Saturday, 4 February 2012

కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం

"కా.. కా.. " ఒక కుర్రకాకి ఆవేశంగా నృత్యం చేస్తుంది.

ఆ శబ్దానికి ఆ పక్కనే వున్న చెట్టుతొర్రలో నిద్రోతున్న కాకికి నిద్రాభంగం అయింది. ఆ కాకి ముసల్ది. పైగా దానికి షుగరు, బిపి. ఆ రోగిష్టి ముసలికాకి కుర్రకాకిని మందలిస్తూ "కా.. కా.. " అని అరిచింది.

లిపి లేని ఈ కాకుల 'కా' భాష మీకు తెలీదు కావున మీ కోసం 'కా' భాషని అనువదిస్తూ - ఇది స్వేచ్చానువాదం అని మనవి చేసుకుంటున్నాను. 

అది ఖమ్మం పట్టణం, సిపియం రాష్ట్రమహాసభలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పట్టణం నెత్తురుగడ్డయిపోయింది. వీధులన్నీ ఎర్రరంగులోకి మారిపోయాయి. నాయకుల ఉపన్యాసాలన్నీ శ్రద్ధగా విన్నది ఒక కుర్రకాకి. నేతల ప్రసంగాలకి ఉర్రూతలూగిపోయింది, ఉద్రేకపడిపోసాగింది.

"విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్." అని అరుస్తూ గద్దర్ స్టైల్లో డ్యాన్స్ ప్రారంభించింది.

ముసలికాకి కుర్రకాకికి వరసకి తాతవుతాడు.

"ఒరే మనవడా! ఆగాగు, యాభయ్యేళ్ళ క్రితం నేనూ నీలాగే డ్యాన్స్ చేశా. అప్పుడు మహానాయకులైన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరి - చూస్తేనే వొళ్ళు పొంగిపోయేది. ఆరోజుల్లో ఎర్రరంగంటే ప్రభుత్వాలు గజగజలాడేవి. అప్పట్నించి డాన్స్ చేస్తూనే ఉన్నా. డాన్స్ చేసీచేసీ కీళ్ళనొప్పులు మాత్రం మిగిలాయి. అవే ఉపన్యాసాలు, వినీవినీ చెవుల్లోంచి నెత్తురొచ్చింది. కానీ వీళ్ళు చెబ్తున్న విప్లవం మాత్రం రావట్లేదు." అంటూ 'కా.. కా..' అని దగ్గాడు ముసలికాకి.

కుర్రకాకికి  చిర్రెత్తింది.

"తాతా! నువ్వు పెసిమిస్టువి. ఆ ఎర్రచొక్కాలు చూడు, ఆ చిందులు చూడు. ఆ వేలమంది కార్యకర్తల్ని చూస్తే 'ఉందిలే మంచికాలం ముందుముందునా' అనిపిస్తుంది." అంటూ మళ్ళీ గంతులెయ్యడం మొదలెట్టింది కుర్రకాకి. 

"మనవడా! ఈ పార్టీకి ఈ ఎర్రచొక్కా వాళ్ళు మాత్రమే ఓటర్లు. వీళ్ళే పాడతారు, ఆడతారు. వొక్కోటు కూడా బయట్నుండి పడదు. చారిత్రక తప్పిదాలు చెయ్యటం వీళ్ళకి ఫేషన్. వీళ్ళు బయటకి ఎర్రచొక్కా వేసుకున్నా, లోపల హృదయం మాత్రం పచ్చటి పసుపు."

"నువ్వు కాంగ్రెస్ పార్టీవాడివి. నువ్వు చెప్పేది నేన్నమ్మను. ఉభయ కమ్యూనిస్టులు కలిసి ప్రభంజనం సృష్టించబోతున్నారు."

"కమ్యూనిస్టు పార్టీలు కలవబోతున్నాయా!" అంటూ బోసినోరుతో భళ్లున నవ్వింది ముసలికాకి. కుర్రకాకిని జాలిగా చూస్తూ -

"ఒరే కుర్రఅజ్ఞాని! విను. ఈ కమ్యూనిస్టు పార్టీలకి మునిశాపం వుంది, ఎలక్షన్లలో సీట్లు సర్దుబాటు కాకూడదని! మంగళగిరి అసెంబ్లీ స్థానం, ఖమ్మం పార్లమెంట్ స్థానం వీళ్ళకి రణస్థలం. ఈ రెండు నియోజక వర్గాల్లో గెలుపు అనేది వీళ్ళ లక్ష్యం కాదు. ఒకళ్ళనొకళ్ళు ఓడించుకోవటమే వీరి ఆశయం. ఓడిన తరవాత ఎవరికెక్కువ ఓట్లొచ్చాయో లెక్కలేసుకుని ఊరేగింపులు తీస్తారు! వీళ్ళ సంగతి బాగా గ్రహించిన మిగిలిన పార్టీలు వీళ్ళనసలు పట్టించుకోవటమే మానేశారు."

కుర్రకాకి బాగా డీలా పడింది.

ఇప్పటికే ఎక్కువ మాట్లాడిన రోగిష్టి ముసలికాకి రొప్పసాగింది.

"మనవడా! నాకు కొమ్మ పొమ్మంటుంది, చెట్టు రమ్మంటుంది. నాలిక రుచి చచ్చింది. మటన్ మస్తాన్ దగ్గరకెళ్ళి నే చెప్పానని చెప్పి ఒక మెత్తటి మాంసం ముక్క పట్రా." అంటూ నీరసంగా కళ్ళు మూసుకుంది.

దానికి ప్రతిగా కుర్రకాకి ఏదో అంటుంది.... 

కానీ - ఇప్పటికే చాలా రాశాను, ఇంతటితో నా 'కా భాష' అనువాదం ముగిస్తాను. ఇంకా రాస్తే నన్ను బూర్జువా అనీ, పెట్టుబడిదారుల ఏజంటనీ నాకు అర్ధం కాని గతితార్కిక భౌతిక వాద భాషలో తిడతారు.

నమస్తే! వణక్కం!!

100 comments:

  1. G Ramesh Babu,Gudivada4 February 2012 at 10:46

    doctor garu emiti sir madyalo subbu vachada emiti ardhantaram ga mugincharu inka chala cheputharani asinchanu.

    "మనవడా! ఈ పార్టీకి ఈ ఎర్రచొక్కా వాళ్ళు మాత్రమే ఓటర్లు. వీళ్ళే పాడతారు. ఆడతారు. ఒక్క ఓటు కూడా బయటి నుండి పడదు. చారిత్రక తప్పిదాలు చెయ్యటం వీళ్ళకి ఫేషన్. వీళ్ళు బయటకి ఎర్ర చొక్కా వేసుకున్నా.. లోపల హృదయం మాత్రం పచ్చటి పసుపు."


    idi adirindi.


    sir,comment rasetappudu telugulo ela rayalo ardham kavadam ledu dayachesi cheppagalaru.

    ReplyDelete
  2. రమణ గారు,
    ఎర్ర పార్టిని బాగా విమర్శించారు కదా! మరి మార్క్సిజం మద్దతుగా దశాబ్ద్దాలుగా తెలుగు లో రచనలు చేసిన కొ.కు. లాంటి వారు మీద మీ అభిప్రాయం ఎమీటి? ఇప్పుడు ఆలోచిస్తే వారి రచనలు, అభిప్రాయలలో లోపాలు ఎమైనా కనిపిస్తాయా? ఆయన రచనలలో లోపాలు ఎత్తి చూపుతూ ఎవరైనా రాశారా?

    Sri

    ReplyDelete
  3. కాంగ్రెస్ పార్టీ లాగ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటి ఫ్రీ స్కీమ్‌లు పెడితే ఎర్ర పార్టీలకి కూడా వోట్లు పడతాయి. అప్పుడు సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్ట్ పార్టీ కూడా AK47లని త్యజించి ఎన్నికలలో పోటీ చెయ్యొచ్చు. గతితార్కిక భౌతికవాదం అర్థం చేసుకోవడం సులభమే. ఆకలితో ఉన్నవాడు రూపాయి బియ్యం స్కీమ్ కోసం పాలక వర్గంవాళ్ళని వెంటనే నమ్మేసి వోట్ వెయ్యడం విచిత్రం కాదని కూడా గతితార్కిక భౌతికవాదులకి తెలుసు. తెలియనిది భావవాదులకి మాత్రమే.

    ReplyDelete
  4. రమణ గారు,

    ఎర్ర పార్టీ తా పుట్టిన దేశం లో నే చచ్చి పాతెయ్య బడి పోయింది.

    మన దేశం లో బతుకుతూ ప్రతి రోజూ పాతెయ్య బడుతోంది.


    లాల్ సలాం
    జిలేబి.

    ReplyDelete
  5. మీ కాకులు ఉభయ కమ్యూనిస్టు పార్తీలంటూ మాట్లాడుకోవడం దారుణం. పుట్ట గొడుగుల్లా వెలిసిన మావో ఇస్టు పార్టీలను కాకులు మరిచిపోయినా మనం విస్మరించకూడదు. ఈ విషయం కాకి భాషను అను"వధించిన" వారికి (రమణ గారు కాదు) తెలియచేయగలరు.

    ReplyDelete
  6. రమణ గారు, కబుర్లు ఎందుకు? మీరు ఒక కార్మిక వర్గ పార్టీ పెట్టి మీ జిల్లాలోని ఒక ఫాక్టరీలో సమ్మె చెయ్యించండి. ఫాక్టరీ యజమానులు కార్మికుల జీతాలు పెంచకుండా కార్మికులని చర్చలకి పిలుస్తారు. సమ్మె విరమిస్తే EPF పెంచుతామని అంటారు. EPF ఎప్పుడో ముసలైపోయి ఉద్యోగం మానేసిన తరువాత వస్తుంది. జీతం పెరుగుతుందో లేదో కానీ EPFనైనా పెంచుకుందామని అల్ప ప్రయోజనానికి ఆశపడి కార్మికులు సమ్మె విరమిస్తారు. అలాగే మీరు రాష్ట్రంలోని మహిళలని ప్రొక్యూర్ చేసి వర కట్న దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించండి. డ్వాక్రా పథకం పేరుతోనో, దీపం పథకం పేరుతోనో పాలక వర్గంవాళ్ళు మహిళల మనసులని డైవర్ట్ చేస్తారు. అదే మహిళా సాధికారికత అని నమ్మిస్తారు. ఎక్కడైనా జరిగేది ఇదే కదా. అటువంటప్పుడు ఎర్ర పార్టీలని తప్పుపట్టడంలో అర్థమేముంది?

    ReplyDelete
  7. ఎంత మంది కమ్యూనిస్టులకు కమ్యూనిజం తెలుసు? ఎంతమంది కమ్యూనిజాన్ని కనీస స్థాయిలో పాటిస్తున్నారు అన్నది కూడా మనం గమనించాలి. ఎర్ర పార్టీల అసలు యావ అధికారములోకి రావడం మీదే ఉంటుంది. కాకపోతే వారికి అది దొరకదని అర్థమైపోయింది కాబట్టి, పాపం వారి పంచనా వీరి పంచనా చేరి తమ పార్టీ పేరుని విస్తృత పరుచుకోవాలని చూస్తుంటారు. కానీ, పాపం అది కూడా కుదరదు. వీరి తింగరి సిద్దాంతాలలో వీరు అన్నింటినీ పాటించకపోయినా, అమెరికా వ్యతిరేకత అనే దాన్ని మాత్రం బాగానే ఫాలో అవుతారు. వీరి ఏకైక అజెండా అదే. దానితో అన్నిచోట్లా ప్రగతి నిరోధకులు అని ముధ్రవేయించుకుని .. అభాశుపాలయ్యి, ఉన్నదీ .. తెచ్చుకున్నదీ రెండూ కోల్పోతారు.

    ఒక విషయం మాత్రం వీరిలో నాకు బాగా నచ్చింది. తాము చేసే ఘోర తప్పిదాలన్నింటినీ .. 'చారిత్రాత్మిక తప్పిదం ' అని భలే కవర్ చేసుకుంటారు. బహుషా, వీరు చేసినన్ని చారిత్రాత్మిక తప్పిదాలూ ఎవ్వరూ చేసుండరనుకుంటా.

    ఇక గతిలేని భౌతిక వాదం అంటారా.. దానిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

    Srikanth.M

    ReplyDelete
  8. @ రమేష్ బాబు గారు,శ్రీకాంత్ గారు

    అసలు ఆ పార్టీలే ఒక సైద్ధాంతిక తప్పిదం. అవి చారిత్రక తప్పిదాలు చేయడంలో ఆశ్చర్యం ఏముంది?

    ReplyDelete
  9. రమణ గారు, మీరు కమ్యూనిజం ఒక ట్రాష్ అని నమ్మితే కొడవటిగంటి గారి పుస్తకాలని తెనాలి సర్కార్ కాలువలో పడెయ్యండి. మీ ప్రొఫైల్‌లో కొడవటిగంటి గారి పేరు ఉపయోగించుకోవడం ఎందుకు?

    ReplyDelete
  10. పెట్టుబడిదారీ వ్యవస్థే గొప్పదని వాదించే వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఒక్క ముక్కైనా వ్రాసారా? వ్రాయలేదు. వ్రాసినవి రెండే అర్గిపోయిన రికార్డ్‌లు. అవి "కమ్యూనిజం స్వేచ్ఛని హరించును & ఫ్రీ మార్కెట్ వ్యవస్థలో మాత్రమే స్వేచ్ఛ ఉండును" అని. ఇంకా సంబంధం లేని విషయాలు అనేకం వ్రాసారు. ఆ మధ్య నేను ఒక బ్లాగ్‌లో శ్రీకృష్ణ దేవరాయులు కొంత కాలం ఇస్లాం మతాంలో ఉన్నాడు, తరువాత హిందూ మతంలోకి తిరిగొచ్చాడు అని వ్రాసాను. రిఫరెన్స్ పుస్తకం ఎక్కడో పెట్టాను. అయినా నేను వ్యాఖ్యలు వ్రాసిన ప్రతి పోస్ట్‌లోకి శంకర్ వచ్చి శ్రీకృష్ణ దేవరాయులు గురించి అరిగిపోయిన రికార్డ్‌లాగ అడిగాడు. సైద్ధాంతికంగా చర్చించలేనివాళ్ళు అలాంటి వాదనలే చేస్తారు. కమ్యూనిస్ట్‌లని విమర్శించే ముందు వీళ్ళు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అమెరికాలోని అయన్ రాండ్ అభిమానులలాగ లిబర్టేరియన్ పార్టీ పేరుతో ఇండియాలో ఒక పార్టీ పెట్టి ఫ్రీ మార్కెట్ సిద్ధాంతాలని వల్లిస్తే ఎంత మంది అర్థం చేసుకుని ఎన్నికలలో వోట్లు వేస్తారు? జార్జ్ లింకన్ రాక్వెల్ నాయకత్వంలోని అమెరికన్ నాజీ పార్టీలాగ హిందుస్తాన్ నాజీ పార్టీ అనే పేరుతో పార్టీ పెట్టినా ఎంత మంది పార్టీలో చేరుతారు? కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వర్గంవాళ్ళే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి.

    ReplyDelete
  11. ఆకలితో ఉన్నవానికి స్వేచ్ఛ గురించి చెపితే అర్థం కాదు అని కొంత మంది పెట్టుబడిదారీ తత్వవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఆ లాజిక్ ప్రకారం చూస్తే ఇండియాలో చాలా మందికి మీ ఫ్రీ మార్కెట్ (స్వేచ్ఛా విఫణి) గురించి కూడా అర్థం కాదు. అర్థమైతే కార్మిక వర్గ తత్వశాస్త్రమైన మార్క్సిజం అర్థమవుతుంది. మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదం అర్థం కాదని ఎవరు ఎంత వాదించినా పేదవాళ్ళకి సులభంగా అర్థం కాగలిగేది అదే.

    ReplyDelete
  12. "రమణ గారు, మీరు కమ్యూనిజం ఒక ట్రాష్ అని నమ్మితే కొడవటిగంటి గారి పుస్తకాలని తెనాలి సర్కార్ కాలువలో పడెయ్యండి. మీ ప్రొఫైల్‌లో కొడవటిగంటి గారి పేరు ఉపయోగించుకోవడం ఎందుకు?"

    ఆ మాటకొస్తే మొన్నటి విగ్రహాల విధ్వంసంతో సహా నువ్వు అభిమానించే రంగనాయకమ్మ గారి అభిప్రాయాలతో చాలా సార్లు విభేదించావు. నువ్వు ఆవిడ పుస్తకాలని మీ ఊరి దగ్గర ఉన్న కాలువలో పడేసావా ప్రవీణ్? నీ మాటల్లో సంయమనం పాటించడం అలవాటు చేసుకో. లేకపోతే ఎప్పుడో ఘోరంగా దెబ్బతింటావు.

    ReplyDelete
  13. కమ్యూనిజం విషయంలో నేను రంగనాయకమ్మ గారికే సపోర్ట్. 2006 సంవత్సరంలో నన్ను బలమైన కమ్యూనిస్ట్‌గా మార్చినవి రంగనాయకమ్మ గారి రచనలే. ఒక వైపు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని ఉపపత్ని (ఉంపుడుగత్తె)గా ఉంచుకోవచ్చు అని అడ్వొకేట్ చేసే విశ్వనాథ సత్యనారాయణ అభిమానులమని చెప్పుకుంటూ మరో వైపు కుల వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించిన చలం గారి పేరు చెప్పుకునే డబల్ స్టాండర్డ్‌గలవారి కంటే నేనే ఎంతో నయం కదా. రంగనాయకమ్మ గారిని కొన్ని విషయాలలో మాత్రమే నేను విమర్శించాను. కానీ కమ్యూనిజం యొక్క ఫండమెంటల్స్ విషయంలో నేను ఆవిడని ఎన్నడూ విమర్శించలేదు. ప్రైవేట్ ఆస్తిని రద్దు చెయ్యాలి అనే సూత్రం విషయంలో నేను ఆవిడని 100% సమర్థించాను. రంగనాయకమ్మ గారు లేకపోతే నాకు చారిత్రక భౌతికవాదంలోని ultimate destination అయిన కమ్యూనిజం గురించి అర్థమయ్యేది కాదు. రంగనాయకమ్మ గారి రచనలు చదివిన తరువాతే ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ వ్రాసిన "The Origin of the Family, Private Property and the State" పుస్తకం నాకు అర్థమయ్యింది, ఇంకా చాలా పుస్తకాలు నాకు అర్థమయ్యాయి. నాకు కమ్యూనిజం యొక్క ఫండమెంటల్స్ నేర్పించిన రంగనాయకమ్మ గారిని వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం నాకు లేదు.

    కొడవటిగంటి కుటుంబరావు గారు కూడా బలమైన మార్క్సిస్టే. ఆయన వ్రాసిన చరిత్ర వ్యాసాలు చదివితే ఆ విషయం అర్థమవుతుంది. ఈ విషయం తెలియక ఆయన ఒక సాధారణ సంఘ సంస్కర్త అనుకునేవాళ్ళు ఉన్నారు.

    ReplyDelete
  14. " ఆ మధ్య నేను ఒక బ్లాగ్‌లో శ్రీకృష్ణ దేవరాయులు కొంత కాలం ఇస్లాం మతాంలో ఉన్నాడు, తరువాత హిందూ మతంలోకి తిరిగొచ్చాడు అని వ్రాసాను. రిఫరెన్స్ పుస్తకం ఎక్కడో పెట్టాను. అయినా నేను వ్యాఖ్యలు వ్రాసిన ప్రతి పోస్ట్‌లోకి శంకర్ వచ్చి శ్రీకృష్ణ దేవరాయులు గురించి అరిగిపోయిన రికార్డ్‌లాగ అడిగాడు. సైద్ధాంతికంగా చర్చించలేనివాళ్ళు అలాంటి వాదనలే చేస్తారు."

    అరిగిపోయిన రికార్డ్ లా కాదు ప్రవీణ్ ఆధారం చూపేదాకా అడుగుతా. నువ్వు ఇంకా నాకు ఆధారం చూపలేదు అన్న విషయం మరచిపోకు. ఆధారాలు చూపకుండా వ్యాఖ్యలు చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఆ పుస్తకం వెతికి అప్పుడు మాట్లాడు. నీకు చేతకాక పొతే మూసుకుని కూర్చో.

    "కమ్యూనిస్ట్‌లని విమర్శించే ముందు వీళ్ళు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అమెరికాలోని అయన్ రాండ్ అభిమానులలాగ లిబర్టేరియన్ పార్టీ పేరుతో ఇండియాలో ఒక పార్టీ పెట్టి ఫ్రీ మార్కెట్ సిద్ధాంతాలని వల్లిస్తే ఎంత మంది అర్థం చేసుకుని ఎన్నికలలో వోట్లు వేస్తారు? జార్జ్ లింకన్ రాక్వెల్ నాయకత్వంలోని అమెరికన్ నాజీ పార్టీలాగ హిందుస్తాన్ నాజీ పార్టీ అనే పేరుతో పార్టీ పెట్టినా ఎంత మంది పార్టీలో చేరుతారు? కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వర్గంవాళ్ళే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి.:"

    నేను పుట్టి పెరిగిన భారత దేశం లో కమ్యూనిష్టులు ఏం పీకగాలిగారో (కాస్త అసభ్యంగా ఉన్నట్టు అనిపించినా రమణ గారు క్షమించాలి) మాత్రమె నాకు అవసరం తప్ప ఎక్కడో ఏదో చేశారని ఇక్కడ ప్రజల ఆకలి కేకలు తీరతాయి అనుకుంటే అది మూర్ఖత్వం అనే నేను భావిస్తాను.

    ReplyDelete
  15. ఫ్రీ మార్కెట్ పేరు చెప్పి కమ్యూనిస్ట్‌లని నిత్యం తిడుతూ ఉండేవాళ్ళు రాజగోపాలాచారి కాలం నుంచీ ఇండియాలో ఉన్నారు నాయనా. పెట్టుబడిదారీ వ్యవస్థకి ఏకైక substitute అయిన సోషలిజాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న గురుచరణ్ దాస్‌లాంటివాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలోని ప్రజలకి ఎలాంటి ఆహారం, ఆహార్యం అందిస్తుందో మాత్రం ఈ మేతావులు చెప్పరు.

    ReplyDelete
  16. "పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలోని ప్రజలకి ఎలాంటి ఆహారం, ఆహార్యం అందిస్తుందో మాత్రం ఈ మేతావులు చెప్పరు."

    పోనీ ఎంత సేపూ అవతల వాళ్ళ మీద పడి ఏడవకపోతే కమ్యూనిస్ట్ వ్యవస్థ మన దేశంలోని ప్రజలకి ఏం ఒరగబెట్టిందో నీలాంటి మేధావులు చెప్పచ్చుగా.

    ReplyDelete
  17. "ఒక వైపు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని ఉపపత్ని (ఉంపుడుగత్తె)గా ఉంచుకోవచ్చు అని అడ్వొకేట్ చేసే విశ్వనాథ సత్యనారాయణ అభిమానులమని చెప్పుకుంటూ "

    విశ్వనాథ వారి గురించి మాట్లాడే స్థాయి మనకి ఉందొ లేదో చూసుకుని మాట్లాడితే బావుంటుంది ప్రవీణ్.

    ReplyDelete
  18. వేయి పడగలు నవలలో విశ్వనాథ అలాగే వ్రాసాడు. తెలుగు సాహిత్య చరిత్రలోనే అత్యంత అభివృద్ధి నిరోధక నవల అది.

    ReplyDelete
  19. ఒకసారి వేయిపడగలు నవల చదువు. చిన్నప్పుడు మా అత్తగారి ఇంటిలో ఆ నవల చదివాను. ఆ నవల ఇప్పటికీ పబ్లిష్ అవుతోంది. ఆ నవల చదివితే విశ్వనాథది ఎంత ఫ్యూడల్ కుళ్ళో అర్థమైపోతుంది. ఇప్పుడు ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్థ అని చెప్పుకుంటున్నా ఫ్యూడల్ వాసనలు ఇంకా పోలేదు.

    ReplyDelete
  20. "వేయి పడగలు నవలలో విశ్వనాథ అలాగే వ్రాసాడు."

    నీ కన్నా వయస్సులో, జ్ఞానంలో పెద్దవాళ్ళని గౌరవించడం కూడా తెలియని నీలాంటి మూర్ఖుడితో చర్చించడం కూడా వృధా ప్రవీణ్. ముందు పెద్దలని గౌరవించడం నేర్చుకో. ఆ తర్వాత సిద్ధాంతాలని గురించి మాట్లాడు.

    ReplyDelete
  21. వేయి పడగలు నవల చదివితే తెలుస్తుంది, అందులో ఎంత ఫ్యూడల్ కుళ్ళు ఉందో. ఫ్యూడల్ కుళ్ళుని గౌరవించాలా?

    ReplyDelete
  22. G Ramesh Babu,Gudivada4 February 2012 at 16:32

    sir,comment rasetappudu telugulo ela rayalo ardham kavadam ledu dayachesi cheppagalaru.

    ReplyDelete
  23. ఈ పరికరం ద్వారా వ్రాయండి: http://teluguwebmedia.in/hamsalekha/

    ReplyDelete
  24. @G.Ramesh Babu

    Use lekhini.org 99% of bloggers use this tool to write telugu. remaining 1% uses baraha ..

    ReplyDelete
  25. G Ramesh Babu,Gudivada,

    Use this link.. to go to lekhini.

    lekhini.org

    ReplyDelete
  26. కమ్యూనిజం గురించి చర్చ లో నేను పాల్గోదలచుకో లేదు గాని ఒక విషయం మాత్రం విశదీకరించదలచుకొన్నాను.ధిల్లీ సుల్తాన్ కాకతీయసామ్రాజ్యాన్ని జయించితిరిగి వెళ్ళేటప్పుదు కాకతీయ సేనానులు ఐన హరిహర,బుక్కరాయ సోదరులను తనతో తీసుకొని వెళ్తాడు.వారిని ఇస్లాం మతంలోకి మార్పిస్తాడు.తర్వాత దక్షిణాదిలో తిరుగుబాట్లు చెలరేగగా అణచడానికి వాళ్ళని పంపిస్తాడు.తుంగభద్రా తీరంలో విద్యారణ్యస్వామి వారికి బోధపరచి ధర్మరక్షణకై వారి చేత హంపీ నగరం రాజధానిగా విజయ నగర రాజ్యాన్ని స్థాపింప జేస్తాడు.ఏ చరిత్రపుస్తకం లో నైనా ఈ సమాచారం లభ్యమౌతుంది.అంతే గాని కృష్ణ దేవరాయలు మొదట ఇస్లాం లో ఉండి తర్వాత హిందువుగా మారేడని ఎక్కడా చదవలేదు.ఒకవేళ అలా వుంటే దానికి నిదర్శనంగా ప్రామాణికమైన చరిత్ర గ్రంధాలనుండి ఆధారాలు చూపించవలసి ఉంటుంది.మరొక విశేషమేమంటే దక్కన్లో ఒక బ్రాహ్మణ గురువు సలహాపై ఒక ముస్లిం సేనాని బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు.

    ReplyDelete
  27. నేను చిన్నప్పుడు చదివినది మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. కొంత కాలం ఇస్లాం మతంలో ఉండి హిందూ మతంలోకి తిరిగి వచ్చినది తుళువ వంశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరిలో శ్రీకృష్ణ దేవరాయులు లేడు. చిన్నప్పుడు చదివినది గుర్తు లేక శ్రీకృష్ణ దేవరాయులు పేరు వ్రాసాను. దాని గురించే శంకర్ అరిగిపోయిన రికార్డ్‌లాగ అడిగాడు. మతం అనేది కేవలం విశ్వాసమైనప్పుడు అది మార్చుకోవడం, మార్చుకోకపోవడం పెద్ద విషయమేమీ కాదు. దాని గురించి చర్చ అనవసరం. రాజులు యుద్ధాలు చేసినది అధికారం కోసమే కానీ మతం కోసం కాదు అని చెప్పడానికి ఆ విషయం వ్రాసాను.

    ReplyDelete
  28. రమణ చక్కగ ఉంది. నేనొక సారి కాలేజికి వెళ్తున్నప్పుడు (సైకిల్ మీద) రోడ్డు మధ్యలో ఒక ఎర్ర రంగుతో నిండినట్టుగా జనం "పదండి ముందుకు - పదండి ముందుకు" అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. సరే ఒక ప్రక్కగ వెళ్ళడానికి ప్రయత్నించాను. అంతె నన్ను పక్కకి నెట్టారు. ఆ నెట్టిన వాడిని అడగా "పదండి ముందుకు" అంటున్నారు, ఎక్కడికి అని. వెంటనే అతను నాకు తెలిస్తే గదా నీకు చెప్పేది. అరవకుండ, నోరు మూసుకుని వస్తే మాతోరా, లేదా ముందుకు కాదు వెనక్కి వెళ్ళు అన్నాడు. అంతే అర్ధం కానప్పుడు ముందుకెళ్ళడం దేనికని వెనక్కి వచ్చేశ.

    ReplyDelete
  29. @DSR Murthy,

    LOL, అదే మంచిది లెండి. ఎక్కడికి పోతున్నామో తెలీకపోయినా.. గొర్రెల మందలా ముందుకు పోయేకన్నా ఊరకుండడం ఉత్తమం.. :-)
    Srikanth.M

    ReplyDelete
  30. మూర్తి గారు, వరంగల్‌లో మావోయిస్ట్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు పోలీసులు లారీలని అడ్డుకోవడానికి ప్రయత్నించినా జనం హాజరయ్యారు. పోలీస్ నిర్బంధం నడుమ ఒక విప్లవ పార్టీ మీటింగ్‌కి వెళ్ళినవాళ్ళు కూడా గొఱ్ఱెలా?

    ReplyDelete
  31. కమ్యూనిస్ట్ పార్టీల మీటింగ్‌లకి ఎవరూ వెళ్ళరని అనుకుంటే ఈ పోస్ట్ కూడా అనవసరమే కదా. ఒక MNCలో పని చేసే కార్తీక్ అనే అతను కమ్యూనిస్ట్‌లు కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవరు అని వాదించాడు. అతని కామెంట్‌ని పట్టుకుని మిగితా పెట్టుబడిదారీ గొఱ్ఱెలు కూడా కమ్యూనిస్ట్‌లకి కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు అని వాదించడం మొదలుపెట్టారు. ఒక గొఱ్ఱెని మందలోని గొఱ్ఱెలన్నీ అనుకరించడం అంటే ఇదే కదా. కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవకుండానే గతితార్కిక-చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటో మాకు తెలిసిందా? ఇక్కడ కమ్యూనిస్ట్‌లని విమర్శిస్తూ వ్రాసినవాళ్ళు ఎవరూ బెంజమిన్ ఫ్రాంక్లీన్ లాంటి పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు వ్రాసిన రచనలు గురించి వ్రాయలేదు. వాళ్ళు కేవలం రెండే అరిగిపోయిన రికార్డ్‌లు తిప్పారు "కమ్యూనిజం స్వేచ్ఛని హరించును & ఫ్రీ మార్కెట్ వ్యవస్థలో మాత్రమే స్వేచ్ఛ ఉండును" అని. ఈ రకంగా వాదించే గొఱ్ఱెలు మేము కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవలేదని విమర్శిస్తే ఎలా ఉంటుంది? సాధారణ గాడిద కంచర గాడిదని చూసి "నేను మోసిన బరువు కూడా నువ్వు మొయ్యలేవు" అని వెక్కిరించినట్టు ఉంటుంది కదా.

    ReplyDelete
  32. "చిన్నప్పుడు చదివినది గుర్తు లేక శ్రీకృష్ణ దేవరాయులు పేరు వ్రాసాను. దాని గురించే శంకర్ అరిగిపోయిన రికార్డ్‌లాగ అడిగాడు. "

    నువ్వు మాట్లాడింది మీ ఊరి మున్సిపల్ చైర్మన్ గురించొ, మీ పక్కింట్లో ఉండే వాళ్ళ గురించొ అయితే అన్ని సార్లు అడగాల్సిన ఖర్మ నాకేంటి ప్రవీణ్? శ్రీకృష్ణ దేవరాయలు లాంటి వ్యక్తీ కొంతకాలం ముస్లిం మతం స్వీకరించాడు అని స్టేట్మెంట్ పారేసి, పైగా ఆధారాలు ఉన్నాయి చూపిస్తాను అని చెబితే దాని గురించి నిన్ను అడక్కూడదా????

    సపోజ్ ఫర్ సపోజ్ మార్క్స్ కొంత కాలం పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అందుకు ఆధారాలు ఉన్నాయి అని నేను స్టేట్ మెంట్ ఇచ్చాననుకో నువ్వు అవిచూపించే దాకా నా వెంట పడవూ?

    ఇంకోసారి ఇలా చరిత్రలో మహానీయుల గురించి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

    ReplyDelete
  33. ఓ బావిలో కప్ప, ఇతరులు కూడా, తాను చదివిన రచణలు చదివితేనే చదివినట్టు లేకుంటే లేదు అనుకుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ప్రపంచాన్ని చెత్త రాతల ద్వారా కాదు వాస్తవిక దృష్టితో చూడు అని ఎలా చెప్పగలము. నవ్వుకుని వదిలేయడం తప్ప. 90% కమ్యూనిస్టులకు అసలు కమ్యూనిజం అంటేనే అవగాహణ ఉండదు. అసలు సోషలిజానికీ, మార్స్కిజానికీ, కమ్యూనిజానికీ గల తేడా ఏమిటో అస్సలు తెలీదు. ఇక గతిలేని భౌతిక వాదముగురించి పట్టించుకోవాల్సిన పనేముంటుంది. పెట్టుబడిదారి విధానము అలాంటిది ఇలాంటిది అని ఎవ్వరూ గప్పాలు కొట్టరు, కానీ పాపం మన మార్క్సిస్టు మిత్రులే ఎప్పుడో బూస్తాపితమైన మార్క్సిజాన్ని పట్టుకుని వేలాడుతూ, మార్కిజపు ప్రేతాల్లాంటి సిద్దాంతాలను పడికట్టు పదాలతో కలిపి వల్లె వేస్తూ జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు. వారి ఖర్మ అంతే.

    <a href="http://kalalaprapancham.wordpress.com>Srikanth.M</a>

    ReplyDelete
  34. @SHANKAR.S

    అసలు ఆ పార్టీలే ఒక సైద్ధాంతిక తప్పిదం. అవి చారిత్రక తప్పిదాలు చేయడంలో ఆశ్చర్యం ఏముంది?

    LOL, Well said.. :-)

    Srikanth.M

    ReplyDelete
  35. Extremely sorry Praveen Sharma garu. It is my sheer experience at the age of 18 when I was studying Graduation. I have not mentioned the word "గొఱ్ఱెలు" in my comment. Please check it once again Sir. My objective is very clear that if I don't know anything it is better not to follow that.

    ReplyDelete
  36. ఏం ప్రవీణూ నువ్వు వ్యాఖ్యాత పేరు కూడా చదవకుండా కామెంట్ పెట్టేస్తావా మరి?

    గొర్రెలు అన్నది శ్రీకాంత్ గారైతే మూర్తిగారికి సమాధానం ఇచ్చావేం?

    ReplyDelete
  37. జోకర్ లేని పేకాటని, కమ్యునిస్ట్ పార్టిలు లేని రాజకీయాలను ఊహించగలమా? టి వి ఛానల్ పెట్టాలని అనుకొంట్టున్నారంట గదా!

    రమణ గారు నేనడిగిన ప్రశ్నకి సమాధానం మీరు తప్పక ఇస్తారని ఆశిస్తున్నాను.


    Sri

    ReplyDelete
  38. శంకర్ గారు,
    నా కామెంట్ పై మీరిచ్చిన సవరణకు ధన్యవాదములు.

    ReplyDelete
  39. Shankar .. LOOOOOOL :))))))))

    But aint the answer obvious? :))

    ReplyDelete
  40. ఎర్ర పార్టీ తా పుట్టిన దేశం లో నే చచ్చి పాతెయ్య బడి పోయింది.

    మన దేశం లో బతుకుతూ ప్రతి రోజూ పాతెయ్య బడుతోంది.
    _________________________________________


    SOOPER!

    ReplyDelete
  41. నా బ్లాగ్ చదివి ఎంతో శ్రమ కోర్చి కామెంట్లు రాసిన మిత్రులకి ధన్యవాదాలు.
    బ్లాగులు రాయటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.

    ఉదయాన్నే మెలుకువ వచ్చి.. ఒక మంచి కాఫీ తాగి.. ఒక పోస్ట్ రాశాను.
    కామెంట్ మోడరేషన్ ఇబ్బందిగా ఉన్న కారణాన నిన్ననే తీసేశాను.
    క్లినికల్ వర్క్ ఎక్కువవడం చేత కామెంట్లు చదవలేక పోయాను.
    రాత్రి చదివిన తరవాత ఒక కామెంట్ అసభ్యంగా ఉన్న కారణాన తొలగించాను.

    నేను రాసిన పోస్టుకి, కామెంట్లకి చాలా సార్లు సంబంధం లేకుండా పోతుంది.
    కాబట్టి చర్చకి నా అవసరం లేదని భావిస్తున్నాను.
    నా ప్రొఫైల్ లో రాసుకున్న విధంగా నేను కేవలం సరదా కోసమే రాస్తున్నాను.
    నేను spoofs రాయడానికి ఇష్టపడతాను.
    దాదాపు అన్ని రాజకీయ పార్టీల మీదా రాశాను.
    చిరంజీవి మీదైతే వ్యక్తిగతంగా కూడా రాశాను.
    కాబట్టి నాకు ఏ పార్టీ అనుకులతా లేదని మనవి చేస్తున్నాను.

    ఇవ్వాళ ఖమ్మం మహాసభల సందర్భాన్ని పురస్కరించుకుని సిపిఎం మీద రాశాను.
    ఆ పార్టీ ఆభిమానుల్ని కించపరిచే ఉద్దేశ్యం లేదు.
    నేను రాసిన విమర్శ కూడా చాలా పాతది.

    కుటుంబరావుకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి సంబంధం లేదనుకుంటున్నాను.
    ఆయన ఆ పార్టీలలో సభ్యుడిగా ఉన్నాడా? నాకు తెలిసినంత మటుకూ లేడు.

    నాకు సంబంధించి..
    నేను కో.కు. రచనల అభిమానిని.
    తెలుగు సాహిత్యంలో కో.కు. రచనలు, అభిప్రాయాలు చాలా ప్రసిద్ధమైనవి.
    అంత మాత్రాన ఆయన దేవుడై పోడు.
    ఆయన రచనలు ఎక్కువ మంది చదివితే మంచిదని భావిస్తున్నాను.
    ఆయన్ని విమర్శిస్తూ కూడా విరివిగా రచనలు రావాలి.
    ఆ రచనలు కూడా నేను తప్పకుండా చదువుతాను.
    ఆ పని బ్లాగ్లోకం కుర్ర వాళ్ళు చెయ్యాలని, చెయ్యగలరని ఆశిస్తున్నాను.

    చివరగా..
    నాకు మీలో చాలా మందికి ఉన్నంత విషయ పరిజ్ఞానం లేదు.
    సీరియస్ విషయాలని కూడా సరదాగా రాసే అలవాటు నాది.
    కొన్నిసార్లు మీ వ్యాఖ్యలు మరీ సీరియస్ గా ఉన్నాయి.
    బ్లాగులు సరదాగా, స్నేహ పూర్వకంగా ఉంటే బాగుంటుందేమో.
    దమ్మిడీ ఆదాయం లేని ఈ హాబీలో ఉద్రిక్తతలు అవసరం లేదు అనుకుంటున్నాను.

    నా మాటలు చిత్తూరు నాగయ్య నీతి వాక్యాల్లాగా అనిపిస్తే మన్నించండి.
    రోజంతా పని చేసుకుని.. కడుపు నిండా అన్నం తిని.. దుప్పటి కప్పుకుని పడుకుని..
    నిద్ర రాక.. 'పని లేక.. ' ఏవో నాలుగు కబుర్లు రాస్తున్నాను.
    ఇవేవీ కొంపలు మునిగి పోయేంత సీరియస్ విషయాలు కాదు.
    నాకు సైకియాట్రీ వైద్యం తప్పించి ఏ రంగం లోనూ చెప్పుకోదగ్గ నాలెడ్జ్ లేదు.
    దయచేసి అర్ధం చేసుకోగలరు.

    ReplyDelete
  42. /ఇంకా రాస్తే నన్ను బూర్జువా అనీ, పెట్టుబడిదారుల ఏజంటనీ నాకు అర్ధం కాని గతితార్కిక భౌతిక వాద భాషలో తిడతారు./

    :))

    ReplyDelete
  43. యరమన గారూ !
    ఖాళీ మైండ్ అత్యంత ప్రమాదకరమైనది అని ఒక సైక్రియాటిస్ట్ గా మీకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం వుంటుందా ? 'పనిలేక' అని మీరు హెడింగ్ పెట్టినా పనిగట్టుకునే రాస్తున్నారు. అదేదో సరదాగా కాకుండా సీరియస్ గా రాయండి. మీరు అందరి మీదా రాస్తున్నారనేది నిజమే అయినా పైపైన కాకుండా ('పనిలేక') కాకుండా ఇదో పనిగా రాయండి. మీ లో రచనా శక్తి వుందని మీ రాతలను బట్టి తెలుస్తోంది. మీ ఖాళీ సమయాన్ని ఇందుకు ఉపయోగిస్తే బ్లాగు లోకానికి మరింత ఉపయోగంగా ఉంటుందని మనవి. ఇక కమ్యూనిస్టుల పై విమర్శలు అత్యంత సహజం. ఎందుకంటే పెట్టుబదిదారీ సమాజపు కుళ్ళును అంతా అంగీకరిస్తారు. కానీ దానిని రూపు మాపడానికీ మూల సూత్రాలు చెప్పే కమ్యూనిజం ఒక నిజం. కాకపోతే కమ్యూనిస్టుల ప్రవర్తన , వారి విభేదాలు నిజంగానే అలాంటి విమర్శకులకు అవకాశం ఇస్తున్నాయి. ఎంతమంది కి కమ్యూనిజం తెలిసి నాయకులుగా వుంటున్నారు. అందుకే చారిత్రక తప్పిదాలు. వాటిని అంగీకరించే సత్తా వారికే వుంది. వుంటుంది కూడా . కమ్యూనిస్ట్ ల వల్ల ప్రపంచ వ్యాపితంగా చాలా మేలు జరిగింది . భారతదేశం లో కూడా జరిగింది. ఇప్పటికీ సాపేక్షంగా చూస్తే మంచి నాయకులు , అవినీతికి దూరంగా వున్నదీ ప్రజల తరపున నికరంగా పోరాడుతున్నదీ కమ్యూనిస్టులే . మరి ప్రజలెందుకు కమ్యూనిస్టులను అనుసరించడం లేదు. చాలా తేలికగా చెప్పగలిగే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆకాశమార్గం లో గందరగోళం గా చెప్పడం, అర్ధం లేని విధంగా ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా పోరాటమార్గాలు వుండడం , సిధాంతాన్ని రాద్ధాంతం చేయడం , తప్పుగా అన్వయించడం , వ్యక్తి పూజ , కెరీరిజం లాంటి భయంకరమైన లోపాలు కమ్యూనిస్టు ఉద్యమానికి అసలైన ఆటంకాలు తప్ప నిజంగా కమ్యూనిస్టులు సరిగా వుంటే పెట్టుబడిదారుల ఎత్తులు చిత్తు కావడం పెద్ద లెక్కే కాదు. సీట్ల కోసం బూర్జువా పార్టీల కంటే ఎక్కువ కాట్లాడుకోవడం లాంటి వెకిలి చేస్టలు మానుకోవాలి. కెరీరిజం లో నియంత్రుత్వం పెరిగితే భ్రమే అయినా పెట్టుబడిదారీ సమాజపు స్వేచ్చే ఉపశమనం ఇస్తుంది. కమ్యూనిస్టులపై అకారణంగా ఉక్రోషంతో చేసే విమర్శలు చూసినపుడు బిజినెస్ మెన్‌ సినిమాలో పులి ని గురించి మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. సకారణంగా విమర్శలు చూసినపుడు వీళ్ళెప్పుడు (కమ్యూనిస్టులు) భూమార్గం పడతారు అనిపిస్తుంది.ఒక్కటి మాత్రం నిజం. మనిషిని - మనసును అల్లకల్లోలం చేసే , అభద్రతా భావం పెంచే పెట్టుబడిదారీ వ్యవస్త కొనసాగింపు కమ్యూనిస్టుల మూర్ఖపు చేష్టలవల్లే తప్ప కమ్యూనిజం వల్ల , మార్క్షిజం వల్లా మాత్రం కాదు. సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిస్టు అంటే కలసివుండేవాడు , కలుపుకు పోయేవాడు . విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు. ఎన్ని వాదనలు చేసినా ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. భ్రమ కాదు.

    ReplyDelete
  44. /సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిస్టు అంటే కలసివుండేవాడు , కలుపుకు పోయేవాడు . విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు. ఎన్ని వాదనలు చేసినా ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. భ్రమ కాదు./
    "భలే భలే! బాగా చెప్పావ్. కాని అందుకు మనమేం చేయాలో అది కూడా నీవే చెప్పూ.." :D

    ReplyDelete
  45. / ఎన్ని ఏళ్ళు గడచినా మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం. /
    ఇండియాలో 6దశాబ్దాలు దాటాయి, ఇంకా ఎన్ని దశాబ్దాలు కాలేంటి ఒట్టి మానవత్వం నిలపడానికి?! మరి ప్రభుత్వానికి, పాలనకి ఎంకెన్ని శతాబ్దాలు కావాలో! అందుకేనేమో చైనాలో అడ్డదారుల్లో పెట్టుబడిదారీ విధానాలని అడ్డగోలుగా అనుసరిస్తున్నారు.

    చికెన్ నారాయణ ఓ నిష్టాగరిష్టుడైన కమ్యూనిష్టేనా? :D

    ReplyDelete
  46. @SNKR!
    వ్యంగ్యం ఒక మానసిక రోగం. విపరీత లక్షణం . ఇంకా చెప్పాలా ? చెప్పింది చాలదా ? అయినా చెపితే వినే రకం కాదని అర్ధం అవుతూనే వుంది. సో ! నిరర్ధక వాదన తో ఎందుకు టైం వృధా చేయాలి.

    ReplyDelete
  47. >>ఇప్పటికీ సాపేక్షంగా చూస్తే మంచి నాయకులు , అవినీతికి దూరంగా వున్నదీ ప్రజల తరపున నికరంగా పోరాడుతున్నదీ కమ్యూనిస్టులే .
    మరి అంత పోరాడేవాళ్ళు ఇప్పటిదాకా ఒక్క అవినీతి పరుడిని కూడా ఎందుకు బోనెక్కించలేకపోయారు?? ఎందుకంటే కమ్యూనిష్టులకు అంత గుండె ధైర్యం, పోరాట పటిమ లేవు కనుక. they are the sore losers of life..
    >>నిజంగా కమ్యూనిస్టులు సరిగా వుంటే పెట్టుబడిదారుల ఎత్తులు చిత్తు కావడం పెద్ద లెక్కే కాదు.
    మరి అంతమంది దగుల్బాచీ మొహాలు ఒకే థియరీని నమ్ముతున్నారంటే దానికి కారణం ఆ థియరీ కాక ఇంకేమిటి??

    >>పెట్టుబడిదారీ వ్యవస్త కొనసాగింపు కమ్యూనిస్టుల మూర్ఖపు చేష్టలవల్లే తప్ప కమ్యూనిజం వల్ల , మార్క్షిజం వల్లా మాత్రం కాదు.
    agreed, as its kind of a zero sum game.. people move away from communism and land up supporting free market theory.
    >>విప్లవం అంటే మౌలికమైన మార్పు. అదేదో అరుపులతో కేకలతో అనర్ధం తెచ్చేది కాదు.
    కమ్యూనిజం లాంటి ఫాసిస్ట్ సిద్దాంతాలతో అది ఎప్పటికీ రాదు.
    >>మానవత్వాన్ని నిలిపే కమ్యూనిజం నిజం
    మమతా బెనర్జీకి ఓట్లు వేస్తామంటే చేతులు తీసేశారు.. అది మానవత్వం!!
    ఇంఫార్మర్ల పేరిట వేలమందిని చంపేశారు.. అదీ మానవత్వమే!!
    బలవంతపు వసూళ్ళూ, మాఫియా చేష్టలు.. అదీ మానవత్వమే!!

    ReplyDelete
  48. @karthik !
    " మరి అంతమంది దగుల్బాచీ మొహాలు ఒకే థియరీని నమ్ముతున్నారంటే దానికి కారణం ఆ థియరీ కాక ఇంకేమిటి?? "
    చదువు సంస్కారాన్ని నేర్పక పోవడం వల్ల వచ్చే అనర్ధం ఇదే ! ఎదుటివ్యక్తిని కించపరుస్తూ విమర్శించడం అవసరమా ? అలా చేస్తే ఏమిటి ఉపయోగం?
    - "మమతా బెనర్జీకి ఓట్లు వేస్తామంటే చేతులు తీసేశారు.. అది మానవత్వం!!
    ఇంఫార్మర్ల పేరిట వేలమందిని చంపేశారు.. అదీ మానవత్వమే!!
    బలవంతపు వసూళ్ళూ, మాఫియా చేష్టలు.. అదీ మానవత్వమే!! " -
    ఇలా చేసి కమ్యూనిజాన్నో , మార్కిజాన్నో నిలబెట్టాల్సిన అగత్యం మార్క్సిజం కు లేదు. ఒక్క మార్క్కిజం కే కాదు ఏ ఇజామూ ఇలా చేయమని చెప్పదు. అలా ఎవరు చేసినా తప్పే.మార్క్సిజం ఒక శాస్త్రం . దానిని సరిగా చదువుకోకుండా ఇలాంటి చేస్టలు చేస్తే మీలాంటి వారినుండి ఇలాంటి విమర్శలను తప్పక ఎదుర్కోవలసిందే. అలాంటి తప్పులను సవరించుకోవలసిందే. కానీ మీరు చెప్పిన చేస్టలు చేయమని మార్క్సిజం లో ఏ పేజీ లోనూ వ్రాయలేదు. కనుక వాటిని మార్క్సిజానికి ఆపదించడం ధర్మం కాదు.

    ReplyDelete
  49. మార్క్సిజం యొక్క సిధ్ధాంతం గొప్పదని, అది ఆచరించేవాళ్ళకు సరి అయిన అవగాహన లేక పొయినంత మాత్రము సిధ్ధాంతమును తప్పబట్టగూడదు అని చెప్పారు, విమర్సించేవాళ్ళకు సరి అయిన విషయ పరిజ్ణానం లేదంటున్నరు. మరి అదే విధంగ బారతీయ హైందవ సంస్కృతి, సాంప్రదాయ, పురాణ ఇతిహాస, వేదాలను కూడా అదే విధముగ చూడకుండ అవన్నీ తప్పు అని అంటారేమిటి. అంటె మీరు చెప్పినట్లుగ వీటి మీద కూడా విమర్సించేవాళ్ళకు అవగాహన లేదనుకోవచ్చా?

    ReplyDelete
  50. కొండల రావు గారూ,
    యరమన గారినుద్దేశించిన రాసిన వ్యాఖ్య (ఆయన గురించిన పార్ట్ కాదు)చాలా అర్థ వంతంగా ఉంది. కమ్యూనిజం గురించి, మార్క్సిజం గురించి వివరించే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంలో,మార్క్సిజంలో గొప్ప లక్షణాలుంటే ఉండొచ్చు. సమాజానికి అవసరం కావొచ్చు. ఇటువంటి ఇజాలను జనాల వద్దకు సరైన రీతిలో చేర్చడం లో కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు ఎందుకు విఫలమవుతున్నారన్నదే ప్రశ్న! ఏ ఇజాన్నైనా దాన్ని పాటించే వాళ్ళ మూలంగానే దాన్ని సామాన్యులు అర్థం చేసుకుంటారు. మరి కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు చేసే పనులకు వారి బాధ్యత ఎంత వరకు? కమ్యూనిజం బాధ్యత ఎంత వరకూ? ఆ ఇజాల బాధ్యత లేకపోతే, అటువంటి వారిని ఆయా పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించరు? మన దేశానికి సంబంధించి కమ్యూనిస్టుల మీద మీ అభిప్రాయం ఏమిటి?

    కమ్యూనిస్టులు కనీసం సామాన్యులకు అర్థం కాని భాష వాడుతూ, పడి కట్టు పదాలు వల్లె వేస్తూ జనాలకు ఎందుకు దూరమైపోతుంటారు? వాళ్ళు వాడే భాష ఎవరికైనా ఏ విషయాన్నైనా సులభంగా బోధించగలుగుతుందా చెప్పండి? వీళ్ళ భాషే కొరుకుడు పడనిదిగా ఉంటుందని రంగనాయకమ్మ గారు "కుట్ర" అనే కథ రాశారు కూడా!

    మామూలు మనుషులకు భిన్నంగా మాట్లాడుతూ,వాళ్ళేదో ప్రత్యేక జాతిగా గురించేసుకుంటూ..ఎవరితోనూ కలవక ..విడిగా ఎందుకుంటారు కమ్యూనిస్టులు?వీళ్ల వల్ల కమ్యూనిజంలో మంచేమైనా ఉంటే అది జనాలకు అందదు అని నిజమైన కమ్యూనిస్టులు గ్రహించరా? దీనికేం చేస్తున్నారు?

    నిజమైన కమ్యూనిస్టు లక్షణాలేమిటి? కమ్యూనిస్టు బోధనల్లో ప్రాక్టికాలిటీ ఎంత వరకూ? కమ్యూనిజం చెప్పేదంతా ఉపన్యాసాలకు, పుస్తకాలకే పరిమితమా?మన దేశానికి సంబంధించి మానవత్వాన్ని నిలపడానికి ఇప్పుడు కమ్యూనిస్టుల మని చెప్పుకుంటున్న కమ్యూనిస్టులు చేస్తున్నదేమిటి?

    కమ్యూనిజం అనగానే జనం అదేదో బ్రహ్మ పదార్థమని భావించి దూరం కావడానికి కారణం ఏమిటి?

    కమ్యూనిస్టులు తప్పుడు వాళ్లైతే కమ్యూనిజంలో తప్పుందని అనుకోకూడదన్నారు! నేనూ అంగీకరిస్తాను. మరి ఈ తప్పుడు వాళ్ళని ఎలా వదిలించుకుంటాయి కమ్యూనిస్టు పార్టీలు? సాక్షాత్తూ ఆయా పార్టీల నాయకులే తప్పుడు వాళ్ళుగా ఉంటున్న సందర్భంలో కమ్యూనిజం,మార్క్సిజం మనుగడ ఏమిటి? ప్రశ్నార్థకం కాదా?
    (ఎక్కువమందికి (నాతో సహా) సో కాల్డ్ కమ్యూనిస్టులతోనే సమస్య కానీ కమ్యూనిజంతో కాదని నాకనిపిస్తుంది.).

    తెలుసుకోవాలనే ఆసక్తితో అడుగుతున్నాను, వివరించగలరు!

    ReplyDelete
  51. >>చదువు సంస్కారాన్ని నేర్పక పోవడం వల్ల వచ్చే అనర్ధం ఇదే ! ఎదుటివ్యక్తిని కించపరుస్తూ విమర్శించడం అవసరమా ? అలా చేస్తే ఏమిటి ఉపయోగం?
    నా సంస్కారం గురించి మాట్లడటానికి మీ అర్హత ఏమిటో చెబుతారా?? అలానే నేను రాసిన దానిలో వ్యక్తిగత విమర్శ ఏముందో కస్త చెప్పండి. నేను కించపరిచింది ఒక సమూహాన్ని. ఆ సమూహం సమాజానికి అత్యంత హానికరమని నా నమ్మకం. వ్యక్తిగతంగా ఆ సమూహం వల్ల నేను, నా కుటుంబం వ్యథను అనుభవించాం..కాబట్టి చదువు సంస్కారం అంటూ మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే మంచిది.
    >>ఇలా చేసి కమ్యూనిజాన్నో , మార్కిజాన్నో నిలబెట్టాల్సిన అగత్యం మార్క్సిజం కు లేదు.
    మరి కమ్యూనిష్టు అయిన ప్రతీవాడి అస్థిత్వం హింస మీద ఎందుకు ఆధారపడి ఉంటుంది?? అలా చేయకపోతే కమ్యూనిజం అనేదాన్ని ప్రజలు మర్చిపోయి కనీసం వందేళ్ళు అయ్యేది. హింస అనేది కమ్యూనిజం లో ఒక integral part. అది వదిలితే కమ్యూనిష్టులకు బ్రతుకేలేదు. ఒక తియెం మెన్ స్క్వేర్ అయినా లేక కంబోడియా అయినా కమ్యూనిష్టుల అస్థిత్వం ఫాసిజం+హింస అనే వాటి మీదనే ఆధారపడి ఉంది.

    ReplyDelete
  52. /వ్యంగ్యం ఒక మానసిక రోగం. విపరీత లక్షణం . /
    అలా అని మార్క్స్ దాస్ కేపిటల్ లో చెప్పారాండి పల్లా కొండల రావు గారు?!!

    /ఇంకా చెప్పాలా ? చెప్పింది చాలదా ? అయినా చెపితే వినే రకం కాదని అర్ధం అవుతూనే వుంది./
    సిద్ధాంతాలు చెప్పకండి, వినివినీ విసుగొచ్చింది. ఆ థియరీ ఈ భూప్రపంచంలో ఏ దేశంలో సమర్థవంతంగా అమలు చేయబడ్డది. ఆదేశపు పురోగతి ఎట్టిది? వివరింపుడు. క్యూబా, ఉత్తర కొరియా, చైనా, రష్యా, వియత్నాం. కోప్పడకండి, కొడలరావు గారు. కమ్యూనిస్టులకు ఆవేశమే కాని ఆలోచన తక్కువ అని మా బామ్మ చెప్పేవారు. నేను మా బామ్మతో అప్పట్లో ఏకీభవించలేదు.
    కమ్యూనిజాల్లో ఏ కమ్యూనిజము మంచిది/గొప్పది? మార్కిస్టులా, లెనినిస్టులా, మావోఇస్టులా, లేదా వాటి చౌచౌ కాంబినేషన్స్ మార్క్స్-లెనిన్, లెనిన్- మావో, మావో-స్టాలిన్, ...

    /సో ! నిరర్ధక వాదన తో ఎందుకు టైం వృధా చేయాలి. /
    మీకున్నదే అది, దాచుకుని ఏంజేస్తారు?! అందరికీ సామ్యవాదంగా పంచి ఇవ్వండి. 60ఏళ్ళకు పైగా అరుస్తున్నారు, ఇంకో 10మార్లు అరిస్తే ....పోయేదేముంది? ఏమో విప్లవం వచ్చి మేమంతా తిరగబడి, పులుసు చచ్చి ' హా! ఎర్రజెండెర్రజెండెన్నియల్లో ఎర్రెర్రనిదీ జెండెన్నియల్లో అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ... చైనా పీపులుసు కమ్యూనిస్టు పార్టీకి జైకొడతామేమో! ఏమో! ఆలోచించుడీ.

    ReplyDelete
  53. వ్యంగమంటే భయపడుతున్నారంటే ఇంకా మీరు ముదురు కమ్యూనిస్ట్ కాదనే అనుకోవాలి. పోనీ సుజాత గారు సూటిగా అడిగారు కదా, ప్రశ్నలకు జవాబివ్వండి. కార్తీక్ చెప్పింది ఆలోచనీయంగా వుంది. మీరు పార్టీ పరంగా చూపించే ఆవేశం కొంచెం తగ్గించి, కొద్దిగా ఆలోచించగలరు.

    ReplyDelete
  54. @ Anonymous,
    దేనిని విమర్శించే వారైనా సరే, దానిని ఎందుకు విమర్శిస్తున్నారో చెప్పగలగాలి. విమర్శించడం అనేది కోపంతోనో, ద్వేషంతోనో ఉండకూడదు. భారతీయ, హైందవ, సంస్కృతి , సాంప్రదాయ , పురాణ, ఇతిహాస,వేదాలను కూడా వాటిని గురించి తెలుసుకోకుండా విమర్శిస్తే తప్పే. ఇవన్నీ లేదా ఏవైనా సరే చారిత్రక పరిణామ క్రమం లో మనిషి తన అవసరాల రీత్యా యేర్పాటు చేసుకున్నవే. వీటిలో మంచివాటిని కొనసాగించాలి. హిందూ సంస్కృతిలో బోలెడన్ని మంచి విషయాలు, జీవన విధానాలు, సాంస్కృతిక విషయాలు ఉన్నయి. వాటినన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకించడం మంచిది కాదు. కానీ 'సతి' పేరులో స్త్రీలను సతీసహగమనం చేయించడం , కులం పేరుతో మనిషినీ-మనిషినీ వేరు చేసే అంశాలు, మనిషి - విశ్వం పుట్టుకకు సంబందించడం వైజ్ఞానిక విషయాలలో హిందూమతం చెపుతుంది కాబట్టి దానినే సరి అయింది అనలేము. అలాగే ముస్లీం మతములో తలాక్ నో, మతోన్మద ' జీహాద్ ' నో మనం సమర్దించలేము. ఏ మతమైనా, సిద్దాంతమైనా వాటిలో మంచి చెడులను శాస్త్రీయంగా విమర్శించాలే తప్ప వారి విశ్వాసాలను కించపరిచే విధంగా, గాయపరిచే విధంగా విమర్శించకూడదు. కమ్యూనిజం లేదా మార్క్సిజం కూడా పరిపూర్ణ సిధ్ధాంతాలు అని చెప్పలేము. అప్పటిదాకా ఉన్న ప్రపంచాన్ని పరిశీలించి కారల్ మార్క్స్ మానవాళి జీవన విధానానికి ఒక అధ్బుత శాస్త్రాలను సశాస్త్రీయంగా వివరించారు. అందుకొక మార్గాన్ని సూచించారు. ఆ మార్గాన్ని ఆయా దే్శాలకు అనుకూలంగా మెరుగుపరచుకుంటూ ప్రణాళికతో కమ్యూనిస్టు పార్టీలు పని చేయాలి. అలా చేస్తున్నాయా ? లేదా ? అనేది ఎప్పటికప్పుడు వారు సమీక్షించుకోవాలి. ప్రజలు వారికి మద్దతునిస్తున్నారా ? లేదా ? అనేది కూడా వారి ఆచరణ మీదనే ఆధారపడి ఉంటుంది.

    ReplyDelete
  55. @పల్లా కొండల రావు,
    మీరు అంటున్నారు, కమ్యూనిస్టులు సరిగా ఉంటే పెట్టుబడి దారులు ఎప్పుడో చిత్తై ఉండేవారన్నారు. వారు సరిగా ఉండొద్దు అని ఎవరైనా బలవంతం చేశారా? పోనీ ప్రపంచములో ఫలానా చోట కమ్యూనిస్టులు సరిగా ఉండి పెట్టుబడి దారి విధానాలను ఎదుర్కొన్నారని ఖచ్ఛితంగా చెప్పగలరా? నేనే కనుగ సరిగా చదువుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని అన్నట్టుగా లేదా ఇది. కాదు అనుకుంటే, నేనూ అదే లైనులో చెబుతాను వినండి. పెట్టుబడి దారులు సరిగా ఉన్న చోట కమ్యూనిజానికి నిలువ నీడకూడా ఉండదు. ఎందుకంటే, ప్రజలు వాస్తవికతను నమ్ముతారు కానీ, అరచేతిలో వైకుంఠం చూపే వారిని కాదు (Read as marxists). దీనికి నేను చాలా ఉదాహరణలు చూపించగలను.

    తప్పులు చేసి, వాటిని అంగీకరించే సత్తా వారికే ఉంది అన్నారు. తమ తప్పును ఒక చారిత్రాత్మిక తప్పిదం అని కప్పిపుచ్చుకోవడం మాత్రమే వారు చేస్తున్నారు. అంటే తాము చేస్తున్నది ఒక గొప్ప పని, దానిలో అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి కాబట్టి పట్టించుకోకండి అని చెప్పడముతో సమానం. అది. కానీ, వారు అలాంటి చారిత్రాత్మిక తప్పిదాలను (కనీసం ఇదివరకూ చేసిన తప్పిదాల వంటివే) తిరిగి చేయకుండా వారు ఎలాంటి చర్యలు తీసుకోరు. నేను ఒక వ్యక్తి ని నరికి చంపి, ఇది కేవలం నేను నాజీవితములో చేసిన చారిత్రాత్మిక తప్పిదం మాత్రమే అంటే సరిపోతుందా? అప్పుడు నేను తప్పులు ఒప్పుకునే సత్తా ఉన్న వాన్ని, గొప్పవాన్ని అవుతానా?

    Srikanth.M

    ReplyDelete
  56. @పల్లా కొండల రావు,

    అసలు కమ్యూనిస్టులో ఉన్న సమస్య .. ఆత్మ స్తుతి, పరనిందా. వారికున్న ఈ జబ్బు ఈనాటిది కాదు, ఇప్పటితో పోయేది కాదు. అక్కడికి తాము, తమ సిద్దాంతాలు మత్రమే గొప్పవి అయినట్టు, మిగిలిన వారు కేవలం అఙ్ఞానముతో బాడపడుతున్నట్టు .. పడికట్టు పదాలతో జనాల్ని విసిగించే అలవాటు బహుషా కమ్యూనిస్టులకు ఉన్నంతా.. మత ప్రచారాలు చేసే వారికి కూడా ఉండదనుకుంటా.

    కమ్యూనిస్టులు మానవ హక్కుల గురించి మాట్లాడడం మాత్రం, ఒక పెద్ద జోక్. మానవ హక్కుల హణణం విషయములో కమ్యూనిస్టులు, వారి రాజ్యాలు ఎప్పుడూ మొదటి స్థానములోనే ఉన్నాయి. అప్పటి సోవియట్ యూనియన్ మొదలుకొని, ఇప్పుడు చైనా వరకూ అన్నీ ఆకోవలోనివే. అయినా కమ్యూనిస్టుల దృష్టిలో మానవ హక్కులు అంటే మావోల హక్కులైనా అయ్యుండాలి, లేదా తాడిత పీడిత జనం అని వారిచేత ముద్ర వేయించుకున్న జనాలైనా అయ్యుండాలి. ఆ తాడిత పీడిత జనములో సైతం ... ప్రజలు మావోయిస్టుల ద్వారా బాధలు పడుంటే మాత్రం అవి మన కమ్యూనిస్టు మాన హక్కుల పోరాటదారులకు అస్సలు కనిపించవు. కదండీ... !!

    Srikanth.M

    ReplyDelete
  57. @@పల్లా కొండల రావు,

    ఇక, హింస అనేది కమ్యూనిజములో లేదు, మార్క్సిజములో లేదు కావాలంటే మేము రాసిన/ రాసుకున్న పుస్తకాలు చూడండీ అంటారు అంతేనా? ఇది ఇంకో జోక్ మాత్రమే.

    పుస్తకాలు అందరూ గొప్పగానే రాసుకుంటారు. మీరు ఇంతగా తిడుతున్న పెట్టుబడిదారులు, మీచేత బూర్జువాలు అనిపించుకుంటున్న వారు, దేశాలు మాత్రం వారి వారి రాజ్యాంగాలలో దోపిడీ చేయుము, పక్కవారిని హింసించుము అని రాసుకున్నారా చెప్పండి?

    అమెరికా వాడు, ఇరాక్ మీద దాడిచేశారాని అమెరికాను తిడుతున్నారు కమ్యూనిస్టులు. అమెరికా విదేశాంగ విధానం చెడ్డది అని చెబుతున్నారు. మరి అమెరికా రాజ్యాంగములో ఇరాకుమీద, దాడిచేయుము అని రాసుకుని చేసారా చెప్పండి. అంతెందుకు మన రాజ్యాంగాన్నే తీసుకోండి, మనది సామ్యవాద దేశం అని రాజ్యాంగములో రాశుంటుంది. మరి ఇక్కడ దోపిడి జరుగుతోందని కమ్యూనిస్టులు ఎలా అనగలుగుతున్నారు చెప్పండి?

    పుస్తకాలలో అలా రాసి లేదు కదా? మరి అక్కడ జరుగుతున్న వాటిని ఆయా దేశాలకు కానీ, పెట్టుబడి దారి విధానానికి మాత్రం మీరు ఎలా అంటగడుతున్నారో కాస్త వివరిస్తారా?

    Last but not least, కమ్యూనిజం మానవత్వానికి దరిదాపుల్లో కూడా ఎప్పుడూ రాలేదు. రష్యాలోనూ, చైనాలోనూ, క్యూబాలలోనూ.. ఆమాటకొస్తే అన్ని కమ్యూనిస్టు రాజ్యాలలోనూ, రెఫ్యూజీ క్యాంపులలో అతి హీనగా, ఘోరంగా మరణించిన సామాన్యులే వాటికి సాక్షం.

    Srikanth.M

    ReplyDelete
  58. @SNKR,
    సిద్ధాంతాలకు విసుగొచ్చినపుడు వాటిని వదిలేయవచ్చు. వ్యంగ్యం ఒక మానసిక రోగం అనేది కేపిటల్ లో మార్క్స్ చెప్పాలా? ఎదుటి మనిషిని గాయపరచేది ఏదైనా మంచిది కాదు. వ్యంగ్యానికి దూరంగా వుండడం అంటే దానికి భయపడడం కాదు మిత్రమా ! బురదకు దూరంగా , కంపుకు దూరంగా జరగడం భయపడడమా ? చెప్పండి. ఈ మాటలు ఖచ్చితంగా మిమ్ములను కించపరచాడానికి కాదని మనవి. మీరు ఇపుడు చేసిన వ్యాఖ్యలలో కమ్యూనిస్టులు ఆచరణలొ విఫల అంశాలు ,ఏ కమ్యూనిజం గొప్పది ? అని అడిగారు. ఖచ్చితంగా మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అపుడు కమ్యూనిస్టులకు వుంటుంది. అలా ప్రశ్నించాలి. నిలదీయాలి కూడా ? అలా మీరు ఎంతైనా విమర్శించొచ్చు కదా ? అనేదే నేను మీకు సూచించదలచుకున్నాను. సుజాత గారికి, కార్తీక్ గారికి కూడా నాకు తెలిసినమేరకు జవాబు ఇస్తాను. మీరైనా విషయం పై చర్చిస్తానంటే తప్పులేదు. కమ్యూనిస్టులేమీ ఆకాశంలో నుండి దిగిరాలేదు తప్పులు చేయకుండా గొప్పవారిగా వుండడానికి ? సిద్ధాంతం ఉండేది కమ్యూనిస్టులకేనా ఏమిటి ? అసలు సిద్ధాంతాలకే భయపదితే ఎలా ? ఆచరణలో నిరూపించబడింది ఏదైనా సిద్ధాంతమే. భూమి గుండ్రంగా ఉంది . ఇదో సిద్ధాంతం.అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతం. మీరు అంగికరించాల్సిన అవసరం ఉన్నా లేకున్నా , మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. దానిలో తప్పులను ఎంచి ఇదిగో , ఇందుకు నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను అని చెపితే మీ వాదనలో బలముంటే దానినే నమ్ముతారు. ఎన్నేళ్ళు అరవాలనేది పరిస్తితులను బట్టి , సిద్ధాంతం చెప్పేవాళ్ళ ఆచరణ బట్టి వుంటుంది. ఒక వేళ సిద్ధాంతమే తప్పు అయితే దానికి మించిన సిద్ధాంతం వచ్చి తీరుతుంది. అంతే తప్ప మనిషిని-మనిషి పీడించే దోచుకునే ఈ పెట్టుబడిదారీ సిద్ధాంతం మాత్రం అంతం కావాల్సిందే . అందులో అణువంతైనా సందేహం నాకు లేదు.

    ReplyDelete
  59. @ సుజాత గారికి,
    " ఏ ఇజాన్నైనా దాన్ని పాటించే వాళ్ళ మూలంగానే దానిని సామాన్యులు చేసుకుంటారు " అనేది నూటికి నూరు శాతం నిజం. అసలు సమస్య ఇక్కడే ఉంది.
    మొత్తం కమ్యూనిజం గురించి కామెంటుగా సమాధానం చెప్పడం సాధ్యం కాదు. నేను అంతటి సమర్ధుడను కూడా కాదు. మీరు రంగనాయకమ్మ గారిని ప్రస్తావించారు గనుక మీకో సూచన. ఆమె వ్రాసిన 'కాపిటల్' పరిచయం 2 భాగాలుగా ఉంది. ఓపికగా చదివితే తేలికగా అర్ధం అవుతుంది. మీరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అది. మీ ప్రశ్నలన్నీటికీ సమాధానాన్ని అందులో ఆమె అందరికీ అర్దమయ్యే రీతిలో వివరించింది.
    కారల్ మార్క్స్ తన జీవిత కాలం మొత్తం వెచ్చించి మానవ జాతి మనుగడకోసం అద్బుతమైన ఒక సిధ్ధాంతాన్ని , మార్గాన్ని రూపొందిస్తే దానిని మన భాషలో లేదా ఇతర భాషలలో అనువదించడానికి, ఆచరించడానికి ఘర్షణలు పడుతూ, తప్పులు చేస్తూ ప్రజలకు చేరువ కాలేకపొతున్నారు. ఇందులో ఎక్కువ శాతం సిధ్ధాంతాన్ని సక్రమంగా అర్ధం చేసుకోలేకపోవడం ఆచరణలో తప్పుడు మార్గాలు అనుసరించడమే కారణం అని నా అభిప్రాయం.
    కమ్యూనిజం బ్రహ్మ పదార్దం ఎంత మాత్రమూ కాదు. పుస్తకాలకీ, ఉపన్యాసాలకీ పరిమితమయ్యేది కూడా కాదు. ప్రస్తుతం మీరన్నట్లే ఉన్నా దానిని గురించి తెలుసుకుంటే లోపం యెక్కడుందో తెలుస్తుంది. కమ్యూనిస్టులలో తప్పుడు వాళ్ళనీ ఆ పార్టీలు అంతర్గత నిర్మాణ పధ్ధతుల్లో వదిలించుకుంటూనే వుంటారు. మనిషికి 2 సంబంధాలుంటాయి. ఒకటి ప్రకృతితోటి, రెండోది తోటి మనిషితోటి. ప్రకృతిలోని వనరులను ఉపయోగించుకుంటూ శ్రమ + ఆలోచన అనే ఆయుధాలతో మనుషులంతా కలసి జీవించడమే కమ్యూనిస్టు ఆశయం. దీనిని సాధించడానికి అడ్డువచ్చే దోపిడీదారులపై పోరాటమే కమ్యూనిస్టు పార్టీ పొరాటం. మీరడిగిన ప్రశ్నలకు కామెంట్ రూపంలో సమాధానం చెప్పడం సాధ్యం కాదు కనుక నేను నడిపే " జనవిజయం " వెబ్సైటు ద్వారా సమాధానం వ్రాయగలనని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదములు.

    ReplyDelete
  60. @ కార్తిక్ గారికి,
    మీకూ , నాకూ వ్యక్తిగత వ్యక్తిగత పరిచయం గానీ, ద్వేషం గానీ లేవు. " నా సంస్కారం గురించి మాట్లాడడానికి మీ అర్హత యేమిటో చెబుతారా ? " అని అడిగారు. ఒక్కసారి మీరు నేను రాసిన కామెంట్ ను, మీ కామెంట్ ను పరిశీలించి చూడగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యెవరినైనా కించపరచినట్లు నిరూపిస్తే క్షమించమని కోరతాను. మీరు వ్యక్తులనైనా, సమూహాన్నైనా దగుల్బాజీ మొహాలు అనడం పధ్ధతికాదు అని చెప్పదలచుకున్నాను. మీరే కాదు ఇలా ఎవరు వాడినా నా సమాధానం అదే. అంతే తప్ప కార్తీక్ గారిని ప్రత్యేకంగా నేను కించపరచదలచుకోలేదు. ఆ అవసరం కూడా లేదు.
    కమ్యూనిస్టు అయిన ప్రతీ వాడికి అస్తిత్వం హింస మీదనే ఆధారపడి ఉంటుందనే అరోపణ మీ అభిప్రాయం మాత్రమే. వాటిని మీ అభిప్రాయంగా స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు మీకు సంపూర్ణంగా ఉంది. కానీ దానిలో వాస్తవం లేదు అని మీతో పాటు ఇది చదివే వారందరికీ విన్నవించదలచుకున్నాను.
    వ్యక్తిగతంగా ఆ సమూహం వల్ల మీరు, మీ కుటుంబం వ్యథ అనుభవిచారనడమూ చాలా తప్పు. మీకు జరిగిన నష్టం నాకు తెలియదు. కానీ అది 'సమూహం' వల్ల ఎలా జరుగుతుంది? నేను కూడా ఆ సమూహంలో ఒకడిని. మీ బాధకు నేనెలా బధ్యుడను చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మీకు కలిగిన బాధకు బాధ్యులైన వారు కమ్యూనిస్టులమని చెప్పుకోవచ్చు. అంత మాత్రాన మీరు 'కమ్యూనిజం' పైననే కక్ష కట్టడం సబబు కాదు. పైగా అది మీలో ఆక్రోషాన్ని పెంచుతున్నట్లుంది. అది కూడా మీకు కూడా వ్యక్తిగతంగా కూడా మంచి పరిణామం కాదు. కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ ఒవర్ యాక్షన్ చేసే వారిలో బాధపడ్డవాళ్ళలో 'నేనూ' ఉన్నాను. నేను చెప్పేది అక్షరాలా నిజం. ఇలా చాలా మంది ఉంటారు కూడా. ఇది ఆచరణలో ఆ సిధ్ధాంతాన్ని అమలు పరిచే నిర్మాణంలో జరిగే వ్యక్తుల క్షమించరాని నేరాలు. దానికీ, కమ్యూనిస్టు సూత్రాలకి సంబంధం అంటగట్టడం. ఏకంగా ఒక సమూహాన్నే విమర్శించడం, శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు.

    ReplyDelete
  61. "వ్యంగ్యం ఒక మానసిక రోగం"

    క్షమించాలి కొండలరావు గారూ. ఈ తొక్కలో సామాన్యుడికి పనికిరాని కమ్యూనిజం గురించి నేను మీతో చర్చించదలచు కోలేదు. కమ్యూనిస్ట్ తో చర్చిండడం కన్నా కుక్కతో కరిపించుకోడం మేలు అని నా ఫీలింగ్.

    ఇకపొతే సాహిత్య పరంగా వ్యంగ్యం అనేది పేరడీల ముఖ్య లక్షణం. మీరు రోగం గట్రా అంటే పేరడీ రచయితలకి ఓ రేంజ్ లో కాలుద్ది మరి.భావ వ్యక్తీకరణలో అనేక శైలులు ఉంటాయి. అందులో వ్యంగ్యం ఒకటి. వ్యంగం మానసిక రోగం అనుకుంటే కార్టూనిష్టులని, పేరడీ రచయితలని అవమానిస్తున్నట్టే.

    ReplyDelete
  62. నా వ్యాఖ్యలపై ప్రతివ్యాఖ్యలు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు . వీటన్నింటికీ సమాధానంగా నేను నా బ్లాగు "జనవిజయం" లో ఒక పోస్టు వుంచుతానని మనవి . మీరు చెప్పిన విషయాలలో నాకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని కూడా మనవి.

    ReplyDelete
  63. @ SHANKAR.S గారూ !
    "వ్యంగ్యం ఒక మానసిక రోగం "
    ఈ విషయం లో మీ సూచనతో నేను ఏకీభవిస్తున్నాను.
    వ్యక్తిగతంగా కించపరుస్తూ వ్రాయడాన్నే నేను తప్పు పట్టదలచుకున్నాను. సాహిత్య పరంగా శైలిని కాదు. ఈ విషయం లో నేను మీ సూచన మేరకు సవరణ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు .

    ReplyDelete
  64. కొండల రావు గారూ,
    మీరు వివరించే శైలి బాగుంది. మీ బ్లాగులో వ్యాసాల కోసం చూస్తాను

    ReplyDelete
  65. కొండలరావు గారు,

    "భూమి గుండ్రంగా ఉంది . ఇదో సిద్ధాంతం."

    భూమి గుండ్రంగా ఉంది అనేది ఒక నిరూపితమైన సత్యం, సిద్ధాంతం కాదు. మీ పొరపాటు గ్రహించగలరు.

    ReplyDelete
  66. రమణ గారు, అరుంధతి రాయ్ తర్వాత మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద చీడపురుగు అయిన కమ్యూనిజం పైన, కమీనేస్టుల పైన చక్కని పోస్టు వేసారు. అభినందనలు

    ReplyDelete
  67. కొండలరావుగారూ,

    కమ్యూనిష్టులని generalize చేసినందుకు మీకు కోపం వచ్చింది. మరి మిరు చేస్తున్న పనేమిటి? మరి మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్తనే generalize చెయ్యట్లేదా?

    మీకొక నీతి, పక్కవాడికి మరొకనీతా?

    ReplyDelete
  68. /ఒక వేళ సిద్ధాంతమే తప్పు అయితే దానికి మించిన సిద్ధాంతం వచ్చి తీరుతుంది./
    It may, but communism has failed in the countries I cited. No practical way of implementing it in as it is.
    It is unwise to still believe, even after the proof!

    / అంతే తప్ప మనిషిని-మనిషి పీడించే దోచుకునే ఈ పెట్టుబడిదారీ సిద్ధాంతం మాత్రం అంతం కావాల్సిందే . అందులో అణువంతైనా సందేహం నాకు లేదు./

    Till you prove communism as an alternative & superior to capitalism, you can only day dream for decades! That's what precisely I said.

    ReplyDelete
  69. @ Edge గారూ !
    మీరు చెప్పిన విషయం గురించి నేను తప్పకుండా ఆలోచిస్తాను. లోపం ఉంటే వెనుకకు తీసుకుంటాను.

    ReplyDelete
  70. @ Malakpet Rowdy గారూ !
    కమ్యూనిస్టులని జనరలైజ్ చేసినందుకు నాకు కోపం వచ్చిందా ? అలా వస్తే వాదనకు భయపడ్డట్లు అవుతుంది. వ్యంగ్యంగా వ్యక్తిగతం గా సరైన భాష వాడనందుకు మాత్రమే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. వ్యంగ్యం గురించి నేను ఇంత క్రితం చేసిన కామెంట్ లో పొరపాటును సవరించుకున్నాను. కోపం తెచ్చుకోవడానికి మనమేమైనా శతృవులమా ? కమ్యూనిజం గురించి అయినా , కాపిటలిజం గురించి అయినా మనం ఒక సిద్ధాంతం గా చర్చిస్తిన్నాము అంతే. కమ్యూనిస్టులలో వెధవలు ,కేపటిస్టులలో ఉత్తములు ఉండవచ్చు. వ్యక్తుల బలహీనతలు - గుణగణాలు వేరు. మొత్తం సామాజిక వ్యవస్థ , సిద్ధాంతం వేరు . ఏ సిద్ధాంతాన్నైనా ఎంత జనరలైజ్ చేసైనా విమర్శించొచ్చు .ఆ సందర్భం లో వ్యక్తిగత విషయాలు-దూషణలు , ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. ఉంటే అది వారి వ్యక్తిగత లోపం అవుతుంది.వీటిని చదివే వారు అవి గమనిస్తూనే వుంటారు. ఏ సిద్ధాంతమైనా ఇదీ,ఇందుకూ,ఇలా ... అనే పద్ధతిలో సమాజానికి మేలు చేసేదై ఉండాలి. మీ పేరు ఏంటీ అలా పెట్టారు ? తెలుసుకోవచ్చా ?

    ReplyDelete
  71. @ SNKR గారూ !
    మీరు చెప్పినట్లు చాలా దేశాలలో ఈ సిద్ధాంతం ఎందుకు ఫెయిల్ అయిందో కమ్యూనిస్టులు మధనం చేసుకోవాలి. సిద్ధాంతమే సరి అయినది కాదా ? దాని అమలులో లోపాలు ఉన్నాయా ? ప్రశ్నించుకోవాలి. సిద్ధాంతమే సరి అయినది కాదు అని తేలితే దానిని మించిన సిద్ధాంతం రావాలి. దీనికి కేపిటలిజం ఎంత మాత్రమూ ప్రత్యామ్నయం కాదు అని నేను విశ్వసిస్తున్నాను.

    ReplyDelete
  72. పికె రావు గారు,
    1) మానసిక రోగం గురించి మీరు చెప్పిన సిద్ధాంతం ఇక్కడోసారి చూడండి:
    http://timesofindia.indiatimes.com/india/Leftist-spoof-of-Last-Supper-creates-furore-in-Kerala/articleshow/11771981.cms
    రంగు పడింది కదా, దీన్నేమంటారు? మీ 'విశ్వాసాలు గొప్పవి, ఇంతవరకూ నిరూపితం కాకున్నా అవి ఎప్పుడో, ఎన్నడో నిఖార్సైనవి అని మీరు చెబితే, మేము నమ్మాలి. ప్రజల మతవిశ్వాసాలను గౌరవిచకపోయినా పనికిమాలిన కూతలు కూయకూడదనే మానసిక మెట్యూరిటీ(మానసిక రోగం అందామా?) మార్కిస్టులకు దశాబ్దాలు గడిచినా రాలేదన్న సత్యాన్ని మీరు అంగీకరిస్తారా?

    2) మీ సో కాల్డ్ విశ్వాసాలు (నిరూపించబడని)చేరట్-డాంకీ కథలోలాగా ఎన్నాళ్ళు సాగిస్తారు? theory of indices ప్రకారం కమ్యూనిజం n=1,2,3,4,5,....(పశ్చిమ జర్మని, సోవియట్ యూనియన్, చైనా, ఉత్తరకొరియా, క్యూబా, యుగోస్లోవియా... ఇలా వరుసగా ఫెయిల్ అయినా, ఇంకా మీరు కేపిటలిజం ఫెయిల్ అయితే గియితే కమ్యూనిజం నిలుస్తుంది అని వారి వాపు, కమ్యూనిస్టులకు బలుపు అనే మీ విశ్వాసం/నమ్మకం, దశాబ్దాలుగా వేచివుండడాలు, చూస్తే ... ప్చ్ ప్చ్.. :)

    ఈ సారి వెరైటీగా జిహాద్ మీద అలాంటి కార్టూన్ వేసి ఆఖరుగా మీ(అంటే కమ్యూస్) అదృష్టాన్ని పరీక్షించుకోగలరు. :D

    ReplyDelete
  73. @ SNKR గారూ !
    మీరు చెప్పింది దీని గురించేనా ?
    http://www.prajasakti.com/voiceofindia/article-320098

    ReplyDelete
  74. కమ్యూనిజం గురించి అయినా , కాపిటలిజం గురించి అయినా మనం ఒక సిద్ధాంతం గా చర్చిస్తిన్నాము అంతే.
    ___________________________________________________

    నా మటుకూ నేను వ్రాసింది కమ్యూనిష్టుల గురించే, కమ్యూనిజం గురించి కాదు. కమ్యూనిజమైనా, కేపిటలిజమైనా మంచే గానీ చెడు చెప్పవని నా ఆభిప్రాయం. ఇక్కడ ఇబ్బందంతా మీరన్నట్టుగా ఆ వెధవలతోటే.

    కమ్యూనిసంలో మంచిని చూడూ అని మీరెల అంటున్నారో కేపిటలిసంలో కూడా మంచిని చూడమని మిగతావారు అనచ్చు. కమ్యూనిసం అర్థంకాక వేరేవాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారన్నారు. మరి అదె విదంగా కేపటలిసం అర్థంకాక కమ్యూనిష్టులు దాన్ని వ్యతిరేకిస్తున్నారేమో?

    ReplyDelete
  75. బావిలోని కప్పలంటే ఎవరు? తెలుగు బ్లాగుల్లో పెట్టుబడిదారులమని చెప్పుకుంటున్నవాళ్ళలో ఒక్కడు కూడా బెంజమిన్ ఫ్రాంక్లిన్ రచనల గురించి ఉదహరించలేదు. పైగా మేము మార్క్సిజం గురించి వ్రాస్తే మేము మార్క్సిజం చదవలేదని విమర్శించారు. మార్క్సిజం చదివినవాళ్ళని బావిలోని కప్పలని అంటూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రచనలని కూడా ఉదహరించకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కబుర్లు చెపుతున్నారు.

    ReplyDelete
  76. USA is still following Benjamin Franklin's economics i.e. cutting costs and making profits. బ్లాగుల్లో పెట్టుబడిదారులమని చెప్పుకుంటున్నవాళ్ళలో ఒక్కడైనా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి తెలుసా? గతితార్కిక-చారిత్రక భౌతికవాదం చదివిన మాకే మార్క్సిజం గురించి తెలియదని అంటున్నారు. మార్క్సిజం గురించి తెలియకుండా మార్కిస్ట్‌లమని చెప్పుకుంటే ఏమీ రాదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి తెలియకుండా కేపిటలిజం పేరు చెప్పుకోవలసిన అవసరం పెట్టుబడిదారులకి ఉంటుంది.

    ReplyDelete
  77. బ్లాగుల్లో కమ్యూనిష్టులమని చెప్పుకుంటున్న వాళ్ళకు కమ్యూనిజం గురించి ఎంత తెలుసో పెట్టుబడిదార్లకు కేపిటలిజం గురించికూడా అంతే తెలుసు ప్రవీణూ. అమేరికా ఎకానమీ నువ్వు ఆలోచించగలిగేదానికన్నా పెద్దదేలే.

    ReplyDelete
  78. మీరు బావిలో కప్పలని ఎవరన్నారు బురదలో పందులయితేనూ?

    ReplyDelete
  79. US follows Benjamin Franklin economics? Joke of 2012 haha

    ReplyDelete
  80. సరే ప్రవీణ్ ఇంతకీ మొన్న వ్యాఖ్యాత పేరు కూడా చూడకుండా కామెంట్ చేసేస్తావు అని నన్ను అన్నావు కదా.మరి నువ్వు చేసినదానికి నీ సమాధానం?

    అలాగే నువ్వు చెప్తున్నా సోకాల్డ్ కమ్యూనిజం సామాన్యుడికి ఏ విధంగా ఉపయోగపడిందో చెప్పగలవా? కనీసం నువ్వు చెప్పే గతితార్కిక-చారిత్రక భౌతికవాదం, పోస్ట్ మోడర్నిజం లాంటి పదాలు ఏ పల్లెటూళ్ళో ఏ సామాన్యుడికి అర్ధమవుతాయో చెప్పగలవా? ఓ సారి ఏదైనా పల్లెటూరికి వెళ్లి ఎవరికైనా ఇలాంటి పదాలు చెప్పి చూడు చేతబడి మంత్రాలు చదువుతున్నావు అనుకోగలరు.
    సామాన్యుడికి అర్ధంకానిది, పనికిరానిది అది ఎంత గొప్ప ఇజమైనా వెస్ట్ ప్రవీణ్.

    ReplyDelete
  81. @ ఈ చర్చలో పాల్గొన్న అందరికీ !
    యరమన గారు ఎర్ర పార్టీల గురించి కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం అంటూ ఒక పోస్టు పెదితే స్పందిస్తూ నా కామెంట్ పంపాను. తరువాత చాలా మంది మితృలు దానికి స్పందిస్తూ అసలు సబ్జెక్ట్ కంటే ఎవరి ప్రతిభ వారు కంబరస్తూ వస్తున్నారు. ఇలా ప్రతిస్పందిస్తూ పోతే అసలు బ్లాగు రచయిత కంటే మన స్పందనలు ఎక్కువ అవుతూ వున్నాయి. ఇలా మనమే చర్విత చరణం చేసుకుంటూ పోయినా చదువరులకు ఇబ్బందే. కమ్యూనిజం కాపిటలిజం ల గురించి కామెంట్ల చర్చలతో తెగేది కాదు. అందుకే నేను ఇక్కడ చర్చల నుండి తప్పుకుని నా బ్లాగులోనే(www.janavijayam.blogspot.com)ఈ విషయం పై చర్చించదలచుకున్నాను. ఇక్కడ చర్చల వల్ల కూడా వ్యంగ్యం వంటి విషయాలలో నా అభిప్రాయాలలో కొంత సవరణలు చేసుకున్నాను. అయితే ఇక్కడ విషయం పై కంటే వ్యక్తిగతంగా చూపెట్టుకునే వ్యంగ్యమే నాకు ఎక్కువ కనబదుతున్నది. అది ప్రవీణ్ శర్మతో సహా మితృలంతా సరిచేసుకోవాలని విజ్నప్తి మాత్రమే.

    ReplyDelete
  82. విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ గారనే ఆయన వ్యవసాయ కార్మిక సంఘం ఒకటి పెట్టి వ్యవసాయ కార్మికులకి గతితార్కిక-చారిత్రక భౌతికవాదం పాఠాలు చెబుతున్నారు. ఆయన నాకు ప్రజాశక్తి బుక్ హౌస్‌లో పరిచయమయ్యారు. ఆయన నాకు ఫోన్ నంబర్ ఇచ్చారు కానీ తరువాత వ్యక్తిగత పనులలో ఉండి నేనే ఆయన్ని కాంటాక్ట్ చెయ్యలేదు. మతవాదులు మనిషికి సమాజం గురించి ఎన్నటికీ అర్థం కాదనీ చెప్పి దేవుడు-ఆత్మ లాంటి భౌతికతకి బయట ఉండే విషయాలనే విశ్వసించమంటారు. నాస్తికులు సమాజం మార్పుకి లొంగని సూత్రాలకి అనుగుణంగా పని చేస్తుందనీ, వాటిని మార్చడం సాధ్యం కాదనీ చెప్పి పెట్టుబడిదారీ వ్యవస్థనే సమర్థిస్తున్నారు. అందుకే జనానికి గతితార్కిక-చారిత్రక భౌతికవాదం గురించి చెప్పడానికి ప్రసాద్ గారు క్లాస్‌లు పెట్టారు. నేను ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాను. ఇక్కడ నేను ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. నేను నా సొంత పని (నా పెళ్ళి సంబంధం పని) మీదే తిరుగుతున్నాను. కనుక కొన్ని రోజుల వరకు బిజీగానే ఉంటాను. నేను మార్క్సిజం గురించి మొట్టమొదటిసారిగా చదివినది రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువాదమైన మార్క్సిస్ట్-లెనినిస్ట్ తత్వశాస్త్రం అనే పుస్తకంలో. ఆ తరువాత రాళ్ళబండి వెంకటేశవరరావు (RVR) గారి రచనలు, కంభంపాటి సత్యనారాయణ గారి రచనలు, ఏటుకూరి బలరామమూర్తి గారి రచనలు చదివాను. వీటిలో అన్నిటి కంటే సులభంగా కంభంపాటి సత్యనారాయణ గారి రచనలు అర్థమవుతాయి. ఆయన సంస్కృత పదాలు కాకుండా ఎక్కువగా తెలుగే ఉపయోగిస్తారు కనుక పల్లెటూరివాళ్ళకి కూడా ఆయన రచనలు అర్థమవుతాయి. ఇండియాలో విప్లవ పుస్తకాలు పబ్లిష్ చెయ్యాలంటే ధైర్యం ఉండాలి. మహారాష్త్రలో ఒక వ్యాపారి భగత్ సింగ్, మావోలు వ్రాసిన పుస్తకాలు అమ్ముతున్నాడని పోలీసులు అతన్ని చిత్రహింసలు పెట్టారు. నిజానికి ఆ పుస్తకాలపై ఇండియాలో నిషేధం లేదు. గ్లోబలైజేషన్ కాలంలో మార్క్స్, మావోలు వ్రాసిన పుస్తకాలంటే కొందరికి భయం పుడుతుంది. అందుకే పాలక వర్గంవాళ్ళు ఆ పుస్తకాల వ్యాపారిని చిత్రహింసలు పెట్టించారు. అయినా మేము భయపడకుండా మార్క్సిజం-లెనినిజం-మావో జెడాంగ్ థియరీలని ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము.

    ReplyDelete
  83. పెరటిలోని చెట్టు వైద్యానికి పనికిరాదంటె ఇదే. మన దేశ వనరులను దృష్ఠిలో బెట్టుకుని, ఇప్పటికీ ఉపయోగపడగల "కౌటిల్యుని అర్ధశాస్త్రం" చదివితే చాలు. లెక్కలేనన్ని Benjamin Franklin's economics థియరీలు ఎన్ని చదివిన మన వనరులకు సరిపడవు.

    ReplyDelete
  84. "నేను నా సొంత పని (నా పెళ్ళి సంబంధం పని) మీదే తిరుగుతున్నాను."

    ఆల్ ద బెస్ట్ ప్రవీణ్.

    ReplyDelete
  85. పెళ్లి సంబంధం పని మీద వెళ్తున్నారా?

    ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. మీ పెళ్లిచూపులు బాగా జరిగి, మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నాను. :)

    ReplyDelete
  86. /ఆ తరువాత ...గారి రచనలు చదివాను./

    ఎరుక మాలువాడికేమేవి చదివిన
    చదివినంతసేపె సద్గుణియగు
    కదిసి తామరందు కప్ప కూర్చున్నట్లు
    విశ్వదాభిరామ వినురవేమ.
    :)))))) :)))))))))

    ReplyDelete
  87. /@ SNKR గారూ !
    మీరు చెప్పింది దీని గురించేనా ?/

    కాదండి, జాతీయ పత్రికల్లో వచ్చిన వార్త గురించి. ప్రజాశక్తి, ఎర్రదండు, జనశక్తి లాంటి తొత్తువాద పార్టీ బాకా పత్రికల్లో వచ్చే చొప్పదంటు ఫేస్-సేవింగ్ సంజాయిషీల గురించి కాదు.

    ఇది మొదటి సారి కాదట, ఇంతకుముందోసారి మదర్ థెరెసా బొమ్మ కూడా ఇలానే ప్రయోగించారట కూడా.
    కావాలంటే బూర్జువా పత్రికలు అని మొదలెట్టారు చూడండి. bourgeois(బూర్జువా) అంటే అరువుతెచ్చుకున్న ఫెయిల్డ్ కమ్యూనిస్టు సిద్ధాంతాం ప్రకారము మధ్య తరగతివాడు, చిన్న వ్యాపారి అనేనా అర్థం? బూర్జువా పత్రిక అంటే పెట్టుబడితో నడిపించే పత్రిక అనేనా? మరి ఏదో ఒక పెట్టుబడి లేకుండా జనాల మీద చందాలతో నడుస్తున్నాయా ఈ జనశక్తి, ప్రజాశక్తి టైపు పత్రికలు?!!
    /కమ్యూనిజం కాపిటలిజం ల గురించి కామెంట్ల చర్చలతో తెగేది కాదు. అందుకే నేను ఇక్కడ చర్చల నుండి తప్పుకుని నా బ్లాగులోనే(www.janavijayam.blogspot.com)ఈ విషయం పై చర్చించదలచుకున్నాను./
    ఇక్కడి తెగని చర్చలు మీ బ్లాగులో చర్చిస్తే బాగా తెగుతాయని ఎలా అనుకుంటున్నారు? :D ఉత్తర కొరియా, క్యూబాల టైపు అనువంశిక పాలన గురించి మార్క్స్ ఏమైనా 'కలలు' కనేవుంటాడనుకుంటా, వివరించండి. :P

    ReplyDelete
  88. @ గారూ !
    అసలు చర్చించను అంటే పొరపాటేమో గానీ , నా బ్లాగులో చర్చిస్తాననడం తప్పు అవుతుందా ? నేను రాసిన కామెంట్ యరమన గారికి . ఆయన దానిని ఎలా తీసుకుంటారో చూద్దాం. మిగతా చర్చలు కొంత చూశాక నా నిర్ణయం నేను తీసుకున్నాను. దానికి కూడా కామెంట్ చేయడం , దానిని కొనసాగించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడ చర్చలలో ఉండదలచుకోలేదు. ఇక్కడ చర్చలలో ఇదే నా లాస్ట్ కామెంట్. ధన్యవాదాలు.

    ReplyDelete
  89. ఇక్కడ జరుతున్న చర్చ ని మొదటనుంచి గమనిస్తున్నాను. కొంచం సేపు పక్క వాదన పట్టినా చర్చ రసవత్తరంగా మారేసరికి పల్లా గారు మనేయడం బాగాలేదు. ఫక్తు భారత కమ్యునిస్టుల్లాగ పలాయనవాదం అవలంబిస్తున్నారు.

    అర్ధంకావడానికి అర్ధం అయ్యేటట్లు చెప్పాలి. అలా కాకుండా పిల్లి అంటే మార్జాలం లా చెప్పి, మీకు ఎంత చెప్పినా అర్ధం కాదు అనడం సరికాదు.


    కాముధ

    ReplyDelete
  90. @ Kamudha గారూ !
    ఈ పోస్టు చూడండి. http://www.janavijayam.com/2012/02/blog-post_6429.html

    ReplyDelete
  91. I disagree with the theory that communism is good but its failinf because of the people.

    To me a true and honest communist is more dangerous than a corrupt communist.

    ReplyDelete
  92. Good sir. but wat u will say about the states like west bengal and kerala in which the communist parties play major role.

    ReplyDelete
  93. @Bharath,

    ఉభయ కమ్యూనిస్టు పార్టీల గూర్చి నా చిన్నప్ప్పట్నించీ నేను వింటున్న విమర్శలే ముసలి కాకి చేసింది. ఈ పాయింట్ ఎవరూ పట్టించుకోలేదు.

    కమ్యూనిస్టులు గొప్పోళ్ళా లేక కమ్యూనిజం గొప్పదా, కాదా అన్న విషయాల జోలికి ముసలి కాకి పోలేదు. వ్యాఖ్యాతలే పొయ్యారు.

    సరదాగా రాసిన పోస్టుల్ని సరదాగా చదివి నవ్వుకుందాం.

    బ్లాగులు చదివి రాజకీయ అభిప్రాయాలు ఏర్పర్చుకునే లేదా మార్చుకునే అమాయకులు ఎవరూ లేరు లేండి!

    ReplyDelete
  94. CPI and CPM are not communist parties. They are neo-ruling class parties in sense. I wrote about it in plus: https://plus.google.com/111113261980146074416/posts/GT5JBuRL8DB Now I saw Yaramana's comment. I gave this link to say that CPI and CPM are neither communist and not even reformist.

    ReplyDelete
  95. Erraki vese vote ellakalam odipoyetanduke....kanuka erralato vadam anavasaram,ode varini enduku odinchadaniki prayatninchi sakti vruda chesukovadam?...aa saktini vere panulaki vada vachuga...so erralaki samadanm ivvatam anavasaram(chevit...shankam katha laga)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.