"అమ్మా! అబ్బా!" కడుపు చేత్తో పట్టుకుని, కళ్ళు గట్టిగా మూసుకుని, పళ్ళ బిగువున బాధ భరిస్తున్నాను.
"కొంచెం ఓపిక పట్టు నాన్నా, ఒక్కనిమిషం." అంటూ తులసికోట నుండి రెండు తులసి దళాల్ని తుంచారు శేషమ్మగారు.
పొట్టిగా, తెల్లగా, బొద్దుగా, నుదుట రూపాయంత కుంకుమ బొట్టుతో ప్రశాంతంగా కనిపించే శేషమ్మగారంటే మావీధిలో అందరికి గౌరవం. విశాలమైన శేషమ్మగారిల్లు మా ఇంటికి రెండిళ్ళ ఆవతలగా ఉంటుంది.
ఆ తులసి దళాల్ని దోసిలిలో పెట్టుకుని సూర్యుని వైపు చూస్తూ ఏవో మంత్రాలు జపించారు. నెమ్మదిగా కళ్ళు తెరచి ఆ తులసి ఆకుల్ని నాపొట్ట మీద ముందుకీ వెనక్కి సున్నితంగా మూడుసార్లు రాశారు.
"ఇంటికెళ్ళి పడుకో నాన్న, కొంతసేపటికి తగ్గిపోతుంది." హామీ ఇచ్చారు శేషమ్మగారు.
ఆవిడ చెప్పినట్లే కొద్దిసేపటికి నా కడుపునొప్పి 'హుష్'మంటూ ఎగిరిపోయింది! దటీజ్ శేషమ్మగారు.. అపర ధన్వంతరి!
నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టి పెరిగాను. ఐదోక్లాసు దాకా శారదానికేతనంలో చదువుకున్నాను. అక్క నాకు ఒక సంవత్సరం సీనియర్, స్కూలుకి రెగ్యులర్‌గా వెళ్ళేది. నాకు మాత్రం స్కూలుకెళ్ళడం అత్యంత దుర్భరంగా ఉండేది. మా స్కూలు భూకంపంలో కూరుకుపోయినట్లూ, వరదల్లో కొట్టుకుపోయినట్లూ మధురమైన కలలొచ్చేవి (ఆవిధంగా కలలు నిజం కావని చిన్నప్పుడే గ్రహించాను).
స్కూలు ఎగ్గోడదామని అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేసేవాణ్ణి. ఆ ప్రయత్నాలు విఫలమవడమే గాక తన్నులు బోనసుగా లభించేవి. ఆవిధంగా నాపై నిర్భంద విద్యాబోధన కార్యక్రమం కర్కశంగా, నిర్విఘ్నంగా అమలు జరపబడింది. దీన్నే 'చదువుకోవటం' అనంటారని పెద్దయ్యాక అర్ధమైంది.
అమ్మకి చుట్టుపక్కల ఇళ్ళల్లో స్నేహితులుండేవారు. వాళ్ళల్లో ఎదురింటి విజయ అతి ముఖ్య స్నేహితురాలు. మేం ఆవిడని 'విజయక్కయ్య' అని పిలిచేవాళ్ళం. విజయక్కయ్య వయసులో అమ్మకన్నా పదేళ్ళు చిన్నది. ఆవిడ భర్త ఆఫీసుకి, పిల్లలు బడికి వెళ్ళిన తరవాత అమ్మతో చాలాసేపు కబుర్లు చెప్పేది.
ఇద్దరు కలిసి బియ్యంలో రాళ్ళు యేరేవాళ్ళు, మినుమలు తిరగలి పట్టేవాళ్ళు, ఆవకాయ పట్టేవాళ్ళు. కబుర్లు కూడా వెరైటీ సబ్జక్టుల మీద చెప్పుకునేవాళ్ళు. 'సుబ్రమణ్యం పెళ్లిసంబందం యెందుకు తప్పిపోయింది? సుబ్బలక్ష్మికి పెళ్ళయి నాలుగేళ్ళైనా ఇంకా కడుపెందుకు రాలేదు?' నాకు వాళ్ళ కబుర్లు అర్ధమయ్యేవి కాదు.
కుక్కలకి వాసనశక్తి స్పెషల్ పవర్, అది ఆ జాతి లక్షణం. కుక్కజాతివలే నాలోనూ ఒక స్పెషల్ పవర్ ఉంది. అది - అమ్మ, విజయక్కయ్యల సినిమా ప్రోగ్రాం ముందుగా పసిగట్టెయ్యడం. సినిమా ప్రోగ్రాం వున్ననాడు వీళ్ళద్దరూ కళ్ళతో సైగలు చేసుకుంటారు, తక్కువగా మాట్లాడుకుంటారు. నాకు వీళ్ళ బాడీ లాంగ్వేజి అర్ధమైపొయ్యేది.
ఈ విషయం తెలీని అమాయక అక్క మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ స్కూలుకెళ్లిపొయ్యేది. అన్నం పీకల్దాకా దట్టించి, నా కడుపునొప్పి నటన ప్రారంభించేవాడిని (అన్నం తినకముందే కడుపునొప్పి యాక్షన్ మొదలెడ్తే ఆ తరవాత ఆకల్తో చస్తాం, అందుకే నటనలో టైమింగ్ ముఖ్యం అంటారు పెద్దలు).
స్కూలుకెళ్ళే ముందు - 'అమ్మా, నొప్పి' అంటూ డొక్క నొక్కుకుంటూ కూలబడిపొయ్యేవాణ్ని. నా ఈ గొప్ప ఐడియాని (నేను పుట్టకముందే) కాపీ కొట్టేసి ఎల్వీ ప్రసాద్ 'పెళ్ళిచేసి చూడు'లో పాటగా పెట్టేశాడు - ఆ విషయం పెద్దయ్యాక తెలిసింది!
స్కూల్ టైమ్ దాటిపొంగాన్లే ఈ ఓవర్ యాక్షన్ శృతి కొంత తగ్గించాలి. స్కూలు అనే ప్రధమ గండం గడిచింది గదా, అని పూర్తిగా రిలాక్స్ అయితే నాది ఉత్తుత్తి కడుపునొప్పని తెలిసిపోతుంది. ఇది మన భవిష్యత్తు నాటకాలకి దెబ్బ (దురాలోచన చేసేవాడు దూరాలోచన కలిగుండాలి).
అమ్మ, విజయక్కయ్య కొద్దిసేపు మంతనాలు సాగించేవారు. ఇద్దర్లోనూ నా కడుపునొప్పి వాళ్ళ సినిమాకి ఎసరు తెస్తుందేమోననే ఆందోళన కనిపించేది. మా ఫ్యామిలి డాక్టరు వాడపల్లి వెంకటేశ్వరరావుగారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే అరవై పైసలు ఖర్చు. అంత డబ్బు అమ్మ దగ్గర ఉండేది కాదు.
అంచేత - వయా మీడియాగా నన్ను శేషమ్మగారి దగ్గరకి తీసికెళ్ళేవాళ్ళు. ఈ కథకి హీరోయిన్ శేషమ్మగారు కావున ఆవిడ వైద్యవిధానం ముందే తెలియజేశాను.
శేషమ్మగారి తులసిదళ వైద్యానంతరం నా కడుపునొప్పి సహజంగానే తగ్గిపొయ్యేది!
అమ్మ ప్రేమగా నాతల నిమురుతూ - "కళ్ళు మూసుకుని పడుకో, కొద్దిగా పనుంది, విజయతో పాటు అలా బజారు దాకా వెళ్ళొస్తా." అనేది.
"భయమేస్తుందమ్మా, మళ్ళీ నొప్పి వస్తుందేమో." అని దీనంగా అనేవాణ్ణి.
అమ్మ, విజయక్కయ్యలు మళ్ళీ మరికొద్దిసేపు మంతనాలు.
కొద్దిసేపటికి అమ్మ నెమ్మదిగా చెప్పేది - "సినిమాకెళ్దామని విజయ ఒకటే గొడవ, నువ్వూ వస్తావా?"
"వస్తానమ్మా"
"సరే, రా! ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా నాన్నకి." అని ఒట్టేయించుకుని నన్ను సినిమాకి తీసుకెళ్ళేది.
మా ఇంటికి దగ్గరగా రెండు సినిమా హాళ్ళుండేవి. ఒకటి ఆనందభవన్ పక్కగా ఉండే లక్ష్మీ పిక్చర్ పేలెస్, ఇంకోటి ఓవర్ బ్రిడ్జ్ అవతలగా శేషమహల్. అమ్మ, విజయక్కయ్యలతో పాటు నడుచుకుంటూ వెళ్లి, నా కడుపునొప్పి సినిమాలన్నీ ఈ హాళ్ళలోనే చూశాను.
తిరపతమ్మకథ, సతీసక్కుబాయి, నాదీ ఆడజన్మే, మాతృదేవత, ఆడపడుచు.. దాదాపుగా అన్నీ మూడుగంటల ఏడుపు సినిమాలే. నాకేమో ఫైటింగు సినిమాలు ఇష్టం, కానీ ఆ సినిమాల్లో భూతద్దంతో వెదికినా ఒక్క ఫైటింగ్ కూడా ఉండేది కాదు. అసలు నాకా సినిమాలల్లో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్ధమయ్యేది కాదు.
స్టిల్ నో రిగ్రెట్స్, నాది డబుల్ ధమాకా! స్కూలు ఎగ్గొట్టాను, సినిమా చూస్తున్నాను. ప్రపంచంలో ఇంతకన్నా లక్జరీ ఏముంటుంది? ఆశ్చర్యమేమంటే - హాల్లో చాలామంది మావీధి ఆడవాళ్ళుండేవారు. సినిమాహాల్లోనే 'పిన్నిగారు, వదినగారు' అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకిరించుకునేవారు.
సినిమా మొదలెట్టిన అరగంటకి హాలు వాతావరణం బరువెక్కేది, ఆపై వేడినిట్టూర్పులతో ఉక్కపోత వాతావరణం మరింత వేడెక్కేది. చిన్నగా మొదలైన ఏడ్పులు, క్రమంగా నిశ్శబ్ద వెక్కిళ్ళుగా రూపాంతరం చెందేవి. రాన్రాను ఏడుపు, పెడబొబ్బలతో హాలు దద్దరిల్లేది. ఆవిధంగా ఆ సామూహిక రోదనా కార్యక్రమం అప్రతిహతంగా గంటలపాటు సాగిపోయ్యేది.
మధ్యలో బుర్రుబుర్రున ముక్కుచీదుళ్ళు, సూర్యాకాంతాన్ని చూస్తూ మెటికల విరుపులు, తిట్లు, శాపనార్ధాలు. హీరోయిన్ కష్టాలకి పెద్దవాళ్ళు ఏడుస్తుంటే, ఉక్కపోత భరించలేక పసిపిల్లలు ఏడ్చేవాళ్ళు. ఆవిధంగా వాతావరణం రోదనాభరితంగా, శోకపూరితంగా ఉండేది. సినిమా అయిపొయ్యేప్పటికి అందరి ఆడవాళ్ళ మొహాలు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయేవి, జుట్టు రేగిపోయేది, కళ్ళు వాచిపోయేవి.
సినిమాని వినోదసాధనం అంటారు, డబ్బిచ్చి ఏడవటం వినోదం కిందకి వస్తుందా?! సమాధానం నాకు తెలీదు గానీ, మొత్తానికి నా కడుపునొప్పి నాటకంతో చాలా సినిమాలే గిట్టిచ్చాను. ఇంటికి వెళ్ళంగాన్లే హడావుడిగా మంచమెక్కి, దుప్పటి కప్పుకుని, నీరసంగా పడుకునేవాణ్ణి - అక్క స్కూల్ నుండి వచ్చే వేళయింది గదా!
'నీ బోడి కడుపునొప్పి నటన గూర్చి తెగ డబ్బా కొట్టుకుంటున్నావ్, ఆమాత్రం మా చిన్నప్పుడు మేమూ వెలగబెట్టాం.' అని అంటారా? సర్లేండి, కాకిపిల్ల కాకికి ముద్దు. నా నటన నాకు మాత్రం గొప్పే. మంచినటనకి కొలమానం ఎదుటివారిని నమ్మించడమే అయితే, నాకందులో నంది అవార్డు రావాలి. కారణం - నా కడుపునొప్పి నాటకాన్ని అమ్మ గానీ, శేషమ్మగారు గానీ, ఎప్పటికీ గ్రహించలేకపోయారు.
శేషమ్మగారి తులసిదళ మంత్రం కడుపునొప్పికి అద్భుతంగా పన్జేస్తుందని అమ్మ ప్రచారం చేసింది. శేషమ్మగారికి కూడా కాన్ఫిడెన్సు పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో తన వైద్యాన్ని జ్వరాలు, దగ్గు, గజ్జి పుళ్ళు, పంటినొప్పి వగైరా రోగాలకి విస్తరింపజేసి ప్రాక్టీసు పెంచుకున్నారు. రోజూ సాయంత్రం నాలుగింటికి తులసికోట పక్కన కూర్చుని పేషంట్లని చూసేవారు. శేషమ్మగారి మంత్రం చాల పవర్ఫుల్లనీ, కొన్నిరోగాలకి వాడపల్లి వెంకటేశ్వరరావుగారి కన్నా ఆవిడే మెరుగనీ చెప్పుకునేవారు. ఆవిడ 'అపర ధన్వంతరి' అనీ, దేవీ ఉపాసకురాలు కావడం చేతనే ఆవిడ వైద్యానికి గొప్పమహత్తు కూడా ఉందని ప్రచారం వచ్చింది.
నేను తన వైద్యం నూటికి నూరుశాతం పనిచేసిన పేషంటుని కావటంచేత శేషమ్మగారు నాపట్ల అవ్యాజ వాత్సల్యాన్ని కురిపించేవారు.
"ఏం నాన్నా! ఈ మధ్యేం కడుపునొప్పి రావట్లేదు గదా!" అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.
ఆ పిలుపులో నాకు అనేకరకాల భావాలు గోచరించేవి. ఏ డాక్టరైనా తన మొదటి పేషంట్ పట్ల కృతజ్ఞతా భావం, ప్రేమానురాగాలు కలిగుంటాడు. తన వైద్యం వల్ల రోగం తగ్గి నార్మల్ అయిన పేషంట్లని చూస్తే డాక్టర్లకి అపరిమితమైన తృప్తి, గర్వం! నీకు ఏ రోగమొచ్చినా తగ్గించటానికి నేనున్నానుగా అనే భరోసా, అభయ హస్తం కూడా శేషమ్మగారి పలకరింపులో నాకు కనబడేవి!
ఏడు పెంకులాట, పిచ్చిబంతి మొదలైన సందుగొందుల క్రీడలు ఆడుతుండగా, శేషమ్మగారి పెరట్లో బంతి పడ్డప్పుడు, దాన్ని తెచ్చుకోటానికి వారి ఇంటి ప్రహరీ గోడ దూకి (ఇంటి తలుపులు తెరిచున్నా గోడ దూకాలనే పాలసీ నాది) పెరట్లో బంతికోసం వెతుకుతున్నప్పుడు.. చేతిలో చిన్న బెల్లంముక్కో , గుప్పెడు శనగపప్పులో పెట్టేవారు. ఎంతయినా నేనావిడ బెస్ట్ పేషంటుని గదా!
నా 'కడుపునొప్పి' తగ్గించి, నాకు దుష్టదుర్మార్గ స్కూలు నుండి తాత్కాలిక విముక్తి కల్పించి, నేను అనేక సినిమాలు చూడ్డానికి కారణభూతురాలైన 'అపర ధన్వంతరి' శేషమ్మగారికి శతకోటి వందనాలు!
డాక్టరు గారు,
ReplyDeleteఅపర 'పరహిత' ధన్వంతరి గురించి మీదైన శైలి లో చాలా బాగా చెప్పారండీ.
ఇక ఆ ఆత్మ విశ్వాసం, నిష్ఠ అన్న పదాలు వాడేరు చూసేరు, ఆ ధన్వంతరి కి ఉండాల్సిన గుణ గణాలన్ని అందులోనే నిమిడి ఉన్నాయి కూడాను.
మూడు తన వైద్యం తనకి పూర్తి గా నమ్మకం కలిగించడానికి కారణమైన మొదటి పేషెంటు మీద ఆవిడ చూపించిన ప్రేమ. ఇది మంచి విషయం.
చాలా మంచి టపా (శర్మ గారి పరహిత వైద్యం తరువాయి ఇది చదవటం మరో అనుభూతి )
చీర్స్
జిలేబి.
hilarious :)
ReplyDeleteఆర్యా! నమస్తే.
ReplyDeleteఈ క్రింది లింక్ తెరచి, చదివి, మీ బ్లాగు ద్వారా పాఠకులకందింప మనవి.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html
Wonder, what the fate of other patients at Sheshamma's OP!! you always write about very delicate issues with lots of humor, and your opinion is always hidden (appreciate that).
ReplyDeleteI hope that this post won't turn into another battle ground between traditional healers and professional Doctors!!
I mean "Discussion" between the supporters of ancient medicine and modern medicine.
ReplyDeletehilarious. but, it in another way degrades traditional medicinal systems. to have penance i advise you to write another piece on Tulasi pant and its curative properties and about Tulasi kota and the cultural scenario around it. any way in writing capbilities your hand got twisted. keep it up. don't forget my advice. it may be pernicious to you. chandrasekhar
ReplyDeleteకోడిగుడ్డు మీద ఈకలు పీకటమంటే ఇదే మరి :)
ReplyDeleteశేషమ్మ గారిలో మా అమ్మమ్మ పోలికలు కనిపిస్తున్నాయి. వాళ్ళింటి పేరేమిటండోయ్? మా అమ్మమ్మ వాళ్ళ అక్క పేరు కూడా శేషమ్మే! అమ్మమ్మ కూడా ఎంతెంత రోగాలకీ మంత్రించి కాసిన్ని నీళ్ళు ఇచ్చిందంటే మటాషే! కాకపోతే ఈవిడ తులసి జోలికెళ్ళేది కాదు, దేవుడి గదిలో కాసిన్ని నీళ్ళు బుల్లి గ్లాసులో పట్టుకుని నిల్చుని ఆరేడు నిమిషాలు మంత్రాలు చదివి, ఇచ్చేసేది. అది తాగుతున్నన సేపూ మన తల మీద చెయ్యి పెట్టి నిలబడేది.
ReplyDeleteమీ నాటకాల్లో మీరన్నట్టు మా అందరికీ కొంత అనుభవం ఉన్నా, చివరి వరకూ నటన అని తెలీకుండా నెగ్గడం కష్టమే!
వీకెండ్ గారు :-))
హహహ బాగుందండీ :-)
ReplyDeleteనటనలో టైమింగూ.. దురాలోచన చేసే వారికి దూరాలోచన... సూపర్ అసలు..
నిజమే మాలెవల్ కి నాటకాలు మేమూ వేసేవాళ్ళం కానీ పైన చెప్పినవి రెండూలేక ఏదో ఓ స్టేజ్ లో దొరికిపోయేవాళ్ళం :-)
:)) ఒక బోరింగ్ మీటింగ్ లో కూర్చుని ఇప్పుడే చదివాను. నా ఒక్క దాని మొహం లోనే నవ్వు.. అందరూ మీరు చిన్నదనం లో వెళ్లిన సినిమా చూసే ఆడవాళ్ల మానసిక స్థితి లో ఉన్నారు ..
ReplyDeleteడాక్టరుగారూ, ఇంతకీ మీ twisted hand కి ఏ వైద్యం చేయిస్తారండీ. శేషమ్మ గారి దగ్గరేనా :))
ReplyDeleteసుజాత గారు, థాంక్యూ :)
జిలేబి గారు..
ReplyDeleteధన్యవాదాలు.
ఏ వైద్య విధానంలో నయినా రోగి పట్ల గౌరవం చూపడం డాక్టర్ల కనీస మర్యాద.
ఈ రోజుల్లో మనం డాక్టర్ల డిగ్రీలని గౌరవిస్తుంటే.. డాక్టర్లు మన మనీ పర్సులని గౌరవిస్తున్నారు!
@Weekend Politician..
ReplyDeleteశేషమ్మ గారి వైద్యం నాకు చాలా కలిసొచ్చింది.
ఆవిడ నా పర్సనల్ ఫిజీషియన్.
నాకు చెయ్యి తిరిగిందని చంద్రశేఖర్ సరదాగా అన్నాడు లేండి.
చేతికైనా, గుండె కైనా శేషమ్మగారే నా డాక్టర్!
సుజాత గారు..
ReplyDeleteమీకు శేషమ్మగారిలో మీ అమ్మమ్మ గారు కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
ఆ రోజుల్లో ఇంట్లో పెద్దవారు ఇటువంటి వైద్యం చేస్తుండేవారు.
నా లాంటి దొంగ పేషంట్లు కాదు గానీ..
చాలామందికి రోగాలు తగ్గేవి.
బహుశా ఈ రోజుల్లో డాక్టర్లు మందులు వాడి 'తగ్గించే' చాలా రోగాలు self limiting రోగాలు.
అందువల్ల కావచ్చు.
దురాలోచన చేసే వారికి దూరాలోచన....హహహహ
ReplyDeleteబావుంది శేషమ్మ గారి వైద్యం....మీ నాటకాలునూ! :)
రమణ,
ReplyDeleteచాలా బాగున్నది. ఈ సంధర్భములో నేను చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తుకు వచ్చాయి. "పెళ్ళి చేసి చూడు" లో అనుకుంట కంద మోహన్ (IAS) చైల్డ్ ఆర్టిస్ట్ గ నటించారు. అందులో ఈ నటుడు నీలగే నటిస్తూ (ఎడవకుండ) పాట పాడాడు. ఆ పాట "అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే". రెండవ సినిమా దేవానంద్ నటించిన "గైడ్" సినిమా. చాలామంది చూసే ఉంటారు. ఈ దేవానంద్ సినిమాలో చివరకు ఆకలిబాధతో ఒక దేవాలయంలో కూర్చొని ఉంటాడు. ఎవరన్న కాస్తంత ప్రసాదం పెడితే తిందామని. ఒక సమయంలో వర్షాలు పడకపోతే ప్రజలు ఇతనితో మొరపెట్టుకుంటారు. అది నిజ జీవితం కాదనుకో. వర్షాలు పడతాయి. కొంతకాలానికి ఒచ్చే పొయ్యే భక్తులు ఇతనిని చివరకు ఒక "మహిమ" గల సన్యాసిగా తయారు జేస్తారు. మీరు శేషమ్మగారిని అపర ధన్వంతరిగ జేసినట్లు.
వేణూ శ్రీకాంత్ గారు..
ReplyDeleteకడుపునొప్పి నటన అనేది ఒక కళండి!
ఆ కళలో మీ వంటి బుద్ధిమంతులకి పట్టు చిక్కదు లేండి!
కృష్ణ ప్రియ గారు..
ReplyDeleteఆ సినిమా హాల్లో నేను కాలక్షేపం చేసినట్లు.. మీటింగులు ఎటెండ్ అయిపోతున్నారా!
ఆ.సౌమ్య గారు..
ReplyDeleteమా అబ్బాయి బుడుగు స్కూల్ టైం కి కడుపునొప్పి, తలనొప్పి అన్నప్పుడల్లా.. తాతకి దగ్గులు నేర్పొద్దురోయ్! అంటుంటాను.
నాటి దొంగలే నేటి తండ్రులు!
బాగుంది. మీ నటన.
ReplyDeleteఇంతకీ మీ మొదటి పేషంటు సంగతేమిటి?
ఆ వ్యక్తిపై ఒక టపా వ్రాయబోతున్నారా?
@DSRMurthy ..
ReplyDelete'పెళ్ళి చేసి చూడు' పాట ఎందుకు గుర్తు లేదు!
ఆ సినిమాలో తల్లి 'బాబూ ఈ మందు తాగరా!' అనంగాన్లే దెబ్బకి కడుపు నొప్పి ఎగిరిపోతుంది.
అసలు 'స్కూలుకి ఏడుస్తూ వెళ్ళిన వాళ్ళే తెలివైన వాళ్ళు.' అని శాస్త్రాల్లో రాయబడి ఉంది!
bonagiri గారు..
ReplyDeleteనా మొదటి పేషంట్ ఒక యువతి.
ఆవిడ వారం లోపే ఆత్మహత్య చేసుకుంది.
కాబట్టి రాయడానికి ఏమీ లేదు.
అప్పుడు రోజంతా బాధ పడ్డాను.
ఇప్పుడు నెలకి నాలుగైదు ఆత్మహత్యలు.
అలవాటయిపోయింది.
ఆ శాస్రం నేనేలే వ్రాసింది.
ReplyDeleteఇంతవరకూ నేను చదివిన మీ టపాలలో ఇది బెస్టు పోస్టు.
ReplyDeleteమిగిలినవి సరదాగానూ మరియు / లేదా సంచలనాత్మకంగానూ ఉంటున్నాయి. ఇది మనసుని తాకుతోంది.
yeah, I have seen people (doctor's sons) who hated these homeopathy and allopathy...hence saw a possibility of battle!!
ReplyDeletethis post, while supporting the modern medicine giving us a chance to criticize the ""Dhanvantari""..
chanting mantra's wont cure a person!!!! or..it would??
Mr. Yaramana has to clear it for us!! he hid his opinion..but better to come out now!!!!
talk in clear terms!!
for better minded people, this post is enough..but for people like, Weekend Politician...Mr. Yaraman has to explain it!! Cuz, their thick skulls need elaborate explanation!!! only doctors can do it!!
I dont know...this could erupt into new discussion!! won't it???
lalithag గారు..
ReplyDeleteధన్యవాదాలు.
నాకు బ్లాగు రాయడం ఒక సరదా!
ఆలోచనలకి అప్పటికప్పుడు అక్షర రూపం ఇచ్చేసి నెట్ లో ప్రచురించటం ఇప్పటికీ థ్రిల్లింగ్ గానే ఉంది.
ఈ 'అప్పటికప్పుడు' వల్ల వివిధ రకాల టపాలు వచ్చేస్తున్నాయ్. అంతే!
But you must clear Sir??
ReplyDeletebetween this Dhanvantari and modern medicine!!!
as per your blog...its just cheating!!!the dhanvantari!!!! clear cheating!! chanting mantra's wont cure people!!! or would they?? or you are just saying us so????
you are a doctor...and hence has more moral responsibility!!!!sir!! more than us!!! give us claarity!!!???? are you supporting the old or the new????
Shout out your opinion!!! please!! we,20 years old, seeking direction...need it!!!!
If you people behave like this...we have no place to go...to check our morality!!!A FACT!
ReplyDeletedear anonymous,
ReplyDeletei don't think one should protect what they write.
the fate of any writing (blog post) would be decided by the readers.
i didn't express anything (+ve or -ve) about any 'system of medicine' in my post.
if somebody hates a particular kind of medical management, they are free to do so. good luck to them.
who am i to advocate good and bad of traditional/modern medicine?
people are wise enough to choose what they want.
i am a medical doctor in allopathy by training.
i earn my livelihood in this profession. (i have to. i have no choice.)
(since i have a qualification) i don't think i should promote modern medicine like a salesman.
my knowledge in traditional medicine is ZERO.
then, i wonder, how can i venture to talk?
but...ee weekend politician ki burra leda???? ledaa...unnaaa gannee...vaadatam ledaa????
ReplyDeleteits a clear war..I dont know how he he is not seeing it??? may be he is a blind guy!!!
you said of a blind belief about her, sheshamma, you want us to believe her?? or you???
the war is here!!!! if we had to believe her...lets go back to to those ancient times..why live in these modern times??? with so much technology and reason??
it may help the weekend politician to get some truths!!
idiots are idiots!! they were there..all the times!! this..."weekend" is one of them! that's all!!
sorry Sir, Yaramana garu,
ReplyDeleteits not about you...I am a great fan of you!!!
sorry if i hurt you!! really!!
please accept my apologies!! pleaase!!!
its really not about you!! I am extremely sorry!!!!
please accept my apologies!!
Its only about that..weekend politician's narrow minded comments!! that's all!!
you have got nothing to do about it!!
we always respect you...we always wait for your next post!!! we are great fans of you!!!
అజ్ఞాతా..
ReplyDeleteకమ్యూనిస్టు పోస్టుకి బుర్ర వేడెక్కి.. చల్లబరుచుకోటానికి ఈ పోస్ట్ రాశాను.
మీరు నన్నడిగారు అనుకుని సమాధానం రాశాను.
నాకు కోపం రాలేదు. నేను హర్ట్ అవ్వలేదు. మీరు అన్నిసార్లు సారీ చెప్పనవసరం లేదు.
నేను బ్లాగ్లోకానికి కొత్త కావడం వల్ల.. అప్పుడప్పుడు తికమక తప్పడం లేదు.
సాహో రమణగారూ, సాధారణంగా అజ్ఞాతలు నెగిటివ్ గానే కానీ పాజిటివ్ గా బ్లాగులని దీవించరుగా. మీకు బోల్డు అభిమానంతో రాస్తున్న అజ్ఞాతలున్నందుకూ...జయహో.
ReplyDeleteఎప్పటిలాగే పోస్టు అద్భుతంగా ఉంది. మనసుని టచ్ చేస్తూ...బాల్యాన్ని గుర్తుచేస్తూ. ఒకటో క్లాసులో ఓసారి రంగు పెన్సిళ్ళు స్కూల్లో పోయాయి.పోగొట్టినందుకు ఏమేనా అంటారేమోనని ఆరోజంతా జ్వరం అభినయించాను స్కూల్లో. ఒళ్ళు వేడి లేకపోయినా మనసులో దిగులంతా బయటకి దీనంగా కనిపించడంతో లోపల పాపం జ్వరం ఉండి ఉంటుందని నమ్మారు. అలా జ్వరం ఇంట్లో కూడా నటించాలనుకుని రాగానే బంధువులొచ్చారని తెలిసి మర్చిపోయి మర్నాడు దొరికిపోయా. అందరూ వయ్యా రమణలు కారు కదూ.
Anonymous,
ReplyDeleteI was watching your mindless hallucination..
What are you talking about ? What is that I wrote in these comments that hurt you. Just saying this post is hilarious is mindlessness/narrowmindedness for you ?!!!
If you have problem with something be direct, ask it away my boy..
Anonymous,
ReplyDeleteI was watching your mindless hallucination..
What are you talking about ? What is that I wrote in these comments that hurt you. Just saying this post is hilarious is mindlessness/narrowmindedness for you ?!!!
If you have problem with something be direct, ask it away my boy..
Anonymous,
ReplyDelete>>ee weekend politician ki burra leda???? ledaa...unnaaa gannee...vaadatam ledaa????
హమ్మో, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే..:)))) డాక్టరు గారూ, నన్ను శేషమ్మ గారికి రిఫర్ చెయ్యండి ప్లీజ్.. మీరొద్దు :))). ఈ అఙాత కేసు మాత్రం మీరు చూడాల్సిందే..
Hey.. stupid 20 year old directionless anonymous,
ReplyDeleteYou are yet to respond to my comment. Where are you ? Let me put it in a more direct way for your mean mind to understand.
1. What made you think that I criticized this post or launching into unneccessary discussion?
2. Why do you think I am against /For any one system of medicine ?
3. What are you begging the blog owner for ? Idoit are you so dependent on a blog !! Though its a good blog, I don't see any reason why the 20 year olds need a blog to set their direction?
4. Do you think your meaningless diatribe can be excused because you are a tender 20 year old? ;) idiot wakeup, 20 is not tender age. Go find a suitable occupation and a nice girl instead of roaming here with a begging bowl for direction.
Note to the blog owner: I apologize for deviating from the topic Ramana gaaru. But what to do..I feel sad to see 20 year olds to be soo foolish.. couldn't resist anymore :)
Ramana garu,
ReplyDeleteI can connect with my childhood; I remember watching 'Ramu' movie as matinee show with my mother and neighbourhood 'Atthayya garu' in Seshmahal theater and it is a complete sob story, with lot people weeping in the movie hall; funnily it rained that day and when we came out of the matinee show, the road resembled like small rivulet :)
You had taken me back to my childhood days, Saradaniketan, Majety school, Hindu college .. so lovely; thanks a lot sir.
Ramachandra
రవణ మామ
ReplyDeleteమన బ్లాగులొ దూరి ఏమిటి వీల్లు నానా యాగి చేస్తున్నారు
నీవు కూడా అందుకే కదా రిలీఫ్ గా మద్యలొ చిన్ననాటి సంగతులు రాస్తె వాటిలో కూడ దూరి చావ గొడుతున్నారు
రవణ మామ
ReplyDeleteమన బ్లాగులొ దూరి ఏమిటి వీల్లు నానా యాగి చేస్తున్నారు
నీవు కూడా అందుకే కదా రిలీఫ్ గా మద్యలొ చిన్ననాటి సంగతులు రాస్తె వాటిలో కూడ దూరి చావ గొడుతున్నారు
Ramesh babu గారు,
ReplyDeleteమీరన్న నానాయాగీ లో నా వ్యాఖ్యలు కూడా ఉండుంటే నేను అర్థం చేసుకోగలను, క్షమించగలరు.
ఈ టపాతో సంబంధం లేకుండా నా మీదా రాయబడిన నానా చెత్త ఉంది కాబట్టి చాలా సేపు ఓపిక పట్టిన తరవాత ప్రతిస్పందించక తప్పలేదు.
బ్లాగులో దూరేదేముందిలేండి కామెంట్లు ఏవి పబ్లిష్ చెయ్యాలో ఏవి చెయ్యకూడదో రమణగారి చేతులోనే ఉంటుంది కదా :)
సమకాలిన విషయాలమీద అలోచింపచేసేవిదంగా రాస్తుంటె అర్దం చేసుకోవాలిగాని.......
ReplyDeleteవీకెంద్ గురువుగారు అంటె నా వుద్దేశం చర్చ పక్కదారి పట్టరాదని అంతె
ReplyDeleteWP గారు..
ReplyDeleteనన్ను ఏక వచనంతో పిలిచే రమేష్ బాబు ఎవరో నాకు తెలీదు.
i need an advice.
i have a problem with comment moderation. updating is a huge task for me. one of my staff members used to do this job for me. he left for hyderabad for better opportunities.
when i leave it open for comments, i am finding some comments totally unrelated to my post.
somebody has used my space to personally attack you. i feel sorry and sincerely regret for this.
right now i am busy with my patients and promise you to delete comments made by anonymous against you in few minutes.
No Problem Sir. Actually I don't mind. I know you left it open for lack of time.
ReplyDeleteI am open for folks to have a go at me and I can handle that :)
You don't have to delete any of those comments for my sake. I do not attribute any blame to you as long as you allow me to respond.
No need to say sorry Sir.
the author might not have meant it...but the text means it!!!
ReplyDeletedont pose as if you are there with the author while he was writing it as a corrector!!!
as per my knowledge, this author is enough talented to know what he is writing and wont need you kind of people's support or mine either!!!!
If you check his previous posts....you can understand the depth of his writing!! just check the very immediate one!!! IDIOT!!!
how much argument has happened there!!!
this author means everything good...only people like you with half knowledge...extend the arguments to an endless list....unfortunately to his pain!!!
IDIOT!!! weekend politician??? I can come personally into your blog and show you what really hell is!!! remember that!!!! weekend or in work days!!! mind waht you are writing!!!!
the same anonymous with so many apologies to Raman garu....I neither know who this other guy is!!! that is Mr. Ramesh!!!
ReplyDeletesorry for creating a scene!! these half-knowledged11???
LoL. I thought so but again gave more benifit of doubt to your intelligence.. unfortunately you don't deserve it.
ReplyDelete>>కోడిగుడ్డు మీద ఈకలు పీకటమంటే ఇదే మరి :)
I did not made that comment about the blog post or the bolg author. Anyone with at least half an ounce of brain would be able to figure that out.
This time I am not calling you Idiot or stupid inspite of your provication. Be thankful for it.
I don't need to call you idiot or stupid. You proved yourself to every one ;)
looooool anonymous,
ReplyDelete>> "I can come personally into your blog and show you what really hell is!!! remember that!!!! weekend or in work days!!!"
he he.. I am looking forward to that. how do you plan to come personally into my blog :)))
do you want to pop out of the browser !!!!!
Jokes apart, try whatever you can, guys better than you have tried before.
and you know what.. you are not even starters for me :)))))))))
Hello sir
ReplyDeleteIf you do not wish to allow anonymous there is a better way. I blogger you can in settings de-select anonymous.
anonymous 00:02,
ReplyDeletethanks for the advice.
i disabled anonymous comments option from my blogger settings.
Dr. Ramana, what is your opinion about the placebo theory?
ReplyDeleteరమణ గారూ,
ReplyDeleteమీరు శేషమ్మ గారికి ఎంతైనా ఋణ పడవచ్చు. మీ కడుపు నెప్పికి ఆవిడ తులసి ఆకులు కాక, వాము అరుకు పోసి ఉంటె, మీరు అన్ని సినిమాలు చూడగలిగే వారా?
సీతారామం
సీతారాం గారు..
ReplyDeleteఅవును గదా!
శేషమ్మగారు బాగా conservative.
తన limitations తెలిసిన sensible lady.
అంచేత ఎవర్నీ ఇబ్బంది పెట్టేవారు కాదు.
Hi Ramana sir,
ReplyDeleteI just saw your article in Andhra Jyothi weekly in a tea stall near my office. Came to office and had a look at your blog. Really interesting one. By to By I am also from GUNTUR sir. Working in Hyderabad. Thanks for sharing your views.
- DP
@DP,
ReplyDeleteథాంక్యూ!
ఆంధ్రజ్యోతి వారు నా టపాని ఇవ్వాళ ప్రచురించడం బానే ఉంది గానీ..
ఇప్పుడు అమ్మ దగ్గరకి వెళుతున్నాను. నేను తన కాళ్ళ నొప్పుల గూర్చి పిచ్చి రాతలు రాశానని తెలిస్తే చచ్చానే!
నా రహస్యం అమ్మకి తెలియకూడదని కోరుకుంటున్నాను.
అయ్యా రమణ గారు,
ReplyDeleteటీ వీ బ్లాగోతం అనబడు టీ వీ పెళ్ళిళ్ళు, టీవీ సీరీళ్ళు ఇంత గా మనిషి దుఖాలని పోగోడుతున్నాయని తెలిసి యమ ఆనంద భరితురాలయ్యాను!
టీవీ టీ(వత్తు టీ) వీ (ఠీవీ) నమో నమః!!
రమణ గారి చేతులలో ఏ టాపిక్కు అయినా ఓ మెరుపు మెరుస్తుంది సుమీ!!
చీర్స్
జిలేబి.