"మీరు.. నువ్వు.. హుస్సేన్ కదూ! నన్ను గుర్తు పట్టలేదా?" రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఉత్సాహంగా అడిగాను.
ఎర్రగా, పొడుగ్గా, బక్కపల్చటి ఆకారం. మాసిన గడ్డం, నలిగిన చొక్కా, వెలసిన లుంగీ. నిర్వేదంగా, నిరాశగా, నిర్లిప్తంగా నాకేసి చూశాడు. అతని కళ్ళలో జీవం లేదు. ప్రపంచంలోని కష్టాలన్నీ తనే అనుభవిస్తున్నట్లున్నాడు.
"మిమ్మల్నెలా మర్చిపోతాను?" అన్నాడు.
"హుస్సేన్! నన్ను మీరు అంటున్నావేమిటి! ఇవ్వాళ నిన్ను వదలను. నీతో చాలా కబుర్లు పంచుకోవాలి. పద, అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం." అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీయబోయాను.
"లేదు, లేదు. ఇప్పుడు నాకు అర్జంటు పనుది. ఈసారి తప్పకుండా.. " అంటూ నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హుస్సేన్.. నా ప్రియనేస్తం.
హుస్సేన్, నేను మూడోక్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. పరీక్షల్లో హుస్సేన్ది ఎప్పుడూ ప్రధమ స్థానమే. ఆ ప్రధమ స్థానానికి, రెండో స్థానానికి మధ్య బోలెడన్ని మార్కుల అంతరం. ఆ రెండో స్థానం కోసం నాకూ, బాబ్జీకీ మధ్య తీవ్రమైన పోటీ. ఈ పోటీ కారణంగా బాబ్జికి నాకు పడేది కాదు. హుస్సేన్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ బాయ్. ఎర్రగా, సన్నగా ఉండేవాడు. లూజు నిక్కరు, నలిగిపోయిన చొక్కా. అల్లరికి ఆమడ దూరం. తక్కువ మాట్లాడేవాడు, అడిగినదానికి సమాధానం చెప్పేవాడు, అంతే.
కొద్దికాలంలోనే నేనూ, హుస్సేన్ మంచి స్నేహితులమైపోయాము. హుస్సేన్ పెన్సిల్ ఎప్పుడూ అంగుళానికి మించి వుండేది కాదు. నా పెన్సిల్ హుస్సేన్ కి ఇచ్చేవాణ్ని. ఇంట్లో పెన్సిల్ పోయిందని అబద్దం చెప్పి, కొత్తపెన్సిల్ కొనుక్కునేవాణ్ని. హుస్సేన్ దగ్గర అన్ని సబ్జక్టులకి పుస్తకాలు వుండేవి కావు. నా టెక్స్ట్‌బుక్స్ హుస్సేన్‌తో పంచుకునేవాణ్ణి. హుస్సేన్ నాకు చదువులో ఎంతో సహాయం చేసేవాడు.
మా స్కూలు పక్కనే ఒక ఆఫీసు, ఆఫీసు వెనక విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలంలో ఒక బిల్డింగ్ మొదలు బెట్టి.. పిల్లర్స్, స్లాబ్ వేసి వదిలేసారు. ఆ వదిలేసిన కట్టడమే హుస్సేన్ ఇల్లు. చుట్టూతా గోనెపట్టాలతో కుట్టిన పరదాలు. ఒక మూలగా మూడు రాళ్ళు. ఆ రాళ్ళ మీద మసిబారిన గిన్నె, పొయ్యిలో మంట కోసం పుల్లలు, చిన్న కిరసనాయిలు బుడ్డి, పక్కన రెండు సత్తుప్లేట్లు. పొయ్యికి నాలుగడుగుల పక్కగా పాత రేకుపెట్టె. ఇదీ హుస్సేన్ ఇంటి ఫర్నిచర్!
రేకుపెట్టె పక్కనే ఒక చింకిచాప. ఆ చాపమీద పొద్దస్తమానం ఒక మహిళ పడుకునుండేది. మనిషి అందంగా ఉంటుంది, కానీ ఎముకల గూడుతో తెల్లగా పాలిపోయి వుంటుంది. నీరసంగా, అప్పుడప్పుడూ మూలుగుతూ ఉండేది. ఆవిడ హుస్సేన్ తల్లి. హుస్సేన్ తల్లికి టీ కాచి ఇచ్చేవాడు. ఆవిడ టీ తాగుతుంటే కాళ్ళు పట్టేవాడు. హుస్సేన్ తల్లి ఉర్దూ బాషలో ఏదో చెబుతూ ఏడుస్తుండేది. హుస్సేన్ తమ్ముడు రెండేళ్ళ క్రితం 'విష జెరం' తో చచ్చిపోయాట్ట, బహుశా చనిపోయిన కొడుకు గుర్తొచ్చి ఏడుస్తుందేమో.
హుస్సేన్ స్నేహం నాకు ఎన్నో కొత్తవిషయాలు నేర్పింది. హుస్సేన్ ఇంటి వెనక దట్టమైన తుప్పలు, పొదలు ఉండేవి. ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు కూడా ఉండేవి. హుస్సేన్ ఉసిరిచెట్టు కొమ్మల్ని బలంగా ఊపేవాడు. బోల్డన్ని ఉసిరికాయలు రాలి పడేవి. అవన్నీ ఏరి ఉప్పూ, కారం అద్దుకుని తినేవాళ్ళం. నేరేడు చెట్టెక్కి కాయలు కోసేవాడు. నేరేడుకాయల తినేప్పుడు నాలుక బయట పెట్టి ఎవరి నాలుక ఎక్కువ రంగు మారిందో చూసుకునేవాళ్ళం.
హుస్సేన్ బొంగరం ఆటలో స్పెషలిస్ట్. నాకు బొంగరం అరచేతిలో తిప్పడం నేర్పించాడు. నాకు నలికీసు పాములు, తొండలు అంటే భయం. అవికూడా మనలాంటివేనని, మనని చూసి అవే ఎక్కువ భయపడతాయని ధైర్యం చెప్పాడు. ఆ పక్క ఇంటివాళ్ళ మామిడిచెట్టుకి కాయలు విరగకాసి వేల్లాడుతూ ఉండేవి. చేయి పెడితే చాలు, కనీసం పదికాయలు అందుతాయ్. నేను ఆ మామిడి కాయలు కోసేద్దామని ఉబలాటపడేవాణ్ణి. అలా చెప్పకుండా కాయలు కొయ్యడం దొంగతనం అవుతుందని, దొంగతనం తప్పని హుస్సేన్ వారించేవాడు. నాకన్నా వయసులో కొద్దినెలలు మాత్రమే పెద్ద అయిన హుస్సేన్ నాకు గురువుగా మారిపొయ్యాడు.
మూడోక్లాసు పరీక్షలు దగ్గర పడ్డాయ్. రోజుట్లాగే హుస్సేన్, నేను నేరేడు చెట్టు కొమ్మమీద కూర్చున్నాం. నేరేడు కాయలు తింటూ, హుస్సేన్ చెబుతున్న పాఠాన్ని బద్దకంగా వింటున్నాను. హుస్సేన్ పాఠం చెప్పే విధం అద్భుతంగా వుంటుంది. ముందుగా పుస్తకంలో ఉన్నది పెద్దగా పైకి చదువుతాడు, ఆ తరవాత అర్ధాన్ని వివరిస్తాడు. నాకు ఆ వివరణ చందమామ కథలాగా ఉండేది.
హఠాత్తుగా హుస్సేన్ ఇంట్లోంచి పెద్దగా శబ్దాలు, కేకలు, అరుపులు వినిపించాయ్. హుస్సేన్ మెరుపు వేగంతో చెట్టు దిగి ఇంట్లోకి పరిగెత్తాడు. వెనకగా నేను కూడా హుస్సేన్ తో పాటు పరిగెత్తాను. ఇంట్లో దృశ్యాన్ని చూసి చలించిపోయాను. చాపమీద పడున్న హుస్సేన్ తల్లిని ఆమె భర్త ఎగిరెగిరి డొక్కల్లో తంతున్నాడు. ఆవిడ పెద్దగా ఏడుస్తుంది. ఏడుస్తూనే ఉర్దూలో అతన్ని ఏదో తిడుతుంది. ఆతను ఊగుతున్నాడు, తూగుతున్నాడు, మాటలు ముద్దగా వస్తున్నాయ్. అతను ఏదో కోపంతో భార్యని కొడుతున్నట్లుగా లేడు. భార్యని చంపేంత కసి, క్రోధం అతని కళ్ళల్లో నాకు కనిపించాయి.
పరుగున వెళ్లిన హుస్సేన్ తల్లిమీద బోర్లాపడి, ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన్నులు హుస్సేన్ వీపుమీద పడుతున్నయ్. ఆ తన్నుల ధాటికి బాధతో విలవిలలాడిపోతూ, తల్లికి దెబ్బలు తగలకుండా కాస్తున్నాడు. హృదయవిదారకమైన ఆ సంఘటన చూసి భయపడిపోయాను, ఏడుపొచ్చింది.
ఒక్కసారిగా ఇంటికి పరుగు తీశాను. తన్నులు తింటున్న హుస్సేన్ మొహమే కళ్ళ ముందు కదులాడుతుంది. నేనెప్పుడూ ఒకమనిషి ఇంకోమనిషిని అంత దారుణంగా కొట్టటం చూళ్ళేదు. తండ్రి తన్నుల ధాటికి అసలే బక్కగా, పీలగా ఉన్న హుస్సేన్ చచ్చిపోతాడా? దుఖం ఆగట్లేదు. ఏడుస్తున్నాను, పరిగెత్తుతూనే ఏడుస్తున్నాను, ఏడుస్తూనే పరిగెత్తాను.
అటు తరవాత హుస్సేన్ స్కూలుకి రాలేదు. నాకు హుస్సేన్ ఇంటికి వెళ్లాలని ఆరాటంగా ఉండేది. కానీ హుస్సేన్ తండ్రి గుర్తొస్తేనే వణుకొచ్చేది. ఆ భయమే నన్ను వెళ్ళనీయలేదు. పరీక్ష ముందురోజు హుస్సేన్‌ని పరీక్షలకి రమ్మని చెప్పటానికి మా టీచర్ నలుగురు పిల్లల్ని వాళ్ళింటికి పంపించారు. వాళ్ళల్లో నేనూ ఒకడిగా బిక్కుబిక్కుమంటూ వెళ్లాను.
ఇంట్లో హుస్సేన్ లేడు, హుస్సేన్ తండ్రి కూడా లేడు. చాపమీద శవంలా పడున్న తల్లిని హుస్సేన్ గూర్చి అడిగాం. ఆవిడ లోగొంతుకతో నీరసంగా హుస్సేన్ ఏదో 'బేరం'కి వెళ్ళాడని చెప్పింది. బేరం అంటే ఏంటో మాకు అర్ధం కాలేదు. అదే ముక్కని మా టీచర్ కి చెప్పాం. ఆవిడ 'చూశారా! దేవుడు వాడికి గొప్ప తెలివితేటలిచ్చాడు, కానీ చదువుకునే అవకాశం లేకుండా చేశాడు.' అంటూ బాధపడ్డారు. ఆ తరవాత హుస్సేన్ మళ్ళీ ఎప్పుడూ స్కూలు గుమ్మం తొక్కలేదు.
ఇంటర్ చదువుతున్నప్పుడు ఒకసారి మార్కెట్ సెంటర్లో కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోనట్లు వెళ్లిపొయ్యాడు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు కనిపించాడు. చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా వెళ్లిపొయ్యాడు.
ఈమధ్య ఒక పెళ్ళిలో కలిశాడు బాబ్జి. ఐఐటీ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాట్ట. పక్కన పొట్టిగా, లావుగా వున్న వ్యక్తిని చూపిస్తూ -
"ఈ శాల్తీని గుర్తుపట్ట్లేదా? మన వాసుగాడు." నవ్వుతూ అన్నాడు బాబ్జి.
"హల్లో మైడియర్ వాసూ! వెంటనే గుర్తుపట్టనందుకు సారీ బ్రదర్!" అంటూ సంతోషంగా కౌగలించుకున్నాను.
వాసుకి గుంటూర్లో పుస్తకాల షాపు వుందిట. నాగూర్చి వివరాలు చెప్పాను. తరవాత మా టీచర్ల గూర్చి కొంత సంభాషణ నడిచింది.
"వాసు! నీకు హుస్సేన్ ఎక్కడున్నాడో తెలుసా?" ఉన్నట్టుండి అడిగాడు బాబ్జి.
ఒక్కసారిగా వాసు మొహం మారిపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ -
"లేదు. మన మూడోక్లాసు పరీక్షలప్పుడే హుస్సేన్ తండ్రి యెటో వెళ్లి పొయ్యాడు. పాపం! ఆ వయసులో తల్లిని పోషించాటానికి నానా తిప్పలు పడ్డాడు హుస్సైన్. అరటి కాయలు అమ్మాడు, సున్నం బొచ్చెలు మోశాడు. కొన్నాళ్ళకి తల్లీకొడుకుల్ని బిల్డింగ్ ఓనర్ ఖాళీ చేయించాడు, తల్లిని తీసుకుని ఎక్కడికెళ్ళాడో! ఆమధ్య సత్తెనపల్లిలో ఫుట్‌పాత్ మీద ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతుంటే చూశానని మా తమ్ముడన్నాడు, నాకయితే తెలీదు." అన్నాడు వాసు.
"పాపం! హుస్సేన్." అన్నాడు బాబ్జి.
"హుస్సేన్ చదువులో మీఇద్దరికన్నా ముందుండేవాడు, వాడే గనక చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడు కదూ." నెమ్మదిగా అన్నాడు వాసు.
"అవును వాసు! నువ్వు చెప్పింది నిజం. హుస్సేన్ గుర్తొచ్చినప్పుడల్లా నాకూ అదే అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి గిల్టీగా కూడా ఉంటుంది. ఇదంతా హుస్సేన్ కే చెప్పాలనిపిస్తుంది. కానీ హుస్సేన్ ఎందుకో నన్ను ఎవాయిడ్ చేస్తున్నాడు బాబ్జి." అన్నాను.
బాబ్జి ఒక్కక్షణం ఆలోచించాడు.
"నువ్వూ, వాసు కేవలం అతని చదువు గూర్చే మాట్లాడుతున్నారు, కానీ చదువొక్కటే జీవితం కాదు గదా. ఇంటర్తో చదువాపేసిన వాసు కూడా హాపీగానే ఉన్నాడు. కానీ నా బాధల్లా హుస్సేన్ బాల్యం గూర్చే. అతని బాల్యం చాలా ఘోరంగా చిదిమెయ్యబడింది. తండ్రి చేసిన తప్పులకి హుస్సేన్ జీవితం బలైపోయింది, సో సాడ్. అన్నివిధాలా అర్హత వుండికూడా, జీవితంలో ఏ అవకాశం లేకుండా చేసిన సమాజం పట్ల ద్వేషం పెంచుకున్నాడేమో. హుస్సేన్ నిన్నెందుకు ఎవాయిడ్ చేస్తున్నాడో నేనర్ధం చేసుకోగలను." అన్నాడు బాబ్జి.
ఇంటికి వస్తూ బాబ్జి చెప్పిన పాయింట్ ఆలోచించాను.
హుస్సేన్ ఆలోచనలు కూడా బాబ్జి చెప్పినట్లే ఉన్నాయా? మా అందరికన్నా తెలివైనవాడై ఉండికూడా ఎన్నో బాధలు పడ్డాడు. తనకి జరిగిన అన్యాయానికి ఈ సమాజం పట్ల ఏహ్యభావం ఏర్పర్చుకున్నాడా? నేనూ ఆ సమాజంలో భాగాన్నే కదా. అందుకనే నాతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదా? నా శుష్కవచనాలు హుస్సేన్‌కి సంతోషం కలిగించకపోవచ్చు. పైగా చికాకు, కోపం తెప్పించవచ్చునేమో కూడా.
చదువు నాకు సమాజంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది. నా జీవితం సంతోషమయం. ఇప్పుడు నాకు నా చిన్ననాటి స్నేహితులతో అలనాటి మధుర క్షణాలు నెమరువేసుకోవడం హాయినివ్వవచ్చు. కానీ - హుస్సేన్ కి మానిన గాయం మళ్ళీ రేపినట్లు అవ్వచ్చు. కడుపు నిండినవాడు ఆహ్లాదంగా, సరదాగా కబుర్లు చెప్పగలడు. కానీ నాతో కబుర్లు పంచుకోవటానికి హుస్సేన్‌లో కొద్దిపాటి ఆనందం అయినా మిగిలుండాలి గదా. అసలంత విశాల హృదయం హుస్సేన్‌కి ఎందుకుండాలి?
నేను హుస్సేన్ నా ప్రియనేస్తం అనుకున్నాను. కానీ హుస్సేన్‌ని బాబ్జిలాగా అర్ధం చేసుకోలేకపోయాను. అందుకే, ఇప్పుడు హుస్సేన్ గూర్చి వాకబు చెయ్యడం మానుకున్నాను.
(picture courtesy : Google)
Hello Sir!
ReplyDeleteI am following your post since a long time.I just really like the way you present the contemporary issues.
This post is so touching...BTW, where has Subbu gone?
I am a great fan of Subbu garu...
this time I am writing a comment coz..mine would be the First:)
చాలా మువింగ్ స్టోరీ. ఆ జూడాసుల కథ కంటే ఇదే చాలా నచ్చింది నాకు.
ReplyDelete@Varun Srikanth,
ReplyDeletethanks for the compliment.
i thought i am bringing Subbu too often into the blogs. he'll come soon.
@GIdoc,
ReplyDeleteధన్యవాదాలు.
జూడాలది కథ కాదండి!
Heart touching. మీ హుస్సేను లాంటి వాళ్ళు ఎంతో మంది సమాజంలో. అంత లేత వయసులో గృహ హింస వలన న్యూనత, అపరాధ భావం జీవితాంతం వెంటాడుతుంటాయి కదా !
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteచాలా టచింగ్ గా ఉందండి. ఆలోచింపచేసే అనుభవం. చిన్నప్పుడు మీకు పూర్తిగా అవగాహన లేని, సరికొత్త పరిస్థితి ఎదురయ్యినప్పుడు మీరు భయపడటం దాన్నుంచి దూరంగా పారిపోవడం జరిగింది. కాకపోతే అదే పరిస్థితి, మీ మిత్రుడి జీవితంలో ఒక అంతర్గత భాగమై కూర్చుంది.
ఆలోచనలకీ, కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మంచిటపా రాశారు. ఇటువంటి అనుభవాల ద్వారా ఎవరికి అర్థమయ్యింది వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ స్వీపింగ్ జెనరలైజేషన్లూ జడ్జ్ మెంట్లూ చెయ్యకూడదు అనిపిస్తుందండి. (ఇక్కడెవరైనా అలా చేశారని కాదు, జస్ట్ నా ఆలోచనలు రాస్తున్నానంతె.)
మీ మిత్రుడు బాబ్జీ గారి అనాలసిస్ కన్నా మీ అనాలసిస్ కే నిజానికి దగ్గరగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హుస్సేన్ గారికి మీరన్నట్టు బాల్యమూ, బాల్య స్నేహితులూ, గడ్డిపూచలతో గుసగుస లాడటం, గోదావరి నీళ్ళని చూసి మనసు కేరింతలు కొట్టడం లాంటి సున్నితమైన భావాలు(Pun Intended) ఉండకపోవచ్చు. ఆయనేదో ఆయన జీవితం నెట్టుకొస్తున్నాడు ఆయనకెదురైన పరిస్థితుల్లో తనకి తోచిన విధంగా. మీరన్నట్టు, మీ అందరితోనూ సమయం గడిపే తీరికా, ఆసక్తీ ఆయనకి ఉండకపోవడం సహజం.
అన్నట్టు నకిలీసు పాములంటే నాక్కూడా ఇప్పటికీ భయమేనండీ..
రమణ గారు,
ReplyDeleteస్పందనకి ధన్యవాదాలు.
మనిషి జీవితానికి 'affectionate childhood' అనేది ఒక వరం. భవిష్యత్ జీవితానికి పెట్టుబడి.
పోలియో వచ్చిన వాడికి కాలు చచ్చుబడి.. ఆ కాలు జీవితాంతం అతనిని అంటిపెట్టుకుని ఉంటుంది. అట్లాగే చిన్నతనంలోని కష్టాలూ, కన్నీళ్ళు కూడా.
Weekend Politician గారు,
ReplyDeleteస్పందనకి ధన్యవాదాలు. కథ మీకు నచ్చినందుకు సంతోషం.
ఇంతకీ అవి నలికీసు పాములా? నకిలీసు పాములా? చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం. ఇప్పుడు పిచ్చుకలు, ఉడతలతో పాటు అవీ అంతరించిపోయినట్లున్నయ్. పాపం!
Heart touching .
ReplyDeleteMala Kumar gaaru,
ReplyDeletethank you.
రమణ గారు,
ReplyDeleteఅవి నలికీసు పాములనే గుర్తండీ. నేను పొరపాటుగా వ్రాశాను :)
అంతరించిపోయేట్టే ఉన్నాయేమో నండీ అంతగా తెలియదు. మా ఇంటి దగ్గరైతే నాకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి, బహుశా మేముండేది సిటీకి కొంచెం దూరం అవడం వల్లనేమో !
ఈ కథ చూశాక నాకు.. మీకు పని ఎప్పుడూ తక్కువ గా ఉంటే బాగుండుననిపించింది.
ReplyDeleteచాలా బాగుంది. స్కూల్ లో ఉన్నప్పుడు మంచి మార్కులు తెచ్చుకుని, ఇప్పుడు పాన్ డబ్బా పెట్టుకున్న మున్నా ఆకస్మాత్తు గా గుర్తొచ్చాడు. అతనూ మమ్మల్ని గుర్తుపట్టనట్టు నటిస్తాడు.
కృష్ణప్రియ గారు,
ReplyDeleteఈ పోస్టులు అర్ధరాత్రిళ్ళు రాస్తున్నాను. అర్ధరాత్రుళ్ళు బిజీగా ఉండే అవకాశం లేదు. కావున ఇబ్బంది లేదు.
బ్లాగు మొదలెడదామనుకున్నప్పుడు నా స్నేహితులు 'పని లేదా?' అన్నారు. నాకు ఆ మాట భలే నచ్చి దాన్ని సొంతం చేసుకున్నాను (టైటిల్ గంభీరంగా, పొయిటిక్ గా ఉంటే నాకు భయం!)
స్పందించినందుకు ధన్యవాదాలు.
హృదయాన్ని కదిలించేశారు రమణ గారు... చివరిలో మీరు తనని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించిన తీరు అద్భుతం.
ReplyDeleteవేణూ శ్రీకాంత్ గారు,
ReplyDeleteథాంక్యూ!
చదువు,ఉన్నత స్థితులు అనేవాటిని ఇప్పుడు ప్రక్కన పెడితే కూడా స్నేహానికి పాత్రులు కావచ్చు. కానీ తనని తానూ వేలివేసుకోవడం అన్నది చూడండీ..అది ఈ సమాజం పై అతను ఏర్పరచుకున్న ఏహ్యభావం కన్నా బలమైనది అంటాను నేను. మీరు అతని గురించి వాకబు చేయండి. స్నేహితునిగా అర్ధం చేసుకుని..అతని కి మళ్ళి స్నేహమయ జీవితాన్ని రుచి చూపండి. ప్రియ నేస్తాన్ని అలా వదిలేస్తామా?
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteప్రతి మనిషి జీవితం లో కొద్దో గొప్పో కస్టాలు ఉంటాయి. కొందరికి ఎక్కువగా,మరి కొందరికి తక్కువగా. మీ స్నేహితుడు తన బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికే ఇష్టపడ నప్పుడు మీరు అతని జీవితాన్ని అతని అనుమతి లేకుండా ఈ విధంగా పబ్లిక్ లో పెట్టడం సరి అయినదేనా? మీరు అతని అనుమతి తీసుకుంటే నా కామెంటుకి మీకు క్షమాపణలు. అతను ఈ పోస్ట్ చదివే అవకాశం లేకపోయనా సరే మీరు అతని అనుమతి లేకుండా నిజమయిన పేర్లు ఉదహరించి వ్రాయడం నైతికంగా తప్పు. మీరు ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్చను హరించి నట్లే. మీకు మరీ రాయాలని కోరిక ఉంటె కల్పిత గాధ గా రాసి ఉంటె బాగుండేది.
ఈ కధ పై నా అభిప్రాయము: ఈ కధ చాలా బాగుంది. ఇంత కన్నా దారుణమయిన కస్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. మానవ జీవితం యాక్. అవిద్య, పేదరికం,సరి అయిన సంఘ నిర్మాణం లేక పోతే మరింత మంది హుస్సేన్ లు తయారవుతారు.పుడతారు,గిడతారు. నిప్పుతోటి కడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని.
వనజ వనమాలి గారు,
ReplyDeleteధన్యవాదాలు.
@Truth Seeker,
ReplyDeleteస్పందనకి ధన్యవాదాలు.
మీ పేరుకు తగ్గట్టుగా ప్రశ్నలు చాలానే అడిగారు.
బ్లాగుల్లో ఉన్న సమస్యేమంటే.. కథని సమర్ధించుకోటానికో, రక్షించుకోటానికో రచయిత కంకణం కట్టుకోవాలి.
నేను రాసింది వాస్తవంగా జరిగిందా.. లేక కల్పించిన కథ మాత్రమేనా.. లేక రెండింటి కలబోతా.. అన్నది చదువరులకి వదిలేస్తున్నాను.
ఈ కథలో నేను చేసిన పొరబాటు 'నేను' కి నా పేరు వాడటం.
ఈ సారి సరిజేసుకుంటాను.
ప్రతీ వాళ్ళ జీవితం ఒక లైను లాగా వెళ్ళుతుంది.(టావోఇజం అనుకుంటాను) కొన్నిసార్లు కలుస్తాయి విడిపోతాయి. హుస్సేన్ లైను, స్టోరీలో మీ(?) లైను చాలా దూరంగా వెళ్ళిపోయాయి. నా ఉద్దేశంలో అవి కలవక పోతే నే బాగుంటుందేమో.
ReplyDeleteస్టోరీ బాగా వ్రాశారు.
>నా టెక్ష్ట్ బుక్స్ హుస్సేన్ తో పంచుకునేవాణ్ణి.
ReplyDeleteఅబ్బో అంట చిన్న వయసు లో నే విశాల హృదయమా..అదీ మీ రైవల్ తో ... కాని తర్వాతి లైను లో అసలు నిజం హహ
>పరీక్షల్లొ హుస్సేన్ పక్కన కూర్చోడం నాకు లాభించేది.
సంతోషం :)
ఇక మీ టపా చదువుతూ ఉంటె చాలా మంది , చాలా సంఘటనలు అలా కనుల ముందు కదిలిపొతూ ఉన్నంత లూ ..అనూహ్యం గా చివరిలో పూర్తీ గా వేరే వారిని గుర్తు చేసింది ..మా సీనియర్ మస్తాన్ :), బావున్నావా అమ్మా అని అడిగాక కాని తనని గుర్తు పట్టలేదు నేను. భలే సంతోషం గా మాట్లాడేసాను. ఇంకా చాల మంది, చాల ఆత్మీయం గా పలుకరిస్తారు.
ఇక మీకు ఈ సంఘటన ఈ మధ్యనే జరిగి ఉంటే, మీరు అతన్ని మల్లి కలవడానికి ప్రయత్నించడమే మంచిది. నిజానికి అతను మిమ్మల్ని తప్పించుకుని ఉండటం లేదు. మీరే ఆ పని చేసారు :) . ఎలా అంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత, మీరు అతన్ని అతను మిమ్మల్ని గుర్తు పట్టారంటే..మీరు ఒకరికొకరు తెలిసేంత దగ్గరలోనే కొంతకాలం ఉన్నారు. చిన్నతనం లో మీ చదువు మీరు చూసుకొని, అతన్ని మర్చిపోయారంటే అతను అర్ధం చేసికోగలదు . కాని మీరు కాస్త పెద్దయ్యాక, అతని తో స్నేహాన్ని పునరుద్దరించుకోలేదు. ఎందుకంటే , అతనితో మీకేం పనిలేదు కాబట్టి. ఇది ఎంతో సహజం గా జరిగినా, మీతో ఉన్న చిన్న నాటి స్నేహాన్ని అతను గౌరవించాలంటే , మీ మీద పోయిన నమ్మకం తిరిగి రావాలి.
మీరు పొందిన స్నేహానికి, సహాయానికి బదులు తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని మీరు నమ్మితే, అతని నమ్మకం సంపాదిస్తారు తప్పకుండా :)
ఇంకా విచిత్రం ఏంటి అంటే, మీకు అత్యంత సన్నిహితుడు హుస్సేన్ పై , అప్పట్లో మీరు పోట్లాడే బాబ్జి చెప్పిన అభిప్రాయాన్ని మీరు అంగీకరించడం లో నే..హుస్సేన్ మిమ్మల్ని ఎందుకు నమ్మకూడదో చక్కగా కనిపిస్తోంది :)
అది సరే, ఇలాంటి స్నేహితుల పేర్లు చాలావరకు ముస్లిం లవి ఉండటం యాదృచ్చికమేనా :)
చాలా వ్రాసాను, సుబ్బు బదులు ఈ సారికి మిమ్మల్ని విమర్శించే అవకాసం మాకిచ్చేయండి మరి :)
Dear Ramana,
ReplyDeleteFantastic. Superb narration from different angles. Loved it but I typically enjoy lighter subjects.
Dinkar
బాగుంది.
ReplyDeleteకామెంట్స్ అన్ని చదివాకా. కామెంటడానికి ఇంతే మిగిలింది.
రమణ గారు,
ReplyDeletewho is sane? hush none !
జిలేబి.
Mauli's comment caught me by surprise. Initially I used to have difficulty comprehending what Mauli tried to say and most of the time wondered if the comments were intentionally tricky. Then the comments slowly started attracting my attention for I could not only comprehend them but either agree with them or was atleast willing to think from tha point of view. This is one such comment, the one that makes most sense to me from my point of view and told it a lot better than I could. Especially the part about your (Hussain's friend's) lost contact and why you should try harder to be his friend now.
ReplyDeleteRao S Lakkaraju గారు,
ReplyDeleteధన్యవాదాలు.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
Mauli గారు,
ReplyDeleteఇవ్వాళ మీలో నిజంగానే సుబ్బు ప్రవేశించాడు.
నా పుస్తకలు షేర్ చేసుకుంది బాబ్జితో కాదు.
నా స్నేహ పునరద్ధరణ, ఆప్యాయతలు ఎవడిక్కావాలి? నా కథ ఎండింగ్ అదే గదా!
దయచేసి ఒక్కసారి Rao S Lakkaraju గారి కామెంట్ చదవండి.
దినకర్,
ReplyDeleteథాంక్యూ!
ఏవిటోయ్ ఎంతసేపటికీ ఆ ముళ్ళపూడి టైపు చెత్త రాతలు.
అప్పుడప్పుడూ హెవీగా రాసి, నీ బరువు పెంచుకోరాదా? అని సుబ్బు ఇచ్చిన సలహా పాటించాను. అంతే!
lalitha jee :)
ReplyDeleteLalithag గారు,
ReplyDeleteఈ కథకి హీరో హుస్సేన్.
కథని 'నేను' చెప్పినప్పటికీ.. హుస్సేన్ POV చర్చించబడింది.
ఈ 'నేను' హుస్సేన్ తో స్నేహం ఎందుకు కంటిన్యూ చెయ్యాలనేది అర్ధమవ్వట్లేదు. అలా చేస్తే.. may look like Lions/Rotary club kind of silly charity show. కాదంటారా?
వంశీ కృష్ణ గారు,
ReplyDeleteమీ కామెంట్ కూడా 'బాగుంది'.
జిలేబి గారు,
ReplyDeleteజిలేబీలు భోజనంలో ఎప్పుడూ ముందే వడ్డించబడతాయి. ఈసారెందుకో చివర్లో వడ్డించబడ్డాయ్!
చదువు నాకు సమాజంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది. నా జీవితం సంతోషమయం. ఇప్పుడు నాకు నా చిన్ననాటి స్నేహితులతో అలనాటి మధుర క్షణాలు నెమరు వేసుకోవడం హాయినివ్వవచ్చు. కానీ హుస్సేన్ కి మానిన గాయం మళ్ళీ రేపినట్లు అవ్వచ్చు. కడుపు నిండిన నా లాంటివాడు.. ఎంజాయ్ మెంట్ కోసం ఆహ్లాదంగా, సరదాగా కబుర్లు చెబుతాడు. కానీ నాతో కబుర్లు పంచుకోవటానికి హుస్సేన్ కి తన జీవితంలో పైసా ఆనందం అయినా మిగిలి ఉండాలి గదా.
ReplyDelete__
ఈ వ్యాక్యాలు బాగా నచ్చాయి నాకు.
కానీ, ఓ ప్రశ్న..Isn't that obvious though?...మీరెందుకు చాలా మధించి కనుక్కున్న సత్యం లాగా రాస్తున్నారు?
Sorry, don't mean to be harsh at all, just sincerely wondering!
"may look like Lions/Rotary club kind of silly charity show. "
ReplyDelete__
చప్పట్లు. You hit the nail on the head :-)))
KumarN,
ReplyDelete>>మీరెందుకు చాలా మధించి కనుక్కున్న సత్యం లాగా రాస్తున్నారు?
నేను మాత్రం మామూలుగానే రాశాను.
పోన్లేండి! మామూలుగా రాసినా.. మధించి రాసినట్లు అనిపించటం నా గొప్పే అనుకుంటున్నాను!
తరవాత కామెంటుకి కూడా కలిపి.. థాంక్యూ!
:-) Actually, you are right. మీరు మామూలుగానే రాసారు.
ReplyDeleteI guess I got a bit carried away by the glorification in responses :-)
రమణ గారూ,
ReplyDeleteనేను మౌళి గారి వ్యాఖ్యలలో సారాంశాన్ని మాత్రమే చూశాను. వారికి మీ జవాబు చూశాక మళ్ళీ ఆ వ్యాఖ్య చదివాను. అప్పుడూ నా వ్యాఖ్యలో "why you should try harder అన్నది తప్పుగా వ్రాశాను అనిపించింది. friendship continue చెయ్యడం అన్నది మాత్రమే ఒప్పుకోవాలనిపించింది. నేను కాస్త diversion కోసం ఆ వ్యాఖ్య వ్రాసి వేరే పనులలో పడిపోయాను. మళ్ళీ ఇంకెవరో నన్ను సంబోధించి నవ్వితే నేను ఇంక ఇక్కడ పెద్దగా involve అవ్వడం మంచిది కాదనుకుని వదిలేశాను కూడా. కాకపోతే స్నేహాన్ని మీరు charity తో పోలిస్తి నాకు ఇక నా అభిప్రాయం ఇంకొంచెం విడమర్చక తప్పదేమో అనిపిస్తోంది. ఇప్పటికీ నేణు సరిగ్గా చెప్పగలనో లేదో. ప్రయత్నిస్తాను. ఐతే ఇంకెప్పుడైనా మళ్ళీ తీరిక్గా ఈ పోస్టు చదివి అన్ని nuiances అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుందనీ, అప్పుడు కథలోని పాత్రలన్నీ ఇంకొంచెం బాగా అర్థం అవుతాయేమో కూడా అనిపిస్తోంది. అప్పుడు నా అభిప్రాయం వేరేగా ఉంటుందా? ఏమో? ప్రస్తుతానికి ఉన్న అవగాహనతో:
స్నేహం మీ కోసం అనుకుంటున్నాను, హుస్సేన్ కోసం కాదు. ఆ దృష్ట్యా అది charity అని నా ఊహలో ఏ మాత్రం ఉద్దేశ్యమే లేదు. మీ చిన్నప్పటి తీపి గుర్తులను నెమరు వేసుకోవడానికి మాత్రమే మీకు తోడు కావాలి అని అతనిని పలకరించబోతే నేనేమీ చెప్పలేను. అవి ఒక భాగం మాత్రమే. ఏ బంధంలో ఐనా అన్నీ తీపి గుర్తులే ఉంటాయి అవి సరదాగా నెమరు వేసుకోవడానికి మాత్రమే మనం వారితో బంధం ఆశిస్తామని నేను అనుకోను. కష్టాలు ఒక్కో సారి మనుషులని ఇంకా దగ్గరికి తెస్తాయి. చిన్నప్పుడు అన్నీ తెలిసిన స్నేహితుడిగా ఇప్పుడు పెరిగి జీవితం గురించి కొంత అర్థమైన వారిగా మళ్ళీ కలుసుకుని నిజానికి అంత dark past కి మీరు సాక్షులుగా ఉన్నందు వల్ల అతను దాచుకోవలసినది ఏమీ లేదు కనుక అతను మీతో free గా ఉండగలగాలి అనిపిస్తోంది నాకు. ఇప్పటికి ఇదే నేను చెప్పగలిగింది.
Lalitha garu & Ramana garu,
ReplyDeleteLooks like I gave an impression that I am laughing *at* someone. Nope. Sorry, if it came across that way. Those smileys at the end are very generic, meant to show a smiling face. Nothing more was meant, when I put them over there.
Now, I have nothing more to say on what Ramana garu has written above other than agreeing with his last paragraph which I mentioned above. It's a multidimensional issue, which cannot be justified by any one single way of looking at it.
I will leave it at that.
కుమార్ గారూ మీ స్మైలీల గురించి కాదు , "godariteram " వారి నవ్వు అర్థం కాలేదు. మరీ ముఖ్యంగా ఆ పేరు కొత్తగా అదీ ఇప్పుడే చూడడం వల్ల. కొన్నేళ్ళ క్రితం తెలిసిన వారే ముసుగులో బ్లాగ్లలో రచ్చ చేసినందువల్ల మళ్ళీ కొంచెం భయమేసింది. ఏదో కాల్క్షేపానికీ, కాస్త diversion కోసం ఈ వ్యాఖ్యలు. ఆలోచనలు express చెయ్యగలిగి కాస్త స్పష్టత (నా కోసం) ఏర్పడుంతుందనే ఆశ. కానీ కొందరికి ఆ ఉద్దేశ్యాలు ఉండవు, ఇంకొకరికి ఉంటాయని అర్థం చేసుకోలేక తీరిక చేసుకుని మరీ ఏడిపిస్తుంటారు. అలా మళ్ళీ దొరికిపోతానేమోనన్న భయం నన్ను వీడని నీడలా వెంటాడుతూనే ఉంటుంది (స్వయంకృతం అనుకోవాలేమో). అర్థం చేసుకోగలరు.
ReplyDelete' మూడో క్లాసు'
ReplyDelete' టాపరు'
'ఫస్ట్ ప్లేస్ కి, సెకండ్ ప్లేస్ కి మధ్య బోలెడన్ని మార్కుల అంతరం.'
'నాకూ, బాబ్జీకీ మధ్య తీవ్రమైన పోటీ!'....ఆ రోజుల్లో
ఇవి మీరే వ్రాశారా అని కొంత అనుమానమొచ్చింది.
చివర్లో బాబ్జి మాట్లాడిన దగ్గర్నుండీ బాగుంది.
రమణ గారు,
ReplyDeleteIn Andhra paakam jilebees come first!
In English Dinner dessert comes last!
ok!
For having come delayed, here is a thought for you to further expand from the book 'The Strong and the Weak'(Les Forts et Les Faibles) by Paul Tournier from the chapter - "Fear"
"It is clear that whether a child has been frightened by his parents' quarrels, whether he is misunderstood and persecuted by them or by a teacher, whether he lacks self-confidence as a result either of a restrictive upbringing or of fear inspired by worrying parents, we find that the basic cause of his weak reactions is always fear"
Not Amen
Zilebi
హమ్మయ్య సుబ్బు గారి పై జెలసీ కాస్త తగ్గుతోంది :)
ReplyDeleteRao S లక్కరాజు గారి అభిప్రాయం బానే ఉన్నా , అది ఒక పార్శ్వం మాత్రమే అయ్యుండొచ్చు.
మీ కధ లోని పాత్ర హుస్సేన్ తో మళ్లి స్నేహమే చెయ్యనక్కర లేదు. అది silly charity show లా కనిపించడం మొదట మామూలే. కాదని ఇద్దరికీ అర్ధం అవడానికి సమయం పడుతుంది.
Lalita garu,
ReplyDeletewell spoted!!! very keen observation. I totally apriciate it.
@Chandu S,
ReplyDeleteఅయ్యో! కథ మొత్తం నా లాప్ టాప్ వ్రాలు.
నా ధోరణికి భిన్నంగా రాశాను. ఇది కేవలం కథ మాత్రమే. గమనించగలరు.
ఓపిక, ఓర్పు లేమి కారణంగా.. ఒక స్కెచ్ రాసి వదిలేశాను.
జీవితం ఒక ప్రయాణం. రకరకాల మనుషులు, ఆలోచనల మయం.
ఒక స్నేహాన్ని కొనసాగించటం ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన విషయం.
జీవితాంతం అపూర్వ సహోదరుల్లా బతుకుదాం అనుకుని.. అటు తర్వాత కనీసం ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియని దుస్థితిలో ఉన్న స్నేహితులు నాకు తెలుసు.
చదువుకునే రోజుల్లో కనీసం పలకరించుకునే స్నేహం కూడా లేకుండా.. తరవాత కాలం లో మంచి స్నేహితులయిపోయినవాళ్ళూ ఉన్నారు.
నా కథలో 'నా' స్నేహం తరవాత హుస్సేన్ జీవితం గూర్చి రాయలేదు. అతని అనుభవాలు, ఆలోచనలు మనకి తెలిసే అవకాశం లేదు. తెలివి, ఓపిక ఉన్న కథకుడు అవతలి వైపు సమాచారాన్ని కూడా పాఠకుడుకి అందిస్తాడు. తన బాల్యం గూర్చి హుస్సేన్ని రాయమంటే 'నా' గూర్చి ఎలా రాస్తాడో!
నాకీ కథ రాయడం ద్వారా అర్ధమైన విషయం.. అన్ని విషయాలు 'పొట్టిగా' రాయడానికి వీలుండదు.
స్పందనకి ధన్యవాదాలు.
Zilebi ji,
ReplyDeleteyou think you are a dessert.
for me.. Zilebi is always icing on the cake!
Mauli గారు,
ReplyDeletelalithag గారు,
నా కథని చదివి.. చక్కటి కామెంట్లతో స్పందించినందుకు ధన్యవాదాలు.
sir,
ReplyDeletebaagundi
Ramesh babu gudivada
@Gudivada Ramesha babu,
ReplyDeletethank you.
హ్మ్...ఒక భారమైన నిట్టూర్పు. మీ ఆఖరి పేరా తో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteRamana garu,
ReplyDeletewhat babjee garu says seems part of the truth.
No one minds that their painful past is witnessed by someone after some 40+ years if their "present" is glorious.
Past may be forgotten easily but present if it's painful, hurts like hell. It is this " present " that hussain jee seems to be having a problem with.
Suppose hussain jee stops to talk with any of his school friends. The talk always, always goes along these lines.
era hussain, ela unnawu ? what are you doing now ? pelli ayintha ? pillalu ? are they studying ?
To tell that I'm selling plastic by the side of a road would not seem so sweet to him, like it is for your friends to tell with some pride, I'm a doctor or a book shop owner. He's smart enough to guess by your appearance ( dressing ) or perhaps hearing from someone else that your social status may be many times higher than him. He's not ready to feel low before a childhood friend, in the "present" , this is not about his past. Suppose his life was like NTR garu or ambani jee or some other person who earns lot of money/fame despite not so glamorous pasts, then hussain jee will be ready to hug your friends to tell you his life story of how he's the hero no matter how painful his past is.
If suppose a world exists where - what is your line of work ? is not an issue to ask or tell about or is not an issue to wonder about ( if secretly ) too , then hussain will warmly reach you.