Tuesday, 14 February 2012

జూడాల జులుం


వైద్యవృత్తి అంటే ఒకప్పుడు గౌరవప్రదమైన వృత్తి, నేడు డబ్బు సంపాదించే గిట్టుబాటు వృత్తి. ఎవరికైనా అనుమానం ఉంటే 'జూడా'లుగా వ్యవహరింపబడుతున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లని పరిశీలిస్తే అనుమానం తీరిపోతుంది. మన బ్లాగర్లు ఎందుకనో ఈ స్వార్ధ జూడాల చావు తెలివిని పట్టించుకోలేదు!

ప్రభుత్వ వైద్యకళాశాలలు మన డబ్బుతో నడుస్తాయి. మన దేశ అవసరాలకి తగినట్లు వైద్యవిద్యకి సిలబస్ నిర్ణయించబడుతుంది. ఇష్టమైతే చేరండి, కష్టమైతే పోండి. మిమ్మల్ని డాక్టర్లయ్యి మమ్మల్ని ఉద్ధరించమని ఎవడూ దేబిరించట్లేదు. చేరేప్పుడు అన్నింటికీ ఒప్పుకుని బాండ్లు ఇస్తారు. బయటకి వచ్చేప్పుడు మాత్రం సమ్మె చేస్తారు. మీ సిగ్గుమాలిన, నీచోపాయానికి రాజకీయపార్టీల వత్తాసు తోడు!

మీ ఏడుపంతా 'రూరల్ సర్విస్' గురించే అని మాకు తెలుసు. హడావుడిగా కార్పరేట్ ఆస్పత్రులు పెట్టేసి ప్రజల్ని దోచేయ్యాలి, లేదా అర్జంటుగా అమెరికా వెళ్లిపోవాలి. మరి రూరల్ సర్విస్ అడ్డే గదా! మీలాంటి దౌర్భాగ్యుల చేతిలో ఈ దేశ ఆరోగ్యం ఉండబోతుంది. ఖర్మ!

మీ బ్లాక్ మెయిల్ గూర్చి ఇంక రాసి నా టైమ్ వేస్ట్ చేసుకోలేను. మీ స్థాయికి దిగజారి రాయలేను.

(photo courtesy : Google)

38 comments:

  1. నేనూ ఈ విషయం మీద స్పందిద్దామనుకుంటూనే ఏపీ బ్లాగర్లకే లేని దురద నాకెందుకని ఆగిపోతూవున్నాను. ఇండియాలో లేని నాకే మాటిమాటికీ ఈ జుడాల జులుం చూస్తుంటే చిరాకు వస్తుంటే మీకు అందరికీ ఎలా వుంటుందో అర్ధం చేసుకోగలను.

    ReplyDelete
  2. i heard somewhere that they are ok with rural service but fellowship is the only problem. i think increase of fellowship is genuine demand from their side. anyway it is a fact that medical system is no more a service oriented area in india. funny is that hospitals having marketing managers....

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. The deaths of patients was over publicised by the nouveau rich people media for its news purpose. The media is propogating as if there were no deaths at all before the junior doctors' strike. Acutally, the junior doctors do nothing except wandering in the verandahs wearing apron and stethascope. Main treatment will be given by the senior doctors and the remaining nursing and other cleansing duites will be performed by the mid-wives and nureses in the hospital. These so called doctors will be in the learning stage and some of them are the cause of deaths with their half knowledge, which is proved in several cases. So, if these juniors go on strike for another one month or so, the media along with rascal and rogue opposition leaders should stop blaming the government for the unrest.

    ReplyDelete
  5. జూడాల సమ్మెలో వికృత, వికార క్రియేటివిటీ కూడా చూడొచ్చు.

    పిండాలు పెట్టటం, శవయాత్రలు నిర్వహించడం మొదలైనవి.

    వీళ్ళు రోడ్లు ఊడ్చుటం, బూట్లు పాలిష్ చెయ్యడం లాంటి నిరశనలు కూడా తెలియజేస్తారు. ఇది ఆ వృత్తుల వారిని అవమానపరచటమేనని, అమానవీయమనీ సృహ ఉండదు.

    మా 'జూడాగిరి' లో ఈ పోకడలు తప్పని వాదించేవాళ్ళం.

    ఇప్పటి జూడాలు పోకిరీలు. అల్లరి మూక. కనీస సామాజిక సృహ లేని urban arrogant bunch.

    ReplyDelete
  6. బాగా తెలివి తేటలు ఉన్న వాళ్ళకు కదా మెడిసిన్ లో సీట్లు వచ్చేది? ఎందుకని ఇల్లా అయ్యింది?. మిగతా విద్యా రంగాల్లో ఎక్కడా చదువుకునేటప్పుడు ఈ సమ్మెలు లేవే. ఏమిటి కారణం? సరిఅయిన వాళ్ళని తీసుకోటల్లేదా చదువుకి?

    ReplyDelete
  7. అన్ని రంగాల్లో విలువలు పడిపోయినట్లే వైద్య రంగం కూడా అధోగతికి చేరుకుంది.

    పిల్లల్ని శ్రీ చైతన్య, నారాయణల లో డిపాజిట్ చేసి.. డైరక్టుగా మెడికల్ కాలేజికి పంపడం వల్ల సమాజానికి ఎంత నష్టమో ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది.

    దాని ప్రతిఫలమే నేటి జూడాలనబడు వికృత సంతతి.

    ReplyDelete
  8. Who told the highly intellegent people get seats in Medicine. Only 10-15%of the doctors are coming with a dedication and real worth. All ramaining are american dimands made in coaching centres. In the last 7 years I believe they made this kind of nuesence atleast once a year. Most of the students who are leading the dirty agitation are nothing but kids of millionairs or upper middle class people, who paid donations and make this education as costly business.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. మీరు పైన పెట్టిన పోటోలో చాలామంది విద్యార్ధులు లా కనపడటం లేదు. ఆ పిల్లల తండృలు లాగా ఉన్నారు. కావాలంటే వారి బొజ్జాలు, చాలా వదులుగా టక్ చేసుకొన్నారు. ఇంతకి వారు విధ్యార్దులా లేక వారి తండృలా? :-)

    Sri

    ReplyDelete
  11. జూడాల అసలు రోగం రూరల్ సర్విస్. కానీ ప్రజల మద్దతు కోసం hospital infra structure, library facilities లాంటి పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెబుతుంటారు.

    బ్లాగర్లలో ఎందరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పేషంట్స్ గా వెళ్ళారో నాకు తెలీదు గానీ.. ఈ జూడాలు (సీడాలతో కలిసి) పేదవాళ్ళకి నరకం చూపిస్తుంటారు.

    ఈ జూడాలకి సమ్మె సందర్భాన మాత్రం పబ్లిక్ మీద విపరీతమైన ప్రేమ. టీవీల్లో ఉపన్యాసాలు దంచుతుంటారు. ఇదే ప్రేమ వీళ్ళ సమ్మె ముగిసిన తరవాత కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం.

    నాకు ఆశ్చర్యం కలిగించింది రాఘవులు, నారాయణల మద్దతు. ప్రకటనలు.

    చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ కమ్యూనిస్టులకేం పొయ్యే కాలం!

    ReplyDelete
  12. "మీరు పైన పెట్టిన పోటోలో చాలామంది విద్యార్ధులు లా కనపడటం లేదు. ఆ పిల్లల తండృలు లాగా ఉన్నారు. కావాలంటే వారి బొజ్జాలు, చాలా వదులుగా టక్ చేసుకొన్నారు. ఇంతకి వారు విధ్యార్దులా లేక వారి తండృలా?"
    :-) :-) :-)

    ReplyDelete
  13. This is too bad for JUDA's behaving like this for everytime.....why the govt has to give them such huge stipuds ,when they are doing their course....they are doing for their Degree only....Few days back i have seen a JUDA in front of TV saying we are studying with peoples money and people are doing for their service only.

    ReplyDelete
  14. జూడా లు సోడాలు వీళ్ళంతా ఎవరు ? ఏమిటీ కథ !జేకే !

    ఏమిటీమారు డాక్టరు గారు సేమ్ సైడ్ గోల్ వేస్తున్నారు ?

    జిలేబి.

    ReplyDelete
  15. డాక్టరు గారు

    ఈ జూడాల గొడవలోకి తేడా (తెలంగాణ డాక్టర్లు) గాళ్లు ఎందుకు వచ్చ్రారంటారు?

    ReplyDelete
  16. Why don't we look for free market answers? Firstly, the medical education needs to be paid for by the students. They can take a loan if need be. If the government subsidizes medical education, then it better make sure to extract service from the junior doctors in exchange - be it in the underserved areas or in the military - not as a trainee, but, as a medical practitioner.

    Importantly, don't let anybody off the hook no matter who they are and enforce regulation universally - which unfortunately is a non-starter in a corrupt country like India. Expecting saintly behavior from people is a crazy idea. People always will do what is in their best interest unless there is a threat of a fine or jail sentence.

    On the other hand, making money ethically is not a crime and nobody needs to be ashamed of it. If the government does not know how to formulate and enforce policies that would serve the population better, then there is no use blaming groups of people.

    We are all capable of acting like Judas (or Jesus for that matter).

    ReplyDelete
  17. జిలేబి గారు,

    'అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక' అన్నట్లు ఈ జూడాలకి నేను మేనమామని.

    అసలు వీళ్ళ డిమాండ్ల గూర్చి, ప్రతి కేలండర్ యియర్ లో వచ్చే వీరి సమ్మె గూర్చి ఒక పోస్ట్ రాద్దామనుకున్నాను.

    కానీ.. మన గూర్చి మనమే ఎందుకు రాసుకోవడం.. ఇప్పటికే పేషంట్లు మమ్మల్ని తంతున్నారు. ఇంక బ్లాగుల్లో కూడా తిట్టించు కోవడం మంచి పని కాదులెమ్మని ఊరకున్నాను.

    నా ఖర్మ కాలి నిన్న టీవీలో ఒక జూడాబాబు ప్రజారోగ్యం గూర్చి దంచుతున్న ఉపన్యాసం చూశాను.

    అవినీతి గూర్చి గాలి ఉపన్యాసం దంచితే ఎలా ఉంటుంది?

    కోపంతో ఐదు నిమిషాల్లో ఈ టపా రాసేశాను.

    రూరల్ సర్విస్ కి నేను పూర్తి అనుకూలం. అది ఏ విధంగా ఉండాలనేది దేశవ్యాప్తంగా ఒక పాలసీ నిర్ణయించబడాలి. అన్ని రంగాల్లో లానే వైద్య విద్య రంగంలో లోపాలున్నయ్. ప్రభుత్వం తన భాధ్యతలని విస్మరిస్తూనే ఉంటుంది. పడుతూ లేస్తూ ప్రజారోగ్యాన్ని కొద్దో గొప్పో (ఇష్టం లేకపోయినా) పట్టించుకునేది ప్రభుత్వమే. ఈ రూరల్ సర్విస్ ని ఎలా ఇంటిగ్రేట్ చెయ్యాలనేది చంద్రబాబు వంటి విజ్ఞులు ఎసెంబ్లీలో చర్చించి ఒక పద్ధతి రూపొందించాలి (జూడాలు కాదు).

    మా విద్యార్ధి దశలో జర్నల్స్ కొరత ఉండేది. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యామాని చాలా జర్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రచురించబడిన తరవాత మూడు నెలల నుండి ఆరు నెలలు దాటితే అవి ఆర్కైవ్స్ లోకి పంపబడి full text ని available చేస్తున్నాయ్. నాలాంటివాడు కూడా ఈ ఫెసిలిటీ వాడుకుంటున్నాడు. వైద్య విద్యలో ఇంటర్నెట్ ఒక విప్లవం సృష్టించింది.

    India is one of the very few countries where you can have free access to COCHRANE library for evidence based medicine (funded by ICMR).

    ప్రభుత్వం వైద్య విద్యార్ధుల మీద చాలా ఖర్చు పెడుతుంది. హాస్పిటల్స్ ని టీచింగ్ హాస్పిటల్స్ అంటారు. ఫాకల్టీ మెడికల్ కాలేజ్ కింద పనిచేస్తుంది. వైద్యవిద్యకి సంబందించి హాస్పిటల్స్ విద్యార్ధుల ప్రాక్టికల్స్ కోసం నిర్మింపబడ్డ ప్రయోగశాలలు. అంతే! నీ ప్రాక్టికల్స్ కోసం పనిచేస్తున్న, నిర్వహింపబడుతున్న ఖర్చు నీ ఖాతాలో కాక ఇంకెక్కడ రాసుకోవాలి జూడాబాబు?

    ఈ జూడాల విషయంలో నా కోపం నాచే ఇలా రాయిస్తుంది. జిలేబి గారు అర్ధం చేసుకోగలరు.

    ReplyDelete
  18. I agree with Gldoc.....why should government fund medical studies in the 1st place.....agreed tht they have signed bonds....but do they have a choice....when the medical education is completely controlled by government......

    boot the government out......

    ReplyDelete
  19. This is the first ever bitter critique of doctors by a doctor. This is dharmagraham. Tappupattalsindi emiledu. Timely exposure of vulgal rights discourse of JUDAs.

    But, one thing. I support JUDAs' demand against rural service. In fact, I demand they should be banned from entering into villages since they colonise the bodies of the rural masses with German and American pharmaceutical products. They colonise human body with western medicines and destroy the inherent immunity mechanism and thus the part of nature in humanbody. Hence, i ask them to leave the country as early as possible and die on daily basis in the consumerist drudgery of the western atomistic individual. bravo Ramana!

    ReplyDelete
  20. Vydyaraja namastubhyam,
    Yamaraja sahodara,
    Yamat harati pranaani,
    Vydyo prana dhanaanicha..

    - putcha

    ReplyDelete
  21. ఏడాది రూరల్ సర్వీస్ చెయ్యడానికి బద్దకమైతే 35 ప్రజా సేవ చెయ్యడానికి ఇంకెంత బద్దకం ఉంటుందో.

    ReplyDelete
  22. రమణగారూ, మీరు సీరియస్ గా రాస్తే తప్పు పడుతున్నానని అనుకోకపోతే ఒక సలహా. మీరు మీ శైలిలో రాస్తేనే బాగుంటుంది.

    This post does not fit your usual style of subtle humor.

    ఇదే విషయాన్ని సుబ్బుతొ చెప్పిస్తే బెట్టరేమో?

    ReplyDelete
  23. Rao S Lakkaraju గారు,

    నాకు తెలిసి వైద్య విద్యకి తెలివి అవసరం లేదు. ఉదాహరణకి ఇంటర్ స్థాయిలో స్టేట్ ఫస్ట్ వచ్చి, వైద్య విద్యలో బంగారు పతకాలు సాధించినవాడు కూడా మంచి వైద్యుడు కాలేకపోవచ్చు.

    పేషంట్ చెప్పేది ఓపిగ్గా విని.. వారి జబ్బు గూర్చి వివరంగా చర్చించి.. జబ్బు తగ్గించేందుకు (తక్కువ మందులతో) ప్రయత్నం చేసేవాడే మంచి డాక్టరవుతాడు. అతను పెద్ద మేధావి అవ్వనవసరం లేదు. మంచి మనిషి అయితే చాలు.

    సాధారణంగా తొంభై శాతం రోగాలు routine clinical problems. majority of them are self limiting.

    'గొప్ప తెలివైన డాక్టర్' అయినా పేషంట్ చెప్పేది వినే ఓపిక లేనపుడు ఉపయోగమేమి?

    వైద్య విద్య అనేది mostly practical training (bed side learning).

    ఒక గొప్ప న్యూక్లియర్ ఫిజిస్ట్ లాబ్ లో కూర్చుని వండర్స్ సృస్టిస్తాడు. అతనికి సమాజం గూర్చి అవగాహన లేకపోయినా.. సమాజానికి నష్టం లేదు. కానీ.. వైద్య వృత్తి అలా కాదు.

    మన దేశంలో చదువుకున్న వారు తక్కువ. వారిని మోసం చెయ్యటం చాలా ఈజీ. ఆ మోసం చేసే వాడు డాక్టరయితే సమాజానికి చాలా హాని జరుగుతుంది.

    ReplyDelete
  24. Jai Gottimukkala గారు,

    మీ సూచనకి ధన్యవాదాలు.

    నా స్నేహితుల సలహాపై సుబ్బుని పక్కన పెట్టాను. (సుబ్బు వెనక దాక్కుని ఆ నంగి కబుర్లేంటి? మర్యాద ముసుగులు పక్కన పడేసి ఏమనుకుంటున్నావో అది రాసిపడెయ్యహె!)

    నేను ఇంత సీరియస్ గా రాయగలనన్న విషయం నాకూ తెలీదు! (పోన్లేండి. జూడాల పుణ్యమాని ఒక కొత్త విషయం తెలిసింది.)

    ReplyDelete
  25. Yaramana Garu entha clear ga chepparandi.....Thanks for the post..
    They are asking to imcrease the salaries (not salaries free money)to AIMIS.....ok govt can collect all the 40 lacs spent on them after that govt can give the salaries with intreast accumilated on that money.

    ReplyDelete
  26. People that espouse virulent anti-Western views like Chandrasekhar should give up their pen, computer, light bulb, electricity, TV, radio, movies, music records, loud speakers, internet, vaccinations, antibiotics, automobiles, concrete, traffic signals, running water, airconditioning, refrigeration and so on. All these are Western creations.

    ReplyDelete
  27. అగ్గిరాముడైపోయారండీ బ్లాగరు గారు!
    ఏదో జూడాలని యేడిపిస్తోందేమో ప్రభుత్వం అని కొంచెం సానుభూతి ఉండేది.
    ఆలోచించేలా చేసారు.
    కృతజ్ఞతలు.

    ReplyDelete
  28. మీ సుబ్బు సుభాషితాలు నాకూ నచ్చవ్. మీవి ఇలాంటి పోస్టులయితేనే చూస్తుంటాను.

    ReplyDelete
  29. శరత్ గారు,

    థాంక్యూ!

    రాద్దామనిపించినప్పుడు రాసేస్తున్నానండి. ఏం రాయాలి? ఎలా రాయాలి? అన్న ప్లానింగ్ అస్సలు ఉండదు. ఒక్కోసారి సుబ్బు ఎంటర్ అవుతుంటాడు. వాణ్ణి క్షమించెయ్యండి.

    ReplyDelete
  30. శ్యామలీయం గారు,

    అత్యంత అరుదుగా మాత్రమే ప్రభుత్వం నిర్దోషిగా ఉంటుంది.

    మీడియాలో వచ్చే నెగటివ్ వార్తలకి భయపడి ప్రభుత్వం జూడాలతో సంధి చేసుకుందని నాకు అనిపిస్తుంది.

    ReplyDelete
  31. Mr. GLDoc,I am thankful to your suggestion. I am in fact in the process of coming out of gadgetised existence.

    The point is not science and its innovations and making use of them. [Unless there is 'Zero'there would not be much innovations in science. Zero is a contribution of pre-modern India]. The point is the ideological dominace of imperial science and its destructive force and Colonisation of societies and the destruction of the East/South by the West in the name of science. one should understand that after the onslaught of western Modernity there has been more violence and destruction in the world. Take the death toll in the two world wars and the destruction of nature, both outside and inside humanbody in the past 200 years. I suggest you to read the story of TAHITI where there was a heaven of 100000 inhabitants in 1779, the year when French navigators landed there. within 7 or 8 years, there were thousands of deaths due to deceases brought by Europeans and the population in 1886 fell by 6-8 thousand. Still it is colony of France. They wiped out the local culture and Christianised all the population which is now more than one lakh. In USA you can take the case of Red Indians. All in the name of science and western Reason.Hope you got the point. By the by, i had not used antibiotics or any allopathy product for the past 17 years.

    ReplyDelete
  32. రమణగారు మీ కోపం చాలా విలువైనదిగా అనిపిస్తోంది. ఏమీ తెలియని మా లాంటి వాళ్ళకే కోసం వస్తుంటే మీకు రావడంలో వింతేమీ లేదు. నేనూ చూసాను ఆ దిక్కుమాలిన జూడా ఇంటర్వ్యూ. ఒకపక్కన ప్రణాలు పోతూ ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకోని ఈ జూడాలందరినీ వైద్యవృత్తికి పనికి రారని తీసిపారేయాలి. వైద్యో నారాయణో హరి: అన్నది పోయి వైద్యో యమధర్మరాజ: అని వస్తుందేమో.

    ReplyDelete
  33. మనోజ్ఞ గారు,

    జూడాలు గోలకి ప్రస్తుతానికి తెర పడింది.

    వైద్య విద్య, వృత్తి చాలా డిమాండింగ్ గా ఉంటుంది. జీవితంలో విలువైన సమయం పుస్తకాలు, జర్నల్స్, పేషంట్లతో గడిచిపోతుంది. అందువల్ల.. వృత్తి వెలుపలి అంశాల పట్ల అవగాహన తక్కువ.

    వార్తాపత్రికల కింద చలామణి అవుతున్న toilet papers లాంటి ఈనాడు, జ్యోతి, సాక్షి కూడా చదవడానికి ఆసక్తి/సమయం లేని డాక్టర్లు నాకు తెలుసు.

    కేవలం చదువు/వృత్తి విషయంలోనే విజ్ఞానులైన డాక్టర్లు సమాజానికి సంబంధించిన అనేక విషయాల్లో అజ్ఞానులు.

    మా వృత్తికి ఇదో శాపం.

    అందుకే నాకు non-professional courses చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న వారికున్న లక్జరీని చూసి ఈర్ష్య, అసూయ.

    చరిత్ర, సామాజిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం.. ఈ రంగాల్లో మాది పదో క్లాసు అవగాహన.

    అందుకనే మనకి జూడా, సీడాల నిరసనలు.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  34. రమణ గారు,
    మీరు ఈ టపా రాసే ముందు ఎవరో ఒక జుడా తో మాట్లాడాల్సింది. మీరు ఫీల్ అయ్యిన దానికంటే డిఫరెంట్ angle ఒకటుంది.
    నేను డైరెక్ట్ గా ఆ సమ్మె లో పాల్గొనక పోయినా 2000 లో చంద్ర బాబు హయాము లో జరిగిన సమ్మె ని చాలా దగ్గరినుండి గమనించాను. ఆ సమ్మె కు సంబంధించిన discussions అన్ని నేను అప్పుడున్న pg హాస్టల్ రూం లోనే జరిగాయి. సమ్మె జరిగిన 45 రోజుల్లో ఎప్పుడుకూడా మీరన్నంత స్వార్థం తో జు డా లు ఆలోచించలేదు.
    కాని మీరన్న మాట నిజం, రూరల్ సర్వీసు , లైబ్రరీ, etc జస్ట్ డిమాండ్స్ లో వున్నాయే కాని సమ్మె వాటి గురించి కాదు. సమ్మె ఎప్పుడు జరిగినా 2 విషయాల మీదే జరిగింది,
    1 . హాస్పిటల్ లో ఏదైనా గొడవ జరిగి జు డా ల పైన రోగుల బంధువులు దాడి చేసినప్పుడు.
    2. 5 -6 నెలలనుండి stipend ఇవ్వక పోవడం లేదా 2 years కి ఒక సారి ఇవ్వాల్సిన hike ఇవ్వక పోవడం.

    govt employees అందరు hike రావాల్సిన టైం కి వాళ్ళ dept నుండి 2 - 3 months ముందే proposals పంపి కరెక్ట్ టైం కి hike వచ్చేలా చూసుకుంటారు, every year మారిపోయే జు డా లకు రెగ్యులర్ hike ఎలా వస్తుంది? రాదు. అందుకే వాళ్ళు సమ్మె చేయాల్సి వస్తుంది. 25 లేక 27 సంవత్సరాల వయసు లో, వాళ్ళ ఖర్మ కాలి పెళ్లి కూడా అయ్యుంటే 5 - 6 నెలలపాటు stipend రాకుంటే వాళ్ళ గతి ఏంటి? ఇంకా అమ్మ నాన్నల్ని అడగాల్సిన్దేనా? సిగ్గుమాలిన జన్మ కదండీ. మరీ ప్రజల౦దరి ముందు జీతాలు ఇవ్వట్లేదనో, పెంచాల్సిన టైం కి పెంచలేదనో అడగలేక లైబ్రరీ అని, రూరల్ సర్వీసు అని, pg exam అని ఏదో పక్కన 4 డిమాండ్స్ రాసుకుంటారు.

    మరి సమ్మె విరమణ కు వచ్చేసరికి గవర్నమెంట్ ఏమి ఒప్పుకుంటుంది, జు డా లు ఏవి వదిలేస్తారు గమనించండి, గవర్నమెంట్ stipend బకాయిలు ఇచ్చి, hike కి ఒప్పుకుంటుంది, జు డా లు మిగిలిన డిమాండ్స్ వదిలేస్తారు. soo వాళ్ళు, జస్ట్ వాళ్ళ కిచ్చే stipend రెగ్యులర్ గా ఇమ్మని , ఇవ్వాల్సిన hike కరెక్ట్ టైం కి ఇమ్మని సమ్మె చేస్తున్నారు. అంతే.

    సరే డాక్టర్స్ రూరల్ సర్వీసు ఇవ్వాలి అనుకుందాం. 1 yr లో బయటకి వచ్చే 5000 జు డా లకు placements ఉన్నాయా? MBBS అయ్యాక అప్లై చేసే వాళ్ళకే జాబ్స్ లేవు, మరి వీల్లకేమిస్తారు? మరి cardiology , gastroenterology , neurology , లాగ super speciality చేసినవాళ్ళు రూరల్ లెవెల్ లో చేయగల వర్క్ ఏంటి? పోని అక్కడ medicines , power supply , drinking water ఏమి లేకుండా ఏమి చెయ్యగలరు...? మన గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా ఆరోగ్య శ్రీ అని, medicines టెండర్స్ లో commissions అని మొత్తం తిని పారేస్తూ, ఒక పద్దతి, ప్లానింగ్ లేకుండా రూరల్ సర్వీసు అంటే ...........

    రూరల్ సర్వీసు చేస్తాము అని ఒక సారి బాండ్ ఇచ్చాక, చచ్చినా చేయాల్సిందే అని జు డా ల కు తెలియదా ఏంటి?

    ఈ లాజిక్ కి ఎవరైనా ఆన్సర్ చెప్పండి.
    డాక్టర్స్ కి చదువుకు అయ్యే లక్షల ఖర్చు ప్రజలదే...... కరెక్ట్. మరి engineers , lawyers , టీచర్స్, మరి వాళ్ళ చదువుల ఖర్చు ఎవరిదండి.? మనదే కదా.... మరి వాళ్ల చదువుకు ఖర్చు పెట్టినట్లే డాక్టర్స్ చదువుకి మన డబ్బు గవర్నమెంట్ ఖర్చు పెడుతోంది. మరి డాక్టర్స్ మాత్రమే ఎలా స్వార్హ్తపరులయ్యారు ? డాక్టర్స్ కాని, lawyers కాని డిగ్రీ తరువాత ఎలా సమాజానికి ఉపయోగ పడేలా చేయాలి అనే ఆలోచన గవర్నమెంట్ చేయాలి. తమిళనాడు లో చూడండి, దాదాపు 90 % డాక్టర్స్ MBBS కాగానే గవర్నమెంట్ సర్వీసు లో చేరతారు. మరి మన గవర్నమెంట్ ఎందుకు అలాంటి policies చేయదు? ఒక ప్లానింగ్ లేదా ముందు చూపు లేదు కాబట్టి.

    ఇదేమి లేకుండా డాక్టర్స్ అందరు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు, లేదా అమెరికా వెళ్లి పోతున్నారు అని ఏడవడం లో అర్థం ఉందా?

    ఇక political parties అంటారా , "మీరు డాక్టర్లు అయ్యి మమ్మల్ని ఉద్ధరించమని ఎవడూ దేబిరించట్లేదు" అన్నట్లే వాళ్ళను వీళ్ళ సమ్మెకు సపోర్ట్ చేయమని ఎవడూ దేబిరించలేదు. TDP అధికారంలో వుంటే YSR వీళ్ళను సపోర్ట్ చేస్తాడు, కాంగ్రెస్ అధికారంలో వుంటే చంద్ర బాబు వీళ్ళను సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ స్వార్థం వాళ్ళది.

    మనకి stipend 6 నెలలనుండి రావట్లేదు అని చెప్పండి 100 % జు డా లు సమ్మెకి వస్తారు. రూరల్ సర్వీసు లేక లైబ్రరీ లేదు కాబట్టి సమ్మె అని చెప్పండి 10 మంది కూడా రారు. ఇది నిజం....... వాళ్ళ pg exam preperations , timetables , ప్లానింగ్ లు వాళ్ళకుంటాయి కదా పాపం..

    stipend సక్రమ౦గా ఇస్తాం, ఎగ్జామ్స్ రెగ్యులర్ గా పెడతాము, హాస్పిటల్స్ లో protection ఇస్తాము అని ప్రతి సారి సమ్మె చివర్లో వాగ్దానం చేసి మాట తప్పే politicians స్థాయి కి , మన జు డా లు దిగజారలేదు అని నా అభిప్రాయం, మీరు మరియు ఇతర bloggers కూడా ఒక సారి ఆలోచించి చూడండి....

    ReplyDelete
  35. Dr.Rajasekhar గారు,

    నేను నా జూడాల టపా దాదాపు మర్చిపొయ్యాను. ఇప్పుడు మీ కామెంట్ వల్ల మళ్ళీ చదువుకున్నాను. ధన్యవాదాలు. మీ వ్యూ పాయింట్ చక్కగా రాసారు.

    జూడాలు రెగ్యులర్ ఉద్యోగులు కారు. వారు ఉపకార వేతనం తీసుకుంటారు. కాబట్టి జూడాల వేతనాల్ని ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులర్ జీతాలతో పోల్చకూడదనుకుంటా.

    మన డాక్టర్లకి పబ్లిక్ లో చాలా 'గొప్ప' పేరుంది. కారణాలు అనేకం. మీరు ఈ టపాలో కామెంట్లు చదివారుగా!

    ReplyDelete
  36. Dr.Rajasekhr చెప్పిందాంట్లో కొద్దిగా న్యాయం వున్నట్లనిపించినా, జూడాలు స్టైఫెండ్ వాళ్ళ భార్యా పిల్లలను పోషించుకోవడానికి అన్నట్టు చెప్పడం సరికాదు. ఎందుకంటే, రమణ గారు చెప్పినట్టు ఆ స్టైఫండ్ జీతం కాదు.

    పోగాలం వస్తే లేదా జూడాలు వైద్యం చేస్తే, రోగుల ప్రాణాలు పోతాయేమో కాని, వాళ్ళు తెల్లకోట్లు వేసుకుని బిపి చెక్ చేసినంత మాత్రానికి ప్రాణాలు పోతాయంటే నమ్మశక్యం కావడం లేదు. ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఎలానో, జూడాలు చేస్తే కూడా అంతే... రోడ్ల మీద, ఆస్పత్రుల్లో రద్దీ తగ్గుతుందని నా విశ్వాసం.

    ReplyDelete
  37. రమణ గారు,
    stipend ఎక్కువా తక్కువా అన్నది కాదండి, వాళ్ళు సమ్మె చేయడానికి గల ఉద్దేశాన్ని స్పష్టం చేసాను అంతే. రూరల్ సర్వీసు తప్పించుకోవడానికి సమ్మె అంటే స్వార్థ పరులనిపిస్తుంది. ఎక్కువో తక్కువో వాళ్ళకు రావలసిన stipend , hike కరెక్ట్ గా టైం కి ఇస్తే సమ్మె చేయరు అనుకుంటే అయ్యో పాపమనిపిస్తుంది.

    హత్య చేసినవాడి కంటే, చేయడానికి ప్రేరేపించిన వాడిదే పెద్ద నేరం మన న్యాయస్థానం లో, మరి సమ్మె కాలం లో జరిగిన మరణాలకు బాధ్యత, 45 రోజులముందే నోటీసు ఇచ్హినా స్పందించని గవర్నమెంట్ దా లేక జు డా లదా? సమ్మె కాకుండా ఇంకే విధ౦గానైనా నిరసన తెలిపితే గవర్నమెంట్ స్పందిస్తుండా? (తెలంగాణా కోసం జరిగుతున్న ఆత్మహత్యలకే దిక్కు లేదు )

    ఈ సమ్మె లన్ని గవర్నమెంట్ మెడికల్ colleges లోనే జరుగుతాయి, బాగా డబ్బున్న వారి బిడ్డలు చదివే private medical colleges లో జరగవు.

    నా తపన అంతా వాళ్ళు స్వార్థం తో కాదు, విధిలేక సమ్మె చేస్తున్నారు అని చెప్పడం.....

    మీరు చూస్తున్న రకరకాల నిరసన పద్ధతులు ఎందుకు చేస్తున్నారో , అది వారి వికృత ధోరణి వల్లా లేక మీడియా ధోరణి వల్లా??? ఆలోచించండి...
    ఒక వేళ జుడా లు చాల మర్యాదకర పద్దతుల్లో సమ్మె చేస్తున్నారనుకుండాము. మొదటి రోజు వారి సమ్మె పైన మీడియా ఫుల్ coverage వుంటుంది. రెండో రోజు 2nd పేజికి, 4 రోజు 5 వ పేజి కి మూల ఒక బాక్స్ కి చేరుతుంది. తరువాతి రోజు నుండి జుడాల సమ్మె వల్ల హైదరాబాదు లో 12 మంది, వరంగల్ లో 8 మంది, కర్నూలు లో 6 మంది ఇలా రోజువారీ మరణాల సంఖ్యా తప్ప ఇంకేది మీడియా కవర్ చేయదు. పేపర్ లేక టీవీ చూసే వాళ్ళందరికీ జుడా ల వల్ల ఇందరు చచ్చిపోతున్నారనిపిస్తోంది తప్ప వాళ్ళ సమసఎంటి, అందులో సహేతుకత ఎంత, గవర్నమెంట్ దాని ఎలా పరిష్కరిస్తోంది ఇలాంటివి ఏమి వుండవు. మరి వీళ్ళ ఆందోళన ప్రజల దృష్టి లో వుండాలి అంటే వారు చెప్పే భాష లోనో, పద్ధతి లో నో కొంత కొత్తదనం వుండాలి (మీడియా కోసం), అందులో భాగం గా వారు చేసిన పనుల్లో ఒకోసారి గీత దాటినట్టు అనిపించినా, అది ఆ వృత్తుల వారిని అవమానించడానికి కాదు. మీడియా attention కోసం చంద్రబాబు, కెసిఆర్ etc వాడే వ్యాఖ్యలు, చేసే పనులకంటే ఇవి జుగుత్సాకరంగా ఉన్నాయా?

    ఇక చివరి విషయం రమణ గారు, మన కోర్సు లో వుండే సాధక బాధకాలు ఇతరులకు తెలియవు, ఇక మనమే జుడా ల సమస్య, వారి స్వార్థం తో చేసే సమ్మె గా నిర్ధారిస్తే ఇక మిగిలిన అందరికి డాక్టర్ల పైనున్న గౌరవం (ఒక వేళ ఏదైనా మిగులుంటే) ఇంకా తగ్గి పోతుంది. మీరన్న "గొప్ప" ఇమేజ్ అలాగే నిలిచిపోతుంది.



    SNKR గారు,

    పైన చెప్పినట్లు వారి ఉపకార వేతనాన్ని ఉద్యోగుల జీతాలతో పోల్చ్ట్లేదండి, జస్ట్ వాళ్లకు ఇచ్చే ఉపకరవేతనము వారి నెలవారీ ఖర్చులకు సరిపోయినా లేకపోయినా, ఇచ్చేదేదో ఉద్యోగులకు ఇచ్చినట్లు క్రమం తప్పకుండా ఇవ్వండి అని. 20 ,000 వచ్చే వాడికి ఒక నెల జీతం రాకపోతే సర్డుకోగాలదేమో కాని. 10 ,000 వచ్చే వాడికి 4 నెలలకో, 6 నెలలకో జీతం ఇస్తే ఎలా సర్డుకోగలడు అని ఆలోచించండి.
    ఈ జు డా లు పెద్ద పెద్ద operations , treatments చెయకపొయిఒనా వీళ్ళ సేవలు ఇంకెవ్వరు చేయలేరు. ఎలాగంటే, ఇంట్లో పని మనిషి అంట్లు తోమి, బట్టలుతికి, ఇల్లలికితే అమ్మ తీరిగ్గా శుచిగా రుచి వంట చేస్తుంది, అన్ని పనులు అమ్మే చేయాలంటే రుచి శుచి గాల్లోకే...... వీళ్ళు చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద డాక్టర్స్ పెద్ద operations , treatments చేయగలరు...


    ఎప్పుడైతే గవర్నమెంట్ విద్య (corporate ఇంటర్మీడియట్ colleges అండ్ ప్రైవేటు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ colleges ) , వైద్య రంగాలలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్శాహించిందో అప్పుడే ఈ రెండు సేవా దృక్పధం నుండి కమర్షియల్ లేక బిజినెస్ రూపాన్ని సంతరించుకున్నాయి. దీన్ని తిరిగి గాడి లో పెట్టాల్సిన బాధ్యత, విద్య వైద్య రంగాలను నష్ట దాయక రంగాలు గా భావించే ప్రస్తుత గవర్నమెంట్ వహిస్తుందా అనేది million dollors question ....

    Dr.Rajasekhar.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.