అతడు నా చిన్ననాటి స్నేహితుడు. సరదాగా కబుర్లు చెబుతాడు. అతనితో కాలక్షేపం నాకు హాయిగా ఉంటుంది. ముఖ్యంగా అతని భార్య నన్ను 'అన్నయ్యా!' అని సంబోధించదు.. ప్రాణానికి సుఖంగా ఉంటుంది. అంచేత ఆ ఆదివారం సాయంకాలం నా మిత్రుని ఇంట్లో ప్రత్యక్షమయ్యాను.
మావాడు హడావుడిగా ఇంట్లోంచి బయల్దేరుతున్నాడు.
"భలే టైం కొచ్చావు. రావుగారితో పనుండి వెళ్తున్నాను. దార్లో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. పదపద!" అంటూ నన్ను లాక్కెళ్ళాడు.
ఏవో కబుర్లు చెబుతూ తన డొక్కు మోటార్ సైకిల్ పోనిస్తూనే ఉన్నాడు. ఊరు బయటకొచ్చేశాం.
"ఏమి నాయనా? ఎవరో రావు పేరు చెప్పి నన్నేమన్నా కిడ్నాపు, గట్రా చెయ్యట్లేదు గదా!" నవ్వుతూ అన్నాను.
మావాడు పెద్దగా నవ్వాడు.
"రావుగారు పెద్ద కాటన్ వ్యాపారి. కోట్లల్లో టర్నోవర్ చేస్తారు. ఆయన ఇల్లు చాలా పెద్దది. ఇంత చిన్న ఊళ్ళో అంత పెద్ద ఇల్లు పట్టదు. అందుకే ఊరు బయట ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు చూస్తే కళ్ళు తేలేస్తావు." అన్నాడు.
కొద్దిసేపటికి మోటార్ సైకిల్ ఆపాడు. ఎదురుగా ఒక పేద్ధ ఇల్లు. చిన్నసైజు కోటలా ఉంది. ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లున్నట్లు ఇప్పటిదాకా నాకు తెలీదు.
ఇంటిముందు ఖాకీ డ్రస్సులో వాచ్ మాన్. మావాడు అతనితో ఏదో చెప్పాడు. అతగాడు ఇంటర్ కమ్ లో ఎవరితోనో మాట్లాడి లోపలకెళ్లమన్నట్లు సైగ చేశాడు. ఇంటి ముందు విశాలమైన లాన్. పోర్టికోలో పెద్ద కుక్క. ఆ కుక్క మమ్మల్ని చూసి గంభీరంగా, హుందాగా, బద్దకంగా, నిర్లక్ష్యంగా మొరిగింది.
"నీ ప్లాన్ ఇప్పుడర్ధమయ్యింది. ఇంట్లోకి తీసికెళ్ళి ఈ కుక్కతో కరిపించి నన్ను చంపెయ్యబోతున్నావ్! అంతేనా?" అన్నాను. సమాధానంగా మావాడు మళ్ళీ పెద్దగా నవ్వాడు.
పోర్టికోలో ఓ మూలగా చెప్పులు విడిచి హాల్లోకి అడుగెట్టాం. ఆ హాలుని పరికించి చూశాను. అది చాలా విశాలమైన హాలు. విశాలంగానే కాదు.. చాలా ఖరీదుగా కూడా ఉంది. గోడకి పెద్ద టీవీ. దానికెదురుగా అంతకన్నా పెద్ద సోఫా.
ఆ సోఫాలో నల్లగా, పొట్టిగా, బట్టతలతో ఒక ఆసామి. తెల్ల లుంగీ, ఫుల్ చేతుల బనియనుతో ఉన్నాడు. "రావయ్యా! రా! పనుంటే తప్ప కనపడవా?" అంటూ బొంగురుగొంతుతో మావాణ్ణి ఆహ్వానించాడు. ఆయన ఆ ఇంటి ఓనరని అర్ధమైంది.
"అయ్యో! ఎంతమాటన్నారు సార్! తమవంటివారి దర్శనం చేసుకోవడం మా భాగ్యం." వినయంగా ఒంగిపోతూ అన్నాడు మావాడు. నేను ఫలానా అని ఆయనకి పరిచయం చేశాడు. ఆయన నన్ను చూసి పలకరింపుగా తల పంకించాడు.
కొద్దిసేపటికి ఆ పొట్టి బట్టతల ఇల్లు చూపించడం మొదలెట్టింది. మమ్మల్ని గదిగదికి తిప్పుతూ, ఆ గదుల ప్రత్యకతని వివరిస్తూ ఇల్లంతా తిప్పసాగాడు. ఇంటి కట్టుబడికి వాడిన సిమెంట్, ఇసుక.. వాటి రేట్లు మొదలైన వివరాలు కూడా పూస గుచ్చినట్లు చెప్పసాగాడు.
కొద్దిసేపటికి నాకు ఆ ఇంటికి ఆయనో గైడ్ లా కనిపించసాగాడు. ఆర్కిటెక్ట్ ఎవడో ముంబాయి వాట్ట. చెక్క పనివాళ్ళు చెన్నై నుండి వచ్చారట. పైపుల పనివాళ్ళు హైదరాబాదు నుండి వచ్చారట. గోడలు నునుపుకి కారకులు ఎవరో బీహారీలట.
నాకు విసుగ్గా ఉంది. ఈ ఆదివారం ఈ ఇంటి పిచ్చోడి చేతిలో ఇలా ఇరుక్కుపోయ్యనేమిటి! మావాడికి ఆయన చెప్పేది నోరు తెరుచుకుని మరీ వింటున్నాడు. అప్పుడప్పుడు మరిన్ని వివరాలడుగుతూ ఆయన్ని తెగ మెచ్చుకుంటున్నాడు. మొత్తానికి ఆ ఇంటిగలాయనతో మావాడికి ఏదో పెద్ద పనే ఉన్నట్లుంది. అందుకే కుట్ర పన్ని మరీ అతిగా పొగిడేస్తున్నాడు.
మావాడి ప్రశ్నలకి ఆయన ఆనందపడిపోతూ.. మురిసిపోతూ.. ఇల్లంతా తిప్పితిప్పి చూపిస్తూ.. ఆ ఇంటి ప్లాన్ ఎప్రూవల్ కి మంత్రిగారిని ఏ విధంగా మొహమాటపెట్టిందీ, కట్టుబడి కోసం ఎవరెవరిని ఏ విధంగా మోపు చేసింది వివరించసాగాడు.
దేవేంద్రలోకంలో ఏసీ బెడ్రూములూ, విశాలమైన లాన్స్ ఉంటాయా? మందపాటి టేకు ఫర్నిచరూ, మెత్తటి సోఫాలూ, ఖరీదైన మంచాలు, రంగురంగుల కర్టన్లు ఉంటాయా? నేనెప్పుడు చూళ్ళేదు. కావున నాకు తెలీదు. ఉన్నట్లయితే మాత్రం ఆ ఇంటిని ఇంద్రభవనం అనొచ్చు.
డబ్బు సంపాదించినవారు ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటారు. అది వారి ఇష్టం. నాకంత డబ్బులు లేవు. ఉంటే ఏం చేస్తానో ఊహంచి ఇప్పుడే చెప్పలేను. సిరివెన్నెల సీతారామశాస్త్రి మార్కెట్ చేస్తున్న 'సువర్ణ భూమి' లో ప్లాట్ కొనుక్కుని సొంత ఇంటి కల నిజం చేసుకుంటానేమో తెలీదు.
కాకపోతే నాకు నా ఆలోచనలలో 'అందమైన సొంత ఇల్లు' అన్న ఎజెండా ఏనాడూ లేదు. పడుకోడానికి మంచం, కాలకృత్యాలు తీర్చుకోడానికో గది ఉంటే చాలు. పాలు మాత్రమే తాగేవాడికి ఎంత ఖరీదైన విస్కీ ఇవ్వజూపినా ఏమి ప్రయోజనం? నేను అంత గొప్ప ఇంటిని యాంత్రికంగా, యధాలాపంగా చూడటం ఆ పొట్టి బట్టతలకి నచ్చినట్లు లేదు.
ఒకడు ఎంత మెచ్చుకున్నా ఇంకొకడు నిర్లిప్తంగా, నిరాసక్తంగా ఊరుకుండిపోవటంతో ఆ ఇంటాయనకి రావలిసింత 'కిక్' వచ్చినట్లు లేదు. మొహం ముడుచుకుంది. 'మొహం నల్లబడింది.' అన్రాయడానికి కుదర్దు.. ఆయన ఆల్రెడీ నల్లగా ఉన్నాడు కాబట్టి.
అటు తరవాత కాఫీ తాగుతున్నంతసేపు కనీసం నాకేసి చూడలేదు ఆ పెద్దమనిషి. మావాడితో మాట్లాడుతూ నేనసలక్కడ లేనట్లే ప్రవర్తించాడు. ఏదో లావాదేవి గూర్చి సీరియస్ గా మాట్లాడుకున్నారిద్దరు.
పాపం! ఆ బట్టతల హృదయం గాయపడినట్లుంది. తన ఇల్లు మెచ్చుకోకుంటే ఆయన అంత సీరియస్ గా రియాక్ట్ అవడం నన్నాశ్చర్యపరుస్తుంది. ఆయన కట్టించింది ఇల్లే గదా. ఆ మాత్రానికే 'అమరశిల్పి జక్కన' లా ఫీలయిపోవాలా? 'నా ఇల్లు నచ్చకపోతే నువ్వు నా శత్రువ్వి' అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. జార్జ్ బుష్ గాడి చుట్టమేమో!
నాకిన్నాళ్ళు కవిత్వాన్ని, కళాకారుల్ని మెచ్చుకోవటం తెలుసు. మంచి పుస్తకాన్ని ఇష్టపడటం తెలుసు. కానీ ఎందుకనో ఎంత ప్రయత్నించినా సోఫాలనీ, కర్టన్లనీ మెచ్చుకోవటం తెలీటల్లేదు. నాకీ ధనవంతుని పట్ల ఈర్ష్యాసూయలు ఉన్నాయా? ఏమో!
తిరుగు ప్రయాణంలో మావాడి మీద ఎగిరాను.
"ఆయన ఆ ఇంటికి దిష్టిపిడతలా ఉన్నాడు. ఏవిటో ఆ ఘోష. ఒక్కముక్క అర్ధం కాలేదు నాకు. పిచ్చెక్కించాడు. నా ఆదివారాన్ని చెడగొట్టావు. నీకు బుద్ధి లేదు." అన్నాను.
"ఆయనేదో మోజు పడి ఇల్లు కట్టించుకున్నాడు. నాలుగు మంచి ముక్కలు చెబితే మన సొమ్మేం పోయింది? నీకసలు బొత్తిగా లౌక్యం లేదు. నీ మీద కోపంతో నా పనికి ఎసరు పెడతాడని భయపడ్డాను." అన్నాడు మావాడు.
"అయితే నీ పని అయిందంటావు. కంగ్రాట్స్." అన్నాను.
"అయినట్లే ఉంది. లేకపోతే ఆ గోడల్ని, బండల్ని పొగిడే అవసరం నాకేంటి?" అన్నాడు మావాడు.
"ఎవరైనా మనుషుల్ని ప్రేమిస్తారు. కుక్కల్ని ప్రేమిస్తారు. ఈయన విచిత్రంగా ఇంటిని ప్రేమిస్తున్నాడేంటి?" ఆశ్చర్యపొయ్యాను.
"కాదేది ప్రేమకనర్హము? మనుషుల్ని ప్రేమిస్తే మోసపోవచ్చు. కుక్కల్ని ప్రేమిస్తే అవి ఏదో ఒకనాడు కరవొచ్చు. తెలివైనవాడు ప్రాణం లేని ఇళ్ళనీ, సోఫాల్ని మాత్రమే ప్రేమిస్తాడు. అవయితే అలా పడుంటాయి. మన నుండి ఏమీ ఆశించవు కూడా!" అంటూ మావాడు పెద్దగా నవ్వాడు.
'అవును కదా!' అనుకుంటూ నేనూ నవ్వాను.
చివరి తోక :- ప్రముఖ కవి కె.శివారెడ్డి కవితల సంపుటి 'రక్తం సూర్యుడు'. అందులో 'గతం నీది భవిష్యత్తు నాది' అనే కవిత ఈ టపా శీర్షికకి ఇన్స్పిరేషన్!
(photo courtesy : Google)
nee bonda. sontham ga oka illu katti chudu. appudu telustundhi intini kuda preminchochu ani. sutti vedhavala unnave.
ReplyDeleteవృత్తి రీత్యా (పేషంట్లతో) తిట్టించుకోవడం నాకలవాటే. అయితే ఇప్పుడు మావాళ్ళు బ్లాగుల్లోకి కూడా వచ్చేస్తున్నారు. కామెంట్లు రాసేస్తున్నారు. గుడ్!
Delete:))
Deleteడాక్టర్ గారు,
ReplyDeleteఈ పై అగ్నాత బహుశా ఆ ఇంటి ఓనరే అనుకుంటా,అందుకే అంత తీవ్రంగా స్పందించాడు.
కాకపొతే సొంతంగా కట్టుకున్న ఇంటిని చాలా మంది ప్రేమిస్తారు.ఇలాగే అందరికి చూయించుకుంటారు.
నేను చలామందిని అబ్సెర్వె చేసాను
జి రమేష్ బాబు
గుంటూరు
@ramaad-trendz,
Deleteడియర్ రమేష్ బాబు,
వ్యాఖ్యకి ధన్యవాదాలు. నేను రాసింది కథ. అందుకే నేను ఈ పోస్టుకి 'కథ' అన్న లేబుల్ ఇచ్చాను. లేబుల్ చూడని కారణాన మీరు ఆ 'నేను'ని నన్నుగా అపార్ధం చేసుకున్నారనిపిస్తుంది.
ఈ కథలో 'నేను' నేను కాదు. ఆ 'నేను' నేనయితే నాకు సొంత ఇల్లు ఉండకూడదు. కానీ నాకు సొంత కొంప ఉంది. అది చాలా పెద్దది.
'ఫస్ట్ పర్సన్' లో రాసే కథల్ని కథకునికి ఆపాదించరాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
డాక్టర్ గారు, కనీస సౌందర్య దృష్ట్టికూడాలేని మీమ్మల్ని ఎందుకు లెక్క చేయాలి? మీకు ఉన్న టాలెంట్ తో మీరు బ్లాగులు రాసుకొని నలుగురు పొగిడితే ఆనందించటంలేదా? ఆయనకు ఉన్న టాలేంట్ తో ఇల్లు కట్టి చూసుకొన్నాడు. ఇల్లుని చూసి ఎవరైనా అభినందిస్తారేమో అని ఆశించటం తప్పేమి కాదు. ఆయనని చూసి కుళ్ళు కోవటం మీ అజ్ఞానానికి పరాకాష్ట.
ReplyDeleteమీరు కుళ్ళుకోలేదని వాదిస్తారేమో, మంచి కామేడి సినేమాకి వెళ్ళి నవ్వకుండా సినేమాను చూడటం, సావిత్రి బాగా నటించిన సినేమాలోని నటన చూసి బాగా చేసిందని మెచ్చుకోకుండా, ఆ నాలాంటి ప్రేక్షకులు డబ్బులు ఇస్తుంటే ఎవరైనా నటిస్తారు అనే భావంతో ఆమే నటనని నిర్లక్ష్యం చేయటంతో సమానం, మీరు చేసిన పని .
ReplyDeleteగౌరవనీయులైన అజ్ఞాతలారా,
Deleteపైన జి.రమేష్ బాబుకి ఇచ్చిన సమాధానమే మీ వ్యాఖ్యలక్కూడా వర్తిస్తుంది. దయచేసి చదువుకోగలరు.
అక్కడక్కడా రావిశాస్త్రి ప్రభావం కనిపించింది.
ReplyDeleteబొందలపాటి గారు,
Deleteనాకీ 'రావిశాస్త్రి ప్రభావం' సమస్య మొదట్నుండీ ఉంది. నా స్నేహితులు కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. బయట పడాలనే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాను. ఒక రచయితని తీవ్రంగా అభిమానించడం ఇబ్బందుల్ని కలిగిస్తుంది.
ఉదాహరణకి ఈ కథలో ఇంటి ఓనర్ ని వర్ణిస్తూ ఒక పెద్ద పేరా రాశాను. తెల్లారి చదువుకుంటే 'రాజు-మహిషి'లో మందుల భీమశంకరం గుర్తొచ్చాడు. వెంటనే ఆ పేరా డిలీట్ చేశాను.
అవయితే అలా పడుంటాయి. మన నుండి ఏమీ ఆశించవు కూడా!
ReplyDelete-------------------------
ఇదే స్లోగాన్ తో ఇక్కడ (అమెరికాలో) తన పెరట్లోకి దొర్లి వచ్చిన కొండరాయిని ముక్కలు చేసి, ముక్కల్ని "Pet Rock" లుగా అమ్మాడు, కొండరాయి తరిగి పోయేదాకా (అసలు విషయం కొండరాయి తొలగించాలంటే చాలా డబ్బులు అవుతాయి).
కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్లింటికి, కొత్తగా ఇల్లు కట్టిన వాళ్లింటికి వెళ్తే.. :) ఇవి తప్పవు.
ReplyDeleteఅవును. ఆ రిస్క్ తీసుకునే వెళ్ళాలి :)
Deleteకొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళని , కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళని అభినందించి వాళ్ళని ఆనందపెడితె మీకు నష్టాం ఏంటి...మీరు రాసీ బ్లొగ్స్ చదివి మిమ్మల్ని అభినందించె వల్లని చుసి నెర్చుకొంది...పక్క వల్ల సంథొషన్ని మన సంథొషంగ ఫీల్ అవ్వదం లొ తప్పు లెదు. ఇలా ఎందుకు చెప్తున్ననంటె మీలంటీ వాళ్ళు ఈ రొజుల్లొ ఎక్కువైపొయరు...ఇథ్రుల గురించి ఈ మత్రం ఇంతెరెస్త్ చుపరు...మీ గురించి చెప్పుకొవదనికి మత్రం గ ఆసక్తి చుపిస్థరు
Deleteవిజ్ఞులైన నా బ్లాగ్మిత్రులకి,
Deleteనా ఈ పోస్ట్ కొందరికి నచ్చకపోగా.. కోపం కూడా తెప్పించిందని అర్ధమవుతుంది. అందుకు బాధ్యత పూర్తిగా నాదే.
ఈ కథ చదివితే కథకునికి సొంత ఇల్లు కట్టుకున్నవారంటే చికాకు అన్నట్లుగా అర్ధమవుతుంది. అయితే నేనా ఉద్దేశ్యంతో రాయలేదు. నేను చాలా గృహప్రవేశాలకి వెళ్తాను. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ.. సేవింగ్స్ తో, బ్యాంక్ లోన్లతో ఇల్లు కట్టుకున్నందుకు.. వారిని మనస్పూర్తిగా అభినందిస్తాను. కావున నా శీలాన్ని మీరు శంకించవలదు.
అయితే నే రాసింది (నా బుర్రలో ఉంది) ఎకరాల కొద్దీ స్థలాల్లో ప్యాలెస్ లు కట్టేవారి గూర్చి. మా ప్రాంతంలో పత్తి, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు విల్లాలు కట్టుకుంటుంటారు. ఇది నాకు అర్ధం కాదు.
నేను అటువంటి ఓ ప్యాలెస్ ఓనర్ గూర్చి రాశాను. అతన్ని, అతని వ్యాపారాన్ని వర్ణిస్తూ రెండు పేరాలు రాశాను. అయితే మరీ రావిశాస్త్రిని మిమిక్రీ చేసినట్లనిపించి డిలీట్ చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది.. ఆ పేరాలు ఉంచాల్సింది అని.
అందువల్ల (ఆ.సౌమ్య గారు చెప్పినట్లు) కథ కట్టే కొట్టే తెచ్చే లాగా తయారయింది. (లేదా.. కొందరు కామెంటినట్లు నా మనసులో ఏ మూలో లంకంత ఇల్లు గలవారి పట్ల ఈర్ష్య ఉందేమో. వారిపట్ల నా కసి/కుళ్ళుని ఈ పోస్ట్ ద్వారా తీర్చుకున్నానా?!)
మన బ్లాగర్లలో పత్తి, మిర్చి వ్యాపారం.. పురుగు మందుల వ్యాపారం.. విత్తనాల వ్యాపారం.. మొదలైనవి చేసి, వందల కోట్లు కూడబెట్టి.. ఒక భయంకరమైన భవనం కట్టి.. వచ్చినవారికి ఆ భవనం గూర్చి కథలు కథలుగా చెప్పేవారు ఎవరైనా ఉన్నట్లయితే.. వారి మనో భావాలు దెబ్బతిని ఉండవచ్చు. వారికి నా హృదయ పూర్వక క్షమాపణలు.
/అందుకు బాధ్యత పూర్తిగా నాదే/
Deleteసరే, అయితే ఏమిటి?! మీరు రాజీనామా చేయబోతున్నారా? లేదా ...
ఓదార్పు జైత్రయాత్రకు తెగబడబోతున్నారా? :))
సార్ నాకెందుకో ఈ పై కామెంట్లు రాసింది ఇతడే అని డౌట్ గా ఉంది. పిలవకపోయినా కనపడ్డ పర్టి బ్లాగులోకీ దూరిపోయి ఇంఫోసిస్ నారాయన మూర్తి లాగా కామెంట్లు చేసేంత టైమున్న బేవార్స్ గాడు ఒక్కడే ఉన్నాడు బ్లాగుల్లో
Deleteఅయివుండచ్చు, టెక్నికల్‌గా అసాధ్యం కాదు.
Deleteపిలిచి నీ/నాలాంటి బేవార్సులతో కామెంట్లు పెట్టించుకోవాల్సిన అవసరం/దుస్థితి రమణగారికి లేదు, రాదు, రానివ్వము. అలాంటి దుస్థితి ఏ బ్లాగరుకూ కలగకూడదని బ్లాగేశ్వరుని ప్రార్థిస్థాను. :D
బేవార్సుగా వున్న నిన్నెవరైనా పిలిపించుకున్న ఎదవ బ్లాగర్లు ఎవరైనా వుండివుంటే చెప్పు వాళ్ళకు నాలుగు కామెంట్లు ధర్మం చేస్తా, ఇంట్లో ఖాళీగా వున్న పిల్లలతో, మిత్రులతో చెప్పి చేయించి ఆదుకుంటా, ఏమంటావ్? :) :P
ఓరి నీ అసాధ్యం కూలా? రమణగారు నీ లాంటి బేవార్స్ గాణ్ణి పిలిపించుకున్నారని నేనెప్పుడన్నానోయ్? కోరికోరి అశుద్ధం మీద రాయివేస్తారా ఎవరైనా?
Deleteనువ్వే అనుకున్నా నీ సంతానం కూడా బేవార్స్ గాళ్ళేనా అంతేలే . కుక్క కడుపున గాడిద పుట్టదుగా
/కోరికోరి అశుద్ధం మీద రాయివేస్తారా ఎవరైనా? /
Deleteతినే కూటిమీద నీలాంటి వాళ్ళు రాయి వేసుకుంటారా? ఎందుకేసుకుంటారు లేండి. :))
/కుక్క కడుపున గాడిద పుట్టదుగా /
ఇది మరీ బాగుంది. మీ జన్మరహస్యం నాకెలా తెలుస్తుంది?!!!
మీ కత మహాగా నవ్వించిందంటే నమ్మండి
ReplyDeleteనమ్ముతాను. నమ్మి తీరితున్నాను. మీవంటి విజ్ఞులు నా కథని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.
Delete(నా రాతల్ని మెచ్చుకునేవారంతా విజ్ఞులేనని నా ప్రగాఢ విశ్వాసం!)
భలే చెప్పారు సార్,
Deleteజి రమేష్ బాబు
గుంటూరు
మీరు నమ్మరు...ఇప్పుడే మొన్నటి ఆదివారం సాక్షి పుస్తకం తిరగేస్తూ ఈ కింది వ్యాసం ఒక్క పేరా మాత్రమే చదివి పక్కనపెట్టి మీ బ్లాగు ఓపెన్ చేసాను. ఆ వ్యాసంలో ఏ వాక్యాలున్నాయో మీ కథలో ఇంచుమించు అవే వాక్యలు ఉండడం భలే విచిత్రంగా అనిపించింది. నవ్వు తెప్పించింది.
ReplyDeletehttp://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53942&Categoryid=10&subcatid=34
పోతే, మీ కథ అంత గొప్పగా అనిపించలేదు. ఇందులో మీరు చెప్పాలనుకున్న విషయాన్ని బాగా కుదించి కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు చెప్పేసారు అనిపించింది.
Copy rights?
Deleteఆ.సౌమ్య గారు,
Deleteమీరిచ్చిన లింక్ చూశాను. నాకూ గమ్మత్తుగా అనిపించింది.
ఏదో నాలుగు పేరాలు టైప్ కొట్టి 'కథ' అంటూ బ్లాగుల్లోకి వదుల్తున్నాను.
నేను కొత్తగా కథ చదివి చాలా కాలమైంది. ఈ మధ్య మిత్రుడు డా.నక్కా విజయరామరాజు ప్రచురించిన 'భట్టిప్రోలు కథలు' కొన్ని చదివాను. నా క్లోజ్ ఫ్రెండ్ డా.వి.చంద్రశేఖరరావు 'ద్రోహవృక్షం' సంపుటిలో ఇంకొన్ని కథలు చదివాను. అంతే.
కారణం.. ఆసక్తి (సమయం కూడా) లేకపోవడం. చదవడానికే లేని ఆసక్తి రాయడానికి ఎలా వస్తుంది? ఏదో సరదా కోసం నాలుగు ముక్కలు టైపుతుంటాను. అందుకే ఈ కట్టె కొట్టె తెచ్చె!
కామన్ సెన్స్ లేని ఒక టేస్ట్ లెస్ వేస్ట్ ఫెల్లో గురించి చక్కని కథ వ్రాశారు డాట్రారు!
ReplyDeleteYour sense of humor, playfulness and speaking your truth lightens my heart and mind dear Ramana.It takes lots of honestly and heart to communicate in an authentic way like this. Especially after so many years, reading your stories in Telugu reminds me how much I miss Mullapudi writings. I am loving and enjoying your posts with so much freedom of Spirit. I feel so much openness in my heart and could not stop laughing when you mentioned about "Annaiah" cultural idealized mask self. Warmly Sudha
ReplyDeleteడియర్ సుధ,
DeleteThank you for the nice words.
అప్పుడు కబుర్లు చెప్పేవాణ్ణి. ఇప్పుడు రాస్తున్నాను. అంతే తేడా!
lekhini.org తో తెలుగులో రాయడానికి ప్రయత్నించు.
మల్లి ఈ కదా చర్చ ముందుకు వచ్చింది కాబట్టి చెపుతున్నాను. మీ కధ నాకయితే మహబాగా సాయం అయ్యింది అండీ, కట్టే కొట్టే లా ఏమి లేదు కదా. ఇంకా వాళ్ళింట్లో వాళ్ళ కాలక్రుత్యాలన్నీ మీ ఇంట్లో ఒక జీవి గురించి వ్రాసినట్లు వ్రాసేస్తారా హ్మ్ :)
ReplyDeleteతన ఇల్లు ఆస్తులు, గిఫ్టులు మరియు ఇక్కడి స్నేహాలు గురించి లంచ్ టైం లో బోరు కొట్టించే తమిళ అమాయకురాలికి (పాపం వాళ్ళ నాన్న గారు కలిమి గురించి తప్ప ఇంకేం చెప్పలేదు తనకి ) మొన్నొక రోజు నెమ్మది గా మీరొక కధ వ్రాసారు ఇలా అని జెనెరిక్ గా చెప్పాను. కొంచెం మొహమాట పడుతూ అదేంటి లగ్జరీస్ చాలా ముఖ్యం కదా అని చిన్నగా వదిలేసింది. ఇక తను ఆ కబుర్లు చెప్పరు అనుకొంటున్నాను :)
అంత కాకున్నా చిన్న చిన్న విషయాల్లో మనం గొప్పలు చెప్పుకోవాలని అనుకుంటాము, కాబట్టి వీలయినంత ఎక్కువమందితో ఈ చిన్న కధ చదివిస్తున్నాను.