రా చుట్టిన వీరుడిలా కనిపిస్తారు :) వారికి ఒరిస్సా లో ని బరంపురం, శ్రీకాకుకుళం నుంచి తమిళనాడులోని హోసుర్ వరకు ప్రతి పల్లే తో పరిచయం ఉన్నట్లు చదివేవారికి అనిపిస్తుంది. ఇక తెలంగాణ గురించి వారి అవగాహన చెప్పకర్లేదు. నిజం చెప్పండి జై గారు ఒకప్పుడు చిత్తూరు/గూడూరు లాంటి ఊళ్లలో తమిళం అందరికీ వచ్చేదా? తెలుగుదేశం పార్టి వచ్చిన తరువాత తెలుగు రుద్దుడు ఎక్కువై అభాగ్యుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయా? మీ విశ్లేషణ వాస్తవానికి దూరంగా ఉంది. నిజానికి తెలుగు ప్రభావం మొదటి నుంచి కర్ణాటకలో ఎలా ఉండేది అంటే, చిత్తురు జిల్లా పక్కనే ఉండే కోలర్ జిల్లాలో (కోలార్, చింతామణి,గౌరి బిదునురు) కనడం తెలిసినవారు లేక, స్కూల్స్ లో టిచర్లు కనడ భాషను తెలుగులో భోదించే వారు. అంటే కనడ పద్యం చదివి దాని అర్థం తెలుగులో చెప్పేవారు.
      భాష రుద్దుడు గురించి తెలుసుకోవాలంటే ఒకసారి తమిళనాడు లోని తిరువళ్లూరు,తిరుత్తణి చూస్తే అర్థమౌతుంది. ఇప్పటికి ఎంతో మంది తెలుగు వారు అక్కడ ఉన్నా,రాజకీయంగా, సాంస్కృతికంగా తెలుగు భాషతో ఎంతో అనుబంధం ఉన్న ఈ ప్రాంతాలలో చిన్న తెలుగు బోర్డ్ కూడా ఎక్కడా కనపడదు. కమ్యునిస్ట్ పుచ్చలపల్లి సుందరయ్య తిరువళ్లూరు లోనే చదువుకొన్నాడు అన్న విషయం మీకు తెలిసి ఉంట్టుందనుకుంటాను. తెలుగు భాష ను తెలుగుదేశం పార్టి ప్రజలపై రుద్దలేదు.తెలుగు వారి మీద తెలుగు రుద్దటమేమిటి? భాషాభిమానం రామారావు కి సహజం గా ఉంది. అధికారంలో ఉన్నపుడు దానిని వ్యక్త పరిచాడు అంతే. తెలుగు రుద్దుడు వలన మన వారు ఆ రాష్ట్రాలలో ఉపాధి అవకాశాలు ఎమీ కోల్పోలేదనుకొంటాను.

      Delete
    6. శ్రీరాం గారూ, ఎక్కడ ఏ భాషలో బోర్డులు ఉన్నాయో ఏ కామ్రేడు ఎక్కడ చదువుకున్నాడో అన్న విషయాలు ముఖ్యం కాదని నా ఉద్దేశ్యం. భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి పెరిగిందో లేదో అనే మాటపై మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది.

      ఒక భాష ప్రభావం తత్తిమ్మా వారిపై ఉండడం ఆ భాష గొప్పదనం అని నేను అనుకోను. అసలు మా భాష గొప్పదంటే మాది గొప్పదనే గొడవ జోలికి నేను వెళ్ళను. I am indifferent to the debate on the alleged superiority of any language.

      Delete
  6. "నాకు తెలిసి హిందీ వచ్చుండటం వల్ల ఒక్కటే ప్రయోజనం, ఎప్పుడన్నా ఉత్తర భారత దేశానికి వెళ్తే ఆటోవాళ్ళు మనని మోసగించకుండా కాపాడుకోగలం!"

    ఇది అన్యాయమండి. మీరు హైదరాబాదులో లేదా విజయవాడలో ఆటోవాళ్ళు మోసం చెయ్యకుండా కాచుకోగలరా?

    ఎవరి భాషని వాళ్ళు గౌరవించుకోవటం వరకు ఒకే, కాని మరో భాషని వ్యతిరేఖించటంలో అర్థం లేదు. కొన్ని వృత్తులకి హిందీ నేర్చుకోవడం అక్కర్లేదేమో కాని, చాలా వ్యాపారాలకి, ఉద్యోగాలకి హిందీ అవసరం. ఆటోవాడి మోసం వందల్లో ఉంటే, వ్యాపారాల్లో మోసాలు ఎంతైనా ఉండచ్చు. గతంలో నా తమిళ కోలీగ్ హిందీ రాక, ప్రాజెక్ట్ సైటులో లేబర్‌తో కూడ ఇంగ్లీషులో మాట్లాడుతూ నానా కష్టాలు పడేవాడు.

    @ హరిబాబు: అలహాబాదు, వారాణసి ప్రాంతాల్లో శుద్ధమైన హిందీ మాట్లాడుతారు. అది సంస్కృతానికి, మన గ్రాంధిక తెలుగుకి దగ్గరగా ఉంటుంది. అలహాబాదుకి చెందిన అమితాబ్ బచ్చన్ భాష (ముంబయి మసాలా సినిమాలలో కాదు) మీరు గమనించినట్లయితే ఈ తేడా తెలుస్తుంది.




    ReplyDelete
    Replies
    1. నేను ఏ భాషకీ వ్యతిరేకం కాదు. రుద్దాలని చూస్తే మాత్రం ఏ భాషనైనా వ్యతిరేకిస్తాను.

      నేను కర్ణాటకలో పీజీ చేశాను. రోజూ పేషంట్లతో చాలా మాట్లాడాలి కనుక (చచ్చినట్లు) కన్నడ భాష నేర్చుకున్నాను. అది నా అవసరం. అలాగే - నార్త్‌లో పీజీ చేసిన నా స్నేహితులు హిందీ నేర్చుకున్నారు.

      ఉద్యోగ వ్యాపార అవసరాల రీత్యా కొన్ని భాషలు తెలుసుకోవలసి వుంటుంది.. అది తప్పదు.

      అందువల్ల - నేచెప్పేదేమనగా - ఇంగ్లీష్ మనం ఎందుకైతే నేర్చుకుంటున్నామో, అందుకోసమే (అవసరం అయితే) ఏ భాషనైనా నేర్చుకుంటాం (మనకి ఇష్టమున్నా, లేకపోయినా).

      Delete

  7. హిందీని నేర్చుకుంటే మంచిదే.ఇండియాలో అధికప్రాంతాల్లో హిందీతో నెగ్గుకురావచ్చును,ఐతే ఇది ఐచ్చికంగా మాత్రమే జరగాలి.హిందీయేతరరాష్ట్రాలపైనమాత్రం రుద్దకూడదు.ఉత్తరాదివాళ్ళు మాత్రం హిందీని మనమీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మనం జాగ్రతగా ప్రతిఘటిస్తూ ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు. అమ్మయ్య! నా పోస్టు మొత్తాన్ని నాలుగు ముక్కలకి కుదించారు. థాంక్యూ సర్. :)

      Delete
  8. భారత రాజ్యాంగం హిందీనే అధికార భాషగా చెప్పలేదు. ఇక జాతీయభాష ముచ్చట అందులో లేనే లేదు. రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికార భాషలు 22. అధికరణం 343 (1) ప్రకారం దేవనాగరి లిపిలో ఉన్న హిందీ కేవలం యానియన్ గవర్నమెంట్కు అధికార భాష. దేశమంతటికీ కాదు. రాష్ట్రాలు 22 అధికార భాషల్లోంచి ఒకదాన్నో, రెంటినో తమ అధికార భాషలుగా స్వీకరించే స్వేచ్ఛ ఉంది. హిందీని అధికార భాషగా రుద్దడం అంటే మన అధికార భాష తెలుగును అధికార భాష కాదనుకోవడమే. అందుకే తమిళ తంబీలు హిందీ రుద్దుడు వ్యతిరేకంగా గొంతెత్తేది.

    ReplyDelete
    Replies
    1. అవున్నిజం. 100% మీతో ఏకీభవిస్తున్నాను.

      Delete
    2. అదే స్పూర్తితో తెలుగు గురించి కూడా ఆలోచించండి. అవశేష ఆంద్ర రాష్ట్రంలో ఆరు జిల్లాలలో ఉర్దూ కూడా అధికార భాషే. ఆంధ్రలో తెలుగేతరులపై తెలుగు రుద్దడం కూడా ప్రతిఘటించాలి.

      Delete
    3. అవశేష ఆంద్ర రాష్ట్రంలో ఆరు జిల్లాలలో ఉర్దూ కూడా అధికార భాషే. ఆంధ్రలో తెలుగేతరులపై తెలుగు రుద్దడం కూడా ప్రతిఘటించాలి

      జైగారు,
      ఉర్దూ అధికార భాష కావటానికి ఓటు బాంక్ రాజకీయలు కూడ ఒక కారణం. బాబు గారు బిజెపి తో జతకడుతున్నపుడు మైనారిటి ఓట్లు పడవని హెచ్చారించారు. అలాగే మైనారిటిలు ఆయనకు ఓట్లు వేసినట్లు లేదు కూడాను. ఆయన బిజెపి తో జత కట్టాడు. ఎన్నికలలో గెలిచాడు. ఆంధ్రా వరకు చూస్తే మైనారిటి ఓటు బాంకు కాలం చెల్లింది. రానున్న రోజులలో రాజకీయపార్టిలు సీమాంధ్రలో , మునుపటి వలే మైనారిటి జపం చేయరు. బహుశా ఇక ఆ భాషకు ఆంధ్రలో అంత ప్రాముఖ్యత లభించకపోవచ్చు(అసలికి బాబు గారిచ్చినేన్నికల వాగ్దానాలు నెరవేరాలంటే అయ్యేపనికాదు.ఇక భాషను కూడా ఉద్దరించగలడా? ) కనుక తెలంగాణ వారే పెద్ద మనసు చేసుకొని ఆ భాష గత వైభవాన్ని పునరుద్దరించాలి. పక్క రాష్ట్రమే కనుక సీమాంధ్రా వారు కూడా వచ్చి తెలంగాణా రాష్ట్రంలోని పాఠశాలలో ఉర్దును అభ్యసిస్తారు. వారిని వలసవాదులు అని ముద్ర వేయకుండా ఉంటే,వారికి మీరు గొప్ప సహాయం చేసినవారౌతారు.

      Delete
    4. ఉర్దూకు అధికార భాష హోదా ఇవ్వడంలో పాపం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదనుకుంటా.

      Delete
  9. Hyderabad lo Hindi rakapothe koncham kastam. Auto drivers dagara nunchi andaru manaki Hindi raadu ani telisthe manatho kavalani Hindi lo ne matladataru .

    Nenu pani chese software company lo team meetings lo Hindi lo matladataru. Though we have rule to use only English.

    ReplyDelete
    Replies
    1. >>Nenu pani chese software company lo team meetings lo Hindi lo matladataru. Though we have rule to use only English.<<

      ఇది భాషా తాలిబానిజం.

      నా పీజీ రోజుల్లో, నా సీనియర్ అయిన ఉత్తర భారతీయురాలు నాకు హిందీ తెలీనందుకు తెగ చిరాకు పడుతుండేది. ఆవిడకి దక్షిణ భారతీయులు రాక్షస సంతతని ఘాట్టి నమ్మకం. ఒకసారి - 'సౌత్‌లో అందరూ దళితులే కదా!' అన్నది. అలా అనడంలో నాకు ఆమె రాజకీయ అజ్ఞానం కన్నా ప్రాంతీయ అహంకారమే కనిపించింది.

      ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇలా బ్లాగులు రాసుకుంటూ నిట్టూర్చడం మినహా - చెయ్యగలిందేమీ లేదు.

      Delete
    2. ఇదంతా చదువుతుంటే ఒక అనుభవం గుర్తుకు వచ్చాయి మదరాసులో (అప్పటి కింకా చెన్నై కాలేదు!) ఒక కష్టమరుదగ్గరకు ఆఫీసుపనిమీద వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు.

      భాషాభిమానం వేరు భాషాదురభిమానం వేరూ.

      మొదటిది, వారి మెయిన్ గేటువద్ద రిజిష్టరులో తమిళంలో సంతకం చేయాలని పట్టుబట్టారు. మాకు రాదని, మేము అఫీషియల్ విజిట్ కోసం వచ్చామన్నా వినలేదు. హోటల్‍కు తిరిగి వెళ్ళిపోయాము. విషయం తెలిసి వాళ్ళే వచ్చి క్షమాపణ చెపుకుని తీసుకెళ్ళారు.

      ఒకనాడు అఫీషియల్ మీటింగ్‍లో కష్టమరు తరపువారంతా తమీళంలోనే వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవటం మొదలు పెట్టారు మధ్యలో. నేనూ నా తోడి వారమూ అభ్యంతరం చెప్పామ. మా బ్రాంచిమేనేజరూ ఉన్నాడు మీటింగులో. ఆయనా తమిళుడే. ఆయనకూ కోపం వచ్చింది. నిరసనగా మీటింగులోంచి లేచి మా బసకు వెళ్ళిపోయము. ఆ తరువాత కష్టమరు తరపువారు హోటలుకు వచ్చి మరీ క్షమాపణ చెప్పినట్లు గుర్తు.

      అలాగే ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కూడా గుర్తుంది. విదేశీయురాలొకామె రెండువైపులా హిందీలోనే ముద్రించిన రిజర్వేషన్ ఫారం నింపలేక అవస్థ పడుతుంటే మేమ సహాయం చేసాము. అక్కడి సూపర్వైజర్లని నిలదీస్తే మీకెందుకు హిందీ రాదు అని అందర్నీ కోప్పడ్డారు!

      Delete
  10. ఈ రోజు TOIలో శోభాడే ఇదే విషయంపై వ్రాసారు. మీరు ఒక రోజు ముందే వ్రాసేసారు. గుడ్!

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      థాంక్యూ! శోభాడే కన్నా ఒక డే ముందే రాసేసినందుకు నాక్కూడా ఆనందంగా వుంది. :)

      Delete
  11. "ప్రస్తుతానికి వెనక్కిపోయిన ఈ హిందీ - దొడ్డిదోవన, ఏదోరూపంలో మళ్ళీ వచ్చే ప్రమాదం పొంచి వుంది.

    మనం ఇకముందు కూడా జాగ్రత్తగా వుండాలి. రాత్రిళ్ళు నేను కాచుకుంటాను, పగళ్ళు మీరు చూసుకోండి. :)), " If you feel sleepy, you tell me, i will help you.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ మిత్రమా! I will. :)

      Delete
  12. నాకైతే హిందీ మీద ద్వేషం యేమీ లేదు.తొలి దశలో అదీ ఒక ప్రాంతానికి సంబంధించినదే అనేది దాని చరిత్రని తెలుసుకోవడం వరకూ మాత్రమే ముఖ్యం. ఒకరు హిందీ రుద్దుడు అనీ ఇంకొకరు తెలుగు రుద్దుడు అనీ అనటం వల్లనే మన దేశంలో లింక్ లాంగ్వేజి గా విదెశీ భాష ఇంగ్లీషు స్థిరపడి పోయింది. మెల్ల మెల్లగా ఈ భాషల్లోని అందాన్నంతా చంపేసి గిరీశం మార్కు బొట్లేరు భాష మనకి మాతృభాష అయిపోయింది?! :-))

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు నాకు హిందీ నేర్చుకునే ఓపిక లేదు.

      అంచేత - లింక్ లేంగ్వేజ్‌గా హిందీ కాకుండా ఇంగ్లీష్ వుంటేనే మంచిదని నా అభిప్రాయం. :)

      Delete
    2. అందరి ప్రాబ్లెమూ అదేనండి!

      Delete
    3. బొట్లేరు భాష అని మనం బాధ పడాల్సిన అవసరంలేదండీ. ప్రస్తుత స్వేఛ్ఛావిపణి ప్రపంచంలో, unexplored market(at least not thoroughly explored/exploited market) ఐన ఇండియాలోవున్న వందకోట్లమంది ఇంగ్లీషు స్వరూపాన్ని శాసించగలరు. They have to speak the way we speak only. For they need to address us in a language-style we understand only :-)

      Delete
  13. కానీ - సంఘపరివార్‌కి హిందీ అంటే మక్కువ! ఎందుకో!?
    రమణ గారు,
    దీనికి సమాధానం పైన జై గారు చెప్పేశారు. సామాన్య ప్రజలకు హింది భాష, చదువుకొన్న వారికి ఇంగ్లిష్ భాష లాంటిది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు కాష్మీర్ నుంచి శ్రీలంక వరకు చాలా మంది ప్రజలకి హింది అర్థమౌతుంది. శ్రీలంకలో తమిళ్ సినేమాల కన్నా హింది సినేమాలని చాలామంది చూస్తారు. గల్ఫ్ లో కూడా హింది సినేమాలకు, సంగీతానికి ఎంతో ఆదరణ ఉంది. పశ్చిమదేశాల వారికి భారత దేశం సాఫ్ట్ పవర్ లో పోటి ఇచ్చినట్లు మిగతాదేశాలు ఇస్తాయని అనుకోను. ఇండియా తో పోలిస్తే చైనా సాఫ్ట్ పవర్ సోదిలోకి కూడారాదు. హింది బాష భారతదేశ సాఫ్ట్ పవర్ కి చాలా దోహదపడుతుంది. కనుకనే చాలా మంది సంఘ్ పరివార్ నాయకులు స్వయంగా హింది వారు కాకపోయినా , హింది భాష భారత దేశ ప్రజలను కుల,మతాలకు అతీతంగా అనుసంధానించే భాషగా, సాఫ్ట్ పవర్ కి చిహ్నంగా గుర్తించి గౌరవిస్తారు. భారత ఉపఖండం లోని ప్రజలు దేశాలు గా విడిపోయినా హింది భాష అనుసంధానం చేస్తుందని సంఘ్ పరివార్ వారి అభిప్రాయం కాబోలు.

    ReplyDelete
    Replies
    1. అవును, అయ్యుండొచ్చు.

      ఒక సంస్థగా సంఘపరివార్ భాషపై కొన్ని అభిప్రాయాల్ని కలిగుండొచ్చు. అది ఆ సంస్థ ఇష్టం.

      కానీ - సంస్థలు వేరు, ప్రభుత్వాలు వేరు.

      Delete
  14. మీరు అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం రాశాను. సోషల్ మీడీయాలో హిందీ భాష ను ఉపయోగించే ప్రభుత్వ నిర్ణయానికి, సంఘ్ పరివార్ కి సంబంధం ఎమి లేదు. ఆ నిర్ణయం గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొంది. కొత్త ప్రభుత్వం దానిని అడ్డుకోలేదు అంతే.
    Hindi in SM decision 10/3/14, circular issued 27/3/14. Rajnath Singh took office 29/5/14

    ReplyDelete
  15. Pls see second para ( Hindi in SM decision 10.03.2014)

    https://twitter.com/rahulkanwal/status/479622399495663616/photo/1

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.